ఇది సోషల్ మీడియా యుగం… సినిమాలు, సీరియళ్లు, ఓటీటీ కంటెంట్, టీవీ రియాలిటీ షోలు, పార్టీలు ఏది చెబితే అది గుడ్డిగా తలూపి ఆహా ఓహో అనడానికి జనం సిద్ధంగా లేరు… అన్నీ చర్చకు వస్తుంటయ్… బట్టలిప్పి బజారులో నిలబెట్టి ఆడుకుంటయ్… అఫ్కోర్స్, కొన్నిసార్లు అది ఎక్స్ట్రీమ్కు వెళ్లి దుర్వినియోగమవుతున్నా సరే, వ్యక్తులు తమ అభిప్రాయాల్ని వ్యక్తీకరించడానికి వేదికలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు… ప్రత్యేకించి బిగ్‌బాస్ వంటి టీవీ రియాలిటీ షోలు జనాన్ని మాయ చేయడానికి వోటింగు […]
అరె, ఏం రాస్తరయ్యా… ఇస్తం, ఎగ్గొడతమా… అసలే మాది నియ్యతి సర్కారు…
అరె, ఏందిర భయ్, ఈ రాతలు..? గుయ్యా గుయ్యా, ఒకటే ఒర్లుతరు… అవునుర భయ్, గా గల్వాన్ల అమరులైన జవాన్లకు పరిహారం ఇస్తమని మా సారు చెప్పిండు, చెప్పిండంటే చేసుడే, చేస్తడు, చేసి తీరతడు… తలకాయ కోసుకుంటడు కానీ మాటతప్పడు… ఆ సంతోష్ ఫ్యామిలీకి 5 కోట్లు ఇచ్చిండా లేదా..? ఆయన భార్యకు మంచి కొలువు ఇచ్చినమా లేదా..? మరి మిగతా 19 మందికి మాత్రం ఎగ్గొట్టిండు అని రాసుడేంది..? 17 నెలల నుంచీ సీఎం ఆఫీసు […]
బాలయ్య బలమైన కోరిక భేష్… కానీ తన చుట్టు మాయపొరల్ని ఛేదించగలడా..?
ఎందుకు చేయలేడు..? బాలయ్య మనసు పెడితే ఖచ్చితంగా చేయగలడు… శంకరాచార్య పాత్రను సమర్థంగా పోషించి, మెప్పించగలడు… మరీ ఆమధ్య తను సొంతంగా ‘‘శివశంకరీ శివానందలహరి’’ అనే పాట పాడి తెలుగు రాష్ట్రాల్ని కల్లోలితం చేసినట్టు గాకుండా… ఏ మంచి దర్శకుడో దొరికితే శంకరాచార్యుడిని కళ్ల ముందు ఆవిష్కరించగలడు… ఏం..? ఇంతకుముందు భైరవద్వీపంలో ఓ గూనివేషం గుర్తు లేదా..? కాకపోతే బాలయ్య మనసైతే మల్లి, లేకపోతే ఎల్లి టైపు… తను ముందుగా ఆ పాత్రను ప్రేమించాలి, జీవించాలి… ఇప్పుడు […]
ముందే చెప్పాను కదా… మల్లెమాల శ్యాంరెడ్డి సుధీర్‌కు గేటు చూపించేశాడు…
అదే కదా మరి… నేను చాలారోజులైంది కదా చెప్పి… ఈటీవీ ఢీ షో నుంచి సుధీర్ ఔట్… రష్మి ఔట్… దీపిక పిల్లి ఔట్… పూర్ణ ఔట్… అనే కదా చెప్పింది… అదే జరిగింది… బిగ్‌బాస్ గత సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్‌ను తీసుకొచ్చి, సుధీర్ ప్లేసులో పెట్టారు… హహహ… ఈటీవీ వాళ్ల బుర్రలకు నమోనమః… మల్లెమాల బుర్రలకు మహానమోనమః… నేను ముందు చెప్పిందే నిజం… మల్లెమాల డైరెక్టర్ల కొట్లాటలో చివరకు మునిగిపోబోయేది మల్లెమాలే… సరే, సుధీర్ […]
బిపిన్ రావత్ పెళ్లికార్డుకూ కత్రినా కైఫ్ పెళ్లిఫోటోకూ లింకేమిటి మహాశయా..?!
ఈ దేశ మహాసైనికాధికారి మరణం మీద తమ అజ్ఞానాన్ని వర్షిస్తూ, సెలబ్రేట్ చేసుకునే అనేకానేక అశుద్ధ జీవుల సోషల్ పోస్టుల్ని కాసేపు వదిలేయండి… పిశాచగణాల బెడద దేశానికి ఎప్పట్నుంచో ఉన్నదే… కానీ అదేసమయంలో కొన్ని వార్తలు, కొన్ని ఫోటోలు హఠాత్తుగా పుట్టుకొస్తయ్… ఆశ్చర్యపరుస్తయ్… సోషల్ పోస్టులు జడ్జిమెంట్లు చెప్పేస్తుంటయ్, వ్యక్తుల్ని జడ్జ్ చేస్తుంటయ్, సకల వ్యవస్థల్నీ దునుమాడుతుంటయ్, జనాన్ని ప్రభావితం చేస్తుంటయ్… ఇదొక మాయాప్రపంచం… నిన్న ఓ ఫోటో, పోస్ట్ బాగా సర్క్యులేటయింది… అదేమిటయ్యా అంటే… ‘‘ప్రజాతంత్ర […]
జర్నలిజానికే కీర్తిప్రభ… ఇలాంటి స్టోరీలు నభూతో నభవిష్యతి…!!
నిజం చెప్పాలి… ఎవరేం అనుకున్నా సరే… పాత్రికేయం ఏ ఉన్నత విలువలకు చేరుకుందో చూస్తుంటే ఒడలు గగుర్పొడుస్తోంది… పులకరించిపోతోంది… పరవశించిపోతోంది… అసలు ఆంధ్రప్రభ అనే పత్రికే లేకుండా పోతే తెలుగు జర్నలిజం మనుగడ, ప్రతిష్ట ఏమైపోయేవో అని ఆలోచిస్తేనే గుండె జల్లుమంటోంది… థాంక్ గాడ్… ఆ పత్రిక ఒకటి ఉంది కాబట్టి ఇంకా సగటు తెలుగు జర్నలిస్టు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాడు నేనూ జర్నలిస్టునే అని..! అ పత్రిక పాటించే ప్రమాణాలు, పాత్రికేయ విలువలు సరిగ్గా అర్థం చేసుకోవాలే […]
బురద పోరాటం..! దురద పోరాటం..! మళ్లీ ఆంధ్రజ్యోతి వర్సెస్ సాక్షి..!!
ఎల్లి మీద మల్లి పడె… మల్లి మీద ఎల్లి పడె….. ఎహె, పార్టీల గురించి, లీడర్ల గురించి, సోషల్ మీడియాలో యాక్టివిస్టుల గురించి కాదు…. మీడియా సంస్థల గురించి… వెలుగును నమస్తే తిడుతుంది… నమస్తేను వెలుగు ఆడిపోసుకుంటుంది… సాక్షిని జ్యోతి నిందిస్తుంది… జ్యోతిని సాక్షి ఉతికేస్తుంది… ఎన్టీవీని టీవీ5 అదిలిస్తుంది… టీవీ5కు ఎన్టీవీ ఝలక్కులిస్తుంటుంది… ఆయా సంస్థలు, ఓనర్ల ప్రయోజనాలు, పార్టీల అనుబంధాల ఆధారంగా పలు వార్తల మీద దుమ్మెత్తిపోసుకుంటాయి… మంచిదే, ఒకరి బట్టలు మరొకరు విప్పితేనే […]
నయీం డైరీస్..! ఇప్పుడిక అందరి దృష్టీ సాయిపల్లవి మీదకు మళ్లుతోంది..!!
నయీం..! పోలీసులే స్వయంగా ఓ విషపుమొక్కను పెంచి పోషిస్తే, అదెలా ఓ భూతాలచెట్టుగా మారుతుందో.., ఆ కొత్తరకం మాఫియా ఎంత అరాచకంగా ఉంటుందో చెప్పే పేరు అది… రాజ్యం పాలుపోసిన పాము, ఆ రాజ్యాన్నే ఎలా గుప్పిట్లో పెట్టుకుందో చెప్పే కేరక్టర్ అది… అధికారులు, వ్యాపారులు, నాయకులు ఎవరైతేనేం, అందరికీ వణుకు… తను ఏది చెబితే అదే చెలామణీ… ఇక మామూలు ప్రజల గురించి చెప్పేదేముంది..? చిన్నప్పటి నుంచీ తనది క్రిమినల్ నేచర్… క్రుయల్… తనను నక్సలైట్లు […]
ప్రపంచంలోకెల్లా ‘అత్యంత విలువైన’ కూరగాయ… జస్ట్, సొరకాయ..!
ఓ మిత్రుడి పోస్టు సొరకాయను (తెలంగాణలో అనపకాయ, ఆన్యపుకాయ) మించిన కాయ లేదు అని..! నిజమే, దాని ఇంపార్టెన్స్ తెలియదు చాలామందికి… ప్రత్యేకించి ఈ తరానికి..! ఎప్పుడూ ఎగుడు దిగుళ్లు లేని రేటు… కాస్త అటూఇటూ ఒకటే రేటు ఎప్పుడూ… మంచి ఆర్గానిక్… ఎరువులు అక్కర్లేదు, పెస్టిసైడ్లు అక్కర్లేదు… పంట దెబ్బతినడాలు, అకస్మాత్తుగా రేట్లు పడిపోవడాలు, పెరిగిపోవడాల్లేవ్… ఊళ్లల్లో చాలావరకూ ఇరుగూపొరుగు నడుమ ఉచితంగా పంపిణీ కాబడే స్నేహపు దినుసు… పట్టణాల్లో కష్టంలే గానీ, ఊళ్లల్లో, ప్రత్యేకించి […]
క్లీన్ మూవీ..! కథ బాగుంది… కథ మంద‘గమనమే’ కాస్త ఇబ్బంది..!!
కొన్ని అస్సలు మారవు… ఇళయరాజాను చూడండి, ఎన్నేళ్లయిందో ఫీల్డ్‌కు వచ్చి, ఎందరో పోటీదారులు వస్తున్నారు, పోతున్నారు… కానీ రాజా అంటే రాజాయే… ఈరోజుకూ అంతే… గమనం అనే సినిమా చూస్తున్నప్పుడు ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజికే కాదు, ఓ సిట్యుయేషన్ సాంగ్ కూడా… ఏమాత్రం తగ్గలేదు ఆయన… అసలు తన పోకడలోనే, అనగా స్వరప్రస్థానంలోనే ఓ భిన్నత్వం… ప్రత్యేకించి మెలొడీ… ఎమోషనల్ సీన్లలో వినిపించే సంగీతం… గమనం సినిమాకు వేరే రివ్యూ అవసరం లేదు నిజానికి, ఆ […]
గురితప్పి… దారితప్పి… ‘లక్ష్యం’ తప్పి… ప్రేక్షకుడి గుండెల్లో కసుక్కున దిగింది…
సినిమా వాళ్లకు ప్రేక్షకులంటే… వాళ్ల జ్ఞానమంటే పరమ అలుసు…. ఎందుకంటే, తామే గొప్పవాళ్లమనీ, తమకు అన్నీ తెలుసని, తామేం చెప్పినా ప్రేక్షకుడనే ఎడ్డి ఎదవ నమ్మేస్తాడనీ, చప్పట్లు కొట్టేసి, జేబులు ఖాళీ చేసేసి, తమ బొక్కసం నింపేస్తాడనీ ఓ పిచ్చి భరోసా… చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేసేది దిక్కుమాలిన మీడియా… నిజం… నిన్న నాగశౌర్య అనబడే ఓ కుర్ర హీరో ఏమన్నాడో తెలుసా..? ‘‘దేహంలో నీళ్లుంటే కండలు ఎక్స్పోజ్ కావు, అసలు ఎయిట్ ప్యాక్, అందుకే తొమ్మిది […]
తేజస్వి ఓ సిన్సియర్ లవర్..! చిన్ననాటి ప్రేమకు కట్టుబడ్డాడు, కట్టుకున్నాడు..!!
ఆ విక్కీ కౌశల్, కత్రినాల పెళ్లి వార్తలు పెద్ద ఆసక్తికరంగా ఏమీ లేవు… ఏముంది..? అట్టహాసం, ఆడంబరం, భారీ ఖర్చు, హంగామా, దుబారా, సాధారణ జనానికి ఇబ్బందులు… ఆఫ్టరాల్ ఓ హైప్రొఫైల్ పెళ్లి, అంతకుమించి ఏముంది..? కానీ అంతకుమించి మహాటట్టహాసంగా జరుగుతుందని అంచనా వేసిన మరో పెళ్లి మాత్రం చాలా లోప్రొఫైల్‌లో ఢిల్లీ సైనిక్ ఫామ్స్‌లో జరిగిపోయింది… వరుడు బీహార్ ప్రతిపక్ష నేత, లాలూ రాజకీయ వారసుడు, ఆర్జేడీ పార్టీ చక్రధారి తేజస్వి యాదవ్… వధువు రేచల్ […]
కోతిపని కాదండీ… కోతుల పనిపట్టే పని..! ప్చ్, అర్థం చేసుకోరెందుకో మరి..!!
వ్యవసాయాధికారులు పరేషన్ అయిపోతున్నారట… అరె, ఈమాత్రం పని చేతకాదా..? వాళ్లను రైతులకు వ్యవసాయ జ్ఞానం నేర్పించాలని ఏమైనా బాధ్యతలు ఇచ్చామా..? పంటల మార్పిడి వైపు పరుగులు పెట్టించామా..? ప్రత్యామ్నాయ పంటల మీద ప్రణాళికలు వేయమన్నామా..? అసలు మాకే వ్యవసాయం మీద ఓ పాలసీ లేదాయె, వాళ్లకు పనిచెప్పిందెక్కడ..? చేయించుకున్నదెక్కడ..? రాక రాక మాకూ ఓ ఆలోచన వచ్చింది… ఇలాగే గాలికి వదిలేస్తే ఫాఫం, వాళ్ల దేహాలూ జంగుపట్టిపోతాయని… యంత్రాలైనా సరే, అప్పుడప్పుడూ నడిపించాలి, లేకపోతే బ్యాటరీలు డౌనై, […]
చిచ్చు పెట్టిన ఆ పాత్రే సమంతకు అవార్డునూ తెచ్చిపెట్టింది..!
కొన్ని అంతే… ఐరనీ అనిపిస్తయ్… మరి లైఫ్ అంటే అంతే కదా… చైతూ సమంతల నడుమ చిచ్చు రాజుకోవడానికి కారణమైన ఓ పాత్ర ఆమెకు ఓ మంచి అవార్డును తెచ్చిపెట్టింది ఇప్పుడు… అదేనండీ, ఫ్యామిలీమ్యాన్ వెబ్ సీరిస్ తెలుసు కదా… అందులో డీగ్లామరస్‌గా, ఓ నల్ల విప్లవకారిణి పాత్ర పోషించింది కదా… అప్పటికే మనస్పర్థలు మొదలైన చైతూ సమంతల సంసారంలో ఆ పాత్ర, ఆ సీరిస్ షూటింగు కాస్త పెట్రోల్ పోసిందని అప్పట్లో వార్తలొచ్చినయ్… ఆమె మరీ […]
రీసెంటుగా ఇజ్జత్ పోగొట్టుకున్న తెలుగు టీవీ ‘రియాలిటీ’ కేరక్టర్లు..!!
సినిమాలు ఫ్లాప్ అవుతుంటయ్… సహజమే… టీవీ షోలు కూడా ఫ్లాప్ అవుతుంటయ్, అదీ సహజమే… కానీ రీసెంటుగా తెలుగు టీవీ ప్రోగ్రాముల్లో పాల్గొని పరువు పూర్తిగా పోగొట్టుకున్న వాళ్లెవరు అని అడిగాడు ఓ మిత్రుడు సరదాగా… క్లిష్టమైన ప్రశ్నే… సరదాగా అడిగినా సరే, ఇలా అడగ్గానే అలా చెప్పేయడం కుదరదు… ఎందుకంటే..? చెప్పడానికి బేస్ ఉండాలి… కనీసం బార్క్ రేటింగుల పరిశీలన ఉండాలి, జనం ఫీడ్ బ్యాక్ ఉండాలి… టీవీ సీరియళ్లు వదిలేద్దాం… ఒకటి తక్కువ కాదు, […]
అజాజ్ పటేల్… భేష్ బ్రదర్… నేల మీదే ఉన్నవ్, గాలిలో ఎగరడం లేదు…
కొన్ని ఇంటర్వ్యూలను, పత్రికా గోష్టుల్ని మనం ఇగ్నోర్ చేస్తాం… కానీ కొన్ని ప్రశంసించడానికి అర్హత కలిగి ఉంటయ్… నిజానికి పెద్ద విషయాలేమీ కావు, కొన్ని చిన్న అంశాలే వ్యక్తుల అసలు తత్వాల్ని పట్టిస్తయ్…. అజాజ్ పటేల్ మాటలు కూడా అంతే… ఎవరీయన అనడక్కండి… జిమ లేకర్, అనిల్ కుంబ్లే తరువాత ఒకే ఇన్నింగ్సులో పది వికెట్లు పడగొట్టిన బాహుబలి… అది మామూలు ఫీట్ కాదు… అదే ఇండియన్ ప్లేయర్ అయితే ధూంధాం కవరేజీ చెలరేగిపోయేది… అరెరె, తను […]
సమంత ఐటమ్ సాంగ్… మంగ్లీ చెల్లెలి వాయిస్… కొత్త గొంతులకై వెతుకులాట…
దర్శకుడు సుకుమార్ షేర్ చేసుకున్న ఫోటో ఒకటి కనిపించింది… అది అసలే బన్నీ సినిమా పుష్పకు సంబంధించింది… ప్రస్తుతం విపరీతమైన హైప్ క్రియేటవుతోంది కదా ఆ సినిమా మీద… పైగా సమంత ఓ ఐటమ్ సాంగ్ చేస్తోంది… (విడాకులయ్యాక ఆమె స్వేచ్ఛ ఆమెకు మళ్లీ లభించింది…) అసలు సమంత సాంగ్ అంటే అదో హైప్… ఆ పాట ఏమిటంటే… అ అంటావా, అ ఆ అంటావా… పదో తారీఖు లిరికల్ వీడియో రిలీజ్ చేస్తాం అని దర్శకుడు […]
వావ్..! ఇది సాక్షేనా..? నిజమేనా..? తెలంగాణ ‘వరిగోస’పై గ్రౌండ్ రిపోర్ట్..!!
హఠాత్తుగా చూస్తే… ఇది సాక్షి పత్రికేనా అనిపించింది..! ఫస్ట్ పేజీలో బ్యానర్‌గా రైతుల కష్టాల గురించిన గ్రౌండ్ రిపోర్ట్… అదీ ప్రస్తుతం తెలంగాణ రైతాంగాన్ని అరిగోస పెడుతున్న ప్రభుత్వ వైఫల్యం గురించి..! అరె, ఏమిటిది..? పొరపాటున ఇంకేదో పత్రిక చూశామా అనిపించింది… కొన్నేళ్లుగా అది నమస్తే సాక్షి అనిపించుకుంటోంది కదా… కాదు, అంతకుమించి..! అవసరమైతే జగన్ మీద నాలుగు రాళ్లు పడ్డా సరే గానీ మా కేసీయార్ మీద మాత్రం ఈగ కూడా వాలడానికి వీల్లేదు అన్నంతగా […]
దటీజ్ బిపిన్ రావత్..! కీలక మిలిటరీ ఆపరేషన్ల వెనుక సూత్రధారి..!
2015… జూన్… 72 మంది కమాండోలు… ధ్రువ్ హెలికాప్టర్లను ఎక్కారు… ఎంఐ ఛాపర్లను స్టాండ్‌బైగా ఉంచారు… అత్యాధునిక ఆయుధాలు… రాకెెట్ లాంచర్లు, నైట్ విజన్ గ్గాసెస్, గ్రెనేడ్లు… బర్మా సరిహద్దులు దాటాయి… రెండు గ్రూపులుగా విడిపోయారు… మళ్లీ రెండేసి సబ్ గ్రూపులు… నాగాలాండ్ దాటాక ఒక ఉగ్రవాద శిబిరం… మణిపూర్ దాటాక మరొకటి… చైనా మద్దతు ఉన్నట్టు చెప్పబడే ఎన్ఎస్సిఎన్-కే ఉగ్రవాదులు ఒకచోట… కేవైకేఎల్ ఉగ్రవాదులు మరోచోట… శిబిరాల్లోని ఉగ్రవాదులు తేరుకుని ఆయుధాలు పట్టుకునేలోపు… జస్ట్, 40 […]
తరాలుగా ఆ కుటుంబం దేశరక్షణలోనే..! అసలు ఎవరు ఈ బిపిన్ రావత్..?
ఎవరు ఈ బిపిన్ రావత్..? దేశమంతా జనం సెర్చ్ చేస్తున్న ప్రశ్న..! ఆయన తన కుటుంబసభ్యులతో, వ్యక్తిగత సిబ్బందితో ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ కూనూరు అడవుల్లో కూలిపోవడం, ప్రమాదతీవ్రత దృష్ట్యా అందులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది… కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమై ఈ ప్రమాదంపై సమీక్షించింది… బిపిన్ సతీమణి మధూలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది… రావత్‌ను మరింత మెరుగైన చికిత్స కోసం తరలించారు… ఈ వార్త రాసే సమయానికి ఛాపర్లో ఉన్న పద్నాలుగు […]
- « Previous Page
- 1
- …
- 386
- 387
- 388
- 389
- 390
- …
- 482
- Next Page »