మొన్న ఎవరో కామెంట్ చేశారు… టాలీవుడ్ పెద్దలు, అందులోనూ తెలుగు సినిమాకు గౌరవాన్ని, ఖ్యాతిని తెచ్చిపెట్టిన వాళ్లు ఒక్కొక్కరే ఏదో పని ఉందన్నట్టుగా ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నారు… రోజులు బాగా లేవు… జాగ్రత్తగా ఉండాలి సుమా అని..! ఇప్పుడు మరో శిఖరం నేలకూలింది… శిఖరం అని చెప్పడానికి సందేహించడం లేదు… అశ్లీలం, అసభ్యత ఏమీ లేకుండా, కళాత్మకంగా తెలుగు సినిమాల్ని రూపొందించి, తెలుగు సినిమాకు గౌరవాన్ని సంపాదించి పెట్టిన ఆ దర్శక శిఖరం కె.విశ్వనాథ్ కూడా […]
చివరకు రాఘవ కూడా సోయి తప్పాడు… సుడిగాలి సుధీర్‌పై చెత్త వ్యాఖ్యలు…
ఒక్కొక్కడే విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు… నానాటికీ నాసిరకం సరుకు నిండిపోతోంది… టీవీ రేటింగ్స్ ఢమాల్ ఢమాల్ అని పడిపోతున్నయ్… ఐనా సరే, జబర్దస్త్ నిర్మాతలకు సోయి లేదు, అక్కడ మిగిలిపోయిన వాళ్లకూ లేదు… అసలే అంతంతమాత్రంగా ప్రజాదరణ ఉన్నప్పుడు కాస్త మనసు పెట్టి మంచి స్కిట్స్ చేయాలి… థర్డ్ రేట్ కామెడీతో విసిగిస్తూ, మరోవైపు వెళ్లిపోయిన వాళ్ల మీద వెకిలి వ్యాఖ్యలు దేనికో మల్లెమాల ప్రొడక్షన్స్‌కే తెలియాలి… 9వ తేదీ ప్రసారం కాబోయే జబర్దస్త్ ప్రోమో ఒకటి విడుదలైంది… […]
అంబడిపూడి… ప్రపంచంలో ఏ విషయం మీదనైనా సరే నిమిషాల్లో పుస్తకం రెడీ…
Bharadwaja Rangavajhala………. అంబడిపూడి ….. ఈ పేరు డెబ్బైల్లో చాలా పాపులర్ . టీవీలు రాని రోజులవి. ఇంట్లో ఉంటే రేడియో ప్లస్ పుస్తకాలు … బయటకు వెళ్తే కేవలం పుస్తకాలే అప్పుడు. బస్సుల్లోనూ రైళ్లలోనూ లాంగ్ జర్నీ చేసే వాళ్లందరూ ఓ నవల పట్టుకుని ఎక్కేసేవాళ్లు. నేను చదివిన చాలా నవలలు అలా దారి ఖర్చుగా నమిలినవే. ముఖ్యంగా బస్టాండుల్లో పుస్తకాల షాపుల దగ్గర సేల్స్ చాలా బాగుండేది. మధుబాబు, కొమ్మూరి సాంబశివరావుల డిటెక్టివ్ నవలలకు […]
కాంతార… టీవీ రేటింగుల్లోనూ అదరగొట్టింది… ఈమధ్యకాలంలో రికార్డు వీక్షణం…
కాంతార మరోసారి అదరగొట్టేసింది… పెద్ద పెద్ద సినిమాలే టీవీ రేటింగుల వద్ద బోల్తా కొడుతుంటే, కాంతార సినిమా ఏకంగా 16.7 టీవీఆర్ రికార్డ్ చేసింది… అఫ్‌కోర్స్ హైదరాబాద్ బార్క్ ఒక్కటే పరిశీలిస్తే 9.5 వరకూ ఉంది… ఐనాసరే, అభినందనీయమే… నిజానికి టీవీల ముందు జనం కూర్చుని సినిమాల్ని చూడటం మానేస్తున్నారు… పెద్ద సినిమాలే రేటింగ్స్ దిక్కులేదు… ఈ స్థితిలో కాంతార ఈ రేంజ్ రేటింగ్స్ సాధించడం విశేషమే… థియేటర్లలో బాగానే నడిచింది… ఓటీటీలోనూ బాగానే నడిచింది… ఇక […]
మరో కాంతార అనుకున్నాడు… మలికాపురం అడ్డగోలుగా రివర్స్ తన్నింది…
కాంతార రిపీట్ అవుతుందని అనుకున్నాడు అల్లు అరవింద్… 15 కోట్లతో నిర్మించబడిన కాంతార 400 కోట్లు సంపాదించింది… తెలుగులో దాని రైట్స్ కేవలం 2 కోట్లకు కొని, కోట్లకుకోట్లు కొల్లగొట్టాడు… దానికి ప్రచారఖర్చు కూడా లేదు పెద్దగా… మొదట కన్నడంలో పాజిటివ్ మౌత్ టాక్ స్టార్టయి, అది క్రమేపీ హైదరాబాద్‌కు చేరి, తెలుగు ప్రేక్షకులను చేరి, కాంతార రిలీజ్ కాగానే తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధించింది… అఫ్‌కోర్స్, కథకథనాలు భిన్నంగా ఉండటం, రిషబ్ శెట్టి క్లైమాక్స్ […]
వంటలక్క తన చివరి రోజున… టీవీ రేటింగ్స్‌ను అదరగొట్టేసింది…
అనుకుంటూ ఉన్నదే… కార్తీకదీపం చివరి ఎపిసోడ్ మీద ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి ఉంటుందని..! బిగ్‌బాస్ ఎంత భ్రష్టుపట్టిపోయినా ఫినాలే ఫంక్షన్‌ను చూస్తారు చాలామంది… అలాగే ఇదీ… కార్తీకదీపం సీరియల్‌ను కొన్నిరోజులు భ్రష్టుపట్టించారు… ఐనా సరే, చివరి ఎపిసోడ్ కథ ఎలా ఎండ్ చేస్తారనే ఆసక్తి నెలకొంది… రకరకాల కథనాలు, రూమర్స్ ఉన్నా సరే, ఇన్నేళ్లు ఆదరించి, మధ్యలో వదిలేసిన వాళ్లు సైతం చివరి ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు… 15.42 ఇదీ చివరి ఎపిసోడ్‌కు రేటింగ్స్… […]
నీళ్ళు లేని ఎడారిలో… కన్నీళ్లయినా తాగి బతకాలి…
Be Patient: పత్రికల్లో ఆత్మహత్యల వార్తలు లేని రోజంటూ ఉందా..? ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. చదువు భారం పెరిగి, ఆశించిన మార్కులు రాక ఒక విద్యార్థి; బదిలీ దూరం భార్యాభర్తల మధ్య బహుదూరమై ఒకరు; పొలం అప్పు తీర్చలేక ఒకరు; కొడుకు బుద్ధి మాంద్యాన్ని భరించలేక ఒకరు; మాజీ ప్రియుడి వేధింపులు భరించలేక ఒకరు… ఇంకా ఎందరో పోయారు. జీవితం అంటే గెలుపు; జీవితమంటే సుఖం; జీవితమంటే శిఖరారోహణం…అని మన నరనరాన ఎక్కించుకున్నాం. జీవితమంటే ఎడతెగని ప్రయాణం. […]
పేరే మూగమనసులు కదా… సైలెంటుగా వచ్చి, కొట్టింది సూపర్ హిట్టు…
Abdul Rajahussain …….. *ఆ ‘పాత’ మధురం…”మూగమనసులు”!! *ప్రయోగాత్మక చిత్రం.. “మూగమనసులు” నిర్మాణం… కథా కమామీషు..!! *ఆత్రేయ కీర్తి కిరీటంలో కలికితురాయి….. “మూగమనసులు ” !! *ముళ్ళపూడి వెంకట రమణ గారి సినీ అరంగేట్రం ఈ సినిమాతోనే…!! *గౌరి’ గా జమున చిరస్థాయి నటన…!! *ఆదుర్తి దశ మార్చిన చిత్రం…! ఆరోజుల్లోనే ప్రయోగాత్మకంగా నిర్మించిన మూగమనసులు సినిమా చాలామందికి బ్రేక్ ఇచ్చింది. తెలుగు చలన చిత్ర సీమలో మరపురాని క్లాసిక్ గా, మ్యూజికల్ బొనాంజగా నిలిచిపోయింది… పాటల రచయితగా […]
టార్గెట్ ఆదానీ… దాని టైమింగు తెలియాలి, డీకోడ్ చేయాలి… అదెలా అంటే..?
పార్ధసారధి పోట్లూరి………. హిండెన్బర్గ్ Vs గౌతమ్ ఆదానీ ! పార్ట్ -02……….. హిండెన్బర్గ్ గౌతమ్ ఆదానీ మీద ఆరోపణలు చేసిన సమయం గురించి మనం చెప్పుకోవాలి ! NDTV ని ఆదాని కొనడం, రబ్బీష్ కుమార్ రాజీనామా చేసిన అనంతరం, NDTV ఇచ్చిన డాటా ని ఆధారం చేసుకొని బిబిసి మోడీ మీద వండిన డాక్యుమెంటరీ వివాదాస్పదం అయిన వారం రోజుల తరువాత హిండెన్ బర్గ్ ఆదానీ గ్రూపు మీద ఆరోపణలు చేయడం వరసగా జరిగిపోయాయి ! […]
ఆదానీ పబ్లిక్ ఆఫర్ వాపస్..! కథ ముగిసినట్టేనా..? లేదు, ఉధృతి పెరగొచ్చు…! (పార్ట్-4)
పార్థసారథి పొట్లూరి :: కొన్ని ప్రశ్నలు : హిండెన్బర్గ్ ఆరోపిస్తున్నట్లు బాంకులు ఉదారంగా అప్పులు ఇచ్చేసాయా ఆదానీ కి ? సామాన్య ప్రజలకి తెలియని విషయం ఏమిటంటే ఆదాని గ్రూప్ లాంటి పెద్ద గ్రూపులని ఎలా నడుపుతారో అని. ఆదానీ గ్రూపు లాంటి వాటి మీద ఉన్న అపోహ ఏమిటంటే బాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఆదానీ అడిగిన వెంటనే రుణాలు ఇచ్చేస్తాయని. కానీ వాస్తవంగా అలా జరిగే అవకాశం లేదు ఒక్క అధికార దుర్వినియాగం చేస్తే తప్ప. […]
అదానీ కేసులో చైనా పాత్ర..?! హిండెన్ బర్గ్ వెనుక ఉన్న ‘నెట్‌వర్క్’ ఎవరిది..?!
పార్ధసారధి పోట్లూరి……… గౌతమ్ ఆదానీ Vs హిండెన్బర్గ్ ! పార్ట్ -03…. గౌతమ్ ఆదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే దశలో ప్రధానంగా ఓడ రేవుల [Ports] మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు. అలా అని ఇతర వ్యాపారాల మీద దృష్టిపెట్టలేదు అని కాదు కానీ పోర్ట్స్ ని స్వంతం చేసుకోవడం లేదా ఆయా దేశాలతో కలిసి భాగస్వామ్య ఒప్పందం చేసుకొని జాయింట్ వెంచర్ కింద కలిసి పోర్ట్స్ ని ఆపరేట్ చేయడం మొదలుపెట్టగానే చైనా కి […]
Adani Vs Hindenburg… షార్ట్ సెల్లింగు కథ తెలిస్తేనే అసలు మర్మం తెలిసేది… పార్ట్-1
పార్ధసారధి పోట్లూరి ….. Adani Vs Hindenburg- గౌతమ్ ఆదాని Vs హిండెన్బర్గ్. పార్ట్ -01….. గత వారం రోజులుగా ఎలెక్ట్రానిక్,ప్రింట్ మీడియా తో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న వార్త .. ఆదాని తన గ్రూపు షేర్ల ని కృత్రిమంగా పెంచుకుంటూ పోతున్నాడు అని! ఒక చిన్న సంస్థ అయిన హిండెన్బర్గ్ అనే పేరుతో అంతర్జాతీయంగా ఆర్ధిక పరమయిన అవకతవకలని బయటపెడతాను అంటూ తమ సంస్థ రీసెర్చ్ [Forensic Financial Research] చేసి […]
అశ్వపతి… ఈ పాత్రే లేకపోతే రామాయణం లేదు… రావణ వధ లేదు…
సూర్యకాంతం… ఈ మాట వినగానే తెలుగువాడు మొహం చిట్లిస్తాడు… తిట్టిపోస్తాడు… ఎవరూ ఆ పేరును పిల్లలకు పెట్టుకోరు… సగటు లేడీ విలన్‌కు ప్రతీక… ప్రతి సినిమాలోనూ ఆమెకు అలాంటి పాత్రలే చేసీ చేసీ ఆమె ఓ క్రూరురాలు అయిపోయింది… కోడళ్లను రాసిరంపాన పెట్టే ధూర్త అత్తగారు అయిపోయింది… ఆ పాత్రల్నీ ఇరగ్గొట్టి ఆమె అఖండమైన పేరు సంపాదించుకుంది, అది వేరే కథ… సేమ్, రామాయణం అనగానే రావణుడికన్నా జనం అందరూ తిట్టిపోసేది కైకేయిని… సీతమ్మ కష్టాలు చూస్తూ, […]
రోజుకు వంద కోట్ల వసూళ్ల సినిమా… నిజంగా అంత బాగుందా..? బాక్సు బద్దలేనా..?!
రోజుకు వంద కోట్లు… పఠాన్ సినిమాపై వార్తలు జోరుగా సాగుతున్నయ్… కొందరి ఊపు చూడబోతే అవతార్-2 వసూళ్లను కొట్టేయబోతోంది అన్నట్టుగా రాసిపడేస్తున్నారు… నిజంగా అంత గొప్ప సినిమా..? నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టరా..? నిజంగా షారూక్ మెస్మరైజ్ చేశాడా..? ఆ వెగటు దుస్తుల, వెకిలి ఊపుల ఆ దీపికను ఇండియన్ ప్రేక్షకులు అంత ప్రేమిస్తున్నారా..? కొందరు మిత్రులు అబ్బే, అంత సీనేమీ లేదు సినిమాలో అని కుండబద్ధలు కొడుతున్నారు… ఫేస్‌బుక్‌లో మిత్రుడు, సీనియర్ జర్నలిస్ట్ Srini Journalist షేర్ చేసుకున్న […]
ఈ జీఎస్టీ శకంలో అసలు బడ్జెట్ వాల్యూ ఎంత..? ఓ తప్పనిసరి తంతు మాత్రమే..!!
రాష్ట్రాలు కొత్తగా ఏ పన్నులూ వేయడానికి వీల్లేదు… ప్రతిదీ జీఎస్టీలో కవరైపోతుంది… రాష్ట్రాలు సొంతంగా వేయదగిన పొగాకు, మద్యం ఉత్పత్తులు ప్లస్ పెట్రో ఉత్పత్తులు ఇప్పటికే మండిపోతున్నాయి… పైగా మద్యం మీద ఎప్పటిప్పుడు బట్జెట్‌కు సంబంధం లేకుండా పెంచుతూనే ఉన్నారు… పొగాకు వినియోగం తగ్గుతున్న దిశలో ఇంకా పన్నుల మోత మోగించలేరు… పెట్రో మీద పొరుగు రాష్ట్రాల్లోకన్నా ఇప్పటికే మన మోతలు, వాతలు ఎక్కువ… ఇంకా పెంచితే సగటు మనిషి మరింత దరిద్రంలోకి కూరుకుపోయే స్థితి… కరోనా […]
ఆ నల్లత్రాచును అంబానీ ఒడుపుగా పట్టి… పాతాళానికి తొక్కేశాడు ఇలా… (పార్ట్-2)
స్టాక్ మార్కెట్లో బేర్ & బుల్ అన్న రెండు పేర్లతో వ్యాపారం నడుస్తూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ లాభపడినప్పుడల్లా బాంబే స్టాక్ ఎక్స్చేంజి ముందున్న ఎద్దుని చూపిస్తుంటారు మన వార్త చానెల్స్ వారు. దళారుల్లో పైన చెప్పిన రెండు రకాలు ఉంటారు. మను మానెక్ బేర్ కూటమికి (Bear Cartel) అధిపతి. స్టాక్ మార్కెట్లో ప్రవేశం ఉన్న అందరూ కూడా బుల్స్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే షేర్ ధరలు పెరిగినప్పుడు అందరూ లాభపడతారు. బేర్స్ ప్రధానంగా షేర్ ధరలు […]
అదానీ స్టాక్స్ గగ్గోలు సరే… షార్ట్ సెల్లింగులో ఓ నల్లత్రాచు కథ తెలుసా..?! (పార్ట్-1)
== స్టాక్ మార్కెట్ నల్ల త్రాచు == హిండెన్ బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ షేర్స్ ను షార్ట్ సెల్లింగ్ చేసిన నేపథ్యంలో ఇప్పటి తరానికి అంతగా తెలియని గతంలో జరిగిన ఒక పెద్ద షార్ట్ సెల్లింగ్ ఘటన గురించి తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్లో అందరికీ బాగా గుర్తున్నవి రెండు స్కాంలు మాత్రమే. ఒకటి హర్షద్ మెహతా, రెండు సత్యం కంప్యూటర్స్. హర్షద్ మెహతా, నేను సహఉద్యోగులం, ఒకే సమయంలో ఒకే కంపెనీలో పనిచేసాము. ఎప్పుడూ కలవలేదనుకోండి. నేను పనిచేసిన […]
పిల్లల కడుపులు నిండాలంటే… నేను స్టంట్స్ చేయాల్సిందే… గాయాలా, జానే దేవ్…
నాకు అప్పటికి ఎనిమిదేళ్లు… పెళ్లిళ్లలో నీళ్లు పంచేదాన్ని… వచ్చిన ప్రతి ఒక్కరి వద్దకూ వెళ్లి నీళ్ల గ్లాసు అందించాలి… రోజుకు 40 రూపాయలు సంపాదించేదాన్ని… ఓ పెళ్లి సందర్భంగా ఒకాయన పరిచయమయ్యాడు… ఒక సినిమా కోసం నాకు జూనియర్ ఆర్టిస్టులు కావాలి, వస్తారా అనడిగాడు… పెళ్లిళ్లలో రకరకాల పనులు చేసే టీం అంతా వోకే అన్నాం… అలా పరిచయం అయ్యాను నేను ఇండస్ట్రీకి… డబ్బు బాగానే వస్తోంది… సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టును… పెళ్లిళ్లలో వర్క్ మాత్రం మానేయలేదు… […]
మంచు మోహన్‌లాల్… పేరుకు స్టారాధిస్టారుడే… పల్లీబఠానీ వసూళ్లు…
ఆమధ్య మంచు విష్ణు సినిమా ఒకటి వచ్చింది… దాని పేరు జిన్నా… మాంచి కసి హీరోయిన్లు సన్నీ లియోని, పాయల్ ఉన్నారు… కాస్తో కూస్తో కామెడీ ఉంది… అయితేనేం, టాలీవుడ్ ఈమధ్యకాలంలో ఎరుగనంత డిజాస్టర్ అది… కొన్నిరోజులైతే థియేటర్ల సింపుల్ మెయింటెనెన్స్ డబ్బులు కూడా రాలేదు… జీరో షేర్… ప్రేక్షకులు అడ్డంగా ఈడ్చి తన్నడం అంటారు దాన్ని… అంతకుముందు మంచు మోహన్‌బాబు సినిమా ఒకటి కూడా అంతే… అది మరీ దారుణాతిఘోరం… హిందీకి వెళ్తే కంగనా రనౌత్ […]
గడిచిన యవ్వనపు జాడల కోసం… గడియారం వెనక్కి తిప్పే ఓ యయాతి…
45 to 18: “దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చరించనప్పుడె కురుల్ వెల్వెల్లఁ గానప్పుడే చింతింపన్ వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!” అన్నాడు ధూర్జటి. వయసు పెరిగేకొద్దీ పళ్లు ఊడడం, శరీర కాంతి తగ్గడం, ముడుతలు పడడం, జుట్టు తెల్లబడడం, రోగాలు పలకరించడం, మన మొహం మనమే గుర్తు పట్టలేనంతగా మారిపోవడం సహజం. ఎన్ని యాంటీ ఏజింగ్ క్రీములు మొహానికి దట్టించినా- వయసును ఆపగలమా? అరవైలో ఇరవై వయసు ఎవరికైనా వచ్చేనా? “ఎలుకతోలు […]
- « Previous Page
- 1
- …
- 323
- 324
- 325
- 326
- 327
- …
- 409
- Next Page »