తనకు కేన్సర్ అనీ, చికిత్స ద్వారా నయం చేయించుకున్నానని చిరంజీవి చెప్పినట్టుగా మెయిన్ స్ట్రీమ్ సైట్లు, యూట్యూబ్ చానెళ్లు రాసిపారేశాయి… టీవీలు కూడా కవర్ చేశాయి… నిజంగా చిరంజీవి అలాగే చెప్పి ఉన్నట్టయితే, ఈ కంటెంట్ రైటర్లు, ట్యూబర్లతోసహా అందరికీ అది పెద్ద వార్తే… దాంతో అందరూ రాసిపారేశారు… వాళ్లను తప్పుపట్టే పనిలేదు… కేన్సర్ అనే పదం చిరంజీవి నోటి వెంట వినగానే… ఆ పదం మీద, చిరంజీవి ఏం చెప్పాడనే విషయంపైన కొంత వర్క్ జరగాలి […]
ముందు నటనలో బేసిక్స్ నేర్చుకొండి బాబులూ… తరువాత వాయిద్దురు గానీ…
మొన్నామధ్య ఎక్కడో చదవబడినట్టు గుర్తు… బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాసుడు నాటి ప్రభాస్-రాజమౌళి చిత్రం ఛత్రపతిని హిందీలో సినిమాగా తీసి, రిలీజ్ చేస్తే… మొదటివారం నెట్ షేర్ కోటి రూపాయలు వచ్చిందట… (అంటే రెండో వారం నడిచిందా అని చొప్పదంటు ప్రశ్న వదలకండి…) సదరు హీరో హిందీ ప్రాంతాల్లో ప్రమోషన్లకు వెళ్లివచ్చిన రవాణా, ఇతరత్రా మీడియా ఖర్చులు తిరిగొచ్చాయన్నమాట… మరి అరవయ్యో, డెబ్బయ్యో కోట్లు పెట్టారు కదా… వాటి సంగతేమిటి..? అయ్య దగ్గర బొచ్చెడు సొమ్ము మూలుగుతోంది… […]
మిస్టర్ రానా… ఇదేం పరేషాన్‌ర భయ్… ఇది తెలంగాణ బ్రాండ్ మూవీయా..?
రానా… కాస్త డిఫరెంట్ మెంటాలిటీ… తన పాత్రల ఎంపిక గట్రా తనను ఇండస్ట్రీలో ఓ భిన్నమైన మనిషిగా పట్టిస్తాయి… తను ఓ చిన్న చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాడూ అంటే, తన టేస్ట్ ప్రకారం కాస్త బెటర్ ఎంపికే అయి ఉంటుంది అనుకుంటాం… పరేషాన్ అనే మూవీ మీద అందుకే కాస్త ఇంట్రస్ట్ జనరేటైంది… తీరా సినిమా చూశాక రానా చాయిస్ మీద, తన టేస్ట్ మీద జాలేస్తుంది… రానా నాయుడు పాత్రతో ఒకటీరెండు మెట్లు దిగజారగా, పరేషన్ […]
ఉత్సవాల్లో నమస్తే హిందు… తెలుగు ప్రాంతీయ పత్రికలు వంద రెట్లు బెటర్..!!
రాహుల్ అనే ఓ సీనియర్ జర్నలిస్టు… కేసీయార్ తన ప్రెస్మీట్లలో రాహుల్‌ను పేరుపెట్టి పిలిచి మరీ ప్రస్తావించేవాడు… తను రిటైరయ్యాడు… కేసీయార్ ఉదారంగా ఏదో ఓ పదవి ఇస్తాడనే ప్రచారం నిన్న సోషల్ మీడియాలో బాగా సాగింది… ఉద్యోగి అన్న తరువాత రిటైర్ కావడం సహజం… దాని మీద ఈ చర్చ కూడా అనవసరం… కేసీయార్ తనకు పదవి ఇవ్వాలనుకుంటే ఎప్పుడో ఇచ్చేసేవాడు బహుశా… కానీ రాహుల్ మీద చర్చించిన సోషల్ మీడియా సదరు పత్రిక ఆఫీసును […]
ఆక్రందనలింకా ఆగనేలేదు… అప్పుడే పొలిటికల్ గద్దలు నోళ్లు విప్పినయ్…
క్షుద్ర రాజకీయాలు మళ్లీ ఆరంభమయ్యాయి… బాలాసోర్ రైల్వే ప్రమాదంలో మృతుల శవాలు ఇంకా బోగీల కిందే ఉండిపోయాయి… తీవ్రంగా గాయపడిన వాళ్ల ఆక్రందనలు కొనసాగుతూనే ఉన్నాయి… రాష్ట్ర, కేంద్ర విపత్తు దళాలు అవిశ్రాంతంగా సహాయకచర్యల్లో శ్రమిస్తూనే ఉన్నాయి… అప్పుడే టీఎంసీ మొదలు పెట్టింది… మమతా బెనర్జీకి ఏమూలో బుర్రలో కాస్త గుజ్జు ఉందనే డౌటుండేది… అదీ లేదని ఇప్పుడు స్పష్టమైంది… 300 మందికి పైగా (ఇంకా ఎక్కువే ఉంటారు) మరణించిన ఘోర ప్రమాదం ఇది… నాలుగు రాష్ట్రాల […]
మొత్తానికి ఆదిపురుష్ ప్రభాస్ సేఫ్… భారీ బేరాలతో నిర్మాతలు గట్టెక్కేశారు…
బహుశా ఈ దేశ ప్రేక్షకులు ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్‌ను తిట్టినంతంగా మరే దర్శకుడినీ తిట్టి ఉండరు… అత్యంత భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఆదిపురుష్ సినిమా ట్రెయిలర్ల దగ్గర నుంచీ విమర్శల జోరు ఆగలేదు… యానిమేషన్ సినిమాల నుంచి కొన్ని సీన్లను యథాతథంగా తీసుకుని, ఆదిపురుష్‌లో పేస్ట్ చేసేశాడు… ట్రోలింగ్, విమర్శలు, తిట్ల ధాటికి దడుచుకుని… గ్రాఫిక్స్ మెరుగుపరుస్తాను, మరో రెండొందల కోట్లు ఇవ్వండి అంటూ ఓం రౌత్ కొన్నాళ్లు మాయం… అసలే 500 కోట్ల బడ్జెట్ […]
కృత్రిమ మేధ… ప్రయోగపరీక్షలో ఆ డ్రోన్ ఆపరేటర్‌నే హతం చేసింది…
ఇప్పుడు టెక్నాలజీపరంగా పదే పదే వినిపిస్తున్న మాట… కృత్రిమ మేధ… అనగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్…! చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ వంటి సెర్చ్ బేస్డ్ ఏఐ ప్లాట్‌ఫారాలే కాదు… ప్రతి రంగంలోకీ ఈ కృత్రిమ మేధ వ్యాపిస్తోంది… ఇది క్రమేపీ మనిషి బుర్రను చంపేస్తుందనీ, టెక్నాలజీ మీదే మనిషి పూర్తిగా ఆధారపడి, సొంతంగా ఆలోచించే తెలివిని కోల్పోతాడనీ భయాందోళనల్ని పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే కదా… ప్రభుత్వ పాలసీల్ని నిర్దేశించే బ్యూరోక్రాట్లు, ప్రభుత్వంలో ఉండే […]
రాసలీల వేళ- రాయబారమేల…. ఈ పాటలో ‘లక్స్ పాప’ కిక్కేముందని…
Sai Vamshi…. హీరోల రీరిలీజ్ సినిమాలు – ఓ ‘జలికట్టు’ కాన్సెప్ట్ ….. జూన్ 10న బాలకృష్ణ గారి పుట్టినరోజు. ఆ రోజు ‘నరసింహనాయుడు’ సినిమా రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పోయినేడాది ఆయన పుట్టినరోజున ‘చెన్నకేశవరెడ్డి’ రీరిలీజ్ చేశారు. ఈ సంగతులు విన్నప్పుడు బాలకృష్ణ గారికి స్టార్డమ్ తెచ్చిన ‘మంగమ్మ గారి మనవడు’, తెలుగులో తొలి సైంటిఫిక్ చిత్రం ‘ఆదిత్య 369’ లాంటి సినిమాలు రిలీజ్ చేయొచ్చు కదా అనిపించింది. మొన్న మార్చిలో చిరంజీవి గారి […]
నీ పదములే చాలు రామా… ఈ పాట గాయకురాలి గురించి తెలుసా మీకు..?
Bharadwaja Rangavajhala……… మనసైన చెలీ పిలుపూ … జయసింహలో టీవీరాజుగారు చేసిన అద్భుత ట్యూన్లలో ఒకటి. బాలసరస్వతిగారి గాత్రంతో పాటు ఎపి కోమలగారి కంఠమూ వినిపిస్తుందా పాటలో. తెర మీద వహీదా రెహ్మాన్ ఎంత అందంగా కనిపిస్తుందో అంతకు మించి అందంగా వినిపిస్తుందీ పాట. రాజుగారి స్వరాల్లో కాస్త హిందూస్తానీ వాసనలు ప్రధానంగా మరాఠీ నాటకాల పట్టు విడుపులూ కనిపిస్తాయి. అందుకే ఆయన చేసిన పాటలు కాస్త ప్రత్యేకంగా వినిపిస్తాయి. ఇంతకీ విషయం ఏమిటంటే .. ఎపి కోమల పూర్తి […]
ఫాఫం రామానాయుడు… అసలు ఈ దగ్గుబాటి వారసులకు ఏమైంది హఠాత్తుగా..?
రామానాయుడు తెలివిమంతుడు… పిల్లల్లో ఎవరి భవిష్యత్తు ఏమిటో తెలుసాయనకు… అందుకే అప్పట్లోనే స్టూడియో, సినిమా నిర్మాణ వ్యవహారాలు, ఆర్థికం అంతా సురేష్ బాబుకు వదిలేశాడు… వెంకటేష్‌ను నటనలోకి దింపాడు… రానాకు సినిమాల పట్ల ఉన్న ప్యాషన్ గమనించి, నీకు నచ్చిన పాత్రలు పోషించు అన్నాడు, అంతే తప్ప నిర్బంధంగా ఓ హీరోగా ప్రేక్షకుల మీద రుద్దలేదు… రానా సోదరుడు అభిరామ్‌ను హీరోగానే కాదు, అసలు సినిమా సెట్ల దగ్గరకే రానిచ్చేవారు కాదు… నటి శ్రీరెడ్డి వివాదాస్పద వీడియోలు, […]
తెలంగాణ వస్తుందని ఎవరు చెప్పినా… ఎకసక్కేలతో వెక్కిరింపులు సాగేవి…
Murali Buddha……… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళుతున్నాను .. తెలంగాణ రాష్ట్రంతోనే తిరిగి వస్తాను .. కోట్ల మందికి విశ్వాసం కలిగించి .. ఆత్మహత్యలను ఆపిన ఒక్క మాట……… జర్నలిస్ట్ జ్ఞాపకాలు… ————————- అంతా అయ్యాక ఇప్పుడు ఏ టుంరీలు ఏమైనా మాట్లాడవచ్చు . కానీ తెలంగాణ రాష్ట్రం అంత ఈజీగా ఏమీ రాలేదు . ప్రతి క్షణం సస్పెన్స్ .. నరాలు తెగేంత ఉత్కంఠ … ఏమవుతుందో తెలియని భయం .. మరో వైపు మాఫియా […]
ఈ కోట్ల ప్రజాధనానికి సార్థకత ఏమున్నట్టు..? పైగా అందులోనూ వివక్ష..!!
ఒక ప్రభుత్వం పత్రికలకు తన గొప్పతనాన్ని తనే పొగుడుకుంటూ ఎందుకు యాడ్స్ ఇవ్వాలి..? దాంతో ప్రజలకు ఒరిగేదేమిటి..? వాటికి ప్రజాధనం ఎందుకు ఖర్చు చేయాలి..? ఇవన్నీ బేసిక్ ప్రశ్నలు… మన పాలకుల నుంచి సమాధానం ఆశించలేం కాబట్టి… ఆ ప్రశ్నలను పక్కన పెట్టేయండి… ఒకప్పుడు సీఎం ఇమేజీ కోసం దేశంలోని అనేక భాషల్లో, అనేక ప్రాంతాల్లో పత్రికలకు కూడా వందల కోట్ల తెలంగాణ ప్రజల సొమ్మును ఖర్చు చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర అవతరణ […]
కెనడాలో మాఫియా వార్… టాప్ ఎలెవన్ గ్యాంగ్స్టర్లలో 9 మంది పంజాబీలే…
షకీల్ బస్రా, అమర్‌ప్రీత్ సమ్రా, జగదీప్ చీమా, రవీందర్ సమ్రా, బరిందర్ ధలివాల్, గురుప్రీత్ ధలివాల్, సమరూప్ గిల్, సుఖదీప్ పన్సల్, సమదీష్ గిల్, ఆండీ పియెరె, రిచర్డ్ జోసెఫ్ విట్లాక్…. మొత్తం పదకొండు మంది… ఇందులో ఆండీ, రిచర్డ్ తప్ప మిగతా 9 మందివీ పంజాబ్ రూట్స్… అందరూ సిక్కులే… వీళ్లెవరో చెప్పలేదు కదూ… కెనడా బేస్‌గా మాఫియా వ్యవహారాల్ని ఓ రేంజులో నడిపిస్తున్న బడా గ్యాంగ్స్టర్స్… కెనడాలో ఉన్న సిక్కులు 8 లక్షలు… అంటే […]
ఇలేకరుల ఇజ్జత్ తీసుడు తప్పితే ఏం ఒరగబెట్టినవో చెప్పు..!?
Shankar Rao Shenkesi………. ఏం జేసినవో చెప్పు!? ‘బక్క పల్సటి ప్యాదోన్ని..’ అంటూ నువ్వు బహిరంగ సభలల్ల మాట్లాడుతుంటే మా అసంటోనివేనని మస్తు ఖుష్ అయ్యేటోళ్లం ‘తెలంగాణ వచ్చుడో.. నేను సచ్చుడో..’ అని నువ్వు స్టేజీలపైన గర్జిస్తాంటే గొంతు కలుపుతూ బిగి పిడికిళ్లను గాలిలోకి ఎత్తెటోళ్లం నువ్వు లేసి ఉర్కినప్పుడు కలాలు చేబూని నీ యెంట ఉరికొచ్చినం నువ్వు కారణం చెప్పకుండా పన్నప్పుడు ఎప్పుడు లేస్తవోనని కన్నార్పకుండా ఎదురుచూసినం ఉద్యమంల హీరోగ ఎత్తిపట్టినం ప్రజలల్ల పల్సన కాకుండా […]
భార్యాభర్తలు ఇలా సంగీతంలో మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటారూ..?
Bharadwaja Rangavajhala…….. భార్యా భర్తలు ఇలా సంగీతంలో మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటారూ ? మొన్న మీరేమన్నారూ …. వలచి రాగంలో వెన్నెలరేయీ ఎంతో చలీ చలీ అన్లేదూ … అదెప్పటి మాట వేసవి రాకపూర్వం … ఇప్పుడు ఇందాక వర్షం పడ్డాక పరిస్తితి చూస్తుంటే … వలచిలోనే నా రాణి కనులలోనా అని పాడాలనుంది. సర్లెండి … ఎవరేనా వింటే నవ్వుతారు… వసంతగాలికి వలపులు రేగ అని పాడే వయసా మనది వలచి రాగంలోనే … అందుకే […]
దమ్మున్న మీడియా దీవించిందా..? ఐతే మరి మటాషే… చరిత్ర చెబుతోందిక్కడ…
Murali Buddha…….. దమ్మున్న మీడియా దీవిస్తే ఎవరైనా మటాషే ….. విజయశాంతి నుంచి షర్మిల వరకు సేమ్ రిజల్ట్స్ జర్నలిస్ట్ జ్ఞాపకాలు- —————— షర్మిల పార్టీని కాంగ్రెస్ లో కలిపేయమని ఒకరు పిలుపు ఇస్తే , ఆంధ్ర కాంగ్రెస్ లో చేరమని మరొకరి పిలుపు . ప్రతిరోజు ఆంధ్రజ్యోతి మొదటి పేజీని అలంకరించి , సీఎంలను మించి ఆ మీడియాలో ప్రాధాన్యత పొందిన షర్మిలకు ఎన్ని సీట్లు అనే చర్చ నుంచి అసలు ఆమె పోటీ చేస్తుందా […]
TV9 vs NTV…. టీవీ9 మురిపాలు, సంబరాలకు పెద్ద బ్రేక్… ఓవరాక్షన్‌కు తెర…
రెండు తెలుగు న్యూస్ చానెళ్ల పోటీ రక్తికడుతోంది… ఇప్పుడు జనం టీవీ9 మూణ్నాళ్ల సంబురాలు చూసి నవ్వుకుంటున్నారు… ఆ సంబరాల్లో శుష్కత్వం చూస్తే ఒకింత జాలి కూడా కలుగుతోంది… విషయంలోకి వస్తే… తాజా బార్క్ రేటింగుల్లో ఎన్టీవీ టీవీ9 చానెల్‌కు కిందకుపడదోసి, తను నంబర్ వన్ స్థానంలోకి వచ్చి కూర్చుంది… అదేమిటి..? ఇంతకీ ఎవరు నంబర్ వన్..? అనేదేనా మీ ప్రశ్న… ఒకసారి ఈ ఆట జరిగిన క్రమాన్ని చూద్దాం… ఎన్నేళ్లుగానో టీవీ9 తెలుగు న్యూస్ చానెళ్లలో […]
కేసీయార్ సార్.., పనిలోపనిగా ఇదే ఊపులో ‘బ్రాహ్మణబంధు’ ప్రకటించండి సార్…
Nancharaiah Merugumala……….. తెలంగాణ ‘విప్రహిత’ ముఖ్యమంత్రి కేసీఆర్… త్వరలో ‘బ్రాహ్మణ బంధు’ ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు! ………………….. తెలంగాణ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు శుక్రవారం (2023 జూన్ 2) పదో ఏడాదిలోకి అడుగుబెడుతున్నారు. ఈ గొప్ప సందర్భానికి ముందు బుధవారం ఆయన హైదరాబాద్ గోపనపల్లిలో ఆరెకరాల విస్తీర్ణంలో నిర్మించిన ‘విప్రహిత’ బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించడం డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన గొప్ప పుణ్యకార్యం. తెలంగాణ […]
మిస్సింగ్ హత్యలు… ఎన్టీయార్ సర్కారు ప్రవేశపెట్టిన కొత్తరకం హత్యాకాండ…
Bharadwaja Rangavajhala…….. ఎన్టీఆర్ శతజయంతి సంవత్సర సందర్భంగా …. ఎన్టీఆర్ హయాంలో మొదలైన మిస్సింగ్ హత్యలు …. నక్సలైట్లే దేశభక్తులు అని ఎన్నికల సభల్లో ప్రకటించి అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ …. పాలనలో అంతకు ముందున్న కాంగ్రెస్ పాలనలో లేని ఓ కొత్త పద్దతిని ఎన్టీఆర్ పోలీసులు అమల్లోకి తీసుకువచ్చారు. అదేమిటీ అంటే …. మనుషుల్ని మాయం చేసి చంపేయడం … ఎవరైనా అడిగితే మాకేం తెల్సూ అని బుకాయించడం. లాకప్పు మరణాలు , గుంపుల మీద […]
మనం మనంలా లేం… గొంతులు పూడుకుపోయిన తెలంగాణ పోరాట జర్నలిజం…
పదేళ్ళ తెలంగాణా రాష్ట్ర ఉత్సవాల సందర్భంగా రాజకీయలకు లోబడి జర్నలిస్టుల స్వతంత్ర కార్యాచరణ వీగిపోయిందని, అందులో ఎక్కువ నష్టపోయింది మొట్ట మొదటగా లేచి నిలబడిన, ఉద్యమ చేతన గల ‘తెలంగాణా జర్నలిస్టు ఫోరం’ అని, వాస్తవానికి “తెలంగాణా కోసమే తెలంగాణ జర్నలిస్టులు” అన్న డిమాండ్ తో ఏర్పడిన ఈ సంస్థ వైఫల్యం మామూలు విషయం కాదని నేరుగా చెప్పక తప్పదు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వైఫల్యాలను చెప్పుకోవడంలో పునరాలోచన, ఒక మెలుకువ తిరిగి మరింత బాధ్యతగా నడుచుకోవడానికి […]
- « Previous Page
- 1
- …
- 236
- 237
- 238
- 239
- 240
- …
- 482
- Next Page »