సీనియర్ నరేష్ భార్య అప్పుల బాగోతం పోలీసు కేసుల దాకా పోవడం ఏమో గానీ, నరేష్ పాత పెళ్లిళ్లు, పెటాకులన్నీ సోషల్ చర్చలోకి వచ్చినయ్… నిజంగానే కామన్ రీడర్‌కు నరేష్ పాత పెళ్లిళ్ల గురించి తెలియదు… తాజా పవిత్రాలోకేష్తో బంధమూ తెలియదు… ఈ చర్చ సాగుతూ ఉండగా, ఒకాయన ‘‘నరేష్ కథలు సరే, కానీ ఎవరు శుద్ధపూసలు..? ఈ రంగుల ప్రపంచంలో ఎవరిని కదిలించినా ఇలాంటి కథలే వినిపిస్తయ్ కదా… లవ్వు, బ్రేకప్పు, లివ్ఇన్, డేటింగ్, పెళ్లి, […]
సాక్షి టీవీతో దేశ అంతర్గత భద్రతకు ఏం ముప్పు..? జగన్‌పై ఇదేం ముద్ర..?!
ఆంధ్రజ్యోతి పత్రిక పొద్దున్నే ఓ బాంబు పేల్చింది… సాక్షి టీవీకి కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వకుండా, అనుమతుల్ని రద్దు చేసిందనీ, హైకోర్టులో సాక్షికి తాత్కాలిక ఊరట దక్కిందనీ ఓ వార్త అచ్చేసింది… ఈమధ్యకాలంలో ఇంత ఆనందంగా ఏ వార్తా రాసుకుని ఉండదు బహుశా… అసలే సాక్షి, అందులో కేంద్రప్రభుత్వ నిర్ణయం, ఇంకేముంది..? వార్తను దంచికొట్టింది… తెలుగు జర్నలిస్టు సర్కిళ్లలోనే కాదు, పొలిటికల్, బ్యూరోక్రాటిక్ సర్కిళ్లలో పెద్ద టాపిక్ అయిపోయింది ఇది… సహజమే కదా… సాక్షి cm […]
లాకప్..! బిగ్‌బాస్‌ను మించిన భీకరమైన కాన్సెప్ట్… ఇది కంగనా జైలు…!
LOCK UPP… ఈ ఓటీటీ రియాలిటీ షో పేరు చూసి… వాడేమిటి పేరు ఇలా పెట్టుకున్నాడు, స్పెల్లింగ్ కూడా తెలియదా అని ఆశ్చర్యపడకండి… BIGG BOSS అని చూడలేదా..? ఇదీ అంతే… లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్త అన్నమాట… బిగ్‌బాస్ షో నిర్మించే ఎండెమాల్ సంస్థే ఇప్పుడు కంగనా రనౌత్ హోస్టుగా ఈ లాకప్ అనే సరికొత్త రియాలిటీ షోకు తెరలేపుతోంది… అనేకానేక దేశాల్లో రియాలిటీ షోలు, ఇతర టీవీ ప్రోగ్రాముల్ని నిర్మిస్తూ ఉంటుంది ఈ సంస్థ… […]
కారు చౌక మందు… ప్రాణాల్ని కాపాడే సంజీవని… కానీ ఒక జాగ్రత్తతో…
*ఏస్పిరిన్ ప్రాణాలను కాపాడుతుంది, శంకలొద్దు*………. ఒక మాదిరి నుండి తీవ్రమైన కోవిడ్ బారిన పడి, కోలుకున్న వారిలో అనేక సమస్యలు దీర్ఘకాలం వేధిస్తుండడం మనకు తెలిసిందే. తీవ్రమైన నిస్సత్తువ, ఒంటి నొప్పులు, ఆయాసం, గుండె దడ, ఎంతకూ తగ్గని దగ్గు ఇలా అనేక రకాల సమస్యలతో… కోవిడ్ బాధితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, కొందరు కోవిడ్ బాధితులు తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలి, అక్కడికక్కడే చనిపోవడం వింటున్నాం. గతంలో గుండెపోటుతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ […]
ఆర్జించే సేవల రేట్లు సరే… మరి ఈ సామాన్యభక్తుడి అవస్థల మాటేమిటి..!!
తిరుమల శ్రీవారి సేవకు ఉదయాస్తమాన సేవ అని ఒక విశిష్ట ఆర్జిత సేవ ఉంటుంది… అత్యంత గిరాకీ… బోర్డు సభ్యులకు వాటికి సిఫారసు చేయడం మంచి లాభదాయకమట… తాజాగా ఇంకా అదనపు ప్రయోజనాలు కూడా కల్పించే పనిలో ఉందట టీటీడీ… మొన్నటి ఆర్జిత సేవల మీటింగ్ సందర్భంగా, ఈ బోర్డు సభ్యులు అత్యంత ధార్మిక భావనలతో, మనసంతా పుణ్యాభిలాషతో ఆర్జిత సేవల విషయం బాగా ‘‘డిస్కస్’’ చేసిన వీడియో చూశారు కదా… శ్రీవారి భక్తగణం తరించిపోయింది… వాళ్లను […]
ఆకాశమంత విగ్రహం పెట్టి… అంత చిన్నవాడివై పోయావేమి స్వామీ..?!
ఇంత చిన్నవాడివైపోయావా స్వామీ? —————————– అంత పెద్ద ఆకాశమంత విగ్రహం పెట్టి ఇంత చిన్నవాడివై పోయావేమి స్వామీ? వామనుడిలో త్రివిక్రముడిని చూసినా… శుక్రాచార్యుడు వద్దని వారిస్తున్నా బలి చక్రవర్తి హాయిగా, ఇష్టంగా నెత్తిన కాలు పెట్టించుకుని, శాశ్వతంగా పాతాళంలోకి కూరుకుపోయాడు. ఎవరు జగద్గురువు? ఎవరు కాదు? అన్న సమకాలీన ప్రైమ్ టైమ్ టీవీ డిబేట్ల స్థాయికి దిగి మీరు ఎక్కడ కూరుకుపోయారు స్వామీ? వెంకన్నకు ఒక గురువున్నాడా స్వామీ? నిజమే. వెంకన్నకే పంగనామాలు పెట్టగలిగిన ఎందరో పుట్టి […]
ఓహ్… ఉక్రెయిన్ గేమ్ వెనుక ఇంత కథ ఉందా..? లోగుట్టు ఇదా..?!
పార్ధసారధి పోట్లూరి ……….. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చాల కంట్రోల్డ్ గేమ్ ఆడుతున్నాడు! ఉక్రెయిన్ ని ఆక్రమించుకోవడం అనే ఆటని మొదట అమెరికా, నాటో దేశాలు మొదలుపెడితే తరువాత ఆ ఆటకి సంబంధించి అన్ని వ్యవస్థలని తన అదుపులోకి తీసుకొని అందరి ఆట తనే ఆడేస్తున్నాడు పుతిన్! పుతిన్ ఆట ఆడుతుంటే మిగతా ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తున్నది! ప్రపంచంలో వివిధ దేశాలలో ఉన్న యూదులలో యూరోప్ యూదులు చాల ప్రత్యేకం! ఇక ఇజ్రాయెల్ యూదుల […]
బురద పెళ్లిళ్లు..! రోజురోజుకూ వెగటు పుట్టిస్తున్న ప్రివెడ్ షూట్స్… ఇదే ఎగ్జాంపుల్…
‘‘సిగ్గూశరం లేదు, ఇది ప్రివెడ్ షూట్ ఏమిట్రా… బురద గాడిదా..! ఇందులో క్రియేటివ్ రొమాంటిక్ ఫీల్ ఏముందిరా.., ఇది చూస్తూ పెళ్లిపందిట్లో భోజనాలకు ముందే వాంతులు చేసుకోవాలా గెస్టులు..? ఆ బురద పూసుకుని వధూవరులు పెళ్లికి ముందే ఏం చూసుకుంటున్నార్రా..? పోతార్రా, నాశనమైపోతార్రోయ్…’’ ఇలా చాలా వ్యాఖ్యలు కనిపిస్తున్నయ్ ఈ ఫోటో కింద… నిన్నటి నుంచీ నాలుగైదు బురద ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నయ్… మెజారిటీ తిట్టిపోస్తున్నారు… అసలేమిటి ఇది..? ఓ ప్రివెడ్ షూట్… మన […]
642 నిమిషాలు… ఔను, అనంత శ్రీరాముడితో స్వప్న సంభాషణ నిడివి…
2013… నార్వేలో ఓ టీవీ 30 గంటల ఇంటర్వ్యూ ప్రసారం చేసింది… ఇప్పటివరకూ ఇదే ప్రపంచరికార్డు… అంతకుముందు 2012లో న్యూజిలాండ్‌లో 26 గంటల టీవీ ఇంటర్వ్యూ ఒకటి సాగింది… దానికిముందు కూడా కొన్ని రికార్డులున్నయ్… అయితే అవి స్ట్రెయిట్ ఇంటర్వ్యూలు… గంటకు ఓ ఐదు నిమిషాల బ్రేక్ ఉంటుంది… చూసేవాడు చూస్తాడు, లేదంటే స్విచాఫ్… అయితే ప్రిరికార్డెడ్, ఎడిటెడ్ ఇంటర్వ్యూల మాటేమిటి ..? ఇవి ఇంకా సౌలభ్యం… అలా యూట్యూబులో పడేస్తే చాలు, అలా పడి ఉంటయ్… […]
గాంధారి..! హిందీ పాటను డబ్ చేసినట్టు..! మన యూట్యూబర్లు వందరెట్లు నయం..!
గాంధారి పేరిట ఓ మ్యూజిక్ వీడియో రిలీజైంది… సోనీ వాళ్లు నటి కీర్తిసురేష్‌తో చేసిన వీడియో అది… వేంఠనే మన సంకీర్తనాచార్యులందరూ అందుకుని, ఆహారాగాన్ని, ఓహోగానాన్ని ఎత్తుకున్నారు… నిజంగా ఆ మ్యూజిక్ వీడియోకు అంత సీనుందా..? ఏమీ లేదు… పైగా ఆ టీంను చూస్తే జాలేసింది… ప్రత్యేకించి పాటల రచయిత సుద్దాల అశోకుడికి ప్రయాస చూసి మరీ… ఏమాటకామాట… ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉండే కీర్తిసురేష్ సన్నబడింది… బొండుమల్లె వంటి దేహం కాడమల్లెలా కనిపిస్తోంది… తను ఏ […]
టీటీడీ సుబ్బన్నా… చేసింది మంచిపనే… కానీ ఆ కోటాల్నే తీసేస్తే నీకు సార్థకత..!!
ఏరోజు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశమో గానీ… ఓ వీడియో బిట్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది… సుబ్బారెడ్డి దేవుడిని అమ్మకానికి పెట్టాడనీ, ఆదాయం తప్ప వేరే లోకమే లేదనీ, భక్తులను నిలువుదోపిడీ చేసేలా ఆర్జిత సేవల రేట్లు పెంచేశాడనీ సోషల్ యాక్టివిస్టులు తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు… ఆ వీడియో చూస్తే అలా అనిపించడంలో, అలా కోపాన్ని వ్యక్తీకరించడంలో తప్పు లేదనిపిస్తుంది… కానీ ఇక్కడ జరుగుతున్నది అనవసర ట్రోలింగే… టీటీడీ ట్రస్ట్ బోర్డు ఉనికి […]
చిన్న కథే… చిన్న విషయాలే… ఐతేనేం, చీకట్లో చిరుదివ్వె చాలదా ఏం..?
తెల్లవారింది.. నాకు ఐదు గంటలకే మెలకువ వచ్చింది. లేచి చేసేది ఏముందని అలాగే పడుకొని ఉన్నాను. మార్నింగ్ వాక్ కి వెళ్ళాలి… కానీ బద్దకంగా అనిపించింది. మావారు బ్యాంక్ మేనేజర్ గా పనిచేసేవారు… ఆయన చనిపోయి రెండేళ్లు అయింది… కొడుకు కూతురు అమెరికాలో స్థిరపడి పోయారు. నన్నూ అక్కడకు వచ్చేయమంటారు…కానీ నాకే ఇష్టం లేదు. ఆయన పోయాక నాకు ఆసక్తి పోయింది. నిరాశ నిస్పృహలతో కాలం గడుపుతున్నాను.. కాఫీ తాగాలి అనిపించింది. కానీ ఈ మధ్యన చక్కెర వ్యాధి రావడాన డాక్టర్స్ సలహా మేరకు కాఫీ మానేశాను.. కాఫీ త్రాగడం […]
నరేషూ… ఓహో… తమరూ తక్కువేమీ కాదు… తమరి సతీమణి కూడా అంతే…
మొన్న ఒకాయన రాశాడు… నిజమే… నాగార్జున కుటుంబం ఓ శాపగ్రస్తం అని… తను రామానాయుడి కూతురిని పెళ్లిచేసుకున్నాడు… ఫెయిల్… ఆమె తరువాత వేరే పెళ్లి చేసుకుంది, నాగ్ కూడా అమలను పెళ్లిచేసుకున్నాడు… కొడుకు చైతూ పెళ్లి ఫెయిల్… చిన్న కొడుకు అఖిల్ నిశ్చితార్థం ఫెయిల్… సుమంత్ పెళ్లి ఫెయిల్… సుప్రియ పెళ్లి ఫెయిల్… ఇవన్నీ నిజమే… కానీ ఆ కలర్‌ఫుల్ ఇండస్ట్రీలో అన్నీ ఇవే కథలు కదా… ఒక్క నాగ్ ఫ్యామిలీనే ఎందుకు వేలెత్తి చూపడం..!! ఇవే […]
నో ఆంక్షలు… నో ఐసోలేషన్… నో టెస్టులు… కరోనా పీడ విరగడ…
*కోవిడ్ ముగిసింది – స్వేచ్ఛగా జీవించండి :: 24 నుండి బ్రిటన్ లో ఆంక్షలు ఉండవు*…….. రెండు సంవత్సరాలకు పైగా ప్రపంచ ప్రజల స్వాతంత్ర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్షును ఓ అత్యంత సూక్ష్మ క్రిమి కొరోనా వైరస్ లాగేసుకుంది. ఆర్ఎన్ఏ వైరస్లలో ఉండే తీవ్రమైన వారస కణ (జీన్) మార్పిడిశక్తి మూలంగా గడచిన రెండేళ్లలో రకరకాల రూపాలతో మానవాళి మున్నెన్నడూ ఎరుగని తీవ్రమైన విషాదానికి, విధ్వంసానికి గురి చేసింది. వైద్య ప్రపంచం వేగంగా కదిలి, గొప్ప మేధస్సుతో ఉపశమన […]
పానిపట్ ఆర్మీ యూనిట్… ! తాలిబన్లకు ఇండియా నిరసన చెబితేనేం..?!
పార్ధసారధి పోట్లూరి …….. ‘పానిపట్ ఆపరేషనల్ యూనిట్‘…. ఇది ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం తమ కొత్త మిలటరీ యూనిట్ కి పెట్టిన పేరు. అమెరికా వదిలివెళ్ళిన ఆయుధాలతో ప్రత్యేక శిక్షణ ఇచ్చి, దానికి ‘Panipat Operational Unit‘ పేరు పెట్టి, ఈ యూనిట్ ని ఆఫ్ఘన్ పాక్ సరిహద్దుల్లో ఉన్న ‘నాన్ గర్హర్ ప్రావిన్స్‘ [Nangarhar province] లో మోహరించింది తాలిబాన్ సర్కార్… మాస్కులు ధరించిన మిలటరీ యూనిట్ పరేడ్ చేస్తున్న దృశ్యాలని నాన్ గర్హర్ […]
యాస్పిరిన్..! కరోనా అనంతర గుండెపోట్లకు అద్భుత చౌక మాత్ర…!!
మంచి ఆరోగ్యకరమైన జీవనవిధానాల్ని పాటించేవాళ్లు కూడా హఠాత్తుగా గుండెపోట్లకు గురవుతున్నారు… నిమిషాల్లో కన్నుమూస్తున్నారు… కోవిడ్ అనంతరం తలెత్తే సమస్యలే కారణం అంటున్నారు కొందరు వైద్యులు… తాజాగా ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం మళ్లీ ఈ చర్చకు దారితీస్తోంది… వైద్యపరిభాషలో ఓసారి ఈ పోస్టు చదువుదాం… Yanamadala Murali Krishna………. కొరోనా వైరస్ కలుగజేసే కోవిడ్ జబ్బులో… హాస్పిటల్ మరణాలలో ముగ్గురిలో ఒకరు రక్తం గడ్డ కట్టడం మూలంగానే చనిపోతున్నట్లుగా 2020 కొరోనా మొదటి వేవ్ లోనే […]
నంబర్లాట..! కేసీయార్ ప్రధాని కావొద్దని ఏమీలేదు… చిన్న రాష్ట్రం అడ్డంకే కాదు…
బెంగాల్ 42 సీట్లు… మమతకు ప్రధాని పదవి కావాలి… అక్కడ సీఎం కావడానికి వారసుడు అభిషేక్ బెనర్జీ రెడీ… ప్రస్తుతం ఎంపీ కూడా… తమిళనాడు 39 సీట్లు… స్టాలిన్‌కు కూడా ప్రధాని పదవి కావాలి… అక్కడ సీఎం కావడానికి కొడుకు ఉదయనిధి రెడీ… ఆల్రెడీ ఎమ్మెల్యే కూడా… మహారాష్ట్ర 48 సీట్లు… ఉద్దవ్ ఠాక్రేకు ప్రధాని పదవి కావాలి… అక్కడ సీఎం కావడానికి కొడుకు ఆదిత్య రెడీ… ఆల్రెడీ ఇప్పుడు మంత్రి కూడా… ఉత్తరప్రదేశ్ 80 సీట్లు… […]
నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్… ఈ దిశలో ప్రతి ఫ్రంటూ ఓ పెద్ద ఫెయిల్యూర్…
1947 నుంచి 1964… ప్రధాని నెహ్రూ… స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీగా జనంలో ఉన్న ఆదరణతో మంచి మెజారిటీతో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి… సుస్థిర ప్రభుత్వాలు… 1964 నుంచి 1966… ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి… అదే కాంగ్రెస్… నెహ్రూ మరణంతో ఖాళీ అయిన ప్రధాని ప్లేసులో చేరిన శాస్త్రి సమర్థంగా పాలించాడు… 1966 నుంచి 1977… ప్రధాని ఇందిరాగాంధీ… పార్టీలో సంక్షోభాలు ఎలా ఉన్నా సరే, అన్నీ తట్టుకుంటూ, ఇంకెవరికీ ఏ చాన్సూ ఇవ్వకుండా సుస్థిర ప్రభుత్వం రన్ […]
ప్రతి కథనమూ బాగుంటోంది… ఆజాదీ మహోత్సవ్‌పై ఈనాడు గుడ్ ఎఫర్ట్…
ఏమాటకామాట… తెలుగు పాత్రికేయ వృత్తిలో కొన్ని ఈనాడు మాత్రమే చేయగలదు… ఈనాడును చూసి వాతలు పెట్టుకునే పత్రికల వల్ల కాదు… వాటికి అంత నైపుణ్యం కూడా ఏమీ లేదు… నిజానికి ఈనాడు తన ట్రెయిన్డ్ మానవ వనరుల్ని సరిగ్గా వాడుకోలేకపోతోంది… ఓరకమైన నిర్లిప్తత ఆ వ్యవస్థను ఆవరించింది… కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, తలుచుకుంటే మంచి మంచి కథనాలను ప్రజెంట్ చేయగల స్టాఫ్ ఈనాడులో ఇంకా ఉన్నారు… ఎటొచ్చీ వాళ్లకు సరైన డైరెక్షన్ కావాలి అంతే… లోపించిందీ […]
ఆ మంత్రం పఠిస్తే రోగులకు బెటరట… అపోలో ఉపాసనపై మళ్లీ ట్రోలింగ్…
చిరంజీవి కోడలు, రాంచరణ్ భార్య అని గాకుండా కామినేని ఉపాసనను ఇక్కడ అపోలో గ్రూపు హాస్పిటళ్ల వైస్ ఛైర్ పర్సన్‌గా ప్రస్తావించుకోవాలి… ఆమె తెలుగు మాట్లాడలేదు ఎందుకో… సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్గానే ఉంటుంది… కొన్ని ఆలోచింపజేసే పోస్టులు కూడా కనిపిస్తుంటయ్… అదే సమయంలో అప్పుడప్పుడూ ట్రోలింగ్‌కూ గురవుతూ ఉంటుంది… ఆమధ్య ఏదో గుడి గోపురం మీద ఎవరెవరో నిలబడ్డ ఓ పిచ్చి ఫోటో పెట్టి బాగా ట్రోలింగుకు గురైంది… స్థూలంగా చూస్తే, కాస్త వివేకం ఉన్న […]
- « Previous Page
- 1
- …
- 332
- 333
- 334
- 335
- 336
- …
- 448
- Next Page »