కరణం గారి పగ, కాటికి చేరినా పోదు… అని ఓ సామెత… ఉండవల్లి అరుణ్‌కుమార్ బ్రాహ్మల్లో ఏ విభాగమో తెలియదు గానీ… వీరముదురు కరణం… పట్టువదలని విక్రమార్కుడు టైపులో పగవీడని అరుణార్కుడు… రామోజీరావును అప్పుడెప్పుడో వైఎస్ రాజకీయ, వ్యక్తిగత అవసరాల కోసం టార్గెట్ చేశాడు ఉండవల్లి… సరైన పాయింట్లు పట్టుకుని, వెంటపడతాడు కాబట్టి ఉండవల్లే కరెక్టని ఆయనకు అప్పగించాడు వైఎస్… వైఎస్ మరణించాక, జగన్‌తో ఉండవల్లికి పెద్దగా సత్సంబంధాలు లేక, కేసీయార్‌కు రామోజీని సాధించడం ఇష్టం లేక, […]
హేపీ మెన్స్ డే బావా… ఇక్కడ పులుసు మరుగుతోంది, తరవాత కాల్ చేస్తా…
Gottimukkala Kamalakar…… సరికొత్త సీసాలో పాత సింగిల్ మాల్టు: నేను: బావా..! ఇవాళేదో ఇంటర్నేషనల్ మెన్స్ డే అటగా..? సాయంత్రం కలుద్దామా..? వాడు: చూస్తాలేరా..! ఇప్పుడే చెప్పలేను. నేను: ఏం చేస్తున్నావ్..? వాడు: పనిమనిషి స్కూటీ సర్వీసింగ్ కి ఇచ్చిందట. రాలేనని మా ఆవిడకి వాట్సాప్ లో మెసేజెట్టింది..! నేను: నీకెందుకు చెయ్యలేదు…? వాడు: నా దగ్గర తన జియో సిమ్ నంబరుందిరా..! అది మా ప్రైవేట్ చాట్ కే. అపార్టమెంట్ వాట్సాప్ గ్రూపులో ఎయిర్ టెల్ […]
షాకింగ్… స్మిత సభర్వాల్ అంత పనిచేసిందా..? ఔనా… నిజమేనా..?
‘‘ఫలానా హోటల్ మూసేస్తారట కదా… అరెరె… అందులో బటన్ ఇడ్లీ బాగుండేది… మసాలా చాయ్ అదిరిపోయేది… శుభ్రంగా ఉండేవి పరిసరాలు… ధరలు కూడా రీజనబుల్… ప్చ్, ఆ హోటల్‌కు బైబై చెప్పాల్సిందేనా..?’’ అని ఎవరైనా ట్వీట్ చేస్తే ఏమిటి అర్థం..? ఛిఛీ, ఇదేం హోటల్ర భయ్, గుడ్‌బై అని చెప్పినట్టు కాదు కదా… అసలే కాదు… పైగా సదరు హోటల్‌తో అనుబంధాన్ని చెప్పుకున్నట్టు…! ఉదయమే కొన్ని వార్తలు చదవగానే ఇదే స్ఫరించింది… ముందుగా ఆ వార్తల సారాంశం […]
స్టార్ హీరోల బిల్డప్పుల్నే ఈడ్చి కొడుతున్నారు… ఏ లోకంలో ఉన్నవ్ సుధీర్..?
గెహనా సిప్పీ… మొదట్లో మోడల్… ముంబై పిల్ల… వయస్సు జస్ట్, 22… చోర్ బజార్ అనే సినిమా కోసం మనవాళ్లే పట్టుకొచ్చారు… నిజం చెప్పాలంటే అందంగా ఉంది… కష్టపడాలే గానీ మంచి కెరీర్ కూడా ఉంది… గాలోడు సినిమా చూస్తే ఆమె ఒక్కతే కాస్త నటించింది అనేట్టుగా ఉంది… సినిమా షకలక శంకర్ సినిమా, సప్తగిరి సినిమా అన్నట్టుగా ఉంది… నిజానికి గెహనాకు సినిమాల్లో చాన్సులు లేకపోయినా పర్లేదు… జబర్దస్త్ జడ్జిగా లేదా శ్రీదేవి డ్రామా కంపెనీ […]
అన్‌స్టాపబుల్-2… రాధికతో ఇదెక్కడి వింత కాంబినేషన్ బాలయ్యా…
చదివేస్తే ఉన్న మతిపోయింది అన్నట్టుంది బాలయ్య అన్‌స్టాపబుల్ షో… ఫస్ట్ సీజన్ బ్రహ్మాండంగా క్లిక్కయింది… ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేశారు… బాలయ్య ఓ కొత్త బాలయ్యగా ఫుల్ ఎంటర్టెయిన్ చేశాడు… తీరా సెకండ్ సీజన్ వచ్చేసరికి శృతి తప్పింది… చంద్రబాబును తీసుకువచ్చాడు… అంతే… ఎవరిని తీసుకురావాలో ఆ టీంకు అర్థం కావడం లేదు… బాలయ్య షో అంటే ఓ రేంజ్ ఉంటుంది, ఎవరిని పడితే వాళ్లను తీసుకురాలేరు… ఏదో కిందామీదా పడి సిద్ధూ, శేషు, శర్వా, విష్వక్లతో […]
జస్ట్ రిలాక్స్… మీకొక చిన్న సరదా పరీక్ష… ఔట్ ఆఫ్ ది బాక్స్ థింకాలి…
ఒక తెలుగు సినిమా పాట… ఓ పాత అగ్ర హీరో… బెల్ బాటమ్ పాంటు, బ్లేజర్, షూస్, టోపీ ధరించి ఎగురుతున్నాడు… వాటిని స్టెప్పులు అంటారు… పక్కనే జయప్రదో, శ్రీదేవో ఫాఫం, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఎగురుతోంది… సగం సగం బట్టలు… మంచుకొండల్లో హీరోకు కార్గిల్ దుస్తులు… హీరోయిన్ వంపుసొంపులు కనిపించాలి కాబట్టి అరకొర దుస్తులు… అంతేనా..? ఒకే పాటలో నాలుగైదుసార్లు హీరో గారి కాస్ట్యూమ్స్ ఛేంజ్… అదేమంటే ఫ్యాన్స్ రకరకాల డ్రెస్సుల్ని ఇష్టపడతారుట… హీరోయిన్ […]
స్మారక చిహ్నం కట్టేవాళ్లే అయితే పద్మాలయాలోనే అంత్యక్రియలు జరిగేవి..!
పద్మాలయా స్టూడియోస్ వద్ద కృష్ణకు ఓ మెమోరియల్ నిర్మించాలని కుటుంబసభ్యులు ఆలోచిస్తున్నట్టుగా ఓ లీక్ వార్త మొత్తం మీడియాలో దర్శనమిచ్చింది… ఏం కవర్ చేసే ప్రయత్నం జరుగుతోంది..? మహేశ్ బాబు తీసుకున్న నిర్ణయాలపై వస్తున్న వ్యతిరేకతను డైల్యూట్ చేసే ప్రయత్నమా..? అదే అనిపిస్తోంది… కృష్ణ వెళ్లిపోయాడు… అంత్యక్రియలకు సంబంధించి కొంత గందరగోళం… ప్రత్యేకించి అభిమానుల సందర్శనకు పార్థివదేహాన్ని గచ్చిబౌలి స్టేడియంలో పెడతాం అన్నారు… చివరి క్షణంలో రద్దు చేశారు… సాధారణంగా ఊరేగింపుకు ఓపెన్ టాప్ వాడుతుంటారు, అదీ […]
తేడా లేని పాటలు… నటిగా అదే జయప్రద… బాపు ఫెయిల్… దాసరి హిట్…
సూపర్ స్టార్ కృష్ణ మరుపురాని పాటలు అని వెతుకుతూ ఉంటే… ఓ పాట కనిపించింది, వినిపించింది… ఫాఫం అనిపించింది… రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అని ఓ సినిమా వచ్చింది 1976లో… నమ్మలేని విషయం ఏమిటంటే… దానికి దర్శకుడు బాపు… కాకపోతే పాటలు బాగుంటాయి… చిత్రీకరణలో కాదు, ట్యూన్లు, కంటెంటు… అందులోనూ రాకోయీ అనుకోని అతిథి పాట ఓ మరుపురాని పాటే… ఇది వింటుంటే మనసు పదే పదే మేఘసందేశం సినిమా వైపు వెళ్తుంది… అందులో ఓ […]
నిజంగా మంగ్లి చేసింది అంత తప్పా…? మళ్లీ భారీగా సోషల్ ట్రోలింగ్…!
బాగా గుర్తు… ఇప్పుడంటే బాగా తగ్గిపోయింది గానీ… సమీపంలో పాపులర్ దర్గా గనుక ఉంటే, ఆ పరిసరాల్లో తల్లిదండ్రులు ఆ దర్గాకు వెళ్లిరావడం, తమ పిల్లలకు ఆ దర్గా పేరు స్ఫురించేలా పేర్లు పెట్టుకోవడం సహజంగానే ఉండేది… సైదులు అనే పేరు బోలెడుమందికి ఉంది… అది హుజూర్నగర్ నియోజకవర్గంలోని ఆ జాన్ పహాడ్ దర్గా మీద అక్కడి ప్రజల విశ్వాసం… భక్తి… ఇదెందుకు గుర్తొచ్చిందీ అంటే… తేలు మంత్రానికీ, పాము మంత్రానికీ మసీదు కావాలి… పిల్లల దడుపు […]
సర్కారువారి పాట..! మహేశ్ బాబు హఠాత్తుగా అందరినీ విస్మయంలో పడేశాడు..!!
ఒక్కసారిగా టీవీ, సినిమా ట్రేడ్ నిపుణులకు పిచ్చెక్కిపోయింది… మహేశ్ బాబు సినిమాయే దానికి కారణం… ఆమధ్య సర్కారువారి పాట సినిమా తీశాడు కదా… సరే, కమర్షియల్‌గా హిట్… 60 కోట్ల దాకా ఖర్చు పెడితే 200 కోట్ల దాకా వసూళ్లు రికార్డయ్యాయి… థియేటర్లలో హిట్… కానీ టీవీల్లో..? ఇప్పుడు టీవీల్లో ఎవడూ సినిమాలు చూడటం లేదు కదా… వీలున్నప్పుడు తాపీగా ఓటీటీల్లో చూస్తున్నారు, అదే బెటర్ కదా… అందుకని టీవీ ముందు కదలకుండా కూర్చుని, ఆ చెత్త […]
మల్టీ ప్లెక్స్ అంటేనే మల్టిపుల్ దోపిడీ అని అర్థం… గుండు గీకేయడమే…
Bharadwaja Rangavajhala……… నేనూ బెజవాడ సినిమా…. సాధారణంగా సినిమాకు పోవాలంటే .. మరి చాలా సరుకులు సరంజామా ఉండాలి. సత్యన్నారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ నుంచీ గేటు వైపు వెళ్తుండగా ఎడమ వైపుకి ఓ బేకరీ ఉండేది … కిసాన్ జామ్స్ వాడివే ఆ రోజుల్లో కిసాన్ బిస్కెట్లు ఉండేవి. ఏమి టేస్ట్ లెండి అవి. తర్వాత తొంభై మూడులో ఆ కంపెనీ బ్రూక్ బాండ్ ఇండియా టేకోవర్ చేసేసిన తర్వాత బిస్కెట్ల తయారీ ఆపేశారు దరిద్రులు. ఇప్పుడది […]
బస్ జర్నీలో బడా చోర్… ఓ సినిమాటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ కథ…
Gottimukkala Kamalakar…… బస్సు జడ్చర్ల మునావర్ హోటల్ దగ్గర ఆగింది. “టిఫిన్, మీల్స్, రోటీ, టీ, టాయిలెట్ అన్నీ కానియ్యొచ్చు. బస్సరగంటాగుతుంది. దిగాల్సార్.. దిగాల..! మళ్లీ అనంతపురం జంక్షను దాకా ఆగదు. దిగాల్దిగాల..!” అంటూ కేకేస్తూ తన డోర్లోంచి దిగాడు డ్రైవరు. బస్సులో ప్యాసింజర్లు ఒక్కొక్కరే తోసుకుంటున్నట్టు దిగసాగారు. నేనింట్లోనే సుష్టుగా తినేసా. బయటి తిండి జనరల్ గా తినను. రేపెలాగూ బెంగుళూరులో తప్పదు. ఓ రెండు నిమిషాలు అలాగే కూర్చుని జనం దిగే హడావిడి అయిపోయాక […]
ఆదిలోనే ఆటుపోట్లు… కృష్ణకు మాత్రమే బలమైన నమ్మకం ఉండేది…
సూపర్ స్టార్ కృష్ణ గురించి అవీ ఇవీ సెర్చుతుంటే… అనేకచోట్ల కనిపించింది… కృష్ణ ఒక సినిమా ఎన్నిరోజులు నడుస్తుందో తొలి షో చూసి చెప్పేసేవాడు… పర్ఫెక్ట్ అంచనా… నిజమే, చివరకు తన సినిమాల మీద కూడా అంచనాల్ని, జోస్యాల్ని చెప్పి.., అవి నిజమైన సందర్భాలు బోలెడు… కానీ సినిమాల జయాపజయాల గురించి కాదు, ఓ నటుడి కెరీర్ మీద కూడా తన దృక్కోణం, తన అంచనా వేరేగా ఉండేది… ఉదాహరణకు… మహేశ్ బాబు… ఫస్ట్ లీడ్ రోల్ […]
కొవ్వు లేని సబ్బు కోసం ఓ పరిశోధన… సింథాల్ పుట్టుక, పేరు వెనుకా ఓ కథ…
పార్ధసారధి పోట్లూరి …….. సింథాల్ సబ్బు గురించి తెలియని వారు ఉండరు ! సింథాల్ సబ్బు గురించి ఆసక్తికరమయిన కధ ఉంది ఈ సబ్బు వాడకంలోకి రావడం వెనుక ! ఇప్పుడంటే ఎవరయినా స్వంతంగా ఇంట్లోనే సబ్బు తయారు చేసుకోవడానికి వీలుగా అన్ని రకాల పదార్ధాలు ఫార్ములాలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి సబ్బు తయారుచేయడం పెద్ద పనా అని అనవచ్చు. కానీ అదే 1930 లలో సబ్బు తయారుచేసే ఫార్ములా అతి రహస్యంగా ఉండేది. కేవలం బ్రిటన్, […]
ప్రసేన్‌కు పెన్ను బాకీ… నాకేమో యండమూరి పాత పెన్ను బహుమతి…
Bp Padala …….. Prasen Bellamkonda గారు తన పోస్టులో యండమూరి గారు తనకు పెన్ ఎలా బాకీ ఉన్నారో సరదాగా రాసారు . ఈ ఉదంతం చదివిన తర్వాత యండమూరి గారు తన పెన్ నాకిచ్చిన సందర్భం గుర్తుకు వచ్చింది . 1997 లో అనుకుంటా సాయి గారు ‘రచన’లో ప్రముఖ రచయితల కొత్త కథలు పేరు లేకుండా అచ్చువేసి పాఠకులను ‘ఆబ్జెక్టివ్ ‘గా( పేరు ఉంటే అభిమాన రచయితల పట్ల పక్షపాతంతో రాస్తారని) విమర్శలను […]
బిగ్‌బాస్ విజేతకు చిప్పే దిక్కు… మిడిల్ డ్రాప్ అయితేనే మస్తు ఫాయిదా…
హళ్లికిహళ్లి సున్నాకు సున్నా… ఈసారి బిగ్‌బాస్ విజేతకు చిప్ప చేతికి ఇచ్చే స్థితే కనిపిస్తోంది… మొన్న వీకెండ్ షో అయిపోయాక, ఏదో గొప్ప విషయం ప్రకటిస్తాను అని నాగార్జున, అందరినీ అలాగే ఉంచేసి, చివరకు విజేతకు 50 లక్షలు ఇస్తాం అని ప్రకటించాడు… అందులో కొత్తేముందో అర్థం కాలేదు… గత సీజన్లో అదే కదా ప్రైజ్ మనీ… ఓహో, ఈసారి సీజన్ దివాలా తీసింది, ప్రైజ్ మనీలో కోత ఉంటుందని అనుకుంటున్నారేమో, లేదు, ఎప్పటిలాగే ఇస్తాం, గమనించగలరు […]
వాట్ జితేంద్రా..? మా కృష్ణ లేక నీ కెరీర్ ఎక్కడిది..? నివాళి అర్పించే తీరిక లేదా..?
కృష్ణ చివరి చూపు కోసం వేలాది మంది అభిమానులు పోటెత్తారు… పోలీసులు ఓ దశలో లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది… తను సినిమాలు మానేసి ఏళ్లు గడుస్తున్నా సరే, వయస్సు 80లోకి వచ్చినా సరే… తెలుగు ప్రేక్షకుల్లో కృష్ణ అంటే పిచ్చి ప్రేమ… టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా నివాళి అర్పించారు… ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి… సగర్వంగా వెళ్లిపోయాడు… ఇదంతా సరే, పొరుగు ఇండస్ట్రీల నుంచి ఎవరైనా వచ్చారేమో అని చూస్తే ఒక్కరూ కనిపించలేదు… మద్రాసులోనే […]
ఈనాడులో మళ్లీ బాండెడ్ లేబర్… ఆంధ్రజ్యోతిలో జీతాల పెంపుదల…
ఈమధ్య ఓ మీడియా వ్యవహారాల వెబ్సైట్ కొన్ని అంకెలు ప్రచురించింది… జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద పత్రికల సర్క్యులేషన్ ఈ రెండేళ్లలో ఎంత దారుణంగా పడిపోయిందనేది ఆ గణాంకాల సారాంశం… తెలుగులో పత్రికల స్థితిగతులేమిటో ‘ముచ్చట’ ఇంతకుముందే చెప్పింది… అసలు ఏబీసీ లెక్కలంటే వణికిపోయే చిన్నాచితకా పత్రికల్ని వదిలేద్దాం… ఏబీసీ లెక్కలకు సిద్ధపడేవి సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి… వాటి కాపీలు ఎంత దారుణంగా పడిపోయాయో కూడా మనం చెప్పుకున్నాం… దేశమంతటా ప్రింట్ మీడియా సంక్షోభం కొనసాగుతోంది… ముద్రణ […]
ఒక వీడియో… ఒక ఫోటో… ఈ రెండింటితో ఈరోజంతా చిరాకు, చివుక్కు…!!
ఈరోజంతా ఒక వీడియో, ఒక ఫోటో డిస్టర్బ్ చేశాయి… ఒకటి చికాకు పెట్టింది… ఒకటి చివుక్కుమనిపించింది… నిజానికి రెండింటికీ సంబంధం లేదు… ఉందంటే ఉంది… ఒక వీడియో… చిన్న బిట్… కృష్ణ మరణానంతరం ముఖ్యమంత్రి కేసీయార్ పరామర్శకు వెళ్లాడు… మామూలుగానే తన పరిసరాల్లో ఉండి, ఏదేదో ఎక్కువ తక్కువ మాట్లాడాలంటే ఒక్కొక్కరికీ హడల్… పైగా అక్కడ మహేశ్, ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నాడు… విజయనిర్మల కొడుకు సీనియర్ నరేష్ కేసీయార్ పక్కనే నిలబడి, చేతులు ఊపుతూ, ఏదేదో చెబుతుండేసరికి… […]
ఎవరెస్టు ఎక్కే కథ… మరి ఆ రేంజ్‌లోనే పారితోషికాలు… అమితాబ్ రికార్డు…
హిందీ సినిమాలు వరుసగా ఎదురుతంతున్నయ్… అది హిందీ ఇండస్ట్రీ వర్గాలతోసహా అందరూ అంగీకరించేదే… సౌత్ ఇండియా సినిమాలు కూడా స్ట్రెయిట్ హిందీ సినిమాల్ని దాటేసి వీరకుమ్ముడు కుమ్మేస్తున్నయ్… ఇలా ఎన్నేళ్లు..? ఏం చేయాలి..? సినిమా మారాలి… కథలు మారాలి, ప్రజెంటేషన్ మారాలి… చెప్పేవాడే కానీ చేసేవాడే లేడు… అంతెందుకు..? మితిమీరిన రెమ్యునరేషన్లు తగ్గాలి, సినిమా నిర్మాణవ్యయం తగ్గాలి, రిస్క్ తగ్గాలి అనేది మరో ప్రతిపాదన… కానీ ఎవడు తగ్గించుకుంటాడు..? అక్షయ్ కుమార్ వంటి ఒకరిద్దరు హీరోలు తప్ప […]
- « Previous Page
- 1
- …
- 318
- 319
- 320
- 321
- 322
- …
- 493
- Next Page »