కేవలం యాంకర్ల పేరుతో షోలు, హీరోలతో సినిమాలు నడవవు… పెద్ద పెద్ద హీరోల సినిమాలు మొదటి ఆటకే తన్నేసిన ఉదాహరణలు బోలెడు… వంట కుదరాలి… అప్పుడు హిట్టో ఫ్లాపో తేలేది… మా అభిమాన హీరో ఉన్నాడు కదాని ‘ఉప్పూకారం లేని బిర్యానీ’ ఎవడూ తినడు… టీవీ షోలు కూడా అంతే… షోలో దమ్ముండాలి… అంతే తప్ప, మా అభిమాన సుమ చేస్తున్నది కాబట్టి బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ అనే షో చూస్తాం, మా అభిమాన ప్రదీప్ చేస్తున్నాడు […]
జై కేసీయార్, జై కేటీయార్, జై కవిత, జై హరీష్, జై సంతోష్, జై హిమాంశ్, జై దయన్నా..!
అన్నా… దయన్నా… గివేం మాటలే… గిట్ల మాట్లాడితే ఎట్లా..? గింత ఘనం సీనియారిటీ ఒచ్చినా ఇంకా గట్లనే ఏందేందో మాట్లాడతనే ఉంటవ్… గిప్పుడు మీ కార్యకర్తలకు కొత్త కొత్త పరీక్షలు పెడితే ఎట్లనే అన్నా..? మంత్రులు తప్పకుంట యాంటీ-బీజేపీ, నాన్-మోడీ, యాంటీ-అయోధ్య, ప్రొ-మజ్లిస్, వీరసెక్యులర్ ప్లస్ మైఫ్యామిలీ టచ్ ఉండేటట్టు మాత్రమే మాట్లాడాలె అని నీ చెవిలో చెప్పిండా కేసీయార్..? మరి గిట్లెందుకు..? జైభారత్- జైశ్రీరాం అని నినాదాలు చేస్తే నీకూ ఇష్టమే గనీ జై కేసీయార్ […]
ఇరిటేట్ చేద్దాం… కడిగి పారేద్దాం..! నిమ్మగడ్డపై వైసీపీ కొత్త స్ట్రాటజీ..!
నిమ్మగడ్డతో సాగిస్తున్న పోరాటంలో ఒకేసారి చేతులెత్తేయలేక… ఓటమిని అంగీకరించలేక… ఇక పూర్తిగా యుద్ధాన్ని నిమ్మగడ్డకు వదిలేయలేక… జగన్ ప్రభుత్వం, పార్టీ ఓ స్ట్రాటజిక్ గేమ్ స్టార్ట్ చేసింది… అది బహుముఖం… చిన్న చిన్న విషయాలపై నిమ్మగడ్డ చూపించే ఆధిపత్య భావనల్ని సీరియస్‌గా పట్టించుకోవద్దు… అందుకే ద్వివేదీని, గిరిజాశంకర్‌లను మార్చమంటావా..? వోకే… మార్చేస్తాం… ఎన్నికలయ్యాక అవే సీట్లలో కూర్చోబెడతాం, పర్లేదు… అభిశంసిస్తావా..? అడ్డుకుంటాం… నీకు ఆ అధికారమెక్కడిదీ అనడుగుతాం… కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం, బదనాం చేస్తాం… మా ఐఏఎస్‌లకు […]
దటీజ్ ఎస్వీఆర్..! ఎవరైనా సరే… సర్ఫ్ లేకుండానే కడిగేసేవాడు…
……… By…. Bharadwaja Rangavajhala……………… సినీరంగంలో ఎస్వీఆర్ ఓ ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనకి ప్రధమకోపం … తనకు అనిపించినదేదో మాట్లాడేస్తారు తప్ప మనసులో ఒకటీ బైటకి ఇంకోటీ రకం కాదు. ఎవర్నైనా తిట్టాలనుకున్నా పొగడాలనుకున్నా … అది ముఖం మీదే తప్ప పరోక్షంగా కాదు. ఆయనతో ఏం చెప్పాలన్నా … చాలా జాగ్రత్తగా ఎలా చెప్తే వింటారో అలానే చెప్పి కన్విన్స్ చేసేవారు ఇండస్ట్రీ పెద్దలు. భక్త ప్రహ్లాద లో క్లైమాక్స్ రీషూట్ చేయాలనుకున్నప్పుడు … నిర్మాతలు డి.వి.నరసరాజుగారిని […]
తనను చూడడానికి విరగబడేవాళ్లను చూస్తూ షకీలా ఎందుకేడ్చింది..?
…….. By….. Gottimukkala Kamalakar………………… వర్మ శ్రద్ధగా చదివి, ఫెళ్లుమని నవ్విన పచ్చి జ్ఞాపకం అలాగే ఉంది… రెండేళ్ల క్రితం నాటి పోస్టు ఇది…. కళారంగంలోకి వచ్చిన, రావాలనుకుంటున్న ఏ మహిళకైనా మగపురుషపుంగవుల నుండి అసంఖ్యాకంగా అభ్యర్ధనలూ; వేడుకోళ్లూ; బెదిరింపులూ; ప్రలోభాలూ రాజకీయ నాయకుల వాగ్దానాలకు మించి వస్తూనే ఉంటాయి. మియా మల్కోవా అందుకు మినహాయింపేం కాదు. ఆమెని శారీరకంగా వాడుకుని, అమ్ముకుని తన వాటా న్యాయంగా పంచిన శృంగార పరిశ్రమ నిజాయితీ ముందు; ఆమె అంతరంగాన్ని […]
ఆరుగురు జడ్జిలు + ఓ చీఫ్ జస్టిస్… భీకర పర్ఫామెన్స్… రేటింగ్‌లో మాత్రం ఫట్..!!
హేమయ్యా… హోంఖారూ… హన్ని టీవీ షోలు చేసినవ్… ఖర్చు కాదు, ఒక టీవీ షో క్లిక్ కావాలంటే కాస్త క్రియేటివిటీ, కొత్తదనం, కమిట్మెంటు కనిపించాలి ఖదటోయ్… హేమో, నువ్వు బొచ్చెడు ఆశలు పెట్టుకున్న డాన్స్ ప్లస్ అనబడే టీవీ షో అడ్డంగా తన్నేసిందేమిటి..? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నావా..? అదేదో షోలో ‘వన్ సెకండ్’ అంటూ విచిత్రమైన స్టోన్‌తో ట్విస్టులు ఇచ్చేవాడివి కదా… జనం కూడా ఈ డాన్స్ ప్లస్ షో కనిపించగానే… ‘వన్ సెకండ్’ అంటూ […]
ఆచార్యా.., తమరు ఏ పాత్ర తీసుకున్నా సరే.., బీభత్సమేనా..?!
టీజర్, ట్రెయిలర్… ఏ పేరయితేనేం… టీవీ ప్రోగ్రాముకు ప్రొమోలాగా… అవేమీ ‘ఉడికిన మెతుకులు’ కావు అన్నం మొత్తాన్నీ అంచనా వేయడానికి… జస్ట్, అవి ఇంట్రడక్షన్స్… సినిమా లైన్‌ను లీలగా చెప్పే సూచికలు… అంతే… రాంగోపాలవర్మ ట్రెయిలర్లు వేరు, అవి సినిమాను సగం చూపిస్తయ్… అసలు సినిమా చూడకపోయినా పర్లేదు, కాదు, చూడనక్కర్లేదు… చూడొద్దు కూడా… అవి ట్రెయిలర్ల కాన్సెప్టు, స్పిరిట్‌కే రివర్స్ ఫార్ములా అన్నమాట… ఇప్పుడు చిరంజీవి కొత్త సినిమా ఆచార్య టీజర్ రిలీజ్ చేశారు… ఇంతటి […]
ప్రదీపే పెద్ద మైనస్..! మరో బుడగ ఫట్‌మని పేలిపోయింది… ఊహించినట్టే..!!
ప్రదీప్ నటనకు సంబంధించి చాలామందికి ముందే ఒక అంచనా ఉంది… కానీ శుభం పలకరా అంటే ఇంకేదో అన్నట్టుగా అమంగళం వద్దు అని ఎవరూ ఎక్స్‌ప్రెస్ చేయలేదు… చేయకూడదు కూడా… కాకపోతే ఎప్పుడో ఓసారి తప్పదుకదా… సినిమా విడుదల కాగానే, అసలు రంగు బయటపడక తప్పదు కదా… దాంతో ఆ బుడగ పేలిపోయింది… 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాకు ప్రదీప్ ప్లస్ కాదు, తనే పెద్ద మైనస్ అని తేలిపోయింది… ఇక్కడ రెండు మూడు […]
వాహనాల ఇన్సూరెన్స్ దెబ్బకు బతుకు జట్కా బండి..!
“ధారయతీతి ధర్మః” అని ధరించేదే ధర్మం అని వ్యుత్పత్తి అర్థం. అంటే పాటించేదే ధర్మం కానీ- చెప్పి చేయకుండా ఉండేది ధర్మం కాదని పిండితార్థం. ధర్మం కృతయుగంలో నాలుగు పాదాలతో; త్రేతాయుగంలో మూడు పాదాలతో; ద్వాపరలో రెండు పాదాలతో; ప్రస్తుత కలిలో ఒకే ఒక్క పాదంతో కుంటుతూ నడుస్తుంటుందని కొందరు గుండెలు బాదుకుంటూ ఉంటారు. చెప్పుల్లేనివాడు కాలే లేని వాడిని చూసి సంతోషంగా బతకాలని మానసిక వ్యక్తిత్వ వికాస శాస్త్ర ఆదేశం. కలిలో ఒక కాలితో కుంటుతూ […]
చివరకు కాశీకి వెళ్లినా ఆ పడికట్టు పదాలేనా కవితమ్మా..!!
ఏ పూజకైనా సరే… సంకల్పం స్థిరంగా, సూటిగా ఉండాలి… ఏ ఫలితం కోసం ఆ పూజ చేయబడిందో, ఆ ఫలితాన్నే ఆశించేలా దృష్టి కేంద్రీకృతమై ఉండాలి, ఆ సంకల్పాన్ని పక్కదోవ పట్టించే మాటలు, చేష్టలు ఉండకూడదు… అలా చేస్తే పూజాఫలమే సిద్ధించదు……….. అప్పుడప్పుడూ పురోహితులు చెప్పే మాటలివి… ఇవెందుకు గుర్తొచ్చాయంటే… ఓ వార్త చదివాక..! సీఎం కేసీయార్ కుటుంబం కాశికి పోయి, గంగకు హారతి ఇచ్చి, దేవుడిని ప్రార్థించింది అనేది ఆ వార్త… ‘‘ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని […]
మనవి ‘లిమిటెడ్ కంపెనీలు’ కూడా కావు… అవిభక్త కుటుంబ పార్టీలు…
‘‘ప్చ్, ప్రస్తుతం నేను లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నట్టుగా ఉంది…’’ అంటున్నాడు రసమయి… అసలే లిమిటెడ్ కంపెనీ కదా, ఉన్న షేర్లు కూడా లాగేసుకుంటారేమోనని సందేహపడి, అబ్బెబ్బే నా మాటల్ని వక్రీకరించారుపో అనేశాడు… రాజకీయాల్లో ఇవన్నీ కామనే కదా… అవును గానీ… ఈ లిమిటెడ్ కంపెనీ అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీయా..? ప్రైవేటు లిమిటెడ్ కంపెనీయా..? బాలకిషన్ ఈ లిమిటెడ్ కంపెనీని మరీ అన్-లిమిటెడ్ కంపెనీగా మార్చకపోతే కష్టం అంటున్నాడా..? అంటే ఏ కట్టుబాట్లూ లేని అపరిమిత స్వేచ్ఛ, […]
వేటూరి కలం… అన్నివైపులా పదునున్న సుదర్శనం..!
Gottimukkala Kamalakar……………………….. పాతదే, కొత్తగా ఏం చెప్పలేక..! **** ఇవాళ సుందరరాముడి స్మరణలో అందరి మనస్సులలో వేటూరి పాటూరిపోతోంది. సినీ గీత ప్రేమికులు సాహిత్యదీప నివాళులను సమర్పిస్తున్నారు. రామాయణంలో రామరావణ యుద్ధాన్ని పోల్చడానికి వాల్మీకికి భాష దొరకలేదో, సరిపోలేదో…? అందుకే సాగరం సాగరంలా; ఆకాశం ఆకాశంలా; రామరావణ యుద్ధం రామరావణ యుద్ధంలా ఉంటుదని తేల్చేసి అద్భుతంగా పోలుస్తాడు. నా బోటి అల్పజ్ఞానులకు దిక్సూచి అవుతాడు. అందుకే…. వేటూరి పాట వేటూరి పాటలా ఉంటుంది…! పాటలన్నీ గుర్తు చేయడానికి […]
రాజదీప్ సర్దేశాయ్పై ఇండియాటుడే ఫైర్… ఇదొక ఇంట్రస్టింగ్ లెసన్…
నిజానికి ఇది చాలా కోణాల్లో ఇంట్రస్టింగు వార్త… ఓ పెద్ద సీనియర్ జర్నలిస్టు, చాలాచాలా కీలకమైన పొజిషన్లలో పనిచేసి… ఓ తప్పుడు ట్వీట్ వదిలినందుకు, నిర్ధారించుకోకుండా జనంలోకి ఓ తప్పుడు వార్తను పంపించినందుకు ఓ అవమానకరమైన శిక్షకు గురికావడం..! విషయం ఏమిటంటే..? (ది వైర్ వెబ్సైట్ ట్వీట్ ప్రకారం)… రాజ్‌దీప్ సర్దేశాయ్ తెలుసు కదా… దేశ ప్రముఖ జర్నలిస్టుల్లో తనూ ఒకడు… కాస్త దూకుడు ఎక్కువ… యాంటీ బీజేపీ జర్నలిస్టు… ఆయన భార్య సాగరిక ఘోష్ అయితే […]
స్కిన్‌టుస్కిన్..! సేమ్ కోర్ట్… సేమ్ పోక్సో… సేమ్ జడ్జి… సేమ్ తీర్పు…
‘‘స్కిన్‌టుస్కిన్’’ అనే బాంబే హైకోర్టు తీర్పు మీద దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది తెలుసు కదా… నేరుగా దేహాన్ని తాకకుండా ఆడపిల్లల లైంగిక సంబంధ శరీరభాగాలను పట్టుకున్నా, ఏం చేసినా అది పోక్సో పరిధిలోకి రాదు అనే అర్థమొచ్చేలా ఆ తీర్పు ఉంది… ఈ తీర్పు మొత్తం పోక్సో చట్టం స్పూర్తికే విరుద్ధంగా ఉందనీ, ఇదొక తప్పు ఆనవాయితీకి దారితీస్తుందనీ చెప్పిన అటార్నీ జనరల్ అభిప్రాయంతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఆ తీర్పుపై స్టే ఇచ్చింది… ఆ మహిళా జడ్జే […]
ఆహా మోడీజీ… సూపర్… ఏమైనా విజయోత్సవాలు ప్లాన్ చేద్దామా సార్..?
అప్పట్లో కేసీయార్ అనేవాడు… ఈ మోడీకి ప్రజలతో కనెక్ట్ కావడం తెలియదు అని..! ఆఁ చెప్పొచ్చాడులే, తను జనంతో పెద్ద కనెక్ట్ అయినట్టు, తనూ తన మాటలు అని ఆక్షేపించకండి… మోడీకి జనాన్ని ప్రేమించడం తెలియదు… సగటు పేద, మధ్యతరగతి మీద భారం తగ్గించడానికి ఏం చేయాలి అనే కోణంలో ఏమీ ఆలోచించడు… అవసరమైతే మళ్లీ నోట్ల రద్దు వంటి నిర్ణయాలతో ఆర్థికవ్యవస్థను ఒక్క పోటు పొడిచేయగలడు… నాది తప్పయితే నన్ను ఉరితీయండి అంటూనే జనం జేబులు […]
ఆహా… బీజేపీకి స్టార్ లీడర్లు భలే దొరికారు బాసూ.,. ఈమె మరీ అల్టిమేట్…
నిజంగా జనంలోకి వెళ్లి, పార్టీకి కొత్త జవసత్వాల్ని తీసుకొచ్చే ఒక్క నాయకుడూ బీజేపీ వైపు రావడం లేదు… ఏపీ, తెలంగాణ, తమిళనాడు… ఎట్ లీస్ట్, ఈ మూడు రాష్ట్రాల్లో ఓసారి చూద్దాం…! బలం, బలగం కలిగి రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఓ ఊపు తీసుకొచ్చేవాళ్లు బీజేపీ మీద ఆసక్తి చూపడం లేదా…? ఆల్రెడీ పాతుకుపోయినవాళ్లు రానివ్వడం లేదా..? సరే, వాటిని వదిలేస్తే విజయశాంతి, ఖుష్బూ, జీవిత, యామిని… ఇలాంటోళ్లేనా చివరకు బీజేపికి దిక్కు..? ఫాఫం..! అసలే జనసేనతో పొత్తులు, […]
ఇక ప్రతి గొర్రెకూ డైపర్ కట్టాల్సిందేనా సార్..? మరేం చావమంటారు..?!
Srinivas Sarla………………. నిన్న ఒక సెక్రటరీ ఆవేదన విన్న తరువాత నౌకరి చేయాలంటేనే భయంగా ఉంది.. ప్రతి నెల స్టేట్ నుండి స్పెషల్ ఆఫీసర్లు విలేజ్ లు పర్యటించి శానిటేషన్ పనులు చూసి మార్కులు వేస్తారు.. అందులో భాగంగా నిన్న ఒక ఊరికి స్పెషల్ స్క్వాడ్ వచ్చింది… పాపం, అక్కడ సెక్రటరీ సిబ్బందికి చెప్పి, పొద్దున 7 గంటలకు ఆ రోజు ఆన్ లైన్ లో వచ్చిన ఆ ఊరి ఇంటర్నల్ రోడ్డు సార్టింగ్ పాయింట్ ఎండింగ్ […]
ఈ మేనిఫెస్టో చదివితే… బాబుపై మళ్లీ మళ్లీ జాలేస్తోంది నిజంగానే..!
పేరుకు పంచాయతీ ఎన్నికలు పార్టీరహితమే అయినా… పార్టీపరంగానే జరుగుతయ్, జరుగుతున్నయ్…! మనం బతికే హిపోక్రటిక్ సొసైటీలో, సిస్టంలో మరో భ్రమాత్మక నిజం ఇది… నిజంగా పార్టీ రహిత ఎన్నికలు అని ఎవరైనా భ్రమపడితే, ఎవడైనా ప్రకటిస్తే అది వాడికే వదిలేద్దాం… పార్టీపరంగా సాగే ఎన్నికలే కాబట్టి ఒక పార్టీగా టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయడాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు… ఒక రాజకీయ పార్టీగా అది తనిష్టం… చిన్న చిన్న విషయాలకే పెద్ద హంగామా, హైపూ క్రియేట్ చేసే అలవాటున్న […]
వీడొక చార్లెస్ శోభరాజ్ సరే… మన వ్యవస్థల నలుపు మాటేమిటి మరి..!!
జర్నలిస్టులే కాదు, నాన్-జర్నలిస్టులకూ ఇది ఓ మంచి వార్తే… ఎందుకంటే, భార్య తనను వదిలేసిందనే ఫ్రస్ట్రేషన్లో ఒక భర్త ఉన్మాదిగా మారి, ఒంటరిగా కనిపించిన మహిళలను ఆకర్షించి, ఎక్కడికో తీసుకుపోయి, హతమార్చే సైకో బాపతు వార్త ఇది… సాధారణంగా సైకో దర్శకులు తీసే థ్రిల్లర్ సినిమాల్లో ఇలాంటి కేరక్టర్లు కనిపిస్తాయి… నిజజీవితంలో కొందరు ఇలా తారసపడతారు… గుడ్, పోలీసులు పట్టుకున్నారు, మీడియా మీట్ పెట్టారు, ఐడెంటిఫికేషన్ ఇష్యూస్ రాకుండా ఓ ముసుగు కప్పేసి విలేకరుల ఎదుట ప్రజెంట్ […]
ఎల్ఐసి ప్రకటనలు చదివేవారికి లేదా ఒక పాలసీ..?
ఎల్ ఐ సి ప్రకటనలు చదివేవారికి లేదా ఒక పాలసీ? ———————- జీవితం మనదే అయినా బీమా తెలుగు పదమేనా? కాదా? అన్న చర్చ ఇక్కడ అనవసరం. తెలుగు ప్రామాణిక నిఘంటువు శబ్దరత్నాకరం ప్రకారం బీమా హిందీ పదం. ధీమా బలంగా ఉండాలనుకుని బీమాకు ఒత్తు కూడా పెట్టి “జీవిత భీమా” అని కూడా కొందరు తమకు తాము గట్టిగా ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు. “యోగక్షేమం వహామ్యహం” అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన అభయ వాక్కును ఎల్ […]
- « Previous Page
- 1
- …
- 392
- 393
- 394
- 395
- 396
- …
- 420
- Next Page »