ఎంకి పెళ్లి, సుబ్బి చావు…. అన్నట్టు ఎక్కడో ఏదో జరుగుతుంది… మన గాశారం బాగాలేకపోతే అది మనకు తగుల్కుని మన ఇజ్జత్ తీస్తది… ఇదీ అంతే… బెంగాల్‌లో ఈడీ పార్థ ఛటర్జీ అనే ఓ మంత్రి గారిపై కన్నేసి దాడులు చేసింది కదా… సారు గారి జాన్ జిగ్రీ దోస్త్, నటి, మోడల్ అర్పిత ముఖర్జీ ఇంట్లో 21 కోట్ల నగదు దొరికింది కదా… దాదాపు నెంబర్ టూ అనిపించుకున్న మంత్రి అరెస్టయితే పార్టీ సైలెంటుగా ఉండటం, […]
రాష్ట్రపతి వదినకు ఆ పేద మరదలి కానుక… ఓ సంప్రదాయిక నేత చీర, అరిశెలు…
కొన్ని వార్తల్లో పెద్ద విశేషం ఉన్నట్టుగా ఏమీ అనిపించదు… కాకపోతే అవి చదువుతుంటే ఇట్టే కనెక్టయిపోతాయి… ఇదీ అంతే… కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది… ఈ దేశ ప్రథమ పౌరురాలు కాబట్టి కొన్ని సంప్రదాయాల మేరకు, పద్ధతుల మేరకు ప్రమాణ స్వీకారం జరుగుతుంది… చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు… 21 తుపాకుల్ని గాలిలోకి కాల్చి, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారాన్ని సెలబ్రేట్ చేస్తారు… అంతేకాదు, టెక్నికల్‌గా అన్నిరకాల రక్షణ సైనిక విభాగాలకు […]
కాస్త నోటి దూల… తెలుగు మూలాలున్న ఈ ‘‘ఓవర్ స్పీకర్’’ కథ ఇదీ…
Nancharaiah Merugumala…………. నెహ్రూ– ఇందిర, సోనియా ఏలుబడిలో మూడు నాలుగు తరాలకు సరిపడా దోచుకున్నాం, ఇకనైనా త్యాగాలు చేయకపోతే మన తిండిలో పురుగులు తప్పవు………… ఇవీ కర్ణాటక మాజీ స్పీకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ములకనాడు బ్రాహ్మణ నేత రమేశ్ కుమార్ ‘కుండబద్దలు’ మాటలు, ఏమైనా కన్నడ బ్రామ్మలు తెలుగోళ్ల కంటే గొప్పోరే! గురువారం రమేశ్ అన్న మాటలు సహజంగానే పాలకపక్షమైన బీజేపీకి ఆయుధాలుగా మారాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నేత, హోం మంత్రి అరగా జ్ఞానేంద్ర […]
తన జీవన సాఫల్యం మీద రజినీకాంత్‌కు తీవ్ర అసంతృప్తి… ఎందుకు..?
ఒక వార్త కనిపించింది… అది రజినీకాంత్ వార్త కాబట్టి ఇట్టే పట్టేసుకుంది… చదివించింది… నా జీవితంలో కనీసం పదిశాతం ప్రశాంతత, సంతోషం లేవని రజినీకాంత్ ఓచోట బహిరంగంగానే వ్యాఖ్యానించాడు… ఎస్… తెలుగు మీడియాలో ఎక్కడా కనిపించలేదు… నైదర్ పత్రికలు నార్ టీవీలు… కానీ అది కనెక్ట్ కావల్సిన వ్యాఖ్యే… ఎందుకంటే..? 71 ఏళ్ల వయస్సులో రజినీకాంత్ వంటి హీరో నా జీవితంలో సంతోషం లేదు, ప్రశాంతత లేదు అని ఎందుకు వగచే దురవస్థ… కావచ్చు, రజినీకాంత్ మొదట్లో […]
హయ్యారే… ఏం సేయుట..? సభ రద్దు చేయుటయా..? వేచి ఉండుటయా..?
కావచ్చు… 12 మంది టీఆర్ఎస్ సిట్టింగుల మీద బీజేపీ వలవిసిరి ఉండవచ్చు… వస్తే కాషాయకండువాలు కప్పవచ్చు… కానీ వాళ్లతో రాజీనామాలు చేయించి, ఉపఎన్నికలు రప్పించి, కేసీయార్‌ను చికాకు పెట్టే ఆలోచన బీజేపీకి ఉండదు… దేశవ్యాప్తంగా బీజేపీది ఒకే పాలసీ… వీలైనంతవరకూ కూల్‌గా వ్యవహారాలు సాగిపోవాలి… అంతేతప్ప ఎప్పుడు తెలంగాణలో ఎన్నికలొస్తాయో తెలియని స్థితిలో బీజేపీ ఈ ఉపఎన్నికల రిస్క్ తీసుకోదు… కేసీయార్ మార్క్ స్వేచ్ఛతో చెలరేగిపోయి, జనంలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న సిట్టింగులను గనుక బీజేపీ ఆదరిస్తే… […]
తెలియదు… ఏమో, గుర్తులేదు… సోనియా ఈడీ విచారణ సాగిన విధంబెట్టిదనిన…
పార్ధసారధి పోట్లూరి ………… ED-సోనియా విచారణ ! సోనియా ED ఆఫీస్ కి బయలుదేరే ముందు అన్ని రాష్ట్రాల నుండి ఛోటా మోటా నాయకులు ఢిల్లీ చేరుకొని ED ఆఫీసు ముందు ఆందోళనకి దిగారు. కక్ష సాధింపు రాజకీయాలు అంటూ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన చేశారు. ED ఆఫీసుకి వెళ్ళే ముందే సోనియా అధికారులకి ఒక అప్లికేషన్ పెట్టుకున్నది… తనతో పాటు తన వ్యక్తిగత వైద్యుడిని అనుమతించాలి అంటూ..! అంతే కాదు, తనకి వ్యక్తిగత సహాయుకుడు కూడా […]
శ్రావణ భార్గవి ఓడి గెలిచింది… ‘ఒకపరి’ భిన్నకోణంలో చూడాలి దీన్ని…
శ్రావణ భార్గవి వివాదానికి దారితీసిన ఆ వీడియో తీసేసింది… అదే వీడియోకు ఓ వేణుగానాన్ని యాడ్ చేసి, మళ్లీ పెట్టింది… అదేమంటే ఆ వీడియోకు బాగా కష్టపడ్డాం అంటోంది… ఆ వీడియోకు నిజానికి అంత సీన్ లేదు, సరే, ఆమె ఇష్టం… అయితే అన్నమయ్య వంశస్థులు కూడా ‘అతి’ చేసినట్టనిపించింది… నచ్చనప్పుడు అభ్యంతరపెట్టారు, తప్పులేదు… వాళ్లు చెప్పేదీ ఓ గందరగోళం… ఈ పిల్లది తింగరి వేషం… ఈమె వాదన, మాటతీరు కూడా అంతే గందరగోళం… కానీ కేసు […]
వామ్మో జర్నలిస్టు..! గొట్టాలు చూస్తేనే జనంలో దడ… ఇవి ‘పెన్ గ్యాంగ్స్…
జనం మీద పడే తోడేళ్లలా ప్రభుత్వ అధికారులు కనిపించేవాళ్లు గతంలో… రాజకీయ పార్టీల నాయకులు, వివిధ కులసంఘాలు, సామాజిక సంస్థలు నిర్బంధ చందాల దందాలు జతకలిశాయి… తరువాత పట్టణాలు, నగరాలయితే హిజ్డాలు ఓ ఆర్గనైజ్డ్ ముఠాలుగా జనంపై పడసాగారు… వీళ్లందరినీ మించి సమాజానికి ఇప్పుడు పెద్ద జాఢ్యం జర్నలిజం… ఈ హైనాల బెడద గతంలో లేదని కాదు, కాకపోతే అప్పట్లో పత్రికల సంఖ్య తక్కువ… తరువాత టీవీ గొట్టాలు చేరాయి… ఇక కొన్నేళ్లుగా యూట్యూబ్ చానెళ్ల పేరిట, […]
చివరకు సుధీర్‌ను బకరా చేశారా..? లేక మల్లెమాలతో ఓ గేమ్ ప్లే చేస్తున్నారా…?!
మల్లెమాల మీద నాగబాబు వీరాభిమాని ఆర్పీ కూతలు… కౌంటర్‌గా ఇతర కమెడియన్ల ఎదురుకూతలు… పరస్పరం వాతలు… కొద్దిరోజులుగా ఇదే తంతు కదా… ఈటీవీ, మల్లెమాల, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ ప్రోగ్రామ్ ఎట్సెట్రా ఉమ్మడిగా ఇజ్జత్ తీసుకుంటున్నాయి… అసలే ఈటీవీలో సినిమా ప్రమోషన్ల కక్కుర్తి కారణంగా మిగతా రియాలిటీ షోల రేటింగ్స్ పాతాళంలోకి వెళ్లిపోయాయి… ఇక ఈ కామెడీ షోలు కూడా ఢమాల్ అంటే, అసలే మూడో ప్లేసులో కొట్టుకుంటున్న ఈటీవీ జెమిని కిందకు, అంటే […]
ఎవరా ఇద్దరు లేడీస్..? ఏమా కథ..? పార్థ మంత్రి గారు ఘటికులే సుమీ…!!
నిన్న ఈడీ దాడుల్లో బెంగాల్ మంత్రి పార్థ చటర్జీ దొరికిపోయాడు కదా… అరెస్టు కూడా చేశారు… అక్కడక్కడా రణగొణ ధ్వనులు మినహా టీఎంసీ క్యాంపు కిమ్మనడం లేదు… దొరికిన సారు గారు చిన్న నాయకుడేమీ కాదు… ఘటికుడు… మమతకు, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడు… అంతెందుకు..? ఒక దశలో అసెంబ్లీలో అతనే ప్రతిపక్ష నేత… టీఎంసీ తరఫున… ఆల్‌రెడీ తనపై సీబీఐ కేసు ఉంది… దానికి కొనసాగింపే ఈడీ దర్యాప్తు… పక్కాగా సమాచారం తీసుకుని, […]
24 సెకండ్ల చిన్న వీడియో… ఓ వంద నయాగారాల్ని చూసినట్టు…
పెద్ద పెద్ద వివరణలు, వర్ణనలు అక్కర్లేదు… ఒక్కసారి ఈ వీడియో చూడండి… ఓ వంద నయాగారా జలపాతాలు కళ్లెదుట భీకరఘోషతో కిందకు దూకుతున్నట్టు అనిపిస్తుంది… ఎక్కడో కాదు… కర్నాటకలోని షిమోగా జిల్లాలో… జోగ్ జలపాతాలు… జోగ్ ఫాల్స్… నిజానికి మామూలు రోజుల్లో పెద్దగా నీళ్లుండవు… బోసిగా కనిపిస్తుంది… అందుకే ఆ పరిసరాలు పెద్దగా కమర్షియలైజ్ కాలేదు… కాకపోతే జలపాతం సరిగ్గా చూడటానికి ఏర్పాట్లు బాగుంటాయి… ఇప్పుడు భారీవర్షాలు కురుస్తూ, జోగ్ ఫాల్స్ కన్నులపండువగా మారాయి… ఎవరో మిత్రులు […]
ఫాఫం… మమతకు బీజేపీ నమ్మకద్రోహం… ఫెడరల్ స్పూర్తికీ గండి…
ఎస్.., ఈ మతవాద, ఈ మనువాద, ఈ ఛాందసవాద బీజేపీని ఏమాత్రం నమ్మడానికి వీల్లేదు… విశ్వాసఘాతక పార్టీ అది… మొత్తం ద్రోహచింతనే… వీసమెత్తు స్నేహనిబద్దత లేదు… ఆడినమాటకు కట్టుబడే నైజమే కాదు… కాకపోతే ఏమిటండీ… మొన్నమొన్ననే కదా డార్జిలింగులో భేటీ వేయించింది… అప్పటి గవర్నర్ ధనకర్‌ను అప్పటికే అక్కడికి పంపించి, అక్కడికే అస్సోం సీఎం హిమంత విశ్వనూ రప్పించి, ఆ సమయానికి మమతను పిలిపించి కూర్చోబెట్టారు కదా… చాయ్ తాగారు, బిస్కెట్లు తిన్నారు… మంచీచెడూ మాట్లాడుకున్నారు… మంతనాలు […]
సమంత ఎంత కెలికినా సరే… చైతూ పాటించే నిశ్శబ్దమే సరైన జవాబు…
ఇప్పుడు నాగచైతన్య ఎలా స్పందించాలి అన్నాడు ఓ మిత్రుడు…? నిశ్శబ్దంగా ఉండటంకన్నా బెటర్ ఆప్షన్ లేదు అనేది మరో మిత్రుడు జవాబు…! నిజం… అక్షరాలా నిజం… సమంత ప్రేమమైకంలో పడి పిచ్చోడయ్యాడు… కుటుంబసభ్యులకు ఎదురుతిరిగాడు… నాగార్జునకు ఆమె తత్వం సంపూర్ణంగా తెలుసు… అడ్డుకున్నాడు… కుదర్లేదు… పోనీలే, అమలలాగా ఒదిగిపోతుంది అనుకున్నాడు… రాజీపడ్డాడు… చైతూ ప్రేమకు వోకే చెప్పాడు… సమంత చెప్పినట్టే… క్రిస్టియన్ సంప్రదాయంలో పెళ్లి, హిందూ సంప్రదాయంలో పెళ్లి… పర్లేదు… వాళ్ల ప్రేమ, వాళ్ల నమ్మకాలు మతం […]
అవార్డులంటే అంతే బ్రదర్… కొన్నే మెరుపులు, అనేక పెదవివిరుపులు…
జాతీయ అవార్డుల ప్రకటన ప్రతిసారీ ఓ ప్రహసనమే… రాష్ట్రాలు, కేంద్రం ప్రకటించే అవార్డులంటేనే అదోరకం… బోలెడు పైరవీలు, లెక్కలు, విధేయతలు మన్నూమశానం… అందుకే ఆ అవార్డులు కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తాయి… ఏ పైరవీలు అడ్డుపడని కేటగిరీల్లో మాత్రం ఎంపికలు బాగానే ఉంటయ్… ఉదాహరణకు అయ్యప్పనుం కోషియం సినిమాకు దక్కిన అవార్డులు… ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గాయని, ఉత్తమ యాక్షన్ డైరెక్టర్ అవార్డులన్నీ దానివే… సరైన ఎంపికలు కూడా… కానీ..? ఉత్తమచిత్రం సూరారై పొట్రు సంగతికొస్తే… […]
నో… ప్రతి హిందీ డబ్బింగూ హిట్టేమీ కాదు… ఈ ఫ్లాపులూ ఉన్నాయ్…
మరో హిందీ సినిమా ఢామ్ అన్నట్టుంది… షంషేరా… హిందీ సినిమాల ఫ్లాపుల పరంపర అనంతంగా అలా సాగిపోతూనే ఉంది… అలాగని తెలుగు ఫీల్డ్ ఏదో కలర్‌ఫుల్‌గా ఉందని కాదు… ఇక్కడా శోకాలే ఉన్నాయి… కొందరు బయటకు ఏడుస్తున్నారు… ఇంకొందరు లోలోపల కుమిలిపోతున్నారు… ఈ నేపథ్యంలో నిన్నటిదో మొన్నటిదో రిపోర్టు… ఇంట్రస్టింగుగా అనిపించింది… బాహుబలి-2 తరువాత ఓ ప్రచారం ప్రారంభమైంది… మొత్తం సౌతిండియన్ సినిమాలు బాలీవుడ్‌ను తొక్కేసి, మొత్తం దేశవ్యాప్తంగా వసూళ్లను దున్నేస్తున్నాయి అనేది ఆ ప్రచారం… ఇలా సౌతిండియన్ […]
ప్చ్..! అనసూయకు యాంకరింగే బెటర్… ఈ క్రౌర్యం అస్సలు నప్పదు…!!
హీరో పాత్రలదేముంది..? ఒడ్డూపొడుగూ ఉన్నవాడు ఎవడైనా చేస్తాడు..? హీరోయిన్ పాత్రలదేముంది..? అదెలాగూ స్కిన్ షో కదా, నదురుగా ఉన్న ఎవరైనా చేయగలరు..? కామెడీ చేయాలంటే కష్టం, దానికి పర్‌ఫెక్ట్ టైమింగు కావాలి… అంతకుమించి విలనీ చేయాలంటే కష్టం… మెప్పించాలి… కళ్లల్లో, మొహంలో క్రౌర్యం ఎక్స్‌పోజ్ కావాలి… మాట కటువుండాలి… బాడీ లాంగ్వేజీ పాత్రకు తగినట్టుగా ఉండాలి… దానికి తగిన బీజీఎం ఉంటే విలనీ భలే పండుతుంది… అదే లేడీ విలన్ అయితే మరీ కష్టం… అందులోనూ కామెడీకి, […]
దూల తీరింది…! ద్రౌపది మీద నోటికొచ్చిన రాతలు… కొలువు గోవిందా..!!
కొన్ని దేశాల్లో ఉన్న మనవాళ్లు నోటికొచ్చినట్టు సోషల్ మీడియా పోస్టుల్ని పెట్టి కేసులు, అవస్థల పాలైన ఉదాహరణలు చూశాం… మన దేశంలో కూడా కొన్ని సంస్థల్లో పనిచేసేవాళ్లకు దూల ఎక్కువ… రాబోయే పరిణామాల్ని, నష్టాల్ని అంచనా వేసుకోకుండా ఇష్టారీతిన పోస్టులు పెడుతుంటారు… కొందరు తెలివిగా ఇది నా వ్యక్తిగతం అంటూ డిస్‌క్లెయిమర్స్ కూడా రాస్తుంటారు… కానీ టైమ్ ఎదురుతన్నినప్పుడు ఇవేమీ కాపాడవు… గిలెటిన్… అనగా తల తెగిపడటమే… అంతే… వ్యక్తిగతంగా పలు అంశాలపై ఎలాంటి అభిప్రాయాలున్నా సరే… […]
దక్షిణ తెలంగాణపై బీజేపీ కన్ను… బలమైన వలసవాదులు కావలెను…
కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డితో అమిత్‌షా ముప్పావు గంట భేటీ వేశాడట… అబ్బే, కలిసిన మాట నిజమే గానీ, జస్ట్, ఓ మర్యాదపూర్వక కలయిక అంటున్నాడు రెడ్డి గారు… హహహ… ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో ముప్పావుగంట అమిత్ షా భేటీ వేయడమా..? అదీ మర్యాదపూర్వంగా..!! జనం చెవుల్లో చాలా మర్యాదపూలు పెడుతున్నారు రెడ్డి గారు… అమిత్ షా మర్యాదస్తుడే గానీ… ఇప్పుడున్న స్థితిలో అమిత్ షా ప్రతి పలకరింపు వెనుక, ప్రతి షేక్ హ్యాండ్ వెనుక చాలా మర్మాలుంటాయని […]
బాబా, శాస్త్రి హత్యలు వోకే…. మరి దిగ్రేట్ అజిత్ దోవల్ వర్గ కసి ఏమైనట్టు..?!
వర్గ కసి… ఈ పదం చాలామందికి అర్థం కాదు… నక్సలైట్ల నిర్మూలనకు ఫేక్ ఎన్‌కౌంటర్లను మొదలుపెట్టి, దూకుడుగా కొనసాగించిన జలగం వెంగళరావు మామూలు మరణానికి గురైనప్పుడు పీపుల్స్‌వార్ బాగా బాధపడింది… అదీ వర్గ కసి లక్షణం… ఏ జాతికైనా, ఏ దేశానికైనా, ఎవరికైనా వర్తించేది వర్గ కసి అనే పదం… అది ఫీలయ్యేవాడికే అర్థమవుతుంది ఆ పదం అసలు అర్థమేమిటో… సేమ్… ఇజ్రాయిలీ గూఢచార సంస్థ మోసాద్ గురించి చెప్పాలి… తమ దేశానికి, తమ జాతికి నష్టం […]
ఫీల్ గుడ్… డిఫరెంట్ స్టోరీ… మంచి టీం… కానీ ఎక్కడో తేడా తన్నింది..?!
నాగచైతన్యను ఒక్క విషయానికి అభినందించొచ్చు… ‘‘తెలుగు హీరో అంటే తప్పనిసరిగా మాస్, కమర్షియల్, బిల్డప్పు, ఇమేజీ, ఫార్ములా విలువల్ని మాత్రమే ప్రేమించును’’ అనే పాయింట్ నుంచి బయటికి వచ్చి భిన్నంగా వ్యవహరిస్తున్నందుకు..! కథల ఎంపికలో ఎంతోకొంత శ్రద్ధను చూపిస్తున్నాడు… భిన్నత్వాన్ని అటెంప్ట్ చేస్తున్నాడు… థాంక్యూ అనే సినిమా కథ కూడా అంతే..! నిజానికి థర్డ్, ఫోర్త్ లేయర్ హీరోల సినిమాలకు కూడా రకరకాల మార్గాల్లో బోలెడంత హైప్ క్రియేట్ చేస్తుంటారు… ఏ తెలుగు సినిమాకైనా మొదటి మూడు […]
- « Previous Page
- 1
- …
- 380
- 381
- 382
- 383
- 384
- …
- 409
- Next Page »