సినిమా నటుడు ఆలీ… ఇండస్ట్రీలో అందరికీ ఇష్టుడే… చిన్నప్పటి నుంచీ కష్టపడ్డాడు… కుటుంబాన్ని ఆదుకున్నాడు… పదిమందికీ సాయం చేస్తాడు… నవ్వుతూ, నవ్విస్తూ సాగిపోతున్నాడు… కానీ ఒక్కసారిగా తనకు తీవ్ర అసంతృప్తి… అదీ జగన్ వైపు నుంచి..! అసలు జగన్ పట్ల మద్దతుగా నిలిచిన సినిమావాళ్లు ఎవరున్నారు..? పోసాని వంటి ఒకటీరెండు కేరక్టర్లు తప్ప… పవన్ కల్యాణ్‌కు సన్నిహితుడైనా, చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నా ఆలీ జగన్‌కు మద్దతుగా ఉన్నాడు, పార్టీలో చేరాడు… మరి ఆ ఆలీకి జగన్ ఏం […]
పేరుకేనా అన్‌స్టాపబుల్..! అప్పుడే స్టాపా..? ఏదీ ఆ మూడో ఎపిసోడ్..?!
అదుగదుగో అన్‌స్టాపబుల్ తదుపరి ఎపిసోడ్లో అనుష్క… ఇక ఆహా ఓటీటీ దద్దరిల్లిపోవాల్సిందే అని వీరభక్తితో రాస్తూపోయాడు ఓ యూట్యూబర్… కానీ ఏది..? ఎక్కడ.? ప్రోమో ఏది..? అసలు ఆమె చాన్నాళ్లుగా ఏ ఇంటర్వ్యూలకూ రావడం లేదు… నో, నో, రోజాతో మూడో ఎపిసోడ్ రాబోతోంది… ఇక చూస్కో నా రాజా అని మరో వీరభక్తుడు థంబ్ నెయిల్ వెలిగించి మరీ వీడియో పెట్టేశాడు… అసలే జగన్ దగ్గర ఫుల్ మైనస్ మార్కుల్లో ఉంది ఆమె… సొంత నియోజకవర్గంలో […]
నెగెటివ్ ప్రచారంలోనూ స్టడీగా కాంతార… ఓ అరుదైన రికార్డు ఛేదన…
కాంతార సినిమాలోని సూపర్ హిట్ పాట ఓ ప్రైవేటు ఆల్బమ్ నవరసం పాటకు కాపీ అని ఓ వివాదం… లీగల్ నోటీసులు… మీడియా కవరేజీ… గతంలో ఇదే మంగుళూరు ప్రాంతం నుంచి వచ్చిన పింగారా సినిమాకు కాంతార కాపీ అని మరో వివాదం… ఆ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చిందట.,.. ఇప్పుడు దాన్ని తెలుగులోకి డబ్ చేసి వదులుతారట… దీనిపైనా మీడియా కవరేజీ… పనిలోపనిగా భూత్ కోళ సంప్రదాయానికీ హిందూ మతానికీ సంబంధం లేదని మరో […]
‘‘తన రెండు చేతులతోనూ తడిమింది, నిమిరింది.., ఉన్నట్టుండి గభీగభీమని గుద్దింది..’’
‘‘భీముడు ఎదురుగా నిలబడగానే పాలకటకంటి అతని రెండు భుజాలను బిగువుగా పట్టుకుంది… అదే శక్తిమంతమైన చేతిపట్టు… అనంతరం ఒళ్లూ, చేతులూ, ముఖాలను తన రెండు చేతులతోనూ తడిమి, నిమిరి, ఉన్నట్టుండి పక్కకు అడుగువేసి వీపు మీద ఏడెనిమిదిసార్లు గుద్దింది… ముఖం బిరుసెక్కింది… కళ్లు ఎరుపయ్యాయి… నోట్లో ఊరకే భీమ, భీమా అనుకుంటూ రెండు చేతుల్ని పిడికిళ్లు బిగించి గుద్దింది… అతను ఊరకే తలవంచి నిల్చున్నాడు… పిడికిలి సడలించి వీపు మీద, రెట్టల మీద ఫటఫటా పదే పదే […]
పక్కా స్క్రిప్టే…! చివరలో ఎవరిదో డబుల్ గేమ్…! మొత్తం ప్లాన్ ఉల్టాపల్టా…?
సోషల్ మీడియాలోని ఇరువర్గాల బురదను… మీడియాలో పుంఖానుపుంఖాలుగా వచ్చిపడిన వార్తల వరదను… ఎంత పరిశీలించినా అర్థం కాని ప్రశ్నలు కొన్ని అలాగే ఉండిపోయాయి… వాటికి జవాబులు తెలిస్తే తప్ప అసలు ఈ స్కామ్ ఏమిటో, స్కీమ్ ఏమిటో అంతుపట్టదు… 1) జస్ట్, నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందా..? అబద్ధం… 2) ఇప్పటికిప్పుడు వాళ్లతో మునుగోడు ఉపఎన్నికలో పొలిటికల్ ఫాయిదా ఏమైనా ఉంటుందా..? ఏమీలేదు… 3) మరి బీజేపీ ఆ నలుగుర్ని కొనేయడానికి అంత […]
హాహాశ్చర్యం..! ఆర్జీవీతో జగన్ బయోపిక్..! ఇదేమి కొత్త విపత్తు స్వామీ..?!
ఈరోజు వార్తల్లో ఆసక్తిగా అనిపించిందీ, జగన్‌ను చూస్తే జాలేసిందీ ఓ వార్త ఉంది… అదేమిటంటే..? రాంగోపాలవర్మ అనే ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు జగన్మోహన్రెడ్డి బయోపిక్ తీయబోతున్నాడట… తాడేపల్లికి వెళ్లి, జగన్‌తో భేటీ వేసి, సినిమా బడ్జెట్, కథ కమామిషూ మాట్లాడి, మీడియాకు చిక్కకుండా వెళ్లిపోయాడట… సినిమా పేరు జగన్నాథ రథచక్రాలు అట… వచ్చే ఎన్నికల్లో లబ్ది కోసం ఈ సినిమా ఉపయోగపడాలట… ఇన్ని ‘ట’లు ఎందుకంటే..? ఇవేవీ ధ్రువీకరించబడిన వార్తలు కావు కాబట్టి… ఇప్పుడప్పుడే ఎవరూ దీని […]
వావ్… మన కోహినూర్‌ను వాపస్ తీసుకురావడానికి భలే వీజీ ప్లాన్…
మన చుట్టూ ఆవరించిన ఉన్న అనేక సమస్యల్ని వర్తమాన వ్యవహారాలతో లింక్ చేసి జోకులు వేసి నవ్వుకోవడం ఆరోగ్యకరమైన హాస్యం… ఎవరినీ కించపరచాల్సిన అవసరం లేదు… మన క్రికెటర్ ఆశిష్ నెహ్రా, రిషి సునాక్ పోలికలతో వచ్చిన బోలెడు మీమ్స్ అలాంటివే… సరదాగా నవ్వుకోదగినవి… నెహ్రా అంటే గుర్తొచ్చింది… సాక్షి వాడైతే ఏకంగా ప్రధాని మోడీ, నెహ్రా కలిసి ఉన్న ఓ ఫోటోను సైటులో పెట్టిపారేశాడు… (సునాక్ ఫోటోల్లో కలిపేశాడు… పబ్లిష్ చేసేముందు ఎవరు నెహ్రాయో, ఎవరు […]
భేష్ ఈనాడు..! ఔనూ, ఈ భేటీతో సాయిరెడ్డికి అందిన సంకేతమేమిటి..?!
విమర్శించడానికి ‘ఈనాడు’ మీద బోలెడు అంశాలు దొరుకుతాయి… రోజురోజుకూ పతనమవుతున్న ప్రొఫెషనల్ ప్రమాణాలు, నాన్-ప్రొఫెషనల్ అంశాలు ఎట్సెట్రా… కానీ కొన్ని ప్రొఫెషనల్ టాస్కులు కూడా ఈనాడు మాత్రమే చేయగలదు… ఈనాడును చూసి వాతలు పెట్టుకునే ఆంధ్రజ్యోతికి, సాక్షికి అస్సలు చేతకావు అలాంటి టాస్కులు… మిగతా వాటికి పత్రికల లక్షణాలే లేవు… (తెలుగు మీడియాకు సంబంధించి…) 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్ని దేశం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట ఘనంగా నిర్వహించుకున్న సంగతి తెలిసిందే కదా… అదేదో బీజేపీ […]
అడుగులన్నీ మూడో ప్రపంచ యుద్ధం వైపే… ప్రత్యక్ష యుద్దానికి అమెరికా తహతహ…
పార్ధసారధి పోట్లూరి ……. మూడవ ప్రపంచ యుద్ధానికి సన్నాహాలు ? రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత, అంటే 80 ఏళ్ల తరువాత మొదటి సారిగా అమెరికాకి చెందిన 101వ ఎయిర్ బోర్న్ డివిజన్ [Screaming Eagles]కి చెందిన లైట్ ఇన్ఫాంట్రీ ఫోర్స్ [light infantry force] యూరోపు దేశం అయిన రొమేనియాలో దిగింది ! ఆర్డర్ ఇచ్చిన గంటలోపే అంతా సిద్ధం చేసుకొని రంగంలోకి దిగిపోతుంది ఈ ఫోర్స్! ఈ డివిజన్ రెండవ ప్రపంచ యుద్ధ […]
తమిళ సినిమాలో హిందీ పాట అనగానే… కాల్ మిస్టర్ పీబీ శ్రీనివాస్ అర్జెంట్లీ…
Bharadwaja Rangavajhala….. డెబ్బై దశకంలో తమిళ తెరను వెలిగించిన దర్శకుల్లో మహేంద్రన్ ఒకరు. ఆయన తీసిన చాలా సినిమాలు తెలుగులో అనువాదమై అలరించాయి. ఆయన చిత్రాల్లో కథలు చాలా వాస్తవికంగా ఉంటాయి. సహజత్వం దెబ్బతినకుండా ఎంటర్ టైనింగ్ గా కథ చెప్పడం ఆయన ప్రత్యేకత. దృశ్యం పొయిటిక్ గా ఉండేలా చూసుకునేవారు. గొప్ప భావుకుడు. ఆయన అసలు పేరు అలగ్జాండర్ . తెర పేరు మహేంద్రన్. శివాజీ తంగపతకం కథ ఆయనదే! కమర్షియల్ సినిమాని ఆర్ట్ సినిమా పద్దతిలో చూపించడం అనే […]
రామసేతు ఇటుకలు నీటిపై తేలతాయి… సినిమా మాత్రం ‘మునిగిపోయింది’…
సినిమాలకు సంబంధించిన బేసిక్ సూత్రం ఒకటే… కొత్త ఆసక్తికర విషయం చెప్పాలి లేదా తెలిసిన విషయాన్నే ఆసక్తికరంగా చెప్పాలి… ఓ నాసిరకం చెత్త కంటెంటును జనం ఆమోదించేలా చేయడం రాజమౌళికి తెలుసు… కానీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హిందూ పురాణాలకు లింకై ఉన్న కంటెంటు ఉండీ అక్షయ్ కుమార్ ఓ చెత్త సినిమాను జనం మీదకు వదిలాడు… నిజానికి చెత్త సినిమా అనే స్ట్రెయిట్ వ్యాఖ్య సరికాదు… రామసేతు సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుందని అనుకున్నారు, దాంట్లో […]
రిషి శునాక్ మూలాలు పాకిస్థానీ గడ్డమీద..! కాకపోతే అప్పటికి పాకిస్థాన్ లేదు..!
ఎన్నడూ లేనిది ఓ బ్రిటన్ ప్రధాని గురించి ఇంతగా చర్చించుకుంటున్నాం దేనికి..? మనవాడు కాబట్టి… ఇక్కడ మనవాడు అంటే ఏమిటి నిర్వచనం..? ఇండియాలో పెద్ద ఎత్తున తన గురించి చర్చ జరుగుతోంది… ముచ్చట్లు చెప్పుకుంటున్నాం, మనవాడు అని ఓన్ చేసుకుంటున్నాం, కానీ నిజానికి తన రూట్స్ ఇండియావేనా..? కావు..! పాకిస్థాన్‌వి..!! నిజమే… గుజ్రన్‌వాలా అని ఓ ఊరు… ఇండియా- పాకిస్థాన్ విభజన వేళ పాకిస్థాన్‌లో ఉంచారు… మరి అక్కడ చడీచప్పుడు లేదేం..? ఉండదు.,. ఎందుకంటే..? రిషి జన్మతః […]
ఓహ్… కాంతార సూపర్ హిట్ వరాహరూపం పాట ఈ ప్రైవేటు పాటకు కాపీయా..?
కాంతార సినిమా ఎంత హిట్టో తెలుసు కదా… అందులో చివరలో వచ్చే వరాహరూపం ఆ సినిమాకు ప్రాణం… ఇప్పుడు ఆ పాట వివాదంలో చిక్కుకుంది… కేరళలో చాలా పాపులర్ ప్రైవేటు మ్యూజిక్ కంపెనీ మాతృభూమి కప్పా టీవీ 2017లో రిలీజ్ చేసిన నవరసం పాటకు వరాహరూపం కాపీ అనేది తాజా వివాదం… దీనిపై సదరు కంపెనీ కాంతార నిర్మాతలు హొంబళె ఫిలిమ్స్‌పై, దర్శకుడిపై కేసులు వేయాలని భావిస్తోంది… 2 మిలియన్ల సబ్స్క్రయిబర్లున్న ఈ యూట్యూబ్ మ్యూజిక్ చానెల్‌కు […]
శ్రీముఖితో కాసేపు ఆడుకున్న రమ్యకృష్ణ… శేఖర్, యశ్ మాస్టర్స్ సరేసరి…
మనకున్న టీవీ యాంకర్లలో సీనియర్, ఫుల్ ఎనర్జిటిక్ శ్రీముఖి… ఎదుటోడు ఏమైనా అంటే, వెంటనే మీద పడి గాయి పట్టేసేంత టెంపర్మెంట్, స్పాంటేనిటీ కూడా…! కాకపోతే కయ్య కయ్య హైపిచ్చులో అరవడమే యాంకరింగు అనే దుర్ భ్రమల్లో ఉంటుంది… ఆమెతో రకరకాల ప్రోగ్రామ్స్ హోస్టింగ్ చేయించేవాళ్లూ అదే కోరుకుంటున్నారేమో బహుశా… పాపం డ్రెస్సింగు విషయంలో కూడా గతంలో ప్రోగ్రామ్‌ను బట్టి, పద్దతిగా డ్రెస్ సెన్స్‌తో కనిపించేది… ఆమధ్య బిగ్‌బాస్ షోకు వెళ్లివచ్చిన తరువాత కాస్త గాడితప్పినట్టుంది… ఎప్పుడూ […]
అది 1979… చిరంజీవికి గుర్తుందో లేదో… మోహన్‌బాబు కూడా సహనటుడు…
Bharadwaja Rangavajhala….. 2014 లో అనుకుంటా …. ప్రముఖ సినీ దర్శకుడు ఐఎన్ మూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు అనే వార్త చూశాను. అప్పటికి ఆయన వయసు సుమారు 89 సంవత్సరాలు. ఎవరీ ఐఎన్ మూర్తి అనుకుంటున్నారా … ఎన్టీఆర్ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన సీతారామకళ్యాణం చిత్రానికి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా వ్యవహరించారాయన. నిజానికి ఈ సినిమాకు దర్శకత్వం ఎన్టీఆర్ అని టైటిల్ కార్ట్స్ లో పడదు. అయినా అన్నగారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం అదే. […]
ఇదుగో ఇందుకే సోనియా ‘ట్రస్టుల’ లైసెన్సులను పీకేసింది హోం శాఖ..!!
పార్ధసారధి పోట్లూరి…… రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి FCRA అనుమతిని రద్దు చేసిన కేంద్ర హోమ్ శాఖ ! భారత హోమ్ మంత్రిత్వ శాఖ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి విదేశాల నుండి తీసుకునే విరాళాల మీద నిషేధం విధించింది ! రాజీవ్ ఫౌండేషన్ మరియు రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ఈ రెండూ కూడా NGO లు. ఈ రెండు సంస్థలు విదేశాల నుండి విరాళాలు సేకరించడం కోసం FCRA [Foreign Contribution (Regulation) Act] […]
నో బీఫ్… నో లిక్కర్… ఒకటీరెండు రోజులు ఉపవాసం… కానీ మస్తు వివాదాలు…
మనవాడు… అంటే..? మన కులం వాడా..? మన రాష్ట్రం వాడా..? మన గోత్రీకుడా..? ఎవరు మనవాడు..? మనవాడు బ్రిటన్ ప్రధాని అవుతున్నాడు అని కన్ఫరమ్ అయ్యేసరికి ఇక అందరూ మన సహజమైన అలవాటుకొద్దీ కులగోత్రాల అన్వేషణలో పడ్డారు… అక్కడికి తనకేదే పిల్లనిస్తున్నట్టు..! తను ప్రాక్టీసింగ్ హిందూ… అంటే ఆచరణాత్మక హిందువు… చివరకు పార్లమెంటులో ప్రమాణస్వీకారం కూడా భగవద్గీత సాక్షిగా చేశాడు… అంత ఆస్తికుడు… తన రూట్స్ మరిచిపోనివాడు… పేరు రిషి సునాక్… తల్లి, తండ్రి పేర్లు కూడా […]
దీపావళి షాపింగ్ మొత్తం ఆపేసిన విరాట్ కోహ్లీ… ఓ అరుదైన చార్ట్…
కొన్నిసార్లు అంతే… మామూలుగా చెబితే నమ్మం… కానీ అధికారిక గణాంకాల్లో చెబితే ఇక నమ్మక తప్పదు… అలాంటి నమ్మలేని నిజమే ఇది… నిన్నటి పాకిస్థాన్- ఇండియా టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచులో విరాట్ కోహ్లీ చేసిన పరుగుల తీరు, వాటి ప్రాధాన్యం, ప్రత్యేకించి ఆ చివరి ఓవర్ మీద ఈరోజుకూ ప్రపంచ క్రికెట్లో చర్చలు సాగుతూనే ఉన్నయ్… పాకిస్థాన్‌తో ఆట అంటే ఇండియన్ క్రికెట్ ప్రేమికులకు ఓ ఆట కాదు… ఓ ఉద్వేగం… చాన్నాళ్లుగా క్రికెట్ […]
మనవాడే తెల్లవాళ్లకు ప్రధాని… ఏదో ఈగో హేపీ… కానీ తను అంత పవర్‌ఫుల్లా..?!
ఆహా… మనల్ని ఎన్నోఏళ్లు నిర్దయగా పాలించిన ఆ తెల్ల దొరలను ఇప్పుడు మనం పాలించబోతున్నాం… ఇదేనా మీ ఆనందం..? రుషి సునాక్ బ్రిటన్ ప్రధాని అవుతున్నాడు… కింగ్ చార్లెస్ సంతకం చేయడమే తరువాయి రుషికి ప్రధాని కిరీటం అధికారికమవుతుంది… ప్రస్తుతం పోటీదారులు లేరు, పాత ప్రధానులు బోరిస్ తదితరులు కూడా పోటీ నుంచి విరమించుకున్నారు… సో, రుషి కుర్చీ ఎక్కడమే తరువాయి… ఇప్పటికీ తన హిందూ రూట్స్ మరవని మనిషి… ఇండియన్ కల్చర్ అంటే ప్రేమించే మనిషి… […]
ఇది కాదురా పండుగ అంటే..! ఫాఫం, కృష్ణంరాజుకు ఓ నాసిరకం నివాళి…!!
మిగతా టీవీలకు ఎలాగూ చేతకాలేదు… యాడ్స్ రాలేదేమో గానీ, ఎవ్వడూ దీపావళి స్పెషల్ షో ప్లాన్ చేయలేదు… మాటీవీ వాడు బిగ్‌బాస్ దీపావళి స్పెషల్ ప్లాన్ చేసి, ఆదివారం సాయంత్రం ఎలా భ్రష్టుపట్టించాడో చెప్పుకున్నాం కదా ఆల్రెడీ… కాస్త ఇలాంటి షోలలో కాస్త సీనియారిటీని, తన అనుభవాన్ని చూపే ఈటీవీ పూర్తిగా పండుగ ఉత్సాహాన్ని నాశనం చేసింది ఈసారి… ఇదికదా పండుగ అంటే శీర్షికతో 3 గంటల షో… యాంకర్లు ఎవరూ దిక్కులేరు కాబట్టి రష్మిని, ఆడవాళ్లూ […]
- « Previous Page
- 1
- …
- 280
- 281
- 282
- 283
- 284
- …
- 459
- Next Page »