(రమణ కొంటికర్ల) ……… 1964లో రహీమ్ సాబ్ ఏ చిట్కాలైతే చెప్పాడో… ఇప్పుడు ఫుట్ బాల్ కు కేరాఫ్ లా మారిన బ్రెజిల్ లో అవే నేర్పిస్తున్నారు. ఈ మాటన్నది.. 1964లో ఇండియన్ ఫుట్ బాల్ కోచ్ గా పనిచేసిన ఆల్బర్ట్ ఫెర్నాండో. అందుకే రహీమ్ సాబ్ ను ఫుట్ బాల్ ప్రవక్తగా కొల్చేవారట. ఇప్పుడెందుకీ రహీమ్ సాబ్ ముచ్చట అంటే.. ఈ ఏప్రిల్ 10వ తేదీన విడుదల కాబోతున్న అజయ్ దేవగణ్ మైదాన్ స్టోరీ.. రహీమ్ […]
ఒక్క “పల్లె కన్నీరు పెడుతోందో” పాట పల్లవి ఈడ్చి తంతే… అవన్నీ…
ఎన్నికల భాషాజ్ఞానంలో ప్రాసలు- పంచులు ‘రాజకీయం’ మాట వ్యుత్పత్తిలో నీచార్థం లేదు. కాలగతిలో రాజకీయ స్వభావం వల్ల ఒకరకమైన అర్థం స్థిరపడింది. రాజకీయంతో ముడిపడని విషయమే ఉండదు. రాజకీయ పరిభాషకు బయట ఎక్కడా నిఘంటువులు దొరకవు. అవసరం కూడా లేదు. “2050 నాటికి దేశంలో అందరికీ ఇళ్లు ఉండాలి” “2075 నాటికి దేశంలో నదులనన్నిటినీ కలిపి తాగునీటి సమస్యను తీర్చేస్తాం” “3075 నాటికి భారత్ ప్రపంచాన్ని శాసించేలా చేయడమే మా పార్టీ సంకల్పం” “నగరంలో ట్రాఫిక్ సమస్య […]
అసలు నేను ఈ సినిమా చూడాల్సి వస్తుందని కూడా అనుకోలేదు…
Prabhakar Jaini….. అసలు ఈ సినిమా గురించి నేను నా స్పందన తెలియచేయాల్సి వస్తుందనీ, అసలు నేను ఈ సినిమా చూడాల్సి వస్తుందని కూడా అనుకోలేదు. కానీ, ఏదో పొద్దుపోకనో, IPL చూడడం ఇష్టం లేకనో, ఈ సినిమా చూసాను. ఎందుకంటే, ఈ ప్రధాన పాత్రధారి హర్ష చేసే బూతు కామెడీ, వెకిలి మాటలు నాకు చిరాకు పుట్టిస్తాయి. ఇతన్ని పెట్టి సినిమా తీయడం కూడా ఈ సినిమా చూడకపోవడానికి ఒక కారణం. కానీ, సినిమా చూసిన తర్వాత […]
… వెరసి ఫ్యామిలీ స్టార్ దర్శకుడు పరుశురాం క్రెడిబులిటీ మటాష్…
సినిమాకు మౌత్ టాక్ బాగుంది, అందరూ అభినందిస్తున్నారు, కానీ మీడియాలో నెగెటివిటీ వ్యాప్తి చేస్తున్నారు అనే దిల్ రాజు ఆరోపణో, ఆవేదనో, సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదో కాదు… ఫ్యామిలీ స్టార్ సినిమాకు సంబంధించిన మరో సినిమా సంబంధ వార్త ఇంట్రస్టింగు అనిపిస్తోంది… ఎస్, విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్‌కు సంబంధించి భీకరంగా ఉద్దేశపూర్వకంగా రివ్యూ బాంబింగ్ జరిగిందనేది నిజం… అదెలా తప్పో మనం కూడా ముచ్చటించుకున్నాం… అక్కడి వరకూ దిల్ రాజు ఆవేదనకు అర్థముంది… దానికి […]
డెమొక్రటిక్ మూవీ… చిప్ కొట్టేసిన వర్మ బుర్రలో మరో దిక్కుమాలిన ఆలోచన…
వర్మ… భ్రష్టుపట్టిపోయిన ఒకప్పటి క్రియేటివ్ డైరెక్టర్… ఈ వ్యాఖ్యకు వివరణలు కూడా అనవసరం… ఐతే ప్రయోగాలు చేయడంలో దిట్ట, కానీ తలతిక్క ప్రయోగాలు… తను తీసిన రాజకీయ చిత్రాలన్నీ పెద్ద బక్వాస్… చాలా చిత్రాలు డిజాస్టర్లు… తనలోని దర్శకుడు ఏనాడో చచ్చిపోయి, యూట్యూబ్ యాంకర్లతో పిచ్చి ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్టుతూ అదోరకం ఆనందం పొందే దిగజారిన స్థాయి తనది… మొన్న జగన్ మీద తీసిన రెండు పార్టుల సినిమాలు మెగా బంపర్ సూపర్ బ్లాక్ […]
నలభై ఏళ్ల నాటి నా నవలకు ముందుమాట రాయమన్నారు పబ్లిషర్లు
Yandamoori Veerendranath …. కొత్త ఎడిషన్ కి ముందుమాట వ్రాయమన్న పబ్లిషర్ కోరికపై 40 సంవత్సరాల తరువాత ‘వెన్నెల్లో ఆడపిల్ల’ మొదటిసారి చదివాను. ఇప్పుడే వ్రాయటం పూర్తీ అయ్యింది. దాన్ని మీతో పంచుకుంటాను: 36 ప్రచురణలు పూర్తయి, లక్ష కాపీలు పైగా అమ్మిన పుస్తకానికి ముందుమాట ఎందుకని కొత్త పాఠకులకు అనుమానం రావచ్చు. దాదాపు నలభై సంవత్సరాల క్రితం టెలిఫోన్ ఎక్స్చేంజీలు ఎలా ఉండేవి? సెల్-అలారం లేని రోజుల్లో ఫోన్లో మనల్ని పొద్దున్నే ఎలా లేపేవారు? పక్క […]
అప్పుడు అంతటి కృష్ణశాస్త్రికీ నోరు పడిపోయింది… మాట పెగల్లేదు…
కృష్ణశాస్త్రి మూగబోయిన వేళ… జాబిలిపై జంపింగ్ నేను! సంతోషాన్నే సిప్పింగ్ నేను!! ఓ చల్లని సాయంత్రం వేళ గోదావరి ఇసుక తిన్నెల మీద పొద్దుగుంకే సూర్యుడు పడి ఇసుక అరుణ వర్ణం పులుముకుంటోంది. నీటి తళతళలు కుంకుమ రాగాలు పాడుకుంటున్నాయి. పొద్దు వాలే వేళ పక్షులు గూళ్లకు మళ్లి…ఆకాశానికి ఆపూటకు వీడ్కోలు చెబుతున్నాయి. పడవల్లో తెరచాపకు చిక్కుకున్న సాయం సూర్యుడు పడవ వెంట తీరానికి వస్తున్నాడు. ఏటి గట్టున పర్ణశాల వెదురు తలుపు తీసి కృష్ణశాస్త్రి బయటికి […]
మంచి సందేశం ఒక్కటే సరిపోదు… అది ప్రేక్షకుల బుర్రల్లోకి ఎక్కించాలి…
Subramanyam Dogiparthi….. మరో ప్రపంచం . ఈ మాట వినగానే మనందరికీ గుర్తుకొచ్చేది శ్రీశ్రీ గారే . ఆయన మహా ప్రస్థానం . బహుశా అక్కినేని , ఆదుర్తి ద్వయానికి శ్రీశ్రీ గారి పదమే స్ఫూర్తి అయిందేమో 1970 లో వచ్చిన ఈ సినిమా తీయటానికి . స్ఫూర్తి ఏదయినా , ఈ ద్వయం ప్రయత్నాన్ని మాత్రం శ్లాఘించాల్సిందే . ఈ ద్వయం సందేశాత్మక చిత్రాలను తీయాలనే అభిలాషతో చక్రవర్తి చిత్ర అనే సంస్థను నెలకొల్పి మొదటి […]
నో పబ్లిక్ ఇష్యూస్… ఒక హత్య కేసు కేంద్రకంగా ఏపీ ఎన్నికలు…
మీడియా అంటే ఇంతే… షీనా బోరా అనే మహిళ హత్య, ఇంద్రాణి ముఖర్జీ పాత్ర అనే అంశాల మీద మన మీడియాలో బహుశా ఓ లక్ష వార్తలు వచ్చి ఉండవచ్చు… (పాపం శమించుగాక, గాంధీ హత్య మీద కూడా ఇన్ని వార్తలు రాలేదేమో…) ప్రాంతీయ భాషా మీడియా పెద్దగా పట్టించుకోలేదు గానీ ఇంగ్లిషు, హిందీ మీడియా హౌజులు షీనా బోరా హత్య అనగానే శివాలెత్తిపోతాయి… ఒక మహిళ హత్య గురించి ఎందుకింత రచ్చ జరిగిందీ అంటే జవాబు […]
కథానాయిక వెయిట్ కాదు… కంటెంట్ వెయిట్ ముఖ్యం… భలే మాలీవుడ్…
ఒక మలయాళ సినిమా… మంచి క్రైమ్ థ్రిల్లర్… రెండేళ్ల క్రితం సినిమా అది, కానీ ఇప్పుడు తెలుగు వెర్షన్ ఈటీవీ విన్లో కనిపించింది… ప్రధాన కథానాయిక అపర్ణ బాలమురళి… సినిమా చూస్తుంటే సినిమాకన్నా మరో అంశం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది… మామూలుగా మన హీరోయిన్లు ఎలా ఉండాలని నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఆశిస్తారు… పోనీ, మన తెలుగు ప్రేక్షకులు..? కలర్, సౌష్టవం, అందం, ప్రత్యేకించి బక్క పలుచగా ఉండాలని చూస్తారు… పెళ్లయి తెర వీడిపోయిన వారిని వదిలేయండి, ఒక […]
82 రోజులు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు ఆ ఐఏఎస్.. చివరకు…
82 రోజులు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడు ఆ సివిల్ సర్వెంట్.. చివరకు సస్పెండయ్యాడు! తన కింద ఉద్యోగస్వామ్యాన్ని బాధ్యతగా నడిపించాల్సిన వాడు.. కానీ, తానే ప్రభుత్వానికి చెప్పాపెట్టకుండా ఏకంగా 82 రోజులు కనిపించకుండా పోయాడు. విధులకు డుమ్మా కొట్టాడు. అతను ఏ సెక్యూరిటీ గార్డో.. లేక, క్లర్క్ పోస్ట్ లో ఉన్నవాడో కాదు.. ఏకంగా తన దగ్గర పనిచేసే వారందరినీ పట్టి నడిపించాల్సిన ఐఏఎస్. అంత రెక్లెస్ అయిన ఆ ఐఏఎస్ ఎవరు..? అభిషేక్ సింగ్.. యూపీ […]
‘జస్ట్, ఏటా కోటి సంపాదిస్తే సరి… ఐనా ఆలోచించి పెళ్లికి వోకే చెబుతాను…’’
ది గౌహతి టైమ్స్… ఫేస్బుక్లో ఓ పోస్టు పెడితే 7800 లైక్స్, 2100 కామెంట్స్, 695 షేర్స్… అంటే ఏ రేంజులో ఈ వార్త మీద డిస్కషన్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు… రకరకాల అభిప్రాయాలు, ఖండనలు, పెదవి విరుపులు, సమర్థనలు, అభినందనలు, ఆల్ ది బెస్టులు ఎట్సెట్రా… అదేమీ పెద్ద వార్త కాదు… ‘‘ఏడాదికి రూ.4 లక్షలు సంపాదించే ముంబైకి చెందిన ఒక కుటుంబం… అందులో ఒక 37 ఏళ్ల మహిళ… కోటి రూపాయలు సంపాదించే వరుడి […]
ఈ క్లాసిక్ తెలుగులో శోభన్, వాణిశ్రీలతో తీశారు గానీ… ప్చ్, వాళ్లకు నప్పలేదు…
Jyothi Valaboju…. ఆరాధన… అమ్మాయి, ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు. పెద్దవాళ్లకు చెప్పకుండా గుడిలో పెళ్లి చేసుకుని ఒకటవుతారు. కాని అనుకోకుండా పైలట్ ఐన ఆ అబ్బాయి యుద్ధంలో మరణిస్తాడు. ఆ అమ్మాయిని అత్తగారింట్లో తమ కోడలిగా అంగీకరించరు. తనకు పుట్టిన బిడ్డను దత్తుకు ఇచ్చి అక్కడే ఆయాగా చేరుతుంది. ఒకానొక పరిస్థితిలో హత్యానేరంపై ఆ అమ్మాయి జైలు పాలవుతుంది. కొన్నేళ్ల తర్వాత జైలు నుండి విడుదలయ్యాక జైలర్ ఇంట్లో ఆయాగా చేరుతుంది. ఆ జైలర్ కూతురు, ఆమె […]
జస్ట్ ఒక్క క్లిక్ దూరం… విల్లు రెడీ… తర్వాత నిశ్చింతగా కన్నుమూయండి…
చివరి కోరిక బిజినెస్! “పాంచభౌతికము దుర్భరమైన కాయం బిదెప్పడో విడుచుట యెఱుకలేదు, శతవర్షములదాఁక మితముఁ జెప్పిరి కాని, నమ్మరాదామాట నెమ్మనమున బాల్యమందో; మంచి ప్రాయమందో, లేక ముదిమియందో, లేక ముసలియందొ, యూరనో, యడవినో, యుదకమధ్యముననో, యెప్పుడో యేవేళ నే క్షణంబొ? మరణమే నిశ్చయము, బుద్ధిమంతుఁడైన దేహ మున్నంతలో మిమ్ముఁ దెలియవలయు, భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!” భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం- పంచభూతాలతో నిర్మితమైన ఈ దేహంలో ప్రాణం ఏ క్షణాన […]
పాలకులు చెప్పిందే చరిత్ర… మార్చేద్దాం మన పొలిటికల్ పాఠాల్ని…
ఏది చరిత్ర..? పాలకస్థానంలో ఉన్నవాడికి నచ్చిందే చరిత్ర… నాటి రాజుల నుంచి నేటి వరకూ అదే కథ… అదే అసలు పాఠం… పాఠ్యపుస్తకాల్లో చేరే చరిత్ర కూడా అంతే..! నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్- ఎన్సీఈఆర్టీ తాజా నిర్ణయాలు, పాఠాల్లో మార్పులు కూడా ఇంతే… ప్రైవేటు స్కూళ్లు, ఆయా రాష్ట్రాల సిలబసులు రకరకాలుగా ఉన్నా సరే, ఎన్సీఈఆర్టీ సిలబస్ స్థూలంగా ఓ గైడ్… చరిత్రను కాషాయీకరిస్తున్నారు, పిల్లల పాఠాల్ని కమలీకరిస్తున్నారు అనే ఆందోళన […]
జెడ్పీటీసీ నుంచి రాజ్యసభ దాకా… అన్ని పదవులూ ఆ కుటుంబసభ్యులకే…
అందరూ బీఆర్ఎస్ను ఆడిపోసుకుంటారు… కేసీయార్, కేటీయార్, కవిత, హరీష్‌రావు, సంతోష్‌రావు… అంతా ఆ కుటుంబమేనా అని… కానీ అయిదుగురే కదా… మొన్నమొన్నటిదాకా కేసీయార్ జిగ్రీ దోస్త్ దేవెగౌడ ఫ్యామిలీని చూడండి… ఏకంగా తొమ్మిది మంది రాజకీయాల్లో యాక్టివ్… లోకసభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి… ఏదైనా వాళ్లకే… మా కుటుంబం, మా పార్టీ, అంతే… ఈ కుటుంబ పెద్ద త్వరలో 90 ఏళ్లు నిండబోయే మాజీ ప్రధాని దేవెగౌడ… సరిగ్గా సంవత్సరం క్రితం మోడీ ఎక్కడో మాట్లాడుతూ… జేడీఎస్ […]
ఆ చీకటి పిశాచ గుహలోకి మనల్నీ తీసుకెళ్లిన ‘మంజుమ్మెల్ బాయ్స్’
కథలో పెద్ద ట్విస్టులేమీ ఉండవు ప్రేక్షకుడిని అబ్బురపరిచేవి… అందరికీ తెలిసిన కథే, తెలిసిన క్లైమాక్సే… స్పాయిలర్ల గొడవ అస్సలు లేదు… ఎప్పుడో 2006లో నిజంగా జరిగిన కథే… సినిమాలో సోకాల్డ్ కమర్షియల్ దుర్వాసనలు కూడా ఏమీ కనిపించవు… వెగటు సీన్లు, వెకిలి పాటలు కూడా వినిపించవు… ఏదో ఒకటీరెండు పెద్దగా కనెక్ట్ కాని పాటలు మాత్రమే… పైగా ఏదో పాత కమల్ హాసన్ సినిమాలోని పాటను అక్కడక్కడా బ్యాక్ గ్రౌండ్‌గా వాడుకున్నారు… తలతిక్క రొమాన్సులు, మన్నూమశానం ఏమీ […]
రాబోయే లోకసభ ఎన్నికలపై చైనా ఎఐ కుట్ర… తప్పుడు ప్రచారాలు చేస్తదట…
కరోనా సమయంలో ఎస్బీఐ రెగ్యులర్‌గా నివేదికలు విడుదల చేసేది… WHO ఇండియా విభాగం అన్నట్టుగా…! ఈ బ్యాంకుకు కరోనాతో సంబంధం ఏమిటనే ప్రశ్నలు తలెత్తినా సరే, మన మీడియా కథనాల్లాగే భయాందోళనల్ని మరింత పెంచేవి ఆ రిపోర్టులు… ఓ వార్త చదివాక ఇదే గుర్తొచ్చింది… మైక్రోసాఫ్ట్ ప్రకటన ఇది… అమెరికా, దక్షిణ కొరియాలతోపాటు ఇండియా జనరల్ ఎలక్షన్స్‌ను ప్రభావితం చేయడానికి చైనా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించే అవకాశమున్నట్టు ఆ ప్రకటన చెబుతోంది… (ఇది కొత్తేమీకాదు, రష్యన్ అధినేత […]
మన దేశ తొలి ప్రధాని ఎవరు…? నెహ్రూ..? నేతాజీ..? మీకు తెలుసా..?
మొత్తానికి నటి, బీజేపీ మండి లోకసభ స్థాన అభ్యర్థి కంగనా రనౌత్‌కు తనకు ఉపయోగపడే వివాదాన్ని ఎలా సృష్టించుకోవాలో బాగానే తెలుసు… బీజేపీ క్యాంపు సహజంగానే పటేల్‌ను, నేతాజీని ఎత్తుకుంటూ, నెహ్రూను డిగ్రేడ్ చేస్తుంటారు కదా… ఈసారి కంగనా ఏం చేసిందంటే..? ఈ దేశ తొలిప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కదా, స్వాతంత్య్రం వచ్చాక ఏమైపోయినట్టు..? అని ఓ ట్వీట్ కొట్టింది… మండీమే క్యా రేట్ చల్ రహా ఆజ్ కల్ అంటూ (మండీలో (అంగట్లో) ఇప్పుడు […]
- « Previous Page
- 1
- …
- 167
- 168
- 169
- 170
- 171
- …
- 450
- Next Page »