ఏళ్ల తరబడీ… తెలుగు సినిమా పాటలో, ఆటలో, కథలో, కథనంలో, ఆత్మలో… అన్నింటా ఆంధ్రా ఆధిపత్యమే… తెలంగాణ మీద వెక్కిరింతలు..! ఇవి ఆంధ్రా సినిమాలు తప్ప మన సినిమాలు కావులే అనే ఓ నిర్లిప్తత తెలంగాణ ప్రేక్షకుల్లో ఉండేది… వేరే దిక్కులేక ఆ సినిమాలే చూస్తూ, అదే మహద్భాగ్యం అనుకునేవాడు… ఇండస్ట్రీలోని చాలామంది తెలంగాణవాళ్లు కూడా తమ ప్రాంతీయతను చెప్పుకునేవాళ్లు కాదు… తరువాత ఒక్కసారిగా తెలంగాణ పాట, మాట, ఆట, పాత్రకు క్రేజ్ ఎక్కువైంది… సుద్దాల, చంద్రబోస్ […]
పెద్దల మాట, బతుకమ్మ ఆట, సద్ది మూట… ఇవీ సద్దుల రకాలు…
బతుకమ్మను పేర్చే శిబ్బిలు మాత్రమే కాదు… కీలకంగా భావించే తంగేడు దొరుకుత లేదు… గునుగు పూవు బంగారం అయిపోయింది… గడ్డిపూవుకు రంగులు అద్దడం, అందంగా పేర్చడం, పరులకంటే పెద్ద బతుకమ్మ కావాలని పోటీలుపడటం గతం… వీలుంటే ఓ కాగితపు బతుకమ్మ కొనడం, లేదంటే మార్కెట్లో దొరికే బంతిపూలతో మమ అనిపించడం… కొత్త తరానికి పెద్దగా ఈ పండుగ మీదే పెద్దగా ఇంట్రస్టు లేదు… చివరిరోజు సద్దుల బతుకమ్మకు మాత్రం కాస్త హడావుడి కనిపిస్తోంది… తెలంగాణ వచ్చాక బతుకమ్మ […]
స్మార్ట్ రావణ్… ఫెయిర్ కలర్ రామ్… ఫాఫం, ఆ సీతమ్మవారెలా ఉన్నారో…
అవును… రావణుడు ఇలాగే ఉంటాడని ఎవరు రాశారు..? రామాయణం కొన్ని శతాబ్దాలుగా పఠింపబడుతూనే ఉంది… అనేక భాషలు, అనేక కళారూపాల్లో తరతరాలుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం… అది మన నెత్తుటిలో ఇంకిపోయిన కథ… అయితే ఆయా పాత్రల రూపురేఖల్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు చెప్పుకున్నారు… పలు ప్రాంతాల్లో ఒరిజినల్ కథకే బోలెడు మార్పులు చేసి చెప్పుకుంటుంటారు… బేసిక్ కథ ఒకటే… కట్టె, కొట్టె, తెచ్చె… దీని చుట్టూ కథ ఎలా అల్లుకుంటాం అనేది క్రియేటర్ ఇష్టం… […]
చంటిని కదా మెడబట్టి గెంటాల్సింది… నాగార్జునా, నీ బుర్రకేమైంది..?
చివరకు నాగార్జున తన ఇజ్జత్ పోగొట్టుకున్నాడు… బిగ్‌బాస్ టీం చెత్తా నిర్ణయాలు, తనతో పలికించే మాటలే కావచ్చుగాక, కానీ ఓ హోస్టుగా తనకంటూ ఓ విచక్షణ, వివేకం ఉండాలి కదా… ఒక విషయంలో నాగార్జున చెప్పిన మాటలు, చేసిన వాదనతో తన పరువు వంద శాతం మూసీలో కలిసిపోయింది… బిగ్‌బాస్ ప్రోగ్రాంతో తనకు పారితోషికం, స్టూడియోకు రెంట్ భారీగా వస్తుండవచ్చుగాక… కానీ ఓ పెద్దమనిషిగా భ్రష్టుపట్టిపోయాడు ఈ దసరా స్పెషల్ షోతో… అసలు తనకు హోస్టింగ్ అంటే […]
ఈ పత్రిక ఉందని ఎందరికి తెలుసు…? అవసరానికి కేసీయార్ ప్రేమించేస్తున్నాడు…!!
పాలకుడికి తెలిసి ఉండాలి… తన పల్లకీ మోసీ బోయీల అవసరాలు ఏమిటో గుర్తెరగాలి… తీర్చాలి… అప్పుడే విధేయత, బానిసత్వం పరిఢవిల్లుతాయి… ఒకప్పుడు హైదరాబాద్ కమ్యూనిస్టు రాజ్యం కోసం రైతులను పోగేసి, సాయుధపోరాటం చేసిన సీపీఐకి ఇవన్నీ బాగా తెలుసు… కొడిగట్టిన దీపం అని మనం అనుకుంటాం… కానీ కొందరు పెద్దలు ప్రభువుల ఎదుట సాగిలపడుతూనే ఉంటారు… పోరాట స్పూర్తి, ప్రజాకోణం అనే పదాల్ని తమ డిక్షనరీల నుంచి తీసిపారేశారు… విషయం ఏమిటంటే… సీసీఐకి విశాలాంధ్ర అనే ఓ […]
తమిళ పొన్నియిన్ పొగరు, బలుపు… కన్నడ కంతారా అల్టిమేట్, ఆల్టర్నేట్…
తండ్రిలాంటి కృష్ణంరాజు మరణానంతర విధులతో ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నా సరే…. తన సంస్మరణ సభలో టన్నుల కొద్దీ మాంసాహారంతో సంతర్పణ చేస్తున్నా సరే… ప్రభాస్ తన వృత్తిజీవితాన్ని, అవసరాన్ని నెగ్లెక్ట్ చేయలేదు… కంతారా సినిమాను భలే తీశారు బ్రదర్ అని పొగిడాడు… ప్రత్యేకించి క్లైమాక్స్ అదిరిపోయింది అన్నాడు… తనకు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఏవో గ్యాప్స్ వచ్చాయట… సాలార్ తీస్తున్నారుగా… పైగా ప్రభాస్, ప్రశాంత్ కలయికతో ఏపీ, తెలంగాణ, కర్నాటకల్లో ఎక్కువ వసూళ్లకు ప్లాన్ […]
ఫాఫం నాగార్జున..! తనే చేతులెత్తేస్తున్నాడు… పరమ పేలవంగా షో…
ఫాఫం నాగార్జున… తనకు కూడా బిగ్‌బాస్ మీద ఇంట్రస్టు కొడిగట్టినట్టుంది… మరేం చేస్తాడు..? పరమ పేలవమైన ఆటతీరు కనబరిచే కంటెస్టెంట్లు… బిగ్‌బాస్ టీం మొద్దు నిద్ర… అసలు బిగ్‌బాస్ షోలో వీకెండ్స్ షోలే అట్రాక్షన్… కానీ ఈరోజు ఏం జరిగింది..? నాగార్జునకు చిరాకు ఎక్కువైనట్టుంది… మామూలుగా గంటన్నర ఉండే షోను పావుగంట ముందే ముగించి, దండం పెట్టేశాడు… ఈ నిర్లిప్తత హైకోర్టులో కేసు పడినందుకు కాదు, కోర్టు కొన్ని పరుషమైన వ్యాఖ్యలు చేసినందుకు కాదు, అసలు ఆట […]
రష్యా గ్యాస్ ఆపేసింది… జర్మనీ లబోదిబో అంటోంది… పుతిన్ గ్యాస్ వార్…
పార్ధసారధి పోట్లూరి ……… 70 ఏళ్ల తరువాత జర్మనీ ఆర్ధిక పరిస్థితి దిగజారడం ఇదే మొదటి సారి ! ఏడ్చే వాళ్ళను నమ్మకు, నవ్వే వాళ్ళని ఆపకు… జర్మనీ దేశంలో 70 ఏళ్ల తరువాత తీవ్ర ద్రవ్యోల్బణ పరిస్థితిని ఎదుర్కుంటున్నది. ప్రస్తుతం 7.9 % శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ముందు ముందు ఇంకా పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బహుశా రెండో ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ బాగా దెబ్బతిన్న తరువాత పరిస్థితులు మళ్ళీ పునరావృతం అవుతున్నట్లుగా భావిస్తున్నారు. […]
అనుకోకుండానే… సుహాసిని డిజిటల్ జర్నోలకు భలే సురుకులు పెట్టింది…
అనుకోకుండానే సుహాసిని… అనేకానేక వెబ్ సైట్లు, యూట్యూబర్లకు మంచి చురక పెట్టింది… ఈవెన్ ప్రధాన మీడియా వెబ్సైట్లకు కూడా…! తనకు తెలియకుండానే..! నిజానికి సుహాసినిని లక్షలాది మంది తెలుగు ప్రేక్షకులు ప్రేమిస్తారు, సొంతమనిషిలా అభిమానిస్తారు… అందంలో ఆమె సాదాసీదాయే, కానీ ఆమె గతంలో పోషించిన కొన్ని పాత్రలు, అశ్లీలానికి దూరంగా ఉండటం, వెగటు వేషాలను దగ్గరకు రానివ్వకపోవడం ఎట్సెట్రా ఆ ప్రేమకు కారణాలు… కానీ మొన్న తమ సొంత సినిమా పొన్నియిన్ సెల్వన్ ప్రిరిలీజ్ సభలో ఏదేదో […]
ఐశ్వర్య గైడెన్స్ లేని నెగెటివ్ ఇంపాక్ట్ ధనుష్‌పై..? నేనే వస్తున్నా ఓ ఉదాహరణ..!
సాధారణంగా పెద్ద సినిమాలు ఒకదానితో ఒకటి తలపడవు… వారం పది రోజుల గ్యాప్ ఉండేలా నిర్మాతలు చూసుకుంటారు… ఎలాగూ వీకెండ్ ఉంటుంది… సో, ఆ రోజుల్లో వేరే సినిమా థియేటర్లలో ఉండదు కాబట్టి, సినిమా ఎలా ఉన్నా సరే, అడ్డగోలు టికెట్ రేట్లతో, ప్రేక్షకుల పర్సుల్ని దోచేస్తుంటారు… సినిమా టాక్ వ్యాపించేసరికి తమ డబ్బు సగమైన వచ్చేయాలనేది ఈ గ్యాపింగ్ వ్యూహం వెనుక కక్కుర్తి… ఓహ్, బిజినెస్ స్ట్రాటజీ అనాలేమో… మరి ఒకే టైములో రిలీజ్ చేస్తే…? […]
ఇప్పట్లో హిందీ హీరోల మొహాల్ని హిందీ ప్రేక్షకులే చూసేట్టు లేరు..!
మనం సొంతంగా, మనకు అలవాటైన నార్త్ స్టయిల్లో ఏవో సోది సినిమాలు తీస్తే జనం అడ్డంగా తిప్పికొడుతున్నారు… కానీ సౌత్ ఇండియన్ సినిమాల్ని హిందీలోకి డబ్ చేస్తే, ఆ హీరోల మొహాలు అంతకుముందు చూసి ఉండకపోయినా సరే, హిట్ చేసేస్తున్నారు… కోట్లకుకోట్ల డబ్బు కొల్లగొట్టేస్తున్నయ్ ఆ సినిమాలు, మరి మనమేం చేయాలి..? చేతనైతే కొత్త కాన్సెప్టులు, కొత్త ట్రెండ్లకు వెళ్లాలి… లేదంటే ఏదైనా సౌత్ హిట్ సినిమా రీమేక్ రైట్స్ కొనేసి, మనమే నిర్మించడం… యథాతథంగా హిందీకరించాలి… […]
వెంకటేషూ, వరుణ్‌తేజా… ఇలాంటి జబర్దస్త్ సినిమాలు అవసరమా మీకు..?
భారీ వసూళ్లు సాధించిన సినిమాల్ని కూడా టీవీ ప్రేక్షకులు పట్టించుకోలేదు… రేటింగ్స్ రావడం లేదు… బోలెడంత డబ్బు పోసి శాటిలైట్ రైట్స్ కొన్న చానెళ్లు లబోదిబో అంటున్నాయి… ఈ ధోరణికి ఉదాహరణలు, కారణాలను కూడా మనం గతంలో చెప్పుకున్నాం… జీతెలుగు టీవీలో 18.9.2022న ఎఫ్3 సినిమా ప్రసారం చేశారు… సరే, కుటుంబ ప్రేక్షకులు పెద్దగా హింసను, యాక్షన్‌ను పట్టించుకోరు కాబట్టి స్టారాధిస్టార్ల తాజా సినిమాలను కూడా ఈమధ్య తిప్పికొట్టారు టీవీల్లో… కానీ ఎఫ్3 వినోదప్రధానం అని ప్రచారం […]
గానుగాపూర్ గుడి… జై గురుదత్త… స్వామివారి కటాక్ష ప్రాప్తిరస్తు… పార్ట్-4
గానుగాపూర్ గుడి దగ్గర సమస్య ఏమిటంటే… కొత్తగా వచ్చినవాళ్లు దేవుడి మీద కాన్సంట్రేట్ చేసి, కళ్లుమూసుకుని, కాసేపు భక్తిగా దండం పెట్టుకునే స్థితి లేకపోవడం…! గుళ్లో అనేకమంది వ్యాపారులు… ఎవరి దందా వాళ్లదే… అరాచకం… హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనాలు ఏమిటి..? భక్తుల సొమ్ముతో ఉద్యోగులను మేపడం ఏమిటి..? అక్కడి భక్తులకు, స్థానికులు, ట్రస్టులకే అప్పగించాలనే నా పాత ధోరణికి గానుగాపూర్ ఆలయనిర్వహణ తీరు పెద్ద సవాలే విసిరింది… (జహీరాబాద్ సిద్దివినాయక గుడి దేవాదాయశాఖ పరిధిలో […]
గానుగాపూర్..! చేరే మార్గమేంటి..? చూడాల్సిందేమిటి..? పార్ట్-2
గానుగాపూర్… ఎలా వెళ్లాలి..? ఏది కన్వీనియెంట్…? ఇదీ చాలామందికి ఎదురయ్యే ప్రశ్న… హైదరాబాద్ బేస్‌గా చెప్పాలంటే… 270 కిలోమీటర్ల దూరం… హడావుడిగా వెళ్లిరావడం కుదరదు… ట్రెయిన్ కంఫర్టే… 02702 వంటి స్ట్రెయిట్ రైళ్లే గాకుండా కలబురిగి (గుల్బర్గా) రూట్లో వెళ్లే రైళ్లను చెక్ చేసుకోవాలి… చౌకగా, వేగంగా వెళ్లడానికి ఇదొక మార్గం… కాకపోతే గానుగాపూర్ రోడ్ అనేది స్టేషన్… అక్కడ దిగాలి… అక్కడ నుంచి గానుగాపూర్ ఊరు, గుడి 20 కిలోమీటర్లు, అంటే అక్కడి నుంచి బస్సు […]
గానుగాపూర్… నెగెటివ్ శక్తుల బాధితులకు కొత్త పుణ్యస్థలి… పార్ట్-1
ఆధ్యాత్మికతకు సంబంధించి… విశ్వాసమే దేవుడు… శివుడు, విష్ణువు, బ్రహ్మ, ఇంకా వేలాది మంది దేవుళ్లను నమ్మడం ఆ విశ్వాసమే… ఒక తీర్థస్థలి మీద నమ్మకం ఉండొచ్చు… అంతేకాదు, బతుకంతా ధర్మప్రచారానికి వెచ్చించిన యోగులను కూడా దేవుళ్లుగా భావించడం కూడా ఆ విశ్వాసమే… ఇక గానుగాపూర్ వెళ్దాం పదండి… ఇది కర్నాటకలో, మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే పాత హైదరాబాద్ రాజ్యంలోని ఓ ఆశ్రమం… ముందే చెబుతున్నాను… ఇది సంప్రదాయిక హిందూ దేవుళ్లకు సంబంధించిన గుడి కాదు… మరేమిటి..? ఇది […]
గానుగాపూర్… జాగ్రత్తగా వెళ్లిరండి… చిల్లర దందాలతో చికాకులు… పార్ట్-3
సాధారణంగా గురుదత్తాత్రేయను విశ్వసించేవాళ్లు అధికంగా ఆశ్రయించేది పారాయణం… గురుదత్త పారాయణాన్ని మించిన పూజ మరొకటి లేదంటారు… ఇప్పుడు తెలుగులో కూడా దొరుకుతోంది… లాభార్జనకు గాకుండా హిందూ ఆధ్యాత్మిక ప్రచారం కోసం పనిచేసే గీతాప్రెస్ తెలుగులోకి లోపరహితంగా అనువదించింది… దేవుళ్లకు సంబంధించిన శ్లోకాలు, మంత్రాల్లో అక్షరదోషాలు ఉంటే అసలుకే మోసం… అందుకని ఒకటినాలుగుసార్లు చెక్ చేస్తారు… ఆ పుస్తకంలో చెప్పినట్టు ఇంట్లో కూడా పారాయణం చేసేవాళ్లు చాలామంది… పటం, రెండు ఊదుబత్తీలు, నిర్మలమైన మనస్సు, స్పష్టంగా ఉచ్ఛారణ, రోజూ […]
తేజస్వి రంగారావ్..! పుష్ప అనుకుంటిరా… ఫైర్..! తొలి లేడీ ఇండియన్ విజో..!
పార్ధసారధి పోట్లూరి …. భారతదేశ ఎయిర్ ఫోర్స్ చరిత్రలో మొదటిసారిగా ఒక మహిళ వెపన్ సిస్టమ్ ఆపరేటర్ గా నియమితురాలు అయ్యింది ! WSO [Weapon System Operator] లేదా ముద్దుగా విజ్జో [WIJJOs]గా పిలుస్తారు. మొదటిసారిగా ఒక మహిళా ఆఫీసర్ ఈ ఘనత సాధించింది. ఫ్లయిట్ లెఫ్టినెంట్ Tejaswi Ranga Rao [తేజస్వి రంగారావ్ ] ఆమె పేరు…. ప్రస్తుతం లదాఖ్ దగ్గర మోహరించిన Su-30 MKI స్క్వాడ్రన్ లో జాయిన్ అయ్యింది. ఇంతకీ ఈ […]
నటులు మాణిక్యాలు… దర్శకుడు మణిరత్నం… సినిమా ఓ రంగురాయి…
ఇవ్వాళ్రేపు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం అనేది చాలా పెద్ద టాస్క్… బోలెడు డబ్బు పోసి, టికెట్టు కొనుక్కుని, హాలులో కూర్చున్నాక.., ఆ దర్శకుడు జేమ్స్ కామెరూనా, రాజమౌళా, మణిరత్నమా, ప్రశాంత్ నీలా..? సంజయ్ లీలా భన్సాలీయా..? మనకు అక్కర్లేదు… వాళ్ల గత చిత్ర వైభవాలు అక్కర్లేదు… ఈరోజు చూడబోయే సినిమా ఎలా ఉందనేదే ముఖ్యం..? ఇదే సినిమాకు రెండో పార్ట్ ఉంటుందా, అది బాగుంటుందా లేదనేది కూడా అక్కర్లేదు… ఎందుకిదంతా చెప్పుకోవడం అంటే…? మణిరత్నం మెరిట్ […]
నీ బిడ్డను ఇవ్వు… లేదంటే అప్పు అణా పైసలతోసహా వెంటనే తీర్చెయ్…
సుబ్బారావు అని ఆ ఊళ్లో ఓ వడ్డీ వ్యాపారి… ఎవరికి ఏం అవసరమొచ్చినా అధిక వడ్డీలకు డబ్బులివ్వడం తన అలవాటు… తనంత తెలివిమంతులు వేరే లేరని పెద్ద గీర తనకు… అప్పారావుకు కష్టమొచ్చి పలుసార్లు సుబ్బారావు దగ్గర అప్పు తీసుకున్నాడు… మిత్తీలు కలిపితే తడిసి మోపెడు అవుతోంది… అప్పారావు తీర్చే స్థితిలో లేడని తెలుస్తూనే ఉంది… కానీ వసూలు ప్రయత్నం తప్పదు కదా… గట్టిగా నిలదీసి అడగడానికి అప్పారావు ఇంటికి వెళ్లాడు… అప్పారావు బతిమిలాడుతున్నాడు… ఓ గడువు […]
దిక్కుమాలిన బాయ్‌కాట్ పిలుపు… సో వాట్..? ఓ సింగర్ ఎంపిక కాకపోతే ఏంటట..?!
రాను రాను ఈ బహిష్కరణ పిలుపులు ఓ దిక్కుమాలిన సంప్రదాయంగా మారిపోతున్నయ్… ఏదో పనికిమాలిన అంశాన్ని తీసుకోవడం, ఎవడో బాయ్‌కాట్ అని స్టార్ట్ చేయడం, హ్యాష్‌ట్యాగ్, క్యాంపెయిన్… గొర్రెదాటులా మిగతా సోషల్ కేకలు వేస్తూ మద్దతు పలకడం… తాజాగా ఇండియన్ ఐడల్ బహిష్కరణ అని సోషల్ మీడియాలో సాగుతున్న బాయ్‌కాట్ క్యాంపెయిన్ కూడా ఇలాంటిదే… టీవీల్లో చాలా పాపులర్ ప్రోగ్రామ్స్‌లో ఇండియన్ ఐడల్ కూడా ఒకటి… 2004 నుంచీ సాగుతోంది… 12 సీజన్లు పూర్తి చేసుకుని, ప్రస్తుతం […]
- « Previous Page
- 1
- …
- 311
- 312
- 313
- 314
- 315
- …
- 482
- Next Page »