Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేదారనాథ్‌కే కాదు… హేమకుండ్‌కూ రోప్ వే… ఈ రెండూ ఎందుకంటే..?

September 21, 2025 by M S R

kedarnath

. ఇటీవల మీడియా మొత్తం కవర్ చేసింది కదా… హిందువులు తప్పనిసరిగా ఒక్కసారైనా దర్శించాలని కోరుకునే కేదారనాథ్‌కు ప్రభుత్వం రోప్ వే నిర్మించబోతున్నది అని… అదేకాదు, మరో రోప్ వే కూడా ప్రభుత్వం సంకల్పించింది… అది హేమకుండ్ సాహెబ్… ‘పర్వతమాల’ ప్రాజెక్టు కింద నిర్మించే ఈ రెండు రోప్‌వేల గురించి కాస్త వివరంగా చెప్పుకుందాం… కేదారనాథ్ గురించి తెలిసిందే కదా… చార్ ధామ్ క్షేత్రాల్లో ఇదీ ప్రముఖమైన శైవక్షేత్రం… పంచ కేదార్లలో ఒకటి… సోన ప్రయాగ నుంచి […]

ఎవెరీబడీ లవ్స్ ఎ వైట్ రేషన్ కార్డ్..! అందరూ పేదవాళ్లే..!!

September 21, 2025 by M S R

ration card

. ప్రపంచంలో ఏ భాషలో అయినా మొదటి పలకరింపు “బాగున్నారా?”. ఒకవేళ మనం ఆ సమయానికి కష్టంలో ఉన్నా బాగున్నామనే చెబుతాం. వెనువెంటనే “మీరెలా ఉన్నారు?” అని అడుగుతాం. వాళ్ళు కూడా బాగున్నామనే చెబుతారు. “ఉభయకుశలోపరి” మిగతా మాటలు మొదలవుతాయి. సెల్ ఫోన్లు రాకముందు ఉత్తరాలు రాసుకునే సత్తెకాలంలో మొదట రాయాల్సిన మాటలు “నేను క్షేమం”; “మీరు క్షేమమని తలుస్తాను”. దానమో ధర్మమో చేస్తే చివరికి అడుక్కుతినేవారు కూడా “దయగల మారాజులు చల్లంగ ఉండాల” అని ఆశీర్వదిస్తారు. […]

అప్పటి హీరోలు ఎక్కువ సినిమాలు చేసేవాళ్లు, ఇండస్ట్రీ పచ్చగా ఉండేది…

September 21, 2025 by M S R

రాధిక

. Subramanyam Dogiparthi …. 1+ 2 సినిమా అని చెప్పేదేముంది . ఇంత చక్కగా అందంగా ముగ్గురూ కనిపిస్తుంటే . కృష్ణ , చిరంజీవి వంటి ఏక్షన్ హీరోల ఫేమిలీ- సెంట్రిక్ సినిమాలు హిట్ కావాలంటే కధ , కధనం , దర్శకత్వం చాలా బిర్రుగా ఉండాలి . 1986 డిసెంబర్లో వచ్చిన ఈ శాంతినివాసం సినిమాలో కధనం బలహీనంగా ఉండటం వలన సినిమా బలహీనంగానే ఆడినట్లు ఉంది . ఎబౌ ఏవరేజ్ సినిమా అని గుర్తు […]

మేడారానికే వెళ్దాం… అపోహల్ని తొలగిద్దాం… అక్కడే ఫైనల్ నిర్ణయాలు…

September 21, 2025 by M S R

medaram

. కేసీయార్‌కూ రేవంత్‌రెడ్డికీ అదే తేడా… కేసీయార్‌ ఫామ్ హౌజు నుంచి కదలడు… ముఖ్యమంత్రిగా ఉండీ అప్పుడప్పుడూ కొన్నిరోజులపాటు ఎక్కడున్నాడో, ఏమయ్యాడో కూడా తెలియదు… ఇప్పుడైతే ఇక తన హౌజులో తనే బందీ… కొండగట్టు ప్రమాదబాధితుల వద్దకే కాదు, ఏ ఇన్సిడెంట్ జరిగినా తను వెళ్లేవాడు కాదు… చివరకు భద్రాచలం ముత్యాల తలంబ్రాలకు కూడా మనమడిని పంపించాడు తప్ప తను మాత్రం వెళ్లడం ఆపేశాడు… రేవంత్‌రెడ్డి కథ వేరు… నగరంలో భారీవర్ష ప్రాంతాలకు వెళ్తాడు… సైలెంటుగా ట్యాంక్ […]

ఇనుప కచ్చడాలు వంటి రచన ఆ రోజుల్లో ఏ రచయితైనా ఊహించి ఉండేవారా?

September 21, 2025 by M S R

tapi

. Bharadwaja Rangavajhala …. తాపీ ధర్మారావు గారు రాసిన గ్రంధాలు, ముఖ్యంగా దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు? మత వాదులను ఇబ్బంది పెట్టింది. మతం పరిణామ సిద్దాంతాన్ని అంగీకరించదు. మనిషిని దేవుడు సృష్టించాడు అన్నప్పుడు పరిణామ క్రమం అనేదాన్ని ఏకవాక్యంలో తిరస్కరించడం జరుగుతుంది. సరిగ్గా అక్కడే హేతువాదానికీ మతవాదానికీ గొడవ నడుస్తుంది. సృష్టించడంలో పరిణామ క్రమం ఉండే అవకాశమే లేదు. ధర్మారావు గారు తొలి రోజుల్లో శుద్ద గ్రాంధికాన్నీ వాడుతూ పద్యాలు రాశారు … ఎందుకు రాశారు? దాని […]

ఈ దేశంలో ఇంతే… పెద్దోడికో న్యాయం-పేదోడికో న్యాయం…

September 20, 2025 by M S R

loan

. పెద్దోడికో న్యాయం-పేదోడికో న్యాయం.. ఒకేరోజు పత్రికల్లో రెండు వార్తలు- అందులో మొదటిది.. గౌరవనీయులైన కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బిరామిరెడ్డి గారు బ్యాంకులకు 5700 కోట్లు ఎగ్గొట్టి 2400 కోట్లకు సెటిల్మెంట్ చేసుకున్నారనే వార్త… ఇక రెండో వార్త.. ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకుల నుంచి ఆరున్నర లక్షలు అప్పు చేసి, కట్టలేక ఆత్మహత్య చేసుకున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన దండుగుల రాజు అనే పేదవాడు… ఇక్కడ ఇద్దరూ తెలుగువాళ్లే. ఇద్దరూ బ్యాంకుల నుంచి అప్పులు […]

ఈ నటనకు గీటురాయిగా… ఆ ఒక్క సీతారామయ్య పాత్ర చాలదా ఏం..?!

September 20, 2025 by M S R

anr

. Rochish Mon …… అక్కినేని నాగేశ్వరరావు జయంతి… ఎన్.టీ. రామారావు అనే నట ప్రభంజనంలోనూ ఉన్నత స్థాయి ఉనికికొన్న ఉత్తమ నటుడు నాగేశ్వరరావు! ఆలోచనా సరళితో, అవగాహనతో, సరైన నిర్ణయాలతో, మేలైన అంచనాలతో గొప్ప నటుడుగా నిలబడ్డారు, చరిత్రగా నెలకొన్నారు నాగేశ్వరరావు. దేవదాసు సినిమాతో దేశ వ్యాప్తంగా ప్రతిష్ఠను పొందారు నాగేశ్వరరావు. “మీరు చేసిన దేవదాసును నేను ముందే చూసుంటే నేను దేవదాసు పాత్రను చెయ్యకపోదును” అని దిలీప్ కుమార్ అన్నారట. తన పరిధిని, తన […]

అక్కినేని- రామోజీ- ఎన్టీయార్… అన్నపూర్ణ కథలో ఆ ముగ్గురూ…

September 20, 2025 by M S R

anr

. Abdul Rajahussain … ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి ‘స్మృతి’ దినం..!! అక్కినేని అన్నపూర్ణ స్టూడియో స్థలాన్ని ఎన్టీఆర్ లాగేశారా ? ఎన్టీఆర్,…. ఏఎన్నార్ … నడుమ అన్నపూర్ణ స్టూడియోస్. !! మూడున్నర దశాబ్దాల నాటి ముచ్చట పునశ్చరణ ) హైదరాబాదు బంజారాహిల్స్ లోని అన్నపూర్ణా స్టూడియోస్ అందరికీ తెలిసిందే. చలనచిత్ర పరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించాలన్న ఆలోచనకు ప్రప్రథమంగా అక్కినేని నాగేశ్వరరావు శ్రీకారం చుట్టారు. ఆయన కుటుంబంతో సహా హైదరాబాదుకు షిఫ్ట్ అయినపుడు, […]

‘నాదేముందమ్మా… లైట్ మీల్స్… ఇదుగో ఈ మాత్రం ఉంటే చాలు…’

September 20, 2025 by M S R

light meals

. మా ఇంటికి ఎప్పుడొచ్చినా… చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని మరీ వస్తారు.., ఎంత త్వరగా వెళ్లిపోదామా అని… భోజనానికి ఎప్పుడూ ఉండరు…. అని మా చిన్ననాటి స్నేహితుడి భార్య మరీ నిష్టూరమాడుతుంటే చెప్పాను… భోజనానికి పిలిస్తే ఎందుకు రాం…? కానీ మా భయమేందంటే, మేం భోజనానికి వస్తున్నామంటే మీరు పొద్దున్నే నాలుగింటికి లేచి, బోల్డన్ని వెరైటీలు చేస్తారు… మీ కష్టం చూడలేకే మీ ఇంటికి భోజనానికి వస్తలేం మేం… సరే… ఇన్నిసార్లు పిలిచారు కాబట్టి మా షరతులు […]

రేవంత్ రెడ్డి అలా సంకల్పించాడు… ఇలా ట్రంపు ఓ చాన్స్ ఇస్తున్నాడు…

September 20, 2025 by M S R

trump

. సంకల్పానికి దరిద్రం ఉండొద్దు… ఏమో, ఏ కార్యకారణ సంబంధమో… ఎక్కడో లింక్ కూడా లేనిదేదో కదులుతుంది… మనం అనుకున్నది నెరవేరే చాన్సూ ఇస్తుంది… రష్యా చమురు కొంటున్నామని ట్రంపుడు పగ పెంచుకోవడం ఏమిటి..? పాకిస్థాన్‌తో అంటకాగుతూ ఇండియా మీద కక్ష తీర్చుకోవడం ఏమిటి..? కొలువు వీసాల మీద ఏకంగా లక్ష డాలర్ల ఫీజు పెట్టి, మీచావు మీరు చావండి అని మనల్ని బెదిరించడం ఏమిటి..? ఏమో, పర్యవసానంగా హైదరాబాదుకు విదేశీ ఐటీ కంపెనీలే రావచ్చునేమో… నిన్న […]

ఆయుధ విసర్జన కాదు… రిట్రీట్ అసలే కాదు… జస్ట్, ఓ లీడర్ లొంగుబాట..!!

September 20, 2025 by M S R

naxals

. మొత్తానికి ఓ క్లారిటీ వచ్చింది… ఆయుధాలు విసర్జిస్తామనీ, మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి వస్తామని మావోయిస్టు పార్టీ పేరిట వచ్చిన లేఖ ఫేక్ కాదు… కాకపోతే అది పార్టీ అధికారిక ప్రకటన కాదు… సెంట్రల్ కమిటీలో సీనియర్ నక్సలైట్ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని స్పష్టత ఇచ్చింది మావోయిస్ట్ పార్టీ… మావోయిస్టుల్లో వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ లేదు… సెంట్రల్ కమిటీ ప్రకటనలే శిరోధార్యం… అయితే ఇక్కడ కొన్ని చెప్పుకోవల్సిన అంశాలున్నయ్… ఎందుకంటే..? మల్లోజుల […]

భిన్నమైన స్టోరీ లైన్… సీరియస్ ఫ్లో… ‘బిచ్చగాడి’ మరో గుడ్ ఎఫర్ట్..!!

September 20, 2025 by M S R

భద్రకాళి

. బిచ్చగాడు సినిమా తరువాత విజయ్ ఆంటోనీ సినిమా ఏది వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు… కానీ తరువాత తన సినిమాలు పెద్దగా తెలుగులో క్లిక్ కాలేదు… ఇప్పుడు భద్రకాళి అంటూ వచ్చాడు… గతంలో ఆర్పీ పట్నాయక్ తీసిన బ్రోకర్ తరహా కథే… నిజానికి ఇలాంటి పొలిటికల్ బ్రోకర్ కథలు తక్కువే… సో, స్టోరీ లైన్ భిన్నమైంది… పైగా ఓ గిరిజన మహిళ ఆత్మహత్య నుంచి మొదలయ్యే కథ… ఓ అనాథ ఏదైనా సాధించగల ఓ […]

H1B వీసా లక్ష డాలర్ల ఫీజు… ఎవరికి..? ప్రభావం ఎంత..? ప్రచారం ఏమిటి..?

September 20, 2025 by M S R

h1b

. ప్యానిక్… ట్రంపు హెచ్1బీ వీసా ఫీజు మీద జారీ చేసిన ఉత్తర్వులతో కలకలం, ఆందోళన, కలవరం… పైగా రకరకాల వార్తలు, భయపెట్టే ప్రచారాలు… ఇండియన్ మీడియా, సోషల్ మీడియా అబద్ధాలతో, అవగాహన రాహిత్యంతో హోరెత్తిస్తున్నాయి… ఏమని..? . ఇప్పుడు హెచ్1 బీ కింద పనిచేసినవాళ్లకు రెన్యువల్స్ ఉండవు, కావాలంటే లక్ష డాలర్లు చెల్లించాలి, ఇక వాళ్లంతా వాపస్ రావల్సిందే… కొత్తగా జాబ్ కావాలని వచ్చే మనవాళ్లు లక్ష డాలర్లు కట్టాల్సిందే, అంత చెల్లించలేరు కాబట్టి ఇక […]

ఓ మోస్తరు ’బ్యూటీ’ఫుల్ మూవీ..! ఈ కథానాయికకు ఫ్యూచర్ ఉంది..!

September 20, 2025 by M S R

neelakhi

. బ్యూటీ అనే సినిమా… మారుతి సమర్పణ అనేసరికి కాస్త ఇంట్రస్ట్… హీరో హీరోయిన్లు కొత్త… ఇదీ ఓ ప్రేమ యవ్వారపు కథే అయినా, ఆ నేపథ్యంలో ఏదో తండ్రీ కూతుళ్ల అనుబంధం, ఘర్షణ, తండ్రి ప్రేమ చిత్రీకరించారని తెలిసి కాసింత ఆసక్తి… పైగా ఈమధ్య అదృష్టవశాత్తూ పెద్ద భ్రమాత్మక సినిమాలు బోల్తా కొడుతూ, చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి కదా… ఇదీ హిట్ అవ్వొచ్చునేమో అనుకున్న సినిమా… కథ వరకూ వోకే… చాలా సినిమాల్లో […]

రష్యా ఆయిల్ కొంటే ట్రంపు పెనాల్టీలు… అసలు కుట్రదారులు ఎవరు..?

September 20, 2025 by M S R

trump

. పార్థసారథి పొట్లూరి….   ట్రంపు- సౌదీ ప్రిన్స్- పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ – ఆపరేషన్ సిందూర్ లింకులు, మధ్యవర్తుల మీద ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ చదివాం కదా… ఇది మిగతా పార్ట్… . ట్రంప్- టారిఫ్స్- మొహమ్మద్ బిన్ సల్మాన్ via India! డోనాల్డ్ ట్రంప్ అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల మీద సుంకాలు విధించాలనే ఆలోచనని గత మూడు దశబ్దాలుగా చెప్తూ వస్తున్నాడు! కాబట్టి ఇప్పుడు కొత్తగా చెప్తున్నది కాదు కానీ తన ఆలోచనని ఇప్పుడు […]

వరల్డ్ వార్ సన్నాహాలు షురూ..! ఆపరేషన్ సిందూర్ ఆపించింది ఎవరు..?!

September 20, 2025 by M S R

trump

. Pardha Saradhi Potluri ………. మూడో ప్రపంచ యుద్ధానికి సన్నాహాలు – part 1 ఆపరేషన్ సిందూర్ కి విరామం! ఎవరు మధ్యవర్తిత్వం వహించారు? యాసిర్ అల్ రూమయ్యాన్ – Yasir al Rumayyan! రుమయ్యాన్ సౌదీ అరేబియాకి చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ( PIF Public Investment Fund) కి గవర్నర్. తను సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కి కుడి భుజం! సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద […]

గద్దను ఎలా బీభత్సంగా వేటాడాలో… అదేదో భాషలో చెబితే ఎలా స్వామీ..?!

September 20, 2025 by M S R

pk

. ఏపీలో తమ ప్రభుత్వమే కదా… అనుకున్నంత మేరకు టికెట్ రేట్ల పెంపు ఉత్తర్వులు అర్జెంటుగా వెలువడ్డాయి పవన్ కల్యాణ్ ఓజీ సినిమాకు… అనుకున్నట్టుగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చేసింది… అప్పుడెప్పుడో రేవంత్ రెడ్డి టికెట్ రేట్ల పెంపు కావాలంటే ఏం చేయాలో చెప్పాడు, పవన్ కల్యాణ్ చేశాడో లేదో తెలియదు… పోనీలే, డబ్బింగ్ సినిమాలే టికెట్ రేట్ల హైక్ ఇచ్చేస్తున్నప్పుడు ఓజీకి ఇస్తే తప్పేముందిలే… సరే, ఆ టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల దోపిడీ మాటెలా […]

మంచు లక్ష్మి నటన, ఖర్చు, ప్రయాస… ఏవీ వర్కవుట్ కాలేదు ఫాఫం…

September 20, 2025 by M S R

manchu

. మంచు లక్ష్మి వర్సెస్ ఆ జర్నలిస్టు కథను కాసేపు పక్కన బెడితే… ఆమె ప్రధాన పాత్రలో నటించిన దక్ష, ది డెడ్లీ కాన్‌స్పరసీ సినిమా ఎలా ఉంది..? చాన్నాళ్లయింది కదా ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా రాక… మరి దీని సంగతేమిటి..? పైగా సొంత సినిమా… లక్ష్మి మంచి నటి, అందులో డౌట్ లేదు… అది వదిలేసి మిగతావి చెప్పుకుందాం… ఈ సినిమా విషయంలో ఆమె చేసిన ప్రాథమిక తప్పు ఏమిటంటే… సన్నాఫ్ ఇండియా […]

లచ్చక్క అంత తేలికగా వదలదట..! ఈ జర్నలిస్టుపై ఫిర్యాదు..!

September 20, 2025 by M S R

manchu

. నిజానికి మన తెలుగు ఫిలిమ్ జర్నలిస్టులకు సంబంధించి ఇది చిన్న వార్తేమీ కాదు… తమ విపరీత ధోరణులతో ఇండస్ట్రీ వాళ్లకు జర్నలిస్టులు షాకులు ఇస్తుంటే మంచు లక్ష్మి అలియాస్ కంచు లక్ష్మి ఓ షాక్ ఇచ్చింది… రీసెంట్ వివాదం తెలుసు కదా… మూర్తి అనే సినిమా జర్నలిస్టు ఆల్రెడీ పలు వివాదాలతో అందరికీ పరిచయమే… మొన్న ఓ ఇంటర్వ్యూలో 50 ఏళ్ల మహిళ, పన్నెండేళ్ల కూతురున్న తల్లికి డ్రెస్ సెన్స్ ఉండాలి కదా, మిమ్మల్ని చూసి […]

కశ్మీరీ పండిట్ల ఊచకోతల బాధ్యుడికి మన్మోహన్ అభినందన, థాంక్స్..!!

September 20, 2025 by M S R

jklf

. ఓ కరడుగట్టిన టెర్రరిస్ట్ నేతకు సాక్షాత్తూ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ధన్యవాదాలు చెప్పాడా..? పాకిస్థాన్‌తో శాంతి చర్చల పేరిట నొటోరియస్ టెర్రరిస్టు నేతలతో సంప్రదింపులకు ఇండియన్ గూఢచార వర్గాలు ప్రయత్నించాయా..? యావజ్జీవం అనుభవిస్తున్న జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF) ఉగ్రవాద నేత యాసిన్ మాలిక్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి… 2006లో పాకిస్తాన్‌ పర్యటన సందర్భంగా లష్కరే తోయబా స్థాపకుడు, 26/11 ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ […]

  • « Previous Page
  • 1
  • …
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • …
  • 390
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • నా డెత్ సర్టిఫికెట్ పోయింది… దొరికినవారు దయచేసి సంప్రదించగలరు…
  • బంగారు బల్లి… వెండి బల్లి… కంచిలో వాటి తాపడాలూ మార్చేసేశారు…
  • స్టార్ల సినిమాలు కాదు… ఇదుగో ఇవి కదా రీరిలీజ్ చేయాల్సింది..!!
  • బండి రాకతో జుబ్లీ హిల్స్ ప్రచార చిత్రంలో హఠాత్ మార్పు… ఎలాగంటే..?
  • జుబ్లీ ఇరకాటంలో కేటీయార్..! మాగంటి తల్లి పేల్చిన కొత్త బాంబులు..!!
  • బ్యాట్లు, లెగ్ గార్డుల షేరింగు అప్పట్లో… మ్యాచుకు జస్ట్ రూ. 1000 ఫీజు..!!
  • పర్సనల్ టచ్..! ఇందులో దేశంలో మోడీకి ఎవరూ పోటీ రాలేరు..!!
  • దత్తాత్రేయ భక్తులా మీరు..? తప్పక చదవాల్సిన ఓ ఆధ్యాత్మిక కథనం..!!
  • ఆదానీ అనగానే మోడీ… మోడీ అనగానే వ్యతిరేకత… ఎర్రన్నలు అంతే..!!
  • డ్రంకెన్ డ్రైవ్‌తోపాటు… డ్రంకెన్ స్పీచ్ టెస్టులూ అవసరం ఇప్పుడు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions