ఎంత బాధాకరం….! ఇవ్వాళ యూత్ అంత ఎగబడి చూస్తున్న Animal మూవీ రిలీజ్ అయినరోజే… సాహసోపేత భారత సైనికుడు, జాతీయ హీరో ఫీల్డ్ మార్షల్ మానెక్ షా జీవిత చరిత్ర మూవీ శాం బహదూర్ రిలీజ్ అయ్యింది… కానీ దీనికి ప్రచారం లేదు… చూడమని చెప్పేవారు లేరు… మానిక్ షా గారి సాహసోపేత ఫైటింగ్ వల్లనే పాకిస్థాన్‌లో బెంగాలీల మీద జరుగుతున్న హింసను ఆపడానికి పాకిస్థాన్ ను విడదీసి బంగ్లాదేశ్ ఏర్పడ్డది… షా గారు మొత్తం ఐదు […]
దూసుకుపోయిన టీవీ9… ఎన్టీవీని మళ్లీ తొక్కేస్తూ… మళ్లీ నంబర్ వన్…
తెలంగాణ ఎన్నికల్లో వేడి పెరిగేకొద్దీ సహజంగానే టీవీ రేటింగ్స్ పెరుగుతుంటయ్… పెద్దగా టీవీ వార్తలను పట్టించుకోని జనం కూడా ఎన్నికల వేళ అప్పుడప్పుడూ న్యూస్ చానెళ్లను ట్యూన్ చేస్తుంటారు… ఆ ప్రజెంటేషన్ల తీరును అసహ్యించుకుంటూనే చూస్తారు… జనం చూస్తున్నారు కదాని న్యూస్ చానెళ్లు మరిన్ని వెధవ పోకడలకు పోతాయి… ఇది మరీ సహజం… జనం మా ప్రయోగాల్ని మెచ్చుకుంటున్నారనే భ్రమ అది… సరే, ఎలాగైతేనేం… రేటింగ్స్ మాత్రం పెరిగాయి… అంతకుముందు వారంకన్నా గత వారం టీవీ రేటింగ్స్ […]
ఉత్తరాఖండ్‌లోని ఓ చిన్న ఊరు… ఇప్పుడు చైనా పాఠ్యపుస్తకాల్లో తన పేరు…
హీరో అంటే ఎవరు..? కలల్ని కనేవాడు, ఆ కలల్ని సాధించేవాడు… మన తెలుగు హీరోల్లా ఆర్టిఫిషియాలిటీ కాదు… ఈయన పేరు రాతూరి దేవ్… వయస్సు 46 ఏళ్లు… ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రి గర్వాల్ జిల్లాలోని కేమ్రియా సౌర్ అనే మారుమూల ఓ కుగ్రామంలో… పర్వతగ్రామంలో పుట్టాడు… అది ప్రకృతి ఒడి… తండ్రి ఓ రైతు… దేవ్‌కు చిన్నప్పటి నుంచీ సాహసాల మీద, స్టార్డమ్ మీద ఇష్టం… అవే కలలు కనేవాడు… కానీ నెరవేరేదెలా..? బ్రూస్లీకి డైహార్డ్ ఫ్యాన్.., […]
ఓ ఆర్థిక సామ్రాజ్యానికి అధిపతి… చివరకు కొడుకుల కన్నీటి వీడ్కోలుకూ నోచలేదు…
2,59,900 కోట్ల రూపాయలు, 5,000 సంస్థలు, 30,750 ఎకరాల భూమి సంపాదించిన సహారా సంస్థ సుబ్రతోరాయ్ యజమాని అంత్యక్రియలకు అతని ఇద్దరు కుమారులు రాలేదు, కానీ అందరూ వచ్చారా..? ఈ వ్యక్తి తన పిల్లల పెళ్లిళ్లకే ఏకంగా 500 కోట్లు ఖర్చు చేశాడు… జీవితం ఇలాగే ఉంటుంది.., బంధాల విలువ కూడా… ….. ఇదీ ఓ మిత్రురాలి ఫేస్బుక్ తాజా పోస్టు… నిజమే… డెస్టినీ ఎవరిని ఎటు తీసుకెళ్తుందో ఎవరు చెప్పాలి..? ఇది చదవగానే మొన్నటి కరోనా […]
అమ్మ అంటే అమ్మే… ఆమె చేయి ఓ అక్షయపాత్ర… అమృతకలశం…
అమ్మచేతి వంట.. కొన్ని ముచ్చట్లు ~~~~~~~~~~~~~~~~~~~~~~~ అమ్మ– ఒక అక్షయపాత్ర…! అమ్మ చేతిగుణమేమిటోగానీ వంట అద్భుతం! శాఖాహార వంటలకు మా వంశంలోనే పెట్టిందిపేరు. బెండ, కాకర, సోర, గోరుచిక్కుడు వంటి అంటుపులుసులు అమృతతుల్యంగా చేసేది. తియ్యబెండకాయ, కలెగూర, టమాటపప్పు, టమాటాతో బీర, సోర, పొట్ల, కాకర వంటి కలగలుపు కూరలు వేటికవే సాటిగా ఉండేవి. రాములక్కాయ కూర గురించి ఎంత చెప్పినా తక్కువే. పప్పుచారు కలవోసినా, చుక్కకూర పప్పు వండినా వంకాయ కూరవండి – పచ్చిపులుసు చేసినా […]
ఫ్రీ బస్..! కొత్త మురిపెం కదా… మహిళలతో ఆర్టీసీ బస్సులు కిటకిట…
ఫ్రీ ఆర్టీసీ బస్సులను 60 శాతం వాడుతున్న మహిళలు… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించింది… సోమవారం రోజున ఆర్టీసీ బస్సుల్లో మొత్తం 51 లక్షల మంది ప్రయాణించగా అందులో 20.87 లక్షల మంది పురుషులు… కాగా 30 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. సాధారణంగా ఆర్టీసీలో 50 లక్షల మంది ప్రయాణికులు ఎక్కితే 18 కోట్లు ఉండే ఆదాయం సోమవారం 11.74 కోట్లు […]
ఓ గోనె సంచిలో నోట్ల కట్టలు కుక్కుకుని రజినీ హైదరాబాద్‌లో వాలిపోయాడు…
నిన్న కదా రజినీకాంత్ బర్త్ డే… చాలామంది చాలా విశేషాలు షేర్ చేసుకున్నారు… ఇంత వయస్సొచ్చినా, ఇన్ని సినిమాలు చేసినా, ఇంకా అదే ‘సౌత్ సూపర్ స్టార్ సుప్రీం హీరోయిక్ యంగ్ ఇమేజీ’ బిల్డప్పు వేషాలు, సంపాదన కోసం తాపత్రయం ఏమిటని కూడా నాలాంటివాళ్లు విమర్శ కూడా చేశారు… కానీ రజినీకి మరో కోణం కూడా ఉంది… అది పదిమందికీ ఆదర్శంగా ఉంటుంది… అలాంటిదే ఇది కూడా… ప్రపంచం మెచ్చిన మన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు Nerella Venumadhav కోణంలో […]
మంకీ ట్రాప్… మనదీ ఈ ట్రాపుల బతుకే… ఏదీ వదులుకోలేకపోతున్నాం…
Rajani Mucherla.. రాసిన పోస్ట్ ఒకటి ఆశ్చర్యాన్ని కలిగించింది… మనుషులు ఇలా కూడా ఉంటారా అనే విస్మయం అది… మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలాంటి వార్తల్ని సరిగ్గా ప్రజెంట్ చేయలేక చేతులెత్తేస్తోందని కూడా అనిపిస్తోంది… సరే, ఒకసారి ఆ పోస్టు యథాతథంగా చదువుదాం… *మంకీ ట్రాప్ * ఇటీవల మూడు రోజుల క్రితం చదివిన ఒక చిన్న వార్త … తల నుండి బయటికి పంపించేసినా.. పదే పదే మళ్ళీ వచ్చి మది తలుపు తడుతూనే ఉంది.. […]
సినిమాలకు జాతీయ అవార్డులు సరే… టీవీలకు ఎందుకుండొద్దు మరి…
సీరియల్స్‌లో గొప్ప నటులు ఉన్నారు … మన దేశంలో సినిమాలకు మాత్రమే జాతీయ పురస్కారాలు ఇస్తారు. టీవీల్లో పనిచేసేవారికి జాతీయ అవార్డులు లేవు. రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు గతంలో ఇచ్చేవారు. ఈ మధ్య అవీ మానేసినట్టు ఉన్నారు. కొన్ని ఛానెళ్లలో ప్రత్యేకంగా అవార్డులు ఇస్తున్నారు. సినిమాల్లో ఉన్నంత గుర్తింపు, గమనింపు టీవీలో ఇప్పుడిప్పుడే వస్తోంది. అలా అని వాళ్లు తక్కువ నటిస్తారని కాదు. వారికంటూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్దిష్టమైన గుర్తింపు/అవార్డులు ఇచ్చే వ్యవస్థ ఇంకా పూర్తిగా […]
పాత నీటిని పక్కకు మళ్లించేసి… కొత్త నీటికి గేట్లు తెరుస్తున్న బీజేపీ…
చత్తీస్‌గఢ్… కాబోయే సీఎం పేరును మాజీ ముఖ్యమంత్రి రమణసింగ్ ద్వారానే ప్రతిపాదింపజేసింది బీజేపీ హైకమాండ్… అందరినీ కూర్చోబెట్టి విష్ణదేవ్ శాయ్ పేరును ప్రకటించింది… ఓ ఎస్టీ ముఖ్యమంత్రి… ఏ వర్గ కొట్లాటలూ లేకుండా ఎంపిక సజావుగా సాగిపోయింది… కాబోయే సీఎం నేపథ్యం ఆర్ఎస్ఎస్… అనూహ్యమైన ఎంపిక… ఆ రాష్ట్రంలో ఎస్టీలు ఎక్కువ… మధ్యప్రదేశ్… సేమ్… కాబోయే సీఎం పేరు మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ద్వారా ప్రతిపాదింపజేశారు… ఆయన ఐదుసార్లు ఎంపీ, నాలుగుసార్లు ముఖ్యమంత్రి… పార్టీ చెప్పినట్టుగా […]
ఆ డీఎస్పీ నళిని గుర్తుంది కదా…! ఇప్పుడామె ఏం చేస్తోంది..? ఇంట్రస్టింగ్ ఛేంజ్..!!
2012… తెలంగాణ ఉద్యమకాలం… ఈమె గుర్తుందా..? నళిని… ఏకంగా తన డీఎస్పీ కొలువునే వదిలేసింది… తెలంగాణ కోసం ఉద్యమించే అన్నాచెల్లెళ్లపై లాఠీని ఝలిపించలేేనని, తూటాల్ని ఎక్కు పెట్టలేనని చెబుతూ తన ఉద్యోగాన్నే త్యాగం చేసింది… 2003లో కాకతీయ యూనివర్శిటీలో తనకు బీఎడ్ క్లాస్మేట్ అని ఓ మిత్రుడు గుర్తుచేసుకున్నాడు ఫేస్బుక్లో… మేర (దర్జీ) కులస్థురాలు… బీసీ… అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు… ఢిల్లీలో దీక్ష చేసింది… రెండుసార్లు తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది… మరి ఇన్నాళ్లూ ఏమైపోయింది..? […]
బతుకమ్మ , శివరాత్రి, పెద్ద ఏకాదశి పండుగ ఏదయినా సరే…
మక్కసత్తు ముద్దలు ~~~~~~~~~~~~~~ మక్క సత్తు ముద్దలు అచ్చమైన ఉత్తర తెలంగాణ తిండి. ఇక్కడివాళ్లు దీనికోసం ప్రాణమిడుచుకుంటరు. అసలు సత్తువాసనకే సగం ప్రాణం ఆవిరయిపోతది. బతుకమ్మ , శివరాత్రి, పెద్ద ఏకాదశి పండుగ ఏదయినా పలారంల దీన్ని వెనుకబడేసేటిది ఒక్కటి గుడ లేదంటే లేదు. పంట మక్కలు అంటే చిన్న మక్కలు పూలుపూలుగ వేయించి ఆ ప్యాలాలను మెత్తగ విసిరి లేదా గిర్ని పట్టించి పిండిగ మార్చి మంచి బెల్లం సన్నగ చిదిమి, చిక్కటి పాలల్ల వేసి […]
ఆ మెంటల్ రాణికి చెక్ పెట్టాలంటే… ఈ ఆల్టర్నేట్ రాణి రావాల్సిందేనా..?
బహుశా ఈ స్టోరీ రాయడం పూర్తయ్యేసరికి రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరో తేలిపోవచ్చు… వరుసగా పలు సామాజిక ప్రయోగాలు చేస్తున్న బీజేపీ హైకమాండ్ ఈ రాష్ట్రంలోనూ బలహీనవర్గాల నుంచి ఓ కొత్త మొహాన్ని తీసుకురావచ్చు… మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో చేసినట్టే రాజస్థాన్‌లో కూడా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంటున్నారు ఈరోజు… మంచిదే కానీ… ఈ అందమైన మొహం కథ కాస్త ఆసక్తికరం… ఈమె పేరు దియాకుమారి… జైపూర్ రాజసంస్థానం వారసురాలు… రాచకుటుంబం… లోకసభ సభ్యురాలు… అంతులేని సంపదను కాపాడుకుంటోంది… […]
ఆ సర్వే ఏం చెబుతోంది..? జగన్ మళ్లీ గెలుస్తాడా..? హఠాత్ మార్పుల నేపథ్యమేంటి..?
సిట్టింగులందరికీ టికెట్లు ఇచ్చి కేసీయార్ చేతులు కాల్చుకున్నాడు… 2018లోనే అందులో చాలామందిపై ప్రజల్లో వ్యతిరేకత ఉండేది… వాళ్లకు అప్పుడూ టికెట్లు ఇచ్చి, మళ్లీ మొన్న టికెట్లు ఇచ్చి స్థూలంగా తనే దెబ్బతినిపోయాడు… వైనాట్ 175 అని కలలు కంటూ మురిసిపోతున్న జగన్‌కు తత్వం బోధపడింది… కళ్లు తెరిచాడు… మరి నా సంగతేమిటని ఆలోచించాడు… స్థానికంగా ప్రజల ఆదరణ చూరగొనలేని, వ్యతిరేకత పెంచుకున్న నాయకులకు మళ్లీ అవకాశాలు ఇస్తే పరిస్థితులు ఎదురు తిరుగుతాయని గ్రహించాడు… సర్వేలకు పూనుకున్నాడు… పైగా […]
ఒక బలిసిన మగాడి ఉన్మాద, ప్రకోప, పైత్య, చిత్తవికార, ఉన్మత్త ప్రదర్శన ఇది…
Aranya Krishna……. హెచ్చరిక…. “జంతు ప్రవృత్తి” అనే కాన్సెప్టుని మనం నీచార్థంలో వాడుతుంటాం. అంటే అమానుషంగా, హింసాత్మకంగా ప్రవర్తించే వాళ్లని జంతువులతో పోలుస్తుంటాం. ఇది నిజానికి చాలా అన్యాయమైన పోలికే కాదు అజ్ఞానంతో కూడిన దురవగాహన కూడా! పాపం జంతువులు వాటి పని అవి చేసుకుంటూ ప్రకృతిబద్ధంగా జీవిస్తుంటాయి. ప్రకృతి ఏర్పరిచిన నియమాల్ని ఉల్లంఘించి ఐతే బతకవు. “యానిమల్” సినిమా చూశాక నాకు కలిగిన మొట్టమొదటి ప్రశ్న ఏమొచ్చిందంటే, అసలు ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టి […]
అక్కడ ఓ ఎస్టీ… ఇక్కడ ఓ బీసీ… బీజేపీ ప్రాధాన్యాలు మారుతున్నయ్…
అది ఒకప్పుడు… బీజేపీ అంటే బనియా పార్టీ, బ్రాహ్మణ్ పార్టీ… ఆ ముద్రల నుంచి వేగంగా చాలా దూరం వచ్చేసింది పార్టీ… మొన్న చెప్పుకున్నాం కదా… తమిళనాట పార్టీ అధ్యక్షుడిగా అన్నా మలై, ఎస్సీ, మాజీ ఐపీఎస్… తెలంగాణలో బీసీ సీఎం అనే స్లోగన్… ఎస్సీ వర్గీకరణకు హామీ… బీజేపీ కోసం మంద కృష్ణ మద్దతు… రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము… ఆదివాసీ… ఛత్తీస్‌గఢ్‌లో సీఎంగా ఓ ఎస్టీ, విష్ణుదేవశాయి ఎంపిక… తాజాగా మధ్యప్రదేశ్ సీఎంగా ఓబీసీ మోహన్ […]
ఆగిపోయినట్టే ఆ అన్‌స్టాపబుల్ షో… నో, ఇప్పట్లో మూడో సీజన్ లేనట్టే లెక్క…
ఆహా ఓటీటీలో బాలయ్య హోస్ట్ చేసే అన్‌స్టాపబుల్ షో ఆగిపోయింది అని ఓ వార్త కనిపించింది… కారణం ఏమిటయ్యా అంటే, అన్నపూర్ణ స్టూడియోలో ఆ షో కోసం వేసిన సెట్టింగ్ మొత్తం పీకిపారేశారు… సో, ఇకపై అన్‌స్టాపబుల్ షో ఉండదు… అది అన్‌స్టాపబుల్ ఏమీ కాదు, జస్ట్, స్టాపబుల్ అని ఆ వార్త సారాంశం… నిజమేనా..? ఒక కోణంలో నిజమే… స్టూడియోలో ఆ సెట్టింగ్ తీసేయడం కూడా నిజమే… ఫస్ట్ సీజన్ సూపర్ హిట్… బాలయ్యను ఓ […]
జగన్‌తో రేవంత్ భేటీ అట…! ఏమిటింత ఆత్రం…? తెర వెనుక లెక్కలేమిటి..?
కనకదుర్గను దర్శించుకోవడానికి రేవంత్ విజయవాడ వెళ్లబోతున్నాడు… పనిలోపనిగా ఏపీ సీఎం జగన్‌ను కూడా కలుస్తాడు… ఇదీ తాజా వార్త, వాట్సపులో కనిపించింది… హఠాత్తుగా అనిపించేది ఏమిటంటే… ఎందుకంత ఆత్రం..? జగన్ ఎన్నోసార్లు హైదరాబాద్ రాడా..? అసలు తన ఇల్లే హైదరాబాద్ కదా… ఒక రాష్ట్రానికి మరో రాష్ట్ర ముఖ్యమంత్రి గనుక వెళ్తే, అక్కడి ముఖ్యమంత్రితో భేటీ మర్యాదపూర్వకం… అదీ ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు… కలిసినప్పుడు మాత్రం ఇరు రాష్ట్రాల నడుమ సమస్యలు, సమకాలీన రాజకీయాల ప్రస్తావనలు కూడా […]
రాజమౌళికే తాత సందీప్‌రెడ్డి… ప్రస్తుత దర్శకుల్లోనే ఓ ‘యానిమల్’…
అప్పట్లో ఏదో ఎన్టీయార్ సినిమాకు జనం ఎడ్ల బళ్లు కట్టుకుని, సద్దులు కట్టుకుని, పిల్లాపాపలతో ఊళ్ల నుంచి తరలిపోయేవారట… విన్నాం, చదివాం… యానిమల్ సినిమాకు సంబంధించిన రెండుమూడు వార్తలు చదివితే అదే గుర్తొచ్చింది… రాజమౌళి అనుకుంటే రాజమౌళికే తాత పుట్టుకొచ్చాడు కదా అనిపించింది… విషయం ఏమిటంటే… నార్త్‌లో కొన్నిచోట్ల యానిమల్ సినిమాను 24 గంటలూ వేస్తున్నారట… మనం శివరాత్రి పూట జాగారం కోసం వేసే మిడ్ నైట్ షోలు చూసేవాళ్లం… మరీ గిరాకీ అధికంగా ఉండే స్టార్ […]
దోసెలు వేస్తూ… ప్రయోగాలు చేస్తూ… ఓ ఎంబీఏ కుర్రాడి సక్సెస్ స్టోరీ ఇది…
ఈరోజు ఫేస్బుక్లో నచ్చిన పోస్టు ఇది… Verabhadraya Kaza గారి పోస్టుగా కనిపించింది… బాగుంది… ఇలాంటి సక్సెస్ స్టోరీలే సొసైటీకి ఇప్పుడు అవసరం… అఫ్కోర్స్, అందరూ సక్సెస్ కావాలనేమీ లేదు… కానీ స్పూర్తినివ్వడానికి, మనల్ని కదిలించడానికి ఇలాంటి కథలే ప్రేరణ… ఆ స్టోరీ యథాతథంగా… ఎంబీఏ చేసిన ఆ కుర్రాడు ఉద్యోగం కోసం వెళ్తే నెలకు రూ.10 వేలు జీతం ఇస్తామన్నారు. ఆ మాటలకు ఖంగు తిన్నాడా కుర్రాడు. తమ టిఫిన్ బండి దగ్గర పనిచేసే వంట […]
- « Previous Page
- 1
- …
- 152
- 153
- 154
- 155
- 156
- …
- 455
- Next Page »