. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలీ కర్కి పేరు వినవచ్చింది కదా… వారణాసిలో చదువుకున్న ఆమెకు ఇండియా అంటే అభిమానం, మోడీ అంటే గౌరవం… కానీ ఆ పేరు ఇప్పుడు వెనక్కి పోయింది… రాజ్యాంగం ప్రకారం మాజీ న్యాయమూర్తులు ఈ పదవికి అర్హులు కారు, పైగా ఆమెకు 70 ఏళ్లు, ఈ జెడ్ జనరేషన్‌కు ప్రాతినిధ్యం వహించలేదు అని జనరేషన్- జెడ్ తాజాాగా ఆమె పేరును తిరస్కరించింది… (అసలు ప్రధాని పదవి ఎవరిదో […]
బరేలీ మార్కెట్లో పడిపోయిన ‘చెవికమ్మ’ దొరికింది… ఇదుగో ఇదే…
. అదేదో దాసరి సినిమాలో మోహన్‌బాబు, సుజాత పాట… ఉంగరం పడిపోయింది, పోతే పోనీ పోతే పోనీ… సేమ్, అప్పట్లో… 1966లో… మేరా సాయా అనే ఓ హిట్ సినిమా… మిస్టరీ, డ్రామా కథాంశమే కాదు, ఒక పాట సూపర్ హిట్… ఝుమ్కా గిరారే బరేలీ కే బజార్ మే… (బరేలీ మార్కెట్లో ఝుమ్కా పడిపోయింది… చెవి కమ్మ, రింగు…) హీరోయిన్ తన ఝుమ్కాను బరేలీ మార్కెట్లో పోగొట్టుకుంటుంది అని అర్థం… 54 సంవత్సరాలు వేగంగా గడిచిపోయాయి… ఆ […]
అప్పట్లో మహాబాహుబలి… ఆరుగురు ఎంపీలు… ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే…
. Subramanyam Dogiparthi …. తెలుగు ప్రజలు మీసం మెలేసి గర్వంగా చెప్పుకునే యుధ్ధాలు రెండు . ఒకటి ఆంధ్ర మహాభారతం పల్నాటి యుధ్ధం . రెండవది బొబ్బిలి యుధ్ధం . పల్నాటి యుధ్ధం మా పల్నాడు ప్రాంతానికి సంబంధించినది అయితే బొబ్బిలి యుధ్ధం ఉత్తరాంధ్రది . బొబ్బిలి యుధ్ధం అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చే యోధుడు , బొబ్బిలి పులి తాండ్ర పాపారాయుడు . తాండ్ర పాపారాయుడు అనగానే గుర్తుకొచ్చే మహా నటుడు యస్వీఆర్ . 1964లో వచ్చిన […]
పెద్ద దొరవారి ధరణి..! నిఖిల జగమూ నివ్వెరపోయే భారీ భూస్కాం..!!
బహుశా ఏ దేశంలోనూ మునుపెన్నడూ ఏ సమాజమూ ఎరగనంత దోపిడీ కావచ్చు ఇది… అదే కేసీయార్ ధరణి పేరిట సాగించిన అత్యంత భారీ తీవ్ర భూఅక్రమం… ధరణినే చెరబట్టిన స్కామ్… లాటిన్ అమెరికా, దక్షిణాఫ్రికా దేశాల్లో నియంతలు కూడా ఈ రేంజ్ అక్రమాలకు పాల్పడి ఉండరు… అవన్నీ ఎలా ఉన్నా సరే… మన దేశంలోనే అత్యంత అవినీతిపరులైన నాయకులు కూడా హాశ్చర్యపోయి, సిగ్గుపడే అక్రమమేమో ఇది… 25 లక్షల ఎకరాలు… మళ్లీ చదవండి… ఏకంగా 25 లక్షల […]
2 రోజుల్లో నలుగురు ప్రధానులు ఔట్… ఈసారి గ్రహణ బాధితుడు ఎవరు..?
. చంద్రగ్రహణం ప్రపంచంలోని నాలుగు దేశాల ప్రధానులు రెండు రోజుల్లో తమ పదవుల్ని కోల్పోయేలా చేసింది… ఇక సూర్యగ్రహణం వంతు..? మోడీయేనా..? ట్రంపుడా..? ఇప్పుడు ఈ చర్చ వైరల్ అవుతోంది… దీనికి కారణం భారతీయ వ్యాపారి హర్ష గోయెంకా పెట్టిన ఓ పోస్టు… తను ఏమంటాడంటే..? ‘‘రెండు రోజుల్లోనే… జపాన్ పీఎం దిగిపోయాడు, ఫ్రాన్స్ పీఎం దిగిపోయాడు, నేపాల్ పీఎం దిగిపోయాడు, థాయ్‌లాండ్ పీఎం దిగిపోయాడు… ఇప్పుడు అందరికన్నూ సూర్యగ్రహణంపైనే… ఓ పేద్ద నారింజనేత..?’’ Orange Man, […]
శుభమాని ఇల్లు కొనాలంటే… ఈ బ్లూప్రింట్లు తగలేసే గోల ఏమిట్రా…
. భాష ఏదయినా భాషే. మాట్లాడే భాషకంటే రాసే భాష కొంచెం ఫార్మల్ గా, కర్త కర్మ క్రియా పదాలు సరయిన అన్వయంతో ఉండాలి. మామూలుగా రాసే భాషతో పోలిస్తే ప్రకటనల్లో భాష ఇంకా అందంగా ఉండాలి. తక్కువ మాటల్లో ఎక్కువ సమాచారమివ్వాలి. పాఠకుడిని ఆకట్టుకోవాలి. కళ్లను కట్టి పడేసేలా డిజైన్ ఉండాలి. యాడ్ చూశాక ఆ వస్తువును తప్పనిసరిగా కొనాలి అనిపించేలా ఆ యాడ్ లో భాష, భావం, డిస్ ప్లే ఉండాలి. కంపెనీల నిర్లక్ష్యమో, […]
ఓరాకిల్ కాదు, మిరాకిల్..! ఒకే రోజులో 7.3 లక్షల కోట్లు పెరిగిన సంపద..!
. ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఒక్క రోజులోనే నాటకీయ మార్పులు చోటు చేసుకున్నాయి… ఓరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ (81) కాసేపు ఎలాన్ మస్క్‌ను అధిగమించి ప్రపంచ నెంబర్ వన్ రిచ్ అయ్యాడు… ఒక్క రోజులో ₹7.3 లక్షల కోట్లు పెరిగిన సంపద! ఓరాకిల్ త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించడంతో, కంపెనీ షేర్లు రికార్డు స్థాయిలో ఎగిసిపోయాయి. లారీ ఎలిసన్ సంపద ₹31.8 లక్షల కోట్లకు చేరింది. ఒక్క రోజులోనే ఆయన ఆస్తి విలువ […]
నటన తెలియనివాళ్ల నుంచీ నటన పిండుకోవడం ఎలాగంటే..?
. Director Devi Prasad.C. …. మా గురువు “కోడిరామకృష్ణ” గారు వెండితెరకు పరిచయం చేసిన నటులెందరో ప్రసిద్ధులయ్యారు. వారిలో ఎక్కువమంది మొదట నటనలో ఏమాత్రం ప్రవేశంగానీ ఆసక్తిగానీ లేనివారే. ఒక వ్యక్తి తన పాత్ర ఆహార్యానికి సరిపోతాడనుకుంటే చాలు అతను కాస్ట్యూమరైనా, నిర్మాతైనా, ప్రొడక్షన్ మేనేజరైనా, అసలు సినిమా పరిశ్రమకే సంబంధం లేని మనిషైనా సరే ముఖ్యమైన పాత్రలను వారితో ధరింపచేసి నటింపచేసేవారు. ఆడిషన్స్, యాక్టింగ్ వర్క్‌షాప్స్ లాంటివి గానీ, ఆ కొత్త నటుడు ఎలా […]
నేపాల్ జనాగ్రహం వెనుక ఇది మరో కోణం… మనకూ డేంజరే…
. Subramanyam Dogiparthi …. NEPO KIDS … నేపాల్‌లో గత రెండు రోజులుగా జరుగుతున్న విధ్వంసానికి కేవలం సోషల్ మీడియా నిషేధం మాత్రమే కాదు కారణం . అవినీతి , నిరుద్యోగం వంటి అంశాలే కాకుండా ఈ Nepo Kids ఇష్యూ కూడా . నిన్నటిదాకా డొక్కు సైకిళ్ళ మీద , సెకండ్ హేండ్ స్కూటర్ల మీద తిరిగిన రాజకీయ నాయకుల పిల్లలు , ప్రభుత్వ అధికారుల పిల్లలు కొద్ది రోజుల్లోనే లక్షలు చేసే కార్లలో తిరగటం […]
అమృతాంటీ… మరీ అనసూయాంటీ ఆవహించిందా ఏమిటి..?!
. దేశంలో గత మూణ్నాలుగు రోజులుగా ఒక విషయం చర్చనీయంశంగా మారింది..! మహారాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి అమృత ఫడ్నవీస్ వస్త్రధారణపై ట్రోల్స్, తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది..! ఒక ఆడది ఏ డ్రెస్ ధరించాలో ఆమె ఇష్టం, మీరెవడ్రా అంచనా వేయడానికి, జడ్జి చేయడానికి, విమర్శించడానికి అని స్టీరియో టైప్ విమర్శలు మరీ అనసూయాంటీ భాషలో తరువాత చేద్దురు గానీ… ముందు విషయమేమిటో చదవండి… ఇటీవల గణేష్ మహానిమజ్జనం పూర్తైన తర్వాత రోడ్లపై.. సముద్రం ఒడ్డున పేరుకుపైన చెత్త […]
డాక్టర్ సాబ్… 20 ఏళ్ల క్రితం నా ప్రాణాలు కాపాడారు గుర్తుందా..?
. ఆమె తన పదేళ్ల వయస్సులోనే చావు అంచుల్ని చూసింది. తిరిగి ఆమే.. 20 ఏళ్ల తర్వాత వచ్చి తనను కాపాడిన వైద్యుడికి ఒక పెన్నును బహుమతిగా ఇచ్చింది. కొన్ని ఘటనలు నిజమా అనిపిస్తాయి. కళ్ల ముందే జరుగుతాయి. గిల్లి చూసుకుంటేనే కానీ అది నిజమో, కాదో ఒకింత నమ్మకం కుదరదు. కానీ, అవి నిజమైనప్పుడు మిగిల్చే ఆశ్చర్యంతో పాటు.. అనుభూతి కూడా మాటలకందనిది. అలాంటి అమ్మాయికి సంబంధించిన ఓ కేస్ స్టడీనే వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ […]
నవలా రాక్షసుడు + సినిమా రాక్షసుడు + నట రాక్షసుడు…!!
. Subramanyam Dogiparthi …. జయ జయ జయ ప్రియ భారతి జనయిత్రి దివ్యధాత్రి , జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి . దేవులపల్లి వారు వ్రాసిన ఈ పాటంటే నాకు చాలా చాలా ఇష్టం . 1986 అక్టోబరు 2న వచ్చిన ఈ రాక్షసుడు సినిమా గుర్తొస్తే నాకు ముందుగా గుర్తొచ్చేది ఈ పాటే . జానకమ్మ ఎంత శ్రావ్యంగా పాడారో ! ఆ తర్వాత కళ్ళ ముందు మెదిలేది రాధ […]
ఐఫోన్-17 సీరీస్… ఈ కొత్త మోడళ్ల అదిరిపోయే కీలక ఫీచర్స్ ఇవే…
. Ravi Vanarasi …. ఐఫోన్ 17 గురించి నేను ఎంత చెప్పినా తక్కువే… కానీ మీ జేబులో ఎంత మిగిలింది ముందు చెప్పండి! గత రాత్రి జరిగిన Apple Event చూసి నేను నిజంగానే ఆశ్చర్యపోయాను. నిద్ర కూడా లేకుండా మొత్తం ఈవెంట్ చూశాను, ఎందుకంటే ఈసారి Apple కొన్ని నిజంగానే అద్భుతమైన ఫీచర్లను తీసుకొచ్చింది. మీరు ఈ ఈవెంట్‌ను మిస్ అయి ఉంటే, చింతించకండి. మీ కోసం నేను ఇక్కడ ఉన్నాను కదా. నేను ఈ […]
‘‘నీ పేరే పెట్టుకున్నాం, మా డ్రగ్ రాకెట్‌ను ఆశీర్వదించు మాతా…’’
. వాల్మీకి రామాయణం సుందరకాండ. సీతాన్వేషణలో భాగంగా వంద యోజనాల సముద్రం దాటి…చీకటి పడేవరకు ఆగి…పిల్లి పిల్లంత రూపంలోకి మారి…రావణుడు నిద్రిస్తున్న పుష్పకవిమానంలోకి వెళతాడు హనుమంతుడు. ఆ పుష్పక విమానం నేలను తాకకుండా గాల్లో తేలుతూ ఉంటుంది. అది ఒక పెద్ద నగరమంత విమానం. మందు విందు పొందులతో, గానా బజానాలతో అలసి ఒళ్ళుమరచి నిద్రిస్తున్నాడు రావణుడు. అక్కడ గదుల్లో మాంసాహారాలు, మద్యం రకాలు ఎన్నెన్ని ఉన్నాయో వాల్మీకి నిర్మొహమాటంగా పద్దు రికార్డు చేశాడు. మన మందు […]
లిటిల్ హార్ట్స్ సక్సెస్ సినిమా ఇండస్ట్రీకి చెబుతున్న పాఠమేమిటంటే..!
. ఎక్కడో చదివినట్టు గుర్తు… చిన్న బడ్జెట్‌తో నిర్మితమై భారీ లాభాల్ని ఆర్జిస్తున్న ఈ ఏడాది సూపర్ హిట్ చిత్రాల కోవలోకి లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమా చేరిందని ఓ వార్తావిశ్లేషణ… దానికి ఉదాహరణలు ఏం చెప్పారంటే ఆ విశ్లేషణలో… సంక్రాంతికి వస్తున్నాం 50 కోట్ల ఖర్చు కాగా రూ.303 కోట్లు రాబట్టింది… 15 కోట్లతో నిర్మించిన మహావతార్ నరసింహ చిత్రం రూ.315 కోట్లు రాబట్టింది.., 40 కోట్లతో నిర్మించిన అహాన్ పాండే ‘సైయారా’ మూవీ […]
ఏమో, రమ్యకృష్ణే కావాలని ఆ బాహుబలి నిర్మాతే కోరుకున్నాడేమో…!
. బాహుబలి సినిమాలో శివగామి పాత్ర గురించి మళ్లీ శ్రీదేవి భర్త బోనీకపూర్ ఎందుకు కెలుకుతున్నాడు..? అది గతం గతః … ఒకవేళ ఏ ఇంటర్వ్యూలోనో, చాట్లోనో ఆ ప్రశ్న వచ్చినా సరే అవాయిడ్ చేయాల్సింది… అవును, గతంలో సాక్షాత్తూ రాజమౌళే చెప్పాడు… ఏమనీ..? ఒక హోటల్ ఫ్లోర్ అంతా తమవాళ్లకే కావాలందనీ, అప్పటి ఆమె డిమాండ్‌కు రెండు రెట్లు మించి పారితోషికం, అంటే 10 కోట్లు అడిగిందనీ, అందుకే రమ్యకృష్ణను ఆ పాత్రకు తీసుకున్నామనీ..! తరువాత […]
కాదు… ఆమె మరో షర్మిల కాదు… రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం ఉంటుంది…
. జస్ట్ ఓ షర్మిలలాగే మిగిలిపోతుందా..? కవిత ఇంపాక్ట్ ఏమైనా తెలంగాణ రాజకీయాలపై, ప్రత్యేకించి బీఆర్ఎస్ మీద ఉంటుందా..? కేసీయార్ తేలికగా కొట్టిపడేస్తున్నాడు గానీ… కవిత ప్రభావమే ఉండదా.,.? సోషల్ మీడియాలో ఆమె మీద దుష్ప్రచారం సాగుతోంది… ఆమె సోషల్ మీడియా కూడా ఎదురుదాడి చేస్తోంది… రోజుకొకరి బట్టలు విప్పుతోంది ఆమె టీమ్.,. కేసీయార్ చుట్టూ ఉన్న దెయ్యాలెవరో కూడా తేటతెల్లం చేస్తోంది… ఈ స్థితిలో తెలంగాణ రాజకీయాలపై కవిత ప్రభావం అనే అంశంపై VOTA media […]
మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్… జనాగ్రహం బద్దలు..!
. కాదు, సోషల్ మీడియా యాప్స్‌ను నిషేధించడం వల్ల మాత్రమే జనం తిరగబడటం లేదు… అది జస్ట్, ఒక వత్తి… అది అంటించారు… జనంలో ఆగ్రహం, అసహనం ఉడికిపోెతున్నాయి చాన్నాళ్లుగా… అదిప్పుడు బయటపడింది… అంతే… అప్పట్లో 2022లో శ్రీలంక, 2024లో బంగ్లాదేశ్, ఇప్పుడు 2025లో నేపాల్…. మరీ నేపాల్‌లో అధ్యక్షుడి ఇంటిని తగులబెట్టారు… ఓ మంత్రిని వీథుల్లో ఉరికిస్తూ కొట్టారు.,. అధికార పార్టీ ఆఫీసుకు అగ్గిపెట్టారు.,. ప్రభుత్వ భవనాలు మండిపోతున్నాయి… ప్రధాని రాజీనామా చేసి దుబయ్ పారిపోవడానికి […]
… బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ సైద్ధాంతిక గందరగోళం…
. కేసీయార్ ఎప్పుడైతే తన పార్టీకి, రాష్ట్ర రాజకీయాలకు, ప్రజాజీవన స్రవంతికీ దూరంగా ఉంటున్నాడో… బీఆర్ఎస్ పార్టీలో ఓ సైద్దాంతిక గందరగోళం అలుముకుంటోంది… తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికపైన పార్టీ పాలసీ, కేటీయార్ వ్యాఖ్యలు నిరూపిస్తున్నదీ అదే… కేసీయార్ యాక్టివ్ పాలిటిక్సులో ఉన్నప్పుడు… తప్పు పాలసీ అయినా సరే దబాయించి మరీ సమర్థించుకునేవాడు… పార్టీ జంపింగులను రాజకీయ శక్తుల పునరేకీకరణ అన్నా, మాదేమీ ఉద్యమపార్టీ కాదు ఇక, అహోబిలం మఠం అసలే కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అని […]
ఆనందశాస్త్రం..! science of happiness … సిలబస్‌లో ఉండాల్సిన సబ్జెక్టు..!
. ఆనందం; పరమానందం; బ్రహ్మానందం- మాటలకు వేదాంత కోణంలో వేరే అర్థాలున్నా – మనం లౌకిక అర్థమే తీసుకుందాం. ఆనందం వెతుక్కోవడంలోనే మనం తికమకపడుతుంటాం. ఆనందం కానిది ఆనందం అనుకుని పరుగులు తీస్తుంటాం. జీవితం ఎప్పుడూ సరళరేఖ కానేకాదు . ఒకేవేగం , ఒకే పద్ధతిలో వెళ్ళదు . ఎగుడు దిగుళ్లు ; లాభనష్టాలు ; కష్టసుఖాలు సహజం . అయితే లాభమూ సుఖమూ ఆనందించదగ్గది – నష్టమూ కష్టమూ భరించకూడనిది అవుతుంది . ఇక్కడే వస్తోంది […]
- « Previous Page
- 1
- …
- 34
- 35
- 36
- 37
- 38
- …
- 385
- Next Page »



















