ఈనాడు నుంచి శ్రీధర్ వెళ్లిపోయాడు… సో వాట్, ఆయన కాకపోతే మరొకరు, ఈనాడు ఆగదు కదా అన్నాడొకాయన… అసలు ఈనాడు లేకపోతే మరోనాడు… ఈ భూమి తన భ్రమణాన్ని ఆపేసుకోదు కదా… ఆయన ఈనాడు వదిలేసి ఎందుకు వెళ్లిపోయాడు అనే అంశం మీద బోలెడు చర్చలు సాగుతున్నాయి సోషల్ మీడియాలో… చివరకు ఆయనది రిటైర్మెంటా..? రిజైనా..? అనే చర్చ వరకూ… సహజం… నలభై ఏళ్ల బానిస బతుక్కి దొరికింది విముక్తి అని కూడా తేల్చేశారు కొందరు… సోషల్ […]
రామోజీరావు గారూ… కేసీయార్ పేరు, తెలంగాణ పేరు మార్చడం లేదు కదా…
రేప్పొద్దున తెలంగాణ ముఖ్యమంత్రి ఇంద్రశేఖర్రావు అని ఈనాడులో వచ్చింది అనుకొండి… దయచేసి ఆశ్చర్యపోవద్దు… ఆయన ఇంటిపేరు కూడా కల్వకుంట్ల బదులు జలకుంట్ల అని రాస్తే అస్సలు నిర్ఘాంతపోవద్దు… ఏమో, కేటీయార్ పేరు కూడా ఇప్పుడున్నట్టే ఉండకపోవచ్చు కూడా… ష్, అసలు తెలంగాణ పేరునే మార్చేస్తే ఎలా ఉంటుందో కూడా ఈనాడులో మేథోమథనం భేటీలు జరుగుతూ ఉన్నాయేమో… బొడ్డు కోసి పేర్లు పెట్టడంలో ఈనాడుదే ఘనకీర్తి… అది అక్షరమంత్రసాని… కాదు, తెలుగుకే మంత్రసాని, ఈ భాష పుట్టుకకు సాయం […]
కార్టూనిస్ట్ శ్రీధర్ ఈనాడును వదిలేశాడు… లేక వదిలేయబడ్డాడా..? అసలేమిటీ కథ..?!
నిజానికి ఇది వేడి వేడి వార్తేమీ కాదు… చాలాసేపటి నుంచీ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్న వార్తే… ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్ తన కొలువుకు రాజీనామా చేశాడు… ఇదీ వార్త… వాళ్లో వీళ్లో చెప్పడం దేనికి..? తనే తన ఫేస్ బుక్ వాల్ మీద షేర్ చేసుకున్నాడు… సో, సందేహాలు అక్కర్లేదు… అయితే కొత్తగా ఆయన రాజీనామా మీద ఏం రాయగలం..? పొమ్మనబడ్డాడా..? తనే పోయాడా..? ఇదీ ఒక ప్రశ్న… ఈనాడు నుంచి వెళ్లిపోయేవాళ్లు కొందరు […]
అన్నీ బాగున్నవాళ్లదేం గొప్ప… ఇదుగో ఈ అవనిది అసలు గొప్పతనం…
అన్నీ బాగున్నవాళ్లు గెలిస్తే ఏం గొప్ప..? విధి వెక్కిరిస్తే, నిలబడి, దాన్ని ధిక్కరించి గెలిచేవాళ్లదే అసలు గొప్ప… అవును, పారాలింపిక్స్ స్వర్ణపతక విజేత అవని లేఖడా నిజంగా గొప్పే… ఎందుకో చెప్పుకుందాం… అలాగే, మరో మాట… ఒలింపిక్స్లో గెలిచినా గెలవకపోయినా, ఉత్త చేతులతో తిరిగి వచ్చినా మీడియా విపరీతంగా హైప్ ఇచ్చింది, చప్పట్లు కొట్టింది, పుంఖానుపుంఖాలుగా కథనాలు రాసింది… ఓ చిన్న పతకం సాధిస్తే కోట్లకుకోట్లు గుమ్మరించాయి ప్రభుత్వాలు, సన్మానించాయి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇచ్చాయి, తెలుగు రాష్ట్రాలయితే […]
ఈ ట్రోలర్లను తప్పుపట్టలేం..! తెలుగు టీవీల ‘‘అశ్లీల వికారాలకు’’ వీళ్లే మొగుళ్లు..!!
అమ్మో, ట్రోలర్స్ అని సెలబ్రిటీలు ఉలిక్కిపడుతుంటారు… వణికిపోతుంటారు… ఎందుకు..? వాళ్లు చాకిరేవు పెట్టేస్తుంటారు కాబట్టి… వాళ్ల నాసిరకం పోకడల్ని బట్టలిప్పి చూపిస్తారు కాబట్టి… అఫ్ కోర్స్, ట్రోలర్స్లో అధికశాతం స్వార్థం, అజ్ఞానం, దురుద్దేశపూరితం… కానీ కొందరు ఉంటారు… వాళ్ల ట్రోలింగ్ సొసైటీకి మంచిదే… కావచ్చు, ఆ ట్రోలింగ్ వాళ్లకు ఉపాధి మార్గం కావచ్చు, వాళ్లకు భాష సరిగ్గా తెలియకపోవచ్చు… కానీ ఓ కంటెంటును చీల్చిచెండాడేలా, రకరకాల సంబంధిత క్లిప్పులు వెతికి, ఎడిట్ చేసుకుని, ఒక్క దగ్గర క్రోడీకరించి, […]
తిరుమల వెంకన్నా… ఈ బ్యూరోక్రాట్లను నమ్మితే ‘మునిగిపోతవ్’… బహుపరాక్…
కోట్ల మంది హిందువులకు ఆరాధ్యుడు తిరుమల వెంకటేశ్వరస్వామి… అత్యంత ధనిక హిందూ దేవుడు కూడా వెంకన్నే… ప్రతి నిర్ణయం వెనుక, ప్రతి ఆలోచన వెనుక ఓ ధార్మిక భావన ఉండాలి… అక్కడ నియుక్తులయ్యే ఏ అధికారికీ ఆ సోయి ఉండదు… ఇతరత్రా ప్రభుత్వ వ్యవహారాలు, పాలన ధోరణులు, ఇగోయిస్టిక్ వైఖరులే ప్రభావితం చేస్తూ ఉంటయ్ వాళ్లను… ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదీ అంటే… తాజా ఉదాహరణ సంప్రదాయ భోజనం…! నిజానికి సంప్రదాయ భోజనం అనే పదప్రయోగమే తప్పు… […]
అంతుచిక్కని విజయమ్మ అడుగులు… హైదరాబాదులో వైఎస్ ప్రత్యేక సంస్మరణ…
నిజమే, అంగీకరించాలి… తెలంగాణకు వ్యతిరేకి అయినా సరే, మాజీ సీఎం రాజశేఖరరెడ్డికి తెలంగాణవ్యాప్తంగా అభిమానగణం ఉంది… ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వల్ల లబ్దిపొందిన కుటుంబాలు ఆయన్ని మరిచిపోవు… కానీ అదొక్కటీ షర్మిల పార్టీకి ఒక ‘డ్రైవింగ్ ఫోర్స్’గా సరిపోతుందా..? ఈ ప్రశ్న ఎందుకంటే..? వైఎస్ పన్నెండో వర్ధంతి సందర్భంగా విజయమ్మ హైదరాబాదు నోవాటెల్ అనే స్టార్ హోటల్లో ఓ ప్రోగ్రాం నిర్వహించనుంది… సెప్టెంబరు రెండున… ఇది నాన్-పొలిటికల్, నాన్-పార్టీ ప్రోగ్రాం అని చెబుతున్నారు… వైఎస్ కేబినెట్ సహచరులు, […]
మన సాయిపల్లవే… బహుశా మీరు ఈ డాన్స్ చూసి ఉండరు… అదిరిపోయింది…
ఈమధ్య సారంగదరియా పాట సూపర్ హిట్ కావడం.., బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా పాట బంపర్ హిట్ కావడం.., పెళ్లిళ్లు పేరంటాల్లో కూడా ఈ పాటలు మారుమోగిపోతుండటంతో సోషల్ మీడియాలో కూడా చర్చ పాటలు, డాన్సుల మీద నడుస్తోంది… మంచి కంటెంటు, మంచి ట్యూన్ ఉంటే చాలు, డాన్సర్ ఎలా ఉన్నా సరే సాంగ్ అదిరిపోతుంది, కోట్ల వ్యూస్ గ్యారంటీ అంటాడు ఒకాయన… నో, నో, అదేమీ కాదు, డాన్సర్ను బట్టి సాంగ్ కథ మారిపోతుంది, సాయిపల్లవి […]
ఈ జైలు అధికారులకు సిగ్గులేదు… సుప్రీం తీవ్ర వ్యాఖ్య…! కథేమిటంటే…?
మనం తీహార్ జైలు అనగానే అదొక దుర్భేద్యం, ఖైైదీల ఆటలు సాగవ్, మస్త్ స్ట్రిక్ట్ మన్నూమశానం అనుకుంటాం కదా… తూచ్… ఉత్తదే… అదీ అన్ని జైళ్లలాంటిదే… కాదు, కాస్త ఎక్కువే… డబ్బుంటే అక్కడ ఏదంటే అది చల్తా… అక్కడి అధికారులకు సిగ్గూశరం లేవు… అరెరె, ఈమాట అంటున్నది మనం కాదు… సాక్షాత్తూ సుప్రీంకోర్టే కామెంట్ చేసింది… Absolutely Shameless… ఇంత ఘాటు వ్యాఖ్య చేసిందంటే ఇక అర్థం చేసుకోవచ్చు మనం… ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందీ అంటే… […]
కాళ్లల్లో కట్టెలు పెట్టేవాళ్లున్నా సరే… గూట్లేలు, గుండుగాళ్లే జోష్ నింపుతున్నారు…
మైనంపల్లి, మల్లారెడ్డిలతో రేవంతుడిని, సంజయుడిని తిట్టించడం అనేది కేసీయార్ స్ట్రాటజీ కావచ్చుగాక…. కోపమొస్తే ఒక మాట అనరా అని కేటీయార్ సమర్థించవచ్చుగాక… కానీ కేసీయార్ గమనించాడో లేదో తెలియదు గానీ ప్రజల్లో తన పట్ల, తన పార్టీ పట్ల, తన ప్రజాప్రతినిధుల పట్ల, తన ప్రభుత్వం పట్ల, తన వ్యవహారిక ధోరణి పట్ల వ్యతిరేకత పెరుగుతోంది… టీఆర్ఎస్ క్యాంపు ఉలిక్కిపడి ఇక బూతులకు పూనుకున్నా సరే, కొన్ని నిజాల్ని అంతర్గతంగా అంగీకరించాల్సిందే… అసలు ఇది కాదు, మనం […]
మళ్లీ మెచ్చితిమి స్టాలిన్..! ఈ మెచ్యూరిటీ లెవల్ ఇలాగే ఉండుగాక..!
మన నేతలు ఇక్కడ జాతిప్రజలు అత్యంత గర్వపడేలా… అద్భుత పరిణత వ్యక్తిత్వాలతో గాండూ, సాలే, గూట్లే, సన్నాసీ, ఎదవ, చవట అని రకరకాలుగా తిట్టుకుంటూ ఉంటారు… ఈమధ్య ఏపీ నేతల ‘జోష్’ తగ్గిపోయింది ఎందుకో… మళ్లీ కొడాలి పూనుకోవాల్సిందే… ఇక మాకేం తక్కువ అంటూ తెలంగాణ నేతలు అందుకున్నారు ఆ ఘన సాంస్కృతిక పోకడను..! ఏపీ నేతలే విస్తుపోయే రేంజులో రెచ్చిపోతున్నారు… మన రాష్ట్రాల్లో విపక్ష నేతలపై కేసులు పెట్టేస్తుంటారు… ప్రతిపక్షానికి పేరొచ్చే పాత ప్రజా పథకాలను […]
ఇదోరకం మారుతీరావు కథ…! ఈ రేంజ్ డార్క్ క్లైమాక్స్తో ఏం ఫాయిదా..?!
ఆమధ్య మన వరంగల్ పిల్ల ఆనంది గురించి రాసిన ‘ముచ్చట’ స్టోరీ మళ్లీ అకస్మాత్తుగా గుర్తొచ్చింది… ఘర్ కీ ముర్గీ దాల్ బరాబర్ అన్నట్టుగా మన దర్శకులకు తెలుగు పిల్లలు హీరోయిన్లుగా పనికిరారు కదా… మన హీరోలతో రొమాన్స్ చేయడానికి ఏ కేరళ, ఏ తమిళనాడు పిల్లలో కావాలి… లేదంటే అడిగినట్టుగా అన్నీ చూపించేసే ముంబై పిల్లలు కావాలి… అకస్మాత్తుగా ఆనంది కనిపించింది… సుధీర్ బాబు సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలో హీరోయిన్ ఆమె… వావ్, […]
మోనిత పాత్రకు శోభ..! ఆ చెత్త కార్తీకదీపానికి వెలుగు, ప్రాణం, చమురు అన్నీ ఈమే…!!
చాన్నాళ్ల తరువాత నిర్బంధంగా మాటీవీ వాడి కార్తీకదీపం సీరియల్ చూడబడ్డాను… చెత్త కథ, చెత్త కథనం, చెత్త కేరక్టరైజేషన్, చెత్త సీరియల్… అందులో ఇసుమంత కూడా బేధాభిప్రాయం లేదు… సరే, ఆ టీవీవాడు ఏ మాయ చేస్తున్నాడో, వాడి సీరియళ్లన్నీ అద్భుతమైన టీఆర్పీలు సాధిస్తయ్… అందులో కార్తీకదీపం ఎన్నాళ్లుగానో టాప్… పెద్ద పెద్ద స్టార్ హీరోల ప్రిస్టేజియస్ సినిమాలు కూడా ఆ రేటింగ్స్ సాధించవు… మన బార్క్ వాడి దరిద్రపు రేటింగ్ వ్యవస్థ, డొల్లతనం, లోటుపాట్ల సంగతి […]
సార్, జూనియర్ గారూ… కనీసం ఇక్కడైనా ఆ వంశచరిత్రలు ఆపండి సార్…
కేబీసీ… కౌన్ బనేగా కరోడ్పతి… అనేక దేశాల్లో అనేక భాషల్లో సూపర్ హిట్ షో అది… మన దేశంలో కూడా పలు భాషల్లో ప్రసారం చేస్తున్నా అమితాబ్ నిర్వహించే షో మాత్రమే అల్టిమేట్… పలువురు వేరే హీరోలు ట్రై చేశారు, తెలుగులో కూడా నాగార్జున, చిరంజీవి ప్రయత్నించారు… దాదాపుగా అందరూ చేతులు కాల్చుకున్నవాళ్లే… మరీ నాగార్జునతో పోలిస్తే చిరంజీవి ఎపిసోడ్లు ఫ్లాప్… చిరంజీవి తరువాత ఇక ఆ షోయే ఆగిపోయింది… ఇప్పుడది జూనియర్ ఎన్టీయార్ హోస్టుగా వస్తోంది… […]
అన్నం కూడా అమ్మడమేనా..? ఎలాంటి భృత్యగణం దొరికింది నీకు వెంకన్నా..!
తిరుమల… అక్కడ రైల్వే స్టేషన్లోనో, బస్ స్టాండులోనో దిగింది మొదలు… మళ్లీ తిరుగు ప్రయాణం వరకు… ప్రతి అడుగులోనూ దోపిడీ కనిపిస్తుంది… ప్రైవేటు వ్యాపారులే కాదు, సాక్షాత్తూ తిరుమల-తిరుపతి దేవస్థానం కూడా తక్కువేమీ కాదు… భక్తుడిని ఎన్నిరకాలుగా పిండాలో బ్రహ్మాండంగా తెలుసు దానికి… అఫ్ కోర్స్, ఏ గుడి దగ్గరైనా అంతే… తీర్థయాత్ర అంటేనే జేబులు ఖాళీ చేసుకోవడం… కానీ అత్యంత ధనికుడైన వెంకటేశ్వరస్వామి సన్నిధిలోనైనా కక్కుర్తి వ్యవహారాలు అవసరమా..? ఎక్కడెక్కడి నుంచో వ్యయప్రయాసలకోర్చి, స్వామి మీద […]
తాలిబన్ల పాలన అంత వీజీ కాదు… ఆర్థికంలో అసలు కథ ముందుంది…
……….. By……… పార్ధసారధి పోట్లూరి ……… ఊపేకుహ : ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి ! తాలిబన్లు కాబూల్ ని స్వాధీనం చేసుకోగానే పాకిస్థాన్ లోని లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి ఉగ్ర సంస్థల వాళ్ళు వీధుల్లోకి వచ్చి స్వీట్లు పంచారు. ఇక పాకిస్థాన్ లో తాలిబన్లని సమర్ధించేవారు కూడా సంబరాలు చేసుకున్నారు. ఇక చైనా, పాకిస్థాన్, రష్యాలు తమ వంతు వాటా కోసం తమ రాయబార కార్యాలయాలని మూసేయకుండా ఆశగా ఎదురు చూస్తున్నాయి….. కానీ […]
పనికిమాలిన అఖండ భారత్ క్యాం‘పెయిన్’..! అసలు ఫాయిదా ఏమిటి..?!
Subramanyam Dogiparthi…… పోస్టు ఇది… ఓసారి చదవండి… ‘‘సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న మరో ఫొటో ఇది . ఎవరు స్పాన్సర్ చేసారో తెలియదు . ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు ఉంటున్నాయి . ఈ ఫొటోలో స్పాన్సర్ పేరు లేదు . అదో అంశం . నేను ప్రస్తావించదలచుకున్న అంశం మరొకటి . అది : అఖండ భారతం నినాదం బాగా ఉంది . అందరికీ ఇష్టమే . అయితే […]
నోరు విప్పితే అబద్ధం..! నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కదా మరి…!!
నో డౌట్… చదువుకోవాలనుకున్న ఈ పిల్లపై అప్పట్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపింది నిజం…. వాళ్లు చేసిన అనేకానేక బీభత్స, భీకరమైన అరాచకాల్లో చాలా చిన్న సంఘటన అది… అంతర్జాతీయ సమాజం ఖండించింది, అండగా నిలిచింది, ఆమె చదువుకుంది… ఆశ్చర్యంగా నోబెల్ వాడు ఆమెకు శాంతి బహుమతి ప్రకటించాడు… నిష్ఠురంగా ఉన్నా ఒకటి మాత్రం నిజం… ఆమె బాధితురాలు, అంతేతప్ప శాంతి స్థాపనకు ఆమె చేసింది ఏముంది..? తాలిబన్ల పాలనలో లక్షల మంది మహిళలు, పిల్లలు ఇంతకన్నా ఘోరాతిఘోరమైన […]
ఈ గెలుపు అపురూపం… పోటీదారుల నుంచి విజేతకు విలువైన కానుకలు…
సాధారణంగా ఓ ఆటల పోటీయో, పాటల పోటీయో జరిగింది… పదీపన్నెండు మంది పోటీపడ్డారు… రిజల్ట్ తేలింది… తరువాత ఏం జరుగుతుంది..? ఏముందీ, గెలిచినవాడిని అభినందిస్తారు, చప్పట్లు కొడతారు, ఎవరి మూటాముల్లే వాళ్లు సర్దుకుని ఇళ్లకు వెళ్లిపోతారు… అంతే కదా… కానీ ఇక్కడ కథ వేరే ఉంది… అది కొంత నమ్మబుల్గా లేదు… కొంత ఆశ్చర్యంగా ఉంది… పోటీదారుల నడుమ ఇంత పాజిటివిటీ ఉన్న తీరు చూసి ఆనందంగా కూడా ఉంది… మొన్నమొన్న ఇండియన్ ఐడల్ -12 పోటీ […]
అఫ్ఘన్ నుంచి మనవాళ్లను అంత వేగంగా ఎలా తీసుకురాగలిగామో తెలుసా..?
అఫ్ఘన్ సంక్షోభం గురించి మనకెందుకు ఇంత హైరానా అనుకోవడానికి వీల్లేదు… తాలిబన్లు బలపడటం, వాళ్లతో చైనా, పాకిస్థాన్ దోస్తీ బలపడటం, వాటికి రష్యా డప్పు కొట్టడం మనకు ఎప్పుడూ ముప్పుకారకమే… అందుకే అధ్యయనం అలవాటైన కలాలన్నీ కదులుతున్నయ్… రకరకాల కోణాల్లో విశ్లేషణలు, కథనాలు కనిపిస్తున్నాయి… సోషల్ మీడియాలో కూడా బోలెడు ఆసక్తికరమైన సమాచార వ్యాప్తి జరుగుతోంది… ఇదే అప్ఘనిస్థాన్కు ఎగువన తజికిస్థాన్ అని ఓ దేశం ఉంటుంది… గతంలో సోవియట్ యూనియన్లో పార్ట్, తరువాత విడిపోయింది… అక్కడ […]
- « Previous Page
- 1
- …
- 372
- 373
- 374
- 375
- 376
- …
- 448
- Next Page »