Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హీరోయిన్ శ్రీదేవిపై హీరో చిరంజీవి రెండో లైంగిక దాడి ఇది…

February 3, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……… శ్రీదేవిని చిరంజీవి మానభంగం చేసిన రెండో సినిమా 1981 ఆగస్టులో వచ్చిన ఈ రాణీకాసుల రంగమ్మ . జులాయిగా , స్త్రీలోలుడిగా , డబ్బు చేసినవాడిగా నెగటివ్ పాత్రలో నటించిన ఆఖరి సినిమా కూడా ఇదేనేమో ! అయితే ఈ సినిమాలో పరివర్తన చెంది రంగమ్మను పెళ్లి చేసుకుంటాడు ముగింపులో .

సినిమా బాగుంటుంది . కమర్షియల్గా కూడా సక్సెస్ అయింది . తాతినేని ప్రకాశరావు నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు ఆయన కుమారుడు తాతినేని ప్రసాదే . కధ , స్క్రీన్ ప్లే కూడా అతనే సమకూర్చుకున్నాడు . అన్నీ బిర్రుగానే ఉంటాయి .

Ads

ఈ సినిమాలో శ్రీదేవే షీరో . ఫైటింగులు కూడా చేసింది . మెడలో రాణికాసులు ఉంటే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది . రేలంగి జేబులో బొమ్మ లాగా . ఫస్ట్ హాఫులో కూరగాయలు అమ్ముకునే పల్లెటూరు యువతిలాగా , సెకండ్ హాఫులో పట్టణంలో ఉద్యోగం చేసే యువతిగా రెండు పాత్రల్లోనూ చాలా బాగా నటించింది . క్లైమాక్సులో ఇంకా బాగా నటించింది .

సినిమా విజయానికి చక్రవర్తి సంగీతం కూడా దోహదపడింది . వేటూరి , దాసం గోపాలకృష్ణ సాహిత్యం తోడయింది . తూరుపునా సాగింది తుమ్మెదల వేట పాట సినిమాకు ఐకానిక్ సాంగ్ . సుశీలమ్మ చాలా శ్రావ్యంగా పాడింది .

అందంగా ఉన్నావు గోవిందా రామ డ్యూయెట్లో చిరంజీవి , శ్రీదేవి పోటాపోటీగా డాన్స్ చేస్తారు . ఈ సినిమాలో రవికల పండుగ అని ఒక పాటను పల్లెటూరి యువతీయువకుల బృంద నృత్యం ఒకటి పెట్టారు . చాలా బాగుంటుంది . బాగా చిత్రీకరించారు కూడా .

ఏరెత్తుకెళ్ళింది రెయిక ఎవరెత్తుకుంటాడో రెయిక పాట . సినిమాలో ఎన్నాళ్ళకు వచ్చింది మళ్ళా రవికల పండుగ అని అంటారు పూజారి . దర్శకుడికి ఆ రవికల పండుగ ఎందుకు గుర్తుకొచ్చిందో ! ఎప్పుడో బహుశా ఓ వందేళ్ళ కింద ఉండేదేమో ! ఈ పండుగలో నుండే వచ్చింది ఓ ముతక సామెత . పండుగ నాడు కూడా పాత మొగుడేనా అని .

సినిమాలో మరో హుషారయిన డాన్స్ పాట జయమాలినిల మీద . లింగూ లిటుకు లింగూ లిటుకు అంటూ ఇద్దరు జయమాలినిల మీద ఉంటుంది . జయమాలినిలు చాలా బాగా డాన్సించారు . నూతన్ ప్రసాద్ , శ్రీదేవిల మీద మది లోన మంగమ్మ పాటలో ఇద్దరూ చాలా బాగా డాన్సించారు . వెరశి పాటలన్నీ బాగా చిత్రీకరించబడ్డాయి .

చిరంజీవి , శ్రీదేవిలతో పాటు జగ్గయ్య , రాళ్ళపల్లి , నూతన్ ప్రసాద్ , అల్లు రామలింగయ్య , సారధి , పుష్పకుమారి , ఝాన్సీ , కృష్ణవేణి ప్రభృతులు నటించారు . అల్లు రామలింగయ్యది శునకానందం పాత్ర . డబ్బులు ఇచ్చల్లా అవతలోడి శృంగారం వింటూ ఉండే శునకానందం పాత్ర . కాస్త ఎబ్బెట్టుగానే ఉంటుంది . నిజ జీవితంలో ఇలాంటోళ్ళు ఉన్నా సినిమాలో ఎక్కడ చూసి చస్తాం !

మొత్తం మీద గట్టి డ్రామా ఉన్న మ్యూజికల్ సినిమాయే . ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక వాచ్ లిస్టులో పెట్టేసుకోవచ్చు . ముఖ్యంగా చిరంజీవి , శ్రీదేవి అభిమానులు . An entertaining , feel good movie .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • RIP… చీకట్లు తొలగి… రామోజీ ఆత్మ నిజంగా శాంతించుగాక!
  • జై గురువాయూరప్ప ! పదేళ్ల తరువాత ‘ఖండాంతర పెళ్లి’ జరిపించాడు !!
  • ఒకే హిందీ గీతం – తెలుగులోకి రెండు విధాలుగా – రాసింది ఒక్కడే !!
  • వేలాది అమాయక సిక్కుల ఊచకోత – ఆ దుర్జనుడు మరణించెను !
  • కంగనా – రాందేవ్ !… యవ్వనాలు, బెడ్‌రూంల దాకా లొల్లి !!
  • అనుబంధాల పలకరింపు కోసం ఓ ముసలి మనసు తన్లాట… అంతే…
  • తప్పు పైలట్లలో లేదు – బోయింగ్ విమానాల్లోనే లోపాలు- ప్రమాదాలు !!
  • ఆర్మీ జవాన్లు జెన్-జీ కాదా? ఈ పిల్లది మరీ ముదురు పైత్యం !!
  • అమిత్ షా కూర్చునే భంగిమ ! ఇలా చాలా ఈక్వేషన్లను పట్టిస్తుంది…!!
  • తెలంగాణ కాంగ్రెస్‌లో హరా‘కిరికిరి’ బ్యాచ్ ! సోయి లేని హైకమాండ్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions