Sankar G……….. మొట్టమొదటి సారి తారకరామ ధియేటర్ (కాచిగూడ) వెళ్ళాను. ఆసియన్ వారు బ్రహ్మాండంగా పునర్నినిర్మించారు. సీటింగ్ అద్భుతంగా విశాలంగా అమార్చారు. RC సీటింగ్ ఏర్పాటు చేశారు. కాళ్ళు బార్లాచాపుకుని సినిమా చూడొచ్చు. సినిమా దసరా… ఈ దర్శకుడికి ఇదే మొదటి సినిమా అట. అంతకుముందు సుకుమార్ దగ్గర అసోసియేట్ గా చేశాడు అని చెబుతున్నారు. సినిమాలో ఆ మేకింగ్ స్టయిల్ కనపడింది. కానీ సినిమాయే చెత్తగా అనిపించింది. దానికి కారణాలు… మొదటి సీన్ లోనే బాలనాని అమ్మమ్మ కోసం […]
ఔను నిజమే… చైతూ మీద కోపంతో ఆ ఐటమ్ సాంగ్ కసిగాకసిగా చేసినట్టుంది…
ఏదో టీవీలో మాట్లాడుతూ సినిమా నటి సమంత… తన విడాకులకు ఒకటీరెండు కారణాలను ప్రస్తావిస్తోంది… ఊ అంటావా ఊఊ అంటావా సినిమా పాట చేస్తానంటే వద్దన్నారనీ, ఇంట్లో కూర్చోమన్నారనీ ఆరోపిస్తోంది ఇప్పుడు… ఇదొక డిబేట్… పెళ్లికి ముందు చైతూ ఆమెను సినిమాలు మానేయాలని చెప్పాడా..? లేక నీ ఇష్టం అన్నాడా..? ఒకవేళ చేసినా సరే, అక్కినేని కుటుంబం అనే ఓ ట్యాగ్‌ను దృష్టిలో పెట్టుకుని, గౌరవప్రదమైన పాత్రలు మాత్రమే చేయాలని ఆ కుటుంబం ఆశపడిందా..? సినిమా రంగంలో […]
రాజమండ్రి టు భద్రాచలం… గోదావరి మీద లాంచీ ప్రయాణం జ్ఞాపకాలు…
ట్రావెలాగ్ రాయాలంటే ముందుగా ఆ అనుభూతిని మనసు నిండా నింపుకుని, తాపీగా అక్షరబద్ధం చేయాలి… అప్పుడే అందులో లైఫ్ ఉంటుంది… మన ఫీలింగ్స్‌ను షేర్ చేసుకోవడానికి ఇప్పుడు సోషల్ మీడియా ఉంది… మది నిండా అల్లిబిల్లిగా కదలాడే అనుభూతుల్ని కాస్త క్రమపద్ధతిలో రాస్తూ పోతే… ఇదుగో ఇలాంటి పోస్ట్ అవుతుంది… గోదావరి ప్రయాణాలు అనుభవమున్నవాళ్లు కనెక్టవుతారు… ఓ మిత్రుడు 1988లో రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లిన లాంచీ ప్రయాణం కథాకమామిషు ఇదుగో… యథాతథంగా… Mallareddy Desireddy….. ” గోదారమ్మ […]
అమెరికాకు గగనంలో చుక్కలు చూపిస్తున్న చైనా… వరుసగా స్పై ప్లేన్ల కూల్చివేత…!!
పార్ధసారధి పోట్లూరి …… (భారత్ –రష్యా – చైనా కూటమి ! పార్ట్ -02) న్యూయార్క్ కి చెందిన హిండెన్‌బర్గ్ ట్వీట్ చేసింది : మేము మరొక సంచలన విషయం బయటపెట్టబోతున్నాము భారత్ దేశపు సంస్థ గురుంచి అంటూ! ఇది ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నది అమెరికా భారత దేశానికి ? భారత్,రష్యా,చైనా లు కలిసి పనిచేయబోతున్నాయా అనే ప్రశ్నకి ఇక్కడ సమాధానం దొరుకుతుంది! లడాక్ మరియు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర చైనా తన దళాలని భారీగా మోహరించింది […]
గీత దాటిన గీతామాధురి… హఠాత్తుగా ఏ వైరస్ తాకిందో, వెకిలి డ్రెస్సుతో ప్రత్యక్షం…
హఠాత్తుగా ఏ వైరస్ మెదడును అటాక్ చేసి, విచక్షణను దెబ్బతీస్తుందో తెలియదు… మేం హోస్ట్ చేస్తున్నది లేదా జడ్జిగా ఉన్నది మ్యూజిక్ షో అనే సోయి కూడా అకస్మాత్తుగా మాయమైపోతుంది కొందరికి… ఆమధ్య శ్రీముఖి డ్రెస్సింగు గురించి, అనసూయ దుస్తుల గురించి మనం చెప్పుకున్నాం… ఆ సిరివెన్నెల ఏ క్షణాన రాశాడో గానీ… నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు… అని… ఇక కాళ్లు, ఆపైన తొడల దాకా చూపించుకునే ఆత్రం, తాపత్రయం బాగా […]
సల్మాన్ సినిమాలో బతుకమ్మ ఖూనీ… మధ్యలో ఈ గొబ్బెమ్మలెందుకు వచ్చాయర్రా…
పాన్ ఇండియా సినిమాకు, ప్రత్యేకించి హిందీ సినిమాకు సౌత్ పాటలు, సౌత్ మార్కెట్ కావాలి… లేకపోతే ఎవడూ దేకడం లేదు ఇప్పుడు…! అందులోనూ తెలుగు మార్కెట్ పెద్దది, రెండు రాష్ట్రాల్లో విస్తరించిన ప్రేక్షక సమూహాలు… అది కావాలి… ఆ డబ్బు కావాలి… అందుకే హిందీ సినిమాకు తెలుగు పాట కావాలి, తెలుగుదనం కావాలి… తెలుగు పాటకు తెలంగాణతనం కావాలి… తెలంగాణ జోష్ కావాలి… ఇదీ ఈక్వేషన్… చిరంజీవి వంటి బడా హీరోలు సైతం హిందీ మార్కెట్ కోసం […]
ఆహా… అల్లు వారి కొత్త దినపత్రిక త్వరలో… ఏకంగా డమ్మీలే ప్రత్యక్షం…
పొద్దున్నే ఓ ఆశ్చర్యం… అల్లు అరవింద్ ఓ దినపత్రికను స్టార్ట్ చేయబోతున్నాడని…! నిజానికి బయటి వ్యక్తులెవరో చేస్తున్న ప్రచారం కాదు, ఆహా వాళ్లు ఫేస్ బుక్ వాల్ మీద కనిపించింది… వావ్, ఒక్కో దినపత్రిక మూతపడుతూ, నడుస్తున్నవేమో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉన్న దుస్థితిలో ఒక కొత్త దినపత్రిక వస్తుందనే ఊహ విస్మయాన్ని కలిగించింది… అసలు ఆహా ఫేస్ బుక్ పేజీలో దాని డిస్క్రిప్షనే బ్రాడ్ కాస్టింగ్ అండ్ మీడియా కంపెనీ అని రాసి ఉంటుంది… వాళ్ల పోస్ట్‌లో […]
రోజుల శిశువుకు ఉప్మా తినిపించిందట… నోరుజారింది, పట్టుబడిపోయింది…
బెంగుళూరు… మగది రోడ్ దగ్గరలోని బిన్నీ మిల్ ఏరియా… నలభయ్యేళ్ల హేమావతి తన కొడుకుతో ఎటో వెళ్తోంది… కంఠీరవ క్రాంతివీర సంగోలి రాయన్న మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఓ గుంపును దాటేటప్పుడు ఓ శిశువును ఎత్తుకున్న ఓ మహిళ కనిపించింది… మరీ రోజులనాటి పసి శిశువులా కనిపిస్తోంది… గుక్క పెట్టి ఏడుస్తోంది… శిశువును ఎత్తుకున్న మహిళకు ఊరడించడం చేతకావడం లేదు… హేమవతిలో అనుమానం మొలకెత్తింది… ఏదో కృత్రిమత్వం, అసహజత్వం కనిపిస్తోంది… ఆమె కూడా ఓ తల్లి కదా… […]







