ఆ చైనావాడు ఎంత బుకాయించినా… ఆ చైనా భక్తగణం ఇక్కడ ఎన్ని వక్రబాష్యాలతో చైనాను వెనకేసుకొస్తున్నా… ఆ WHO వాడు కూడా ఏ ప్రలోభంతోనో చైనాకు దాసోహం అంటున్నా… ప్రపంచాన్ని –ంక నాకించేసిన కరోనా వైరస్ చైనా వాడి సృష్టేననీ, వుహాన్ ల్యాబులో తయారు చేసే జీవాయుధం లీకై విశ్వమంతా వ్యాపించిందనీ ఇప్పుడు ప్రతి దేశమూ నమ్ముతోంది… గత ఏడాది జనవరిలోనే మనం ‘ముచ్చట’లో చెప్పుకున్నాం… వుహాన్ మీద రకరకాల వార్తలు వస్తూనే ఉన్నయ్… ఈ స్థితిలో […]
‘‘జగన్ మళ్లీ జైలుకు… పార్టీ పగ్గాలు షర్మిలకు…’’ ఆస్ట్రో జర్నలిస్ట్ ఆర్కే విశేషరచన…
‘‘జగన్ బెయిల్ రద్దు కావడం ఖాయం, అనవసరంగా రఘురామ కృష్ణంరాజుతో గోక్కున్నాడు… రఘు ఊరుకునేరకం కాదు, ఢిల్లీలో కూర్చుని రచ్చ చేసేస్తున్నాడు… ఢిల్లీ కూడా అదును కోసం వేచిచూస్తోంది… రేప్పొద్దున జగన్ బెయిల్ రద్దు అయిపోగానే, తన భార్య భారతిని సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టే ఆలోచనలో ఉన్నాడు జగన్… కానీ తమిళనాడులో అన్నాడీఎంకేను శశికళ చేతుల్లో నుంచి తప్పించి ఆమెను శంకరగిరి మాన్యాలు పట్టించినట్టుగానే జగన్ను కూడా కట్ చేసేస్తారు మోడీ, అమిత్ షా… షర్మిలను […]
కేసీయార్ రైతుబంధును అన్యాపదేశంగా తిట్టిపోసిన నమస్తే తెలంగాణ..!!
ముందు నుంచి అనుకుంటున్నదే ఇది…. అంతా బాగున్నప్పుడు… కేసీయార్తో బాగున్నప్పుడు… అందరూ కలిసి కొత్తకొత్తగా తెలంగాణ సమాజాన్ని దంచుకుంటున్నప్పుడు… దండుకుంటున్నప్పుడు… ప్రజలు లేరు, ఆత్మాభిమానం లేదు… ఇప్పుడు కేసీయార్కూ, తనకూ పడకపోతే అకస్మాత్తుగా తెలంగాణ ప్రజలు, బానిస భవన్ గట్రా గుర్తురావడం కరెక్టు కాదని….!! ఒకటి మాత్రం ఈటల చెప్పింది నిజమే… ఐదేళ్లుగా కేసీయార్తో గ్యాప్ ఉందనేది… కానీ తెలంగాణ ప్రజలు, వాళ్ల సంక్షేమం అనే సోయి నిజంగానే ఉండి ఉంటే, అక్కడ బానిసగా ఎందుకిన్నేళ్లు బతికినట్టు..?! […]
హనుమ జన్మస్థలి రచ్చలోకి బ్రహ్మి..! ఏబీఎన్ చర్చలో మరీ కామెడీ వాదన..!!
సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ అకశేరుక ప్రపంచం… అంటే వెన్నెముకల్లేని జీవజాతులు కొన్ని వంగుతూ, పాకుతూ నడుస్తుంటాయి… తప్పదు… వెన్నెముక ఉన్నట్టు గానీ, విద్యత్తు ఉన్నట్టు గానీ, జోకుడు జ్ఞానం తప్ప ఇంకేమైనా జ్ఞానమున్నట్టు గానీ పసిగడితే సినిమా పెద్దలు మెడలు విరిచేస్తారు… ఇక స్త్రీలయితే తాము రక్తమాంసాలున్న ప్రాణులమని కూడా మరిచిపోవాల్సిందే… ఈ స్థితికి అలవాటుపడ్డవాడే ఉంటాడు… ఏళ్ల తరబడీ స్టార్ కమెడియన్గా వెలిగిన బ్రహ్మానందానికి ఈ విషయం తెలుసు… తను స్వతహాగా కాస్త […]
సమంతాలో అసలు నటి అజ్ఞాతం వీడింది… బయటికొచ్చింది, ఇప్పుడామె ‘టైగర్’…
రెగ్యులర్, రొటీన్ సినిమా రివ్యూ ఫార్మాట్ కాదు… దీన్ని కొత్తగా చూడాలి… కొత్తగా రాసుకోవాలి… అసలు ఇది సినిమా కాదు… రొటీన్ కమర్షియల్ సినిమా లక్షణాలు కూడా లేవు… ఉండకూడదు… ఓటీటీల్లో వచ్చే వెబ్ సీరీసుల్లో మితిమీరిన హింస, వల్గర్ గట్రా ఉండవచ్చుగాక… కానీ ఇన్నాళ్లూ రొటీన్ సినిమాల్లోని అనేక పైత్యాల నుంచి ప్రేక్షకుల్ని అవి దూరం తీసుకుపోతున్నయ్… క్రియేటివిటీకి పదును పెడుతున్నయ్… కొత్త కథల్ని, కొత్త కథనాల్ని, కొత్త పోకడల్ని పరిచయం చేస్తున్నయ్… లేకపోతే మామూలు […]
ఎంత బాపు అయితేనేం… రాజాధిరాజు నిర్మొహమాటంగా ఉల్టా తన్నేసింది…
Bharadwaja Rangavajhala…….. మార్క్సీయ వాక్యం … శాంతి అనేది రెండు యుద్దాల మధ్య విశ్రాంతి. అదే వాక్యం కొంచెం కామెడీ గా రాజాధిరాజు సినిమాలో సైతాను నోటెంట వస్తుంది. అన్నట్టు శాంతంటే తెల్సా శిశువా … రెండు యుద్దాల మధ్య ఇంటర్వెల్లు అని … ముళ్లపూడి వెంకట్రమణ గారు పొలిటికల్ రైటర్ గా ముద్రేయించుకోడానికి పెద్దగా ఇంట్రస్టు చూపించలేదుగానీ … ఆయన తన సినిమాల్లో రాజకీయాలు బానే రాశారు … మన ఊరి పాండవులు చిత్రంలో ఆయన […]
ఓ బీభత్స, భయానక చిత్రం..! ఈనాడు వార్తతో పేరెంట్స్ గుండెలు బేజారు..!
ఇతర పత్రికలకన్నా నాలుగు మైళ్లు ముందుండేది ఈనాడు… అది ఒకప్పుడు… కానీ ఇప్పుడది ఏ పూర్వకాలం ప్రమాణాల్లోనే ఆగిపోయి, అక్కడే తచ్చాడుతోంది… దాని ఖర్మ, దానిష్టం అని కొట్టిపారేయకండి, ఇన్నేళ్లుగా తెలుగువాళ్ల మైండ్ ట్యూనింగ్, థాట్ పోలీసింగ్ చేసిన ఓ వ్యవస్థ ప్రస్తుత స్థితి చెప్పుకోకపోతే ఎలా..? ఫస్ట్ పేజీ బ్యానర్ కొట్టింది… ఏమిటయ్యా అంటే..? మూడో దశలో 30 లక్షల మంది పిల్లలకు వైరస్ సోకుతుంది, 8 వేల మందికి ఐసీయూ అవసరపడొచ్చు, ఒక శాతం […]
చివరకు జగన్ కూడా పెదవివిరుపు… ‘కరోనా లేఖ’ల్లో కేసీయార్ ఒక్కడే మిగిలాడు…
మోడీ వేక్సిన్ పాలసీలపై అసంతృప్తి వ్యాప్తి చెందుతూనే ఉంది… చివరకు జగన్ కూడా పెదవి విరిచాడు… అందరమూ ఏకాభిప్రాయంతో ఉందామని ముఖ్యమంత్రులకు లేఖ రాశాడు… కరోనా వేక్సిన్ చివరకు కేంద్రం వర్సెస్ రాష్ట్రాలుగా మారుతోందనీ, రాష్ట్రాల మీద బాధ్యత పెట్టేయడం సరికాదనీ, కేంద్రమే బాధ్యత తీసుకోవాలనీ వాటిల్లో పేర్కొన్నాడు… ‘‘చివరకు జగన్ కూడా’’… అని ఎందుకు ప్రత్యేకంగా పేర్కొనాల్సి వస్తున్నదీ అంటే..? పేరుకు బీజేపీయేతర ముఖ్యమంత్రే అయినా, తటస్థుడే అయినా, కేంద్ర విధానాలకు సంబంధించి జగన్ దాదాపు […]
ఇంతకు మించిన ప్రేమ నివాళి ఏమివ్వగలం నీకు గాన గంధర్వుడా..?
ఇది Mohammed Khadeerbabu… విరచితం… ఎంత బాగుందో… మనమూ ఓసారి పలకరించి, పరవశించిపోదాం… అతని పాటలు పది అందరూ రాసి అక్షరాల్లోనే వెళ్లబోసుకోవాలనుకోరు. అసలు నోరు తెరిచి చెప్పాలని కూడా అనుకోరు. ఇష్టాన్ని చెప్పడం ఏంటి? సమక్షంలో కాసేపు చుబుకానికి పిడికిలి ఆన్చి కూచోవడం… నడుస్తూ ఉండగా ఊరికే చేతిని ఒక లిప్త పట్టుకు వదిలేయడం… రేపటి సాయంత్రం కోసం ఇవ్వాళ్టి రాత్రి చంద్రుణ్ణి త్వరగా తెమలమని పేచీ పడటం… ఎక్కడ ఉన్నా ఆ మెత్తటి పాదాల […]
మావోలూ మనోళ్లే… నిజమే… కానీ *కరోనా యుద్ధవిరామం* సాధ్యమేనా..?!
విశేషంగా కనిపించింది ఓ బ్యానర్ స్టోరీ… ఆంధ్రప్రభలో… విడ్డూరమనో, వింత ప్రతిపాదననో అలా కొట్టిపారేయనక్కర్లేదు… మానవీయ దృక్పథంతో, జర్నలిస్టిక్ కోణంలోనే ఒక సానుకూల ఆలోచనను డిబేట్కు పెట్టినట్టుగా పరిగణిద్దాం… అయితే ఆ సానుకూలత ఉందా..? ఆ ఆచరణసాధ్యత ఉందా..? అదీ అసలు ప్రశ్న… ఈ కథనం ఏమంటున్నదంటే..? ‘‘మావోయిస్టులు కూడా మనవాళ్లే కదా, విదేశీయులు కాదు, మావోయిజం సామాజిక సమస్య, వాళ్లు కూడా మన సమాజంలో భాగమే, కాపాడుకుందాం, గతంలో వైఎస్ ప్రభుత్వం చర్చలకు పిలిచి, భద్రంగా […]
భేష్ ముఖేష్..! తొలిసారి రిలయెన్స్ మానవీయ ముఖం… అభినందనీయం..!
ఈ కరోనా మహావిపత్తు వేళ అనేక చిన్న కంపెనీలు కుదేలైపోయాయి… లక్షలాది కొలువులు ఊడిపోయినయ్… పెద్ద కంపెనీలు సైతం కొలువుల్లో, జీతాల్లో కోతలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నయ్… ఇక రోజువారీ కూలీలకు, చిన్న చిన్న వృత్తుల వారికి ఇదొక మహా సంక్షోభం… ఈ స్థితిలో ఎవరు కొంత ఔదార్యాన్ని కనబర్చినా ప్రశంసించకతప్పదు… పలు కంపెనీలు కరోనా సాయానికి సిద్దపడుతున్నయ్… ఆక్సిజన్ పడకల హాస్పిటల్స్ ఏర్పాటు దగ్గర్నుంచి అనేక రకాలుగా ‘సామాజిక బాధ్యత’ను మీద వేసుకుంటున్నయ్… అయితే అంతా […]
The Journalist..! మిత్రులు ఓ యజ్ఞమే చేశారు… కానీ కరోనాయే గెలిచింది…
మనం పలుసార్లు చెప్పుకున్నట్టు… ఓ టైం వస్తుంది… అదంతే, తరుముకుంటూ వస్తుంది… అది యమపాశం… దానికి అడ్డు ఉండదు… మెడకు పడి బిగుసుకుంటుంది… ఊపిరి ఆగిపోతుంది… అది డెస్టినీ…. వైఎస్ఆర్… అనగా వై.శ్రీనివాసరావు అనే ఓ జర్నలిస్టు… హైదరాబాదులో తనను ప్రేమించని జర్నలిస్టు లేడు… భిన్న సిద్ధాంతరాద్ధాంత వర్గాలకు అతీతంగా అందరికీ ఇష్టుడు… జర్నలిస్టు అంటే అదుగో ఆయన అని చెప్పుకునే టైపు… ఆస్ట్రాలజీ, అస్ట్రానమీ మాత్రమే కాదు, మనుషుల్ని చదివాడు… ఆజన్మ బ్రహ్మచారి… జిజ్ఞాసపరుడు… వృత్తిలో […]
వందలాది అనాథ ఆత్మలు..! కావేరి ఒడిలో ‘‘సామూహిక అస్థికా నిమజ్జనం..!!
మనం ఇంతకుముందు చెప్పుకున్నాం… చెప్పుకుంటూనే ఉన్నాం… చెప్పుకుంటాం కూడా… కరోనాతో ఎవరైనా మరణిస్తే ఆ శవాలను కూడా తీసుకుపోవడానికి కుటుంబసభ్యులు, బంధువులు రావడం లేదు… ఒక హైదరాబాదో, ఒక బెంగుళూరో కాదు… దేశమంతటా దాదాపు ఇదే పరిస్థితి… అనేక కారణాలుంటయ్… కరోనా మనకూ అంటుకుంటుందనే భయం… లేదా అప్పటికే అప్పుల పాలై ఇంకా దహనసంస్కారాల కర్చులు కూడా పెట్టుకునే స్థితి లేకపోవడం… (కొన్ని కులాల్లో చావు కూడా పెళ్లిలాంటిదే…) కొన్ని కుటుంబాల్లో బాధ్యత మీద వేసుకునేవారు మిగలకపోవడం… […]
హవ్వ… ఖర్చెంతో ముందే చెప్పేస్తారా..? కార్పొరేట్ వైద్యానికే అవమానం…
ఇది నిజమేనా..? హవ్వ… ఎంత అప్రదిష్ట… హైదరాబాదు కార్పొరేట్ వైద్యప్రపంచానికే అవమానం… నామర్దా… వీలయితే మిగతా కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కలిపి, కేటీయార్కు చెప్పి, ఈ సెంచరీ హాస్పిటల్ వాడి లైసెన్స్ రద్దు చేయించాలి… కాదంటే మోడీనే రంగంలోకి దింపేయాలి… హమ్మా… అసలు వైద్యానికి ఇంత ఖర్చవుతుందని ఉజ్జాయింపు అంచనా వేసివ్వడం ఏమిటి అసలు..? మన కల్చర్ ఏమిటసలు… ఏమీ చెప్పకుండా, ఏ బిల్లులూ ఇవ్వకుండా… వీలైనంత నగదు గుంజేస్తూ… కార్డులు, బీమా పథకాలు గట్రా దగ్గరకు […]
జిజ్ఞాసకు ముసలితనమేంటి..? కంప్యూటర్ భాషను పీవీ పరపరా నమిలేశాడు..!
అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం…. అంటే ఎయిటీస్లో మాట… రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నాడు… ఆయన మంత్రివర్గంలో పీవీ నరసింహారావు మంత్రి… కీలకమైన శాఖలే… తరువాత కాలంలో అదే రాజీవ్ భార్య సోనియాకు నచ్చలేదు, అమానవీయంగా తొక్కేసింది, చివరకు ఆయన శవం మీద కూడా కక్ష కనబర్చింది… అది వేరే కథ… తిట్టకండి, ఆమె తెలంగాణ ప్రదాత… అయితే రాజీవ్ గాంధీ టెక్నాలజీకి గేట్లు తెరిచాడు, దేశాన్ని కొత్త సాంకేతిక జ్ఞానం వైపు తీసుకుపోయాడు,.. ఓరోజు ఓ […]
ఓ కొలవెరి, ఓ రౌడీ బేబీ… అప్పట్లో ‘తోడీ సి పీ లీ హై’… పాటతో మందు కొట్టించేశాడు…
వై దిస్ కొలవెరి పాటలో ఏముంది..? ఏమీలేదు… జనానికి విపరీతంగా కనెక్టయిపోయింది…. రౌడీబేబీ పాటలో ఏముంది..? ఏమీలేదు… కానీ వంద కోట్ల వ్యూస్ దాటి ఇంకా దున్నేస్తూనే ఉంది… ఇప్పటి రెండు తరాలకు పెద్దగా తెలియకపోవచ్చుగాక… 45 దాటినవాళ్లకు తెలుసు… అమితాబ్ నటించిన నమక్ హలాల్ సినిమా ఎంత భారీ హిట్టో… 1982… హైదరాబాద్ కాచిగూడ చౌరస్తాలో మహేశ్వరిలో నమక్ హలాల్, పరమేశ్వరిలో డిస్కో డాన్సర్… ఎన్ని నెలలు ఆడాయో కూడా ఎవరికీ లెక్కలేదు… అసలే అమితాబ్ […]
మోడీ టీకాల తీరు పట్నాయకుడికీ నచ్చలేదు… ఏ ఒక్కరూ మెచ్చని పాలసీ…
సుప్రీంకోర్టు కేంద్ర వేక్సిన్ పాలసీని మళ్లీ తీవ్రంగా తప్పుపట్టింది… సగటు మనిషికి కూడా అర్థమైపోతోంది మోడీ వేక్సిన్ పాలసీ ఓ హిస్టారిక్ బ్లండర్ అని… అది జాతికే తీవ్ర నష్టదాయకంగా మారిపోయిందని…! సరే, ఒక సీపీఎం సీఎం పినరై విజయన్ బీజేపీయేతర ముఖ్యమంత్రులందరికీ లేఖ రాశాడు… ఇలాంటి విషయాల్లో మోడీ మీద స్వారీ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాడు కాబట్టి కాసేపు పక్కన పెడదాం… జార్ఖండ్ హేమంత్ సోరెన్ కాంగ్రెస్ క్యాంపు మనిషి కాబట్టి విమర్శ చేస్తున్నాడూ […]
ప్రైవేటు కంపెనీలూ… ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సొసైటీకి ‘‘తిరిగి ఇచ్చేది’’….
మెచ్చుకోదగిన ఔదార్యం ఇది… చాలామంది చాలారకాలుగా కరోనా పోరాటంలో సాయం చేస్తున్నారు కదా అంటారా..? కాస్త వివరంగా చెప్పుకుందాం… సమాజం నుంచి తీసుకోవడమే కాదు, సమాజానికి అవసరమున్నప్పుడు తను నష్టపోతున్నా సరే, తిరిగి ఇవ్వాలి… ఈ నీతిని పాటించే కార్పొరేటు కంపెనీలు కొన్ని మాత్రమే… ఆ కొన్నింట్లో ఆర్జాస్ స్టీల్… దీనికి ప్రమోటర్లు ఏడీవీ పార్టనర్స్… తాడిపత్రిలో స్టీల్ ప్లాంట్ ఉంది… (గతంలో Gerdau Steel) ఈ కరోనా కష్టకాలంలో మన చుట్టూ ఉన్న వాళ్లకు ఏం చేయగలం..? ఏం […]
ఇంద్రచాపం… వరదగుడి… సింగిడి… సన్ హాలో… నెటిజనమంతా ఫోటోగ్రాఫర్లే…
ఒక్కసారిగా హడావుడి… హైదరాబాద్ నెటిజనమంతా స్మార్ట్ ఫోన్లలో, కెమెరాల్లో ఈ సీన్లను బంధించడానికి పోటీలు పడ్డారు… అరుదైన దృశ్యాల్ని చూస్తూ సంబరపడిపోయారు… వాట్సప్ గ్రూపులు, ఫేస్ బుక్ షేర్లు, ఇన్స్టా పోస్టులు మొత్తం ఇవే ఫోటోలతో నిండిపోతున్నయ్… కొందరికి ఇదేమిటో తెలుసు, కొందరికి తెలియదు… మొత్తానికి ఓ చర్చ… ఇళ్ల నుంచి బయటికి వచ్చి అనువైన కోణాలు వెతికి ఫోటోలు తీయడంలో బిజీ అయిపోయారు చాలామంది… నిజానికి ఏమిటిది..? ఇదొక వింత కాదు, విడ్డూరం కాదు… ఒక […]
అంతటి సుబ్బన్నే చెప్పేశాడుగా… అది ఉత్త దండుగ మందేనట…
నో, నో, ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదట, కరోనాకు పనిచేయదట, అందుకని మేం తయారు చేయబోం, ఒకవేళ కేంద్రం అనుమతిస్తే అప్పుడు సీఎంతో మాట్లాడి ఆలోచిస్తాం…….. ఇదీ టీటీడీ అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి పత్రిక ప్రకటన… ఇది చదివాక ఆశ్చర్యం, ఆనందం, ఆందోళన, అనుమానం గట్రా చాలా ఫీలింగ్స్…. జగన్ ఈయన్ని కేవలం టీటీడీకి పరిమితం చేయడం పట్ల ఒకింత ఆనందం, ఇప్పటికీ ఆయన అదేతరహాలో మాట్లాడుతున్న తీరు పట్ల ఆశ్చర్యం… టీటీడీ పరిస్థితి పట్ల ఆందోళన… ఇలాగన్నమాట…. […]
- « Previous Page
- 1
- …
- 388
- 389
- 390
- 391
- 392
- …
- 447
- Next Page »