మొన్న ఎప్పుడో చెప్పుకున్నాం కదా… ఈటీవీ డాన్సింగ్ షో ఢీ నుంచి యాంకర్ ప్రదీప్‌ను తరిమేశారని… సరే, సరే, తనే వెళ్లిపోయాడు… ఇదే ఈటీవీలో క్రియేటివ్ డైరెక్టర్లుగా ఉన్న నితిన్, భరత్ దర్శకులుగా ప్రదీప్, దీపిక పిల్లి హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తీస్తున్నారు, సో, వెళ్లిపోయాడు… తనే కాదు, ఇన్ని సీజన్లుగా జడ్జి కుర్చీలో ఓ అసెట్‌గా ఉన్న ప్రియమణిని కూడా తరిమేశారు… మూలిగే నక్క మీద తాటిపండులా… అసలే పూర్ రేటింగులతో మూలుగుతున్న ఈటీవీ ఢీ […]
నాగార్జున, మాటీవీ, ఎండమోల్ షైన్, అన్నపూర్ణ… వీళ్ల మీదా కేసులు..?!
‘‘బిగ్ బాస్ షో వద్ద జరిగిన ఘటనలపై పోలీసుల విచారణ.. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు.. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో సుమోటోగా కేస్ నమోదు.. 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసు ఫైల్.. పలువురు అభిమానులపైన కేసులు నమోదు చేసిన పోలీసులు…’’ ….. ఇదీ వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో కనిపిస్తున్న వార్త… చాలామంది బిగ్‌బాస్ ఫాలో కానివాళ్లకు ఆ ఘటన ఏమిటో తెలియదు… బిగ్‌బాస్ […]
మరేం చేయాలిప్పుడు..? రేవంత్ కూడా రిటైర్మెంట్ ఏజ్ పెంచాలా..?!
నమస్తే తెలంగాణలో ఓ వార్త… ఫస్ట్ లీడ్… బొంబాట్… వచ్చే ఐదేళ్లలో 44,051 మంది ఇంటికి… రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు పునఃప్రారంభం… రిటైర్మెంట్ వయస్సును కేసీయార్ 61 ఏళ్లకు పెంచడం ద్వారా మూడేళ్ల దాకా రిటైర్మెంట్లకు విరామం… వచ్చే మార్చిలో ఏకంగా 8,194 మంది పదవీవిరమణ… 2024 నుంచి ఏటా 8 నుంచి 9 వేల మంది రిటైర్మెంట్… ఇదీ వార్త… దీన్ని ఒక సాధారణ సమాచార వార్తగా గాకుండా… నమస్తే అలా ఫెయిర్ అండ్ […]
ఆ గ్రహాలకూ కేసీయార్‌పై ఆగ్రహమే… ఫామ్‌హౌజ్‌లో ‘గ్రహశాంతి యాగం’…
పొద్దున్నే ఓ వార్త… కనీకనిపించకుండా ఆంధ్రజ్యోతిలో ఓ సింగిల్ కాలమ్… విషయం ఏమిటీ అంటే..? కేసీయార్ నివాసంలో ఇటీవల 3 రోజులపాటు శాంతియాగం నిర్వహించారు… ఎన్నికలకు ముందు కేసీయార్ రాజశ్యామల యాగం, చండీయాగం నిర్వహించారు కదా… తరువాత కొద్దిరోజులకు శాంతియాగం నిర్వహించాల్సి ఉంది… డిసెంబరు 10న దానికి ముహూర్తం ముందే నిర్ణయించారు… కానీ ఈలోపు కేసీయార్ తుంటి ఎముక విరిగింది కదా, సో, 10న ఆ యాగం నిర్వహించలేదు… నిర్వహించకపోతే మరిన్ని కష్టాలు తప్పవు అని పండితులు […]
దావూద్‌పై విషప్రయోగం… రహస్య ‘ఆపరేషన్ ఖతం’లో పెద్ద టార్గెట్…
దావూద్ ఇబ్రహీం… భారత జాతి యావత్తూ ఛీత్కరించే పేరు… 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి… ఓసారి మన గుప్తదళం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసింది, పలువురు ఇజ్రాయిలీ ఏజెంట్లతో ఒప్పందం… పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందిన దావూద్ ఏ టైమ్‌లో ఎటు పోతాడు, ఏ దారిన పోతాడు స్కెచ్ రెడీ… గురితప్పని షూటర్లు రహస్య స్థలాల్లో పొజిషన్ తీసుకున్నారు… దావూద్ గన్ పాయింట్లోకి వచ్చిన మరుక్షణం తూటాలు ఆ దేహాన్ని జల్లెడ చేయాలి… ముంబై మృతుల ఆత్మలు, ఆ కుటుంబాలు […]
ఆ అత్తతనంలో గయ్యాళీతనమే కాదు, భోళాతనం… అమ్మధనం కూడా…
Bharadwaja Rangavajhala……… దురుసునోటి పలుకుబడికి పంతులమ్మ… సూర్యకాంతం. చాలా చక్కటి పేరు. అలాంటి పేరు ఎవరూ పెట్టుకోడానికి లేకుండా చేశావు కదమ్మా అని గుమ్మడి వెంకటేశ్వర్రావు వాపోయేవారు. అంతటి ప్రభావవంతమైన నటనతో తెలుగు సినిమాను వెలిగించిన నటి సూర్యకాంతం. అమాయకత్వం లా అనిపించే ఓ తరహా సెల్ఫ్ సెంటర్ట్ నేచర్ ఉన్న కారక్టర్లను పోషించారు తప్ప సూర్యకాంతం పూర్తి స్థాయి విలనీ చేయలేదు. ఆవిడ చేసిన గయ్యాళి పాత్రల్లో కాస్త అమాయకత్వం కలగలసి ఉండడం చేత ఆడియన్స్ […]
గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్ సుద్దులు… అందెశ్రీ పాటపై రేవంత్ రెడ్డికేదీ జవాబు?
తెలంగాణ వాగ్గేయకారులుగా పిలుచుకుంటున్న గోరటి వెంకన్న (Gorati Venkanna), దేశపతి శ్రీనివాస్ (Desapthi srinivas)ల గొంతుల ఈ రోజు వింటే మతిపోయే విధంగానే ఉంది. నిజానికి వాగ్గేయకారులనేది పెద్ద మాట. ఉద్యమకాలంలో కొన్ని Over tones ఉంటాయి. తెలంగాణ ఉద్యమ కాలంలోని ఓవర్ టోన్ వాగ్గేయకారులనేది. అయితే, దానికి సాధారణమైన అర్థం కూడా చెప్పుకోవచ్చు. పాటలు రాసి, వాటిని ఆలపించేవాళ్లను వాగ్గేయకారులుగా చెప్పవచ్చు. ఈ పరిమితి తెలంగాణ ఉద్యమకాలంలోని పాట కవులకు ఉంటుంది. వారిద్దరు కూడా తెలంగాణ […]
ఓ పొద్దు తిరుగుడు పువ్వు… వెనుదిరిగి చూసే ఓ చిరునవ్వు…
విను తెలంగాణా – … వెనుదిరిగి చూసే నవ్వు…. పెన్షన్లు ఉపశమనమే. కానీ అదొక్కటే వృద్ధులను కలిసినప్పుడు మాట్లాడే విషయం కాదని బోధపడింది. పెద్ద వాళ్ళు అంటే పని విరమణా – జీవిత విరమణా కానే కాదనిపించింది. సాయంత్రం వెలుతురు. ఆ ఊరు పేరు జ్ఞాపకం లేదు, పాలమూరులో కృష్ణా నది పుష్కరాలు జరిగే బీచుపల్లి సమీప గ్రామం. తిరిగి ఆ గ్రామ శివార్లు దాటి తారు రోడ్డు మీదుగా వెనక్కి, పట్టణానికి వెళుతుండగా ఆమె పల్లెటూరులోకి […]
కలల్ని కూడా ఎడిట్ చేస్తాం.., కంట్రోల్ చేస్తాం.., కలర్‌ఫుల్ చేస్తాం…
కలల కిరీటం- హలో! కలలు కనే యంత్రం “కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే..” -సముద్రాల సీనియర్ “కునుకు పడితే మనసు కాస్త కుదుటపడతది… కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది… కలలె మనకు మిగిలిపోవు కలిమి సివరకు… ఆ కలిమి కూడ దోచుకునే దొరలు ఎందుకు?” -ఆత్రేయ “పగటి కలలు కంటున్న మావయ్యా! గాలి మేడలెన్ని నీవు కట్టావయ్యా! మావయ్యా! ఓ మావయ్యా!” -కొసరాజు “అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే కలలు చెదిరినా పాటే […]
వెలమ దొర గడీపై పాలమూరు రెడ్డి జెండా… ఇదేనా బయోపిక్ టైటిల్…
ఆంధ్రజ్యోతిలో ఓ వార్త… రేవంత్ కథను సినిమా తీస్తే సూపర్ హిట్ అట… అదే హెడ్డింగ్… జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ దశరథరెడ్డి ఏదో అభినందన బాపతు మీటింగులో చెప్పాడట అలా… ‘రేవంత్ ఈ సంస్థలో చదవాలని మూడుసార్లు ఎంట్రన్స్ రాశాడు, ఓసారి 8వ ర్యాంకు వచ్చినా సీటు రాలేదు, రాకపోవడమే మంచిగైంది’ అని ఏదేదో చెబుతూ పోయాడాయన… ఒక కళాకారుడు సీఎం కావడం అద్భుతమని మరొకాయన అన్నాడట… రేవంత్‌లో కళాకారుడు ఎవరబ్బా అనుకుంటుంటే […]
పక్కబట్టల గుసగుసల ముచ్చట… పట్టెమంచాలు, పత్తిపరుపులు…
పక్కబట్టల గుసగుసలు~~~~~~~~~~~~~~~~ మల్లెపువ్వుల లెక్క తెల్లటి తెలుపుతోటి సన్నగ నున్నగ నేసిన నూలుబట్ట తానుకొని మిషినుమీద కుట్టిచ్చిన మెత్తగౌసెన్లు పరుపుగౌసెన్లు కుచ్చులు బొందెలు తొడిగనేర్చిన ఒకానొక కళాత్మకత తొడుగుటానికి పోటీవడె పిల్లల ఆరాటం… ! ఒకప్పటి ఇంఢ్లన్ని బయిరంగమేనాయె చలికాపేది దుప్పటొక్కటే ఎలుపుకెలుపు దొడ్డుకుదొడ్డు గుండుపోగుతోటి నేసిన మోతకోలు బరువుండే ముదురురంగు తెలుపుదుప్పట్లు ఎన్నివుంటే అది అంతపెద్ద సంసారమన్నట్టు… ! ఇంట్లున్న అందరికి — పట్టెమంచాలు ఉంటయా ? పత్తిపరుపులు దొరుకుతయా ?? పక్కబట్టలంటే చానవరకు చేతవోసిన […]
టచింగ్ రిప్లయ్… సీఎం రేవంత్ ఆఫర్‌కు మనసు కదిలించే ప్రతిస్పందన…
Domakonda Nalini….. గౌరవనీయులైన cm గారు! మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది. ఈ నేపథ్యంలో గతం ఒక రీల్లా నా కళ్ళ ముందు కదులుతుంది. ఇన్నాళ్లు నేను ఒక సస్పెండెడ్ ఆఫీసర్ గా ‘సోషల్ స్టిగ్మా ( మరక) ‘ను మోసాను. నన్ను ఆనాటి ప్రభుత్వం 3 ఏండ్లు చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచింది. […]
విన్నర్ ఎవరో, రన్నరప్ ఎవరో జానేదేవ్… అసలైన నైతిక విజేత ప్రియాంక జైన్…
సరే… బిగ్‌బాస్ షో ఎండింగ్‌కు వచ్చింది… ఆదివారం ఫినాలే… మహేశ్ బాబు చీఫ్ గెస్ట్… డాన్సులు, హంగామా ఉంటుంది… సాయంత్రం 7 గంటలకే స్టార్ట్… అన్నీ వోకే… ముందుగా అర్జున్ను ఎలిమినేట్ చేస్తారట… వోకే… తరువాత రవితేజ వచ్చి ప్రియాంకను ఎలిమినేట్ చేసి వేదిక మీదకు తీసుకొస్తాడట… వోకే… యావర్ ఏదో 15 లక్షలకు టెంప్టయ్యాడని, తీసుకుని మధ్యలోనే నిష్క్రమించాడనీ కొన్ని వార్తలు… సరే, ఏదో ఒకటి… తనెలాగూ టాప్ త్రీ ఎలాగూ కాదు… అది తెలిసి […]
ఆ విధంగా మొత్తానికి సీఎం రేవంత్‌రెడ్డికి ఓ ఇబ్బంది తప్పిపోయింది…
Nancharaiah Merugumala……. తెలంగాణ అసెంబ్లీలో తొలి, చివరి ఆంగ్లో ఇండియన్ ఎల్విస్ స్టీవెన్సన్! 2019 రాజ్యాంగ సవరణతో ‘ఆంగ్లో ‘ను నామినేట్ చేయించాల్సిన పని సీఎం రేవంత్ రెడ్డికి తప్పింది! …………………………… లోక్ సభలో ఇద్దరు, రాష్ట్రాల శాసనసభల్లో ఒక్కొక్కరు చొప్పున ఆంగ్లో ఇండియన్లను వరుసగా నామినేట్ చేసే నిబంధనను నాలుగేళ్ల క్రితం నరేంద్ర మోదీ బీజేపీ సర్కారు తొలగించింది. దీంతో పార్లమెంటు ఎన్నికలవ్వగానే కేంద్రంలో కొలువుదీరే కొత్త మంత్రివర్గం సిఫారసు మేరకు రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో […]
అందమైన ‘విశ్వ ఐశ్వర్యం’ అభిషేక్ చేజారిపోయినట్టే… సూచనలు అవే…
పెళ్లయి ఎన్నేళ్లయితేనేం..? దీర్ఘకాలిక సాంగత్యం, సంసారం అలాగే నిలకడగా సాగాలనేమీ లేదు… ఈరోజుల్లో, మరీ ప్రత్యేకించి సెలబ్రిటీ కాపురాల్లో విడిపోవడాలు పెద్ద విశేషాలు కూడా ఏమీ కాదు… ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ సంసారం పెటాకుల బాటలో ఉందని ఎవరో ఓ ఇంగ్లిష్ పత్రిక వెబ్సైట్ స్టార్ట్ చేసింది… మిగతా అందరూ దాన్నే అందుకున్నారు… నిజమో, కాదో తరువాత… కానీ రాసిన తీరు మాత్రం గమ్మతుంది… ఐశ్వర్య అమితాబ్ ఇంట్లో సుఖంగా లేదు… అత్త జయాబచ్చన్‌తో అస్సలు పడటం […]
రేవంత్ పాలన సామర్థ్యానికి అత్యంత గొట్టు పరీక్ష కాళేశ్వరమే…
నిజమే… కాళేశ్వరం కొత్త సీఎం రేవంత్ రెడ్డి ఎదుట అతి పెద్ద సవాల్… ఆహా ఓహో, ఇది ప్రపంచపు పదో వింత, అబ్బురం, నదికి కొత్త నడకలు అని కేసీయార్ గ్యాంగ్ ఊదరగొట్టింది కదా… తీరా చూస్తే డిజైనింగ్ లోపాలు, నిర్మాణ లోపాలు, కమీషన్ల కథలు… రెండుమూడేళ్లకే ఓ ప్రధాన బరాజ్ కుంగిపోయింది… మిగతావీ బాగాలేవు… నిజానికి ఇంజనీరింగ్ నిపుణులు అన్నీ ఆలోచించి ఎల్లంపల్లికి రూపకల్పన చేస్తే… తనేదో పెద్ద ఇంజినీర్ అయినట్టు, తోెచినట్టు బరాజులు కాగితాలపై […]
వావ్ గుడ్ ఫోటో… ధనుష్, వరలక్ష్మి ఫోటోలతో రాధిక ఏదో చెబుతోంది…
ఒక ఫోటో రకరకాల గాసిప్స్‌కు దారి తీసింది… ఏమో, గాసిప్స్ కూడా కాకపోవచ్చు… ఆ ఫోటో రాబోయే పరిణామాలకు సూచిక కూడా కావచ్చు… విషయం ఏమిటంటే..? నటి రాధిక శరత్ కుమార్ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది… అందులో రాధిక, శరత్ కుమార్, ధనుష్, శరత్ కుమార్ బిడ్డ వరలక్ష్మి, మరో మహిళ కనిపిస్తున్నారు… అసలే సవతి బిడ్డ వరలక్ష్మికీ, రాధికకు పెద్దగా టరమ్స్ బాగా లేవంటుంటారు… వరలక్ష్మి ఇండిపెండెంట్ లివింగ్… తను సినిమాలు, […]
సరె, సర్లే, మోడీ భయ్… గట్ల పోయి వన్ బై టూ చాయ్ తాగొద్దాం పా…
ఏ వచనం? ఏమిటా ఏకవచనం పిలుపు? ఏకవచనం పిలుపు అమర్యాద. బహువచనం పిలుపు గొప్ప గౌరవం. పెద్దవారిని నువ్వు అనకూడదు. మీరు అనాలి. కొన్ని ప్రాంతాల్లో ఈ ఏకవచనం పిలుపుల మీద పెద్ద పట్టింపే ఉండదు. రాయలసీమ, తెలంగాణల్లో నిత్యవ్యవహారంలో ఏకవచనం సర్వసాధారణం. కోస్తాలో బహువచనానికే బహు డిమాండు. మీడియా రుద్దిన ప్రామాణిక భాష ప్రభావంతో ఇప్పుడు రాయలసీమ, తెలంగాణల్లో కూడా చాలావరకు “నువ్వు” “మీరు”గా మారింది. వ్యాకరణం ప్రకారం ‘డు’ ఏకవచనం. ఒకడే అయితే క్రియాపదం చివర ‘డు’; […]
యాంకర్ సుమ కొడుకు Vs సింగర్ సునీత కొడుకు… ఇద్దరూ ఇద్దరే…
మాంచి కొలువు మీదున్నప్పుడు… పవర్ మీదున్నప్పుడు… కలెక్టర్‌గా దర్పం ఒలకబోసే పెద్దమనిషి కాస్తా వృద్యాప్యం పైనబడ్డాక… శక్తులన్నీ ఉడిగిపోయాక మస్కూరిలాగా అయిపోతాడు అని అంటుంటారు… ది గ్రేట్ బొడ్డు దర్శకుడు రాఘవేంద్రరావు పోస్టు ఒకటి చూశాకే అదే అనిపించింది… ఆయన ‘సర్కారు నౌకరి’ అని ఓ సినిమాను ప్రజెంట్ చేస్తున్నాడు… దానికి సంబంధించిన ఓ పోస్టు పెట్టాడు ఫేస్బుక్లో… వోకే, తన టీం పెట్టినట్టుంది… 9 గంటల్లో దానికి వచ్చిన లైకులు ఎన్నో తెలుసా..? వంద..! నిజంగా […]
ఓహ్… ప్రదీప్ అదృశ్యం, నందు ప్రత్యక్షం వెనుక అదా అసలు సంగతి…
ఈటీవీ నాన్-ఫిక్షన్ కేటగిరీలో దాని ప్రధాన బలాల్లో ఢీ షో కూడా ఒకటి… ఈ డాన్సింగ్ షోకు పోటీగా వేరే చానెళ్లు ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాయి, భారీ ఖర్చు పెట్టాయి కానీ సక్సెస్ కాలేదు… ఐతే ఫిక్షన్ కేటగిరీలో అత్యంత వీక్‌గా ఉండే ఈటీవీ ఈ నాన్ -ఫిక్షన్ (రియాలిటీ షోలు ఎట్సెట్రా) కేటగిరీని కూడా ఈమధ్య బాగా దెబ్బతీసుకుంది… దాంతో చానెళ్ల పోటీలో బాగా వెనుకబడిపోయి, స్టార్ మాతో పోలిస్తే చాలా చాలా దూరంలో కుంటుతోంది… అది […]
- « Previous Page
- 1
- …
- 151
- 152
- 153
- 154
- 155
- …
- 455
- Next Page »