************************* ప్రచారం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత అభివృద్దిలో హైదరాబాద్ దేశంలోనే “నంబర్-1” వాస్తవం: ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ సాధించిన అభివృద్దికన్నా, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ది దిగజారింది. ************************* ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆంధ్ర పాలకుల వ్యతిరేకత మొదటి నుండీ హైదరాబాద్ నగరం చుట్టే తిరిగేది. హైదరాబాద్ నగరం అభివృద్దిలో తమపాత్ర ఉందనే కన్నా, తమ వల్లే హైదారాబాద్ నగర అభివృద్ది జరిగిందని ఆంధ్రా పాలకులు చెప్పుకోవడం తెలంగాణ ప్రజలకు మింగుడుపడేది కాదు. తమవల్లే […]
దర్శకుడు విశ్వనాథ్, గాయకుడు ఎస్పీ బాలుతో బంధుత్వం ఎలాగంటే..?
Bharadwaja Rangavajhala…… తెలుగు తెర చంద్రుడు… చంద్రమోహన్ గా పాపులర్ అయిన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా స్వర్ణయుగపు మేలి గురుతు . బిఎన్ దర్శకత్వంలో నటించి ఇప్పటికీ మనకు మిగిలి ఉన్న నటుల్లో ఆయన ఒకరు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించాడు. ఈ రోజుకీ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. […]
చంద్రమోహన్ అంటే చంద్రమోహనే… ఏ తోక పురస్కారాలూ లేవు…
... అవసరమైన విషయాలను వదిలేసి అనవసరమైనవి గుర్తు పెట్టుకోవడంలో ప్రపంచంలో తెలుగు వాళ్లని కొట్టేవాడు లేడు. తెలుగు వాళ్లకు భలే భలే విషయాలు గుర్తుంటాయి. అసలు విషయాలు, అతి ముఖ్యమైన సంగతులు మాత్రం అరిచి గీపెట్టినా గుర్తుండవు. ఫలానా ఆవిడ ఫలానా ఆయనతో తిరుగుతోంది, ఫలానా అతను ఫలానా ఇంటి ముందు రాత్రిపూట తచ్చాడాడు, ఫలానా వాళ్లు విడాకులు తీసుకున్నారు, ఫలానా ఆవిడకు పెళ్లయినా కాళ్లకు మెట్టెలు లేవేంటి.. ఇలా సవాలక్ష విషయాలు మన జ్ఞానగ్రంథుల్లో తచ్చాడుతూ […]
భోలే షావలి ఔట్… చిత్రమైన కేరక్టర్… విచిత్రమైన మాట, పాట ధోరణి…
భోలే షావలి… బిగ్‌బాస్ హౌజ్ నుంచి వెళ్లగొట్టబడ్డాడు… అనగా ఎలిమినేటెడ్… ఎవిక్టెడ్ బిగ్‌బాస్ భాషలో… ఊహిస్తున్నదే, కానీ హౌజులో ఉన్న కొందరికన్నా తను ఇంకొన్నాళ్లు ఉండటానికి మరీ అనర్హుడేమీ కాదు… కొనసాగనివ్వాల్సింది… గాయకుడు… తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా… మ్యూజిక్ కంపోజర్ కూడా… కాకపోతే ఫోక్ స్టయిల్… అప్పటికప్పుడు నాలుగు పదాలు కూర్చగలడు, రాగయుక్తంగా పాడగలడు… కానీ ఏమాటకామాట బిగ్‌బాస్ వంటి ఆటకు తను సూట్ కాడు… తను ఈ ఏడో సీజన్లోకి మిడిల్ ఎంట్రీ… ఫస్ట్ జాబితాలో […]
జర్నలిస్టు సంక్షేమం దిశలో కేసీయార్, జగన్… దొందూ దొందే…
Va Sam వాల్ మీద కనిపించిన ఓ పోస్ట్ ఒకసారి పూర్తిగా చదవండి… జర్నలిస్టులకు వైఎస్ ఇచ్చిన ఇళ్లస్థలాల విధానంబెట్టిదనిన… 2009లో చివరిసారిగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. వైఎస్సార్ మొదటి విడత పాలన ముగింపు దశలో ఇది జరిగింది. ఇప్పుడు మళ్లీ ఆయన తనయుడు జగన్ పాలనలో ఇళ్లస్థలాల కోసం జీవో కేటాయించారు. కానీ ఆనాటి విధానంతో పోలిస్తే నేటి జీవోలో పేర్కొన్న నిబంధనలు అనేకం కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి జర్నలిస్టుల సంఘాలను భాగస్వామ్యం చేస్తూ, […]
ఇదీ అదీ అని ఏదీ లేదు… ఏది కాదు, ఏదైనా సరే… అదే చంద్రమోహన్…
చంద్రమోహన్… మరణించాడనే వార్త అయ్యో అనిపించింది గానీ ఆశ్చర్యం అనిపించలేదు… నిష్ఠురంగా ఉన్నా సరే, ఊహిస్తున్నదే… ఆమధ్య కొన్ని సైట్లు, యూట్యూబ్ గొట్టాలు ఆయన్ని చంపేశాయి కూడా… చాన్నాళ్లుగా తను అనారోగ్యంతో బాధపడుతున్నాడు… సగటు ఆయుఃప్రమాణం బాగా పెరిగిన ఈరోజుల్లో 82 ఏళ్ల వయస్సు మరీ ఎక్కువేమీ కాదు… తెలుగు సినిమాల చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని రాసుకున్న చంద్రమోహన్ గురించి ‘ఇదీ’ అని ఏమీ చెప్పలేం… ఆయన ‘అన్నీ’… ఏది కాదు అనడగాల్సిన కెరీర్… బాగా […]
సృష్టికి ప్రతిసృష్టి ఎప్పుడూ డేంజరే… అప్పుడప్పుడూ ప్రాణాంతకాలు కూడా…
Ruthless Robo: వెనుకటికి ఒక బద్దకస్థుడు ఏ పనయినా చిటికెలో చేసి పెట్టే దయ్యం కోసం ఘోరమయిన వామాచార అభిచార హోమం చేశాడు. అతడి హోమానికి మెచ్చి దయ్యం ప్రత్యక్షమయ్యింది. “నాకు నా పళ్లు తోముకోవడం కూడా బద్దకమే. ఎప్పుడూ నా వెంట ఉండి…నేను నోటితో చెప్పడం ఆలస్యం…నువ్వు ఆ పనులన్నీ చేసి పెడుతూ ఉండాలి” అన్నాడు. “దానికేమి భాగ్యం! అలాగే. అయితే- ఒక షరతు. నాకు పనులు చెబుతూనే ఉండాలి. పనులు చెప్పనప్పుడు… నేను నిన్ను మింగేస్తాను…లేదా అదృశ్యం అయిపోతాను” అంది. […]
జపాన్..! అడ్డదిడ్డం కథలో అడ్డగోలు ‘అతి’ సీన్లు… అబ్బే, బిలో యావరేజ్…
హీరోయిన్ అనూ ఇమాన్యుయేల్ ఎందుకు ఉందో అర్థం కాదు ఈ సినిమాలో… ఆ పాత్రకు ప్రాధాన్యం లేదు, హఠాత్తుగా అంతర్ధానం… మెయిన్ విలన్‌గా మన కమెడియన్ సునీల్… వేషధారణ నప్పలేదు… పెద్దగా ఇంప్రెసివ్ పాత్ర కాదు… ఇవే కాదు, కొన్ని పాత్రలు అలా వస్తాయి, ఇలా వెళ్తాయి… ఏ పాత్ర ఎందుకొస్తుందో తెలియదు… సినిమా అయిపోయాక థియేటర్ బయటికొచ్చాక చాలా పాత్రలు గుర్తు కూడా ఉండవు… అదేనండీ, మనం జపాన్ అనే సినిమా గురించి చెప్పుకుంటున్నాం… ఎప్పటిలాగే […]
బిహారీ కుర్మీ..! కేసీయార్ కులం మీద రేవంత్ అనుచిత, అడ్డగోలు వ్యాఖ్యలు..!
Nancharaiah Merugumala……. “కేసీఆర్ బిహారీ కుర్మీ, విజయనగరం మీదుగా తెలంగాణకొచ్చిన ఫ్యామిలీ ఆయనది, కేసీఆర్‌ది బిహార్ డీఎన్యే , బిహార్ డీఎన్యే కన్నా తెలంగాణ డీఎన్యే మేలైనది” రేవంత్‌రెడ్డి ఇంత అడ్డగోలుగా మాట్లాడినా కంట్రోలు చేయని ఇండియాటుడే రాహుల్ కవల్ ……………………………………….. బుధవారం హైదరాబాద్‌లో ఇంగ్లిష్ న్యూజ్ చానల్ ఇండియా టుడే ‘తెలంగాణ రౌండ్‌టేబుల్’ పేరుతో నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికలపై నడిపిన చర్చాగోష్ఠిలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి నోటికి అడ్డూఅదుపూ లేకుండా మాట్లాడాడు. […]
అక్కడ ఈటల రాజేందర్ మరో సువేందు అధికారి అవుతాడా..?
శీర్షిక చూసి… ఎవరు ఆ సువేందు అధికారి..? ఏమా కథ అనుకోకండి… సువేందు అధికారి పశ్చిమబెంగాల్ నాాయకుడు… మొదట్లో కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ఆరంభించినా తరువాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాడు… ఎమ్మెల్యే, తరువాత మంత్రి… ఆ తరువాత బీజేపీ అధికారంలోకి వస్తుందని భ్రమపడి, బీజేపీలో చేరాడు… మమతను బీజేపీ అధికారం నుంచి కొట్టలేకపోయింది కానీ సువేందు మాత్రం ఏకంగా మమత బెనర్జీనే ఓడించాడు… దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించాడు… ప్రస్తుతం బెంగాల్ ప్రతిపక్ష నేత ఆయన… […]
ఎన్నికల ప్రచార పర్వంలో అభ్యర్థుల ‘సాగరసంగమం భంగిమలు’…
Gimmicks: ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు రోడ్డు మీద అట్లకాడ చేతబట్టి దోసెలు వేస్తారు. బట్టలు ఇస్త్రీ చేస్తారు. ఆటో నడుపుతారు. పళ్లమ్ముతారు. బస్సులో ప్రయాణిస్తారు. బైక్ నడుపుతారు. దుక్కి దున్ని, నీరు నిలిపిన బురద పొలంలోకి దిగి నాట్లు వేస్తారు. కొడవలి చేతబట్టి కోతలు కోస్తారు. చెబితే బాగోదు కానీ…ఇంకా ఏవేవో చేస్తూ ఉంటారు. గెలిచాక, ఓడిన తరువాత అదే అభ్యర్థులు అవే పనులు చేయాలని మనం కోరుకోము. ఒకవేళ మనం కోరుకున్నా వారు చేయరు. అంటే ఎన్నికల ప్రచారంలో కొంత […]
అవి నేను ఎస్.వరలక్ష్మితో లేచిపోవాలని ప్లాన్ చేస్తున్న రోజులు…
అక్షర తేజోమూర్తి సాక్షాత్కారం A close encounter with Raavi Shastri ———————————————- అవి నేను ఎస్.వరలక్ష్మితో లేచిపోదామని ప్లాన్ చేస్తున్న రోజులు! అహో!..ఏమా గొంతు! ఏం నవ్వు! ఏం చూపు! వేళాపాళా లేకుండా నడుచుకుంటూ వచ్చేసేదావిడ కలల్లోకి…నీ సరి విలాసులు జగాన లేనే లేరుగా, “వేయి శుభములు కలుగు నీకు” అని పాడుకుంటూ… మనశ్శాంతి లేకుండా చేసేది. లీలా కృష్ణుని నీ లీలలుగని…అని ఒకసారి, “వరాల బేరమయా..” అని మరోసారి పాడేది. మరువమూ.., మార్దవమూ.. ఆ […]
బభ్రాజమానం భజగోవిందం… ఎవరికి వోటేస్తే నిజంగా ఎవరికి సపోర్ట్..?
మిత్రుడు Bharadwaja Rangavajhala వ్యంగ్యంగా ఏమంటాడంటే… ‘‘ఎవరికి ఓటేయాలి అనే మీమాంస వద్దు! అద్వైతంగా ఆలోచన చేయండి … సైకిల్ ఓటుబ్యాంకును హస్తానికి అమ్మేసుకున్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న టీగ్లాసు మద్దత్తుతో పోటీ చేస్తున్న కమలంతో లాలూచీ పడ్డ కారు గుర్తుకే మీ ఓటు…’’ చదవగానే నవ్వొచ్చినా… నిజంగానే తెలంగాణలో ఓ వింత పరిస్థితి… ఎలాగంటే..? టీడీపీ పోటీచేయడం లేదు, కాంగ్రెస్‌కు అనుకూలించడం కోసం… బహిరంగంగా చెప్పకపోయినా, ప్రకటించకపోయినా, ఇప్పుడు పోటీచేసే స్థితిలో లేమంటూ ఆ జాతీయ పార్టీ చెప్పుకున్నా సరే… ఆ […]
కర్నాటక డీకే శివకుమార్ మరో జయలలిత కాబోతున్నాడా..? చూడబోతే అదే..!!
వేడెక్కుతున్న కర్ణాటక రాజకీయం! కాంగ్రెస్ అంటే ముఠా తగాదాల రాజకీయం! కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు సహజమే! దానికి మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని ప్రచారం చేసుకుంటుంది! అసలు రెండు లేదా మూడు వర్గాలుగా చీలిపోయి పాలన చేసిన రాష్ట్రాలు ఉన్నాయి గతంలో! కర్ణాటకలో కూడా ప్రస్తుతం అదే ట్రెండ్ నడుస్తున్నది! ************************* కర్ణాటక కాంగ్రెస్ లో రెండు పవర్ హౌస్ లు ఉన్నాయి! సిద్ధరామయ్య, డీకే శివకుమార్… పేరుకే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి! తనకి, […]
పాకిస్థాన్ ఇంటికే… న్యూజిలాండ్‌తోనే ఇండియా సెమీ సమరం…
ఒకప్పుడు శ్రీలంక, ఇంగ్లండ్ వంటి జట్లతో పోటీ అంటే మాంచి థ్రిల్ ఉండేది… కానీ ఇప్పుడవి తుస్… మరీ ఇంగ్లండ్ అయితే డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి, అనేక ఓటములతో అసలు క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండేనా అనే సందేహాల్లో పడేసింది అందరినీ… ఆస్ట్రేలియాతో, న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ మ్యాచులు కొంతకాలంగా ఎన్నో చూశాం కదా… చివరి బంతి వరకూ అదే థ్రిల్… నిజానికి పాకిస్థాన్ కూడా ఒకప్పుడు సూపర్ జట్టే… ఇంగ్లండ్, శ్రీలంకలతో పోలిస్తే ఇప్పటికీ ఇది […]
ఏమిటీ గుద్దుడు..? వోట్లు గుద్దుడా..? ఎవరినైనా గుద్దుడా..? పార్టీని గుద్దుడా..?
ఓహ్… ఇప్పుడర్థమైంది… ఆంధ్రప్రభ ఎందుకింత హడావుడిగా స్మార్ట్ ఎడిషన్లు తీసుకొచ్చిందో… ఎన్నికల దాకా పొద్దున, మధ్యాహ్నం, రాత్రి భజన చేయడానికా..? ఈరోజు తమ స్మార్ట్ ఎడిషన్‌లో ఓ స్టోరీ, దానికి హెడ్డింగ్ చదివాక నవ్వొచ్చింది… శీర్షిక ఏమిటంటే… ‘‘గులుగుడు గులుగుడే… గుద్దుడు గుద్దుడే…’’ గుడ్, గులుగుడు వంటి తెలంగాణ పదాలు శీర్షికల్లోకి అర్థవంతంగా తీసుకురావడం వరకు గుడ్… ఇది ప్యూర్ భజన వార్త… కేసీయార్ కోసం వండబడిన కథనం… కంటెంట్, ప్రజెంటేషన్ అన్నీ అదే చెబుతాయి… కానీ […]
గెలిచేది ఎవరో ఓ పార్టీ లీడర్… అంతిమంగా ఓడిపోయేది వోటరు..!!
The Losers: ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలైనా ఉండవచ్చుగాక. మనల్ను మనం పాలించుకోవడంలో ప్రజాస్వామ్యానికి మించిన మెరుగైన ప్రత్యామ్నాయం లేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకం. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, శాంతియుతంగా, ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా, ధనబలం, భుజబలం లేకుండా, మద్యం పోసి ఓటర్లను మత్తులోకి తోయకుండా జరగాలన్నది ఆదర్శం. అలా జరగడం అసాధ్యం అని అందరికీ తెలుసు. కాబట్టి ఎన్నికల్లో ఎవరు తక్కువ అక్రమాలు, అరాచకాలు, డబ్బు ఖర్చు చేస్తే వారు గొప్పవారుగా చలామణి అయ్యే రోజులొచ్చాయి. ఓటుకు నోటు […]
నువ్వు సూపర్ లాయర్ సాబ్… ఈరోజుల్లో నీలాంటోళ్లు అత్యంత అరుదు…
ఈ వార్త నిజానికి ఇంకా ప్రాధాన్యతతో మీడియాలో కనిపించి ఉండాలి… ఈరోజు పత్రికల్లో, న్యూస్ సైట్లలో కనిపించిన అన్ని వార్తల్లోకెల్లా జనానికి చాలా పాజిటివ్‌గా కనెక్టవుతున్న వార్త ఇది… విషయం ఏమిటంటే..? కేరళలో ఉత్తర పాలక్కడ్ జిల్లాకు చెందిన ఈయన ఓ న్యాయవాది… పేరు పి.బాలసుబ్రహ్మణ్యన్ మేనన్… ఆయన ఇప్పుడు గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కాడు… మొన్నటి సెప్టెంబరు 11న ఆ రికార్డు నమోదైంది… ఒక న్యాయవాదిగా ఇంత రికార్డు కాలం ప్రాక్టీసులో ఉన్నది తనేనట… అదీ […]
అతను- ఆట – ఓ తమిళమ్మాయి… రన్స్ సునామీ మ్యాక్స్‌వెల్ ప్రేమకథ ఇదే…
యవరాజ్సింగ్కు బ్రిటిష్ యువతి హాజెల్ కీచ్ పరిచయం అయ్యాక చాలా ఏళ్లు పట్టింది వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడానికి… అసలు మధ్యలో కొన్నేళ్లు వాళ్లు మాట్లాడుకోలేదు, కలవలేదు కూడా… కానీ రాసిపెట్టి ఉంది… తరువాత దగ్గరయ్యారు, ఏళ్ల డేటింగ్ తరువాత ఒక్కటయ్యారు… నేను పంజాబీ కోడలిని అని మురిపెంగా చెప్పుకుంటుంది ఇప్పుడు హాజెల్… దీన్ని రివర్స్‌లో చెప్పుకుంటే… అంటే ఆ బ్రిటిష్ యువతి ప్లేసులో ఆస్ట్రేలియన్ క్రికెట్ హీరో గ్లెన్ మాక్స్వెల్… యువరాజ్ ప్లేసులో మిన్నీ రామన్… మాక్స్వెల్ […]
ఆ మెరుపు కళ్ల మందస్మితను చూడాల్సిందే… వొట్టు, కళ్లు పేలిపోతయ్…
‘భూమిక’ The Role ఎ ఫిల్మ్ బై శ్యాం బెనెగల్ …………………………………………………….. S M I T A P A T I L… A Barometer for Accomplishment ఉదాత్తమైన అక్రమ ప్రేమ – స్టోరీ మహారాష్ట్రలో ఓ మారుమూల కుగ్రామం. ఒక అందమైన దేవదాసీ, వయసులో పెద్దవాడైన ఓ బ్రాహ్మడు (బి.వి.కారంత్) భార్యాభర్తలు . వాళ్ళకో పదేళ్ళ కూతురు ఉష. శాస్త్రీయ సంగీతంలో ఆరితేరిన ఉష అమ్మమ్మ కూడా వాళ్ళతోనే. దిగువ మధ్యతరగతి కుటుంబం. […]
- « Previous Page
- 1
- …
- 296
- 297
- 298
- 299
- 300
- …
- 389
- Next Page »



















