‘‘మీ అమ్మమీదొట్టు.. అయ్యమీదొట్టు.. అక్కమీదొట్టు.. చెల్లెమీదొట్టు….’’ పాట ఎలా ఉంది..? ఎవడ్రా రాసింది, ఎవడ్రా కూసింది అనాలనిపిస్తోందా..? పొరపాటున ఎదుట కనిపిస్తే కుమ్మేయాలని ఉందా..? అదే మీ అజ్ఞానం… ‘అమ్మో నీయమ్మ గొప్పదే, అందం పోగేసి కన్నదే’ అని చిరంజీవి అదేదో గ్రాఫిక్ సినిమాలో పాడితే ఆనందించారు కదా… మరి ఇదెందుకు నచ్చదు..? పోనీ… గుండిగెలాంటి గుండేదానా అని విక్రమ్ గొంతు చించుకుంటే ఎగిరి గంతేశారు కదా..! సినిమా పాటలకు అర్థాలేమిటి..? పరమార్థాలేమిటి… ఎవడో ట్యూన్ ఇస్తాడు, […]
సాక్షి 3 పేజీల ‘కృష్ణా తులాభారం’..! పాఠకులకు, ప్రజలకు ఓ శిరోభారం..!!
నిష్పాక్షిక మీడియా అంటూ ఏం సచ్చింది గనుక… టీవీ, పత్రిక… ప్రతిదీ ఏదో ఓ భజనసంఘమే కదా… భజన సైట్లు మరీ దరిద్రం, ఆమధ్య సెక్యులర్ అనే ముసుగు ఉండేది, ఇప్పుడు నిజ కులస్వరూపం ప్రదర్శిస్తూ రెచ్చిపోతున్నయ్… సారీ, ట్యూబ్ చానెళ్ల గురించి అడగొద్దు… ఇక పార్టీల అనుబంధ విభాగాలుగా వర్ధిల్లే పత్రికలు, టీవీలయితే చెప్పనక్కర్లేదు… సుప్రభాతం దగ్గర్నుంచి రాత్రి నిద్రపుచ్చే పాట దాకా… ప్రతిదీ ఓ కీర్తనే… ఐతే… ఇదొక కళ… అది కూడా చేతకానివాళ్లు […]
జగమెరిగిన గాయని ఆశా భోస్లే ఓ మంచి మాట చెప్పింది… ఏమిటంటే..?
ఆశా భోస్లే… భారతీయ సినీ సంగీతాన్ని ప్రేమించేవాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు… మెలొడి, క్లాసిక్ మాత్రమే కాదు, రకరకాల ట్యూన్లకు ప్రాణం పోసింది ఆమె గాత్రం… 87 ఏళ్లు ఆమె వయస్సు ఇప్పుడు… ఆమె ఇండియన్ ఐడల్ షోకు వచ్చింది ఈవారం గెస్టుగా… నిజంగా ఇలాంటివాళ్లను పిలిచి, పాత స్మృతుల్లో పరవశిస్తేనే షోకు నిజమైన విలువ… షణ్ముఖప్రియ ఓ పాట పాడింది… తనకు అలవాటైన రీతిలోనే, తను ఎప్పుడూ అటెంప్ట్ చేసే ఓ పాప్ సాంగ్ పాడింది… […]
సుమన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు… నిజమేనా..? కేంద్రం ఇచ్చిందా..?!
ఒక్కసారిగా విస్మయం ఆవరించింది… దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లేదా పురస్కారం నటుడు సుమన్‌కు ప్రకటించడం ఏమిటి..? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ప్రకటనా రాకముందే ఫాల్కే మనమడు చంద్రశేఖర్ అవార్డును అందజేయడం ఏమిటి..? తెలుగు మెయిన్ మీడియా సైట్లు కూడా చకచకా రాసేసుకుని, చంకలు గుద్దుకోవడం ఏమిటి..? ఐనా ఈ సంవత్సరం రజినీకాంత్‌కు కదా దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించింది… మరి సుమన్ ఎలా వచ్చాడు మధ్యలోకి..? భారతీయ సినిమా పితామహుడిగా చెప్పుకునే దాదాసాహెబ్ ఫాల్కే […]
ఈ మొక్కలేమిటో… ఈ మొక్కులేమిటో… బాటపక్కన పడిగాపులేమిటో…
అధికార దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి, అహాల్ని సంతృప్తిపరుచుకోవడానికి ఇక వేరే మార్గాలే లేవా..? గతంలో ఉండేది ఓ పైత్యం… ప్రభువుల వారు వస్తున్నారంటే ఆ పరిధుల్లోని బళ్లను ఖాళీ చేసి, పిల్లలను దారికిరువైపులా నిలబెట్టి చేతులు ఊపించాలి… ఎండయినా, వానొచ్చినా బేఫికర్… పిల్లలకు అదొక నరకం… ఆ స్వాగతాల్ని అందుకునే మొహాలకు అదో ఆనందం… అయ్యో పాపం అనే సోయి కూడా ఉండదు… అలా ఉంటే రాజకీయ నాయకులు ఎలా అవుతారులే… ఇది కూడా అంతే… యాక్టింగ్ ప్రభువుల […]
ట్యూబు చూసి వండితే ఇక అయినట్టే..! సింపుల్‌గా ఇలా తేల్చేయండి ఈసారి..!!
నిజమే… ఓ మిత్రురాలు చెప్పినట్టు… ఎంతసేపూ ఆ క్షుద్ర రాజకీయాలేనా..? ఇక వేరే జీవితమే లేదా..? ఆఫ్టరాల్ పాలిటిక్సు గురించి ఎవడికి పట్టింది..? ఈ జనరేషన్ అయితే అస్సలు పట్టించుకోదు, పైగా ఏవగించుకుంటుంది… సరే, సరే…. జీవితంలోని పంచమహాపాతకాలు ఏమిటేమిటో గానీ… షష్టి లేదా సప్తమ పాతకం మాత్రం ఆహార వృథా… ఆకలి అంచనా లేకుండా ఎక్కువ తక్కువ వండేసి, మిగిల్చి, ప్రిజ్జులో పడేసి, తెల్లారాక దాన్ని ఏం చేయాలో అర్థం గాక డస్ట్ బిన్లో పడేసే […]
ఫాఫం… జగన్‌రెడ్డి క్యాంపు ట్రాపులో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ..! రాతలన్నీ అవే..!!
ఒకరు ఒక అబద్దాన్ని పదే పదే ప్రచారంలోకి తీసుకొస్తున్నాడంటే కొన్ని కారణాలుంటయ్… 1) విషయం తెలియకపోవడం 2) తెలిసీ వక్రమార్గం పట్టించడం 3) తెలిసీ తెలియని రీతిలో ప్రత్యర్థి శిబిరం ప్రభావానికి గురికావడం……… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పెద్ద ముదురు టెంక… తనకు విషయం తెలియదు అనలేం… అన్నీ తెలుస్తయ్… కానీ వాటిని తనకు అనుకూలంగా, తనకు అనువైన రీతిలో ప్రజల మెదళ్లను ట్యూన్ చేయగలను అనుకునే వెర్రి జ్ఞానం ఒకటి తను పీడిస్తున్నది… ఆ పోకడలో తాను […]
ఒరేయ్ యాదగిరీ… నీ పేరేమిట్రా..? ఫ్రైడే అంటే ఏవారమో అర్జెంటుగా చెప్పు…
కావచ్చు… మండల స్థాయిలోనో, జిల్లా స్థాయిలోనో… పంచాయతీ కార్యదర్శులను పరీక్షించడానికి ఉద్దేశించిన ప్రశ్నపత్రమే కావచ్చు… లేదా ప్రతి జిల్లాలోనూ విధిగా ప్రయోగిస్తున్న మరో చికాకు బాణమే కావచ్చు… లేదా ప్రజలకు ఏమేరకు గ్రామ విభిన్నాంశాలపై అవగాహన ఏర్పడిందో తెలుసుకునే ప్రయత్నమే కావచ్చు… ఒకవైపు సరిపడా నిధులుండవ్ గానీ బ్రహ్మాండమైన టార్గెట్లు పెట్టి… అసలే ఊళ్లల్లో ప్రతి పనికీ పంచాయతీ కార్యదర్శే బాధ్యుడు అన్నట్టుగా తరుముతున్నది ప్రభుత్వం… వాళ్లకిచ్చే జీతం తక్కువ… కొలువులకు గ్యారంటీ లేదు… ఖాళీగా ఉండలేక, […]
ఆమె ఓ రావణ పరిచారిక..! ఐతేనేం… దేవతను చేశాం, గుళ్లు కట్టి పూజిస్తున్నాం..!
రామాయణం అనగానే… రామాయణంలోని పాత్రలు గుర్తొస్తయ్ కదా… అందులో నరులు, వానరులు, రాక్షసులే కాదు… జటాయువు వంటి పక్షులు, జాంబవంతుడు వంటి ఎలుగుబంట్లు, చివరకు వంతెన కోసం రాళ్లెత్తిన కుందేలు… ఇలా చాలా జీవ జంతు పాత్రలు కూడా ఉన్నయ్… మళ్లీ ఆ నరుల్లోనూ కైకలు, మంథరలు… వానరుల్లో వాలి… రాక్షసుల్లో రావణాసురుడు, కుంభకర్ణుడు… హీరోలు, సైడ్ హీరోలు, హీరోయిన్లు, సైడ్ హీరోయిన్లు, విలన్లు, ఇతరత్రా పాత్రలు, అనేక తత్వాలు కూడా… చాలా కీలకపాత్రే అయినా పెద్దగా […]
మహేశ్ కత్తి..! నిజంగా ఈసడించుకోవాల్సిన కేరక్టరేనా..? ఎందుకు తను భిన్నం..?!
ఆనందయ్య ఇచ్చే మందుకు నేను మద్దతుదారు… వేలమంది నమ్మారు, లైన్లు కట్టారు… కానీ మహేష్ కత్తి బద్ద వ్యతిరేకి… పరంపరగా మనకు సంక్రమించిన అద్భుతమైన మూలికావైద్యాన్ని కొన్ని రోగాలకు సంబంధించి మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అనేదే నా నమ్మిక, నా భావన… అది ఆనందయ్య కావచ్చు, మరొకరు కావచ్చు… వ్యక్తులు కాదు ముఖ్యం… గుడ్డిగా ఎందుకు వ్యతిరేకించాలి అనేది నా కోణం… సాధారణంగా వేరేవాళ్ల పోస్టుల్లోకి జొరబడే తత్వం కాదు మహేశ్‌ది… కానీ ఆనందయ్య మందు పోస్టుల్లోకి […]
గ్రేట్ రవిబాబూ… ఇలా సినిమా తీయడం ఇంకెవరి వల్లా కాదు… నిజం…
ఎంత దరిద్రగొట్టు సినిమా అయినా సరే… ఎంత నేలబారు సినిమా అయినా సరే…… ఒక పాటో, ఒక మాటో, ఒక సీనో కాస్త బాగుంది అనిపిస్తుంది… ఎడిటింగో, నేపథ్యసంగీతమో, కెమెరాయో పర్లేదు అనిపిస్తుంది… ఫలానా సీన్లో కనిపించే ఆ పది మందిలో ఒకడి మొహంలో కాస్త ఎమోషన్స్ కనిపిస్తున్నాయి అనిపించవచ్చు… చివరకు టైటిల్స్ వేసే పద్ధతైనా వచ్చవచ్చు… అరె, శుభం అని వీడు భలే చమత్కారంగా వేశాడే అని కూడా అనిపించవచ్చు….. కానీ మచ్చుకు ఒక్కటంటే ఒక్కటీ […]
జగన్ పురస్కారం ఇస్తానన్నాడు… జర్నలిస్ట్ వద్దన్నాడు… భేషైన నిర్ణయం…
కనీసం జర్నలిస్టు సర్కిళ్లలోనైనా చిన్నపాటి డిబేట్ జరుగుతుందని ఆశిస్తే… అదీ నిరాశే అయ్యింది… జర్నలిస్టులకు సంబంధించిన అంశాలు తప్ప జర్నలిస్టుల గ్రూపుల్లో అన్నిరకాల చర్చలూ సాగుతున్నయ్… సోషల్ మీడియాలో, మీడియాలో సాగించే భజనలు జర్నలిస్టుల గ్రూపుల్లోనూ నడుస్తున్నయ్… అప్పుడప్పుడూ వృత్తికి సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నారా, మంచీచెడూ ముచ్చటించుకుంటున్నారా అంటే అదీ లేదు… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన జీవిత సాఫల్య పురస్కారాన్ని సీనియర్ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్ తిరస్కరించాడు… అదీ వార్త… ఆయన ఎంచుకునే వార్తాంశాలు, రచనశైలి మీద […]
ఈ కేంద్ర మంత్రి కథ మరీ డిఫరెంట్…! మాజీ ఐఏఎస్, జేడీయూ వారసుడు..?!
రాజకీయ నేపథ్యాలు లేని అశ్విన్ వైష్ణవ్, జైశంకర్‌లకు కేంద్ర మంత్రి పదవులు ఎలా వచ్చాయో… వాళ్లు రెగ్యులర్ పాలిటిక్స్‌కు ఎలా భిన్నమో… వాళ్ల మీద కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న ఆశలేమిటో మనం నిన్నా మొన్నా చెప్పుకున్నాం కదా… మంచో చెడో, ఫలితం ఏదైనా సరే, ఎంపికల వరకూ వోకే… డబుల్ వోకే… ఇప్పుడు మనం చెప్పుకోబోయే మరో కేంద్ర మంత్రిది మరీ మరీ భిన్నమైన కేసు… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓ పార్టీ అధినేత నీడకు కేంద్ర […]
ఇందిరకు నచ్చినా… విడుదలకు ససేమిరా..! అదీ మరి ‘‘గరం హవా’’..!!
Taadi Prakash…… ఎం.ఎస్.సత్యు ‘గరంహవా’ A LANDMARK POLITICAL FILM ————————————————– సరిగ్గా 46 సంవత్సరాల క్రితం 1974లో ‘గరంహవా’ (Scorching Wind) విడుదల అయింది. ’వేడిగాలి’ లేదా ‘వడగాడ్పు’ అనొచ్చు. కొందరు ఈ సినిమాని నిషేధించాలి అన్నారు. హిందూ ముస్లిం గొడవల్ని ఇంకా పెంచే ప్రమాదకరమైన సినిమా అని ఇంకొందరు అన్నారు. మనదేశంలో వచ్చిన గొప్ప రాజకీయ చిత్రం అన్నారు విమర్శకులు. దేశవిభజన తర్వాత పరిణామాలని యింత బాగా తెరకెక్కించడం అసాధారణం అన్నారు చాలామంది. ఉత్తర […]
జజ్జనకరి జనారే, టీవీ9 తోపురే…! రేటింగు లెక్కల్లో ఎప్పుడూ జిత్తులమారే…!!
జజ్జనకరి జనారే… డప్పు కొట్టుకుంటూ ఉండాలి… ఆ డప్పింగును బట్టే యాడ్స్ వస్తుంటయ్… కానీ నానా అవలక్షణాలు, ట్యాంపరింగు బాగోతాలు గట్రా ఉన్నా సరే, టీవీల రేటింగు తేల్చడానికి బార్క్ ఉంది… కానీ ఈ రేటింగ్ దందాలతో అది న్యూస్ చానెళ్ల రేటింగ్స్ మొత్తమే నిలిపేసింది… రిపబ్లిక్ టీవీ దగ్గర నుంచి బోలెడు టీవీ చానెళ్ల దందాల్ని తేల్చే పని ముంబై పోలీసులు చూసుకుంటున్నారు… అఫ్ కోర్స్, ముంబై పోలీసుల కేసులు అంటేనే మళ్లీ దందాలు, పొలిటికల్ […]
కేసీయార్ మోసకారే… కానీ ఆ మోసంలో భాగస్వామి ఎవరు..? నీ పాత్ర ఏమిటి..?!
షర్మిలకు ఒక సూటి ప్రశ్న…. నీ నాన్న రాజన్నరాజ్యం రాలేదు నిజమే… అది తెలంగాణలో మాత్రమేనా..? ఏపీలో కూడానా..? తెలంగాణలో పార్టీ పెట్టి, పాపం, తెలంగాణీయులు వాళ్ల బతుకులు వాళ్లు బతుకుతుంటే మళ్లీ ఎందుకు కెలుకుతున్నట్టు..? ఏపీలో అంతా బాగుందా..,? మరి ఒక్క మాట ఏపీలో రాజన్నరాజ్యం వచ్చేసింది, ఇక తెలంగాణలోనే నేను దాన్ని సాధిస్తాను అని చెప్పొచ్చుగా… అంతెందుకు..? జస్ట్, ఒక్క క్లారిటీ… సంగమేశ్వరం లిఫ్టు అక్రమమా.,.,? కాదా..? పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు అన్యాయమా కాదా..? […]
ఎస్.జైశంకర్..! నాన్-పొలిటికల్ మంత్రిగా ఈయనదీ విశిష్ట ఎంపికే..! చదవండి..!
రైల్వే, ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అశ్విన్ వైష్ణవ్ ప్రొఫైల్ నిన్న చెప్పుకున్నాం కదా… మాజీ ఐఏఎస్… రెగ్యులర్ పొలిటిషియన్ కాదు… వోట్లు సంపాదించలేడు… ఏ వర్గంలోనూ ఇమడలేడు… చెత్తా పాలిటిక్స్ చేతకావు… కానీ మోడీ తనను సెలెక్ట్ చేసుకున్నాడు, ఓ బృహత్తర బాధ్యతను ఇచ్చాడు… ఇది కదా మనం చెప్పుకున్నది…. అబ్బే, ఏడేళ్లలో ఈ ఒక్కడేనా కాస్త పనికొచ్చే నాన్-పొలిటికల్ ఎంపిక..? ఇన్నేళ్లలో ఇంకెవ్వరూ దొరకలేదా అని కొక్కిరించాడు ఓ మిత్రుడు… మరొకాయన ఉన్నాడు… […]
అశ్విన్ వైష్ణవ్..! ఈ కేంద్ర మంత్రిపై ఆసక్తికర చర్చ..! ఓ డిఫరెంట్ సక్సెస్ స్టోరీ..!
బాగా చదువుకున్నవాళ్లు రాజకీయ పదవుల్లో రాణించాలని ఏమీ లేదు… కానీ రాజకీయ పదవుల్లోకి బాగా చదువుకున్నవాళ్లు రావాలి… పారడాక్స్ ఏమీ కాదు… నిజమే… ఇప్పుడు ఈ చర్చ ఎందుకు నడుస్తున్నదంటే..? మోడీ కేబినెట్ మార్పుల తరువాత… మా మోడీ సర్కారులో ఇప్పుడు ఇంతమంది బాగా చదువుకున్నవాళ్లు ఉన్నారు తెలుసా..? ఇదీ మా కేబినెట్ క్వాలిటీ అంటూ కాషాయ సెక్షన్ సోషల్ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది… ఎస్, కాస్త చదువుకున్నవాళ్లు బాగానే కనిపిస్తున్నారు… కానీ చదువే అర్హత కాదు, ఇవేమీ […]
ఆ మంత్రిని ఎందుకు పీకేశారో..? అసలు ఈమెకు కొత్తగా ఎందుకిచ్చారబ్బా..!
సంప్రదాయ పాత్రికేయ కోణాన్ని వదిలేసి… వాస్తవ కోణాల్లోకి వెళ్దాం ఓసారి… అదుగో ఆ మంత్రిని అందుకే పీకేశారు, ఇదుగో ఈ మంత్రిని తీసేయడానికి కారణం ఇదే… కులాలు, ప్రాంతాలు, వయస్సు, చదువు, లింగం ఆధారంగా బోలెడు మీడియా విశ్లేషణలు వస్తున్నయ్… ఒక్కొక్క రాజకీయ విశ్లేషకుడు సందర్భం దొరికింది కదా మా పాండిత్య ప్రదర్శనకు అన్నట్టుగా రెచ్చిపోతున్నారు… టీవీల్లో డిబేట్లు సహజంగానే మోకాలి బుర్రలతో తెగ కొట్టేసుకుంటున్నయ్… వాస్తవం ఏమిటంటే..? మంత్రుల పనితీరుకూ, పన్నెండు మందిని కేబినెట్ నుంచి […]
అధ్వానపు ప్లానింగుకు అతి చక్కని ఉదాహరణ… యాదాద్రి పునర్నిర్మాణం…
ఓ పెద్ద సంకల్పాన్ని తీసుకున్నప్పుడు… దాన్ని సంపూర్ణం చేయడానికి… మంచి ప్రణాళిక కావాలి, సమర్థులైన టీం కావాలి, సరైన పర్యవేక్షణ కావాలి, సరిపోయే నిధులు కావాలి, లక్ష్యం ఏమిటనే స్పష్టత కావాలి, భావి అవసరాల మీద మంచి అంచనాలు కావాలి… అవేవీ లేకపోతే… దాన్నే యాదాద్రి పునర్నిర్మాణం అంటారు… ఈ నిర్మాణంలోని లోటుపాట్లు, ప్రణాళికారాహిత్యం కేసీయార్‌కే పరువుగండం అయిపోతోంది రాను రాను… అదుగో వచ్చే నెల సుదర్శనయాగం, ప్రారంభోత్సవం అంటారు, ఏమీ ఉండదు… కాదు, కాదు, ఫలానా […]
- « Previous Page
- 1
- …
- 381
- 382
- 383
- 384
- 385
- …
- 448
- Next Page »