అసలు ఆంధ్రాను తమిళనాడు నుంచి విడదీయడమే తప్ప… విడదీసిన తీరూ తప్పే… అందుకే ఎప్పటికైనా తమిళనాడులో ఆంధ్రా కలిసి ఉండటమే కరెక్టు అని ఎవరైనా గతి-మతి తప్పిన ‘‘తమిళ ఉండవల్లి’’ సుప్రీంకోర్టులో కేసు వేస్తే..? కాదు, ఈ శతృత్వాలు దేనికి..? ఈ యుద్ధాలు దేనికి..? అసలు పాకిస్థాన్, ఇండియా విడిపోవడం తప్పు, విభజించిన తీరు తప్పు, ఎప్పటికైనా రెండు దేశాలు మళ్లీ కలవడమే కరెక్టు అని ఎవరైనా ‘‘పాకిస్థానీ ఉండవల్లి’’ అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేస్తే..? ఎహె, […]
ఆలూ లేదు, చూలూ లేదు… సీత పాత్రలో సాయిపల్లవి… ఆలియా పడనిస్తుందా..?!
సాయిపల్లవి… మంచి నటి… నటనలో మెరిట్కన్నా తన ప్రవర్తనలో మెచ్చదగిన నటి… ఆ చర్చలోకి ఇక్కడ వెళ్లాల్సిన పనిలేదు గానీ… అది ఒడవని ముచ్చట గానీ… చాన్నాళ్లుగా వార్తల్లో లేదు… అయిపోయింది, గార్గి, విరాటపర్వం ఫెయిల్యూర్ల దెబ్బకు ఇక ఆమెకు చాన్సులు లేవు, ఎక్స్పోజ్ చేయదు, ఎదవ్వేషాలు వేయదు, అందులో ఏ నిర్మాతా పిలవడం లేదు, చేతిలో పనిలేదు, దాంతో ఇక తన డాక్టరీ పనితో ఓ పెద్ద హాస్పిటల్ కట్టాలని ప్లాన్ చేస్తుంది అనే వార్తలు […]
సారొస్తారొస్తారు..! ఏది పడితే అది తినడట… నిప్పు… మెనూ ఉత్తర్వులు జారీ..!!
పెద్ద సారు జిల్లా పర్యటనకు వస్తున్నాడంటే… ఆ జిల్లా, ఆ శాఖ సిబ్బందిలో ఒకటే టెన్షన్… ఏదో వృత్తిపరమైన, శాఖాపరమైన, ప్రభుత్వపరమైన, ప్రజాసంబంధమైన టెన్షన్ కాదు… సార్ వెంట ఎవరెవరొస్తారు..? ఏం తింటారు..? రాత్రి బస చేయాల్సి వస్తే, సారుకు ‘ఏమేం ప్రత్యేక ఏర్పాట్లు’ చేయాలి..? తగ్గితే తమ సిబ్బందికి తనపట్ల మర్యాద లేదని కోపం పెంచుకుంటారు… మర్యాద మరీ ఎక్కువైతే, ఏ యూట్యూబ్ గొట్టానికే దొరికిపోతే అదొక తల్నొప్పి… ఇదీ టెన్షన్… సాధారణంగా మన అధికార […]
వివాహేతర శృంగారం బ్యాన్… సహజీవనానికి నో… అధ్యక్షుణ్ని వ్యతిరేకిస్తే యాక్షన్…
మొన్నటి అయిదో తారీఖున ఇండొనేషియా కొన్ని కీలక చట్టాల్ని చేసింది… పెళ్లిళ్లు గాకుండా శృంగారం, అనగా వివాహేతర శృంగారం నిషేదం… సహజీవనాలపై సంపూర్ణ నిషేధం… దేశ అధ్యక్షుడిని ఏ రీతిలో ఎవరు అవమానించే వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు… రాజ్యానికి వ్యతిరేకంగా అభిప్రాయాల వ్యక్తీకరణ నిషేధం… ఈ కొత్త చట్టాల్ని తీసుకొచ్చేసింది… వివాహేతర శృంగార సంబంధాలు, సహజీవనాలకు సంబంధించి నిందితుల తరఫు వ్యక్తులే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది… అంటే భార్యలు లేదా భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు… ఇది […]
రాముడితో రామేశ్వర తీరంలో శివ హోమం చేయించిన రావణుడు..!!
కోరాను స్క్రోల్ చేస్తుంటే ఓచోట చూపు నిలిచిపోయింది… ఓ పిచ్చి కథ… చదవగానే కోపం వచ్చింది… పురాణాలను ఎవరికివారు ఇలా ఇష్టానుసారం మార్చేయడం దేనికి..? ప్రత్యేకించి వేల ఏళ్లుగా పూజించబడుతున్న పవిత్రగ్రంథాలకు సంబంధించి ఏం రాయాలన్నా, వాటిని విశ్వసించేవారి ఫీలింగ్స్ పరిగణనలోకి తీసుకోవాలి కదా అనిపించింది… కానీ మళ్లీ మళ్లీ చదివితే… వింతగా ఉన్నా సరే, మూర్ఖపు క్రియేటివిటీ, చిత్తపైత్యంలా అనిపిస్తున్నా సరే… ఆయా పురాణ పాత్రల గొప్పతనాల్ని ఎలివేట్ చేస్తున్నట్టుగానే ఉంది… ఆ పాత్రలు ఒకరికొకరు […]
వేరే వ్యక్తితో పెళ్లి, ఓ బిడ్డ… ఐనాసరే కమల్‌తో బంధంపై అవే రాతలు, కూతలు…
పూజా కుమార్ అనే నటి తెలుసా మీకు..? అమెరికాలో పుట్టింది, ఇండియన్ రూట్స్… అక్కడ చిన్న చిన్న సినిమాలు చేసి చెన్నై వచ్చిపడింది… కాదు, కమలహాసన్ కళ్లల్లో పడింది… పడిపోయింది… ఉత్తమ విలన్, విశ్వరూపం, విశ్వరూపం-2… అన్నింట్లోనూ ఆమే… లిప్ లాకులు, మస్త్ కెమిస్ట్రీ… తనకు అలవాటైన రీతిలోనే గౌతమిని కూడా వదిలించుకున్నాక కమలహాసన్‌కు పూజ దొరికింది… కొన్నేళ్లు సహజీవనం చేశారనే వార్తలు బోలెడు వచ్చాయి తమిళ మీడియాలో… కానీ తను 2020లో విశాల్ జోషిని పెళ్లి […]
ఎన్టీయార్ రూమ్మేట్… తన విజయాల్లో భాగస్వామి… రెండేళ్లు మాటలు బంద్…
Bharadwaja Rangavajhala……… జయకృష్ణా ముకుందా మురారీ… సినీ సంగీతంలో అనేక ప్రయోగాలు చేసిన సంగీత దర్శకుడుగా టి.వి.రాజు మోస్ట్ పాపులర్. జానపద సినిమాల్లో పాశ్చాత్య సంగీతం వినిపించడం … జానపదగీతాల్లో వెస్ట్రన్ బీట్స్ జోడించడం, హిందూస్థానీ సంగీతానికి ప్రాధాన్యత ఇవ్వడం… ఇలా ఒకటేమిటి… అనేక ప్రయోగాలు. ఇన్ని చేసిన సంగీత దర్శకుడు తోటకూర వెంకటరాజు. టి.వి.రాజు అధికంగా ఎన్టీఆర్ చిత్రాలకే సంగీతం కూర్చారు. ఇద్దరూ ఒకే సమయంలో చెన్నైలో కాలు పెట్టడంతో పాటు ఇద్దరూ కల్సి ఒకే […]
పదాలన్నీ పచ్చల పిడిబాకులే… పదప్రయోగంలో సినారె రసికుడైన వగకాడు…
ఈటీవీ స్వరాభిషేకంలో మాళవిక పాడుతోంది… ఛాంగురే బంగారురాజా… ఏ పదానికి ఏ అర్థవంతమైన భావాన్ని పలికించాలో, ఎలా ఉచ్చరించాలో బాగా తెలిసిన శ్రావ్యమైన గొంతు… మధురం… కైపున్న మత్స్యకంటి చూపు పదాల దగ్గర స్పష్టంగా భావాన్ని పలికించింది… చాలామంది మచ్చకంటి చూపు అని పాడేయడం విన్నాను… లిరిక్స్ సైట్లు కూడా అలాగే రాసుకున్నాయి… ఈ మచ్చ ఉన్న కన్ను ఏమిటి..? అంతటి సినారె అలా రాశాడేమిటో అనుకునేట్టు..! కానీ అది మత్స్యకంటి చూపే… అంటే చేపకళ్ల పిల్ల […]
చిరంజీవి ఏడుపు ఆగడం లేదు… తెల్ల చొక్కా తడిసిపోయింది కన్నీళ్లతో…
Abdul Rajahussain ………… వంశీ కొత్త పుస్తకం-2…. వంశీకి “ఏవో కొన్ని గుర్తొస్తున్నాయి “… ఇంతకీ చిరంజీవి కళ్ళలో నీళ్ళెందుకు..? ఆ రోజు… ‘మంచుపల్లకి’ క్లైమాక్స్ సీన్ ను చిరంజీవి మీద తీయాలి.. చిరంజీవిని పిలుద్దామని రూమ్ కు వెళితే ఆయన కళ్ళ నిండా నీళ్ళు, ఆయన తల మీద చెయ్యేసి నిమురుతున్నాడు స్టిల్ కెమెరా రాజేంద్ర ప్రసాద్….! “ప్రాబ్లమ్స్ అందరికీ వుంటాయి..ఊరుకుందురూ” అంటూ ఓదారుస్తున్నాడు రాజేంద్రప్రసాద్..! ఏం జరిగింది…? ఏం జరిగింది ? యూనిట్ అంతా […]
కేసీయార్ ఉచ్చులోకి అమిత్ షా… అప్పుడు ఉంటుంది అసలు తమాషా…
నిజమే అయితే… ఇక కేసీయార్ ఏకంగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ వ్యవహారాల కీలక సూత్రధారి అమిత్ షాను ఉచ్చులోకి లాగబోతున్నాడు అనే తాజా వార్తలే గనుక నిజమైతే… ‘ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు’లో సిట్‌ను నేరుగా ఢిల్లీ చిన పాదుషా పైకే ప్రయోగించడమే నిజమైతే… పోరాటం మరింతగా రక్తికడుతుంది… (ఇక్కడ రక్తికట్టడం అనే పదం వాడటానికి కారణం… ఇవేవీ చివరకు ‘వర్కవుట్’ అయ్యే కేసులేమీ కావు అని… ఒకరినొకరు ఇరికించడం కోసం, పొలిటికల్‌గా బదనాం చేయడం కోసం […]
దటీజ్ ఆంధ్రజ్యోతి… స్పైజర్నలిజంలో దిట్ట… మోడీ షాట్- జగన్ షాక్…
నిన్న రాత్రి నుంచీ మహాఉబలాటంగా ఉంది… ఉత్సుకత కూడా ఉంది… ఆ జీ20 అఖిల పక్ష సమావేశం వద్ద ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ పెట్టిన సీక్రెట్ స్పై హియర్ బగ్స్ సమయానికి సరిగ్గా పనిచేస్తాయో లేదో… కొందరు నేతల చొక్కా గుండీలకు అమర్చిన నానో కెమెరాలు ఎలా పనిచేస్తాయో ఏమో… ఈమధ్య పెద్దగా సెన్సేషనల్ కవరేజీ ఏదీ పత్రికలో గానీ, ఆ టీవీ చానెల్లో గానీ కనిపించలేదు… చాన్నాళ్లకు మరి ఇప్పుడైనా… మరి ఇప్పుడేమో చంద్రబాబు మొహం చూశాడు […]
పద్యం పాడాలంటే ఘంటసాల… ప్రాణం పోశాడు, పరుగు పెట్టించాడు…
Bharadwaja Rangavajhala……. పద్యానికి ఘంటసాల ప్రాణము పోయున్… తెలుగు సినిమా పాటకు శాశ్వతత్వం ప్రసాదించిన గళం పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు. మొన్న ఘంటసాల వారి పుట్టిన రోజు. తెలుగుజనం పెద్దగా స్మరించుకున్నట్టు లేదు… తెలుగు పద్యాలకి ఒక కొత్తరూపం ఇచ్చినవాడు ఘంటసాల. పద్యనాటకాల్లో నటించాలంటే శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోక తప్పేది కాదు. పద్యాలను రాగయుక్తంగా ఆలపించాలంటే…ఈ కసరత్తు తప్పదు మరి. సాహిత్యాన్ని మింగేసేలా సంగీతం సాగేది. రాగాలు సాగేవి. ఈ పద్దతిని సమూలంగా మార్చిన వాడు ఘంటసాల. […]
బిగ్‌బాస్ తరహాలో ఓ రియాలిటీ షో టేకప్ చేయాలి ఆహా అరవింద్ భాయ్…!!
ఓటీటీల్లో ఎప్పుడైనా చూడదగిన వెబ్ సీరీస్, సినిమాలు వంటి కంటెంటు మాత్రమే ఉండాలని ఏముంది..? టీవీల్లో వచ్చే రియాలిటీ షోలు కూడా రన్ చేయొచ్చు… ఎస్, తెలుగు వినోద చానెళ్లలో వచ్చే మ్యూజిక్, కామెడీ, డాన్స్, కుకింగ్, ఫన్నీ గేమ్స్, చిట్‌చాట్ వంటి అన్ని అంశాల రియాలిటీ షోలను ఆహా ఓటీటీ వాళ్లు అడాప్ట్ చేసేసుకుంటున్నారు… ఏమాటకామాట… ఖర్చు బాగానే పెడుతున్నారు… మెయిన్ స్ట్రీమ్ టీవీ చానెళ్లలోకన్నా నాణ్యతతో షోలు రన్ చేస్తున్నారు… మంచి ఉదాహరణ… కామెడీ […]
బండి ఎద్దుకు బాగా బలిసింది… డైపర్లు కడితేనే ఆ వీథిలోకి రానివ్వండి…
నిన్న పొద్దుణ్నుంచీ ఎదురు చూస్తున్నా… ప్చ్, ఈ వార్త మీద సోషల్ మీడియా, టీవీ మీడియా, సైట్స్ ఏమైనా స్పందిస్తాయేమో, ఏమైనా రాస్తాయేమో అని… నిరాశే… అసలు ఈ పత్రికే ఇంకాస్త ప్రయారిటీ ఇచ్చి ఉండాల్సింది… సరే, వాళ్ల పత్రిక, వాళ్లిష్టం… కానీ మనం ఎలాంటి పాలన వాతావరణంలో బతుకుతున్నామో సరిగ్గా అర్థమై ఓరకమైన వైరాగ్యం ఆవరిస్తుంది మనకు… పాలితుడంటే పాలకులకు ఎంత అలుసో అర్థమవుతుంది… పాలితుడంటే సగటు మనిషి, పాలకుడు అంటే పోలీస్, ఉన్నతాధికారులు, నాయకులు… […]
డెలివరీ కోసం మైనర్ భార్య సర్కారీ హాస్పిటల్ వెళ్తే… భర్తపై పోక్సో కేసు…
కొన్ని సమర్థించాలో, వ్యతిరేకించాలో తెలియదు… ఉదాహరణకు… తమిళనాడులోని కడలూరు… ఓ స్కూల్ పిల్లాడు… తన ఫ్యామిలీ ఫ్రెండయిన అమ్మాయితో లవ్వు… పరస్పర అంగీకారంతోనే ఆమె మెళ్లో తాళి కట్టబోతున్నాడు… హుటాహుటిన బిలబిలమంటూ పోలీసులు, అంగన్వాడీ సిబ్బంది చుట్టుముట్టారు… అబ్బాయి మీద పోక్సో కేసు పెట్టారు… అమ్మాయిని చిల్ట్రెన్ హోంకు పంపించారు… అసలు చిల్డ్రెన్ హోం అంటే అదొక నరకం… అందులోకి ఆ పిల్లను తోసేయడం అంటే క్రూరమైన జైలుశిక్ష విధించడమే… ఆమె ఏం తప్పు చేసిందని..? ఎస్, […]
భేష్… పాస్‌పోర్టు సేవల తీరే మారిపోయింది… నమ్మశక్యం కానంతగా…!!
కొన్ని మెచ్చుకోవాలి… సమాచారం కోసం… అభినందన కోసం… తెలంగాణ పాస్‌పోర్ట్ సేవలు ఎంత సరళీకృతం అయ్యాయంటే, ఓ అయిదూపదేళ్ల క్రితంతో పోలిస్తే అసలు పోల్చలేనంత మార్పు… సూటిగా విషయంలోకి వెళ్దాం… ప్రభుత్వ, ప్రైవేటు సర్వీసుల బ్లెండ్ సొసైటీకి ఎలా ఉపయోగం..? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం ఎలా ఉండాలి..? అనే అంశాలకు ఇదొక్క మంచి ఉదాహరణ… గతం ఓసారి నెమరేసుకుందాం… పాస్‌పోర్టు సంపాదించడం ఓ గగనం… సవాలక్ష కొర్రీలు, సర్టిఫికెట్లు, అర్థం కాని దరఖాస్తు వ్యవహారం… దళారులు, […]
వావ్ సుధీర్… అల్లు అరవింద్‌కు కూడా నచ్చేశావ్… తప్పలేదు…
మొన్న మనం చెప్పుకున్నాం కదా… ఆఫ్టరాల్ జబర్దస్త్ కమెడియన్ అని తీసిపారేసిన సుడిగాలి సుధీర్ ఈరోజు సక్సెస్ ఫుల్ చిన్న హీరో… ఏం, సక్సెస్ కొట్టాలంటే విషక్సేన్లు, శిరీష్‌లు, విష్ణులు అయి ఉండాలా..? సుధీర్‌లు కూడా కొడతారు… కొట్టి చూపిస్తారు… చూపించాడు సుడిగాలి సుధీర్… గాలోడు అంటే అందరూ ఒకే తీరు కాదు, కొందరికి సుడి ఉంటుంది, అందుకే సుడిగాలి సుధీర్ అయ్యాడు… ఈమాట ఊరికే అనడం లేదు… తను హీరోగా చేసిన గాలోడు అనే సినిమా […]
‘‘నీ ఏడుపేదో నువ్వేడువు… నాకన్నా ఎక్కువ ఏడువు… నేనేమైనా వద్దన్నానా..?’’
మల్లెమాల తీస్తున్న ఏదో సినిమా… జమున, జయలలిత ఇద్దరూ ఉన్నారు… జయలలిత కాస్త ఇంట్రావర్ట్… తన షూటింగ్ పార్ట్ అయిపోగానే ఏదో ఇంగ్లిషు పుస్తకం చదువుతూ ఓ పక్కన కూర్చునేది… యవ్వనంలో అబ్బురపరిచే అందం… మంచి ఇంగ్లిషు పరిజ్ఞానం… వేరే తారలకు తనంటే ఓరకమైన ఈర్ష్య… జమున షూటింగ్ స్పాట్‌కు వెళ్లగానే ఓరోజు అప్పటికే అక్కడికి వచ్చి షూటింగ్‌కు రెడీగా ఉన్న జయలలిత లేచి నిలబడలేదు, విష్ చేయలేదు… జమునకు చర్రుమంది… తనకూ ఇగోయిస్టు అనే పేరుందిగా… […]
కవిత కేసులో మరో ట్విస్టు… ‘‘అసలు ఎఫ్ఐఆర్లో నా పేరే లేదుగా…’’
మరో ట్విస్టు… ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత విచారణ కేసులో చిన్న మలుపు… అసలు మీ ఎఫ్ఐఆర్లో నా పేరే లేదు, మొన్న ఆరో తారీఖున మా ఇంటికి రండి అన్నాను… కానీ ముందుగానే ఖరారైన ప్రోగ్రాముల వల్ల ఆరోజు నాకు వీలుకాదు, 11, 12, 14, 15 తేదీల్లో ఏదో ఒక రోజు మా ఇంట్లోనే అందుబాటులో ఉంటాను… అంటూ కవిత సీబీఐకి తాజాగా లేఖ రాసింది… ముందుగా ఆ వార్త చదవండి… ‘‘ఢిల్లీ ఉపముఖ్యమంత్రి […]
వెంకయ్య కాదు… ఈయన జగదీప్ ధన్కర్… సుప్రీంనే గోకుతున్నాడు…
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వివాదాస్పద వ్యాఖ్యలు, రాజకీయ వ్యాఖ్యానాల జోలికి పోకూడదు… గతంలో ఏ పార్టీ అయినా సరే, తన రాజకీయ భావజాలం ఏదయినా సరే, ఒకసారి ఆ పోస్టుల్లో చేరాక నిష్పాక్షిక, వివాదరహిత ధోరణిలో నడుచుకోవాలని అంటుంటారు కదా… ప్రత్యేకించి ఏవైనా మీటింగుల్లో, పర్యటనల్లో మాట్లాడేటప్పుడు తమ ఆఫీసులు ప్రిపేర్ చేసిన స్క్రిప్టునే ఫాలో కావాలని కూడా అంటారు… మన వెంకయ్యనాయుడు కూడా బోలెడుసార్లు తన అసహాయత వ్యక్తీకరించాడు కదా, తాను ఉపరాష్ట్రపతి హోదాలో ఏదీ స్వేచ్ఛగా […]
- « Previous Page
- 1
- …
- 154
- 155
- 156
- 157
- 158
- …
- 347
- Next Page »