పలు సినిమాల్లో అవకాశాల కోసం తిరిగీ తిరిగీ… నలిగీ నలిగీ… చివరకు మందలో ఒకడిగా నటించిన రోజుల నుంచి హీరోగా రవితేజ ప్రస్థానం చిన్నదేమీ కాదు… ఏ పాత్ర దొరికితే ఆ పాత్ర… కష్టపడేవాడు… నా ఆటోగ్రాఫ్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం వంటి సినిమాలు ఒకప్పుడు… తరువాత ఇమేజీ బందిఖానాలోకి చేరిపోయాడు… ప్రత్యేకించి రాజమౌళి విక్రమార్కుడు సినిమా తనను పెద్ద హీరోను చేసేసింది… ఇక ఆ తరువాత రవితేజ అంటే మొనాటనీ… ఫార్ములా… రొటీన్… తను ఏం […]
ఈ సంపూర్ణ నటుడికి గౌరవప్రదమైన తుది వీడ్కోలు పలకండర్రా కనీసం..!!
నిజంగా కైకాల సత్యనారాయణకు రావల్సినంత గుర్తింపు దక్కిందా..? ఎందుకో దక్కలేదనే అనిపిస్తోంది… ఒక ఎస్వీరంగారావులాగే తనూ వివక్షకు గురయ్యాడా..? 62 ఏళ్లపాటు సినిమా సెట్లలో ఉండి, 777 సినిమాలు చేయడం చిన్న విషయం ఏమీ కాదు… ఎప్పుడో 1959లో మొదలైన కెరీర్ మూడేళ్ల క్రితం నాటి మహర్షి వరకు… ఈ సంఖ్య అనితరసాధ్యం… కొందరికి మినహా… మరి ఆయనకు దక్కిన పురస్కారాలు..? ప్చ్, చెప్పదగినవేమీ లేవు… నిజానికి తను మొదట్లో హీరో… ఎన్టీయార్, ఏఎన్నార్లాగు స్ఫురద్రూపం… డైలాగ్ […]
ఇంట్రస్టింగ్ కరోనా స్టోరీ… గడగడా వణికించేది కాదు, ఊరటనిచ్చేది…
మీరు సున్నిత హృదయులా..? రాబోయే విపత్తులను తలుచుకుని బెంబేలెత్తిపోతుంటారా..? కొద్దిరోజులపాటు టీవీ9, ఏబీఎన్ వంటి పిచ్చి చానెళ్లను చూడటం మానేయండి… ఎంతసేపూ ఎంత మంది చస్తారు..? వేలా..? లక్షలా..? అదుగో ప్రళయం, ఇదుగో మహానాశనం వంటి మాటలే తప్ప పాజిటివ్ అనే పదమే తెలియని బుర్రలవి… చైనా పరిస్థితి ఇండియాలో తలెత్తితే ఎంతమందిని కరోనా కబళించవచ్చు అనే లెక్కలు, అంచనాల దాకా పోయాడు ఇండియాటుడే వాడు… సో, ఈ దిగువ వార్తను కాస్త జాగ్రత్తగా చదవండి… చైనాలో […]
ఓహ్… కాంతార రెండో భాగంపై అనుకోని ట్విస్టులు… శివ తండ్రి కథ అట…
ఒక వార్త ఇంట్రస్టింగుగా అనిపించింది… అందరూ కాంతార సీక్వెల్ గురించి అడుగుతున్నారు, రాస్తున్నారు కదా… తనలో రకరకాల ఆలోచనలు ఉన్నాయని, అవి ఇంకా ఓ ఫైనల్ షేప్‌కు రాలేదని రిషబ్ శెట్టి చెప్పి తప్పించుకుంటున్నాడు… ఈమధ్య పీటీఐతో మాట్లాడుతూ కాంతార నిర్మాత విజయ్ కిరంగదూర్ ‘‘కాంతార -2 ఉంటుంది… ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేను… అంతేకాదు, అది సీక్వెలా, ప్రీక్వెలా కూడా తేల్చుకోవాల్సి ఉంది…’’ అన్నాడు… హఠాత్తుగా తన నోటి వెంట ప్రీక్వెల్ మాట వచ్చేసరికి… ఇక అందరి […]
లాఠీతో విరగబాదిన విశాల్… అటు ఆకు రౌడీలను, ఇటు ప్రేక్షకులను…
కొందరు హీరోలు…., కాదులెండి… నటులు… అస్సలు మారరు… మారడానికి ప్రయత్నించరు… కాలం ఎంత మారినా వాళ్లు మారాలనే తపన ప్రదర్శించరు… అదే రొటీన్, రొడ్డుకొట్టుడు, ఫార్ములా, ఇమేజ్, చెత్తా కథలతో ప్రేక్షకులతో దాడి చేస్తూనే ఉంటారు… ఒరే నాన్నా… లోకం చాలా మారిందిరా, కాస్త నువ్వూ మారొచ్చు కదా అంటే వినరు… మరింత ఇరగబాదుతారు… లాఠీ సినిమా కూడా అదే… నిజానికి లాఠీ సినిమా ట్రెయిలర్ చూసినప్పుడే ఆ సినిమా మీద ఓ అభిప్రాయం ఏర్పడింది… కాపురం […]
హాస్టళ్లు టూరిస్ట్ హోమ్స్ ఏమీ కావు… ఇష్టారాజ్యంగా వచ్చిపోవడానికి…
చిన్న వార్తే… కానీ కేరళ సీపీఎం ప్రభుత్వాన్ని అభినందించాల్సిన వార్త… స్టోరీ ఏమిటంటే..? కొందరు మహిళా విద్యార్థినులు కోర్టుకెక్కారు… ‘‘కొజికోడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆంక్షలు పెడుతోంది… ఓ నోటీఫికేషన్ జారీ చేసింది… ఫిమేల్ స్టూడెంట్లు ఎవరూ తమ హాస్టళ్ల నుంచి రాత్రి 9.30 తరువాత బయట ఉండానికి వీల్లేదు అని… అవసరముంటే స్టడీ హాల్స్ వాడుకొండి, చదువుకొండి అంతేతప్ప ఇష్టమొచ్చినట్టు తిరగడానికి వీల్లేదు అని… ఇది అన్యాయం’’ అనేది వాళ్ల పిటిషన్… Kerala University for […]
జగన్‌పై చూపించే దురుసుతనం… కేసీయార్ పాలన మీద కిక్కుమనలేదేం…
రండి, రండి, వచ్చేయండి, పార్టీకి పునర్వైభవం తీసుకొద్దాం… అని చంద్రబాబు ఆవేశంగా తెలుగుదేశం కేడర్‌కు పిలుపునిచ్చాడు… నో డౌట్, ఖమ్మం మీటింగుకు జనం బాగానే వచ్చారు… అదేమిటో గానీ తెలంగాణలో మళ్లీ కాలు మోపాలని, రాజకీయం చేయాలని ఆశపడే ప్రతి ఆంధ్రా పార్టీకి ఖమ్మమే గుమ్మం… అటు వైఎస్పార్టీపి అక్కడే పార్టీ ఆఫీసు కట్టుకుంటోంది… తెలుగుదేశం అక్కడి నుంచే మళ్లీ ఆట స్టార్ట్ చేసింది… పాల్ కూడా త్వరలో పెద్ద మీటింగు పెడతాడు… జనసేనదే ఇంకా ఎటూ […]
ప్చ్… ఒయిజా బోర్డుతో ఆత్మతోపాటు ప్రేక్షకులు కూడా ‘కనెక్ట్’ కాలేదు…
ఓయిజా బోర్డు… OUIJA Board… ఆత్మలను పిలిచి మాట్లాడే ఓ మార్గం… నమ్మేవాళ్లు నమ్ముతారు… లేదంటే లేదు… దీని మీద చాలా కథలు, సినిమాలు వచ్చాయి… ఆ బోర్డు మీదకు వచ్చే ఆత్మలు డిస్టర్బ్ అవుతే వెళ్లిపోతాయి తప్ప వికటించి, ఆడేవాళ్లను ఆవహించవు… ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే… నయనతార ప్రధాన పాత్రలో కనెక్ట్ అనే సినిమా వచ్చింది… అందులో మరణించిన తన తండ్రి ఆత్మతో మాట్లాడాలని ఓయిజా బోర్డు ద్వారా ప్రయత్నిస్తుంది ఓ బిడ్డ… కానీ […]
ఉట్టికి ఎగిరారు సరే… ఆకాశానికి ఎగరలేక చతికిల..? పుష్ప ఫ్లాప్ కథ..!
ఆర్ఆర్ఆర్ జపాన్ భాషలోకి అనువదింపబడుతుంది… మస్తు హిట్ అవుతుందని ఏదో లెక్క చెబుతారు… పలు ఇండియన్ సినిమాలు చైనా భాష (మాండరిన్)లోకి అనువదింపబడతాయి… వేల కోట్లు వసూలు చేసినట్టు లెక్కలు చెబుతారు… పాన్ వరల్డ్ సినిమాల్లాగా ప్రచారం జరుగుతుంది… నిజంగా ఇండియన్ సినిమాను దేశదేశాల ప్రజలు అంత ఇష్టపడుతున్నారా..? ఈ పిచ్చి ఫైట్లు, ఈ తిక్క పాటల్ని నెత్తిన పెట్టుకుంటున్నారా..? లేక ఈ డబ్బింగుల పేరిట హవాలా, మనీలాండరింగు ఏమైనా జరుగుతోందా..? ఈడీకి ఇవెందుకు పట్టవు..? ఎంతసేపూ […]
అమ్మా రోజమ్మా… ఎటు వెళ్లినా ఈ జబర్దస్త్ తోకలు ఉండాల్సిందేనా..?
నిజంగా రోజాను చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది… నేను ఒక రాష్ట్రానికి మంత్రిని అనే సోయి ఏమీ కనిపించదు… వేదిక దొరికితే డాన్సు చేస్తుంది… మాట్లాడితే చాలు ఆ ఈటీవీ జబర్దస్త్ టీంను వెంటేసుకుని తిరుగుతుంది… తను ఇంకా జబర్దస్త్ జడ్జినే అనీ, జగన్ పేరుతో కాదు, జబర్దస్త్ ఫేమ్‌తో గెలిచాను అని నమ్ముతున్నట్టుంది బలంగా… జగన్ ప్రత్యర్థి రామోజీ… రామోజీ చానెల్ ఈటీవీ… ఈటీవీ ప్రోగ్రాం జబర్దస్త్… మరి ఆ షోను పదే పదే ఎందుకు ప్రమోట్ చేస్తుంది […]
కేసీయార్ సార్.., ఈయన సేవలు నిజంగా వైద్యారోగ్య శాఖకు అవసరమా..?!
హమ్మయ్య… అంతటి విధ్వంసకారి కరోనా నుంచి ఈ ప్రపంచం ఎలా రక్షింపబడిందా అని ఇన్నాళ్లూ సందేహం ఉండేది… ఇప్పుడు అలాంటి సందేహాలన్నీ తీర్చేశాడు కేసీయార్ అభిమాన వైద్యాధికారి శ్రీనివాసరావు… వేక్సిన్లు, మందులు, డాక్టర్ల వల్ల కాదట… కేవలం ఏసు క్రీస్తు కృపవల్లే కరోనా పారిపోయిందట… ష్, మరి చైనాను వణికిస్తూ, మళ్లీ ప్రపంచం మీద పడగ జాపుతున్న కొత్త వేరియంట్ మాటేమిటని అడక్కండి… సారు గారికి కోపమొస్తుంది… నిజానికి ఈయన ఫస్ట్ నుంచీ వివాదాస్పదుడే… అటు హరీష్‌రావు […]
నిజానికి ఫస్ట్ మార్చాల్సింది ఈ బిగ్‌బాస్ చెత్తా టీంను… హోస్టును కాదు…
నాగార్జునలో ఉన్న బ్యూటీ ఏమిటంటే..? ఈ వయస్సులో కూడా ఆ స్టామినా మెయింటెయిన్ చేయడం ఒక్కటే కాదు… బిగ్‌బాస్ హౌజులో ఉన్నవాళ్లతో మాట్లాడేటప్పుడు ఎక్కడా పొల్లు మాట మాట్లాడడు… కానీ కమాండ్ ఉంటుంది… నవ్వే చోట నవ్వుతూ, సీరియస్‌గా ఉండేచోట అలాగే ఉంటూ… సరదాగా ఆడిస్తూ… పర్ఫెక్ట్ ప్రోగ్రాం హోస్ట్ తను… సీనియర్ నటుడు, ఓ స్టూడియో అధినేత, ఇద్దరు హీరోల తండ్రి, ఈరోజుకూ కాస్తోకూస్తో హీరోగా డిమాండ్… అలా సహజంగానే నాగార్జున మాట్లాడుతుంటే హౌజులో ఉన్న […]
కాంతార హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి తప్పుచేసింది ఎక్కడ అంటే..?
16 కోట్ల బడ్జెట్ సినిమా… అనితరసాధ్యమైన రీతిలో తెరకెక్కించాడు… దర్శకుడు తనే… హీరో తనే… సినిమా ఓ కొత్త చరిత్ర సృష్టిస్తూ 460 కోట్లు వసూలు చేసింది… కానీ కాంతార దర్శకుడు రిషబ్ శెట్టికి దక్కిందేమిటి..? హొంబళె ఫిల్మ్స్ వాళ్లు రిషబ్ శ్రమను, ప్రయాసను, క్రియేటివిటీనీ లైట్ తీసుకున్నారా..? రిషబ్ శెట్టికి దక్కింది ముష్టి మాత్రమేనా..? ఇదీ కన్నడ మీడియాలో కొత్త చర్చ… ఈ చర్చ ఉద్దేశపూర్వకమా..? నిజంగానే రిషబ్ శెట్టికి అన్యాయం జరిగిందా..? నిజానికి రిషబ్ […]
ఒకేరోజు సాక్షి మూడు పత్రికలు… మరి జగన్ సార్ బర్త్‌డేనా… మజాకా…?!
ఏపీలో చిత్తూరు, విజయవాడ, గుంటూరు ఎడిషన్లలో సాక్షి పాఠకులకు మూడు పత్రికల్ని ఇచ్చింది… అరె, కన్ఫ్యూజ్ కావద్దు సుమీ… మూడు సాక్షి పత్రికలు, సేమ్ కాదు, వేర్వేరు పత్రికల్ని ఇచ్చింది… మొత్తం ఎన్ని పేజీలో తెలుసా..? 42 పేజీలు… టైమ్స్ వంటి పత్రికలు కొన్ని సందర్భాల్లో అన్ని పేజీలను ఇచ్చాయి, పెద్ద విశేషం ఏముంది అంటారా..? 42 పేజీలను ఒకే బంచ్‌గా కాదు, మూడు పత్రికలుగా ఇచ్చింది… ఒకటి 16 పేజీలు, మరొకటి 14 పేజీలు, ఇంకొకటి […]
నీవేమో విలువైన పైసలు.., వేరే నిర్మాతలవి పెంకాసులా నయనతారా..?!
ఎంత తోపు హీరోతో నటించినా సరే… ఎంత భారీ సినిమా అయినా సరే… ఎంత పెద్ద బ్యానర్ అయినా సరే… ప్రమోషన్ వర్క్‌కు, అంటే ప్రిరిలీజ్ ఫంక్షన్లు, ట్రెయిలర్ రిలీజులు, ఆడియో రిలీజులు, పోస్టర్ రిలీజులు గట్రా ప్రోగ్రాములకు నయనతార హాజరయ్యేది కాదు… ససేమిరా… సైట్లు, మీడియా, యూట్యూబర్ల ఇంటర్వ్యూలకు కూడా నో చెప్పేది… ఒకసారి సినిమా షూటింగ్ అయిపోయిందంటే ఖతం… ఇక అది ఏమైపోయినా తనకు పట్టేది కాదు… సైరా, గాడ్‌ఫాదర్ సినిమాలకు కూడా సింగిల్ […]
ఈడీ రివర్స్ గేమ్..! రోహిత్‌రెడ్డే కాదు, మిగతా ఆ ముగ్గురిపైనా గురి..!?
అన్ని పత్రికల్లోనూ సేమ్ వార్త… బీఆర్ఎస్ పార్టీవర్గాలు పేర్కొన్నట్టుగా… అంటే పార్టీయే ఆఫ్ ది రికార్డుగా పంపించిన నోట్ కావచ్చు బహుశా… త్వరలో ఎన్నికలు జరగనున్న ఆరు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ, రైతు విభాగాల ఏర్పాటు, పలు రాష్ట్రాలకు చెందిన నేతలు ఢిల్లీలో కేసీయార్‌ను కలిశారు, ఏపీ నుంచి కూడా బోలెడు మంది, వేగంగా బీఆర్ఎస్ భావజాల వ్యాప్తి… సేమ్, ఇదే కంటెంటు… ఇవన్నీ నిజంగా జరుగుతూ ఉంటే, మీడియా తనంతటతనే రాయాలి, అంతేతప్ప ఇలా రాయించుకుంటే […]
మనిషి జీవితాన్నే చిన్నాభిన్నం చేస్తున్న స్మార్ట్ ఫోన్… షాకింగ్ సర్వే…
Kapilavai Ravinder…… ఫేస్బుక్ వాల్ నుంచి సేకరణ… బంధాలను బలితీస్తున్న స్మార్ట్ ఫోన్.. నిద్రలేచిన 15 నిమిషాల్లో 84శాతం మంది అదే చేస్తున్నారట..!! ఈరోజుల్లో భార్యభర్తల మధ్య గొడవలు జరగడానికి ప్రధాన కారణం.. టైమ్ ఇవ్వడం లేదు అనే ఉంటుంది.. ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు.. కానీ ఆఫ్‌డేస్‌లో అయినా ఒకరితో ఒకరు టైమ్ స్పెండ్ చేస్తారా అంటే ఎవరి ఫోన్ వారు వాడుతుంటారు. ఇది సవితి పోరు కంటే దారుణం.. బంధాలను సెల్‌ఫోన్ బద్నాం చేస్తుందని […]
ఒకే ఒక సినిమా… ఫుల్ స్టాప్… నేనూ నా సంగీతం… అదే నా ప్రపంచం…
ఒకే ఒక సినిమా చేసేసి, ఆ తరువాత సినిమాలకు గుడ్ బై కొట్టేసి, ఇతర రంగాల్లో సెటిలైన వాళ్లు ఉన్నారా..? అదీ హీరోయిన్లు… ఒకసారి ఆ మేకప్పులు, లైట్లు, ఆ పాపులారిటీ పాత కాలం విస్కీలా ఎక్కేసి, ఇక అవకాశాల కోసం ఇండస్ట్రీలోనే చక్కర్లు కొడుతుంటారు సాధారణంగా… కానీ కొందరు ఆ ప్రలోభాల్లో పడరు… ఎస్పీ శైలజ ఒకే ఒక్క సినిమా చేసింది… అదీ విశ్వనాథ్ మొహమాటానికి… సాగరసంగమం… తను ట్రెయిన్డ్ డాన్సర్, ట్రెయిన్డ్ సింగర్ కాబట్టి […]
నటుడు త్రిపురనేని సాయిచంద్ కాలినడక దీక్ష… ఆలోచన మంచిదే…
ప్రముఖ సీనియర్ నటుడు, త్రిపురనేని రామస్వామి వారసుడు సాయిచంద్ కాలినడక దీక్ష కొనసాగిస్తున్నారు. అయిదవ రోజైన సోమవారం నాడు సూళ్లూరుపేట, గూడూరు దాటి పొట్టి శ్రీరాములు స్వగ్రామం ప్రకాశం జిల్లా పడమటిపల్లె వైపు అడుగులు వేస్తున్నారు. తెలుగువారి కోసం పొట్టిశ్రీరాములు చేసిన ప్రాణత్యాగాన్ని ప్రభుత్వాలు కానీ పౌరసమాజం కానీ ఇంతవరకూ పట్టించుకోలేదన్న ఆవేదనతో ఈ నెల 15 తేదీన మైలాపూర్ లో బులుసు సాంబమూర్తి (పొట్టి శ్రీరాములు తుది శ్వాస విడిచిన చోటు) నివాసం నుంచి కాలినడక […]
ఆ ఇద్దరు మెగా ‘జయా’ల నడుమ… ఈ కుర్ర రాశి ఎలా ఇరికింది బాలయ్యా…
నో డౌట్… తెలుగు టీవీల్లో నప్పతట్ల సెలెబ్రిటీలు పలు చాట్షోలు చేశారు… ఏదో పైపైన సరదాగా నడిచిపోయాయి… కానీ విస్తృత ప్రజాదరణ పొందుతున్నది మాత్రం ఆహా ఓటీటీలో వచ్చే బాలయ్య అన్‌స్టాపబుల్ షో… వాళ్లేదో డిజిటల్ వ్యూస్ అని ఏవో తప్పుడు లెక్కలు ప్రచారం చేసుకుంటారు, వాటి నిజనిర్ధారణకు ఎలాగూ మనకు చాన్స్ లేదు… సినిమా వాళ్ల వసూళ్ల సంగతి తెలుసు కదా… ఇవీ అంతే… బట్, బాలయ్య షో సూపర్ హిట్… అయితే..? ఫస్ట్ సీజన్ […]
- « Previous Page
- 1
- …
- 287
- 288
- 289
- 290
- 291
- …
- 482
- Next Page »