యూపీలో టోపీ రాజకీయం….. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరఖండ్, గోవా, మణిపూర్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. మిగిలిన వాటి సంగతి ఏమైనా గానీ, ఉత్తరప్రదేశ్ ఎన్నికలే ఇప్పుడు కీలకం. 80 లోక్‌సభ సీట్లు ఉండే ఉత్తరప్రదేశ్ ఎప్పుడూ దేశ రాజకీయాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు యూపీ ఫలితాలే తొలి మెట్టు అవుతాయి. ఇక్కడ అధికారంలో ఉంటే బీజేపీకి ఢిల్లీ గద్దె సులువుగా దక్కుతుంది. బీజేపీని గద్దె దించాలనే తపనతో ఉన్న మిగిలిన పార్టీలు యూపీ […]
రష్యాకు అనూహ్య నష్టాలు… తెగించి తిప్పికొడుతున్న ఉక్రెయిన్…
…. by… పార్ధసారధి పోట్లూరి……… నాకు ఆయుధాలు ఇవ్వండి… ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదమీర్ జెలెనస్కి నిన్న అన్న మాటలవి… అమెరికా అధ్యక్షుడు బిడెన్ జెలెనస్కిని అమెరికాకి వచ్చేయమని సలహా ఇచ్చాడు. అంటే దేశం వదిలి పారిపోయి రమ్మని ఆహ్వానించాడు. అక్కడితో ఆగక ప్రత్యేక విమానం పంపిస్తాను అంటూ వాక్రుచ్చాడు బిడెన్ ! నాకు ఫ్లైట్ కాదు, ఆయుధాలు కావాలి అని అడిగాడు జెలెనస్కి… మిలటరీ దుస్తులు ధరించి తానే స్వయంగా యుద్ధరంగంలోకి దిగి, తన ప్రజలని కూడా […]
మట్టిని ఆక్రమిస్తారు సరే… మరి మనుషులు, బతుకుల మాటేమిటి..?
Padmaja Veliganti…….. రెండేళ్ల కిందట మా పిల్లల స్కూల్ ప్రాంగణంలో మరో కొత్త బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ చేసారు. పునాదుల కోసం తవ్వుతుంటే బాంబ్ దొరికిందని, త్వరగా వచ్చి పిల్లలని తీసుకుపొమ్మని ఫోన్ వచ్చింది స్కూల్ నుండి. కాస్త కంగారు పడుతూ స్కూల్ కి పరుగెత్తడమే తప్ప విపరీతంగా భయపడలేదు. ఎందుకంటే అలాంటి వార్తలు ఇక్కడ (Hungary) సాధారణం. విషయం వాళ్ళు పూర్తిగా చెప్పకపోయినా మాకు అర్థమవుతుంది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో పేలకుండా మట్టిలో మిగిలిన బాంబులు.. […]
మొదట్లో రాజేంద్రప్రసాద్‌ను హీరోగా తిరస్కరించాడు రామోజీరావు… కానీ..?
చాలామంది ఇప్పటి ప్రముఖులు ఒకప్పుడు కెరీర్ మొదట్లో ఛీకొట్టబడినవాళ్లే అయి ఉంటారేమో… బొచ్చెడు ఉదాహరణలు చదివాం కదా… పర్సనాలిటీ డెవలప్మెంటలిస్టులు కూడా తాము చెప్పే సక్సెస్ స్టోరీల్లో ఇదే ఊదరగొడుతుంటారు కదా… డైరెక్టర్ వంశీ రాస్తున్న పాత జ్ఞాపకాల్లో నటుడు రాజేంద్రప్రసాద్ గురించి ఓచోట చదివితే ఇదే గుర్తొచ్చింది… అప్పట్లో రాజేంద్రప్రసాద్‌తో వంశీ ఓ సినిమా తీశాడు… దాని పేరు ‘ప్రేమించు పెళ్లాడు’… ఉషాకిరణ్ మూవీస్ వాళ్లు అప్పట్లో కాస్త జోరుగానే సినిమా నిర్మాణం స్టార్ట్ చేసిన […]
ఫాఫం… ఆ రామోజీ చానెళ్లను దేకేవాళ్లే లేరు… ఉత్త డబ్బు దండుగ…
ఫాఫం ఈటీవీ… నానాటికీ తీసికట్టు అన్నట్టుగా చానెల్ వెలవెలబోతోంది… జబర్దస్త్ మినహా మరేఇతర ప్రోగ్రామ్ కూడా చూసేవాళ్లు కరువై, రేటింగ్స్ లేక, పోటీచానెళ్ల ముందు తలవంచుతోంది… కొన్ని నెలల రేటింగ్స్ తీరు చూస్తుంటే అర్థమయ్యేది అదే… తాజా బార్క్ రేటింగ్స్ చెబుతున్నదీ అదే… వయోభారంతో రామోజీరావు వదిలేసి ఉండవచ్చుగాక… కానీ దాన్ని ఉద్దరించాల్సిన బాధ్యులు ఏం చేస్తున్నట్టు..? సరే, వాళ్లకు చేతకాదు, ఆ బూతుల జబర్దస్త్ ప్లస్ దాన్ని నిర్మించే అదే మల్లెమాల వాళ్లు నిర్మించే శ్రీదేవి […]
భారతీయ దెయ్యాలు కదా… వాటికీ కులాలుంటయ్… చచ్చినా వదలవ్…
Bharadwaja Rangavajhala………. దెయ్యాల చెట్టు! అనగనగా ఓ ఊరి చివర స్మశానం కాడ … ఓ మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు మీద దెయ్యాలుంటాయని … ఆ చుట్టుపక్కల ఊళ్లల్లో బాగా ప్రచారంలో ఉన్న విషయం. సుబ్బయ్య కూడా చిన్నప్పట్నించీ ఈ విషయం వింటూనే ఉన్నాడు. అయితే అతనెప్పుడూ దెయ్యాలను చూడలేదు. దెయ్యాలను చూడలేదు కాబట్టి దేవుడు కూడా ఉండి ఉండడు అనుకుని గుడి మొహం కూడా ఎప్పుడూ చూడ్లేదు. చాలాసార్లు సెకండ్ షో […]
నిత్యామేనన్ మీద త్రివిక్రమ్‌కు ఎందుకంత కోపం..? ఏమిటీ కత్తెర్లు..?!
తగ్గిందా..? నిన్నటి జోష్ చల్లబడిందా..? నేలమీదకు దిగిపోయింది కదా హైప్..! హిట్టో, సూపర్ హిట్టో, బంపర్ హిట్టో క్లారిటీ వచ్చింది కదా..! ఇక కాస్త వేరే విషయాలు కూడా మాట్లాడుకుందాం… ఈ సినిమాలో హీరోయిన్ నిత్యామేనన్… సంయుక్త మేనన్ అనే మరో మలయాళ నటి కూడా ఉంది, ఎవరబ్బా ఈమె అని అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది గానీ, ప్రధాన పాత్ర మాత్రం నిత్యదే… ఈ సినిమా మలయాళ మాతృక అయ్యప్పనుం కోషియంలోని ఈ పాత్రతో పోలిస్తే […]
బీమ్లా నాయక్లాగే దంచికొట్టారు… ఈ రేంజ్ సినిమా కథనం నభూతో నభవిష్యతి…
ఆహా… పవన్ కల్యాణ్ అదృష్టమా మజాకా… ఓ మెయిన్ స్ట్రీమ్ పత్రిక… అదీ అనేక దశాబ్దాల చరిత్ర ఉన్న పత్రిక… బీమ్లానాయక్ అనబడే సినిమా మీద ఓ రివ్యూ కమ్ భజన కమ్ కీర్తన కమ్ డప్పు భీకరంగా థమన్ బీజీఎం రేంజులో వాయించేసింది..! కార్యకర్తకూ, అభిమానికీ నడుమ… సినిమాకు, రాజకీయానికీ నడుమ… రేఖలు గీసుకోలేని పవన్ కల్యాణ్ ధోరణిలాగే…!! పాత్రికేయానికి రోజురోజుకూ కొత్త ఎత్తులకు తీసుకెళ్లడంలో ఆంధ్రప్రభ ఎప్పుడూ వెనుకంజ వేయదు… హహహ… పవన్ కల్యాణ్ […]
నిశ్శబ్ద నారసింహుడు..! కొత్త గర్భగుడిలోకి తరలించే విశేషపూజలు షురూ..!!
మొన్న నిశ్శబ్దంగా యాదాద్రిలో విశేష పూజలు మొదలైపోయాయ్… అవేమిటయ్యా అంటే… ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణం సాగుతోంది కదా… అందుకని మూలవిరాట్టులను తీసుకొచ్చి బాలాలయంలో పెట్టారు కదా… ఇప్పుడు సంప్రోక్షణతో, యంత్ర పూజలతో ప్రత్యేక పూజలు స్టార్టయ్యాయి… అంటే తిరిగి గర్భగుడిలోకి వాటిని తరలించే పని మొదలైంది… ఇక హఠాత్తుగా ఎప్పుడో ఓసారి పునర్నిర్మిత గర్భగుడిలో దర్శనాలకు తలుపులు తెరుచుకోవచ్చు… అదేమిటి..? వెయ్యి పైచిలుకు హోమకుండాలతో నభూతో నభవిష్యతి అనే తరహాలో భారీగా సుదర్శన నారసింహ హోమం నిర్వహిస్తామని […]
ఇమ్రాన్‌ఖాన్‌కు అమెరికా చెంపదెబ్బ..! ఒక్క వ్యాఖ్యతో పరువూ, డబ్బూ మటాష్..!!
పార్ధసారధి పోట్లూరి………… బయటికి వెళ్ళేటప్పుడు తిధి, వార, నక్షత్రాలతో పాటు రాహు కాలం [రాహు కాలం అంటే పంచాంగంలో చెప్పబడేది అన్నమాట ] చూసుకొని వెళ్ళాలి కదా ? కనీసం వర్జ్యం అన్నా చూసుకొని వెళ్లాలని శాస్త్రం! అలాంటిది వేరే దేశం వెళ్తున్నప్పుడు ఇంకెన్ని చూసుకోవాలి ? మొన్న అంటే గురువారం ఉదయం 5 గంటలకి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ మాస్కో చేరుకున్నాడు రెండు రోజుల పర్యటన కోసం… సరే వచ్చాడు కదా అని పుతిన్ తన […]
ఏదో వెలితి… గంగూబాయ్ చూస్తుంటే ఏదో అసంతృప్తి… ఎందుకలా..?!
సినిమా బాగున్నట్టే అనిపిస్తుంది… కానీ ఏదో వెలితి… ఓ అసంతృప్తి… ఎందుకు..? గంగూబాయ్ కఠియావాడి సినిమా గురించే..! చాలారోజులుగా ఈ సినిమా మీద హైప్ ఉంది… ఎందుకు..? ప్రస్తుతం బాలీవుడ్ పాపులర్ స్టార్ అలియా నటిస్తోంది గనుక… అది కథానాయిక సెంట్రిక్ పాత్ర గనుక… ఓ వేశ్య కథ గనుక… కాదు, వేశ్యల కంపెనీని నడుపుతూ, మాఫియా ప్రోద్బలంతో రాజకీయాల్లోకి, సంఘసేవలోకీ అడుగుపెట్టిన ఓ డిఫరెంట్ కేరక్టర్ గనుక..! అన్నింటికీ మించి అది సంజయ్ లీలా భన్సాలీ […]
చిన్న వీడియో బిట్… గౌతమ్‌రెడ్డి పునీత్లా కొన్నాళ్లు మరపురాడు…
ఎందుకో గానీ… లక్షలాది మంది అభిమానాన్ని పొందిన పునీత్ రాజకుమార్, మొన్న కన్నుమూసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సేమ్ జాతకులే అనిపిస్తుంది… ఇద్దరూ జిమ్ ప్రియులే… దాదాపు సేమ్ ఏజ్… సేమ్ ఫిజిక్… ఫిట్నెస్ కోసం ప్రయాస… ఇద్దరూ దాదాపు ఒకేస్థితిలో మరణించారు… చికిత్సకు కూడా టైమ్ లేనంత హడావుడిగా వెళ్లిపోయారు… అకస్మాత్తుగా సోషల్ మీడియాలో ఓ వీడియో కంటబడింది… ఏదో సంగీత్ కార్యక్రమంలో తన భార్యతో కలిసి హుషారుగా డాన్స్ చేస్తున్నాడు ఏదో పాటకు… అది చూస్తుంటే […]
ఇగో క్లాష్..! ఇద్దరు హీరోల నడుమ నో ఇగో క్లాష్… పవన్ మార్క్ మాస్..!!
అయప్పునుం కోషియం అనే మలయాళ సినిమా బీమ్లానాయక్‌కు మాతృక… నిడివి ఎక్కువైన, మలయాళీ ప్రేక్షకులకు నచ్చేలా తీయబడిన సినిమా అది… దాంతో బీమ్లానాయక్ సినిమాను పోల్చడం దండుగ… తెలుగులో రీమేక్ చేశాక, తెలుగు ప్రేక్షకుడి కోణం నుంచే చూడాలి… రీమేక్ అన్నంతమాత్రాన ఒరిజినల్లాగే ఉండాలా..? అలా ఉండాలనుకుంటే డబ్బింగ్ చేస్తే సరిపోతుంది కదా, రీమేక్ దేనికి..? మలయాళ ఒరిజినల్ నటులు వేరు… కానీ తెలుగులోకి వచ్చేసరికి కచ్చితంగా ఇక్కడి మార్కెట్ అవసరాల మేరకు మార్పులు అవసరం… ప్రత్యేకించి […]
సపోజ్… పర్ సపోజ్… అనసూయ జబర్దస్త్‌ను వీడాల్సిన పరిస్థితే వస్తే…!!
సపోజ్… పర్ సపోజ్… అనసూయ జబర్దస్త్‌ను వీడాల్సిన పరిస్థితే వస్తే..? ఆ ప్లేసులోకి ఎవరొస్తే బెటర్..? ఎవరొచ్చే చాన్సుంది..? మల్లెమాల శ్యాంరెడ్డి ఎవరిని ప్రిఫర్ చేస్తాడు..? ఇంట్రస్టింగు ప్రశ్నలు కదా… ఈ ప్రశ్నలు ఎందుకు తలెత్తాయంటే… ఈమధ్య అనసూయకు, హైపర్ ఆది అండ్ జబర్దస్త్ డైరెక్టర్ మణికంఠకూ నడుమ గొడవ జరిగింది… మాటామాటా పెరిగింది… ఎహె, ఊరుకొండి, అనసూయ మీద హైపర్ ఆదికి లవ్వు, ఆమెకూ ఆది మీద మస్తు సాఫ్ట్ కార్నర్, అందుకే తను ఎన్ని […]
యుద్ధం స్టార్ట్ కాలేదు… పుతిన్ ముగిస్తున్నాడు… కానీ మనం ఎటువైపు..?!
ఏం జరుగుతుంది..? మూడో ప్రపంచ యుద్ధం సాగుతుందా..? కరోనా విపత్తుతో ఇప్పటికే కుదేలైన ప్రపంచం ఈ దెబ్బకు దీర్ఘకాలపు మాంద్యంలోకి ప్రయాణించాల్సిందేనా..? పుతిన్ మరో హిట్లర్ అయిపోయాడా..? సగటు మనిషిలో ఇవీ ప్రశ్నలు… ఒక్క ముక్కలో చెప్పాలంటే… ఈ భయాలన్నీ మీడియా వ్యాప్తి చేస్తున్నవే… మూడో ప్రపంచ యుద్ధానికి చాన్సే లేదు… అబ్బే, మేం నేరుగా ఉక్రెయిన్‌లోకి వచ్చేసి, రష్యా దళాలతో యుద్ధం చేయబోవడం లేదు, జస్ట్, ఆయుధసాయం చేస్తాం, రష్యాను ఆంక్షలతో దారికితెస్తాం అని నాటో […]
చిన జియ్యర్ షాక్ తిన్నదెక్కడ..? సదరు భారీ ప్రాజెక్టు ఇక అసంపూర్ణమేనా..?!
అవును… ముచ్చింతల్ రామానుజ క్షేత్రం, చిన జియ్యర్ వ్యవహారాలపై ఆసక్తితో గమనిస్తున్న సెక్షన్లలో ఓ చర్చ… ఓ ప్రశ్న… చిన జియ్యర్ తన కర్తవ్యాన్ని మరిచి, ఓ కమర్షియల్ రియల్ ఎస్టేట్ దందాకు మద్దతుగా నిలిచి, రాజకీయ పంకిలాన్ని అంటించుకుని, ఆధ్యాత్మికతకన్నా ఇంకేదో మార్గంవైపు తరలిపోతూ… చివరకు ఇప్పుడు తలపట్టుకున్నాడా..? అవమానానికి, మోసానికి గురయ్యానని బాధపడుతున్నాడా..? ఒక సన్యాసి వగపు వెనుక తాజా కారణాలేమిటి..? ఈ జియ్యర్ బాట వేరు… ఆధ్యాత్మిక ప్రచారం, ప్రజల్లో ధార్మిక స్పృహ […]
బీమ్లానాయక్ వచ్చిపోయేదాకా… టికెట్ రేట్ల కొత్త జీవో రాదన్నమాటేనా..?!
నిజం కావచ్చు, కాకపోవచ్చు… కానీ అనుకోవడానికి ఆస్కారమైతే ఇస్తుంది జగన్ ప్రభుత్వం… ఏమిటీ విమర్శ అంటే..? భీమ్లానాయక్ సినిమాకు, తద్వారా పవన్ కల్యాణ్‌కు ప్రయోజనం దక్కకూడదు అనే భావనతోనే సినిమా టికెట్ల రేట్ల పెంపు జీవో ఇంకా విడుదల చేయడం లేదు అని..! ఎందుకు..? పవన్ కల్యాణ్ రాజకీయ ప్రత్యర్థి కాబట్టి..! ఎందుకు..? పవన్ కల్యాణ్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి..! ఎందుకు..? టికెట్ రేట్ల మీద కూడా పవన్ కల్యాణ్ ఒక్కడే నిటారుగా నిలబడి […]
హెచ్చరిక :: థియేటర్ వదిలాక మీ బుర్రలు కాసేపు పనిచేయకపోవచ్చు..!!
బోనీకపూర్ నేరుగా ఓ తమిళ చిత్రం నిర్మించడమే ఓ విశేషం… ఇన్ని బైకులు వాడాం, ఇన్ని కొత్త కార్లు కొన్నాం, మొత్తం కార్లు ఇన్ని వాడాం, ఇన్ని కార్లు ధ్వంసం అయ్యాయి, ఇన్ని బైకులు స్క్రాప్ అయిపోయాయి అని లెక్క చెబుతున్నప్పుడే అర్థమైపోయింది… ఈ సినిమాలో అవి తప్ప ఇంకేమీ కనిపించబోవడం లేదని..! అనుకున్నట్టుగానే ఉంది… రయ్ రయ్… సినిమా మొత్తం బైకు చేజులు, బస్సు చేజులు, కార్లు, గేర్లు… చెవుల్లో హోరు నింపే బ్యాక్ గ్రౌండ్ […]
KCR మీడియాకు లోకసభ నోటీసులు..! పార్టీల పోరాటాల రూపు మారుతోంది..!!
తెలుగునాట ప్రతి మీడియా ఒక పార్టీ గొంతుక… కరపత్రిక… నిష్పాక్షికత అనేది ఓ భ్రమ… ఎవరి బాస్ పాదపూజ కోసం ఏం చేయాలో అది చేస్తయ్… ఎవ్వరూ మినహాయింపు కాదు… పార్టీల పోరాటం కాస్తా మీడియా పోరాటంగా, సోషల్ మీడియా పోరాటంగా పరిణమించింది… ఇది ఇంకా ఏ రూపాలు తీసుకుంటుందో తెలియదు… పార్టీల సిద్ధాంతాలు, రాద్ధాంతాలు జాన్తానై… మీడియాను కంట్రోల్ చేయడం కూడా పోరాటాంశమే ఇప్పుడు… యెల్లో మీడియా వర్సెస్ జగన్ మీడియా పోరు చూస్తూనే ఉన్నాం… […]
సుడిగాలి సిద్ధార్థ్..! లుక్కేమో శుద్ధపూస, కానీ యవ్వారాల్లో తక్కువేమీ కాదు…!!
సీనియర్ నరేష్ భార్య అప్పుల బాగోతం పోలీసు కేసుల దాకా పోవడం ఏమో గానీ, నరేష్ పాత పెళ్లిళ్లు, పెటాకులన్నీ సోషల్ చర్చలోకి వచ్చినయ్… నిజంగానే కామన్ రీడర్‌కు నరేష్ పాత పెళ్లిళ్ల గురించి తెలియదు… తాజా పవిత్రాలోకేష్తో బంధమూ తెలియదు… ఈ చర్చ సాగుతూ ఉండగా, ఒకాయన ‘‘నరేష్ కథలు సరే, కానీ ఎవరు శుద్ధపూసలు..? ఈ రంగుల ప్రపంచంలో ఎవరిని కదిలించినా ఇలాంటి కథలే వినిపిస్తయ్ కదా… లవ్వు, బ్రేకప్పు, లివ్ఇన్, డేటింగ్, పెళ్లి, […]
- « Previous Page
- 1
- …
- 331
- 332
- 333
- 334
- 335
- …
- 448
- Next Page »