పాత వార్తేమీ కాదు… అయిదారు రోజుల క్రితం వార్త… ఏమిటంటే..? తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ భార్య దుర్గ ఏ సెక్యూరిటీ, ప్రోటోకాల్, అధికార అట్టహాసాలు, పటాటోపాలు, అధికారుల భజన గీతాలు ఏమీ లేకుండా…. ఓ సామాన్య భక్తురాలిగా దేవుడిని దర్శించుకుని వెళ్లిపోయింది… ఇదీ వార్త… నచ్చింది… ఒక సీఎం భార్య… అదీ ఆ దేవుడిని తమిళులు మా సొంత దేవుడే అని ఓన్ చేసుకుంటుంటారు… ఆ మంత్రాలూ తమిళంలోనే ఉంటాయంటారు… అక్కడికి నిరాడంబరంగా వెళ్లి, కేవలం భక్తి […]
బుల్డోజర్ సర్కార్..! 46 ఏళ్ల క్రితం సంజయ్ గాంధీ మొదలుపెట్టిందే…
Nancharaiah Merugumala……….. నలభై ఆరేళ్ల క్రితం… అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చిన్న కొడుకు సంజయ్ గాంధీ చొరవతో, దిల్లీ పాతనగరం తుర్కమన్ గేట్ ప్రాంతంలో పాత ఇళ్లు, రేకులతో వేసిన ‘పూరిళ్లు’ తొలగించే ప్రయత్నం విజయవంతంగా పూర్తిచేశారు… ఎమర్జెన్సీ కాలంలో- 1976 వేసవిలో బుల్డోజర్లతో పేదల గృహాలు నేలమట్టం చేశారు. ఇప్పటి బుర్ర తక్కువ హిందుత్వ పాలకుల మాదిరిగా కాకుండా ‘యువరాజు’ నాయకత్వంలోని ప్రభుత్వాధికారులు- యువజన కాంగ్రస్ నేతల బృందాలు కేవలం కూలగొట్టుటకే పరిమితం కాలేదు. దాదాపు […]
ఇంతకీ ఈ ‘‘కాన్వాయ్ కథలో’’ సదరు హోంగార్డు చేసిన తప్పేమిటబ్బా..!!
సీఎం జగన్‌కు ప్రభుత్వ వాహనాల కాన్వాయ్ ఉంటుంది… సెక్యూరిటీ వెహికిల్స్ విడిగా ఉంటాయ్… ఇంకా కావాలంటే తన సొంత వాహనాలు ఎన్నంటే అన్ని వెంట పరుగులు తీస్తాయ్… వెంట పోలోమంటూ అనుసరించి వచ్చే నాయకులకు కూడా వాహనాలు ఉంటయ్… మరి ఎప్పుడూ సీఎం పర్యటన అనగానే కాన్వాయ్ పేరిట ప్రైవేటు వాహనాలను స్వాధీనం చేసుకుని ఏం చేస్తారు..? అసలు కాన్వాయ్‌కు ప్రజలు వాహనాలను సమకూర్చడం ఏమిటి..? పోనీ, ఏదైనా సభ ఉందంటే ప్రైవేటు బస్సుల్ని, లారీల్ని, జీపులను, […]
పేరుకు పెద్ద పెద్ద వంటగాళ్లు… ఒక్కరికీ గసగసాల వాడకం తెలియదు…
ఖస్ ఖస్ అంటారు హిందీలో… తెలుగులో గసగసాలు… ఇంగ్లిషులో పాపీ సీడ్స్… మన ఈతరం వంటగత్తెలు, వంటగాళ్లు మరిచిపోయారు దాని వాడకం… ప్రత్యేకించి పెద్ద పెద్ద చేతులు తిరిగిన చెఫులకూ గసగసాల వాడకం తెలియదు… మిలియన్ల వ్యూస్ ఉన్న, వేయి వంటల వీడియోలు చూస్తే ఒక్క దాంట్లోనూ గసగసాలు వాడుతున్నట్టుగా లేదు… నిజానికి వేల ఏళ్లుగా గసగసాలు లేక భారతీయ వంటశాల లేదు… అనేక వంటల్లో అవి పడాల్సిందే… ఇప్పుడేమో కిరాణా సామగ్రి జాబితా నుంచి మాయమైపోయింది […]
what next yash..! సౌతిండియన్ సూపర్ బ్రాండ్ యశ్ ఎదుట పెద్ద ప్రశ్న..!!
Sridhar Bollepalli…………… సౌతిండియా సునామీ.. యష్…. అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. వయసు 36. కాలేజీ రోజుల్లోనే వొక డ్రామా కంపెనీలో చేరి స్టేజీ మీద యాక్ట్ చేశాడు. పద్దెనిమిదేళ్ల వయసులో టీవీ సీరియల్లో చేసే అవకాశం వచ్చింది. నాలుగేళ్ల తర్వాత మొదటి సినిమా ఛాన్సు. ఫస్ట్ సినిమా ఎవరికీ పెద్దగా పట్టినట్టు లేదు. రెండో సినిమా “మొగ్గిన మనసు” హిట్. 2008 లో వచ్చిన యీ సినిమాలో హీరోయిన్ రాధికా పండిట్. మొదట్లో పడేది […]
ఓహో… అలా జీఎస్టీ నోటీసులు జారీ… ఇలా రాజా వారి భజన షురూ…
ఆయన మోడీ మీద రెండు ప్రశంసాపుష్పాలు విసిరాడు… అంతే, అప్పటిదాకా తనను వీరాభిమానించేవాళ్లు సైతం చాలామంది హఠాత్తుగా మనువాదిని చేశారు… మతోన్మాది అన్నారు… సంఘీ అని తిట్టారు… ఇన్నేళ్ల తమ అభిమానానికి నిలువెత్తు పాతరేసి, యమర్జెంటుగా రెండు మూడు పుష్పాల్ని నివాళిగా అర్పించారు… ఖతం… ఇళయరాజా… గొప్ప సంగీతకారుడే… డౌట్ లేదు… అదేసమయంలో పలు వివాదాల్లోనూ ఆయన పేరు తరచూ వినిపిస్తుంటుంది… ప్రత్యేకించి సినిమా పాటల రాయల్టీ గట్రా… ఆ కెరీర్, ఆ ప్రపంచం వేరు… ఆయన […]
వార్ టాక్టిక్స్…! ఓ డ్రోన్‌తో తెలివైన ఆట ఆడి… రష్యా యుద్ధనౌకనే పేల్చిపారేశారు..!!
పార్ధసారధి పోట్లూరి ………. భారతదేశ రక్షణ విషయంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి అనేది చాలా చిన్న మాట ! భారతదేశ రక్షణ రంగములో 75% కి పైగా రష్యాకి చెందిన ఆయుధాలు ఉన్నాయి. మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దాని మీదనే ఆధారపడుతూ వచ్చాం మన దేశ రక్షణ అవసరాల కోసం… బ్రిటీష్ వాళ్ళు వెళుతూ మనకి వదిలేసిన ఆయుధాలతో మొదలు పెట్టి, తరువాతి కాలంలో సోవియట్ యూనియన్ నుండి మెల్లగా ఆయుధాలు కొనడం ప్రారంభించాము. నెహ్రూ అలీన […]
సారీ… సారీ… లెంపలేసుకున్న అక్షయ్… మహేశ్, షారూక్, అజయ్ మాటేమిటో…
మన హీరో మహేశ్ బాబు మంచోడు… అందగాడు, వివాదాల్లో వేలుపెట్టడు… బోలెడు మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించాడు… ఇలా చాలా చాలా చెప్పుకుంటాం… కానీ నాణేనికి మరోవైపు… నీకు ఈ గుట్కాల సరోగేట్ యాడ్స్ డబ్బు, ఆ పెంట మీద డబ్బు అవసరమా నీకు అనీ తిట్టుకుంటాం… దేనిది దానికే… దూద్కాదూద్ పానీకాపానీ… ఆమధ్య అమితాబ్ బచ్చన్ టపటపా చెంపలేసుకుని, తాను ఇక గుట్కా యాడ్స్‌లో యాక్ట్ చేయను, ఇప్పటికే తీసుకున్న డబ్బు వాపస్ పంపించేస్తున్నాను […]
మంచితనం అక్కడక్కడా బతికే ఉంది… ఓ పాత కథే… ఏ మూలో ఏదో నిరాశ…
ఫస్ట్.., ఎవరో మార్నింగ్ వాకర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఇన్సిడెంట్ ఆధారంగా… ది లాజికల్ ఇండియన్ సైటులో వచ్చినట్టుంది ఇది… తరువాత ది హిందూ, తరువాత పలు పత్రికలు… తెలుగులో Bade Raja Mohan Reddy తెలుగీకరించి ఫేస్బుక్లో రాస్తే కొన్ని వేల షేర్లు, లైకులు… సైట్లు, టీవీలు, యూట్యూబర్లు కూడా ఎడాపెడా వాడేసుకున్నారు ఈ స్టోరీని… ఎందుకు..? తెల్లారి లేస్తే మొత్తం నెగెటివిటీయే కమ్మేస్తోంది మనల్ని… రకరకాలుగా… సమాజం, మీడియా, రాజకీయాలు, ప్రభుత్వాలు, మనుషులు, […]
రాష్ట్రపతి కుర్చీలో ఇప్పటికైనా ఓ గిరిజన మహిళ… Why not Draupadi Murmu…!
తన సీనియారిటీని అగౌరవపరిచి, తనను పక్కకు తోసేసిన గురుద్రోహాన్ని కడుక్కోవడం కోసం మోడీ అద్వానీని రాష్ట్రపతిని చేయడం బెటర్ అంటాడు ఒకాయన… అబ్బే, వెంకయ్య నాయుడికే ప్రమోషన్ ఇవ్వడం మేలు అంటారు ఇంకొకాయన… నో, నో, విపక్ష వోట్లు లేకుండా రాష్ట్రపతిని గెలిపించుకోలేదు బీజేపీ, అందుకే శరద్ పవార్‌ను పెడితే సరి, ఈజీ అని సూచిస్తున్నాడు మరొకాయన… ఇవన్నీ కాదు, గులాం నబీ ఆజాద్‌ను రాష్ట్రపతిని చేస్తే గాయపడిన కశ్మీరీయులకు కొంతైనా స్వాంతన దక్కుతుంది అని తేల్చేశాడు […]
కేజీఎఫ్_2 మీద ఉత్తరాది మూవీ మీడియా వివక్ష..? ఎందుకో తెలియని కుతకుత..!!
ఇది ఎప్పుడూ ఓ చిక్కు ప్రశ్నే… ఒక సినిమా రివ్యూ ఎలా ఉండాలి..? ఎందుకంటే..? కొన్నిసార్లు సినిమా ఏమాత్రం బాగాలేకపోవచ్చు, కానీ కమర్షియల్‌గా సూపర్ హిట్ కావచ్చు… అలాగే సినిమా బాగున్నా సరే కమర్షియల్‌గా క్లిక్ కాకపోవచ్చు… దానికి రకరకాల కారణాలుంటయ్… అయితే బేసిక్‌గా ఓ ఫిలిమ్ రివ్యూయర్ తన వ్యక్తిగత అభిరుచిని ప్రామాణికంగా తీసుకోవాలా..? మెజారిటీ ఆడియెన్స్ పల్స్‌ను పట్టుకోవాలా..? ఏది ముఖ్యం..? ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకొస్తున్నదంటే..? కేజీఎఫ్-2 సినిమా…!! మొదట పుష్ప… తరువాత […]
తాతినేని అనగానే గుర్తొచ్చేది యమగోల… అబ్బో, ఆ స్టెప్పులు, ఆ పాటలు…
నాకెందుకో తాతినేని రామారావు అనగానే జస్ట్, యమగోల గుర్తొస్తుంది… ఆయన ఖాతాలో అరవయ్యో, డెబ్బయ్యో సినిమాలు ఉండవచ్చుగాక… చాలావరకు హిందీ సినిమాలకే పరిమితమయ్యాడు ఆయన… నిజానికి ఆ యమగోల సినిమాకు సంబంధించి కూడా ఎన్టీయార్‌కు ఆయనపై పెద్ద విశ్వాసం ఉండేది కాదు… కానీ అది సూపర్ డూపర్ బంపర్ హిట్… ఆగండాగండి… ఆ సినిమా ఏదో ఫన్ బేస్డ్ సినిమా… కానీ ఫుల్లు వెగటు భంగిమలు, శృంగార గీతాలు… మరీ అర్ధరాత్రి దాటాక జాతరల్లో వేసే రికార్డింగ్ […]
ప్రశాంత్ కిషోర్ చూపే బాట ఎటువైపో మరి..?! జవాబుల్లేని ప్రశ్నలెన్నో..!!
అవును సరే గానీ… 4 రోజుల్లో సోనియమ్మను ప్రశాంత్ కిషోర్ మూడుసార్లు కలిశాడు… మిషన్ 2024 గురించి చర్చించాడు… ఈ ఔట్ సోర్సింగ్ దేనికోయ్, పార్టీలోకి వచ్చెయరాదూ, జనరల్ సెక్రెటరీ ఐపో అంటారు వాళ్లు… తనేమో వ్యాపారి… సరుకు అమ్ముతాడు తప్ప, పుణ్యానికి ఇస్తే ఏం ఫలం..? పైగా వందల కోట్ల దందా తనది… సో, చివరకు బేరం ఎంతకు కుదురుతుందో చెప్పలేం… గుజరాత్ సహా ఏడెనిమిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వరకేనా..? వచ్చే జనరల్ ఎన్నికలకు […]
పుష్ప కేసులో అసలు సర్‌ప్రయిజింగ్ ఫ్యాక్ట్ ఇది… అంతుపట్టని ఏదో మిస్టరీ…
అనకాపల్లి పుష్ప క్రైం స్టోరీలో బాగా నచ్చిన అంశం ఒకటుంది… ఆమె కాబోయే భర్త రాము నాయుడిపై దాడి చేసింది… తనకు రక్తం కారిపోతున్నా సరే, మైండ్ ఒక్కసారిగా షాక్‌కు గురైనా సరే ఆ అబ్బాయి ఏం చేశాడు..? ఆమెపై ఎదురుదాడి చేయలేదు… ఆవేశంతో హత్యాయత్నం ఏమీ చేయలేదు… మానసిక స్థితి అదుపు తప్పిన ఆమె ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందో అని భయపడి, ఆమెను సంఘటన స్థలం నుంచి వాపస్ తీసుకొచ్చాడు… తరువాత హాస్పిటల్లో చేరాడు… నిజానికి […]
నిక్కచ్చిగా… నిజాయితీగానే రాశాడు… ఎందుకు చీకటిగదిలో బందీ అయిపోయిందో…
సినిమా, టీవీ ఇండస్ట్రీ అంటేనే వెయ్యి శాతం హిపోక్రసీ… అవకాశవాదం… డబ్బు తప్ప మరేమీ అక్కడ కనిపించదు… కరెన్సీ నోటు ఎన్ని దుష్కృత్యాలైనా చేయిస్తుంది… బయట సమాజం గొప్పగా ఉందని కాదు… కానీ ఫిలిమ్, టీవీ ఫీల్డుల్లో… ఆ రంగుల ప్రపంచాలు విసిరే ట్రాపులు, కరిగే కలలు, కారే కన్నీళ్లు, మోసాలు, కుట్రలు, అబద్దాలు, ఆత్మవంచనలు, వెన్నుపోట్లు, నయవంచనలు, లైంగిక దోపిడీలు, తార్పుడు బాగోతాలు… వాట్ నాట్… అదొక అధోప్రపంచం… కొందరు ఉంటారు… సక్సెస్ అయినా, ఫెయిల్ […]
సరిగ్గా కుదరాలే గానీ… ఈ పబ్బియ్యం ముందు దమ్ బిర్యానీ కూడా బలాదూర్…
చాలామందికి ఉప్మా అంటే ఓ దురభిప్రాయం… అసలు అదీ ఓ ఆహారమేనా..? వంటేనా..? అని ఈసడించుకుంటారు… కానీ పెళ్లిళ్లయినా, ఫంక్షన్లయినా, సమయానికి వేరే వంట వండటానికి ఓపిక లేకపోయినా… చకచకా కొందరి కడుపులు నింపడానికి ఉప్మాయే బెస్టు… కడుపులకు నష్టం కలగజేయదు కూడా… సరే, దాన్ని కూడా రకరకాలుగా వండుకుని ఇష్టపడేవారు కూడా ఉంటారు… ఆ ఉప్మాయణం వదిలేస్తే అది టిఫిన్ మాత్రమే… అంచుకు ఏమున్నా, (నంజుకు), ఏమీ లేకపోయినా జస్ట్, ఉప్మాను అలాగే ‘రా’ సరుకు […]
మొదట్లో ఓ వాచీ రిపేరర్… హాలీవుడ్‌కు దీటైన సినిమాటోగ్రాఫర్ ఇప్పుడు…
చెప్పు సారూ, చెప్పు… కేజీఎఫ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సక్సెస్ స్టోరీ చెప్పావు… ఫేట్, డెస్టినీ, టైం అన్నావు… సేమ్, అదే కేజీఎఫ్-2 ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి టీన్స్‌లో ఉన్న ఓ పిల్లాడని చెప్పావు… అసలు ఆ దర్శకుడు ప్రశాంత్ నీల్ తనే ఓ డిఫరెంట్ కేరక్టర్ అని చెప్పావు… యశ్ బాడీగార్డును ఓ మెయిన్ విలన్‌గా మార్చిన తీరు కూడా చెప్పావు… సరే, కానీ కేజీఎఫ్ సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణం సినిమాటోగ్రఫీ కదా… […]
నన్ను తప్పించండి ప్లీజ్ అని అడిగిందట… మోడీ, షా బదిలీ చేసేస్తున్నారట…
వివిధ సమాచార మార్గాల్లో తమకు అందే లీకులు లేదా కాన్ఫిడెన్షియల్ సమాచారం ఆధారంగా మీడియా సంస్థలు పలు ఊహాగానాలు చేయడం సాధారణమే… కొన్నిసార్లు నిజంగానే అనుకోకుండా అవి నిజం అవుతుంటాయి… ఈ వార్త ఒకటి విస్మయకరంగా అనిపించింది… తెలంగాణ గవర్నర్ తమిళిసై నిన్న విలేకరులతో చిట్‌చాట్ చేస్తూ… ప్రధాని, రాష్ట్రపతి, హోంమంత్రి తనకు బలమైన మద్దతుగా నిలుస్తున్నారని, చాలా అంశాల్లో ఒక గవర్నర్‌గా కేంద్రానికి నివేదికలు పంపిస్తున్నాననీ చెప్పుకొచ్చింది… అదేసమయంలో ఆవేదనను షేర్ చేసుకుంది… పాత ఫోటోలతో […]
బ్రేక్‌ఫాస్ట్ ఎగ్ శాండ్విచ్… లంచ్‌లో బాయిల్డ్ ఎగ్స్… సాయంత్రం ఎగ్ పరోటాలు…
‘‘మా నాన్న వెజిటేరియన్… మా తాత, బామ్మ కూడా అంతే… నేనేమో ఎగిటేరియన్… నాకు కావల్సిన ప్రొటీన్ల కోసం తప్పదు… చాలా ఎగ్స్ తింటుంటా… నా అవసరం అది… దాదాపు రోజుకు 12 ఎగ్స్ తప్పవు… అవేం సరిపోతాయి..? అందుకే పుష్కలంగా కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్ షేక్స్ కూడా డైట్లో తప్పనిసరి… పొద్దున్నే ఓ ఎగ్ శాండ్విచ్, ఏదైనా ఫ్రూట్ జ్యూస్… మధ్యాహ్నభోజనంలోకి కాస్త ఎక్కువ మోతాదులోనే అన్నం, అందులోకి పాలకూర వంటి ఏదైనా ఆకుకూర ప్లస్ పప్పు […]
నచ్చావు కార్తీక్..! జడ్జిగా నో మొహమాటమ్స్… పాడి చూపించడంలోనూ అదుర్స్..!!
సాధారణంగా ఆహా ఓటీటీలోని కంటెంటు మీద పెద్దగా సదభిప్రాయం ఉండదు… తొలిసారి కాస్త చూడబుల్ అనిపించింది బాలయ్య అన్‌స్టాపబుల్ షో… గొప్పగా ఉందని కాదు… కొత్త బాలయ్యను చూపించింది ఆ షో… అలాగని తీసికట్టుగా కూడా ఏమీ లేదు… ఇప్పుడు ఇండియన్ ఐడల్ షో ఇంకాస్త చూడబుల్… ఇదీ అంతే… గొప్పగా దుమ్మురేపుతుందని కాదు… ఇతర టీవీల్లో వచ్చే సంగీత ప్రధాన షోలతో పోలిస్తే నాలుగైదు మెట్లపైనే ఉంది… ప్రత్యేకించి శని, ఆదివారాల్లో పెట్టిన బాలు నివాళి […]
- « Previous Page
- 1
- …
- 316
- 317
- 318
- 319
- 320
- …
- 448
- Next Page »