‘‘నేను అప్పుడు రాధిక వాళ్లదే ఓ తమిళ సీరియల్‌లో చేస్తున్నాను… అమ్మవారి గెటప్… కుట్రాలంలో షూటింగ్, అది ఫినిష్ చేసుకుని, టాటా సఫారీలో బెంగుళూరు వెళ్తున్నాం… మధ్యలో మీనాక్షి హోటలో, మరొకటో ఆపుకుని లంచ్ చేశాం… ఆ టైమ్‌లో నేను ఏదో ఫోన్ మాట్లాడుతూ డోర్ తీయడానికి ప్రయత్నించాను… కానీ డ్రైవర్ లాక్ చేసుకుని ఎక్కడికో వెళ్లాడు… ఎవరైనా కారు లాక్ తీయడానికి ప్రయత్నిస్తే అరుస్తుంది కదా… అప్పట్లో అదొక అలర్ట్ సిస్టం ఉండేది… అది కుయ్ […]
ఈ ప్రపంచస్థాయి డాక్టర్ మీద శ్రీదేవికి ఎనలేని అభిమానం… ఎందుకలా..?!
నోరి దత్తాత్రేయుడు… తెలుగు జాతి గర్వించదగిన డాక్టర్… ప్రత్యేకించి కేన్సర్ రోగులెందరికో దేవుడు… ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆయన గురించి మళ్లీ పరిచయం చేయడం ఓ సాహసమే… లెజెండరీ స్టేటస్‌కన్నా చాలా ఎక్కువ… ఈమధ్య హైదరాబాద్ వచ్చాడు… విస్మయకరం అనిపించింది ఏమిటంటే… ఆయన ఓ యూట్యూబ్ చానెల్‌కు ముప్పావుగంట ఇంటర్వ్యూ ఇవ్వడం… చాలా అంశాల్ని ఏ శషభిషలూ లేకుండా పంచుకోవడం..! మేం తోపులం, మేం దైవాంశ సంభూతులం అని ఫీలయ్యే పిచ్చి సెలబ్రిటీలందరూ ఆయన్ని చూసి నేర్చుకోవాలి… […]
స్త్రీవాది కాదు… రాజేశ్వరితో ఏం చెప్పించాడో ఆయనకే తెలియదు…
Abdul Rajahussain……… (మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా) చలం గారి “ స్త్రీ వాదం “ లో ‘ స్త్రీ ‘ పాత్రలకు వ్యక్తిత్వం ఏదీ ? ‘మైదానం’ లో “ రాజేశ్వరి “ వ్యక్తిత్వం నేతిబీరకాయలోని “ నెయ్యేనా ? మైదానంలో..”రాజేశ్వరికి ” చలం గారు అన్యాయం చేశారా ? “స్త్రీ వాదిగా “ చెప్పుకునే చలం తన రచనల్లోని “ స్త్రీ “ పాత్రలకు అన్యాయం చేశారా ? వ్యక్తిత్వం లేని […]
తండ్రి బరువు వదిలించుకుందామని ఆ కొడుకు ప్రయత్నం… తరువాత..?
ఓ రైతు… విపరీతంగా కష్టపడేవాడు… పెద్ద వ్యవసాయ క్షేత్రం కావాలి తనకు… ఎందుకు..? తన కొడుకులు, మనమలు సంతోషంగా జీవించాలి… అందుకే పఢావు భూముల్ని కొన్నాడు… దాన్ని సారవంతం చేయడానికి బాగా కష్టపడేవాడు… కరువులు, తుపాన్లు, చీడపీడలను తట్టుకుంటూ… ఎదురీదుతూ… పంటల్ని కాపాడుకున్నాడు… అదృష్టం కలిసొచ్చింది… మంచి దిగుబడులు వచ్చినయ్… ధనికుడు అయిపోయాడు… కాలం ఆగదు కదా… వయస్సు మీద పడుతోంది… మునుపటిలా కష్టపడలేకపోతున్నాడు… ఇక రిటైర్ అయిపోయి రెస్ట్ తీసుకోవాల్సిన టైమ్ వచ్చేసిందని అనుకున్నాడు… ఓరోజు […]
ప్రవచనం ఓ గొప్ప కళ… అందులో దిట్ట మల్లాది… 60 ఏళ్లపాటు ఓ తపస్సు…
Rajan Ptsk………… ప్రథమం ఆవలింతంచ – ద్వితీయం కళ్లు ముయ్యడం – తృతీయం త్రుళ్ళిపడటం – చతుర్థం చెంపదెబ్బచ – పంచమం పారిపోవడం – ఇదీ ఒకప్పటి పురాణ ప్రవచన లక్షణమట. ఈ మాటలు అప్పటి ప్రవచనాల తీరుపై ఎవరో సంధించిన వ్యంగ్యాస్త్రం. కానీ నిజానికి పురాణంలాగే పురాణ ప్రవచనకారులకు కూడా పంచలక్షణాలుండాలేమో అనిపిస్తుంది. అవి.. ఒకటి.. రామాయణ భారత పురాణాదుల మీద, వేదవేదాంగాల మీద, సంపూర్ణమైన సాధికారత కలిగినవారై ఉండాలి. రెండు.. పురాణసాహిత్యంలో పైకి అసంబద్ధంగా […]
నా భార్య మెంటల్, ట్రీట్‌మెంట్ వద్దట, ఇది క్రూరత్వం, విడాకులు ఇప్పించండి…
ఈమధ్య కోర్టుల్లో వచ్చే పలు తీర్పులు భిన్న చర్చలకు తావిస్తున్నయ్… అలాంటిదే ఈ కేసు కూడా… కేరళ… ఓ భర్త ఫ్యామిలీ కోర్టుకు వెళ్లాడు… నా భార్య మానసిక రుగ్మతతో బాధపడుతోంది, చికిత్స చేయించుకొమ్మంటే ఒప్పుకోవడం లేదు, సో, మాకు విడాకులు ఇచ్చేయండి అనేది కేసు… నాకు ఎలాంటి రోగమూ లేదు, నా పిల్లల్ని చూసుకుంటున్నాను, నర్సుగా కొలువు చేస్తున్నాను, ఇరుగూపొరుగూ సహా అందరితో బాగానే ఉంటున్నాను, నాకెందుకు చికిత్స, నాకు మానసిక రుగ్మత ఉన్నట్టుగా ప్రచారం […]
No Time To Die..? No… Time To Die..! చివరకు చంపేశారు కదరా..!!
బాండ్… జేమ్స్ బాండ్… 25 సినిమాలు… అసలు బాండ్ అంటే ఎలా ఉండాలి..? సిగ్నేచర్ ట్యూన్‌తో గూస్ బంప్స్ మొదలైతే ఎండ్ వరకూ ఎక్కడా థ్రిల్ ఆగొద్దు… మధుబాబు నవలల్లో షాడో పాత్రలాగా… తెలుగు సినిమాల్లో మడత నలగని హీరోలాగా… పేలుళ్లు, కాల్పులు… సముద్ర అంతర్భాగం నుంచి అంతరిక్షం దాకా… ఎడారుల నుంచి మంచుమైదానాల దాకా… బాండ్ అడుగుపెడితే ఆపరేషన్ సక్సెస్ కావల్సిందే… సినిమా చివరలో తను కన్నుగొట్టి, అదో తరహా చిరునవ్వుతో ప్రేక్షకుడికి బైబై చెప్పాల్సిందే… […]
హీరోలకు అసలు ఫ్యామిలీలు ఉంటే కదా… బామ్మ, మామ్మ పాత్రలు కనబడేది…
Bharadwaja Rangavajhala……………. తెలుగు సినిమా ఆడియన్సుకు హాయ్ … అయ్యా నా పేరు నిర్మల … నన్ను నిర్మలమ్మ అంటారు ఇక్కడ సినిమా ఆడియన్సు. సారీ అనేవాళ్లు … ఆడియన్సే కాదండీ … సినిమా హీరోలూ అందరూ కూడా … మీ మెగాస్టార్ చిరంజీవికి అదే ఇప్పుడు ఆచార్యగా వస్తున్నాడు కదా … ఆయనకి కూడా బామ్మగా నటించాను. ఆయనకేంటి ఆయనతో గొడవ పడతా ఉంటాడు చూడండీ … మోహన్ బాబు, ఆయనకీ బామ్మగా వేశా … […]
అంతరిక్షంలోకి వెళ్లాడు… తిరిగి వచ్చేసరికి దేశమే ముక్కలుచెక్కలు…
పార్ధసారధి పోట్లూరి……… రష్యా తన సూయజ్ అంతరిక్ష నౌక లేదా రాకెట్ మీద ఉన్న అమెరికా, జపాన్, బ్రిటన్ దేశాల జెండాలని చెరిపేసి, రష్యా జెండాతో పాటు భారత దేశ జెండాని మాత్రం అలానే ఉంచేసింది! ఈ కథేమిటంటే…? రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసిన సంఘటనలో అమెరికా, బ్రిటన్, జపాన్ లు రష్యా మీద ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే కదా ! బదులుగా రష్యా ఆయా దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాల విమానాలు […]
అనూహ్యం… రష్యన్ సబ్‌మెరైన్లు నిశ్శబ్దంగా సముద్రతలంపైకి తేలాయి…
తూర్పు పాకిస్థాన్, అనగా ఇప్పటి బంగ్లాదేశ్ నుంచి లక్షల మంది శరణార్థులు ఇండియాలోకి వస్తున్నారు… పాకిస్థానీ సైన్యం అరాచకాలు భరించలేక రోజురోజుకూ వలసలు పెరుగుతూనే ఉన్నయ్… బంగ్లాదేశ్‌ను విముక్తం చేద్దామంటే పాకిస్థాన్‌కు అమెరికా, బ్రిటన్‌లతోపాటు చైనా కూడా సాయం చేస్తుందేమో… ఆస్ట్రేలియా కూడా జతకలుస్తుందేమో.,.. కానీ ప్రధాని కుర్చీ మీద ఉన్నది ఇందిర కదా… మనకు బలమైన మద్దతు కావాలి… అంతకుముందే రష్యాతో స్నేహానికి సంబంధించి నెహ్రూ వేసిన పునాదులున్నయ్… దాంతో 1971… ఇండియా, రష్యాల నడుమ […]
పుతిన్ తక్కువోడు కాదు… పిల్ల పుట్టకముందే కుళ్ల కుట్టేశాడు…
పుతిన్ తక్కువోడు కాదుగా… చాలా ముందస్తు ప్రణాళికలు ఉంటయ్… ఎంత అంటే… పర్ సపోజ్, ఉక్రెయిన్ మీద దండయాత్ర పుసుక్కున నాలుగైదు రోజుల్లో ముగిసిపోయి, ఎటు చూసినా శిథిలాలు, విధ్వంసపు ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటయ్ కదా… ప్రజలంతా గుండెలు పగిలి శోకాలు పెడుతుంటారు కదా… బతుకు జీవుడా అనుకుంటూ లక్షల మంది వలస వెళ్లిపోయినా సరే, ఇంకొందరు ఎటూ పారిపోలేక దేశంలో చిక్కుబడిపోతారు కదా… మరి అప్పటికప్పుడు వాళ్లను పాలించి, ఉద్దరించడానికి ఎవరిని నియమించాలి..? ఇదంతా పుతిన్ […]
రష్యన్ ఆర్మీ కాదు… మన వైద్య విద్యార్థిని ఉక్రెయిన్‌లో నిజంగా చంపేసింది ఎవరు..?
కర్నాటక విద్యార్థి ఒకరు ఉక్రెయిన్‌లో మరణించాడు… రష్యా సైన్యం ప్రయోగించిన ఓ క్షిపణి కారణంగా… వేలాది మంది విద్యార్థులు ఇంకా అవస్థలు పడుతున్నారు… సరిహద్దులు దాటలేక, ఇండియాకు తిరిగిరాలేక భయాందోళనల నడుమ బిక్కుబిక్కుమంటున్నారు… మోడీ ప్రభుత్వం వాళ్ల సత్వర తరలింపు కోసం ప్రయత్నిస్తోంది… ఇవీ వార్తలు… మధ్యలో మళ్లీ రాజకీయాలు… వాటికి సిగ్గూశరం ఉండవుగా… కానీ ఓ మౌలికమైన ప్రశ్న మాత్రం చర్చల్లోకి రావడం లేదు… అసలు ఇన్ని వేల మంది ఆఫ్టరాల్ ఓ చిన్న దేశానికి […]