ఆశ, లక్ష్యం ఉన్నచోట ఆశాభంగం, అసంతృప్తి, ఒత్తిడి, నిరాశ, పరుగు ఉంటాయి…
1.26 కోట్లు ఒక లడ్డూ… ఓ విల్లా ధరలా బాగా ఖరీదైన భక్తి…
in hyderabad one ganesha laddoo prasadam auctioned for 1.26 crores
దంచుడే దంచుడు… తెర నిండా బీభత్సమే… అచ్చమైన బోయపాటి సినిమా…
బోయపాటి దర్శకత్వం అంటేనే… లాజిక్కులు వెతక్కూడదు… దంచుడే దంచుడు… నరుకుడే నరుకుడు… బీభత్సమైన హింస… గాల్లోకి తేలిపోతూ రౌడీలు… సూపర్ మ్యాన్‌లా హీరో ఫైటింగులు… కథా కాకరకాయా చూడొద్దు… భీకరమైన బీజీఎంతో హీరో నెత్తురు పారిస్తూ ఉంటాడు… థియేటర్ దడదడలాడిపోతూ ఉంటుంది… సీఎం లను సైతం తుక్కుతుక్కు కొట్టేసాడు హీరో… స్కంద కాదు, బోయపాటి బొంద… మొన్నమొన్నటి బాలయ్య అఖండ అయినా… రాపో, అనగా రామ్ పోతినేని నటించిన తాజా స్కంద అయినా అంతే… బోయపాటి మారడు… […]
తలుపు తట్టిన చప్పుడు… డెయిలీ పేపర్ కింద పడిన చప్పుడు… నేనింకా బతికే ఉన్నాను…
వార్తాపత్రిక డెలివరీ బాయ్ చెప్పిన కధ హృదయాన్ని హత్తుకుని నా మనస్సుని కదిలించింది *”సౌండ్ ఆఫ్ నాకింగ్”* *పేపర్ బాయ్* : నేను వార్తాపత్రికను డెలివరీ చేస్తున్న ఇళ్లలో ఒక ఇంటి మెయిల్‌బాక్స్ తాళం వేసి ఉంది, అందువలన నేను వారి తలుపు తట్టాను. మిస్టర్ ప్రసాద్ రావు, అస్థిరమైన అడుగులతో నడుస్తున్న వృద్ధుడు, నెమ్మదిగా తలుపు తెరిచాడు. నేను అడిగాను, “సార్, మీ మెయిల్ బాక్స్ ఎంట్రన్స్ ఎందుకు బ్లాక్ చేయబడింది?” ఉద్దేశపూర్వకంగానే బ్లాక్ చేశాను […]
అందంలో… అభినయంలో… జ్యోతికకు ఆమడదూరంలోనే ఆగింది కంగనా…
మొన్నొకసారి చంద్రముఖి హీరోయిన్ల గురించి రాస్తున్నప్పుడు… చంద్రముఖి సీక్వెల్‌కు ఆ పాత దర్శకుడు వాసు దర్శకత్వం వహిస్తున్నాడనీ, చీప్ టేస్టున్న సదరు దర్శకుడు ఈ సినిమాను ఏం చేస్తాడో పాపం అని అభిప్రాయపడ్డాను… అనుమానించినట్టే జరిగింది… ఓ చెత్తా సినిమాను వదిలాడు ప్రేక్షకుల మీదకు… సీక్వెల్‌కూ స్పూఫ్కూ తేడా తెలియదు ఈ దర్శకుడికి… ఓ పాపులర్ కమర్షియల్ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే మరీ ఆ ఒరిజినలే పదే పదే గుర్తొచ్చేలా (పాతదే నయం అని గుర్తొచ్చేలా… […]
ఆయన కంప్యూటర్ కనిపెట్టిన బాబు కాదు… కానీ ఆ భాషల్ని పరపరా నమిలేశాడు…
ఇండియాకు ఐటీని తెచ్చినవాడు… మన ఐటీకి ఆద్యుడు… కంప్యూటర్ కనిపెట్టినవాడు… ఐటీ పితామహుడు… వంటి విశేషణాలతో చంద్రబాబును కీర్తిస్తూ సాగే డప్పులు బోలెడు చదవబడ్డాం… బడుతున్నాం ఇంకా…! తనకు అంత సీన్ లేదని కూడా మనం నిజాలు చెప్పుకున్నాం… సరే, అదంతా వేరే సంగతి గానీ ఓ ప్రశ్న… కంప్యూటర్ను కనిపెట్టిన పితామహుడు చంద్రబాబుకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం తెలుసా..? ఎవరికైనా సమాధానం తెలుసా..? భలేవారే… రాకెట్ కనిపెట్టినవాడు ఆ రాకెట్లో అంతరిక్షానికి వెళ్లి రావాలనేముంది అంటారా..? […]
C C+ అంటే CBN అస్సలు కాదు… అసలు మన ఐటీకి ఆద్యుడెవరో తెలుసా మీకు..?
సీ, సీ ప్లస్ అనబడే ఐటీ భాషలకు ఆ పేర్లు పెట్టిందే సీ ఫర్ చంద్రబాబు అనే భావనతో… ఇదుగో ఈ పోస్టులు చూశాక… హఠాత్తుగా మిత్రుడు Jagannadh Goud… రాసిన ఓ వివరణాత్మక కథనం యాదికొచ్చింది… ఐటీకి ఆద్యుడిగా, హైదరాబాద్‌ను ఐటీ సెంటర్‌గా డెవలప్ చేసింది చంద్రబాబే అనే ప్రచారాన్ని, ఐటీ ఎంప్లాయీస్ దాన్ని నమ్ముతున్న విచిత్రాన్ని బ్రేక్ చేసే కథనం ఇది… నిజాలు ఏమిటో చెప్పే ప్రయత్నమిది… కంప్యూటర్లు నేనే కనిపెట్టాను, మొబైల్ నా పుణ్యమే వంటి […]
వయస్సును వెనక్కి మళ్లించి… మళ్లీ యవ్వనంలోకి తిరుగు ప్రయాణం…
మీకు యయాతి కథ తెలుసు కదా… ఏదో శాపానికి గురై వృద్ధాప్యం మీదపడితే… తన కొడుకుల్ని తమ యవ్వనాల్ని ఇవ్వమని ప్రాధేయపడతాడు… ఎవడూ ఇవ్వడు… చిన్న కొడుకు సరేనని ఇస్తాడు… యయాతి నవ యవ్వనుడు అవుతాడు… మిగతా కథ జోలికి పోవడం లేదు గానీ ఈ యవ్వనంలోకి రావడం వరకే పరిమితం అవుదాం ఇక్కడ… పొద్దున్నే ఓ మిత్రుడి పోస్టు చూడగానే ఈ కథే గుర్తొచ్చింది ఎందుకో గానీ… రేఖ పారిస్ వెళ్లి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని […]
టీవీ5, మహాన్యూస్ ప్రజెంటర్లకే తాతలు ఈనాడు పెద్దతలకాయలు…
చాలారోజుల క్రితం.,. అంటే జగన్ జైలుకు వెళ్లిన తొలిరోజులు… అప్పటికే సాక్షి పత్రిక ప్రారంభమైంది… ఇప్పుడు టీవీ5, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఏబీఎన్, మహాన్యూస్ ప్రదర్శిస్తున్న చిత్త పైత్యాన్నే అప్పట్లో సాక్షి కూడా ప్రదర్శించింది… ప్రత్యేకించి ఒక వార్త… ఇప్పుడు దాని క్లిప్పింగ్ దొరకడం లేదు గానీ బాగా వైరల్… ఓ పసిపిల్లాడు జగన్ అరెస్టయ్యాక ఏడుస్తూ అన్నం కూడా తినడం లేదట… టీవీలో జగన్ వీడియో ఏదో చూపించాక తిన్నాడట… దాదాపు ఇలాంటి వార్తే… భజన […]
ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు… కానీ ఆస్కార్ బరికి సరైన అధికారిక ఎంపిక…
1, ది స్టోరీ టెల్లర్ (హిందీ), 2, మ్యూజిక్ స్కూల్ (హిందీ), 3, మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ), 4, ట్వెల్త్ ఫెయిల్ (హిందీ), 5, విడుథలై పార్ట్-1 (తమిళ్), 6, ఘూమర్ (హిందీ), 7, దసరా (తెలుగు), 8, వల్వి (మరాఠీ), 9, గదర్-2 (హిందీ), 10, అబ్ తో భగవాన్ సే భరోసే (హిందీ), 11, బాప్ లాయక్ (మరాఠీ), 12, రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ (హిందీ), 13, జ్విగాటో […]
భలే భలే… 955 అసలు ధరట… 1000 సబ్సిడీ అట… అద్దిరిపోయే స్కీమ్…
పొద్దున్నే ఓచోట… ఎక్కడ దొరికిందో గానీ ఒకాయన ఆంధ్రప్రభ పట్టుకున్నాడు… పక్కవాడిని అడుగుతున్నాడు… ‘‘కేసీయార్ ఒక్కో సిలిండర్ మీద 1000 రూపాయల సబ్సిడీ ఇస్తాడట… ఈ పేపరోడు రాసిండు… ఇప్పుడు సిలిండర్ రేటే 955… అంటే సిలిండర్ బుక్ చేస్తే 45 రూపాయలు ఉల్టా మనకే ఇస్తారా..? భలే ఉంది కదా స్కీమ్..?’’ ఆ పక్కన కూర్చున్నాయన తెల్లమొహం వేశాడు… ఏం సమాధానం ఇవ్వాలో తెలియడం లేదు… వెయ్యి రూపాయల సబ్సిడీ అని వార్త రాసిన విలేఖరి, […]
ముందుగా మనకు కొంత డబ్బిస్తారు… తర్వాత మొదలవుతుంది అసలు కథ…
Nàgaràju Munnuru…… మా ప్రాజెక్ట్ Aspire లో శిక్షణ పొంది, ఉద్యోగం చేస్తున్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది. గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ _________, సార్, మీరు చాలామందికి హెల్ప్ చేస్తారు కదా! నాకు ఒక హెల్ప్ కావాలి సర్. ఇంతకు నీకు ఏ సహాయం కావాలో చెప్పు, నేను చేయగలిగేది అయితే తప్పకుండా చేస్తాను. సర్, నాకు ఒక 5500 కావాలి సర్. ఎందుకు ఈ డబ్బులు? అమెజాన్ వర్క్ ఫ్రం హోం […]
మౌనం రాగం మధురం మంత్రాక్షరం… కంపోజర్‌గా కూడా బాలు ఘనుడే…
Bharadwaja Rangavajhala…. స్వరకల్పన… చీకటిలో వాకిట నిలిచీ దోసిట సిరిమల్లెలు కొలిచీ … 1977 లో రేడియోలో ఆ పాట వినిపించగానే వాల్యూమ్ పెంచేవారు శ్రోతలు. జయమాలిని, శ్రీవిద్య హీరోయిన్లు గా చేసిన కన్యాకుమారిలో పాట అది. దర్శకుడు దాసరి ఎందుచేతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంగీత దర్శకత్వం ఛాన్స్ ఇచ్చారు. అంతే బాలు చెలరేగిపోయాడు. ఆ తర్వాత బాపు, జంధ్యాల, సింగీతం లాంటి క్రియేటివ్ జీనియస్సుల దగ్గర సంగీతం చేశారు. అనేక గుర్తుండిపోయే గీతాలకు ప్రాణం పోశారు. కన్యాకుమారితో మొదలై జైత్రయాత్ర […]
దాదా సాహెబ్ ఫాల్కే… పద్మభూషణ్… కానీ అవార్డుల సంఖ్య చాలా తక్కువ…
1955… రోజులు మారాయి అనే తెలుగు సినిమా… కల్లాకపటం ఎరుగనివాడా, ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా అనే పాటలో తొలిసారి నర్తించింది వహీదా రెహమన్… అంటే 68 ఏళ్ల క్రితం… ఇప్పుడామె వయస్సు 87… సుదీర్ఘమైన సినిమా ప్రయాణం… అయితే ఈ ప్రస్థానంలో ఆమెకు లభించిన అవార్డుల సంఖ్య స్వల్పం… అది ఆశ్చర్యకరం… నిజానికి అవార్డులే ఆమె వెంటపడాలి… తెలుగు, తమిళంలో యాక్ట్ చేసినా సరే, ఆమె ప్రధానంగా పనిచేసింది హిందీ, మరాఠీ ఇండస్ట్రీల్లో…! ఇన్నేళ్ల పయనంలో […]
కంగనా రనౌత్ నార్త్ చంద్రముఖి… నాలుగు కాదు, ఆమె నంబర్ అయిదు…
సినిమా సైట్లు, యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది… చంద్రముఖిగా ఎవరు బాగా చేశారు అని..! సరదాగా బాగానే ఉంది కానీ చాలామంది కంగనా రనౌత్‌ను నాలుగో నంబర్ చంద్రముఖిగా చెబుతున్నారు… అదీ బ్లండర్… ఆమె త్వరలో విడుదల కాబోయే చంద్రముఖి-2 సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది… నటిగా ఆమె మెరిట్‌కు వంక పెట్టలేం… కాకపోతే ఆమె సౌత్ సినిమాల్లో నటించి ఎప్పుడూ పెద్దగా క్లిక్ కాలేదు… ఈ సినిమా రిజల్ట్ చూడాలిక… దెయ్యం, […]
Right to Sit… సేల్స్ గరల్స్ కూర్చోకూడదా..? గంటల కొద్దీ నిలబడే ఉండాలా..?
(ప్రభాకర్ జైనీ)……. ఇయ్యాల నాకు చాన సంతోషంగ ఉన్నది. ఇంటర్మీడియట్ పరీక్షల ఫస్ట్ క్లాసుల పాసయిన. ఇంటర్నెట్ సెంటరుల ఇచ్చిన కాగితాన్ని తీసుకోని బయటకొచ్చి ఇంటి ముఖం పట్టిన. కనీ, దూరం పంటి కూలిపోయేటట్టున్న మా ఇల్లు చూసెటాలకు, నాకు నా భవిష్యత్తు ఎట్లుంటదో అర్థమయింది. పై చదువులు చదివించే స్థోమత మా ఇంట్లోల్లకు లేదని నాకర్థమైంది. మనసు చంపుకున్న. పై చదువులు చదువాలనే ఆశను మొగ్గల్నే తుంచేసుకున్న. మా ఊరు, పట్నం గదే, హైద్రాబాదుకు నలభై రెండు […]
నాయకుడు పదే పదే గట్టిగా చెప్పాడంటే… దానికి వ్యతిరేక దిశలో వెళ్తున్నట్టు లెక్క…
జర్నలిస్ట్ లు అవకాశం ఉన్నంత వరకు చదవాలి . 87 నుంచి 94 వరకు జిల్లాల్లో పని చేసేప్పుడు చాలా మంది జర్నలిస్ట్ లు జిల్లా పేజీలు మాత్రమే చదివేవారు . ఆ తరువాత మనం రాసిన వార్త మనం చదివితే పేపర్ చదివినట్టే అనే దశకు చేరుకున్నాం . ఇప్పుడు ఆ దశ కూడా దాటి పోయి టివిలో న్యూస్ చూడడమే తప్ప చదవడం అనే అలవాటు తగ్గిపోయింది .నాయకుల మాటల్లో మర్మం అర్థం చేసుకోవడానికి […]
ఆరోజు విమానంలో… మా పాపను ఆయన ఎత్తుకుని లాలిస్తూ…
Prabhakar Jaini ఒక రోజు ఉదయం చీకటి తెరలు ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు కూడా! అప్పుడు కలిసిన వ్యక్తి! మేం కొత్త దంపతులం. అంటే అప్పటికే మా పాపకు రెండు నెలల వయసు. విమానంలో తిరుపతికి వెళ్ళాలని ప్లాను చేసుకుని, అంతకు ముందు సంవత్సరం పాటు డబ్బులు కూడబెట్టుకున్నాము. అప్పుడు నాది చాలా చిన్న ఉద్యోగం. వరంగల్ మునిసిపాలిటీలో క్లర్క్ ఉద్యోగం. కానీ, కోరికలు ఉండకూడదని ఏం లేదు కదా? వరంగల్ నుండి ముందు రోజు బయలుదేరి […]
ఆ మూగజీవాలూ మన కుటుంబసభ్యులే… ఆ ఉద్వేగాల్ని పట్టించిన మూవీ…
“రామే ..అండాళుం రావణే అండాళుం” ఆనందంతోనో.. బాధతోనో రెండు కన్నీటి చుక్కలు రాల్చలేని కళ్లెందుకు?? .. బావోద్వేగాన్ని పంచలేని గుండె ఎందుకు ?? చివరికి అవయవదానం చేసుకోవడానికి తప్ప ఇంక దేనికి పనికిరావు .. మనిషికి, రోబోట్ కి తేడా ఏంటి అంటే ?? ఫీలింగ్స్ లేకపోవడమే అంటాడు ..రోబో సినిమాలో వశీకరణ్..నిజమే స్పందనలు , బాధ , సంతోషం , ఉద్వేగం , ఆవేశం ఇవన్నీ ఉంటాయి కాబట్టే మనం మనుషులం అయ్యాం .. కానీ […]
మైనార్టీ వోట్లతో వయనాడ్‌లో గెలిచిన రాహుల్… హైదరాబాద్‌లో నిలబడతాడా..?
Nancharaiah Merugumala…. రాహుల్ గాంధీని వాయనాడ్ కమ్యూనిస్టులు ఉత్తరాదికి పొమ్మంటుంటే… కాంగ్రెస్ ‘ప్రిన్స్’ హైదరాబాద్ లో పోటీకి దిగాలని మజ్లిస్ నేత అసదుద్దీన్ సవాల్! ………………………………………………………………………………………………………. భారత్ జోడో యాత్ర తర్వాత, ఇటీవల పార్లమెంటులో, వెలుపలా పదునైన ప్రసంగాలతో తన ‘నేషనల్ స్టేచర్’ పెంచుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కాంగ్రెసన్నా, నెహ్రూ–గాంధీ కుటుంబమన్నా ఎమర్జెన్సీ పెట్టిన 1975 జూన్ 25 నుంచీ ఘోరంగా వ్యతిరేకించే నాలాంటి ‘అవిశ్రాంత’ పాత్రికేయులు సైతం రాహుల్ భయ్యా ముఖంలో పొంగిపొర్లుతున్న […]
- « Previous Page
- 1
- …
- 313
- 314
- 315
- 316
- 317
- …
- 390
- Next Page »


















