మహి వి రాఘవ … యాత్ర-2 దర్శకుడు… యాత్ర ఫస్ట్ పార్ట్‌ను అందరికీ కనెక్టయ్యేలా, ఎమోషన్స్ కూడా సరిగ్గా చిత్రిక పట్టగలిగి… తీరా యాత్ర సీక్వెల్‌కు వచ్చేసరికి… తనలోని క్రియేటివ్ దర్శకుడిని కోల్పోయాడు అనే విమర్శను ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు… జగన్ వ్యతిరేక శిబిరం ఎలాగూ సినిమా మీద ఏదేదో వ్యాఖ్యానాలు చేస్తుంది, అది సహజం… ఇది సాదాసీదా ఓ మసాలా మూవీ కాదు గనుక, వర్తమాన రాజకీయాలతో అల్లబడిన కథ గనుక… ఒక నాయకుడిని బాగా ఎలివేట్ […]
ముద్దపప్పు – మసలవెట్టిన చారు…. ఇగ జూడు, కడుపు కైలాసమే…
Sampathkumar Reddy Matta ……. ముద్దపప్పు – మసలవెట్టిన చారు ~~~~~~~~~~~~~~~~~~~~~~~ ముద్దపప్పు & మసలవెట్టిన చారు.. ఇది తరతరాలుగా వన్నెతరుగని వంట ! సాంబారు గీంబారు.. పేరుతోటి మనం పరాయీకరణకు గురికానప్పటి పాతకాలపు సంప్రదాయకమైన రుచి యిది. బోనం – తీర్థం, పెండ్లి – పేరంటం చుట్టం – పక్కం… సందర్భమేదయినా ఎన్నితీర్ల కాయగూరలు వండుకున్నా సరే అన్నిటికి మొదటిది పప్పు & చారు/ పచ్చి పులుసు. మన ఇంటిమందమే అయితే పచ్చి పులుసు చేసుడు […]
ఇంకేం చేయాలి చెప్మా..! ఇద్దరు బడా స్టార్ల ఎదుట నిలిచిన పెద్ద ప్రశ్న…!!
రజినీకాంత్ వయస్సు 73 ఏళ్లు… తనను ఓ ఫ్యాన్‌లా చూడకపోయినా సరే, తను సాధించిన పాపులారిటీ ఎప్పుడూ అబ్బురం అనిపిస్తుంది… ముదురు ఛాయ, బక్కపలుచని దేహం, పెద్ద అందగాడు కూడా కాదు… ఐనా సరే, ఇండియన్ సినిమా తెర మీద తను ఓ సుప్రీం హీరో… అదీ భాషలకు అతీతంగా… తెలుగు, తమిళం, మలయాళంతోపాటు హిందీ ఎట్సెట్రా… పద్మవిభూషణ్… సీన్ కట్ చేస్తే… చిరంజీవి వయస్సు 68 ఏళ్లు… రజినీకన్నా చిన్నోడే… తను కూడా పద్మవిభూషణ్… తన […]
మోడీ అంచనా మేరకు పాకిస్థాన్ కొత్త ప్రధానిగా మళ్లీ నవాజ్ షరీఫ్..!
Pardha Saradhi Potluri… పార్లమెంట్ కాంటీన్ లో మోడీ ముచ్చట్లు! నేను మిమ్మల్ని కాసేపు విసిగిస్తాను… మోడీ! నిన్న పార్లమెంట్ కాంటీన్ లో భోజనం చేస్తున్న పార్లమెంట్ సభ్యులతో హఠాత్తుగా అక్కడికి చేరుకున్న మోడీ అన్న మాటలు అవి! సహచర సభ్యులతో కలిసి భోజనం చేసిన మోడీ సరదాగా వారితో సంభాషించారు! ఇదెలా జరిగింది అంటే….. భోజనం చేయడానికీ కాంటీన్ కి వచ్చిన మోడీ అప్పటికే అక్కడున్న పలువురు పార్లమెంట్ సభ్యులతో ‘కాసేపు మిమ్మల్ని విసిగిస్తాను, నాతో కలిసి భోజనం చేయండి’ అంటూ […]
మిస్ నాట్ పర్ఫెక్ట్..! త్రిపాఠీ లావణ్యం, నటన అంట్లు తోమడానికే సరిపోయాయ్…!
Ms not so Perfect… సాధారణంగా సీరీస్లు, సినిమాలు చూసిన తర్వాత రివ్యూలు రాయాలంటే మహా బోరు బద్దకం. కానీ ఈ కళాఖండంపై రాయాలనుకునీ రాయకుండా టైం పాస్ చేసా… కానీ, రాయడం వల్ల ఇలాంటి కళాఖండాల బారిన పడకుండా వుంటారని గుర్తొచ్చింది. సరే, ఇంతకీ ఏంటి ఈ కళాఖండం కథాకమామీషు….. డిస్నీహాట్‌స్టార్‌లో కొత్తగా రిలీజయిన ‘Miss Perfect’ గురించి… దీనిలో లావణ్య త్రిపాఠి టైటిల్ రోల్లో నటించింది… ఆమెకి జోడీగా బిగ్‌బాస్ ఫేమ్ అభిజిత్ నటించాడు. దీనిని […]
స్థితప్రజ్ఞత… నిర్వికారం… ఏ సర్టిఫికెట్లూ అక్కర్లేని ఓ శ్రేష్ట మానవుడు…
భారతరత్న పివి… మౌన ముని… పివి చెప్పే పాఠం… అనేక భాషల్లో పివి పాండిత్యం, ఆయన రచనలు, అంతర్జాతీయ విధానాలు, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన తీసుకున్న సాహసోపేతమయిన నిర్ణయాలు, ఇతర పార్టీల నాయకులను గౌరవించిన తీరు, ఆర్థిక సంస్కరణలు, వార్ధక్యంలో కూడా కొత్త విషయాలు నేర్చుకునే ఉత్సాహం…ఇలా పివి గురించి అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. సినిమా తారాల్లాంటి వారిని కంటితో చూడాలి. ఘంటసాల లాంటివారిని చెవితో వినాలి. పివి, వాజపేయి […]
ఆ అద్దాలమేడలో ఒక్క గులాబీ పూయలేదు మళ్లీ… పొలమారిన జ్ఞాపకం…
Abdul Rajahussain …. ప్రియురాలి కోసం కట్టిన అద్దాల మేడ…! ప్రవరాఖ్యుడి పోలికల్లో వున్న ఆ శాస్త్రినే చూస్తోంది అందాల ఆ జగదాంబ….! నిగనిగలాడే చంద్రుడు నల్లటి మబ్బుల్లోకెళ్ళి పోయేటప్పటికి ఆ వనమంతా చీకటి ఆవరించింది. అడుగులో అడుగేసుకుంటూ శాస్త్రి దగ్గరకొచ్చిన ఆ జగదాంబ అతన్లో కలిసిపోతోంది.! శృంగారంలో వాళ్ళు స్వరాల్ని పలుకుతుంటే మరి భరించలేని ఆడ నెమలి తన గూడు తలుపులు తెరుచుకొని తమకంలో బయటకొచ్చింది.! కలగలిసి పోతున్నా తనకేసి చూడ్డం సబబు కాదనిపించి విప్పుకుని […]
ఇది మన రజినీకాంత్ సినిమాయేనా…? నిజం చెప్పు ఐశ్వర్యా…!!
రజినీకాంత్ ఇమేజీ అసాధారణం… ప్రేక్షకులు తన నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తారు… థియేటర్ విజిళ్లతో దద్దరిల్లిపోవాలి… దశాబ్దాలుగా తనను చూస్తూనే ఉన్నా సరే… తన డైలాగులు, తన మేనరిజమ్స్, తన ఎలివేషన్, ఎమోషన్స్ ఎట్సెట్రా కావాలి… ఏమాత్రం తగ్గినా సరే సినిమా ఢమాల్… ఈ అతి అంచనాలే రజినీకాంత్ సినిమాలకు బలం, బలహీనత కూడా… తను మారలేడు… జనం మారనివ్వరు… అలాగని రొటీన్ మొనాటనస్ సినిమాలు తీస్తే క్రమేపీ తన మీద న్యూట్రల్ ఆడియెన్స్ ఆసక్తిని చంపేసుకుంటున్నారు… […]
ఈగిల్… సంక్రాంతి బరి నుంచి గాలివాటం గద్ద తప్పుకుని… బతికిపోయింది…
ఎవరో సరిగ్గా రాసినట్టు అనిపించింది… ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సిండికేట్ ప్రభావం పుణ్యమాని రవితేజ ఈగల్ సినిమాను మొన్నటి సంక్రాంతి బరి నుంచి తప్పించడమే మంచిదైంది… లేకపోతే కొట్టుకుపోయేది లేదా నలిగిపోయేది… వెంకటేశ్ సైంధవ్ రిజల్ట్ చూశాం కదా… హనుమాన్ దెబ్బకు అంతటి గుంటూరు కారమే హిట్టో కాదో చెప్పలేని స్థితి… నాగార్జున నాసామిరంగా సినిమా ఏదో కన్నులొట్టబోయి బయటపడిందట… శివకార్తికేయన్ సినిమా అయలాన్ కూడా వాయిదా వేసుకుని, చివరకు తెలుగు రిలీజ్ లేకుండానే, అదే తమిళ […]
అనుకుంటాం గానీ… అసలు పాటే లేకుండా కృష్ణ డాన్స్ ఇరగేశాడు…
Subramanyam Dogiparthi…. నిర్మాత డి రామానాయుడుకి తన సినిమాలో ఏదో ఒక అతిధి పాత్రలో నటించే సెంటిమెంట్ ఉందని మనందరికీ తెలిసిందే . డాక్టర్ గానో , పోలీసు ఆఫీసర్ గానో తళుక్కుమంటుంటాడు . ఈ సినిమాలో పెళ్ళి కొడుకుగా కనిపిస్తారు . విజయనిర్మలను పెళ్లి చేసుకుంటారు . చక్కటి ఎమోషనల్ , సెంటిమెంటల్ సినిమా . ఓ చిన్న పాప కరుడుగట్టిన ముగ్గురు హంతకులలో ప్రేమను చిగురింపచేసి , మనుషులను చేసి , పోలీసులకు లొంగిపోయేలా […]
ఘనత వహించిన సోకాల్డ్ ఉన్నతాధికారులంతా సేఫ్ అయిపోతున్నారు..!!
తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌ను రాజీనామా చేయమని ఆదేశించారు… చేస్తాడు, తప్పదు… హాయిగా చేసేసి, సుబ్బరంగా శేషజీవితం విలాసంగా బతుకుతాడు… మరో ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును సర్వీస్ నుంచి తొలగించారు… ఆయనకేం, హేపీ… ఇన్నాళ్ల ఆర్జనలు చాలవా ఏం..? ఎటొచ్చీ ఆ మేడిగడ్డే ఇక పనికిరాకుండా పోతుందని తెలంగాణ బాధపడుతుంది… అన్నారం కూడా అదే ఖాతాలో పడుతుంది… మల్లన్నసాగర్ భూకంపం రావొద్దని రోజూ కొమురవెల్లి మల్లన్నకు పెద్ద పట్నం వేసి మొక్కుతూ ఉంటుంది… […]
ఇండియాలోనే కాదు… ఇంగ్లిషులోనూ లేకపోలేదు రకరకాల యాసల గోస…
ఇండియన్ ఇంగ్లిష్… భాష- యాస తెలుగు భాష ఒకటే అయినా యాసలు అనేకం. ఒక్క జిల్లాలోనే నాలుగయిదు యాసలు కూడా ఉంటాయి. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో హిందూపురం , మడకశిర, గోరంట్లల్లో కన్నడ ఉచ్చారణతో కూడిన తెలుగు యాస. కదిరిలో కడప యాస. గుత్తిలో కర్నూలు యాస. అనంతపురం, ధర్మవరం, పెనుకొండలో ఒక యాస. ఇంకా లోతుగా వెళితే కులాలు, వృత్తులను బట్టి యాసల్లో మరి కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. భాష, యాసల మీద దృష్టి ఉన్నవారు రెండు […]
‘ఇంకో పదిసార్లు పీఎం అయినా సరే… ఆర్టికల్ 370 టచ్ కూడా చేయలేడు…’
‘ఈ రూమ్‌లో ఉన్న మనం, ప్రధాని ఆఫీసులోని ఒకరిద్దరు కోర్ మెంబర్స్, అంతేతప్ప చివరకు ప్రధాని పీఏకు కూడా సైతం మన ప్లాన్ ఏమిటో తెలియవద్దు’… ‘ఈ ప్రధాని మరో పదిసార్లు పీఎం అయినా సరే ఆర్టికల్ 370 మీద చేయి వేయలేడు’… ‘చరిత్రలో లిఖించబడాలీ అంటే ఎవరో ఒకరు చరిత్రను లిఖించాలి కదా’… ఇలా కొన్ని డైలాగ్స్ ఏకంగా ప్రధాని కార్యాలయాన్నే సినిమాలోకి లాగుతాయి… సినిమా పేరు ఆర్టికల్ 370… నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ […]
అబ్బో… ఆంటీని మునగ చెట్టు ఎక్కిస్తున్నారుగా… జెర పైలం తల్లీ…
గంగవ్వ… బర్రెలక్క… కుర్చీ మడత పెద్దాయన… ఒక్కోసారి ఒకరు సోషల్ మీడియాలో ఫుల్లు పాపులర్ అయిపోతారు… గంగవ్వ అయితే ఓ ఇల్లు కట్టుకుంది… బిగ్‌బాస్ ఇంటికి వెళ్లొచ్చింది… బర్రెలక్క మంచి వోట్లే సాధించి రాజకీయాల్లో కొనసాగే సూచనలు కనిపిస్తున్నయ్… ఫాఫం, ఆ మడత కుర్చీ పెద్దమనిషికి పాపులారిటీ వచ్చింది గానీ ఇంకేమీ దక్కలేదు… ఇప్పుడు ట్రెండ్ కుమారీ ఆంటీ… తెలుసు కదా… ఫుడ్ స్టాల్, ఫుల్లు గిరాకీ పెంచేసిన సోషల్ మీడియా… ఎగబడిన జనం… పోలీసుల కన్నెర్ర, […]
మా బెజవాడ మేమే గుర్తుపట్టనంత వేగంగా మారిపోతోంది… ఇలా…
Paresh Turlapati……. (నేను రాసింది కాదు…వాట్సాప్‌లో వచ్చింది…మా బెజవాడ కదా అని ఇక్కడ పోస్టేసా.. రాసినవారికి అభినందనలు ) మా బెజవాడ ఎంత మారి పోయింది ఒకప్పటి బెజవాడలా లేదిది. ఊరు మారిపోయింది . దాని కన్నా వేగంగా ఊర్లో జనం మారిపోతున్నారు. అన్నీ మార్పులే. డా.బసప్పున్నమ్మ గారి ఆసుపత్రి ముందు ఉండే వాణీ నికేతన్ ఎప్పుడో కొట్టేసారు. పక్కనే ఉండే సోడా కొట్టు ఇపుడెక్కడుందో తెలీట్లా. వరసెట్టి షాపులు కట్టేసేరక్కడ గోడలమీద అంటించే సినిమా పోస్టర్లు […]
Yatra2… జగన్ ఇమేజ్ బిల్డింగ్ మూవీ… ఫీల్ గుడ్ పాజిటివ్ ధోరణి…
ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాలు, సొంత మీడియా సంస్థలు తమ నాయకుడిని, తమ పార్టీని ఎప్పుడూ పాజిటివ్ యాంగిల్లో చూపించడానికి ప్రయత్నిస్తాయి… అలా ప్రయత్నించడం వాటి కర్తవ్యం… అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ విధానాల్ని తూర్పారబట్టడం, తమ పార్టీ విధానాల్ని జస్టిఫై చేయడడం కూడా సాధారణమే… కేవలం ఒక నాయకుడి కోసం సినిమా తీయడం అంటే, తన ప్రతి చర్యనూ జస్టిఫై చేయాలి, ఇప్పుడు ఎన్నికల ముందు పొలిటికల్ ఫాయిదా కోసం తీయబడిన సినిమా కాబట్టి […]
‘కోడి కోసం వచ్చావా గోపాలా… పుట్ట తేనె కావాలా గోపాలా…’’
Bharadwaja Rangavajhala….. కురిసే చినుకు ఎద వరకు ఎల్లువైతే … కడవరకూ వేచి ఉంటానంటూనే … కాలం చెల్లితే ఇంత మన్నేసిపొమ్మనే… ఎద రొదను తన వేణుగానంతో మన హృదయాల్లోకి ప్రసారం చేసినవాడు నవీన్. హృదయాల మీద పెంకులు ఎగిరిపోయేలా తన సంగీతంతో ఆత్మలకు మేలుకొలుపు పాడతాడు. కావాలంటే … మణిరత్నం బొంబాయి కోసం రెహ్మాన్ స్వరకల్పన చేసిన థీమ్ మ్యూజిక్ గుర్తు చేసుకోండి… రెహ్మాన్ సత్తా బాలీవుడ్ కి చాటిన తాళ్ సంగీతానికి ఊతం నవీన్ వేణుగానమే. ఎద […]
ఫాఫం మణిశర్మ… మంగ్లి మాటకు నోరుతెరిచాడు… భలే సరదా ఎపిసోడ్…
యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ… అలియాస్ మణిశర్మ… మొన్నామధ్య ఎంతసేపూ తమన్, డీఎస్పీయేనా… నాకూ చాన్స్ ఇస్తే వైవిధ్యం ఉంటుంది కదా అంటూ నిర్మాతలను కోరుతూ హఠాత్తుగా ప్రచారతెర మీదకు వచ్చాడు… నిజంగా ట్రాజెడీ… 30 ఏళ్లు తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన మణిశర్మ నాకూ చాన్సులు ఇవ్వండి సార్ అనడగడం బాగనిపించలేదు… అడగడం బాగా లేదని కాదు… అలా అడిగే సిట్యుయేషన్ బాగా లేదని… ఎస్, ప్రస్తుతం ఇండస్ట్రీలో తమన్, డీఎస్పీ టాప్ మ్యూజికల్ […]
ఉద్యమ జ్వాలకు చమురు పోసిన జాతి గీతం… ఈ స్వల్ప మార్పులు సరి..!
జయజయహే తెలంగాణ . కాల గమనంలో పాటలు కూడా ఆటుపోటులకు గురవుతాయి. గీతాలు తమ రీతులు మార్చుకుంటాయి. తొలి దశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ఎన్.టి.ఆర్ తాను స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించిన ‘తల్లా పెళ్లామా’ చిత్రాన్ని 1970 లో విడుదల చేశాడు. ప్రాంతీయ విభేదాలకు అతీతంగా ఆంధ్ర ప్రదేశ్ సమైక్యంగా ఉండాలని ఉద్దేశిస్తూ’ సినారె’ గారితో ‘తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది’ అనే పాటను రాయించారు. అనేక పోరాటాల పరిణామాల […]
పత్రికొక్కటి చాలు… పది విధంబుల చేటు… సేమ్ ఆంధ్రజ్యోతి…
మీడియా అంటేనే ఇప్పుడు ప్రజలపక్షం కాదు… ఏదో ఒక పార్టీకి, ఏదో ఒక నాయకుడికి ఊడిగం చేసే బాకా… అది క్లియర్… టీవీలు, పత్రికలు, వాటి అనుబంధ సైట్లు, సోషల్ మీడియా గ్రూపులు, ఎఫ్ఎం స్టేషన్లు, వినోద చానెళ్లు… అన్నింటిదీ అదే తోవ… ప్రజలకు కూడా ఇప్పుడు మీడియా నిష్పాక్షికత మీద భ్రమలేవీ లేవు… మరీ తెలుగు పత్రికలైతే రొచ్చులో పడి దొర్లుతున్నయ్… సరే, అదంతా వేరే చర్చ… కొన్నిసార్లు నాయకుడిని మించి యాక్షన్ చూపిస్తుంటయ్ కొన్ని […]
- « Previous Page
- 1
- …
- 163
- 164
- 165
- 166
- 167
- …
- 483
- Next Page »