ఒక విఫల ప్రయత్నం… నిన్నటి గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురు మహిళల మృతికి అసలు కారకుడు చంద్రబాబును, ఆ పాతకం నుంచి బయటపడేయటానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓ విఫల ప్రయత్నం చేశాడు… అబ్బే, చంద్రబాబుకు అస్సలు సంబంధం లేదు, అసలు అది టీడీపీ కార్యక్రమమే కాదు, అదంతా ఉయ్యూరు ఫౌండేషన్ చేపట్టిన జనోద్ధరణ మాత్రమే, వాళ్ల నిర్వాకం కారణంగానే ఆ ముగ్గురూ మృతిచెందారు… అని కవరింగు ఇవ్వడానికి నానాపాట్లూ పడింది… మొన్నటి కందుకూరు దుర్ఘటనలో సంభవించిన మరణాలు రాష్ట్రవ్యాప్తంగా […]
మన ‘ఏడుకొండల్లా’గే జార్ఖండ్‌లో పార్శ్వనాథ్ గుట్టలు… అగ్గిపెట్టిన సర్కారు…
సంఖ్యాబలమున్న మైనారిటీలను మచ్చిక చేసుకోవాలి… వోటు బ్యాంకుగా చూసుకోవాలి… వాళ్లు చెప్పినట్టు సై అనాలి… ఇదేకదా, భారతదేశంలో ప్రతి సెక్యులర్ పార్టీ చేసేది… మరి మైనారిటీలు అంటే, నిజంగానే సంఖ్యాబలం లేని మైనారిటీలను ఎవడు పట్టించుకోవాలి..? అదే కదా మన దరిద్రం… మన రాజకీయ పార్టీలు, మన ప్రభుత్వాల అడుగులు అలా ఉంటాయి… మన దేశ మైనారిటీల్లో క్రిస్టియన్లు, ముస్లింలే కాదు… పార్శీలు, జైనులు, సిక్కులు, బౌద్ధులు కూడా ఉన్నారనే సోయి రాజకీయ పార్టీలకు ఉండదు… ఇవి […]
ఓహ్… ఈ సుపారీ హత్యల వెనుక ఇంత చరిత్ర ఉందా..? ఇంట్రస్టింగు…
పార్ధసారధి పోట్లూరి …… సుపారీ అనే పదం తరుచూ మనం సినిమాలలో మరియు పత్రికలలో వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం ! సుపారీ అనేది కాంట్రాక్ట్ హత్యలకి మారు పేరుగా వాడుతుంది అండర్ వరల్డ్ మాఫియా ! అయితే ఈ ‘సుపారీ ‘ అనే పదానికి అర్ధం ‘తాంబూలం ‘! డబ్బులు తీసుకొని చేసే హత్యలకి పర్యాయపదంగా సుపారీ అనే పేరు ఎలా వాడుకలోకి వచ్చింది ? ఈ సుపారీ అనే పదానికి చారిత్రిక నేపధ్యం ఉంది […]
సాక్షి కదా… అదంతే… పాఠకుల్ని పిచ్చోళ్లను చేయడంలో నెంబర్ వన్…
పొద్దున్నే టీవీల్లో కొందరు స్వాములు రంగురంగుల పూసల దండలు వేసుకుని, ప్రపంచంలోని ప్రతి సమస్యకు ఓ విరుగుడు చెప్పేస్తుంటారు… ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంటారు… మూఢనమ్మకాల్ని వ్యాప్తి చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు… వాళ్లను చూస్తుంటేనే ఓ అలర్జీ… సేమ్, సాక్షిలో ఈరోజు వచ్చిన హాఫ్ పేజీ ఐటం కూడా అలాగే అనిపించింది… ఐటం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే… అది యాడ్‌లా అనిపించలేదు, యాడ్ అనీ రాయలేదు… స్పాట్ వార్త కాదు, స్పెషల్ స్టోరీ కాదు… ఫ్యామిలీ పేజీ […]
‘‘ఇక్కడ వ్యాపారం చేయాలనుకుంటే… ఈ దేశ చట్టాల్ని గౌరవించాల్సిందే…’’
ముందుగా ఒక వార్త…ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన ట్విట్టర్ ఖాతాలో ఇండియా మ్యాప్‌ను తప్పుగా చూపించే ఓ కొత్త సంవత్సరపు గ్రాఫిక్ పోస్ట్ చేసింది… పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, చైనా ఆక్రమించుకున్న కశ్మీర్ భాగాలు లేని మ్యాప్ అది… ఇది గమనించిన వెంటనే కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సీరియసయ్యాడు… ‘‘డియర్ వాట్సప్, వెంటనే ఆ తప్పును సరిదిద్దండి, లేకపోతే బాగుండదు… ఈ దేశంలో వ్యాపారం చేయాలని అనుకునే ఏ సంస్థయినా భారతదేశ చట్టాల్ని […]
‘‘నీ ఏడుపేదో నువ్వేడువు… నాకన్నా ఎక్కువ ఏడువు… నేనేమైనా వద్దన్నానా..?’’
మల్లెమాల తీస్తున్న ఏదో సినిమా… జమున, జయలలిత ఇద్దరూ ఉన్నారు… జయలలిత కాస్త ఇంట్రావర్ట్… తన షూటింగ్ పార్ట్ అయిపోగానే ఏదో ఇంగ్లిషు పుస్తకం చదువుతూ ఓ పక్కన కూర్చునేది… యవ్వనంలో అబ్బురపరిచే అందం… మంచి ఇంగ్లిషు పరిజ్ఞానం… వేరే తారలకు తనంటే ఓరకమైన ఈర్ష్య… జమున షూటింగ్ స్పాట్‌కు వెళ్లగానే ఓరోజు అప్పటికే అక్కడికి వచ్చి షూటింగ్‌కు రెడీగా ఉన్న జయలలిత లేచి నిలబడలేదు, విష్ చేయలేదు… జమునకు చర్రుమంది… తనకూ ఇగోయిస్టు అనే పేరుందిగా… […]
శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
హఠాత్తుగా చుట్టుముట్టిన వరద… ఓ మనిషి తను ముందుజాగ్రత్తగా ఇంటి వద్ద ఉంచుకున్న పడవలో కుటుంబసభ్యుల్ని, పశువుల్ని ఎక్కించాడు… వరద ఉధృతి పెరుగుతోంది… పడవ కొట్టుకుపోసాగింది… బరువు ఎక్కువై మునక ప్రారంభమైంది… జెట్టీసన్ (ఈ పదం ఇక్కడ వాడొచ్చా)… తప్పదు… బతికుంటే పశువుల్ని కొత్తవి కొనుక్కోవచ్చు అని పాడిగేదెల్ని, ఎద్దులను వరదలోకి తోసేశాడు… తరువాత పెంపుడు జంతువులను కూడా… ఇంకా బరువు తగ్గాలి… ఆ మనిషి చూపు అమ్మ, అయ్య మీద పడింది… రోజూ తిండి దండుగ […]