Paresh Turlapati…. కారులో వెళ్తూ చౌరస్తాలో రెడ్ సిగ్నల్ పడితేనూ ఆగా… ఆగినవాడ్ని ఎందుకో పక్కకు చూసి ఉలిక్కిపడ్డా ! పక్కనెవడో బైకు వాడు నా వంక చూసి హుష్.. హుష్.. అని సైగలు చేస్తున్నాడు ! వసంతకోకిలలో శ్రీదేవి మైండ్ రిస్టోర్ అయి ట్రైన్లో వెళ్లిపోతుంటే కమలాసన్ రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడే.. అలా మూగ సైగలు చేస్తున్నాడు ! మొదట అర్థం కాలే. తర్వాత భయమేసింది ! కొంపదీసి వీడి తలకు కూడా దెబ్బ తగిలి […]
పెళ్లా… విడాకులా… నాన్సెన్స్.., జస్ట్, కొన్నాళ్లు కలిసి ఉన్నాం అంతే…
మీకు తృణమూల్ ఎంపీ నుస్రత్ జహాన్ పెళ్లి యవ్వారం గుర్తుంది కదా… ఓ ధనిక వ్యాపారి నిఖిల్ జైన్‌ను టర్కీలో (డెస్టినేషన్ మ్యారేజ్) పెళ్లి చేసుకుంది… ఏడాదిలో గొడవలు… దూరంగా ఉంటున్నారు… ఆయన గారు విడాకులకు అప్లయ్ చేస్తే, అసలు మాది పెళ్లే కాదుఫో అనేసింది… టర్కీలో పెళ్లి జరిగింది, అక్కడి చట్టాల ప్రకారం మా పెళ్లికి గుర్తింపు లేదు, ఇండియాలో పెళ్లిని రిజిష్టర్ చేసుకోలేదు కాబట్టి ఆ పెళ్లే జరగనట్టు లెక్క… జరగని పెళ్లికి విడాకులేంటి అంటోంది… […]
ఎలక్టోరల్ బాండ్స్‌ను స్కాం అనాలా..? అసలెక్కడ స్టార్టయింది ఈ యవ్వారం..!!
ఎలెక్టరల్ బాండ్స్ ! పార్ట్ -1 కొండని తవ్వి ఎలుకను పట్టిన వైనం! గతం నుంచి వర్తమానంలోకి వద్దాం! మోహన్ దాస్ కరంచంద్ గాంధీతో మొదలయ్యింది రాజకీయ పార్టీకి పారిశ్రామిక వేత్తల విరాళాలు ఇవ్వడం! ఘనశ్యామ్ దాస్ బిర్లా (GD Birla) గాంధీకి ఆర్థికంగా సహాయం చేశాడు. గాంధీ 1909 లో వ్రాసిన ‘ The Indian Opinion ‘ అనే పుస్తకంలో తనకి ఉదారంగా విరాళం ఇచ్చిన రతన్ జీ జెంషెడ్ జీ గురించి ప్రస్తావించారు. […]
పేరుకే హీరో కృష్ణ అఖండుడు… కానీ రియల్ హీరో మాత్రం ఓ పాము…
Subramanyam Dogiparthi …. 1970 లోకి వచ్చేసాం . నేను ఫస్ట్ ఇయర్ బికాం నుంచి సెకండ్ ఇయర్లోకి వచ్చేసా . ఈ సినిమాకు చుట్టాలతో జాగ్రత్త లేదా చుట్టాలున్నారు జాగ్రత్త అనే టైటిల్ పెట్టి ఉండాల్సింది . హీరోని ఎలివేట్ చేసేందుకు అఖండుడు అనే టైటిల్ పెట్టి ఉంటారు . పేరులో ఏముంది ? సుడి ఉండాలి . పహిల్వాన్లుగా సుపరిచితులు నెల్లూరి కాంతారావు , యస్. హెచ్. హుస్సేన్ నిర్మాతలు . కృష్ణ చాలా […]
హవ్వ… బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడు దొంగలట… మరిన్నాళ్లూ కాపాడిందెవరు మహాశయా..?!
1) కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ దోపిడీ, ఇప్పుడు కాంగ్రెస్‌కు ఏటీఎం, ఢిల్లీ దాకా కమీషన్లు చేరుతున్నయ్, బీఆర్ఎస్ స్కాములు ఢిల్లీని చేరాయ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర సహకారం, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ పార్టీల పాత్రే తేలుతోంది….. మోడీ వ్యాఖ్యలు ఇవన్నీ… …. నిజమే, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ అవినీతి పార్టీల పాత్రే తేలుతోంది అనేది కరెక్టే… కుటుంబ పార్టీలు ఖచ్చితంగా దేశానికి చేటు… కానీ బీఆర్ఎస్ అవినీతి మీద గతంలో తప్పనిసరై […]
మిక్స్ అప్..! ఆహా ఓటీటీ కూడా బజారులో నిలబడి పైట జారుస్తోంది..!!
బరితెగించిన కోడి బజారులో గుడ్డు పెట్టిందట..! ఎలాగూ దీన్ని నడిపే సీన్ లేదు, ఎలాగూ అమ్ముకుంటున్నాం, ఇక తలుపు చాటు కన్ను కొట్టడాలు దేనికి, బజారులోకొచ్చి పైట జార్చి కవ్విస్తే పోలా అనుకున్నట్టుంది ఆహా ఓటీటీ యాజమాన్యం… ఎస్, ఇన్నాళ్లూ రకరకాల ఓటీటీల్లో పరమ బూతు, అశ్లీల, అసభ్య కంటెంటు ‘కుర్చీ మడతబెట్టి’ ధోరణిలో చెలరేగిపోతుంటే, కాస్త ఆహా ఓటీటీ కాస్త పద్ధతిని పాటించింది… ఇప్పుడిక తనూ ‘రాజమండ్రి రాగ మంజరి, మాయమ్మ పేరు తెల్వనోల్లు లేరు […]
ముసలోడే గానీ మగానుభావుడు… 77 ఏళ్ల వయస్సులో మాజీ భార్యపై వ్యాఖ్యలు…
నిజంగానే వీడొక దిక్కుమాలిన మొగుడు..! ఆయన గారి పేరు మోహన్ శర్మ… తమిళ నటుడు… ఎవరీయన అంటారా..? సీనియర్ నటి లక్ష్మి తెలుసు కదా… వందల సినిమాల్లో నటించి మెప్పించింది… తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్, అగ్రనటులందరితోనూ, అందరికీ దీటుగా నటించింది… తరువాత వయసుకు తగినట్టుగా తన పాత్రల్ని మార్చుకుంటూ, తన నట ప్రతిభతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది… ఆమె మాజీ భర్త ఈయన… అప్పట్లో […]
వారణాసిలో ప్రధాని మోడీపై పోటీకి… మన తెలుగు నీలిమక్క భర్త సై…
Nancharaiah Merugumala ……. సనత్ నగర్ లో మూడో స్థానంలో నిలిచిన తెలుగు బిడ్డ కోట నీలిమ పంజాబీ భర్త, కాంగ్రెస్ ప్రవక్త పవన్ ఖేడా వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీపై పోటీ చేస్తారట! ––––––––––––––––––– రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో యూపీలోని వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీతో కాంగ్రెస్ పార్టీ తరఫున దిల్లీకి చెందిన పవన్ ఖేడా తలపడతారని ఇంగ్లిష్ న్యూజ్ చానల్స్ నిన్నటి నుంచి ఊదరగొడుతున్నాయి. టీవీ చానళ్ల డిబేట్లలో, ఏఐసీసీ ఆఫీసులో జరిగే కాంగ్రెస్ మీడియా […]
చిట్టీలు అందించడం ఓ ఆర్ట్… కొన్ని ఊళ్ల ప్రజలు ఆ కళల్లో దిట్టలు…
పిల్లల కాపీలకు ఊరుమ్మడి సాయం! కొన్ని దృశ్యాలు మనసును మరులుగొలుపుతాయి. కొన్ని చిత్రాలు మనసును పులకింపచేస్తాయి. కొన్ని దృశ్యాలు కలకాలం గుర్తుండిపోతాయి. కొన్ని దృశ్యాలు ఒకానొక రుతువులోనే దర్శనమిస్తాయి. అలా గ్రీష్మరుతువు ఎండలు మొదలుకాగానే పరీక్షల వేళ అక్కడక్కడా కనిపించే దృశ్యమిది. “భారతదేశము నా మాతృభూమి…నేను నా దేశమును ప్రేమించుచున్నాను…” అని చేయి చాచి ప్రమాణం చేసే భావి భారత పౌరులైన విద్యార్థులు వార్షిక పరీక్షలు రాసే వేళ…వారి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పడే తపన […]
యానిమల్ వంగా ఎదురుదాడితో… హఠాత్తుగా ఆత్మరక్షణలో జావేద్…
కథా రచయిత, గీత రచయిత జావేద్ అఖ్తర్ యానిమల్ సినిమాపై చేసిన విమర్శ సహేతుకం… యానిమల్ వంటి సినిమాలపై సొసైటీ మాత్రమే కాదు, ఇండస్ట్రీ వైపు నుంచి స్పందన అవసరమే ఈరోజుల్లో..! ఐతే యానిమల్ దర్శకుడు వంగా సందీప్‌రెడ్డి ఆదే యానిమల్ ఇన్స్టింక్ట్తో ఎవరు విమర్శలు చేస్తే వాళ్లకు వెటకారం, వ్యంగ్యంతో జవాబులు ఇస్తున్నాడు… ఎదురు ప్రశ్నలు వేసి, ఉల్టా దాడి చేయడమే జస్టిఫికేషన్ అనుకుంటే ఇక ఎవరేం మాట్లాడతారు..? జావేద్కూ అలాంటి రిప్లయ్ ఇచ్చాడు… ఎప్పుడైతే […]
ప్రచారపైత్యంలో మరో నీచస్థాయి… ఆడపిల్లను గేలిచేస్తూ వాణిజ్యప్రకటనలు…
ఫేక్ ర్యాంకులతో, ఫేక్ గొప్పలతో అడ్డగోలుగా యాడ్స్ ఇవ్వడం చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యాసంస్థలకు అలవాటే… ఎక్కడో చదివి ర్యాంకులు సంపాదించిన వాళ్ల పేరెంట్స్‌కు డబ్బులు ఎరజూపి, తమ పుస్తకాలు చదివారనో, తమ సూచనలు పాటించారనో, అందుకే ర్యాంకులు వచ్చాయనో క్లెయిమ్ చేసుకుని, కొత్తగా పిల్లల్ని చేర్చబోయే పేరెంట్స్ చెవుల్లో పూలు పెట్టడం వాళ్లకు పరిపాటే… కానీ ఒక విషయానికి మెచ్చుకోవాలి… పిల్లల విజయాల్ని తమ విజయాలుగా ప్రచారం చేసుకోవచ్చు గాక… కానీ ఎప్పుడూ పిల్లల్ని […]
ఏదో ఓ పని… చేతినిండా పని… దాంతో పాజిటివిటీ… హేపీనెస్, హెల్త్…!
Amarnath Vasireddy ….. అదే బ్రహ్మానందం ! అనగనగా ఒక కుర్రాడు ! రోహిత్ గుర్తున్నాడా ? జ్ఞాపకం రావడం లేదా ? ఫరవా లేదు ! పోనీ … మంచి కాఫీ లాంటి సినిమా “ఆనంద్” హీరో ? గుర్తొచ్చాడు కదా ? పేరు గుర్తుందా ? ఆయన్ని వెండితెరపై చూసి ఎన్నాళ్లయింది ? ఇప్పుడేమి ఏమి చేస్తున్నాడో ? ఆలోచించారా ? కొత్త బంగారు లోకం వరుణ్ సందేశ్ ; సూపర్ హిట్ “పెళ్లి […]
అక్కడ జై కొండపోచమ్మ… అమెరికాలో జైజై వర్జీనియా గ్రేట్ ఫాల్స్…
ఎందుకలా అనిపించిందో తెలియదు గానీ… వర్జీనియా గ్రేట్ ఫాల్స్ వెళ్లినప్పుడు హఠాత్తుగా ఏడుపాయల, కొండపోచమ్మ తదితర క్షేత్రాలు గుర్తొచ్చాయి… అవేకాదు, చాలాచోట్ల శక్తి స్వరూపిణుల గుళ్లు ఉన్నచోట ఏం చేస్తారు..? కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సంఖ్యను బట్టి, మొక్కు తీర్చుకునే కుటుంబం రేంజ్‌ను బట్టి మేకనో, కోడినో కసకసా కోసేస్తారు… అక్కడే వండుతారు… దేవతలకు నైవేద్యం… మందు సరేసరి… వండినదంతా అక్కడే అయిపోవాలి… ఒక్క ముక్కలో చెప్పాలంటే అవి స్పిరిట్చువల్ గెట్‌టుగెదర్స్… పుణ్యం, పురుషార్థం, పర్యాటకం అన్నీ… కాకపోతే […]
కత్తులును ఘంటములు కదను తొక్కినవిచట… రియల్ మల్టీస్టారర్…
Subramanyam Dogiparthi…. ఆడవే జలకమ్ములాడవే కలహంసలాగా జలకన్యలాగ అనే సి నారాయణరెడ్డి వ్రాసిన పాట ఈ సినిమాకే హైలైట్ . ఈ పాటలో సాహిత్యం అద్భుతం . అంతే గొప్పగా పాడారు ఘంటసాల . కత్తులును ఘంటములు కదను తొక్కినవిచట అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట అనే చరణంలో ఘంటసాల గాత్రం , టి వి రాజు సంగీతం మహాద్భుతం . ఈ సినిమాలో నాకెంతో ఇష్టమైన పాట . గోదావరి , సాగర్ , […]
మరణించాక కూడా బాలు గొంతు సంపాదించి పెడుతూనే ఉంది..!!
పెద్ద ప్రశ్న..! జవాబు తెలియని ప్రశ్న..! ఒక ప్రఖ్యాత గాయకుడు సంపాదించిన ఆస్తులకు తన కొడుకు వారసుడు అవుతాడేమో చట్టల ప్రకారం, ఆనవాయితీగా వస్తున్న పద్ధతి ప్రకారం..! కానీ మరణించాక తన గొంతుపై వారసత్వం, హక్కులు ఎవరివి..? ఇదెందుకు మళ్లీ తెర మీదకు వచ్చిందీ అంటే..? బాలు గొంతును ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో కీడా కోలా సినిమా కోసం దర్శకుడు తరుణ్ భాస్కర్, సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌కు బాలు కొడుకు చరణ్ నోటీసులు ఇచ్చాడు, భారీ […]
ఊర్జా… హట్జా… ఉట్జా… మా భాషకు ఈ క్రూడాయిల్ మసాజ్ ఏమిటండీ..!!
ఇండియన్ ఆయిల్ సమర్పిత మోడీ ఊర్జోపక్రమం ! రాముడు అడవికి వెళుతుంటే తల్లి కౌసల్య విశల్యకరణి (ఎముకలు విరిగితే వెంటనే వాటంతటవే అతుక్కోవడానికి చదివే మంత్రం) లాంటి ఎన్నెన్నో రక్షా మంత్రాలు చదివి… నాయనా నీకు పంచభూతాలు, రుతువులు, సంవత్సరాలు, మాసాలు, పక్షాలు, రోజులు, పూటలు, ఘడియలు, విఘడియలు అన్నీ రక్ష కలిగించుగాక అంటుంది. పద్నాలుగేళ్లు లోకాభిరాముడిని చూడకుండా ఎలా ఉండగలనో అని తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ఆయనంటే అవతారపురుషుడు. ఆయన్ను ఘడియ ఘడియకు రక్షించడానికి ముందే […]
డ్రగ్స్ కూడా ఆనడం లేదు… ఇప్పుడిక పాము విషమే కొత్తరకం డ్రగ్…!
అదేదో సినిమాలో భీకర విలన్ గాడు పాముతో కాట్లు వేయించుకుంటూ వికటాట్టహాసం చేస్తుంటాడు… కళ్లు అరమోడ్పులు… ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఆ విషాన్ని, ఆ కాట్లను..! అదేమిటి, పాము విషం రక్తంలో కలిస్తే ప్రాణం పోదా అంటారా..? అప్పట్లో పున్నమినాగు సినిమా చూశారు కదా, చిరంజీవి కెరీర్ మొదట్లో వచ్చిన సినిమా… కొద్దికొద్దిగా విషాన్ని తాపిస్తూ ఉంటాడు చిరంజీవిని పెంచినాయన… తరువాత తనే ఓ పాములా విషపూరితం అవుతాడు, అది వేరే కథ… క్రియేషన్… అంతెందుకు..? చాణుక్యుడు […]
బస్తర్… ది నక్సల్ స్టోరీ… రైటిస్టుల భావజాల వ్యాప్తిలో మరో చిత్రం…
బస్తర్… ది నక్సల్ స్టోరీ… ఈ సినిమా చూశాక ఒక్కసారి వ్యూహం, శపథం, రాజధాని ఫైల్స్ వంటి రాజకీయ ప్రచార చిత్రాలతో పోల్చాలని అనిపించింది… అంతకు ముందు కూడా కొన్ని పొలిటికల్ చిత్రాలు వచ్చినయ్, త్వరలో వివేకా బయోపిక్ కూడా వస్తుందట… హేమిటో… కేసీయార్, చంద్రబాబు తదితరులపై కూడా సినిమాలు ఏమైనా వచ్చాయా..? వచ్చినట్టు కూడా తెలియకుండా మాయమయ్యాయా..? ప్రజలకు కనెక్టయ్యేలా సినిమా తీయకపోతే అంతటి ఎన్టీయార్ బయోపిక్స్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలనే జనం తిరస్కరించారు… అది […]
మరదలా మరదలా తమ్ముని పెళ్ళామా… ఏమమ్మా, వైనమేమమ్మా…
Subramanyam Dogiparthi….. మరదలా మరదలా తమ్ముని పెళ్ళామా ఏమమ్మా వైనమేమమ్మా , వదినమ్మ వదినమ్మ అన్నయ్య పెళ్ళామా ఏమమ్మా వైనమేంటమ్మా . సి నారాయణరెడ్డి పాట ఆరోజుల్లో వదినామరదళ్ళ సరసం , ప్రేమాభిమానాలను అద్భుతంగా చూపించారు దర్శకులు NTR . బహుశా అలాంటి సున్నితమైన , ఆహ్లాదకరమైన సరసం ఇప్పటి తరం వదినామరదళ్ళకు తెలియదేమో ! ఇప్పటి తరం ఆడపిల్లలు యూట్యూబులో ఈ పాటను తప్పక ఆస్వాదించాలి . సావిత్రి , కృష్ణకుమారిల హావభావాలు కూడా నిజమైన […]
ఆ సెలబ్రిటీ వివాహం… ఓ పాతికేళ్ల విషాదం (A Lesson to All)…
ఆమె వివాహం.. పాతికేళ్ల విషాదం (A Lesson to All) The Tragedy behind a Celebrity Marriage అన్ని పెళ్లిళ్లూ వేడుకలుగానే మిగలవు. కొన్ని వివాహాలు విషాదాలుగా మారి జీవితాంతం వెంటాడతాయి. అలాంటి జీవితమే నటి శాంతి విలియమ్స్‌ది. 12 ఏళ్ల వయసులో తమిళ చిత్రాల్లో బాలనటిగా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఆ తర్వాత అనేక చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించారు. ‘అపరిచితుడు’ సినిమాలో హీరో విక్రమ్ తల్లి పాత్ర చేసింది ఆమే! తెలుగులో […]
- « Previous Page
- 1
- …
- 150
- 151
- 152
- 153
- 154
- …
- 483
- Next Page »