స్టార్ తెలుగు సినిమా అనగానే గుర్తొచ్చే సంగీత దర్శకులు డీఎస్పీ, తమన్… కాపీలు కొట్టినా, సొంత ట్యూన్లు కొట్టినా, హిట్లతో అదరగొట్టినా ఆ రెండు పేర్లేనా..? అప్పుడప్పుడూ కీరవాణి… అంతేనా..? మంగళవారం సినిమా చూస్తూ కన్నడ సంగీత దర్శకుడు అజనీష్ భేష్ అనుకుంటున్నప్పుడు ఈ సందేహమే కలిగింది… కాంతారతో సూపర్ హిట్టయిపోయిన ఈ మ్యూజిషియన్కు ఇప్పుడు ఊపిరి సలపనంత పని… చేతిలో దాదాపు ఆరేడు సినిమాలున్నయ్… రెహమాన్‌లు, ఇళయరాజాల్ని ఎప్పుడో దాటేసి, చాలా మైళ్లు ముందుకెళ్లిపోయిన అత్యంత […]
పాయల్ రాజ్‌పుత్… ఆ పాత్ర చేయడమే ఓ సాహసం… అవార్డుకు అర్హురాలు…
పాయల్ రాజ్‌పుత్… ఈ పేరు వినగానే ఆర్ఎక్స్ 100 అనే ఓ చిన్న సినిమాలో ఓ బోల్డ్ కేరక్టర్ వేసిన ఓ నటి గుర్తొస్తుంది… తరువాత ఏవో రెండు మూడు ఐటమ్ సాంగ్స్, పెద్దగా క్లిక్ కాని హీరోయిన్ గుర్తొస్తుంది… కానీ ఆమె తొలి దర్శకుడు అజయ్ భూపతి ఆమెను అలా వదిలేయలేదు… మహాసముద్రం సినిమా సమయంలో హీరోయిన్గా తీసుకోకపోయినా తన సినిమాకు ఆమె టచ్ లేకుండా వదిలేయలేదు… తరువాత మంగళవారం సినిమా… ఆమే ప్రధాన పాత్ర… […]
పిశాచి… ఈమెను అమ్మ అని పిలవొచ్చా..? కంటేనే అమ్మ అంటే ఎలా..?
నిన్ననే కదా… రైలు పట్టాల మీద ఓ తల్లి తన బిడ్డ కోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన సాహసం, ప్రేమ, తెగువ చదివాం, వీడియో చూశాం… అందరమూ చప్పట్లు కొట్టాం… దేవుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని మరోసారి చెప్పుకుని ఆనందపడ్డాం కదా… కానీ కొన్ని పూర్తి వ్యతిరేక మొహాలు ఉంటయ్… ప్రియుల కోసం కన్నబిడ్డలకు విషం పెట్టి కడతేర్చిన తల్లుల కథలు విన్నాం కదా, చదివాం కదా… ఇదీ అలాంటిదే… ఓ తల్లి, కాదు, ఓ […]
ఔనా..? టీవీ9 నక్సలైట్ చానెల్లా ఉండేదా..? ఇప్పుడేమైనా భక్తి చానెలా అది..?!
సీనియర్ పాత్రికేయ మిత్రుడు Nancharaiah Merugumala పోస్టులో కొన్ని అంశాలు మొదట చదవండి… ‘‘సోమవారం కడ్తాల్ మండలం మహేశ్వర మహా పిరమిడ్‌లో జరిగిన పత్రీజీ ధ్యాన మహాయాగం ఉత్సవాల్లో పాల్గొన్న మై హోం గ్రూప్ అధిపతి డాక్టర్ జూపల్లి రామేశ్వర్రావు గారు తెలుగు ప్రజలకు తెలియని ఓ కొత్త విషయం వెల్లడించారు… ‘‘2018లో నేను టేకోవర్ చేసే వరకూ టీవీ 9 చానల్‌ను ఒక నక్సలైట్ వ్యవస్థలా నడిపారు. భారత సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాలంటే ఏ మాత్రం గౌరవం లేకుండా […]
సలార్ ప్రభాస్‌తో మళ్లీ బాలీవుడ్ మాఫియా కొత్త ఆటలు… తొక్కగలదా..?!
షారూక్ ఖాన్ డన్కీ సినిమా రిలీజ్ మొదట్లో ప్రభాస్ ఆర్ సౌత్ మీద కుట్రపన్ని భంగపడిన బాలీవుడ్ మాఫియా మళ్లీ స్టార్ట్ చేసింది… ఆల్ ఆఫ్ సడెన్ చెప్పాపెట్టకుండా మల్టీప్లెక్సుల్లో డన్కీ షోలు స్టార్టయ్యాయి… అసలు డన్కీకి పట్టించుకున్నవాడే లేడు, చూసేవాడు లేడు, అడ్డగోలు ఫ్లాప్… ఆ కోపం అంతా ప్రభాస్ సలార్ మీద చూపిస్తున్నది ఆ మాఫియా… దానికి కారణముంది… బాహుబలి తరువాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ అన్నీ ఫ్లాపులే… దాంతో ప్రభాస్ పనైపోయింది అనుకుని […]
ఓ పాజిటివ్ మర్యాదపూర్వక భేటికి కూడా వక్రబాష్యాలు, శోకగీతాలు…
కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు… తోడుగా ఉపముఖ్యమంత్రి… కొలువు దీరిన కొత్త మంత్రివర్గం… ఇక్కడ ఏ పార్టీ అనేది పక్కన బెడితే… కేంద్రం- రాష్ట్రం అనే కోణంలో చూడాలి కొన్ని భేటీలను..! తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనిదే… తెలంగాణ ప్రజలకు కూడా మోడీ ప్రధానమంత్రే… ఈ సోయి లోపించింది నమస్తే తెలంగాణకు… ఇదుగో ఇలాంటి రాసీ రాసీ బీఆర్ఎస్ మీద వ్యతిరేకతను పెంచింది… ఇంకా మారడం లేదు… ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి భేటీకి వక్రబాష్యాలు దేనికి..? ఏదో […]
కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీలు… నిజస్పూర్తికి విరుద్ధంగా ప్రస్తుత కార్యాచరణ…
ఆరు గ్యారంటీలకు రేషన్ కార్డుతో లంకె…. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ తీసుకురాకపోగా, అపఖ్యాతినీ, ప్రజల్లో ఆగ్రహాన్ని తీసుకొచ్చే అవకాశాలున్నయ్… ఎప్పుడెప్పుడు మీద పడదామా అని మొదటి రోజు నుంచే కాచుక్కూర్చున్న బీఆర్ఎస్కు చేజేతులా అవకాశాల్ని ఇస్తాయ్… ఆ సిక్స్ గ్యారంటీల ట్రూస్పిరిట్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది… నాలుగు రోజులు ఆలస్యమైనా సరే పకడ్బందీ ఆచరణకు పూనుకుంటేనే బీఆర్ఎస్కు మళ్లీ ఏ స్కోపూ లేకుండా ఉంటుంది… నిజానికి రేషన్ కార్డు ప్రస్తుతం చౌక బియ్యానికి మాత్రమే […]
‘‘హోస్ట్‌గా నాగార్జున వేస్ట్..’’ ఘాటు వ్యాఖ్యలతో ఓ తింగరి పిల్ల తెంపరితనం…
ఆ షో ముగిశాక కూడా వార్తల్లో ఉంటోంది రకరకాల కారణాలతో… బాగా నెగెటివిటీని మూటగట్టుకున్న రన్నరప్ అమర్దీప్ ఏమైపోయాడు..? జాడలేడు, పత్తాలేడు… ఒక వార్త… ప్రియాంక జైన్ పెళ్లి త్వరలో, ఆ ప్రియుడితోనే… ఇంకో వార్త… అంబటి అర్జున్ ట్రాన్స్‌జెండర్ పాత్ర పోషిస్తున్నాడు… మరో వార్త… 250 కోట్లతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నానని పాత బిగ్‌బాస్ విన్నర్ కౌశల్ ప్రకటన… మరొక వార్త… నన్ను డీఫేమ్ చేసి, కుట్రలు పన్నిన యూట్యూబర్ల అంతుచూస్తానని పల్లవిప్రశాంత్ భీషణ […]
మీదుంపతెగ… సూపర్ సింగర్ షో అంటే… శ్రీదేవి డ్రామా కంపెనీ షో అనుకున్నార్రా..?!
పాత ఈటీవీ షోలు తిరగేస్తుంటే… ఓచోట రష్మి వర్షిణిని అంటుంది… శని, ఆదివారాల్లో సుధీర్‌తో నువ్వు పబ్బులెంబడి తిరుగుతవ్, నేనెందుకు ప్రపోజ్ చేయాలి తనకు… ఫన్ క్రియేటైనా సరే వర్షిణి, సుధీర్ పబ్బులకు కలిసి తిరుగుతారు అని ఎక్స్పోజైంది… మరో సందర్భంలో ఇదే వర్షిణి ఇదే రష్మిని పట్టుకుని, ఏమో మసాజ్ మీరెలా చేసుకుంటారో నాకెలా తెలుసు అంటుంది… హహ… సుధీర్, రష్మి సాన్నిహిత్యాన్ని ఎక్స్పోజ్ చేసింది… స్టార్ మాలో ప్రారంభమైన సూపర్ సింగర్ షో మెగా […]
నాటి ఆ అల్లర్లు హైదరాబాద్ జర్నలిస్టులకు అస్సలు అర్థమయ్యేవి కావు…
Nancharaiah Merugumala….. వంగవీటి రంగా హత్యానంతరం జరిగిన బెజవాడ అల్లర్లు అప్పట్లో కొందరు హైదరాబాద్ తెలుగు జర్నలిస్టులకు ‘పోస్టుమాడ్రన్ హింస’గా కనిపించాయి! ……………………………………………….. బెజవాడ నుంచి, కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చేసి పాతికేళ్ళు దాటిపోయినా 1988 డిసెంబర్ 26 నాటి ‘రంగా గారి యాజిటేషన్’ మాలాంటి ఆంధ్రోళ్లను ఇంకా వెంటాడుతూనే ఉంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని కాటూరులో పుట్టాడని చెప్పే వంగవీటి మోహనరంగారావు గారిని తెలుగు జనం మర్చిపోకుండా గత కొన్నేళ్లుగా యూట్యూబ్ చానళ్లు […]
సీటుకు నాలుగు శాంపిళ్లు… 90 కోట్ల మంది అభిప్రాయాన్ని చెప్పాయా..?!
సరే, ఏబీపీ-సీవోటర్ సర్వే చేసింది… ఎగ్జిట్ పోల్సే ఫ్లాపవుతున్నయ్, ఒక ఒపీనియన్ పోల్స్ నమ్మేదెలా అంటారా..? నిజమే… జస్ట్, ఒక మూడ్ చెప్పగలవేమో గానీ, అది సరైన శాస్త్రీయ ఫలితాన్ని సూచిస్తుందని ఎవరూ చెప్పలేరు… మరీ ప్రత్యేకంగా ఈ సంస్థ సాగించిన సర్వే పూర్తిగా నమ్మబుల్ కాదు… బీజేపీ కూటమికి 295 నుంచి 335 సీట్లు… అంటే మినిమమ్ మ్యాగ్జిమమ్ నడుమ ఏకంగా 40 సీట్ల తేడా… ఇండి కూటమికి 165 నుంచి 205… సేమ్ లివరేజ్… […]
ఈ వెగటు పాటపై సజ్జనార్ సీరియస్ స్పందన ఉంటుందేమో అనిపించింది…
ఎందుకలా అనిపించిందో తెలియదు కానీ… అనిపించింది…! ఆమధ్య నితిన్ హీరోగా నటించిన ఎక్సట్రా ఆర్డినరీ మ్యాన్ ఓ చెత్తా సినిమా వచ్చింది కదా… ఫాఫం, హీరో ఇంకా నటన బేసిక్స్ దగ్గరే ఆగిపోయాడు… విలన్ కూడా సేమ్ సేమ్… డబుల్ ఫాఫం, శ్రీదేవి ఎందుకు అంగీకరించిందో ఈ సినిమా, తనూ చెడ్డ పేరు మూటగట్టుకుంది… ప్రేక్షకులు కూడా ఛీత్కరించారు… అడ్డగోలు ఫ్లాప్… నితిన్ మొహం మాడిపోయింది… అయితే..? అందులో ఓ పాట ఉంది… నా పెట్టే తాళం… […]
ఎడ్లకు పిండప్రదానం, పెద్ద కర్మ, అస్థికల నిమజ్జనం… అదీ రైతుతో బంధం…
కని పెంచిన తల్లిదండ్రులను కాటికి పంపించిన కొడుకుల్ని, బిడ్డల్ని చూశాం… ఎక్కడికో తీసుకెళ్లి, కాటకలిపి అగాధం చేసిన పిల్లన్నీ చూశాం… నిర్బంధంగా ఓల్డేజీ హోమ్స్ పాలుచేసిన వాళ్లను, బయటికి నెట్టేసి తలుపులు మూసుకున్నవాళ్లను, సజీవంగా స్మశానాల్లో పారేసివచ్చినవాళ్లను కూడా చూశాం… కలికాలం… కాలమహిమ అనుకుంటున్నాం… కానీ అదే సమయంలో… పెంపుడు జంతువులకు సొంత పిల్లలుగా ప్రేమించేవాళ్లనూ చూశాం, ఆస్తులు రాసిచ్చి వైభోగంగా బతికే ఏర్పాట్లు చేసినవాళ్లనూ చూశాం… ప్రస్తుత వార్త విషయానికొస్తే… సాధారణంగా వ్యవసాయం పనుల్లో తోడ్పడే […]
బిగ్‌బాస్‌పై నజర్… బట్, పోలీసులు తప్పులో కాలేశారా..? ఎందుకంటే..?
ఎస్… పల్లవి ప్రశాంత్ అనబడే ఓ కేరక్టర్ మూర్ఖత్వం, ఓవరాక్షన్ ప్లస్ తనకు మద్దతుగా నిలిచిన శివాజీ, యావర్, భోలే వంటి సపోర్టింగ్ కేరక్టర్ల వల్ల బిగ్‌బాస్ ఓ శాంతిభద్రతల అంశంగా కనిపిస్తోంది ఇప్పుడు… ఇప్పటికే అనేక విమర్శలు వినిపించే ఈ టీవీషో మీద ఇప్పుడు మరింత నెగెటివిటీ పెరిగింది… ఎవరెవరినో తీసుకొచ్చి కృత్రిమ కోరలు, కొమ్ములు తొడిగి సమాజం మీదకు వదులుతున్నారనేది తాజా విమర్శ… నిజానికి ఇది ఒక టీవీ షో… అనేకానేక టీవీషోల్లాగే ఇదీ […]
ఆ ముగ్గురూ ఇక్కడి నుంచే పోటీ చేస్తే..? మరో కామారెడ్డి, మరో గజ్వెల్…!!
మొన్న కామారెడ్డిలో ఏం జరిగింది..? ఇద్దరు సీఎం అభ్యర్థులు తలపడ్డారు… గజ్వెల్లో ఏం జరిగింది..? ఇద్దరు సీఎం అభ్యర్థులు తలపడ్డారు… ఒక సీఎం అభ్యర్థి కేసీయార్ ఒకచోట మాత్రమే గెలిచాడు, కానీ సీఎం కాలేకపోయాడు… ఒక సీఎం అభ్యర్థి గెలవకపోయినా సరే సీఎం అయిపోయాడు… కానీ భలే పోటీ జరిగింది… పెద్ద నాయకులు కదా, చాలా చాలా ప్రాధాన్యాంశాలు చర్చకు వచ్చాయి, గుడ్… ఇక లోకసభ పోటీలకు వద్దాం… మొదట సోనియాను తెలంగాణలో పోటీచేయాలని కోరుతూ ఓ […]
‘పాదాల మీద నడిచే ఈ రాజన్నబిడ్డ’ పయనం ఆ పచ్చ క్యాంపు వైపేనా..?
ఒక పుల్ల అటు నుంచి ఇటు కదిలితే… రాజకీయాల్లో దానికీ ఓ అర్థముంటుంది… కారణం లేకుండా కదలదు… ఇదీ చాలామంది నమ్మేదే, జరిగేదే, నిజమే…. సరే, ఈ సూత్రంతో ఆలోచిస్తే వైఎస్ షర్మిల లోకేష్ కుటుంబానికి క్రిస్టమస్ శుభాకాంక్షలు, కానుకలు ఎందుకు పంపించినట్టు..? అతను ఆనందపడిపోయి వేంఠనే ధన్యవాదాలు చెప్పడమేమిటి..? అసలు మర్మమేమిటి..? కొన్ని సైట్లయితే చాలాదూరం వెళ్లిపోయి… ఇంకేముంది..? షర్మిల టీడీపీలో జాయిన్ కాబోతోందా అని రాసిపారేశాయి… లోకసభకు పోటీచేస్తుందా…? ఎక్కడి నుంచి పోటీచేసే చాన్సుంది..? […]
అప్పుడు మరో విజయశాంతి… ఇప్పుడు మరో శివగామి… భలే నటి…
21 ఏళ్ల సినీ ప్రయాణం… కానీ 14 సినిమాలు మాత్రమే… 2005లో ఏదో పోలీస్ అధికారి పాత్ర వేసింది, అందరూ మరో విజయశాంతి అన్నారు… ఇప్పుడు సలార్‌లో లేడీ విలన్ పాత్ర… అందరూ ఇప్పుడు మరో రమ్యకృష్ణ, శివగామి అంటున్నారు… సలార్ అనగానే ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్విరాజ్‌కు ఎంత పేరొచ్చిందో ఆమెకూ అంతే పేరొచ్చింది… ష్, హీరోయిన్ శృతిహాసన్కన్నా… నిజంగా ఓ ఇంట్రస్టింగ్ ప్రయాణం ఆమెది… పేరు శ్రియారెడ్డి… వయస్సు 41 ఏళ్లు… భరత్ రెడ్డి […]
చెన్నై వదిలేసి, పిల్లల్ని తీసుకుని ముంబైకి జ్యోతిక… ఏం జరుగుతోంది..?!
సెలబ్రిటీల వివాహాల్లో చాలా బ్రేకప్పులు చూస్తుంటాం… సొసైటీలోనే విడాకుల శాతం బాగా పెరుగుతున్నా సరే, సెలబ్రిటీల కథలే బహుళ ప్రచారంలోకి వస్తుంటాయి… వ్యక్తిగత అహం, రాజీపడకపోవడం, పాత చరిత్రలు, అత్తింట్లో ఇమడలేకపోవడం, మానసిక హింస… కారణాలు బోలెడు కావచ్చుగాక… 15, 20 ఏళ్లు కాదు, 25, 30 ఏళ్ల వివాహ బంధాల్ని కూడా వదిలేస్తున్నారు… కాకపోతే సెలబ్రిటీ కపుల్స్‌పై అకారణంగా గాసిప్స్ కూడా పుట్టుకొస్తుంటాయి… కొన్నాళ్లకు అవి నిజం కావచ్చు లేదా చర్చల నుంచి సమసిపోవచ్చు… చిరంజీవి […]
మరీ మిడిసిపాటు అక్కర్లేదు… మనమే తోపులం కాదు… బాలీవుడ్ తక్కువది కాదు…
రాబోయే అయిదు తెలుగు సినిమాలు ఇండియన్ సినిమా దశను, దిశను తిప్పేస్తాయ్ సార్… అవి దేవర, పుష్ప-2, కల్కి అని ఓ జాబితాను చదివాడు ఓ మిత్రుడు… వంగా సందీప్, ప్రశాంత్ నీల్, రాజమౌళి, సుకుమార్, మణిరత్నం వంటి మన దర్శకులు బాలీవుడ్ దర్శకులకు కొత్త పాఠాలు నేర్పిస్తున్నారు అని తేల్చిపడేశాడు… ఆ సినిమాలే కాదు… నిజానికి రాంచరణ్-శంకర్ సినిమా… భారతీయుడు-2.., మహేశ్- రాజమౌళి, ఎన్టీయార్- ప్రశాంత్ నీల్ సినిమాలతోపాటు కాంతార-2 వంటి సినిమాలు కూడా పాన్ […]
అసెంబ్లీకి వోటర్లు వద్దన్నారు… ఏమో, పార్లమెంటుకు పంపిస్తారేమో…
ఓసోస్… మమ్మల్ని అసెంబ్లీకి వద్దన్నారు… పార్లమెంటుకే వెళ్లమంటారు… గత ఎన్నికల్లో చూడలేదా అంటున్నారుట కొందరు నాయకులు… నిజమే, అంబర్‌పేటలో ఓడిపోతే ఒక కిషనుడు సికింద్రాబాదులో గెలిచి ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయాడు… కరీంనగర్లో ఓడిపోతేనేం, అక్కడే ఎంపీగా గెలిచాడు బండి సంజయుడు… అంతెందుకు..? మన ముఖ్యమంత్రి కొడంగల్‌లో ఓడిపోతేనేం, మల్కాజిగిరి నాదే అన్నాడు, గెలిచాడు… సో, అసెంబ్లీ ఎన్నికల్లో వద్దు అన్నారంటే వోటర్లు పార్లమెంటుకు పంపించవచ్చు… ఇప్పుడిక బీజేపీలో నలుగురైదుగురు ఎంపీ సీట్లలో పోటీకి రెడీ అట… […]
- « Previous Page
- 1
- …
- 177
- 178
- 179
- 180
- 181
- …
- 482
- Next Page »