నిన్న సోషల్ మీడియాలో కనిపించిన ఓ చిన్న వీడియో బిట్ కాస్త విస్మయాన్ని కలిగించిన మాట వాస్తవం… ఈ విస్మయంలో వ్యతిరేక భావన లేదు… కాస్త అభినందన భావనే… వీడియో విషయం ఏమిటంటే..? తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన మాజీ మంత్రివర్గ సహచరుడు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించాడు… కుటుంబసభ్యులతో కాసేపు గడిపి, బొజ్జల త్వరగా కోలుకోవాలంటూ ధైర్యం చెప్పాడు… సో వాట్..? ఓ సీనియర్ నాయకుడు, తనతోపాటు నడిచినవాడు, తన కేబినెట్లో పనిచేసినవాడు […]
అమెరికా అనగానే వినయంగా చేతులు కట్టుకునే ఆ పాత ఇండియా కాదు..!!
పార్ధసారధి పోట్లూరి ………… EAM జై శంకర్ ! మన విదేశాంగ శాఖ మంత్రి ! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విదేశాంగ విధానం ఎలా ఉండాలో భారత్ ని చూసి నేర్చుకోవాలి అనేంతగా ప్రభావితం చేస్తున్న వ్యక్తి జై శంకర్ గారు. చైనా, రష్యా, అమెరికా, యూరోపు ఇలా అవతలి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళయినా తన సమాధానాలతో సంతృప్తిపరచగలడు లేదా అదే సమయంలో ధీటుగా సమాధానం ఇవ్వగలడు… రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనవద్దు అంటూ US […]
టీవీలకు బిత్తిరి సత్తి స్వస్తి…! సాక్షి నుంచీ బయటకు…! ఇక సినిమాలే లోకం…!
బిత్తిరి సత్తి టీవీ ప్రస్థానం ముగిసింది… ప్రస్తుతం పనిచేస్తున్న సాక్షి టీవీ నుంచి కూడా బయటికి వెళ్లిపోయాడు… తనే వదిలేశాడు… ప్రస్తుతం గరం గరం వార్తలకు ప్రధాన పాత్రధారి తనే… (చల్లబడిండు)… రాబోయే చిరంజీవి సినిమాలో ఓ పాత్ర దక్కింది, మరికొన్ని సినిమా చాన్సులు కూడా వస్తున్నాయి… ఇక తన అదృష్టాన్ని పూర్తిగా సినిమాల్లోనే పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు… మరీ నిరాశాజనకంగా ఉంటే సొంత యూట్యూబ్ వీడియోలు… బిత్తిరి సత్తి… అసలు పేరు చేవెళ్ల రవి… అంతకుముందు ఏవేవో […]
ఆర్ఆర్ఆర్ Vs కేజీఎఫ్2… ప్లస్సులు, మైనస్సులపై ఓ ఇంట్రస్టింగ్ విశ్లేషణ…
ఆర్ఆర్ఆర్తో పోలిక తప్పకుండా వస్తుంది… ఎందుకంటే..? ఇప్పుడు దేశమంతా క్యాష్ కొల్లగొడుతున్న సినిమాలు ఇవి… ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ దున్నేసింది… ఇంకా వసూళ్లు సాగుతూనే ఉన్నాయి… ఇప్పుడు కేజీఎఫ్ దండయాత్ర మొదలైంది… బాక్సాఫీసు షేక్ అయిపోతోంది… నిజానికి రెండింటినీ పోల్చడానికి ఇతరత్రా కారణాలున్నయ్… రెండూ బాలీవుడ్ ఇగోను, వివక్షను, సుప్రిమసీని బద్ధలు కొడుతున్నయ్… బాలీవుడ్ పెళుసు నాణ్యత, డొల్ల భారీతనాల్ని ఎత్తిచూపుతున్నయ్… సౌత్ ఇండియన్ సినిమా కాలర్ ఎగరేస్తున్నయ్… అంతేకాదు, బాలీవుడ్ ముట్టడికి మితిమీరిన హీరోయిజాన్ని ఆశ్రయిస్తున్నాయి… హీరోలను […]
అదే జరిగితే ఇక అమెరికాతోనే నేరుగా రష్యా యుద్ధం… గాడితప్పింది…!
పార్ధసారధి పోట్లూరి……. ఈ దారి ఎటు వెళ్తున్నది ? ఫిన్లాండ్, స్వీడన్ సరిహద్దుల వద్ద హెవీ మిలటరీ ఎక్విప్మెంట్ ని మోహరించింది రష్యా! ఫిన్లాండ్ మరియు స్వీడన్ లు కనుక నాటో కూటమిలో చేరితే అణు దాడి చేయడానికి అయినా వెనుకాడను అంటూ పుతిన్ హెచ్చరిక చేశాడు. కోల్డ్ వార్ సమయం నుండి ఫిన్లాండ్, స్వీడన్ లు ఎటు వైపు మొగ్గకుండా తటస్థంగా ఉంటూ వచ్చాయి ఇప్పటి వరకు… కానీ ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేయగానే అమెరికా […]
ఎవరు ఈ పది తలల రాజమౌళి..? మూడే సినిమాలతో ముట్టడి..!
అంతకుముందు తెలుగు ప్రేక్షకులకు తెలియని కేరక్టర్… పునీత్ రాజకుమార్… కానీ మరణం తరువాత పునీత్ మీద కన్నడిగుల అభిమానం ఏ స్థాయిలో ఉందో తెలుసుకుని ఆశ్చర్యపోవడం మన వంతయింది… అసలు కన్నడ ఇండస్ట్రీ ఎప్పుడూ మిగతా సినిమా ప్రపంచానికి దూరదూరంగానే ఉంటూ వచ్చింది… ఇప్పుడిప్పుడే ప్రధాన స్రవంతిలోకి వచ్చేస్తోంది… ప్రత్యేకించి కేజీఎఫ్ కొత్త కన్నడ సినిమాను పరిచయం చేస్తోంది… కొత్త చరిత్రను రాస్తోంది… దానికి కారకుడు యశ్ కాదు… ప్రశాంత్ నీల్…! హసన్‌లో పుట్టి, సినిమాయే ప్యాషన్‌గా […]
బాబా అంబేద్కరా…! ఈ ఒక్కరోజు నన్ను క్షమించక తప్పదు…
Warangal Ajay…….. అవును..ఈ ఒక్క రోజు అవును..ఈ ఒక్క రోజు మీ నిలువెత్తు విగ్రహం చుట్టూ ఖాకీల లాఠీ పహారాల మధ్య దళితత్వం పులుముకున్న నాయక మన్యుల అభినయాలు! మీ ఆలోచనలే అక్షరాలై కల్పించిన రిజర్వేషన్లు గద్దెలెక్కించాయన్న సోయి రాబందు రాజకీయాలు స్మరించుకునే రోజు.. అవును.. ఈ ఒక్క రోజు దొరీర్కం కార్లలోనే విడిచి నీలాకాశం నీడన జై భీంజెండా నినాదాల నడుమ కైదండలూ,, కౌగిలింతలు కరచాలనాలూ, పలకరింతలు, అవును.. ఈ ఒక్క రోజు.. అందరూ.. “దళిత […]
ఈ బుడ్డోడే కేజీఎఫ్-2 తెర వెనుక అసలు హీరో… ఎవరో తెలుసా..?!
కొన్ని స్టోరీస్ రాయడానికి ఆనందమేస్తుంది… మౌస్, కీప్యాడ్, కంపోజింగ్, అక్షరాలు, పదాలు చకచకా పరుగులు తీస్తుంటాయి… ఇదీ అంతే… అరె, నువ్వు గ్రేట్‌రా బుడ్డోడా… హేట్సాఫ్… హేట్సాఫ్… ఉజ్వల్ కులకర్ణి… వయస్సు జస్ట్ 19 ఏళ్లు… షార్ట్ ఫిలిమ్స్ ఎడిట్ చేసేవాడు… మస్తు క్రియేటివిటీ… కళ్లల్లోనే కత్తెర్లతో పుట్టాడేమో… పోనీ, చేతి వేళ్లలోనే ఆ విద్యతో పుట్టాడేమో… ఏ సీన్ ఎంతమేరకు ఉంచాలి, ఏది నరకాలి, ఏది తీసేయాలి, ఏది ఎక్కడ జతచేయాలి పుట్టుకతో వచ్చినట్టుంది విద్య… […]
డీజే టిల్లు గాడు శ్యామ్ సింగరాయ్‌ను ఓడించాడు… అట్లుంటది రాధికా…
ఎంత సాయిపల్లవి ఉంటేనేం..? ప్రణవాలయ అని కష్టపడి ఎంత శాస్త్రీయంగా నర్తిస్తేనేం..? నానికి కొత్త లుక్కు ఇచ్చి, పాత జన్మలోకి లాక్కుపోయి, ఓ కొత్త కథ రాస్తేనేం..? నాని మరీ రెచ్చిపోయి కృతిశెట్టితో ఘాటు లిప్లాకుల్ని పండిస్తేనేం…? జనానికి అంతగా కనెక్ట్ కావాలనేముంది..? కాలేదు… నిజానికి సినిమాకు నెగెటివ్ టాక్ ఏమీ రాలేదు… ఉన్నంతలో మంచి వసూళ్లే రాబట్టింది… కానీ టీవీ ప్రేక్షకులు ఎందుకో పెదవి విరిచారు… ఆసక్తి చూపించలేదు… కానీ మరీ ఇంత తక్కువ రేటింగ్స్ వస్తాయని […]
దీప లేని కార్తీకదీపం ఎవడు చూస్తాడు..? అందుకే పడింది రేటింగ్స్ దెబ్బ..!!
ఒక కథ… ఒక సినిమా… ఒక నవల… ఒక సీరియల్… ఒక కెరీర్… సరైన వేళలో ఆపేసేవాడే గొప్పోడు… కార్తీకదీపం సీరియల్ డైరెక్టర్‌కు ఆ సోయి లేదు… నడిచినన్ని రోజులూ నడిపిద్దాం, ఇక ఆదరణ అడుగంటాక ఆపేద్దాం అనే కక్కుర్తిలో ఉన్నాడు… అందుకే కథను ఇష్టారాజ్యంగా మార్చేసి, ఎడాపెడా పాత్రల్ని చంపేసి, కొత్త నటులను తీసుకొచ్చి, రాత్రి మైండ్లోకి ఏది జొరబడితే, అది తెల్లారే అమల్లో పెట్టేస్తున్నాడు… వెరసి ఒకప్పుడు ఈ సీరియల్‌కు నీరాజనాలు పట్టిన జనాలే […]
అసాధారణ హీరోయిజం..! బంగారు బాక్సాఫీసు గనుల్ని తవ్వుకుంటున్నాడు..!!
ఆర్ఆర్ఆర్ సినిమా ముందుగా విడుదలై బతికిపోయింది… లేకపోతే కేజీఎఫ్-2 ముందు వెలవెలబోయేదేమో…! కేజీఎఫ్ మీద నెలకొన్న హైప్, దాని ముందస్తు వసూళ్లు సినిమా పండితులను కూడా ఆశ్చర్యపరుస్తున్నయ్… లక్షల అడ్వాన్స్ బుకింగులతో కేజీఎఫ్ గల్లాపెట్టె గలగలమంటోంది… కేజీఎఫ్ ఓ సంచలనాన్ని సృష్టించింది అప్పట్లో… అసలు సౌతిండియా ఇండస్ట్రీలో బాగా వెనుకబడినట్టుగా ఇన్నేళ్లూ కనిపించిన శాండల్‌వుడ్ చరిత్రను యశ్ తిరగరాస్తున్నాడు… అది మాత్రం నిజం… ప్రపంచవ్యాప్తంగా పదివేల స్క్రీన్లలో విడుదల అంటే మాటలా..? మరీ రాజమౌళిలా 400 కోట్లు, […]
దక్షిణాది సినిమా నిజంగా బాలీవుడ్ కొమ్ములు విరిచేసినట్టేనా..? కాదు… లేదు…!!
మరీ అంతగా భుజాలు చరుచుకోవాల్సిన పనిలేదు… దక్షిణాది సినిమా బాలీవుడ్ కొమ్ములు విరిచేసిందని అప్పుడే ఓ నిర్ధారణకు వచ్చేయకండి… నిజమే… ఒకప్పుడు రజినీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి వంటి చాలామంది సౌతిండియన్ హీరోలు హిందీ మార్కెట్లోకి అడుగుపెట్టి, వాపస్ వచ్చేశారు… నిజానికి హిందీ ఇండస్ట్రీ దక్షిణాది హీరోయిన్లను తప్ప ఇంకెవరినీ ఎప్పుడూ సహించదు… హిందీ ప్రేక్షకులు కూడా సౌత్ ఇండియన్ సినిమాలంటేనే అదోరకంగా చూసేవాళ్లు… తెలుగు, తమిళ సినిమాల రీమేక్ హక్కుల్ని కొని, బాలీవుడ్ నిర్మాతలు హిందీ తారల్ని […]
హమ్మయ్య… కేఏపాల్ తెలంగాణకు వచ్చేశాడు… ఇక చింత లేదు…
ఏపీలో నవ్వు పుట్టించగల నాయకులు బోలెడు మంది… అందుకే ఏపీ ప్రజల్లో బీపీ, స్ట్రెస్ తక్కువ… తెలంగాణలోనే మరీ లోటు కనిపిస్తూ ఉండేది… ఏదో అప్పుడప్పుడూ బండ్ల గణేష్ ఆ లోటు కొంత పూరిస్తున్నా సరే, తను సరిపోవడం లేదు… ఏదో అప్పుడప్పుడూ తలసాని కూడా కాస్త చేయి వేస్తున్నాడు… హమ్మయ్య, ఇప్పుడు ఆ చింత తీరినట్టే… కేఏ పాల్ తన క్రీడావేదిక ఏపీ కాదని, తెలంగాణ మాత్రమే తన కార్యస్థలమని గుర్తించాడు… వచ్చేశాడు… ఇక గాయిగత్తరే… […]
ఈటల ప్లేసు ఏపీలో భర్తీ..! అదీ తెలంగాణ బిడ్డతోనే…! కమ్మలకూ బాధక్కర్లేదు..!!
Nancharaiah Merugumala………….. తెలంగాణ ‘ముది’ రాజకుమారి ఏపీలో మంత్రి…. తెలంగాణ కాబినెట్లో 2014 నుంచీ ‘కమ్మ ప్రాతినిధ్యం’ ——————— తెలంగాణలో ఏకైక ముదిరాజ్ మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి సాగనంపి ఏడాది నిడుతోంది. నల్లగొండ జిల్లా వీరోచిత రెడ్లకు సంపన్న అల్లుడైన రాజేందర్ గారు తనపై టీఆరెస్ సర్కారు నుంచి ‘వేధింపులు’ ఎదురైనప్పుడు తాను ‘రెడ్స్’ దామాద్ అని బెదిరించకుండా ముదిరాజ బిడ్డనని వినమ్రంగా విలేఖరులకు చెప్పారు. ముదిమి, బలిమి గల మరో ముదిరాజ్ […]
ప్రపంచ రాజకీయ చిత్రపటం మారుతున్నది! అమెరికా ఇప్పుడు నథింగ్…!!
పార్ధసారధి పోట్లూరి………….. ప్రపంచ రాజకీయ చిత్రపటం మారుతున్నది ! ఆధిపత్యం కోసం జరిగే పోరాటంలో నిత్యం ఎవరో ఒకరికి నష్టం తప్పదు కానీ నష్టపోయిన వారికి ఒక్క విజయం దక్కితే మాత్రం అది అప్పటివరకు విజయం సాధిస్తూ వచ్చిన వాళ్లకి పెద్ద నష్టమే కలుగచేస్తుంది! ఇప్పుడు ఆ నష్టం అనుభవించే దేశాల జాబితాలో యూరోపియన్ యూనియన్ తో పాటు అమెరికా కూడా ఉండబోతున్నది. EU కానీ అమెరికా కానీ తమ తమ దేశాలలో పర్యావరణానికి హాని కలగకుండా […]
బీస్ట్ అంటే మృగం… ఔను, అలా మీదపడితే ఎవడికి నచ్చుతుంది మరి..?!
నిజానికి సినిమా అంతా చూశాక… బతుకుజీవుడా అని థియేటర్ నుంచి పారిపోయి వస్తుంటే… ఒకటి ఎందుకో కాస్త డిఫరెంటుగా స్ట్రయికయింది… అందరూ గోల్డెన్ లెగ్ అని కీర్తించి, ఆ పాదాల మీద, ఐమీన్ తొడల దాకా ప్రత్యేక గీతాలు రాసి, నేల మీద పొర్లుతూ పొర్లుదండాలు పెట్టారు కదా… ఆల్ ఆఫ్ సడెన్ ఫాఫం, ఇలా అయిపోయింది ఏమిటీ అని… అవును, పూజా హెగ్డే గురించే… నటనలో ఆమె పూర్… గట్టిగా అడిగితే ఆమే ఒప్పుకుంటుంది ఆ […]
ఈనాడు కార్టూన్‌పై నెటిజన్ల ఫైర్… మోడీని తిట్టుకో, కానీ దేశాన్ని కాదు…
ఇదే ఈనాడు ఓ దశలో మోడీకి విపరీతంగా డప్పుకొట్టింది… చంద్రబాబుతోపాటు తనూ దూరమైంది… అంతే… తన రాగద్వేషాలే తన పాలసీలు… అంతకుమించి తేడా ఏమీ ఉండదు… లోతైన ఆలోచన, జాతికోణంలో సంయమనం వంటివి దానికి పట్టవు… పడితే అది ఈనాడే అనిపించుకోబడదు… మోడీని అనేక అంశాల్లో ఆక్షేపించవచ్చు… తప్పేమీ లేదు… మోడీ విమర్శలకు అతీతుడేమీ కాదు, ఉపేక్షించాల్సిన పనీ లేదు… నోట్ల రద్దు దగ్గర్నుంచి ఆత్మనిర్భర్ దాకా అనేకానేక వైఫల్యాలున్నయ్… అయితే ఒక విమర్శ చేసేముందు ప్రతిపక్షం […]
హమ్మయ్య… రోజా వదిలేసింది… కానీ స్టేజీ కూడా ఖాళీ అయిపోయింది…
‘‘మంత్రి పదవి వచ్చింది, ఇక జబర్దస్త్ షో చేయలేను, ఒకేసారి రెండు కామెడీ షోలు చేయడం కష్టం’’ అని రోజా అంటున్నట్టుగా నిన్న మీమ్స్, చెణుకులు కనిపించాయి సోషల్ మీడియాలో…. మంత్రి పదవిని కామెడీ షోతో పోల్చడం కరెక్టు కాదు, కానీ జబర్దస్త్ కామెడీతో పోలిస్తే ఇదేమంత పెద్ద తప్పుగా అనిపించడం లేదు… నేను ఇక టీవీ షోలు చేయను అనే రోజా వ్యాఖ్యను మీడియా, సోషల్ మీడియా నిన్న హైలైట్ చేసింది… అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వను అని […]
బెంగాల్లోనూ మారీచ మీడియా..! కుతకుత ఉడికిపోతున్న మమత…!!
‘‘ఒక పేద బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది… చివరకు ప్రాణాలు వదిలింది… నిందితులు అధికార పార్టీ టీఎంసీకు చెందినవారు……’’ సపోజ్, ఇది వార్త అనుకొండి… మామూలుగా ఇలాగే రాస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు భ్రష్టుపట్టిపోయినయ్, పరిపాలన లేదా, అధికార పార్టీ అరాచకాలకు అంతే లేదా, మనుషులు ఇక్కడ బతికేదెట్లా అనే భావనను వ్యాప్తి చేసినట్టవుతుంది… అది బెంగాల్‌కు ఎంత అప్రతిష్ట..? నియంత మమతకు ఎంత నగుబాటు..? సో… అందుకని… ఇలాంటి నెగెటివ్ వార్తనైనా సరే, పాజిటివ్ వార్తగా మలచాలి… […]
ఇదీ స్పిరిట్..! తండ్రి హత్య కేసే టార్గెట్… లా చదివింది… పదహారేళ్లు పోరాడింది..!!
బంగ్లాదేశ్… తాహెర్ అహ్మద్ ఆయన పేరు… ఓ యూనివర్శిటీలో ప్రొఫెసర్… భార్యాపిల్లలు, సాఫీగా సాగుతున్న జీవితం… 2006, ఫిబ్రవరి ఆయన కిడ్నాపయ్యాడు… రెండు రోజుల తరువాత తాహెర్ శవం ఓ మ్యాన్‌హోల్‌లో కనిపించింది… కన్నీరుమున్నీరైన కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది… కేసు నమోదైంది… ఈ హత్య వెనుక ఆరుగురు నిందితులున్నట్టు సందేహించారు… దర్యాప్తు ప్రారంభమైంది… తాహెర్ హత్యకు కారకులైన వారికి తగిన శిక్ష పడేలా చేయడం కోసం ఆ కుటుంబం కోర్టుల చుట్టూ తిరిగింది… ఎక్కడా ఏమీ […]
- « Previous Page
- 1
- …
- 377
- 378
- 379
- 380
- 381
- …
- 450
- Next Page »