అత్యంత ఖరీదైన టీవీ రియాలిటీ షో బిగ్ బాస్… అందరికీ తెలిసిన విషయమే… నచ్చేవాళ్లు చూస్తారు, నచ్చనివాళ్లు తిడతారు… మొదట్లో వచ్చిన కొన్ని సీజన్లను జనం ఆసక్తిగానే చూశారు… తరువాత క్రమేపీ ఆదరణ తగ్గిపోయింది… ఓటీటీ షో ఫ్లాప్… దాన్ని మించి గత సీజన్ అట్టర్ ఫ్లాప్… కాదు, డిజాస్టర్… ఆఫీసర్ సినిమాను మించిన డిజాస్టర్ నాగార్జునకు… పరువు పోయింది… ఆఫ్టరాల్ పరువుదేముంది..? పైసలు వస్తున్నాయి కదా అంటారా…? ఎస్, అదొక్కటే నిజం… నో, నో, ఈసారి […]
బాబులీ… ఆనాడు చంద్రబాబు అరెస్టయినప్పుడు ఏం జరిగిందంటే…
అర్ధరాత్రి ఇంటికి చేరుకొని, ఎప్పటిలానే ఉదయం ప్రధాన రహదారి పైకి వెళ్లి చూస్తే, ఇనుప చువ్వల వెనుక జైలులో బాబు ఉన్న పోస్టర్లు.., బేగంపేట వంటి ప్రధాన రహదారిలో భారీ హోర్డింగ్లను చూసి ఆశ్చర్యం వేసింది . వారి సామర్ధ్యం గురించి తెలియంది కాదు . అప్పటికే వారిని దగ్గర నుంచి ఒకటిన్నర దశాబ్దాల నుంచి చూస్తూనే ఉన్నాను . అయినప్పటికీ ఆ హోర్డింగ్ లు , పోస్టర్లు చూసి వాళ్ళు మామూలోళ్లు కాదు అనుకున్నాను . […]
స్కిల్ స్కాం ఓ తీగ మాత్రమే… చంద్రబాబు అరెస్టు వెనుక కనిపించని ఎన్నో కోణాలు..!!
చంద్రబాబు అరెస్టు..! ఇది నిజమేనా..? అసలు ఇది సాధ్యమేనా..? అని చాలామంది ఇప్పటికీ హాశ్చర్యంలోనే ఉన్నారు… స్టేలు తెచ్చుకోవడంలో ప్రసిద్ధుడు, ఏ విచారణనూ తన దగ్గరకు రానివ్వని సమర్థుడు, ఏం చేసినా వ్యవహారాల్ని చట్టపరంగా దొరక్కుండా చేయడంలో నిపుణుడు అంటూ ఇన్నాళ్లూ సాగిన ప్రచారం ఉత్తదేనా..? అంతటి చంద్రబాబు కూడా అరెస్టులకు, కేసులకు అతీతుడు ఏమీ కాదా..? అమరావతి వంటి పెద్ద పెద్ద కేసుల్లో చంద్రబాబును ఫిక్స్ చేస్తారని అనుకుంటూ ఉన్నారందరూ… కానీ చాలామందికి పెద్దగా అవగాహన […]
దెయ్యమున్న ఇంట్లో ప్రతి పనీ దెయ్యానికి తెలిసే జరుగుతుంది…
Bharadwaja Rangavajhala …. ఇది చాలా పురాతన పోస్టు… మళ్ళీ తగిలించా అప్పుడెప్పుడో…. పక్షవాతానికి ఆయుర్వేదపు వైద్యం అంటూ మణిభూషణ్ ఓ పోస్టు పెట్టారు. దాన్ని నేను లైక్ చేయడమే కాక ప్రపంచీకరణ నేపధ్యంలో ఇలాంటి వాటిని ప్రోత్సహించాలని కూడా ఒక వ్యాఖ్య జోడించాను. దీనిపై కొందరు మిత్రులు ఆగ్రహించారు. మొన్ననే కన్నుమూసిన బత్తిన ఆయన సోదరుల చేపమందును కూడా తెరమీదకు తెచ్చారు. విద్య, వైద్యం లాంటి సేవలు అందించడం నుంచి తాను స్వచ్చందంగా వైదొలగుతున్నట్టు ప్రజాస్వామిక ప్రభుత్వాలు […]
బస్టాండ్లలో ఓమూలన పెద్ద పెద్ద బాక్సులు కనిపించేవి గుర్తున్నాయా..?
ఇమ్లీ బన్ బస్సు స్టాండ్ , జూబ్లీ బస్సు స్టాండ్ , విజయవాడ , విశాఖ బస్సు స్టాండ్లలో ఏదో ఓ మూలకు కొన్ని బాక్స్ లు మీరు చూసే ఉంటారు. అన్ని దిన పత్రికలు తమ తమ పత్రికల పేర్లు రాసి అక్కడ బాక్స్ లు వేలాడ దీశాయి . ఇప్పుడు వాటి ఉపయోగం లేకున్నా కొన్ని బస్సు స్టాండ్లలో ఆ బాక్స్ లు దుమ్ముకొట్టుకుపోయి ఇంకా అలానే ఉన్నాయి . వాటికో చరిత్ర ఉంది […]
తస్వ ఇరస్వ త్వమేవాహం… డిజైనర్ వేర్ షాపులు… బుర్ర చెదిరే ట్రెండీ డ్రెస్సులు…
Traditional: ఇస్సా ఇరస్వ త్వమేవ్ తస్వ సబ్యసాచి ముఖర్జీ అంగసూత్ర మనీష్ మల్హోత్రా రీతూ కుమార్ ఆశా రావ్ అనుశ్రీ రెడ్డి శంతను అండ్ నిఖిల్ ముగ్ధ రాఘవేంద్ర రాథోడ్ కవితా గుత్తా ప్రత్యూష గరిమెళ్ల మైసూర్ పాక్ లో మైసూర్ ఉండదు. బంజారా హిల్స్ లో బంజారాలు ఉండరు. పై పేర్లలో ఎవరూ బంజారాలు కాకపోవచ్చు. ఎక్కువ భాగం ఉత్తర భారతీయ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్లు అయి ఉండాలి. ముగ్గురో, నలుగురో తెలుగు డిజైనర్లు కూడా ఉన్నట్లున్నారు. […]
మనసు పెడితే క్లాసిక్… రేవు పెడితే డ్యూయెట్… మావోడు మహా ఘటికుడు…
Koppara Gandhi……. మనసు పెడితే క్లాసిక్… రేవు పెడితే డ్యూయెట్****** మా దద్ది చిరాగ్గా కూచుని రెండు కర్రముక్కలు తీసుకుని అడ్డదిడ్డంగా కళ్ళుమూసుకుని డ్రమ్స్ బాదేశాడనుకోండి.. అది ఓ సూపర్ హిట్ డ్యూయెట్ అయి పోతుంది.. ఆరోజుల్లో ఏ పెళ్లి మేళంలో అయినా.. ఏ సెలూన్లో అయినా ఆ పాట ఉండాల్సిందే.. అక్కడ జనం మూగి ఉర్రూతలూగాల్సిందే.. పోనీ అలాకాకుండా తీరిగ్గా కూకుని ఓ పిసర క్లాసిక్ పోపు వేసి.. మధ్యలో ఫ్లూట్ నూరి… చెంచాడు వయోలిన్ […]
రొంబ అరవ అతి తంబీ… ఓ తమిళ మాస్ సినిమాలో షారూక్ నటించాడు… అంతే…
ఆమధ్య ఇదే షారూక్ ఖాన్ సినిమా వచ్చింది… పఠాన్… అబ్బో, వందల కోట్ల వసూళ్లు, బంపర్ హిట్ అని మీడియా ధూంధాం రాసేసింది… తీరా తన సర్కిళ్లోని నటీనటులే ఆ లెక్కల మీద జోకులు వేశారు… అప్పుడు కూడా షారూక్ వైష్ణోదేవి గుడికి వెళ్లి వచ్చాడు… ఇప్పుడు తన సొంత సినిమా… ఇదీ పాన్ ఇండియాయే… ఇప్పుడు కూడా వైష్ణోదేవిని దర్శించుకున్నాడు… అదనంగా తిరుమలకూ వచ్చి వెళ్లాడు… ఎందుకనేది మనం ఇప్పటికే చెప్పుకున్నాం… నాలుగురోజులపాటు దీని వసూళ్ల […]
శెట్టి అందం, పోలిశెట్టి హాస్యం… సరదాగా, భిన్నంగా ఓ స్టాండప్ కామెడీ…
సగటు తెలుగు సినిమా అనగానే… బీభత్సమైన మానవాతీత ఫైట్లు… జబర్దస్త్ తరహా వెకిలి కామెడీ… రొటీన్ కథ… రొడ్డకొట్టుడు కథనం… ప్రతీకారాలు, ఐటమ్ సాంగ్స్, హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనలు వంటివి ఎన్నో గుర్తుకువస్తుంటాయి కదా… తలతిక్క ఇమేజీ బిల్డింగ్ మూసలో పడి కొట్టుకుపోతుంటాయి కదా… కొన్ని డిఫరెంట్ సినిమాలు వస్తుంటాయి… కొన్ని మాత్రమే… ఒకటీ అరా… అలాంటిదే ఈ సినిమా… టైటిల్ శెట్టి పోలిశెట్టి… ఓ భిన్నమైన సబ్జెక్టు… ఓ రిజిడ్ స్త్రీ… వృత్తిరీత్యా చెఫ్… తన […]
కృష్ణం వందే జగద్గురుం… ‘కృష్ణకర్ణామృతం’ తెలుసా మీకు..?
Karnamrutham: వేదాలను పరిష్కరించడంతో పాటు పద్దెనిమిది పురాణాలు, భారతం రాశాక…వ్యాసుడిలో ఇంకా ఏదో వెలితి ఉంది. ఆ వెలితి ఏమిటో తనకు తాను కనుక్కోలేకపోయాడు. నారదుడు వ్యాసుడి బాధను అర్థం చేసుకుని…భాగవతం రాయి…నీ వెలితి మాయమై…నీ రచన పూర్ణమై…నీ రాతలకు సిద్ధి దశ వస్తుంది అంటాడు. అప్పుడు వ్యాసుడు భాగవతం రాశాడు. భాగవతంలో వ్యాసుడు కృష్ణుడి గురించి గొప్పగానే చెప్పాడు. కానీ మన పోతన తెలుగు అనువాదంలో ఆ కృష్ణుడు మధుర బృందావన ద్వారకలను వదిలి మన తెలుగు పల్లెల్లోకి వచ్చేశాడు. మన పెరట్లో […]
షారూక్ ఖాన్ టెంపుల్ రన్ వెనుకా ఓ కథ..? ఉదయనిధితో లింకేమిటో తెలుసా..?
షారూక్ ఖాన్ తన సినిమాల విడుదలకు ముందు వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించిన ఉదాహరణలు ఉన్నాయ్… పఠాన్ విడుదలకు ముందు ఆ గుడికి వెళ్లి పూజలు చేశాడు… ఇప్పుడు జవాన్ సినిమా విడుదలకు ముందు కూడా వెళ్లాడు… 9 నెలల్లో రెండుసార్లు ఆ గుడికి వెళ్లాడు… ఉత్తర భారతంలోని గుడికి వెళ్లి పూజలు చేయడం ఆయా సందర్భాలలో మంచి కవరేజీని కూడా పొందింది… సహజమే… బాలీవుడ్ టాప్ స్టార్ ఓ హిందూ గుడికి వెళ్లి, తన సినిమా విజయం […]
హర్ ఘర్ జర్నలిస్ట్… అనగా ఇంటికొక న్యూస్ చానెల్ ఇలలో సుమతీ…
Murali Buddha….. దాదాపు రెండేళ్ల క్రితం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సరికి నా కోసం ఒకరు గేటు వద్దనే ఎదురు చూస్తున్నారు . నేను వచ్చాక ఏదో మాట్లాడి స్టైల్ గా చేతికి ఐడెంటిటీ కార్డు ఇచ్చాడు . ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా గలవారికి కూడా అంత నాణ్యమైన కార్డు ఉండదు . కార్డు నాణ్యతతో చాలా బాగుంది . అలా చూస్తూ ఉండిపోయాను . నేను కూడా రిపోర్టర్ ను ఐపోయాను అన్నాడు […]
ఇండియా వర్సెస్ భారత్… ఓ దిక్కుమాలిన చర్చ… నేములోనేముంది..?
నిజంగా మోడీ ప్రభుత్వం దేశం పేరు మార్చడానికి నిర్ణయం తీసుకున్నదా లేదా తెలియదు… జస్ట్, ఓ ఆహ్వానపత్రికలో భారత్ అని ప్రస్తావించారు… నిజానికి ఇదేమీ తొలిసారి కాదు, భారత్ అనే పేరు వాడటానికి అడ్డంకులు కూడా ఏమీలేవు… దీనికి రాజ్యాంగ సవరణలు, కొత్త చట్టాలు గట్రా ఏమీ అక్కర్లేదు… రాజ్యాంగం మొదట్లోనే ఇండియా, భారత్ అని రెండు పేర్లూ ఉన్నయ్… ఏది వాడుకున్నా ఏ చిక్కులూ లేవు… ఏ సందర్భంలో ఏ పేరు వాడుకోవాలనేది మన ఇష్టం… […]
చావు తరువాత..? అంతుపట్టనిదేదో ఉంది… ఎడతెగని పరిశోధనలు…
Soul-Resale: “కన్ను తెరిస్తే ఉయ్యాల; కన్ను మూస్తే మొయ్యాల…” అని జాలాది చాలా లోతయిన విషయాన్ని చాలా సింపుల్ గా తేల్చిపారేశాడు. “కన్ను తెరిస్తే జననం; కన్ను మూస్తే మరణం; రెప్పపాటే కదా జీవితం?” అని మినీ కవిత రచయిత పేరుతెలియకపోయినా తెలుగులో దశాబ్దాలుగా బాగా ప్రచారంలో ఉంది. “స్వతంత్ర దేశంలో చావుకూడా పెళ్లిలాంటిదే బ్రదర్!” అని ఆకలి రాజ్యంలో సినీ కవి సూత్రీకరించాడు. చావు- పుట్టుకలు రెండూ మనచేతిలో ఉండవు. ఏది మనచేతిలో ఉండదో సహజంగా దానికి అతిన్ద్రియ శక్తులను అంటగడతాం. శాస్త్రం- నమ్మకం […]
సంపాదకులు అనగా… రకరకాలుగా వేధించు శాడిస్టులు అని మరో అర్థం…
“మీకేంటి రెండు చేతులా సంపాదిస్తారు .. జీతానికి జీతం, పై ఆదాయానికి పై ఆదాయం ” ఈ మాట ప్రతి జర్నలిస్ట్ తన వృత్తి జీవితంలో అనేకసార్లు విని ఉంటారు . జర్నలిస్ట్ జ్ఞాపకాలు రాస్తుంటే కూడా కొందరు తెలిసినవారు జర్నలిస్టులకు రెండు చేతులా ఆదాయం ఉంటుంది, మీరేమో దినదిన గండం అని రాస్తున్నారు అని అడిగారు . వారి సందేహాలు నిజమే , జర్నలిస్టుల జీవితాలు దినదిన గండం అనేదీ నిజమే . ఓ సినిమాలో […]
నిదురపోరా తమ్ముడా… మలి సూర్యోదయ వెలుగుల కోసం నిరీక్షిస్తూ…
చాలామంది చంద్రయాన్-3 ఫలితాన్ని కేవలం సేఫ్ ల్యాండింగ్, రోవర్ ప్రయోగాల మేరకే పరిమితం చేశారు… కానీ అంతకు మించి…!! తొలిసారి ఓ దేశయంత్రం చంద్రుడి దక్షిణ ధృవం మీద కాలు (?) మోపడం ఓ విశేషం కాగా… చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ బహుశా చైనా తరువాత మనమేనేమో.,.. అరెరె, అమెరికా, రష్యాలు కూడా ఎప్పుడో దశాబ్దాల క్రితమే అక్కడ మనిషినే దింపి, తిరిగి తీసుకువచ్చాయి అంటారా..? అదే చెప్పబోయేది… ప్రస్తుతం సూర్యుడు 15 రోజులపాటు కనిపించడు… రోవర్ […]
మాట జాగ్రత్త కార్టూనిస్ట్ మల్లిక్ భాయ్… చంద్రయానంలో అలా ‘ఇరుక్కున్నావ్…
ఇప్పుడు చంద్రయాన్ వంటి ఖగోళ ప్రయోగాలు అవసరమా..? ఈ ప్రశ్నను చాలామంది వేశారు సోషల్ మీడియాలో… చంద్రయాన్ అవసరం ఏమిటో, సాంకేతిక పురోగతిలో దేశం స్వయంసమృద్ధి ఎందుకు అవసరమేమిటో అర్థం చేసుకోవడం ఆయా వ్యాఖ్యదారుల అవగాహన స్థాయిని బట్టి ఉంటుంది… ఐతే..? చంద్రయాన్ విజయాన్ని దేశం విజయంగా గాకుండా ఒక మోడీ విజయంగానో, ఒక బీజేపీ విజయంగానో చూడటం వల్ల వస్తోంది సమస్య… ఇది ఎక్కడ మోడీ ఇమేజీని మరింత పెంచుతుందో అనేది ‘ఇండియా’ విపక్షాల భయం… […]
మణిశంకర్ అయ్యరుడికి ఆరోజు బాగానే దేహశుద్ధి జరిగింది… కానీ..?
Nancharaiah Merugumala…. పీవీకి తెలుగు బ్రామ్మల్లో ఉన్న అభిమానుల్లో నాలుగో వంతు… ఎన్టీఆర్ కు కమ్మ జనంలో ఉంటే…టీడీపీ స్థాపకుడి జీవితం అలా ముగిసేదా? …………………………………………………… ఎప్పుడో పాతిక ముప్పయేళ్ల క్రితం అయోధ్యలో బాబరీ మసీదు కూల్చడానికి నాటి కాంగ్రెస్ ప్రధాని పాలములపర్తి వేంకట నరసింహారావు గారు ఆరెసెస్–బీజేపీ శ్రేణులకు వీలుకల్పించినందుకు ఇప్పుడు సాటి దక్షిణాది బ్రాహ్మణ నేత నుంచి నిందలు పడాల్సివస్తోంది. కరీంనగర్–వరంగల్ ప్రాంత తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పీవీ గారిని హిందూ మతోన్మాదిగా […]
అప్పుడు ఆ అమ్మాయి సిగరెట్ వెలిగించి … ఘట్టిగా ఓ దమ్ము లాగి…
Bharadwaja Rangavajhala….. ఒకే పాయింట్ తో వచ్చిన రెండు నవలల కథ (పునః ) ………. యద్దనపూడి సులోచనారాణి గారి జీవనతరంగాలు నవలకున్నూ … పోల్కంపల్లి శాంతాదేవి అనే ఆవిడ రాసిన చండీప్రియ అనే నవలకున్నూ దారుణమైన పోలిక ఉంది … ఎవుడ్రీడు, ఎప్పటి నవలల గురించో మాట్లాడతా ఉండాడు అని కోప్పడమాకండి … ఈ రెంటిలోనూ ఉన్న కామన్ పాయింటును సాగ్గొట్టి ఓ సినిమా తీసి పాడేయవచ్చనేది మాత్రమే నా ఉద్దేశ్యం … ఈ రెండు నవలలూ కూడాను […]
ఇండియన్ పీనల్ కోడ్కు అదనంగా అక్కడ పోలీస్ పంచాంగ్ కోడ్…
Crime-Panchangam: సంస్కృతంలో గ్రహం మాటకు ముందు ఉపసర్గలు చేరి, మాట కొంచెం మారి- ఉపగ్రహం అనుగ్రహం నిగ్రహం విగ్రహం సంగ్రహం గ్రహణం గ్రాహ్యం గ్రహీత లాంటి ఎన్నెన్నో మాటలు పుడతాయి. పట్టుకోవడం అన్నదే ఇందులో మూల ధాతు రూపానికి ఉన్న అర్థం. అందుకే గ్రహాలను సవాలు చేస్తూ అంతరిక్షంలో వాటికి దగ్గరగా (ఉప) పంపే ఉపగ్రహాలకు కూడా ముందు శ్రీహరికోట పక్కనున్న చెంగాళమ్మ అనుగ్రహం, ఆపై తిరుమల ఏడుకొండలవాడి ప్రత్యేక అనుగ్రహం కోరుతున్నారు శాస్త్రవేత్తలు భక్తి ప్రపత్తులతో. […]
- « Previous Page
- 1
- …
- 309
- 310
- 311
- 312
- 313
- …
- 383
- Next Page »