. సంఘంలో పెళ్లి తొలి అధికారిక కాంట్రాక్ట్. పెళ్లి గొప్ప వ్యవస్థ. కానీ పెళ్లి చేయడం పెద్ద అవస్థ. సరైన సంబంధం దొరకడం కష్టం. దొరికినది సరైన సంబంధం అవునో కాదో తేల్చుకోవడం మరో కష్టం. ఇదివరకు పెళ్ళి చూపుల్లో అమ్మాయి గొంతు వినడానికి పాట పాడమనేవారు. కాలు వంకర లేదని రుజువు చేసుకోవడానికి నడవమనేవారు. వంట వచ్చో లేదో ఏదో ఒక రకంగా కనుక్కునేవారు. కుట్లు అల్లికల్లాంటివేమైనా వచ్చా? అని అడిగేవారు. ముగ్గులు వేయగలవా? కళ్ళాపి […]
కథే కాదు… కథానాయకుడి లుక్కు కూడా ముఖ్యమే కొన్నిసార్లు…
. Subramanyam Dogiparthi …….. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో అనే పాట వినగానే గుర్తుకొస్తుంది ఈ జస్టిస్ చౌదరి సినిమా . జస్టిస్ చౌదరి సినిమా అనగానే గుర్తుకొస్తుంది ఈ పాట . అంత ఐకానిక్ సాంగ్ . ఈ పాటలో యన్టీఆర్ హావభావాలు , నటన సూపర్బ్ . చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా గొప్ప మ్యూజికల్ హిట్ కూడా . ఈ సినిమాలోని పాటల విశేషం ఏమిటంటే సినిమాలో […]
ఢిల్లీ గెలుపు వెనుక చాణక్యుడు..! నవీన్ పట్నాయక్ మాజీ శిష్యుడు..!
. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు మీద నేషనల్ మీడియాలో చాలా విశ్లేషణలు వచ్చాయి… కొన్ని రొటీన్ ఫార్ములా రివ్యూలు… ప్రభుత్వ వ్యతిరేక వోటు పనిచేసిందనీ, కేజ్రీవాల్ పార్టీ నుంచి నాయకుల్ని బీజేపీ కొనేసిందనీ, కేజ్రీవాల్‌పై అవినీతి కేసుల ప్రభావం బాగా పడిందనీ… ఇలా… ఒక విశ్లేషణ కాస్త డిఫరెంటుగా… ఒక వ్యక్తిని ఫోకస్ చేసింది… ఆ వ్యక్తి చాణక్యం వల్లే ఢిల్లీలో బీజేపీ గెలవగలిగిందని దాని సారాంశం… గత రెండు ఎన్నికల్లో ఓసారి 67, […]
ప్రమోషన్లు, పబ్లిసిటీ ఖర్చు, థియేటర్ కరెంటు బిల్లులూ నో రికవరీ..!!
. కేరళ సినిమా పూర్తిగా దెబ్బతిన్నది… ఇక సినిమాలు తీయలేం… ఇవేం పారితోషికాలు..? ఇంత నిర్మాణ ఖర్చు ఎలా రికవరీ… అంటూ నిర్మాతలు లబోదిబో… అవసరమైతే మొత్తం సినిమాలపై బ్యాన్ పెట్టుకుంటాం, నో షూటింగ్స్, నో మోర్ న్యూ ప్రాజెక్ట్స్ అంటున్నారు కదా… నిజానికి అది ప్రతి భాష ఇండస్ట్రీలోనూ ఉన్నదే… తమిళం, తెలుగు అయితే మరీ దారుణం… హీరోల రెమ్యునరేషన్లు మరీ అడ్డగోలు… టికెట్ల ధర పెంపుతో అదంతా ప్రేక్షకుల జేబుల నుంచి వసూళ్లు… ఎవడు […]
అందరినీ మెచ్చుకుంటున్నాం సరే… మరి ఈ తోపు విలన్ మాటేంటి..?!
. ఓ మిత్రుడి సీరియస్ ప్రశ్న… ‘అందరూ ఛావా సినిమా మీద ఏదేదో రాస్తున్నారు… తిట్టేవాళ్లు, మెచ్చుకునేవాళ్లు, ప్రమోట్ చేసేవాళ్లు, సోషల్ మీడియాలో ఏకిపారేసేవాళ్లు… అవన్నీ పక్కన పెట్టండి కాసేపు… వీక్కీ కౌశల్ నటనను ఆకాశానికెత్తుతున్నారు… అహో ఆంధ్ర భోజా అన్నట్టు కీర్తిస్తున్నారు… దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్, సంగత దర్శకుడు ఏఆర్ రెహమాన్లనూ పొగుడుతున్నారు… కానీ ఒక్కరిని అందరూ విస్మరిస్తున్నారు, అన్యాయం కదా’’ ఇదీ తన ఫ్లో… ఎవరిని విస్మరిస్తున్నారు..? నేషనల్ క్రష్ అని పేరు తెచ్చుకున్న […]
ధనుష్ మేనల్లుడి లాంచింగ్… ఓ తేలికపాటి కథ, పాత్రతో నడిపించేశాడు…
. ధనుష్ హీరో మాత్రమే కాదు… మంచి దర్శకుడు, నిర్మాత అనుకుంటాం కదా… ఈమేరకు తన సినిమా అంటే కాస్త ఏదైనా మంచి సోషల్ ఇతివృత్తంతో వస్తాడేమో అని ఆశించడమూ సహజమే కదా… కానీ..? ఏమనుకున్నాడో… తను నటనకు దూరంగా ఉండి, తన మేనల్లుడు 22 ఏళ్ల పవిష్ నారాయణ్‌ను లాంచ్ చేసే సినిమా కదా, సీరియస్ కంటెంట్ ఎందుకులే అనుకున్నాడో… ఆ బరువు కొత్త కథానాయకుడు మోయలేడని అనుకున్నాడో గానీ ఓ ప్రేమ కథ రాసేసి, […]
హీరో కదా… 48 బ్యాక్ లాగ్స్ అట… ఫేక్ సర్టిఫికెట్లతో ఉత్తమ ఉద్యోగి…
. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఫంక్షన్లోనే కదా… ఓ తెలుగు నిర్మాత కాయలు పళ్లు అని ఏవో పిచ్చి కూతలు కూసింది… తరువాత ఏదో విఫల సమర్థనకు ప్రయత్నించాడా లేదా తెలియదు గానీ… ఇంతకీ ఆ సినిమా ఎలా ఉంది..? అది ఓ డబ్బింగ్ సినిమా… ప్రదీప్ రంగనాథన్ అనబడు ఓ తమిళ వర్ధమాన నటుడు మెయిన్ లీడ్… పర్లేదు, బాగానే ఈజ్ ఉంది… బాగానే చేశాడు… అనుపమ పరమేశ్వరన్ మనకు తెలిసిన నటే […]
ఛావా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్… వసూళ్లు, టికెట్ల లెక్కలే చెబుతున్నయ్…
. అబ్బే, అదంతా చరిత్ర వక్రీకరణ… మతోన్మాదాన్ని పెచ్చరిల్లచేయడానికి తీసిన సినిమా… ఫక్తు కాషాయ ఎజెండా… ఆర్ఎస్ఎస్ ప్రమోట్ చేస్తోంది… వసూళ్ల లెక్కలూ తప్పు… ఇలాంటి డొల్ల విశ్లేషణలు ఛావా సినిమా మీద చాలా కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో… తప్పు… కాషాయ ఎజెండాతో తీసిన ప్రతి సినిమా సక్సెసైందా మరి..? అంతెందుకు..? సాక్షాత్తూ మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో స్వయంగా చూసి, ప్రమోషన్‌కు పరోక్షంగా సహకరించాలి అనుకున్న ది సబర్మతి […]
ధన్‌రాజ్… కొన్నిచోట్ల నిరాశపర్చినా ఓవరాల్‌గా నీ సినిమా పాస్…
. రామం రాఘవం… ఈ సినిమా మీద రివ్యూయర్ల ఆసక్తి ఉండానికి కారణం… ధన్‌రాజ్… బలగం వేణుగా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ వేణు సమకాలీనుడు ధన్‌రాజ్… ఒక జబర్దస్త్ కమెడియన్ నుంచి బలగం వంటి ఎమోషనల్ సినిమా రావడం విశేషమే… సినిమాలో ఆ దమ్ముంది… అలాగే ధన్‌రాజ్ కూడా ఓ మంచి సినిమాను ప్రజెంట్ చేశాడేమో అనేదే ఆసక్తి… తను కూడా జబర్దస్త్ కమెడియనే ఒకప్పుడు, తరువాత ఇతరత్రా కామెడీ షోలు చేశాడు, కొన్ని సినిమాలు చేశాడు… […]
నో సెన్సార్… నో కత్తెర… బాలయ్య బాదుడు స్టెప్పులు యథాతథం..!!
. నిజానికి ఎన్డీటీవీ న్యూస్ వెబ్సైట్లో అంత అనాలోచితంగా ఎలా రాస్తార్రా బాబూ ఈ వార్తను అనుకున్నాను దాన్ని చదవగానే… కానీ కొద్ది గంటల్లోనే దానంతటదే ఆ న్యూస్ డిలిట్ కొట్టేసింది… అంటే, సదరు సినిమాకు సంబంధించిన వాళ్లు బలంగా దాన్ని ఖండించి ఉండాలి… లేదా మేం తప్పు రాశాం అని లెంపలేసుకుని ఆ స్టోరీ డిలిట్ కొట్టి ఉండాలి… అప్పుడే అర్థమైంది వాళ్లు రాసిన మొదటి స్టోరీలో నిజం లేదని..! విషయం ఏమిటంటే..? బాలయ్య నటించిన […]
సారీ బ్రహ్మాజీ… నీ బాపు సినిమా పక్కా ఇన్సెన్సిబుల్… ఇన్సెన్సిటివ్…
. 1. సీరియస్, సెన్సిటివ్ విషయాలను కామెడీగా చెప్పాలనుకోవడమే తప్పు… తప్పున్నర… ఇన్సెన్సిటివ్, ఇన్సెన్సిబుల్… 2. ఒకవేళ అది సరిగ్గా చెప్పగలిగితే జనంలోకి బలంగా వెళ్లగలదు అనుకుంటే… దానికి సరైన, పద్దతైన స్క్రీన్ ప్లే, ప్రజెంటేషన్ అవసరం… తెలుగు సినిమాజనానికి అది ఎప్పుడూ చేతకాలేదు, కాదు కూడా… 3. బలగం సినిమా వేరు… అది బంధాలకు సంబంధించిన సినిమా… పైగా దాని ప్రజెంటేషన్ జనానికి వెంటనే ఎక్కేలా ఉంటుంది… దాంతో బాపు అనే తాజా సినిమాను పోల్చడం […]
భలేవారండీ మీరు…! ఈడీకీ కాపీ రైట్‌కూ లింక్ ఏమిటంటారేంటి…?
. . ముందుగా ఓ వార్త చదవండి…. ‘‘ప్రసిద్ధ తమిళ దర్శకుడు (నిజమే, జస్ట్, ఓ తమిళ దర్శకుడు మాత్రమే…) శంకర్‌కు ఈడీ షాక్ ఇచ్చింది… రోబో సినిమాకు సంబంధించి కాపీ రైట్ వివాదంలో ఈడీ తనకు సంబంధించిన 10 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది… ఈనెల 17న మనీలాండరింగ్ చట్టానికి సంబంధించి ఈ చర్య తీసుకుంది… కాపీ రైట్ నిబంధనలను ఉల్లంఘించే కేసుల్లో స్థిరాస్తుల స్వాధీనం ఇదే మొదటిసారి అనీ ఈడీ ఓ ప్రకటనలో చెప్పుకుంది… […]
షార్ట్ టరమ్ ముఖ్యమంత్రులు… ఒకాయన మరీ ఒకేఒకరోజు సీఎం…
. Siva Racharla …… ఒకే ఒక్కడు సినిమా… ఒక్కరోజు ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరు? సరిగ్గా 27 సంవత్సరాల కిందట ఇదే రోజు ఏమి జరిగింది? రేఖా గుప్తా నుంచి సుష్మా స్వరాజ్ వరకు… నిన్న ఢిల్లీ సీఎంగా బీజేపీ నేత రేఖా గుప్త ప్రమాణ స్వీకారం చేశారు. 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న NDA కూటమి తరపున సీఎం అయిన ఏకైక మహిళా నేత రేఖా గుప్త… (వర్తమానంలో)… ఈ సందర్భంగా ఢిల్లీకి చివరి సీఎంగా […]
సో, జగన్ రైట్… ఆదానీ రైట్… ఆ ఒప్పందం రైట్… మోడీ సూపర్ రైట్…
. అవును, రాజకీయాలంటే అంతే… ఒక విషయం మీద నిర్ణయాలపై ప్రభుత్వం మీద పదే పదే అవినీతి ఆరోపణలు చేస్తుంది ఒక పార్టీ… తీరా తను అధికారంలోకి వచ్చాక అవే ఆరోపణల్ని విడిచిపెట్టేసి, ఆ నిర్ణయాలపై తనే ఆమోద్రముద్ర వేస్తుంది,.. మరి ఆ ఆరోపణలు అబద్ధం అని అంగీకరించినట్టేనా..? విషయం ఏమిటంటే..? జగన్ హయాంలో సెకితో కుదిరిన ఒప్పందం వల్ల ప్రజలపై లక్ష కోట్ల రూపాయల మేర భారం పడుతుంది అని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది టీడీపీ… […]
నిజమే… ఏబీఎన్ నుంచి వెంకటకృష్ణ వైదొలుగుతున్నాడు..!
. ఓ వార్త ఆసక్తికరంగా అనిపించింది… ఏబీఎన్ నుంచి న్యూస్ డిబేట్ ప్రజెంటర్ పర్వతనేని వెంకటకృష్ణ వైదొలుగుతున్నాడు అని… తరచూ ఇలాంటి వార్తలు యూట్యూబులో మూడేళ్ల నుంచీ కనిపిస్తూనే ఉన్నాయి… వెళ్లగొట్టబడ్డాడా, వెళ్లిపోతున్నాడా..? వంటి విశ్లేషణలూ కనిపించేవి… అందుకని మొదట నమ్మలేదు, కానీ నిజమే… తను ఏబీఎన్ చానెల్‌ను వదిలేస్తున్నది నిజమే… రూఢీ… ఐతే ఇంకా రాజీనామా పత్రాలు ఇవ్వలేదు, రాధాకృష్ణకు చెప్పలేదు… కానీ ఆయనకూ వేరేమార్గాల్లో తెలుసు వెంకటకృష్ణ వెళ్లిపోతాడు అని..! సరే, సంస్థ మీద […]
… చేజేతులా రైతుల్లో వ్యతిరేకత కొనితెచ్చుకునే రేవంత్ సర్కార్..!!
. చూడబోతే తెలంగాణలో అధికారులందరూ హైడ్రా రంగనాథ్‌నే ఆదర్శంగా తీసుకుంటున్నట్టున్నారు… రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ పాల శీతలీకరణ కేంద్రం మూసివేతలో ఉన్నతాధికారుల దుందుడుకు నిర్ణయాలే కారణమని అనిపిస్తోంది… అసలే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికార యంత్రాంగం మీద పట్టు చిక్కలేదు ఇప్పటికీ..! ఒకరిద్దరిపై కొరడా ఝలిపించి ఉంటే గాడిన పడేదేమో… మరోవైపు రైతుల్లో వ్యతిరేకత కూడా కనిపిస్తోంది ఊళ్లల్లో… కారణాలు అనేకం ఉండవచ్చుగాక… కానీ, ప్రభుత్వం మీద, పార్టీ మీద మరింత […]
‘సుత్తి’ కొడుతూనే… పిల్ల హీరోహీరోయిన్లతో… ఓ సిల్వర్ జుబిలీ…
. Subramanyam Dogiparthi ………. తెలుగు వారికి జంధ్యాల ఇచ్చిన సుత్తి , దాని పుట్టుక మరియు వివిధ రకములు . త్రేతాయుగంలో అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడిని అయోధ్యకు తిరిగొచ్చి పట్టాభిషిక్తుడివి కమ్మని భరతుడు ప్రార్ధిస్తాడు . అప్పుడు శ్రీరాముడు భరతుడికి తాను ఎందుకు తిరిగి రాలేనో , భరతుడే ఎందుకు రాజ్యపాలన చేసుకోవాలో తెలుపుతాడు . అంతా విన్న తర్వాత భరతుడు ఇంత సుత్తి వేయాలా అన్నయ్యా అని శ్రీరాముడితో అంటాడు . ఇలా మొదటిసారి […]
ఢిల్లీ ఫంక్షన్లో పవన్ కల్యాణ్‌కు మోడీ అమిత ప్రాధాన్యం… ఎందుకో..?!
. Paresh Turlapati ……….. ఇందాక టీవీల్లో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమం లైవ్ చూశా. అందులో ఒక దృశ్యం నన్ను ఆకర్షించింది ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన 12 రాష్ట్రాల బీజేపీ పాలిత సీఎంలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లతో సహా అందరూ వేదిక మీద మోడీని రిసీవ్ చేసుకోవడానికి రెండు చేతులూ జోడించి లైను లో నిలబడి ఉన్నారు మోడీ కూడా […]
సీఎం రేవంత్.., కనీసం ఈ ఇష్యూలోనైనా ధైర్యం చూపించగలవా..?!
. నేను కొడితే దెబ్బ మామూలుగా ఉండదు అన్నాడు కదా మొన్నామధ్య కేసీయార్… ఎందుకోగానీ హఠాత్తుగా గుర్తొచ్చాయి ఆ మాటలు… కాలేశ్వరం అక్రమాల మీద కేసు వేసిన రాజలింగం దారుణ హత్య వార్త చదివాక… లింక్ ఉందో లేదో తెలియదు, కానీ అంతకుముందు హైకోర్టు అడ్వొకేట్ల దంపతుల హత్య… రేపు విచారణ అనగా దారుణ హత్య… ఈరోజుకూ అది తేలలేదు, తేలదు, తేలుతుందనే నమ్మకమూ లేదు ఎవరికీ… ఆరోజు కేసీయార్ బర్త్ డే… ఇప్పుడు కేసీయార్ బర్త్‌డే […]
శివాజీలు, శంభాజీలు సరే… మన ప్రతాపరుద్రుడు ఎందరికి తెలుసు..?!
. Thummeti Raghothama Reddy ……… తెలుగు పట్టణాలలో నిన్న, చత్రపతి శివాజి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఆ ఉత్సవాల నిర్వాహకులు, బిజెపి కార్యకర్తలు. శివాజీ మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తన జీవితాంతం వరకు పోరాడాడు.అందులో సందేహం లేదు. అతని జయంతి వర్ధంతి జరపడానికి అర్హుడు. ఎక్కడ? మహారాష్ట్ర వ్యాప్తంగా! శివాజీ జయంతిని తెలుగు పట్టణాలలో జరపడం ఏమిటి? మహారాష్ట్ర వ్యాప్తంగా జరపాలి, కానీ గత దశాబ్ద కాలంగా, అంటే కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత, […]
- « Previous Page
- 1
- …
- 26
- 27
- 28
- 29
- 30
- …
- 489
- Next Page »