ఎవరెంత తిట్టుకున్నా సరే… టీవీ9 అంటే ప్రయోగం… అది పలుసార్లు వికటించి నవ్వులపాలు కావచ్చుగాక… కానీ ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనాన్ని ప్రయత్నిస్తుంది… ఈమధ్య ఇంగ్లిషు, ఒడిశా భాషల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో రూపొందించిన డిజిటల్ యాంకర్‌ను తెరపైకి తీసుకువస్తే సూట్లు, యూట్యూబర్లు, మెయిన్ స్ట్రీమ్ టీవీలు సైతం ఆ వార్తను ఊదరగొట్టాయి… సేమ్, దాన్ని టీవీ9 కూడా తెలుగులో తీసుకువద్దామని అనుకుంది… కానీ..? బిగ్‌టీవీ అనే ఓ చిన్న చానెల్ వాళ్లకన్నా ముందే ఏఐ యాంకర్‌ను తీసుకొచ్చేసింది… […]
అస్సాం కొండల్లోంచి గుండెల్లోకి జాలువారిన సంగీత జలపాతం…
Artist Mohan’s love letter to Begum Parveen sultana… ఈ అస్సాం హంసధ్వని పేరు బేగం పర్వీన్ సుల్తానా. పటియాలా ఘరానా క్వీన్ పద్మభూషణ్ పర్వీన్ పుట్టినరోజు నేడు. అస్సాం కొండల్లోంచి గుండెల్లోకి జాలువారే ఈ హిందూస్తానీ సంగీత జలపాతానికి జన్మదిన శుభాకాంక్షలు. 1980లో విడుదలైన ఖుద్రత్ సినిమాలో “ హమేతుమ్ సే ప్యార్ కితనా” పాట గుర్తుందా? ఈ దేశాన్ని అంతటినీ ఒక ప్రేమ పూలతోటగా మార్చిన ఆ పాట పర్వీన్ పాడిందే! 33 […]
ప్రేమంటే..? పెళ్లంటే..? ఈమె బాష్యం వేరు, ఆచరణ వేరు…! నమ్మలేము…!!
ప్రేమ అంటే..? ఈ పదాన్ని సరిగ్గా, సమగ్రంగా నిర్వచించినవాడు ఈ ప్రపంచంలో పుట్టలేదు… పుట్టబోడు..! ఇప్పుడు అకస్మాత్తుగా ఇండియన్ మీడియాలో ఒక లవ్ స్టోరీ వైరల్ అవుతోంది… దానికీ ఓ నేపథ్యం ఉంది… షేర్ షా అని ఓ హిందీ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలైంది… సిద్ధార్థ మల్హోత్రా హీరో, కియరా అద్వానీ హీరోయిన్… 1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఓ ఆర్మీ కెప్టెన్ బయోపిక్ ఇది… ఆ కథానాయకుడి పేరు విక్రమ్ బాత్రా… ఈ […]
తానాకు కొత్త కార్యవర్గం… ఎన్నికలు లేకుండా రాజీమార్గంలో ఎంపికలు…
తానా ఎన్నికలకు సంబంధించి ఫేస్బుక్లో Chennuri V Subba Row… పోస్ట్ ఆసక్తికరంగా ఉంది… అందులో ఆశ్చర్యపరిచిన వాక్యం ఏమిటంటే… మొన్నటిదాకా 36 వేల మంది సభ్యులున్న తానాలో ఇప్పుడు 70 వేల మంది ఉన్నారనేది… సరే, ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్గనైజేషన్ అని ఆ పోస్టులో రాయబడిన వాక్యం నిజమో కాదో తెలియదు గానీ తానా అంటే తానాయే… అమెరికాలో కులాల వారీ, ప్రాంతాల వారీ వేర్వేరు సంఘాలు పెట్టుకున్నారు… వాటినీ తేలికగా తీసిపారేయలేం గానీ తానా ఇంపార్టెన్స్‌ను […]
ఆ ఎడిటర్ ఇంట్లో పెళ్లి… అచ్చం టీడీపీ మినీ మహానాడే…
ఓ సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గున్న ఏనుగులా ఉన్న పిల్లాడిని చూసి వీడెవడో మినీ మహానాడులా ఉన్నాడంటాడు . రిపోర్టర్ గా ఎన్నో మహానాడులు , మినీ మహానాడులు కవర్ చేసిన నాకు ఈ డైలాగ్ చాలా బాగా నచ్చింది . ఎన్ని సార్లు విన్నా నవ్వు వస్తుంది . మహా అంటే భారీ . మినీ అంటే చిన్నది . మినీ మహానాడు ఏంటో ? చిన్న పెద్ద నాడు అన్నట్టు . ఆంధ్రభూమిలో ఎడిటర్ […]
టైంపాస్ పల్లీస్వామ్యం… వోటు విలువ- ప్రతినిధి విలువ… అంతా ఓ భ్రమ
Jumping Japang: బాంబే చౌపట్టి బీచ్ ఒడ్డున సంధ్యా సమయం ఆహ్లాదకరంగా ఉంది. రోజంతా ఎంత గింజుకున్నా… కలవారి ఆకాశ హర్మ్యాలు దాటి…లేని వారి పూరి గుడిసెల మీద పడలేకపోయానే! అన్న దిగులుతో సూర్యుడు పడమటి అరేబియా సముద్రంలోకి దిగిపోతున్నాడు. వడా పావ్ లు తినాలన్న ఉబలాటం కొద్దీ అలలు చెలియలి కట్ట దాటి రావడానికి ఎగురుతూ…రాలేక వెనక్కు వెళుతున్నాయి. చౌపట్టి తీరంలో సిమెంటు దిమ్మెల మీద పల్లీలమ్ముకునే వారు మహారాష్ట్ర రాజకీయాల గురించి మరాఠీలో విసుగు విరామం లేకుండా మాట్లాడుకుంటున్నారు. […]
జర్నలిస్టు ఫోన్ సీజ్ చేయడానికి వీల్లేదు: కేరళ హైకోర్టు
ఓ కేసుకు సంబంధించి విచారణ పేరుతో ఓ జర్నలిస్టు ఫోన్‌ను పోలీసులు సీజ్ చేయడాన్ని కేరళ హైకోర్టు తప్పుపట్టింది. చట్టం నిర్దేశించిన నిబంధనలు అనుసరించకుండా జర్నలిస్టు ఫోన్‌ను సీజ్ చేయడానికి వీల్లేదని పేర్కొంది. జర్నలిస్టులు ప్రజాస్వామ్యంలో ‘నాలుగో స్తంభం’లో భాగమని.. ఏదైనా కేసులో వారి ఫోన్ అవసరమని భావిస్తే, సీఆర్పీసీ నిబంధనలను అనుసరించాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అసలేం జరిగిందంటే..? కేరళకు చెందిన షాజన్ స్కారియా అనే వ్యక్తి.. ఓ యూట్యూబ్ న్యూస్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు. […]
తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది… ఓ దేశదిమ్మరి కథ ఇది…
తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది… It is a cart if it travels, else it is but timber… The scholar gypsy M.Adinarayana ——————————————————– ఈ దేశం గర్వించదగ్గ పెయింటర్ ఎం.ఎఫ్.హుస్సేన్, చెప్పుల్లేకుండా తిరిగేవాడు. ‘‘ఆయనివి ప్రపంచ ప్రఖ్యాత పాదాలు’’ అని ఆర్టిస్టు మోహన్ ఒక వ్యాసంలో రాశాడు. ఆ మాట ఆదినారాయణ గారికీ వర్తిస్తుంది. ఈ దేశ దిమ్మరికి ప్రయాణమే ప్రాణ వాయువు. సంచారమే ఎంతో బాగున్నది…. దీనంత ఆనందమేడున్నది… అని […]
సీఎం సీతక్క… ఈ మాట రాహుల్ గాంధీతో ముందుగానే ప్రకటింపజేస్తే..?
‘‘అవసరమైతే’’…. ఈ పదం రాజకీయాల్లో దుర్మార్గమైనది… ఆ అవసరాన్ని ఎవరు నిర్దేశించాలి..? తప్పించుకోవడానికి అత్యంత అనువైన పదం ఇది… ఎటంటే అటు మార్చుకోగల ఫ్లెక్సిబులిటీ ఉన్న పదం… అమెరికా దాకా వెళ్లిన రేవంతుడు ఏమన్నాడు..? ‘అవసరమైతే’ సీతక్కను సీఎం చేస్తాం అన్నాడు… అంటే సీఎం అభ్యర్థిగా సీతక్కను చెప్పడం లేదు తను… (సీతక్క అసలు పేరు ధనసరి అనసూయ, సీతక్క అనేది నక్సల్స్ దళంలో ఉన్నప్పుడు పెట్టిన విప్లవనామం… ఉనికి బయటపడకుండా ఉండేందుకు నక్సలైట్లు అసలు పేర్లకన్నా […]
ఒక్క క్షణం… బతుకు ఉరికి వేలాడేదే… ఒక ఆలోచన మదిలో పురుడు పోసుకుంది…
పోటీ పరీక్షల్లో ఎలా చదివారు..,? సివిల్స్ ఎలా బ్రేక్ చేశారు..? ఏ బ్యాచ్, ఏ ర్యాంక్, ఎన్ని మార్కులు, ఏ సబ్జెక్టు, ఎన్నిసార్లు దండయాత్ర, రోజుకు ఎన్ని గంటలు చదివారు..? మంచి ర్యాంకులు సంపాదించిన సివిల్స్ క్రాకర్స్ సక్సెస్ స్టోరీలు బోలెడు చదువుతుంటాం… వాటిల్లో కొన్ని మాత్రమే పేద, గ్రామీణ, అణగారిన సామాజికవర్గాల నేపథ్యం నుంచి వచ్చిన కథలుంటాయి… అవి స్పూర్తిదాయకమే… రీసెంటుగా సోషల్ మీడియాలో మరో భిన్నమైన సక్సెస్ స్టోరీ కనిపిస్తోంది… సరే, సోషల్ మీడియాలో […]
హేమిటీ… వాళ్లింట్లో టమాట పప్పు, టమాట రసం, టమాట పచ్చడి, టమాట రైస్..?!
‘IT-Tamota’: అది బ్రాహ్మీ ముహూర్తం. ఆ ఇంట్లో ఎవరూ నిద్ర లేవలేదు. దిగువ మధ్య తరగతి ఇళ్లున్న కాలనీ కాబట్టి బైకులు, ఆటోలు తప్ప కార్లు కూడా లోపలికి రాలేవు. ఒకవేళ వచ్చినా ఒక కారుకు ఎదురుగా ఇంకో కారు వస్తే…ఎవరో ఒకరు వెనక్కు వెళ్లాల్సిందే. అలాంటి ఏరియాలో సాయుధ పోలీసులతో అధికార నిఘా విభాగం బృందాలు మెరుపు దాడి చేశాయి. ఆ ఇంటి తలుపు తట్టాయి. తెల్లవారక ముందే ఏ పాల బిల్లు కోసమో ఎవరో తలుపు తడుతున్నారనుకుని […]
ఈ మూడు పాటల్లో ఏదో ఉంది… షార్ట్స్, రీల్స్ చేస్తూ లేడీస్ ఫుల్ ఎంజాయ్…
ఇప్పుడు ట్రెండ్ తెలంగాణ పాట… అది సినిమాల్లోనైనా, టీవీల్లోనైనా, యూట్యూబులోనైనా… మళ్లీ మళ్లీ చెప్పుకోనక్కర్లేదు… ఐతే మొన్నమొన్నటిదాకా చమ్కీల అంగిలేసి, ఉరుముల రమ్మంటినా పాటలతో పాటు దసరాలో కీర్తి సురేష్ బ్యాండ్ డాన్స్ పాపులర్… షార్ట్స్, రీల్స్‌లో ఫుల్ హడావుడి అవే… ఫంక్షన్లలోనూ అవే… చిన్న పిల్లల దగ్గర్నుంచి ఓ వయస్సొచ్చిన మహిళల దాకా అవే గెంతులు… ఒక పాట పాపులారిటీని లెక్కించడానికి కొత్త కొలమానం షార్ట్స్, రీల్స్… ఎక్కువ ఏ పాట ట్రెండ్ అవుతుంటే అది […]
తన పేరు ముక్తవరం పార్థసారథి… తెలుగు సాహిత్యానికి దొరికిన నిధి…
ఆయన పేరు ముక్తవరం పార్థసారథి… Loneliness of a long distance runner ———————————————————– గుడిపాటి వెంకట చలం, వరవరరావుకి రాసిన ఒక ఉత్తరంలో “హైదరాబాదులో కోటీకి దగ్గరే ఎక్కడో పార్థసారథి గారిని ఒకాయన ఉంటారు. కష్టాల్లో ఉన్నాడు. వీలైతే వెళ్లి కలవండి” అని కోరారు. చలం మాట కదా.. వెతుక్కుంటూ వెళ్లిన వరవరరావు, పార్థసారధిని కలిశారు. అది 1961లో. నిన్నటికి సరిగ్గా 60 ఏళ్ళ క్రితం. అప్పుడు ముక్తవరం వయసు 17 ఏళ్లు! “పార్థసారథి నాకు […]
అచ్చు మా అత్తయ్యలూ పిన్నులు మాట్లాడుకున్నట్టే అనిపించింది
Bharadwaja Rangavajhala…… మానవ సంబంధాలన్నీ… అను కథ… ( ఇది కేవలం కల్పితం… ఇందలి పాత్రలు పాత్రధారులు అందరు కూడా కల్పితం ) …. పొద్దున్న మెట్రో ప్రయాణం చేసా సరదాగా… నా పక్కన…సీట్లలో రిటైర్మెంట్ దగ్గరికి వచ్చిన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయినులు కూర్చున్నారు… అనివార్యంగా వారి సంభాషణ నా చెవిన పడుతోంది. తీర్థయాత్రల గురించిన సమాచారం మాట్లాడుకుంటున్నారు. కాశీ వెళ్ళాం, ఇంకెక్కడికో వెళ్ళాం అని ఆల్రెడీ చూసొచ్చినావిడ చూడని మేడం కు వివరిస్తూన్నారు. అచ్చు క్లాసులో పిల్లలకి చెప్పినట్టే… […]
బ్రాహ్మలపై అసంగత వ్యాసం… సాక్షి ఎడిట్ పేజీ ఫీచర్… ఆ వ్యాసానికి ఇది కౌంటర్…
నిన్న సాక్షి దినపత్రికలో ఒకాయన ఓ వ్యాసం రాశాడు, దానిపై బ్రాహ్మణులు కోపగించిన సంగతి మనం చెప్పుకున్నాం కదా… అయితే ఆ వ్యాసానికి ఓ మిత్రుడు సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ కౌంటర్ రాశాడు… ఎందుకు పర్ఫెక్ట్ అంటున్నాను అంటే… వ్యాసంలో ఒక్కో పాయింట్‌ను పట్టుకుని, సాధికారంగా కౌంటర్ చేయడం ఆసక్తికరం అనిపించింది… దేవరాజు మహారాజు రాసింది కరెక్టా, మిత్రుడు రోచిష్మాన్ రాసింది కరెక్టా అనేది ఇక్కడ చర్చించడం లేదు… ఆ వ్యాసంలో ఏముంది..? దానికి ప్రతివాదుల సమాధానం […]
ఒకప్పటి జాతీయ అవార్డుల విజేత… ప్చ్… మరీ ఇలా నాసిరకం ప్రదర్శనేమిటి..?
జీవితంలాగే సినిమా ఇండస్ట్రీ… ఎప్పుడు ఎవరు వెలిగిపోతారో, ఎప్పుడు ఎవరు మసకబారతారో చెప్పడం కష్టం… నీలకంఠ అనే దర్శకుడు గుర్తున్నాడా..? ఇరవై ఏళ్ల క్రితం షో అనే ఓ చిన్న సినిమాతో వెలుగులోకి వచ్చాడు… రెండు జాతీయ అవార్డులతో మనకొక మంచి దర్శకుడు వచ్చాడు అనే పేరు సంపాదించుకున్నాడు… ప్రత్యేకించి స్క్రీన్ ప్లే రచనలో భిన్నత్వాన్ని, కొత్తదనాన్ని చూపించాడు… తరువాత మిస్సమ్మ అనే మరో సినిమా వచ్చినట్టు గుర్తు… భూమిక పాత్ర బాగుంటుంది అందులో… తరువాత ఇంకొన్ని […]
బ్రాహ్మణులపై సాక్షికీ చులకనే… ఎడిట్ పేజీలో ఏదేదో రాసిపడేశారు…
ఈరోజు ఎక్కడో తెలంగాణ బ్రాహ్మణ సంఘం సమావేశం జరుగుతున్నట్టు వాట్సప్‌లో వార్త కనిపించింది… వీళ్ల మీటింగులో ఇలాంటి ప్రస్తావనలు వస్తాయో రావో తెలియదు గానీ… మరోవైపు బ్రాహ్మణుల మీద విద్వేషాన్ని చిమ్ముతూ సాక్షి దినపత్రికలో ఓ వ్యాసం కనిపించింది… ఇది రాసింది డా.దేవరాజు మహారాజు… ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ప్లస్ జీవశాస్త్రవేత్త అని సదరు వ్యాస రచయితకు పరిచయం రాశారు వ్యాసం చివరలో… ఈమధ్య ఎవరో కాపీ రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ […]
సిపిఆర్ తో పర్యాటకునికి ప్రాణం పోసిన డాక్టర్ యనమదల
పాండిచేరి, 9 జూలై 2023 :: గుండె మరణాలు పెరగడం, హఠాత్తుగా గుండె ఆగిపోవడం ఈ మధ్య తరచుగా జరుగుతున్నది. పశ్చిమబెంగాల్ భవానిపూర్ కి చెందిన రిటైర్డ్ ఉద్యోగి అనిరుధ్ దాస్ (71) తన కుటుంబ సభ్యులతో పాండిచ్చేరిలోని ఆరోవెల్లిలో ప్రఖ్యాత ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో, వాహనం ముందు సీట్లో కూర్చుని ముందుకు వాలిపోయారు. కుటుంబ సభ్యులు బాధ, ఆందోళనతో సహాయం చేయాల్సిందిగా కేకలు వేశారు. కాకినాడకు చెందిన ప్రముఖ సాంక్రమిక వ్యాధుల […]
యాంకర్ సౌమ్య… తన తల్లికి ఏళ్లుగా చేసిన సేవ రియల్లీ టియర్ ఫుల్…
టీవీలోగానీ, సినిమా తెరపై గానీ… కనిపించే మేకప్పు మొహాల మెరుపుల వెనుక ఎన్నెన్నో నిజజీవిత బాధావీచికలుంటయ్… భరించలేని వేదనలుంటయ్… వేధింపులు, వివక్షాపూరిత సాధింపులూ ఉంటయ్… పొట్ట తిప్పల కోసం లేడీ ఆర్టిస్టులు అన్నీ భరిస్తుంటారు… తప్పదు… మేకప్ మొహాలతో నవ్వాలి, నవ్వించాలి, వినోదపరచాలి… కార్వాన్లోకి వెళ్లాక గుక్కపట్టుకుని ఏడవాలి… చివరకు అదీ కరువుతీరా ఏడవటానికి లేదు.. మేకప్ చెరిగిపోతుంది… అలా కన్నీళ్లను పేపర్ న్యాప్కిన్తో అద్దాలి, అంతే… శ్రీదేవి డ్రామా కంపెనీ తాజా ఎపిసోడ్ చాలామందికి కనెక్టయింది… […]
ఆగిపోయిన మరో న్యూస్ చానెల్… ఈ కొలువులు తుమ్మితే ఊడిపోతున్నయ్…
బ్రేకింగ్ న్యూస్ అంటూ పొద్దున్నుంచీ ఓ వాట్సప్ వార్త చక్కర్లు కొడుతోంది… అదేమిటో సంక్షిప్తంగా చదువుదాం ముందుగా… ‘‘ప్రైమ్ 9 న్యూస్ లైసెన్స్ సస్పెండ్ చేయబడింది… చట్టవిరుద్ధమైన వార్తా ప్రసార మాధ్యమాలపై భారీ అణిచివేతలో, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ హైదరాబాద్ ఆధారిత వార్తా ఛానెల్ ప్రైమ్ 9 న్యూస్ లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది… మరో కంపెనీ అయిన సంహిత బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 23 గంటల 55 నిమిషాల ఉచిత స్లాట్ ఇవ్వడంతో […]
- « Previous Page
- 1
- …
- 189
- 190
- 191
- 192
- 193
- …
- 448
- Next Page »