పుదుచ్చేరిలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ మర్డర్ చేసింది అని ఓ లెఫ్ట్ పత్రిక ఒకేరోజు నాలుగు వ్యాసాలు, ఓ సంపాదకీయం, ఫస్ట్ పేజీ బ్యానర్ రాసింది… పత్రికల నిండా వార్తలు… చర్చలు, విశ్లేషణలు గట్రా… అప్పటికిప్పుడు మోడీ ప్రభుత్వం అక్కడ ఇన్నేళ్లుగా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని పీకిపారేసి, తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అదనపు పగ్గాలు ఇచ్చింది… ఎమ్మెల్యేలను తనవైపు లాగిపారేసింది… ఆ ముఖ్యమంత్రి వేరే దిక్కులేక, బలనిరూపణ చేసుకోలేక, రాజీనామా చేశాడు… హహహ… అసలు రెండు […]
మనమే ఒప్పుకోం… తెలుగు సినిమాను అసలు మనం మారనిస్తే కదా…
ఓటీటీ… స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్… ప్రపంచ సినిమాను అందుబాటులోకి తెచ్చింది… సినిమాను ప్రేమించే ప్రేక్షకులు రకరకాల జానర్ల సినిమాల్ని తిలకిస్తూ, అతుక్కుపోతున్నారు… అనేక భాషల్లో సినిమాలను సబ్ టైటిల్స్ సాయంతో రుచిచూస్తున్నారు… వాటితో పోలిస్తే మన సినిమా ఎక్కడున్నదనే సోయి, తద్వారా అసంతృప్తి పెరుగుతోంది… అయితే మన హీరోలు, దర్శకులు, నిర్మాతల తప్పేకాదు… మన వీక్షకుల అభిరుచిలోనూ తేడా ఉంది… సహజమే కావచ్చు… అదొక డిబేట్… అయితే ఓటీటీ వల్ల వెరయిటీ సినిమాల్ని చూసే సౌలభ్యం, […]
దృశ్యం వకీలమ్మ గుర్తుంది కదా… నిజంగానే ఆమె ప్రాక్టీసింగ్ హైకోర్టు లాయర్..!
2019… గానగంధర్వన్ అనే సినిమా… మళయాళం… కేరళ సూపర్ స్టార్లలో ఒకడైన మమ్ముట్టి హీరో… అందులో కథానాయకుడిని రక్షించడానికి ఓ వకీలమ్మ వస్తుంది… సీన్ కట్ చేస్తే… 2021… దృశ్యం-2 సినిమా… కేరళ మరో సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరో… ఇందులోనూ కథానాయకుడిని రక్షించేందుకు ఓ వకీలమ్మ వస్తుంది… ఆ రెండు పాత్రలనూ పోషించింది శాంతి మాయాదేవి అలియాస్ శాంతిప్రియ… విశేషం ఏమిటంటే..? ఆమె వృత్తిరీత్యా వకీలమ్మే… ప్రాక్టీసింగ్ లాయర్… తను రెగ్యులర్ యాక్టర్ కూడా కాదు… […]
పుస్తకావిష్కరణకు ఢిల్లీ నుంచి రాక..? ఏ కాలంలో ఉన్నారు సారూ మీరు..?
ప్రజెంట్ పాపులర్ రైటర్స్ మీద ఏదో వ్యాసం చదువుతుంటే… కొన్ని అంశాలు ఆసక్తికరంగా అనిపించాయి… 1) అందరూ అనుకున్నట్టు ప్రజల్లో పఠనాసక్తి ఏమీ చచ్చిపోలేదు… చేతన భగత్ పుస్తకాలు కొన్ని 70 లక్షలు అమ్ముడయ్యాయి… అమిష్ రాసినవి 50 లక్షలు… అనేక భాషల్లోకి అనువాదం… వీళ్లు రియల్ పాన్ ఇండియా స్టోరీ టెల్లర్స్… 2) పాత పురాణాలను కూడా కొత్త పద్దతుల్లో, కొత్తకొత్తగా చెబుతున్న తీరు పాఠకుడిని ఆకట్టుకుంటోంది… ఉదాహరణకు భారతాన్ని భీముడి కోణంలో, రామాయణాన్ని తార […]
జూ బిజినెస్..! అంబానీ వారు ఏదయినా వ్యాపారీకరించగలరు..!!
త్వరలో విడుదల! అంబానీ వారి జంతు ప్రదర్శన శాల! ——————– రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంపద విలువ ఆరు లక్షల కోట్లు. మార్కెట్ విలువను బట్టి ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో ఎప్పుడూ మొదటి పదిమందిలో ముఖేష్ ఉంటాడు. అలా ఆయన ఉన్నందుకు భారతీయులుగా మనం గర్వపడితే ఆయనేమీ అసూయపడడు. అది ఆయన కష్టార్జితం. చెమటోడ్చి సంపాదించిన ఆరు లక్షల కోట్లు. ఆయన తండ్రి ధీరూభాయ్ అంబానీ వేసిన గట్టి […]
పీవీని మించిన చాణక్యం… పీవీ కుటుంబంపైనే… తెలివైన ఎత్తుగడ…
గెలిచే చాన్స్ కనిపించక కేసీయార్ హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి పెట్టకపోవచ్చుననీ, సీపీఎం నాయకుడు నాగేశ్వర్‌కు మద్దతు ప్రకటిస్తాడని ఆమధ్య బాగా ప్రచారం జరిగింది… ఆ సందర్భంగా… అది జరగకపోవచ్చుననీ, అదే చేస్తే కేసీయార్‌కు వచ్చే ఫాయిదా ఏమీ ఉండదనీ, పైగా నష్టం జరుగుతుందనీ ‘ముచ్చట’ ఓ స్టోరీ పబ్లిష్ చేసింది… అదే జరిగింది… టీఆర్ఎస్ పోటీలో ఉండబోతోంది.., కేసీయార్ మాజీ ప్రధాని పీవీని మించిన చాణక్యాన్ని ఆయన కుటుంబం మీదే ప్రయోగించాడు… పీవీ కుమార్తె సురభి […]
అడ్డెడ్డె… బొట్టు చర్చ సరే.., ఫాఫం, ఆమె చెవుల వైపు చూడలేదేమిటోయ్..!
అన్యాయం గురూ గారూ… స్వాతి మోహన్ బొట్టు మెరిసిందీ, ఖగోళం మురిసిందీ అని ట్విట్టర్ నిండా బొచ్చెడు ప్రశంసలు రాశారు గానీ ఓ అన్యాయం జరిగిపోయింది… . పలు దేశాల నుంచి నాసాకు వచ్చి పనిచేసే వారి నడుమ… భారతీయ మూలాలున్న ఓ హిందూ స్త్రీ నాయకత్వ విజయాన్ని మనవాళ్లు ఆనందించి ఉంటారులే, బొట్టు హైందవం సూచికే కాబట్టి, ఆ క్షణాన ఆమె నొసట తిలకం చూసి మురిసిపోయి ఉంటారు… అందులో అభ్యంతరం ఏముంది..? మన మూలాల్ని […]
ప్రేక్షకుల పాలిట ఒక సైబర్ క్రైం..! బాబూ విశాల్, విసుగెత్తించావయ్యా..!!
స్టార్ హీరో అనే ఇమేజీ ఎవరినైనా సరే ఓ రొటీన్ బాటలోనే నడిచేలా చేస్తుంది… లేకపోతే పాపులర్ సినిమా డబ్బు లెక్కలు అంగీకరించవు… ప్రయోగాలు చేయనివ్వవు… ఆ బాటను తప్పి ఒక్క అడుగు కూడా అటూఇటూ పడనివ్వవు… కామన్ సెన్స్, లాజిక్ మన్నూమశానం అన్నీ తొక్కేస్తూ సాగిపోవాల్సిందే… ఫ్యాన్స్ ఒప్పుకోరు, బయ్యర్లు ఎవరూ సినిమా కొనరు… విశాల్ అయితేనేం, ఇంకెవరయితేనేం..? తన తాజా సినిమా చక్ర సినిమా చూశాక మరోసారి అనిపించేది ఇదే… పాపం విశాల్ అని […]
ఈ ఇద్దరిలో ఎవరు రేపటి మహిళ..? ఎవర్ని మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం..?!
నిజానికి రెండూ వేర్వేరు… ఒకటి కల్పన… అంటే ఒక కథ… రెండోది రియాలిటీ… మన కళ్లెదుట కనిపించే నిజం… రెంటినీ పోల్చడం ఒక కోణంలో కరెక్టు కాదు… కానీ నిన్నాఈరోజు మీడియాను ఫాలో అయ్యే వాళ్లకు ఓ పోలిక స్ఫురించడం సహజం… తేడాలపై ఆలోచన సాధారణం… ఈ ఫోటోలో మొదటిది పింకీ… నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వాడు తెలుగులో తీయించిన ఓ కొత్తతరం అంథాలజీ ఫిలిమ్ పిట్టకథల్లోని ఒక కథలో ఒక పాత్ర… రెండోది మార్స్‌పైకి నాసా పంపించిన […]
పాఫం మల్లాది..! ఆ సినిమాకు మాటలు రాసి కలం కాల్చుకున్నాడు..!!
తెలుగు పాపులర్ సాహిత్యంలో… సారీ, రచన ప్రక్రియల్లో మల్లాది వెంకట కృష్ణమూర్తిది కూడా ప్రముఖపాత్రే…. గొప్ప రచనలు అని ప్రత్యేకంగా ఏమీ చెప్పలేమేమో గానీ… తను ఏమైనా రాయగలడు… చిన్న కథలు, ట్రావెలాగ్స్, నవలలు… వాట్ నాట్… ఏదైనా రాయగలడు… తను ఓ సినిమాకు డైలాగ్స్ రాశాడనే ఓ మిత్రుడి సమాచారం ఎక్కడో చదివి, ఆ సినిమా వెతికితే ‘పోలీస్ రిపోర్ట్’ అని కనిపించింది… వావ్, అదేమిటో చూద్దాం అనుకుని అప్పుడెప్పుడో 1989 బాపతు సినిమాను చూస్తే… […]
సిటీ బ్యాంక్ కొట్టిన సున్నాలు! చివరికి మిగిలిన సున్నాలు!
సంస్కృతంలో విశాఖదత్తుడి “ముద్రా రాక్షసం” బాగా పేరు ప్రఖ్యాతులు పొందిన కావ్యం. దాదాపు రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం నాటి రచన. అనేక భారతీయ భాషల్లోకి అనువాదమయ్యింది. కొన్ని వాస్తవిక ఘటనలు, కొంత కల్పనతో అల్లిన కావ్యమది. తెలుగు పలచపడి, సంస్కృతం అంటరానిది అయ్యింది కాబట్టి ఆ కావ్యంలో గొప్పదనం మనకనవసరం. ముద్రా రాక్షసం అంటే అచ్చు తప్పులు, పొరపాట్లు ఎంత అనర్థమో అన్న విషయానికే పరిమితమవుదాం. పుస్తకాలు ముద్రిస్తే, జనం వేలకు వేల ప్రతులు […]
చిల్ చేయలేని చిల్లర్ పిట్టకథలు…! తేడా కొట్టేయడానికి కారణాలు ఇవే..!
మంచి ప్రతిభ కలిగిన నటీనటులు, దర్శకులు, ఇతర టెక్నిషియన్స్… అంతర్జాతీయ స్థాయి వెబ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్… సంకల్ప్‌రెడ్డి, నందినీరెడ్డి, తరుణ్‌భాస్కర్, నాగ్అశ్విన్ తమను తాము ప్రూవ్ చేసుకున్నవారే, కొత్త ట్రెండ్స్, కొత్త కథాంశాల్ని టచ్ చేసినవాళ్లే… రొటీన్ ఫార్ములాల నుంచి బయటికొచ్చి ఆలోచించగలరు… మంచు లక్ష్మి, శృతిహాసన్, జగపతిబాబు వోకే, కానీ అమలాపాల్ ప్రతిభ కలిగిన నటే… మరి వీళ్లంతా కలిపి వండిన ఓ వెబ్ వంటకం ఎందుకిలా ఏడ్చింది…? ఏ సెన్సార్ పరిమితులూ లేని… ఏ […]
కోమాలో ముమైత్ ఖాన్…! ఆ కైపు చూపుల వెనుక ఎవరికీ కనిపించని నొప్పి…!!
ముమైత్ ఖాన్…. పేరు వినగానే, ఆ మొహం చూడగానే ఓ పాట అకస్మాత్తుగా గుర్తొచ్చి హమ్ చేయాలనిపిస్తుంది… ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే… చీటికిమాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే… నాకెవ్వరూ నచ్చట్లే, నా ఒంటిలో కుంపట్లే, ఈడు ఝుమ్మంది తోడెవ్వరే… అలాంటి ఐటమ్ సాంగ్స్ నుంచి డ్రగ్స్ కేసు… ప్లస్ బిగ్‌బాస్… తాజాగా ఏదో టీవీషోలో జడ్జి దాకా… ఆమెకు టాలీవుడ్లో బోలెడన్ని అనుభవాలు… కెరీర్ సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడమో, మరేదైనా కారణమో గానీ… మంచి […]
బాలచందర్ ఆత్మ లోకనాథన్… ఆయన ‘కెమెరా డెప్త్’ అలాంటిది…
…… By……… Bharadwaja Rangavajhala………. బి.ఎస్.లోకనాథన్ తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా సినిమా చూపించిన కెమేరా దర్శకుడు. అంతులేని కథ సినిమా చూసిన ప్రేక్షకులకు మొదటి సారి అతని పేరు తెర మీద కనిపించింది. తెలుగులో అతని మొదటి చిత్రం అదే. అప్పట్లో జాతీయ స్థాయిలో గానీ ప్రాంతీయ స్థాయిలోగానీ కెమేరా విభాగానికి ఇచ్చే అవార్టులు రెండు విధాలుగా ఉండేవి. నలుపు తెలుపు చిత్రాల ఛాయాగ్రహణంలో అత్యుత్తమంగా చేసిన వారికి బ్లాక్ అండ్ వైట్ విభాగంలోనూ, రంగుల్లో […]
రవి కృష్ణ-నవ్య స్వామి..! మాటీవీ జంటకు ఈటీవీలో పెళ్లిచేసేశారు…!
బిగ్‌బాస్ ఫేమ్, టీవీ సీరియల్ నటుడు రవికృష్ణకూ… నటి నవ్య స్వామికీ పెళ్లయిపోయింది… ఆమె మెడలో పుస్తె కట్టేశాడు… సెట్లోనే అందరూ చప్పట్లు కొట్టారు… ఇప్పటిదాకా వాళ్ల నడుమ ఏదో ఉంది, ఏదో నడుస్తోంది అని తెగ రాసుకున్నారుగా అందరూ… ఇప్పుడు మరో జంటను వెతుక్కొండి ఇక……………. హహహ… ఏదీ నిజం కాదు… ఈటీవీ వాళ్లను చూసి జాలిపడాల్సిన పెళ్లిసందడి ఇది… శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఓ సూపర్ ఫ్లాప్ షో వస్తోంది కదా ప్రతి […]
ఆ దృశ్యం మళ్లీ అదిరింది..! హీరో, దర్శకుడు అభినందనలకు అర్హులే…!
ఇప్పటి ట్రెండ్ ఏమిటి..? ఒక స్టార్ హీరో సినిమా తీస్తే… కనీసం నాలుగైదు భాషల్లో… చేతనైతే ఏడెనిమిది భాషల్లో డబ్ చేసి, పాన్ ఇండియా పేరిట దేశమంతా విడుదల చేయడం… ప్రతి భాషలోనూ టీవీ రైట్లు, ఓటీటీ రైట్లు, ఓవర్సీస్ రైట్లు కలిపి కుమ్మేసుకోవాలి… థియేటర్లలో హోర్డింగులు గట్రా ఫుల్ హైప్ క్రియేట్ చేయడం… సినిమాలో ఫుల్ మాస్ మసాలా నింపేయడం… కథా మన్నూమశానం ఎలా ఉన్నా పర్లేదు, కథనం సంగతి వదిలేయండి… వేయి శాతం హీరోయిక్ […]
రాజరికం బంగారు పంజరం… ఎగిరిపోయిన జంట మళ్లీ ఎందుకొస్తుంది..?!
బకింగ్ హ్యాం ప్రిస్టేజ్ ఈజ్ ఫాలింగ్ డౌన్! ——————- బ్రిటిషు వారి ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాలో దుకాణం తెరిచిన నాటికి బహుశా ఇంగ్లాండ్ జనాభా యాభై లేదా అరవై లక్షలు ఉండి ఉండాలి. అదే సమయానికి భారత జనాభా హీనపక్షం ఇరవై అయిదు కోట్లు దాటి ఉండాలి. ఇప్పుడు ఇంగ్లాండ్ జనాభా అయిదు కోట్లా అరవై లక్షలు. భారత జనాభా 135 కోట్లు. పట్టుమని పది నాటు పడవల్లో గాలివాటుగా వచ్చిన పాతికమంది కంపెనీ వ్యాపారులు […]
స్వాతి తిలకం..! అరుణగ్రహంపై అడుగుజాడకన్నా ఆ బొట్టుపైనే చర్చ..!
దశాబ్దాలుగా అరుణగ్రహంపై జీవం ఉనికిని తెలుసుకోవాలని, ఆ గ్రహం స్థితిగతులేవో అంచనాలు వేయాలని మన వైజ్ఞానిక ప్రపంచం కలలు కంటోంది… ఖగోళ శాస్త్రజ్ఞులకు ఎన్నేళ్లుగానో దానిపై కన్ను… నాసా ప్రయోగించిన ఓ రోవర్, పేరు పర్సెవరెన్స్ నిన్న పదిలంగా మార్స్ ఉపరితలంపై అడుగుపెట్టింది… అది ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష శాస్త్రవేత్తలకే కాదు, సైన్స్‌ను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఉద్విగ్నతను కలిగించిన క్షణం… ప్రత్యేకించి రోవర్ మెల్లిమెల్లిగా అక్కడ దిగే ఆ చివరి ఏడు నిమిషాలూ నాసా సైంటిస్టులకు తీవ్రమైన […]
ఈ కపట‘దారి’ కాదు..! సుమంతుడా, ఆ అల్లరి నరేషుడి బాటే కరెక్టోయ్..!!
నందమూరి సుహాసిని, కల్వకుంట్ల కవిత, వైఎస్ షర్మిలమ్మ… తమ అత్తింటి పేర్లు కాదు, పుట్టింటి ఇంటిపేర్లతోనే జనంలో పాపులర్… అలాగే అక్కినేని సుమంత్… నిజానికి తను యార్లగడ్డ సుమంత్… కానీ అక్కినేని సుమంతే అంటారు చాలామంది… అఫ్ కోర్స్, కొందరు నాగసుమంత్ అని కూడా రాస్తుంటారు… ఇదెందుకు గుర్తొచ్చిందంటే… ఆమధ్య కార్తీకదీపం ఫేమ్, కాబోయే నిర్మాత ప్రేమి విశ్వనాథ్ సుమంత్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ… ‘మై ఫేవరెట్ హీరో సుమంత్’ అని సంభోదిస్తూ తాము నిర్మించబోయే ‘అనగనగా […]
భజే విశ్వనాథం..! తెలుగు తెరకు దొరికిన ఓ నిష్కామ కర్మయోగి..!
………………By… Gottimukkala Kamalakar ………………. ఇంకోస్సారి: కాశీనాథ్ అన్నా, విశ్వనాథ్ అన్నా శివుడే కదా..! మరి కాశీనాథుని విశ్వనాథ్ అంటే మూర్తీభవించిన పరమశివ తత్వం కామోసు..! శివ శిరోభూషణం ఐన నెలవంకకో నూలు పోగులా; మానస సరోవరం ముందు మినరల్ వాటర్ చుక్కలా వారి సినిమాలలోని పాటలూ, మాటలూ, నటులూ, పాత్రల మీద ఒక చిన్న అవలోకనా ప్రయత్నం..! అంతకాలం ఆరేసుకుంటూ, పారేసుకుంటున్న పాటలు, వారి సినిమాల్లో మనల్ని శివసమేతంగా ఆనందవృష్టి లో తడిపేసాయి. కొండకోనలు తుళ్ళిపడేట్టు […]
- « Previous Page
- 1
- …
- 405
- 406
- 407
- 408
- 409
- …
- 440
- Next Page »