సూపర్ స్టార్ మహేష్ బాబు, బిడ్డ సితారతో పాటు ఓ టీవీ షోకు రావడం… అదీ ఓ తెలుగు చానెల్లో వచ్చే డాన్స్ షోకు…! సితార స్టెప్పులేయడం, మహేష్ బాబు మురిసిపోవడం.., ఓ ఇద్దరు డాన్సర్ల డాన్స్ చేసి, మీకు నా సినిమాల్లో చాన్స్ ఇస్తానని మహేష్ ఔదార్యం చూపించడం, వాళ్లు పరుగెత్తుకెళ్లి కాళ్ల మీద పడిపోవడం, ఈయన కౌగిలించుకోవడం… ఎక్కడో ఏదో తేడా కనిపిస్తోంది… మామూలుగా మహేష్ బాబు మాటల్లో గానీ, ప్రెస్ మీట్లలో గానీ […]
సైలెంటుగా భలే పేల్చావు బ్రహ్మాజీ అంకుల్ … ఆంటీకి సెటైరిక్ కౌంటర్…
కొద్దిరోజులుగా సదరు పొట్టి దుస్తులు, ఐటమ్ సాంగుల యాంకరిణి రచ్చ రచ్చ చేస్తోందిగా… నన్ను ఆంటీ అని పిలుస్తారురా, ఆఫ్టరాల్ నేను 37, అయితే ఆంటీని అయిపోయానా, ఇది ఏజ్ షేమింగ్ అని వీరంగం వేస్తోందిగా… ఇది నన్ను తిట్టినట్టే అంటూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టుంది… తనను ట్రోల్ చేస్తున్న వాళ్ల మీద కనీసం దేశద్రోహం సెక్షన్లు పెట్టాలన్నంత కోపంతో ఊగిపోతోంది ఫాఫం… అంతేలే, ఆమె బాధ ఆమెకు జాతీయ సమస్య… అప్పుడెప్పుడో విజయ్ దేవరకొండ […]
ద్రవిడనాడు పేరిట దేశం నుంచి చీలిపోతారట… స్టాలిన్ ఏమంటాడో మరి..?!
ఒకవైపు కశ్మీర్లో పండిట్లను కాల్చేస్తూనే ఉన్నారు… మరోవైపు ఖలిస్థానీవాదం ప్రాణం పోసుకుని, ఢిల్లీని ముట్టడించి, ఈమధ్య పంజాబ్‌లో అనుకూల ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసుకుంది… ఇంకోవైపు కొత్తగా ప్రత్యేక తమిళనాడు (ఈలం) కోరికలు బలాన్ని పెంచుకుంటున్నాయి… ఈ దేశం నుంచి విడిపోతారట… ప్రత్యేకంగా తమిళదేశం కావాలట… ఎవరో కాదు, అధికారంలో ఉన్న స్టాలిన్ అనుయాయులు, మిత్రులే గొంతెత్తుతున్నారు… మొన్నటి జూలైలోనే రాజా అనబడే మాజీ కేంద్ర మంత్రి ‘‘ఇప్పటివరకూ మా ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నా బాటలో నడుస్తున్నాడు… మాకు […]
మీరూ మీరూ ఒకటే… నడుమ మీడియా వాళ్లు హౌలాగాళ్లు అయిపోయారా..?
ఇలా అడిగేవాడు ఒక్కడైనా అవసరం ఇండస్ట్రీలో..! ఆత్మవంచన, హిపోక్రసీ, అబద్దాలు, భజన, పాదసేవలు తప్ప ఇంకేమీ తెలియని సినీ పరిశ్రమలో తమ్మారెడ్డి భరధ్వాజలాగా పదునైన, సహేతుకమైన విమర్శ చేసేవాడు అవసరం… తాజాగా ఏదో ఇంటర్వ్యూలో కార్తికేయ హీరో నిఖిల్‌ను, దానికి అడ్డుపడబోయి అడ్డంగా బదనాం అయిపోయిన దిల్రాజును తమ్మారెడ్డి నిలబెట్టి కడిగేశాడు… నిఖిల్, దిల్‌రాజు డబుల్ స్టాండర్డ్స్‌ను ఏకిపడేశాడు… కార్తికేయ-2 సినిమా విడుదలకు దిల్‌రాజు రకరకాలుగా అడ్డుపడ్డాడనేది ఫిలిమ్ సర్కిళ్లలో బహిరంగ రహస్యం… అంతెందుకు ఇదే నిఖిల్ […]
వాడొక మాజీ ఐఏఎస్… పెళ్లాం ఓ పిశాచి… మిగతా కథ చదవండి…
అందరూ కాకపోవచ్చుగాక…. కానీ ఈ దేశంలో నయా జమీందార్లు, దొరలు, దొరసాన్లు సివిల్ సర్వెంట్లు… భారతీయ సమాజానికి అది పెద్ద శాపం వాళ్లే… బట్టీలు పట్టి, సబ్జెక్టు పుస్తకాలను ముక్కున పట్టి, ఆ దిక్కుమాలిన సివిల్స్ పరీక్షల్ని రాసి, తలతిక్క ఇంటర్వ్యూల్లో నెగ్గితే… మనం ఆహా అంటున్నాం, ఓహో అంటున్నాం… చిన్న మంచి పని చేస్తే చప్పట్లు కొడుతున్నాం… కానీ వాళ్లలో ఎందరు ఈ సొసైటీకి కరోనా వైరసులు అవుతున్నారనే నిఘా లేదు, చర్యల్లేవు… ఒక్కసారి ఐఏఎస్, […]
అది ఇంకా అందని చందమామే… అడుగు పెట్టనివ్వలేదు ఎవ్వరినీ…
1969… అంటే 53 ఏళ్ల క్రితం… ఈ భూతలం నుంచి ఒక జీవి మన ఉపగ్రహమైన చందమామ మీద కాలుమోపినట్టు ఒక ప్రకటన… అమెరికా వ్యోమగాములు ఆ చంద్రుడిపై నడిచి, జెండా పాతి, అక్కడి మట్టిని తీసుకుని తిరిగి వచ్చేశారని ప్రపంచమంతా చప్పట్లు కొట్టింది… అమెరికా ఖగోళ, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానానికి జేజేలు పలికింది… 1972 వరకు ఆరుసార్లు అలా అలా చంద్రుడి మీదకు వెళ్లి వచ్చినట్టు కూడా నాసా రాసుకుంది… ప్రపంచానికి చెప్పింది… ప్రపంచం నమ్మింది… […]
70 ఏళ్ల క్రితమే ఓ సూపర్ పాన్ ఇండియా మూవీ… ఆ స్టార్ ఎవరో తెలుసా..?
సౌత్‌లో విజయవంతమైన సినిమాల్ని హిందీలోకి… హిందీ సక్సెస్ఫుల్ సినిమాల్ని సౌత్‌లోకి డబ్ చేసి విడుదల చేయడం ఎప్పటి నుంచో ఉన్నదే… కాకపోతే ఇప్పుడు అన్ని భాషల్లోనూ ఒకేసారి డబ్బింగ్ వెర్షన్లను రిలీజ్ చేసేసి, పాన్ ఇండియా ముద్ర వేసేసి, మార్కెటింగ్ చేసేస్తున్నారు… కానీ మన తెలుగు సినిమాయే… 70 ఏళ్ల క్రితమే ఓ జబర్దస్త్ పాన్ ఇండియా మూవీ వచ్చింది… సేమ్, ఒకేసారి దేశమంతా రిలీజ్ చేశారు… హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేసిన ఈ […]
ఈటీవీ ఢీ షోకు అదిరిపోయే పోటీ… విజయ్ దేవరకొండ, మహేశ్‌బాబు హంగామా…
తెలుగే కాదు… ఏ భాషలో వచ్చే టీవీ డాన్స్ షోలైనా అంతే… సినిమా పాటలకు సర్కస్ ఫీట్ల వంటి పిచ్చి గెంతులు… ఈ విషయంలో వేరే అభిప్రాయం లేదు… ఇక విషయంలోకి వెళ్దాం… టీవీల్లో రియాలిటీ షోలకు సంబంధించి పోటీ విపరీతంగా పెరిగిపోయింది… అంటే డాన్స్, మ్యూజిక్, కామెడీ ఎట్సెట్రా షోలు… (నాన్-ఫిక్షన్, అంటే సీరియళ్లు గట్రా కాదు)… వీటిల్లో ఈటీవీ ఇప్పటిదాకా బలంగా ఉండేది… వావ్, క్యాష్, స్వరాభిషేకం, పాడుతా తీయగా, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా […]
పన్ను మోసం ప్లస్ చరిత్ర వక్రీకరణ… నిజమే, బాలయ్యే నైతిక బాధ్యుడు…
థాంక్ గాడ్… మా అల్లూరి కథే అనుకుని జగన్, మా కుమ్రం భీమ్ చరిత్రే అనుకుని కేసీయార్ ఆర్ఆర్ఆర్ సినిమాకు వినోదపన్ను రద్దు చేయలేదు… హమ్మయ్య… చిరంజీవితో కలిసి వెళ్లి, ఏదో అడగ్గానే జగన్ టికెట్ రేట్లను అమాంతం పెంచేశాడు, ఈ రేట్ల విషయంలో ఎలాగూ కేసీయార్ చేతికి ఎముకే లేదు… కానీ నిజంగానే రాజమౌళి అడిగి ఉంటే, ఈ హిస్టారిక్, సారీ, చరిత్రను పరమ నీచంగా వక్రీకరించిన సినిమాకు బహుశా వినోదపన్ను మినహాయింపు ఇచ్చేవాళ్లేమో… అందుకే […]
చేతులు మూతులు కాలాక… తత్వం బోధపడి ఆకులు పట్టుకుంటున్న విజయ్…
నో డౌట్… లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్‌కు కారణాల్లో పూరీ దిక్కుమాలిన దర్శకత్వం ప్రధాన కారణమే… ముట్లుడిగిన కేరక్టర్ తను… ఇంకా తనను పట్టుకు వేలాడటం విజయ్ దేవరకొండ తప్పు… దేశమంతా ఎక్కడ ప్రమోషన్ మీట్ పెట్టినా సరే విజయ్ పట్ల యువతలో విపరీతమైన క్రేజ్ కనిపించింది… కాకపోతే విజయ్ యాటిట్యూడ్ వ్యాఖ్యలు కూడా సినిమాను దారుణంగా దెబ్బతీశాయి… అది తను అంగీకరించకపోయినా సరే, తను ఓసారి నేలమీదకు దిగిరావాలి అనే కోరిక ప్రేక్షకుల్లో కనిపించింది… […]
హాట్‌స్టార్ లైవ్ సంఖ్య చూశారా..? అది రాబోయే డిజిటల్ పట్టుకు సంకేతం..!!
ఒక మాయను చిన మాయ, చిన మాయను పెద మాయ, పెద మాయను పెను మాయ… అని ఎక్కడో చదివాం కదా… సాంకేతికత పెరిగేకొద్దీ కొత్తది వచ్చి పాతదాన్ని మింగేయడం సహజం… నిన్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ చూస్తుంటే హాట్‌స్టార్ వ్యూయర్స్ సంఖ్య కూడా లైవ్ వేశారు… యూట్యూబ్ లైవ్ వ్యూయర్స్ నంబర్ వేసినట్టుగానే..! హార్ధిక్ పాండ్యా చివరి ఓవర్లలో గెలిపించిన సందర్భంలో 1.3 కోట్ల మంది లైవ్ చూశారు హాట్‌స్టార్ వేదికగా… ఆశ్చర్యం వేసింది, కాదు, రాబోయే […]
రివ్యూ కూడా 13 Lives ఆపరేషన్లాగే… చూడదగ్గ మూవీ, చదవదగ్గ రివ్యూ…
ఒకే కథ… కానీ వేర్వేరు కథనతీరులు… అన్నట్టుగా… థర్టీన్ లైవ్స్ సినిమా మీద ఆల్రెడీ మనం ఓ రివ్యూ రాసుకున్నాం… అదే సినిమా… ఈ రివ్యూ కూడా చదవండి… ఈ రివ్యూ సాగిన తీరు వేరు… నిజానికి అనేకానేక సైట్లలో, మీడియాలో ఒకే తరహా మూస ఫార్మాట్లో రివ్యూలు వస్తుంటయ్… అసలు రివ్యూలకు టెంప్లేట్ ఏమిటి..? రివ్యూయర్ కూడా ఓ సగటు ప్రేక్షకుడిలా చూసి, ఫీలై రాయాలి, అప్పుడే అందులో లైఫ్… సరే, ఆ చర్చలోకి వెళ్లకుండా […]
సుధీర్‌ను మళ్లీ పట్టుకొచ్చారు… జస్ట్, ఈటీవీకి చుట్టపుచూపుగా మాత్రమే…
అవమానించారు… ఒక్కొక్క ప్రోగ్రామ్ నుంచీ కత్తెరపెట్టారు… ఉంటే ఉండు, పోతేపోవోయ్ అన్నారు… తీరా సుధీర్ బయటికి వెళ్లిపోయాక లెంపలేసుకుని, రా బాబూ రా ప్లీజ్ అని ఓ స్పెషల్ ప్రోగ్రామ్‌లోకి తీసుకొచ్చారు… ఈటీవీ 27 సంవత్సరాల కార్యక్రమం ‘భలేమంచిరోజు’లో మాత్రమేనట… అంతేతప్ప, సుధీర్ ఏదో అర్జెంటుగా మళ్లీ జబర్దస్త్‌లో, ఢీలో, శ్రీదేవి డ్రామా కంపెనీలో దూరిపోతున్నాడని కాదు..! అంతెందుకు… వినాయకచవితిన ప్రసారం చేయబోయే ‘మనవూరి దేవుడు’ స్పెషల్‌లో అసలు సుధీర్ కనిపించడమే లేదు… (ప్రోమోల్లో)… ఈటీవీతో తనకు […]
Sherdil… గిరిజనంపై ప్రభుత్వాల నిర్లక్ష్యంపై క్రియేటివ్ సెటైర్…
నాన్న పులి కథ.. నేటికీ కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తున్న మారుమూల అటవీ ప్రాంతాల పట్ల ప్రభుత్వాల దృక్కోణంపై ఓ సెటైర్ Sherdil: The Pilibhit Saga. ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో సుమారు 17 మంది పులుల బారిన పడి చనిపోయిన 2017 నాటి ఘటన… శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన Sherdil: The Pilibhit Saga కు మెయిన్ మోటో! వాస్తవానికి ఓ డాక్యుమెంటరీని పోలినట్టుగా సినిమా కథాగమనం కనిపించినా…అదే సమయంలో వాస్తవికతకు దర్పణం […]
రైతు పోరాటాల సరికొత్త కాగడా కేసీయార్ సార్… మరి వీళ్ల గోస మాటేంటి..?
వైఎస్ మరణానంతరం కేసీయార్ వేసిన ప్రతి అడుగూ సక్సెస్ అయ్యింది ఇన్నాళ్లు కాబట్టి, తన ఆలోచనల్లో అద్భుతమైన చాణక్యం ఉందని అనుకుంటున్నాం… కానీ నిజమేనా..? నిజమో, అబద్ధమో… సక్సెస్ అనేది మనం చేసిందే రైట్ అనిపించేలా చేస్తుంది… ఎందుకు చెప్పుకోవడం అంటే..? జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర అని గత లోకసభ ఎన్నికల ముందు నుంచీ చెబుతున్నాడు… ఈరోజుకూ ఊదు కాలలేదు, పీరు లేవలేదు… అన్ని భాషల పత్రికల్లో ఫస్ట్ పేజీ జాకెట్ యాడ్స్ ఇస్తే చాలు, మస్తు […]
ఓహ్.., ఆచార్య తన్నేసింది అందుకేనా..? సారు ఎంత సింపుల్‌గా తేల్చేశాడు..?!
అనవసరంగా చిరంజీవి బుర్ర బద్దలు కొట్టుకుంటూ… కొడుకు, తాను కలిసి ప్రతిష్ఠాత్మకంగా కొత్త కొత్త స్టెప్పులేస్తూ నటించినా సరే, ఆచార్య అంత ఘోరంగా డిజాస్టర్ కావడానికి కారణాలేమిటబ్బా అని కారణాల లోతుల్లోకి వెళ్లాల్సిన పనే లేదు… చాలా సింపుల్… తను అంతకుముందు టికెట్ రేట్ల తగ్గింపు కోరుతూ, జగన్ ఎదుట చేతులు జోడించి వేడుకుంటూ, ప్రాధేయపడుతూ, బాబ్బాబు ప్లీజ్ అన్నట్టుగా బతిమిలాడాడట కదా… అదుగో, అందుకే ప్రేక్షకదేవుళ్లు ఆచార్య సినిమాను ఛీఫో అన్నారట… అంతే, పెద్ద పెద్ద […]
రాంగ్ డెసిషన్…! ABN రాధాకృష్ణ బిగ్డిబేట్తో కవితకు రిలీఫ్ ఏంటి..?
ఏబీఎన్ చానెల్లో డిబేట్‌కు వెళ్లడం ద్వారా కేసీయార్ బిడ్డ కవితకు వచ్చిన ఫాయిదా ఏమిటి..? కనీసం డ్యామేజీ కంట్రోల్ ఏమైనా జరిగిందా..? తన వెర్షన్ బలంగా వినిపించగలిగిందా..? అసలు ఆ డిబేట్‌కు వెళ్లాలనే సలహా ఇచ్చింది ఎవరు..? నిజానికి ఈ డిబేట్ కవితకు ఒకరకంగా నష్టం చేకూర్చింది… ఎలాగో చెప్పుకోవాలంటే కాస్త దీనికి పూర్వరంగం నెమరేసుకోవాలి… కవిత పేరును పదే పదే బీజేపీ వాళ్లు ఢిల్లీ మద్యం స్కాంలోకి తీసుకొస్తున్నారు… ఆమె కోర్టుకు వెళ్లి ఎవరూ తన […]
పేకాట బదులు ఇంకో డర్టీ పదం… ఈనాడులో ఓ కొలువును ఉరితీసేశారు…
ఈనాడు వరంగల్ యూనిట్లో ఓ సబ్ ఎడిటర్‌ను తీసేశారు… పేరు, ఆయన వయస్సు, ఆయన జీతం ఎట్సెట్రా ఇక్కడ అనవసరం… తను ఉషోదయ ఎంప్లాయీ కూడా కాదు, శ్రమదోపిడీ కోసం ఈనాడు ఏర్పాటు చేసిన డిజిటల్ బ్యాచ్ సబ్ఎడిటర్ ఆయన… విషయం ఏమిటీ అంటే..? ఓ అక్షర దోషానికి తను బాధ్యుడట… నిజమే, చాలా దారుణమైన తప్పు దొర్లింది… అయితే తనొక్కడే దానికి కారకుడా..? ఓ సబ్ఎడిటర్ను పీకేస్తే ఈ సమస్య పరిష్కారం అయిపోతుందా..? ఆ సోయి […]
‘‘నమస్తే తెలంగాణ ఓ పేపరా..? దాన్ని అసలు కేసీయారే చదవడు…’’
కొన్నిసార్లు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాటతీరు చూస్తే విస్మయం కలుగుతుంది… కడుపులో ఉన్నది ఏదైనా సందర్భం చూసుకుని మొత్తం కక్కేస్తాడు… ఎదుటోడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడు, దానికి రియాక్షన్ ఏమిటనేది అస్సలు పట్టించుకోడు… ఇదీ అంతే… నమస్తే తెలంగాణ పత్రిక మీద తను చేసిన వ్యాఖ్యల్ని ఎలా ఖండించాలో, అసలు ఖండించాలో లేదో తెలియని అయోమయావస్థలోకి నెట్టేశాడు ఆ పత్రికను… నిజంగా ఆ పత్రిక స్పందన చూడాలని ఉంది రేపు పత్రికలో… ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీయార్ […]
హవ్వ లైగర్… తెలుగు సినిమాల్లోకెల్లా లోయెస్ట్… సిగ్గుపడే రికార్డు…
లైగర్ ఏ స్థాయి డిజాస్టరో చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం… థియేటర్లకు వెళ్లి, గజ్జన వణికిపోతూ మధ్యలోనే పారిపోయి వస్తున్నవాళ్లూ ఉన్నారు… రిలీజుకు ముందు విజయ్, పూరీ తదితరుల ఎచ్చులు గుర్తుచేసుకుని, వాటిని కోట్ చేసి, మరీ మీమ్స్ వదులుతున్నారు నెటిజెన్స్… ప్రత్యేకించి ఆగ్ లగాదేంగే వంటి… విజయ్ మాటను ప్రేక్షకులు గౌరవించి, నిజంగానే కాలబెట్టారు… ఎంత అంటే..? తెలుగు సినిమాల్లోకెల్లా లోయెస్ట్ ర్యాంకు ఇచ్చి, సినిమా బాధ్యులందరూ సిగ్గుతో తలదించుకునేలా చేశారు… అదెలా […]
- « Previous Page
- 1
- …
- 304
- 305
- 306
- 307
- 308
- …
- 466
- Next Page »