. ఒక ట్రంప్, ఒక జెలెన్ స్కీ, ఒక వీధి పోరాటం దేశాధినేతల ద్వైపాక్షిక చర్చలు; శిఖరాగ్ర సమావేశాలు; అంతర్జాతీయ దౌత్యసంబంధ చర్చలు; శాంతి చర్చలు; పరస్పర ఒడంబడికలు; వాణిజ్య ఒప్పందాలు సుహృద్భావ వాతావరణంలో, ప్రశాంతంగా, రహస్యంగా నాలుగ్గోడల మధ్య జరగాలని నియమం ఏమీ లేదు. డిప్లమసీ డీసెన్సీ, డిగ్నిటీ, కర్టసి, ఇమ్యూనిటీ లాంటి మర్యాదపూర్వక పదబంధాలు ఎన్నయినా భాషలో ఉండవచ్చు. కానీ భావంలో ఆ మర్యాదలు అలాగే ఉండాలని నియమేమీ లేదు. మన ఊరి చేపల […]
మరణించని అమరజవాన్..! చదివి తీరాల్సిన ఓ వీరుడి పోరాటగాథ..!!
. యాభై ఎనిమిది సంవత్సరాల క్రితం అసువులు బాశాడు ఆ జవాను… కానీ ఈరోజుకూ తను సర్వీసులో ఉన్నట్టుగానే భావిస్తూ ప్రమోషన్లు ఇస్తుంది ప్రభుత్వం…! మహావీరచక్ర పురస్కారం ఇచ్చింది… తను బలిదానం చేసిన చోట ఓ గుడి వెలిసింది… ఆ ప్రాంతం నుంచి వెళ్లే జవాన్లు అక్కడ ఆగి మనసారా మొక్కుకుని వెళ్తారు… తన పేరిట ఓ చలనచిత్రం కూడా వచ్చింది… ఇంట్రస్టింగు కదా… అవును, జశ్వంత్‌సింగ్ రావత్… భారతీయ సైన్యం ఎప్పుడూ మరిచిపోలేని పేరు… ఈమధ్య […]
సారీ సీఎం రేవంత్ సార్… ఒక్క రాధాకృష్ణ సర్టిఫికెట్టు సరిపోదేమో..!!
. ‘‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం నాడు గాంధీభవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఏకరువు పెట్టారు. అవన్నీ వింటున్నప్పుడు నిజంగా ఇన్ని నిర్ణయాలు తీసుకున్నారా అని ఆశ్చర్యం వేసింది. అయినా, అనుభవం లేనందున ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి విఫలమవుతున్నారన్న ప్రచారమే పెరిగింది. ఈ ప్రచారమే అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి కీడు చేస్తుంది…’’ …. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి కొత్త పలుకులోని ఓ పేరా… ఫాఫం ఇన్నాళ్లూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు చంద్రబాబును మోయడమే […]
ఛావా విక్కీ కౌశల్‌కు అసలు సిసలు ఛాలెంజ్ రాబోయే ఈ పాత్ర..!!
. ఛావాతో దేశమంతా ప్రకంపనలు క్రియేట్ చేస్తున్న విక్కీ కౌశల్‌కు అసలు పరీక్ష ముందుంది… ఇన్నేళ్ల కెరీర్ ఒకెత్తు… ఇకపై ఒకెత్తు… తనపై హై ఎక్స్పెక్టేషన్స్ పెరగడం కాదు, తను చేయబోయే పాత్ర మరొకటి ఛాలెంజింగ్… నిజానికి యురి, సర్దార్ ఉధమ్, శామ్ బహదూర్ పాత్రలకన్నా ముందు విక్కీ కౌశల్ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు… తను నటుడే కాదు, టీవీ హోస్ట్, మ్యూజిక్ వీడియోస్, సోషల్ యాక్టివిస్ట్ ఎట్సెట్రా… పుష్కరం క్రితం వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ […]
కృష్ణవేణీ… ఎవరీ ‘తెలుగింటి’ విరిబోణీ..? హాశ్చర్యకరమైన ఓ యాడ్..!!
. నేలనడిగా, పువ్వులనడిగా… ఆమె ఎవరు, ఏమిటనీ… గాలినడిగా, మబ్బులనడిగా… ఆమెపై ఈ ప్రేమేమిటనీ… పత్రికల్లో ఓ యాడ్ చూశాక ఇలా ఓ పేరడీ మదిలో తట్టింది… ఫాఫం… ఆ యాడ్ ఏమిటంటే..? ఎన్టీయార్ కుటుంబం అందరి పేర్లతో, అంటే మూకుమ్మడిగా, అంటే సామూహిక ప్రేమతో, అంటే చెదిరిపోని అభిమానంతో, అంటే..? ఎట్సెట్రా… ఆ యాడ్ ఏమిటయ్యా అంటే..? ఇదుగో ఇదీ… ఆహా… ఎన్టీయార్ భారీ కుటుంబం ఎప్పుడైనా ఎన్టీయార్ జయంతిరోజో, వర్ధంతిరోజో ఓ యాడ్ ఇస్తుంది… […]
ట్రంపును ధిక్కరించిన తోపు… సరే, రేప్పొద్దున ఎటువైపు, ఏదీ దారి..?!
. ఒక్కసారి యూరోపియన్ యూనియన్ సభ్యదేశాల జాబితా చదవండి… Austria, Belgium, Bulgaria, Croatia, Republic of Cyprus, Czech Republic, Denmark, Estonia, Finland, France, Germany, Greece, Hungary, Ireland, Italy, Latvia, Lithuania, Luxembourg, Malta, Netherlands, Poland, Portugal, Romania, Slovakia, Slovenia, Spain and Sweden… ఇవన్నీ మేం మీకు తోడుగా ఉంటాం, నీకేమీ భయం లేదు, ఛలో పోరాడదాం అని ఉక్రెయిన్ జెలెన్స్కీకి హామీ ఇచ్చాయి… రష్యా దురాక్రమణకు […]
కాంగ్రెస్ కీలకనేత భార్యకు ఐఎస్ఐతో సంబంధాలు..? దర్యాప్తు షురూ..!
. అస్సోం రాజకీయాల్లో ఎప్పుడూ అక్రమ వలసలు ఓ ముఖ్యాంశం… ఇప్పుడు ఓ కొత్త అంశం రాజకీయ రచ్చకు దారితీస్తోంది… కాంగ్రెస్ పార్టీని కూడా బీజేపీ ఇరుకునపెడుతోంది ఈ అంశంపై… ఎలిజబెత్… Elizabeth Colburn… జన్మతః ఈమె బ్రిటిషర్… లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో ఇంటర్నేషనల్ పొలిటికల్ ఎకానమీ సబ్జెక్టులో మాస్టర్స్ చేసింది… 2013లో గౌరవ్ గొగోయ్‌ను పెళ్లి చేసుకుంది… ఎవరు ఈ గౌరవ్ గొగోయ్..? అస్సాంకు దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన తరుణ్ గొగోయ్ కొడుకు… న్యూయార్క్ […]
ఖాన్ మార్కెట్ గ్యాంగ్..! మోడీ వెక్కిరింపు… అసలు ఏమిటా పదం..?!
. ఓ పెళ్లి ఊరేగింపు… పదిమంది డాన్స్ చేస్తున్నారు… పోలీసులు వచ్చి వరుడితోపాటు ఆ పదిమందినీ తీసుకెళ్లి జైలులో వేశారు… చట్టప్రకారం సాధ్యమేనా..? కోర్టులో పోలీసులు ఈ చర్యను సమర్థించుకోగలరా..? అవును, మొన్నమొన్నటివరకూ సాధ్యమే… చట్టప్రకారమే… నిన్న ఢిల్లీలో జరిగిన NXT Conclave సందర్భంగా ప్రధాని మోడీ వెల్లడించిన ఒకటీరెండు ఇలాంటి ఉదాహరణలు ఇంట్రస్టింగు… మనం స్వాతంత్ర్యం పొందాక ఓ ముఖ్యమైన పనిని విస్మరించాం… కాలం చెల్లినవి, వర్తమాన కాలానికి వర్తించనివి బోలెడు బ్రిటిష్ చట్టాల్ని మార్చుకోలేకపోయాం, రద్దు […]
పటాటోపాల్లేవ్… డాబుసరి వేషాల్లేవ్… అసలీమె నాయకురాలేనా..?!
. పురాణ ప్రవచనకారులు అనేక ఉదాహరణలు చెప్పక తప్పదు. అసలు కథ మన మనసుల్లో బలంగా నాటుకోవాలంటే ఎన్నెన్నో కథలతో చెప్పాల్సిందే. అలా అనాదిగా చెబుతున్న ఒకానొక గొప్ప కథ ఇది. ఒక ఊళ్లో అనేక ప్రాకారాలతో పెద్ద గుడి. గుడికి వెళ్లే దారిలో వీధి పొడవునా అటు ఇటు భిక్షగాళ్లు అడుక్కుతింటూ ఉంటారు. రోజూ ఉదయాన్నే ఒక ఏనుగును గుడి ప్రధాన ద్వారం దగ్గరికి మావటివాడు తీసుకొచ్చే ముందు భిక్షగాళ్లందరూ లేచి… పక్కకు వెళతారు. ఏనుగుకు […]
తప్పుపట్టకండి… అసలు కథ తెలిస్తే… గుండె తడి పొంగి, కళ్లను దాటేస్తుంది…
. కంటికి కనిపించేది అంతా నిజం కాదు… మనకు కనిపించిన సన్నివేశాన్ని, దృశ్యాన్ని బట్టి మనం ఏదేదో ఊహించేసుకుంటాం… కానీ సత్యం వేరే అయి ఉండవచ్చు… ఈ మాట మనకు పెద్దలు పదే పదే చెప్పినా సరే… మన రక్తంలో జీర్ణించుకుపోయిన తత్వాన్ని బట్టి ఇప్పటికీ మనం మారం… ఉదాహరణ చెప్పడానికి… చాలామంది ఇదుగో ఈ బొమ్మ చూపిస్తారు… ఫస్ట్, బొమ్మ చూడగానే మనకు కొన్ని నెగెటివ్ ఆలోచనలు కలుగుతాయి… ఛిఛీ అనిపించొచ్చుగాక… కానీ అసలు కథ […]
a mystic story..! ఇలా జరగకపోవచ్చు… కానీ జరిగితే బాగుండేదేమో..!!
. ఒక కథ… ఫేస్‌బుక్‌లోనే కనిపించింది… అలా బోలెడు కథలున్నయ్… ఇదే ఎందుకు ఆకర్షించింది అంటే… మనం కాలం వెళ్లదీస్తున్నవి గడ్డురోజులు కాబట్టి… మనకు తెలియని ఏదో అంశం మన బతుకుల్ని, వాటి గతుల్ని నిర్దేశిస్తున్నట్టుగా అనిపిస్తున్నది కాబట్టి… మనిషిని ఈ గడ్డుకాలం కాస్త వైరాగ్యం వైపు నెట్టేస్తున్నది కాబట్టి… మన చేతుల్లో ఏముంది అనే ఓరకమైన విరక్తిని నింపుతున్నది కాబట్టి… ఇది కథ, ఎవరు రాశారో తెలియదు… (తెలిస్తే బాగుండు… తెలియకపోయినా సరే, ఆ అజ్ఞాత […]
Pity scene… trump and Zelensky heated arguments…
. BP Padala …. Zelenskyy, the Ukrainian president should be tried for war crimes , for bringing unimaginable misery upon his own people , with his false ego and abominable greed . Ukraine had lost more than one lac soldiers , nearly a crore of citizens died or wounded , 25% of population was dislocated and […]
బ్లేడ్ బాబ్జీ..! చివరకు గడ్డం గీకే బ్లేడ్ల కంపెనీలకూ మనం అలుసే..!!
. అంటే అన్నామంటారు గానీ… ఎప్పుడూ కొనేవాడు అమ్మేవాడికి లోకువే… అన్నింటికీ మించి వాడు చేసే వాణిజ్య ప్రచారాలకు అలుసే… ప్రత్యేకించి బ్రాండెడ్… ఆ ప్రకటనలు పెద్ద బ్యాండ్… వాడికి ఇష్టమొచ్చినట్టు చెప్పుకుంటాడు… అడిగేవాడు ఉండడు కదా… ఐనా, గుట్కా ప్రకటనలు వద్దురా అంటే పాన్ మసాలా అని బ్రాండ్ ప్రమోషన్స్, అదీ మహేశ్ బాబు రేంజులో… మద్యం ప్రకటనలు నిషిద్దంరా అంటే మినరల్ వాటర్, సోడా పేరిట బ్రాండ్ ప్రమోషన్స్… వీటినే సరోగేట్ యాడ్స్ అంటారు… […]
నాసిక్ కుంభమేళా..! ఈసారి పుణ్యస్నానాలకై గోదావరి రమ్మంటోంది..!!
. 66 కోట్ల మంది భక్తుల పుణ్యస్నానాల మహాకుంభమేళా అయిపోయింది.., ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆధ్యాత్మిక మేళా మొన్నటి మహాశివరాత్రి స్నానాలతో ముగిసింది… కానీ ఇంకా ఆ పట్టణం పూర్ణ పారిశుద్యంతో ఓ కొలిక్కి రానేలేదు… అప్పుడే తదుపరి కుంభమేళా ఎప్పుడు అనే తాజా చర్చకు తెరలేచింది… అదేమిటి..? 144 ఏళ్ల తరువాత మళ్లీ మహాకుంభమేళా వచ్చేది, అప్పుడే చర్చ ఏమిటి అంటారా..? మీ ప్రశ్న సబబే, హేతుబద్దమే… అవును, మహాకుంభమేళా వచ్చేది మరో 144 ఏళ్ల […]
మనం తినేది ప్లాస్టిక్… తాగేది ప్లాస్టిక్… బతుకంతా ప్లాస్టిక్‌మయమే.,.
. మహారాష్ట్ర బుల్దానా జిల్లా షెగావ్ తాలూకాలోని బొండ్ గావ్, కలవాడ్, హింగానా మూడు గ్రామాల్లో ఇప్పుడు జుట్టు కలవాడు లేడు. ముందు తలమీద దురద మొదలవుతుంది. నెమ్మదిగా ముందు భాగం జుట్టు రాలిపోతుంది. వారంలో బట్టతల అవుతుంది. ఆడామగా, చిన్నా పెద్ద తేడా లేదు. దాంతో ఊరు ఊరంతా మూకుమ్మడిగా ఏడుస్తుంటే ప్రభుత్వం పెద్ద మనసుతో వైద్యబృందాలను పంపింది. నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. చర్మసంబంధ వ్యాధులు కూడా వచ్చినట్లు గుర్తించారు. ఈ గ్రామాలకు […]
మహాభారతంనాటి దివ్యాస్త్ర పరిజ్ఞానం ఏమైంది..? ఎలా అంతరించింది..?
. కురుక్షేత్రంలో అనేకమంది అతిరథులు, మహారథులు మరణించారు కదా… తరువాత కొన్నేళ్లకు యాదవులు, పాండవులు కూడా గతిస్తారు కదా… కురుక్షేత్రంలో మరణించకుండా మిగిలినవాళ్లలో కురుగురువు కృపాచార్యుడు, ధర్మరాజు సవతిసోదరుడు యుయుత్సు, యాదవ వీరులు సాత్యకి, కృతవర్మ కూడా కాలం చేస్తారు… అశ్వత్థామ కృష్ణుడి శాపానికి గురై, కుష్టు వ్యాధిగ్రస్తుడై, పిచ్చోడై దేశాలు పట్టిపోతాడు… ఈలోపు కలియుగం వచ్చేస్తుంది… మరి అనేకానేక దివ్యాస్త్రాల పరిజ్ఞానం అంతటితో అంతరించిపోయిందా..? అవి తెలిసిన వీరుడెవ్వడూ కలియుగంలోకి ప్రవేశించలేదా..? ఓ చిన్న చర్చ… […]
దిగ్గజరాజు..! ఈ శిల్పం వెనుక ఓ ఆసక్తికర కథ… ఓ మహాభారత పాత్ర…!!
. రామాయణం, భారతం, భాగవతం… వీటిల్లో ఏది గొప్పది అనడిగాడు ఓ మిత్రుడు… దేని గొప్పతనం దానిదే… కానీ రామాయణం, భాగవతాల్లో కథలు చిన్నవి… ఎక్కువగా రాముడిని, కృష్ణుడిని దేవుళ్లుగా చిత్రీకరించేవి… కానీ భారతం కథ ఓ మహాసముద్రం, దాని ఉపకథలు, ఉపోపకథలు కోకొల్లలు… ఈ కథ యావత్తూ రాజతంత్రాలు… సంక్లిష్టత, మార్మికత, ధర్మాధర్మ మీమాంస వంటివి బోలెడు… నిజమే… భారతంలో మనుషులే కాదు, పిశాచాలు, రాక్షసులే కాదు… నాగులు, ఏనుగుల పాత్రలకూ కథాప్రాధాన్యం… ఒక పాత్ర […]
ప్రభాస్ అనారోగ్యానికి మరో చిక్కు..? భారీ ప్రాజెక్టులపై భయాందోళన..!!
. గుర్తుందా మీకు..? ఆదిపురుష్ ప్రిరిలీజ్ ఫంక్షన్ తిరుపతిలో జరిగినప్పుడు… ఆ వేదిక ఎక్కడానికి కూడా ప్రభాస్ కాళ్లు సహకరించక… లిఫ్ట్ పెట్టాల్సి వచ్చింది… అందరికీ తెలిసిందే, రాసిందే… అప్పటికే తన మోకాలి చిప్ప ఆపరేషన్లు, ఆరోగ్య సమస్యలు తనను సతాయిస్తున్నాయి… ఆ తరువాత కల్కి… ఆ సినిమా జయాపజయాల్ని, వసూళ్లను వదిలేయండి… ఆ సినిమా తరువాత తను జనంలోకి వచ్చి పలకరించింది తక్కువే… ఎక్కడో తనను నడిపించుకుంటూ తీసుకొస్తున్న ఫోటోలు కూడా కనిపించాయి… అసలు ఏమైంది […]
ఓ యూదు రెఫ్యూజీ సైంటిస్టు… మన శాస్త్ర విద్యకు పిల్లరయ్యాడు…
. ……. (రమణ కొంటికర్ల)….. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తూ కాదు. కానీ, అలాంటి ప్రతిభను గుర్తించి.. ఆ ప్రతిభను ఉపయోగించుకోవాలంటే.. అలాంటి ప్రతిభావంతుల నుంచే అవుతుంది. అదే పని చేశాడు మన చంద్రశేఖర్ వెంకట్రామన్. అలా ఓపెన్ హైమర్ బాప్ నే మన ఇండియాకు సైంటిస్ట్ గా పట్టుకొచ్చాడు. ఎలా..? ఓ ఇంట్రస్టింగ్ కథ! అది 60 లక్షల మంది యూదులను విషవాయు గదుల్లో బంధించి చంపిన హిట్లర్ నియంతృత్వానికి ప్రతీకగా నిల్చిన కాలం. ఆ సమయంలో […]
ప్రభుత్వ ఉద్యోగి రిటైరయితే… అకౌంట్ సెటిల్ చేయలేని దురవస్థ..!!
. ముందుగా ఓ వార్త చదవండి… తెలంగాణ ఆర్థిక స్థితికి అద్దం పట్టేదే… పెద్ద విశ్లేషణలూ, విపుల వివరణలూ అక్కర్లేదు… వార్త చదవగానే పాఠకుడికి అర్థమైపోతుంది… ఇదీ వార్త… తొర్రూరు విశ్రాంత హెడ్ మాస్టర్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించండి: హైకోర్టు ఆదేశం… మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన విశ్రాంత హెడ్ మాస్టర్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎనిమిది వారాల్లోగా (రెండు నెలల్లోపు) చెల్లించాలని తెలంగాణ హైకోర్టు గురువారంనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది… పదవీ విరమణ చేసి ఏడు […]
- « Previous Page
- 1
- …
- 21
- 22
- 23
- 24
- 25
- …
- 494
- Next Page »