మీడియాకు మండుతోంది..! సైట్లు, చానెళ్లు తెగ తిట్టిపోస్తున్నయ్ సమంతను…! ఆమెకు అంత పొగరెక్కిందా..? అసలు తన గురించి తను ఏమనుకుంటోంది..? ప్రశ్న అడిగితే బుద్ధి ఉందా అని తిడుతుందా…? అసలు ఆమెకు బుద్ధి ఉందా..? సిగ్గుందా..? మీడియాను అంత మాట అంటుందా…… అంటూ తెగ గింజుకుంటోంది పొద్దున్నుంచీ..! కానీ సమంత చేసిన వ్యాఖ్యలో ఏమాత్రం తప్పులేదు… జస్ట్, బుద్ధి ఉందా అని మాత్రమే తిట్టి సంయమనం పాటించడం మాత్రమే ఆమె చేసిన తప్పు నిజానికి… మీడియాకు కోపం […]
కేసీయార్ తప్పక చదవాల్సిన ఓ చిన్న వార్త… కాదు, నిజానికి పెద్ద వార్తే…!!
నిజానికి కొన్ని వార్తలు అమిత ప్రాధాన్యాన్ని కలిగి ఉంటయ్… కానీ అవెక్కడో మూలకు కనీకనిపించకుండా అచ్చవుతుంటయ్… కొన్ని పత్రికల్లో అసలు కనిపించనే కనిపించవు… టీవీలకు సహజంగానే ఇవి అక్కర్లేదు… వాటి లోకం వేరు… విషయం ఏమిటంటే..? ఇది కరీంనగర్ వార్త… ఏ హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం కేసీయార్ తలబద్దలు కొట్టుకుంటూ కొత్త పథకాలు ఆలోచిస్తున్నాడో, అదుగో ఆ హుజూరాబాద్ నియోజకవర్గం ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్త… ప్రపంచానికే నేను మార్గదర్శకుడిని, ప్రపంచంలోని ఏ లీడరూ ఈ […]
కోల్గేట్ వాడి తెలివి మళ్లీ తెల్లారింది..! పళ్లు బాగుంటేనే ఒళ్లు బాగుంటుందట..!!
బహుళ జాతి కంపెనీ అంటేనే బైరూపి… అంటే బహురూపి… రకరకాల వేషాలు… అందులో కోల్గేట్ వాడు అందరికన్నా ఫస్ట్… దశాబ్దాలుగా మన నోళ్లను రసాయనాలతో నింపీ నింపీ, మన జేబుల్ని ఖాళీ చేసీ చేసీ… ఈమధ్య ఇంకా కొత్త కొత్త ప్రచారాలు చేస్తున్నాడు… ఇంకెలా మాయచేయాలో ఆలోచిస్తున్నాడు… నిజానికి వేపపుల్లలు, బొగ్గుపొడి మాత్రమే కాదు… రకరకాల దంత మంజన్లు… చివరకు ఊక కాల్చిన తరువాత మిగిలే బూడిద కూడా మన పళ్లను తోమింది… ఉప్పు, తినే సోడా […]
భూమిపూజ జరిగి ఏడాది..! అయోధ్య గుడి నిర్మాణం ఎక్కడిదాకా వచ్చినట్టు..?!
అయోధ్య గుడి వివాాదంలో ఉన్నప్పుడు… చీమ చిటుక్కుమన్నా కథలకుకథలు రాసేది మీడియా..! నెగెటివ్, కంట్రవర్సీ సబ్జెక్టులపై ఉన్నంత శ్రద్ధ, ఆసక్తి మీడియాకు సజావుగా సాగిపోయే విషయాలపై అస్సలు ఉండవు… ఎప్పుడూ పెట్రోల్ పోసే వార్తలే కావాలి దానికి… ఏ మీడియా సంస్థా దీనికి భిన్నం కాదు… ఉదాహరణకు అయోధ్య గుడినే తీసుకుందాం… ఏళ్లకేళ్లు దీనిపై వచ్చినన్ని వార్తలు అసంఖ్యాకం… అసలు ఈ వివాదం ఎప్పటికైనా తెగుతుందా..? రావణకాష్టంలా మండిపోతూనే ఉంటుందా అనుకునేవాళ్లు అందరూ… కానీ ఆ స్థలవివాదాన్ని […]
ఇదుగో ఇలాంటివే… ఇంకా మన జీవితంలోని పాజిటివిటీని బతికించేవి…
తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు బావమఱదులన్నలు మేనమామగారు, ఘనముగా బంధువుల్ కలిగినప్పటికైన దానుదర్లగ వెంటదగిలిరారు, యమునిదూతలు ప్రాణమపహరించుక పోగ మమతతో బోరాడి మాన్పలేరు, బలగమందఱు దుఃఖపడుట మాత్రమెకాని, యించుకయాయుష్యమీయలేరు, చుట్టములమీది భ్రమదీసి చూరజెక్కి, సంతతము మిమ్ము నమ్ముట సార్ధకంబు ……… అన్న శేషప్ప పద్యంలోని ఈ మాటలు వింటుంటే… దుబాయ్ ఆసుపత్రిలో 9 నెలల పాటు గడిపి ఇక పనైపోయిందనుకున్న ఆ పేషంట్ పాలిట వాళ్లే సాక్షాత్తూ ఆ భూషణ వికాసుడైన నారసింహుడయ్యారనిపించే కథ ఇది! కట్ల గంగారెడ్డీది […]
ఫీల్డులో కొట్లాడేవాడికి తెలుస్తుంది… తగిలే గాయాలేమిటో, ఆ నొప్పి ఏమిటో…
‘‘అక్కడికి నేనేదో శశిథరూర్‌ను అనకూడని మాటలేవో అన్నట్టు, పెద్ద పంచాయితీ… అవున్లెండి, అసలే కాంగ్రెస్… ఇప్పటికే కేసీయార్ తొక్కీ తొక్కీ నారతీశాడు… ఎవరేమిటో అర్థం కారు, ఎవరు కేసీయార్ మనుషులో అర్థం కాదు, అలాంటిది ఫీల్డులో నానా గదుమలూ పట్టుకుంటూ, అందరి కడుపుల్లో తలకాయలు పెడుతూ… కేడర్‌ను కదిలించుకుంటూ… రాష్ట్రమంతా తిరుగుతూ, సభలు పెడుతూ… నానా కష్టాలూ పడుతున్నాను…. ఫీల్డులో పనిచేసేవాడికి తెలుసు, ఈ పెయిన్ ఏమిటో… మేం కేసుల పాలవుతం, మేం జైళ్లపాలవుతం… వీళ్లు ఎక్కడి […]
తమన్నా… ఓ ఫీనిక్స్ పక్షి..! మాస్ట్రో నితిన్ సినిమా కాదు… తమన్నా సినిమా…!
ఇప్పుడు ఎలాగూ చాన్స్ ఉంది కదా, పది రూపాయలో, వంద రూపాయలో… ఎంతొస్తే అంత… దీన్ని థియేటర్లలో కూడా విడుదల చేయాల్సింది… ఓ డిస్ట్రిబ్యూషన్ సిండికేట్ మెంబర్ తన సొంత కొడుకు, తన సొంత సినిమాను కేవలం ఓటీటీలో విడుదల చేయడం ఏమిటి..? నెట్‌ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ అయితే ఇంకా బెటర్ రీచ్ అయి ఉండేది… ఆ హాట్ స్టార్ రీచ్ చాలా తక్కువ కదా… ఈ కామన్ సెన్స్ ఎందుకు లోపించింది..? కేవలం తమకు […]
కేసీయార్‌జీ… రాంజీ గోండు కథెప్పుడైనా విన్నారా..? రేపు షా వచ్చేది ఆ స్మరణకే…!!
నచ్చింది… ఒక పాత్రికేయుడు తెలంగాణ మాండలికంలో జనం మరిచిపోతున్న, మరిచిపోయిన ఓ అమరవీరుల కథను రాస్తే… దాన్ని చదివిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వయంగా ఓ లేఖ రాసి అభినందించడం నచ్చింది… అందులోనూ నమస్తే అని సంబోధించడం ఆయన సంస్కారం… కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది… పాత ఆదిలాబాద్ జిల్లాలో ఒకచోట ఏకంగా వేయిమందిని ఉరి తీసినట్టు ఓ చరిత్ర… దాని మీద భిన్నాభిప్రాయాలు, సందేహాలు ఉండవచ్చుగాక… కానీ మృతుల సంఖ్యపై […]
టీవీ9 రజినీ మళ్లీ వేసేశాడు- తెలుగు ప్రజల గొంతుకలో గుచ్చేశాడు…
అంటే అన్నామంటారు గానీ… మరి దీన్నేమనాలి డియర్ టీవీ9 రజినీకాంత్ భాయీజీ… ఆమధ్య శ్రీదేవి మరణించినప్పుడు తమరు గట్టిగా పలికిన ఆ ఆటోస్పై అనే పదం తెరతెరలుగా మన టీవీ ప్రేక్షకుల మెదళ్లను కమ్మేసి, నిర్విణ్నులను చేసి పారేసిన తీరు ఇంకా మరపుకే రాలేదు… మధ్యలో నీ స్పూర్తిని అందిపుచ్చుకుని దేవి ఓసారి నీటి గురుత్వాకర్షణ శక్తి ఎలా బ్రేకవుతుందో జ్ఞానబోధ చేసింది… ఈమధ్య రుధిరం అంటూ నెత్తుటి భాషను కురిపించింది… ఆ దడ నుంచి ఇంకా […]
జూనియర్ పాపులారిటీ వేస్టు… తమన్నా షో మరీ మాడిపోయిన ఆమ్లెట్టు…
మొన్నొకరోజు టీవీలో రకరకాల చానెళ్లు ట్యూన్ చేస్తుంటే… ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ తగిలింది… కొద్దిసేపే… ఒకామె జూనియర్‌ను తెగపొగిడేస్తోంది… అసలు క్విజ్ షోకన్నా ఈ భజనే ఎక్కువ అనిపించింది… చానెల్ వెంటనే మార్చేలా చేసింది ఖచ్చితంగా షో నిర్వాహకులే..! జూనియర్, సినిమాల్లో అయితే ఏదో ఓ పాటలోనో, రెండుమూడు పంచ్ డైలాగుల్లోనో వంశకీర్తనలు, స్వకుచ స్తుతులు పర్లేదు, కానీ ఇది టీవీ షో, అదీ విజ్ఞానాన్ని పంచాల్సిన షో… ఇక్కడా అదేనా..? జూనియర్ వైఖరి మీద జాలి […]
నవ్వుకునే జోకుల దశ దాటేసి… ఇప్పుడు బాలీవుడ్ నంబర్ వన్ చాయిస్…
బాలీవుడ్ నంబర్ వన్ నటి ఎవరిప్పుడు..? కంగనా..? దీపిక పడుకోన్..? ప్రియాంక చోప్డా..? శ్రద్ధాకపూర్..? ఎవరు..? వాళ్లెవరూ కాదు..! నిస్సందేహంగా ఆలియా భట్..! రెమ్యునరేషన్ లెక్కలు కాసేపు వదిలేయండి… డిమాండ్, పాపులారిటీ, దర్శకులు ఎవర్ని ప్రిఫర్ చేస్తున్నారు కోణాల్లో చూస్తే… ఆలియా నంబర్ వన్ ఇప్పుడు..! ఇండియన్ కాదు, బ్రిటిష్ పౌరసత్వమున్న నటి… వయస్సు కూడా 28 దాటలేదు… ఆమె సినిమా వయస్సు మరీ తొమ్మిదేళ్లే… చేసింది పట్టుమని పదమూడు సినిమాలు మాత్రమే… అంతేకాదు, ఆలియాకు బుర్రలేదు […]
భేష్ తెలంగాణ పోలీస్… తుపాకీకి మరక అంటలేదు… ‘‘పని జరిగిపోయింది…
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సింగరేణి కాలనీ చైత్ర హత్యాచారం కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు… తెలంగాణ పోలీసులు తమ తుపాకీకి ఏ ఎన్కౌంటర్ మరక అంటించుకోలేదు… న్యాయం జరిగిపోయింది… అబ్బే, పోలీసులు ఏమీ చేయలేదు… ఎలాగూ ఉరి తప్పదు, ఎన్కౌంటర్ తప్పదు, తప్పించుకోలేను అనే భయంతో తనే ఆత్మహత్య చేసుకున్నాడు అంటారా..? ఎస్, అదే నిజమని నమ్మేద్దాం… ఖండించాల్సిన పనిలేదు, హక్కుల గుంజాటన అసలే అక్కర్లేదు… వాడు తన ఆత్మకు తనే జవాబు చెప్పుకున్నాడు, శిక్ష […]
సంజయా, వెలుగు పేపర్ చదివావా..?! రేవంతూ, ఈ కథేమిటో తెలిసిందా..?!
ఒక స్కీం… అది వోట్ల కోసం కేసీయార్ ఆలోచించిన స్కీమే… అదీ ఆయనే చెప్పుకున్నాడు… దళితబంధు పేరిట ఒక్కో ఎస్సీ కుటుంబానికి పది లక్షలు ఇస్తాను, ఎలాగైనా ఖర్చుపెట్టుకో అంటున్నాడు కేసీయార్… జస్ట్, పైలట్ ప్రాజెక్ట్ పేరిట కేవలం ఉపఎన్నిక జరగాల్సిన హుజూరాబాద్‌లో మాత్రమే ప్రారంభిస్తాడు… మళ్లీ మాట మార్చి వాసాలమర్రిలో స్టార్ట్ చేస్తాడు… ఆయన మదికి ఏది తోస్తే అదే స్కీం… ఇది దేశంలోనే సీఎంలందరి కళ్లూ తెరిపించే స్కీం, ప్రపంచానికే మార్గదర్శకం అనే దాకా […]
బిగ్‌బాస్ కంటెస్టెంట్లపై హేయమైన ముద్రలు..! నువ్వు ఒక జాతీయ నేతవా..?!
ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం కోణంలో భ్రష్టుపట్టిపోవచ్చుగాక… పార్టీ ఉనికే ఊగిసలాటలో ఉండవచ్చుగాక… కానీ సీపీఐకి ఈ దేశ రాజకీయ చరిత్రకు సంబంధించి ప్రాముఖ్యత ఉంది… ఈరోజుకూ ఆ పార్టీ జెండా కోసం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలున్నారు, అభిమానులున్నారు… ఒకప్పుడు పార్టీ ప్రవచించిన సిద్ధాంతాల కోసం, ఆదర్శాల కోసం ఎందరెందరో తమ ప్రాణాలకు తెగించి పోరాడిన చరిత్ర కూడా ఉంది… అలాంటి పార్టీకి నారాయణ జాతీయ కార్యదర్శి… ఆయన పిచ్చి కూతలు వింటుంటే, అసలు ఎలా ఆ హోదా […]
సిద్ధాంతం, మన్నూమశానం ఏమీ లేదు… ఎవరొచ్చినా ఎర్ర కండువాలు కప్పేయడమే…!!
లెఫ్ట్, రైట్ పార్టీలు కాస్త నిబద్ధత పంథాలో ఉండేవి గతంలో… పూర్తి రైట్ అంటే బీజేపీ… ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేవైఎం వంటి అనుబంధ సంస్థల్లో పనిచేసి మెల్లిగా ఎలివేట్ అయ్యేవాళ్లు నాయకులు… వేరే పార్టీల నాయకుల్ని అంత త్వరగా నమ్మదు బీజేపీ… కానీ ఇప్పుడలా కాదు… మోడీషా శకం కదా… పక్కా కాంగ్రెస్ తరహా… ఏ పార్టీయో, కేసులున్నాయో లేదో, ఎలాంటి గత చరిత్ర అనేది ఏమీ చూడటం లేదు… డబ్బోదస్కమో, ఇతర ప్రలోభమో, వచ్చావా, పార్టీలో […]
కరీనాను తప్పించి… కంగనాను ఒప్పించి…! మార్పు వెనుక అసలు కథేమిటి..?!
నిజానికి బాలీవుడ్‌కే కాదు… ఇది ఇండియన్ సినిమాకు సంబంధించి కాస్త ఇంట్రస్టింగ్ వార్తే..! కరీనాకపూర్‌ను తప్పించి, ఓ భారీ సినిమాలో సీత పాత్రకు కంగనా రనౌత్‌ను ఎంపిక చేయడం..! ఆ సినిమా పేరు… సీత- The Incarnation… పాపులర్ రచయిత విజయేంద్రప్రసాద్ రాసిన కథ… అదీ సీత కోణంలో కొత్తగా కథను చెప్పడం… అంతేకాదు, హిందీతోపాటు తమిళం, తెలుగు, మళయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు… నిజానికి చాలారోజులుగా సాగుతున్నది ప్రిప్రొడక్షన్ […]
హబ్బ… మన జీహెచ్ఎంసీ బాసుల బుర్రల్ని చూస్తే కళ్లు చెమరుస్తున్నయ్…!!
కేసీయార్ కాలర్ ఎగరేయాలి, జీహెచ్ఎంసీకి అద్భుతమైన బుర్రలున్న అధికారులను నియమించినందుకు…! కాబోయే ముఖ్యమంత్రి, ప్రస్తుత నగరాధిపతి కేటీయార్ కూడా కాలర్ ఎగరేయాలి, జీహెచ్ఎంసీ అద్భుతంగా పనిచేస్తున్నందుకు..! ఓ మెగా హీరో స్పోర్ట్స్ బైక్ జారిపడటానికి కారణం ఎవరు..? ఇసుక…! అది అక్కడెందుకు ఉంది..? సదరు కంట్రాక్టు కంపెనీ నిర్లక్ష్యం..! ఎంతటి నేరం..? ఎంతటి పాపం..? ఆ నిర్లక్ష్యానికి, ఆ తప్పుకి ఆ కంపెనీ ఓనర్‌ను ఉరితీసినా తప్పులేదు… కాకపోతే మన జీహెచ్ఎంసీ అధికారుల హృదయాలు విశాలం కదా… […]
పాపం మామూలు దేవుళ్లు కదా… ఈ సినిమా పెద్ద దేవుళ్లను ఏమీచేయలేరు…
మాజీ గవర్నర్ నరసింహన్ వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా కావచ్చుగాక….. ఒక విషయంలో మాత్రం తనను చూసినప్పుడల్లా ఓరకమైన చీదర..! ప్రతి గుడికీ వెళ్లడం, ప్రొటోకాల్ పేరిట మర్యాదలు, ప్రాధాన్యతలు, సామాన్య భక్తులకు అవస్థలు… గంటలకొద్దీ… ఒక్కొక్క భక్తుడూ క్యూలో నిలబడి బూతులు తిట్టుకున్నాడు… దేవుడి దర్శనంతో ఆయన ఏం పుణ్యం సంపాదించుకున్నాడో గానీ భక్తుల తిట్లు శాపనార్థాలతో అదనపు పాపాన్ని మూటగట్టుకున్నాడు… తన ఇంటికి దగ్గరలోని ఆంజనేయుడి గుడి దగ్గర నుంచి తిరుమల వరకూ అదే పైత్యం […]
బై బై టాలీవుడ్…! జై జై బాలీవుడ్…! సమంత అడ్డా ఇకపై ముంబై..!!
నిజానికి పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు… కాకపోతే సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి నాగచైతన్య-సమంతల విడాకుల వ్యవహారం జనం నోళ్లలో నానుతోంది… అసలు సినిమా, టీవీ, మోడలింగ్ తదితర ప్రలోభాల, విలాసాల రంగుల రంగాల్లోనే కాదు… విడాకులు విపరీతంగా పెరిగిపోయాయి… కాకపోతే సెలబ్రిటీల విడాకుల మీద కాస్త ఎక్కువ చర్చ సాగుతూ ఉంటుంది… ఆమెతో చైతన్య బంధం తెగిపోయినట్టే… మ్యుచువల్ కాన్సెంట్‌తో డైవోర్స్‌కు అప్లయ్ చేసుకుని, ఓ దఫా కౌన్సిలింగ్ కూడా జరిగిందట… నాగార్జున కాస్త చక్కబెట్టే ప్రయత్నం […]
అమెరికా డబుల్ గేమ్..! గల్ఫ్ రీజియన్ నుంచీ బలగాలు వాపస్..?!
………… By…. పార్ధసారధి పోట్లూరి …. అంతు పట్టని అమెరికా ఆలోచనలు ! అమెరికా – సౌదీ ఆరేబియాల మధ్య విడదీయలేని దౌత్య, ఆర్ధిక, రక్షణ పరమయిన బంధం ఉంది చిరకాలంగా ! అసలు గల్ఫ్ ప్రాంతంలోని ఆయిల్ కొనుగోలు డాలర్ రూపంలో జరుగుతుంది. అలాగే గల్ఫ్ రీజియన్ రక్షణ బాధ్యత అమెరికా తీసుకుంది. చాలా కాలంగా అది కొనసాగుతూనే ఉంది. అయితే …. రెండు వారాలక్రితం అమెరికా తన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని సౌదీ […]
- « Previous Page
- 1
- …
- 329
- 330
- 331
- 332
- 333
- …
- 409
- Next Page »