కెరీర్ ఉచ్చదశలో ఉన్నప్పుడు, ఇక దిగడమే ఎక్కే నిచ్చెనలేమీ లేనప్పుడు… రిటైర్‌మెంట్ ప్రకటించగలవాడు, ఆ దశను గుర్తించగలవాడు గొప్పోడు… రాజకీయాలు గానీ, సినిమాలు గానీ, క్రికెట్ గానీ… అది ఏరంగమైనా సరే, ఇక మనం గుదిబండలం కాబోతున్నాం అనే స్పృహ తెలిసినవాడే గొప్పోడు… లేదంటే జనమే తిరస్కరిస్తారు… అది ఏ రేంజ్ సెలబ్రిటీకైనా వర్తిస్తుంది… సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఇంకా ఆ సోయి రాలేదు… ఒకవైపు అదే తమిళంలో జైభీమ్ వంటి మంచి మంచి ప్రయోగాత్మక, జన […]
పాపం పసివాడు..! బాల్యం కరిగిపోయేసరికి ఇండస్ట్రీ అలా వదిలేసింది..!!
………. By….. Bharadwaja Rangavajhala……………. పాపం పసివాడు… అతని పేరు రాము. అది కేవలం సినిమా కోసం పెట్టుకున్న పేరే … అసలు పేరు చాంతాడంత ఉందనీ మనం వేసేది ఎటూ చైల్డ్ రోల్సే కాబట్టి అంత పేరు ఎబ్బెట్టుగా ఉంటుందనీ తలంచి రాము చాలనుకున్నాడు. అయినప్పటికీ అసలు పేరు చుక్కల వీర వెంకట రాంబాబు. అయ్యిందా, ఇహ ఊరు విషయానికి వస్తే … బెజవాడ. మరి ఆ రోజుల్లో బెజవాడ అంటే తెలుగు సినిమా […]
అదే కుందేలు… అదే తాబేలు… కానీ ఈ కథే కొత్తది… ఆ పాత కథకు సెకండాఫ్…
……… By….. Jagannadh Goud…………. కుందేలు తాబేలు కథ అందరికీ తెలిసిందే. అయితే, అది సగ భాగం మాత్రమే; తర్వాత ఏం జరిగిందో ఎవరూ చెప్పలేదు, మనమూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఒక అడవిలో చెంగు చెంగున ఎగరగలను అనుకునే కుందేలు, తాబేలుని చూసి నీలా నెమ్మదిగా నడిచే జీవిని నేను ఎప్పుడూ చూడలేదు అంటే… అప్పుడు తాబేలు కుందేలుతో నాతో పరుగుపందెం పెట్టుకొని చూడు అంటుంది. పరుగు పందెం ప్రారంభమవుతుంది. కుందేలు చెంగు చెంగున […]
అబ్బో.., ఆంధ్రజ్యోతి తక్కువేమీ కాదండోయ్… ఉద్దండ పాత్రికేయపిండం…
అదేమిటో గానీ… రాధాకృష్ణ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు అలా మౌల్డ్ అయిపోయారేమో… ఏది రాసినా సరే, వైసీపీ మీద ద్వేషం, తెలుగుదేశం మీద ప్రేమ ఆటోమేటిక్‌గా అక్షరాల వరదలాగా తన్నుకొస్తాయి… ఆ రాతలో పడి, కొన్నిసార్లు తాము అసలు ఏం రాస్తున్నారో కూడా తమకే సమజ్ కానంత గందరగోళంలో పడి కొట్టుకుపోతుంటారు… ఇతరత్రా విషయాలు, తన టెంపర్‌మెంట్ అంశంలో ఆర్కే ఈజ్ వోకే… కానీ మరీ ఈమధ్య కొన్ని కథనాలయితే మరీ వైసీపీ […]
నమస్తే కోడి కూయకపోతే పొద్దు తెల్లారదా ఏం..? రిజల్ట్ మారిపోతుందా..?!
నా కోడి కూయకపోతే తెల్లారదు… అని ఎవరైనా అనుకుంటే ఏమంటాం..? నవ్వుకుంటాం..! పెదవి విరుస్తాం…! నమస్తే తెలంగాణలో హుజూరాబాద్ ఫలితం మీద వార్త చూశాక కూడా అంతే… హుజూరాబాద్ ఉపఎన్నిక తెలంగాణలో ఓ ప్రాధాన్యవార్త… మూడు నెలలుగా హుజూరాబాద్ ఎన్నిక మీద పేజీలకొద్దీ, ప్రత్యేక సంచికలకొద్దీ, బస్తాలకొద్దీ, టన్నులకొద్దీ కథనాలు కుమ్మీ కుమ్మీ… ఈటల మీద నానా బురదా గుమ్మరించీ… తీరా ఆ ఫలితాన్ని మాత్రం రెండో పేజీలో కనీకనిపించకుండా సింగిల్ కాలమ్ వేస్తే దాన్నేమనాలి..? ఎవరికి […]
కోడిచికెన్ లేదు, మేకమటనూ లేదు… ఆ ఊళ్లల్లో జీవాలన్నీ వాతాపి జీర్ణం…
ప్చ్… ఇంకా ఊరూరికీ గొర్ల యూనిట్లు పెంచాలె సారూ అని చెబితే విన్నారా..? వినకపోతిరి..? అక్కడికి అధికార పార్టీ ఎమ్మెల్యే నోరు విడిచి, నాటు కోళ్లను కూడా పంపిణీ చేయాలి అన్నాడు… వినకపోతిరి…? అరె… ఇంకా ఉపఎన్నికలు వస్తాయేమో… కోడిచికెన్, మేకమటన్ లేకపోతే ముద్దదిగని కార్యకర్తలు, నాయకులు ఉంటారు… కులసంఘాల నేతలుంటారు… ఊళ్లల్లో పెద్దమనుషులుంటారు… ఏం సారూ, ఎన్నికలొచ్చినప్పుడైనా జెర మసాలా భోజనం పెట్టించవా అని తప్పుతీయరా..? మరి తప్పదు కదా..! ఏ చెరువు దగ్గరికి పోయినా […]
అంత పెద్ద స్టార్… అకస్మాత్తుగా మాయం… నిశ్శబ్దంగా స్వీయ అజ్ఞాతంలోకి…
అప్పట్లో తమిళనాట ఎంజీఆర్… ఆంధ్రలో ఎన్టీయార్… కన్నడంలో రాజకుమార్… సూపర్ స్టార్లు… తిరుగులేని ప్రజాదరణ… ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చాడు… సీఎం అయ్యాడు… ఎన్టీయార్ కూడా ఆ బాటలోనే… సీఎం అయ్యాడు… హిందీ సూపర్ స్టార్ అమితాబ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు… కానీ రాజకుమార్ మాత్రం రాజకీయాల్లోకి రాలేదు… ప్రజల్లో ఉన్న ఆదరణను రాజకీయంగా వాడుకోవాలని, పీఠాలు ఎక్కాలని అనుకోలేదు… ఎందుకు..? ఇదెప్పుడూ ఓ ప్రశ్నే… నిజానికి ఓ దశలో ఆయన్ని ఎలాగైనా ఒప్పించి 1978 లోక్‌సభ […]
అరయగ కర్ణుడీల్గె..! హుజూరాబాద్ రిజల్ట్- ఓ తులనాత్మక పరిశీలన..!!
ఈటల గెలిచాడు…! నిజమే… అదేమిటి, బీజేపీ కాదా గెలిచింది..? కాదు…! నిర్మొహమాటంగా చెప్పాలంటే బీజేపీ కాదు… ఆ మాజీ అతివాద కమ్యూనిస్టు, అనంతరం తెలంగాణవాది, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు కాబట్టి, బీజేపీ గుర్తుపైనే పోటీచేశాడు కాబట్టి, బీజేపీ శ్రేణులు సిన్సియర్‌గా వర్క్ చేశాయి కాబట్టి… సాంకేతికంగా మాత్రమే ఇది బీజేపీ గెలుపు..! మరీ నిర్మహమాటంగా చెప్పాలంటే ఇది ఈటల వ్యక్తిగత సానుకూల వోటు కూడా కాదు… సంపూర్ణంగా ఇది కేసీయార్ వ్యతిరేక వోటు…! తన అహం కోసం, […]
ఈ ఖాకీ కొలువేం ఖర్మ..? అంత తెలివే ఉంటే కేబీసీలో 7 కోట్లూ కొట్టొచ్చు…!
ఉన్నవేమో 5,500 పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టులు… దరఖాస్తు చేసుకున్నవాళ్లేమో 8.29 లక్షల మంది… మరి వీళ్లను వడబోయడం ఎలా..? మెరికల్ని ఎంపిక చేయడం ఎలా..? హర్యానా ప్రభుత్వానికి ఎదురైన చిక్కు ప్రశ్న ఇది…! మూడు దశల ఎంట్రన్స్ టెస్టు పెట్టేసింది… ఆదివారం నుంచి మంగళవారం వరకూ…! ఆ ప్రశ్నపత్రం ఎంత గొట్టుగా సెట్ చేశారంటే… ఆ ప్రశ్నలకు జవాబులు గనుక తెలిస్తే కౌన్‌బనేగాకరోడ్‌పతిలో ఏడు కోట్ల ప్రైజ్ మనీ కొట్టొచ్చు… యూపీఎస్సీ సింగిల్ అటెంప్ట్‌లో క్రాక్ చేయొచ్చు… […]
ఈ ఓటమి ఛోడ్‌దేవ్… KCR ఇప్పటికీ చేస్తున్న పెద్ద బ్లండర్ ఏమిటంటే..?
కేసీయార్ అహానికి ఎందుకింత పెద్ద దెబ్బ తగిలింది..? ఈటల గొప్పతనమో, బీజేపీ కార్యశూరత్వమో, కాంగ్రెస్ నిస్సహాయ స్థితో, వికటించిన వ్యూహాలో కాదు… అంతకుమించిన స్వయంకృతాలు… తను, చంద్రబాబు ఒకే స్కూల్ నుంచి వచ్చారు గానీ, కేసీయార్ ఒక్క విషయానికి స్టికాన్ కావడంలో ఫెయిలయ్యాడు… ఒక నియోజకవర్గంలో ఒకడే రాజుగా ఉండకూడదు… ఉంచకూడదు… అది టీఆర్ఎస్ కాదు, ఎంత బలమైన పార్టీ అయినా సరే నష్టదాయకం… ఒక దశలో లీడర్ ఏమీ చేయలేని దుస్థితిలో పడిపోతాడు… ఇప్పుడూ అదే […]
హుజూరాబాద్ ఏం తేల్చింది..? జస్ట్, పది పాయింట్లలో నిష్ఠుర నిజాలు..!
వోటుకు అడ్డగోలుగా ధర పెంచేసి, జనాన్ని ‘ఆరు వేల’తో కొనుక్కోవచ్చునన్న ‘ధనఅహం’ ప్రతిసారీ గెలిపించదు అడిగిన ఫైళ్లన్నీ ఆగమేఘాల మీద శాంక్షన్ చేసేసి, పనులు చేసి, చిన్న నాయకుల్ని కొనే పథకాలూ ఫలించవు తాత్కాలిక భ్రమాత్మక పథకాలతో, పదిలక్షల చొప్పున సర్కారు ఖజానా నుంచే పంచినా కొన్నిసార్లు పనిచేయదు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దాసోహమైపోయినా, ప్రభుత్వం చెప్పినట్టు నడిచినా కొన్నిసార్లు ఫలితం లేదు అనేకానేక సోషల్ ఫేక్ పోస్టులతో దుష్ప్రచారాలు సాగిస్తే, అవి రిజల్ట్ ఇవ్వకపోగా ఎదురుతన్నే […]
జై భీమ్..! ఈ సినిమాను ఎందుకు మెచ్చుకోవచ్చునంటే..?
అత్యంత వెనుకబడిన, అణగారిన ఇరులార్ ఆదివాసీ తెగ సంక్షేమం కోసం హీరో సూర్య, జ్యోతిక దంపతులు కోటి రూపాయల విరాళాన్ని పళంకుడి ఇరులార్ ఎడ్యుకేషన్ ట్రస్టుకు ముఖ్యమంత్రి స్టాలిన్ సాక్షిగా అందించిన ఫోటో, వార్త చూశాం కదా… ఆ ట్రస్టును మాజీ లాయర్, జస్టిస్ చంద్రు నడిపిస్తున్నాడు… ఆ కథనానికి మనం చప్పట్టు కొట్టాం కదా, ఎంత మంచివాడవురా అని మెచ్చుకున్నాం కదా… ఈ వార్తకు నేపథ్యం తను తీసిన జైభీమ్ సినిమా… ఆ సినిమా అమెజాన్‌లో […]
ఈ జనాభిమానం ఫేక్ కాదు… కడుపుల్లో నుంచి తన్నుకొచ్చిన దుఖమే…
‘‘దక్షిణాదికి, అందులోనూ కన్నడకే పరిమితమైన ఓ వారసత్వ హీరో… లీడ్ యాక్టర్‌గా చేసినవి మహా అయితే 30 లోపు… తన డెస్టినీ బాగాలేదు కాబట్టి చిన్న వయస్సులోనే గుండెపోటుకు గురయ్యాడు… అంతేకదా, మరెందుకు కన్నడ ప్రభుత్వం, ప్రజలు, మీడియా, సోషల్ మీడియా అతిగా రియాక్టయ్యాయి..? నిజంగా ఈ రేంజ్ నివాళికి అర్హుడా..?’’……. ఇదీ ఒకాయనకు వచ్చిన సందేహం..! ఈ సందేహానికి నిజంగా అర్థం లేదు… ఎందుకంటే జనానికి ఎవరిని ప్రేమించాలో తెలియదా..? తనను గమనిస్తున్నారు, భిన్నమైన తన […]
ఎంత మంచివాడవురా…! భేష్ సూర్య-జ్యోతిక… చప్పట్లకు అర్హులు మీరు..!
అక్కడ పునీత్… ఇక్కడ విశాల్… సోనూసూద్, అక్షయకుమార్ సహా నటి ప్రణిత, లారెన్స్‌ల వరకు… ఎవరైనా సరే, స్పందించే హృదయం ఉన్న సినిమా ప్రముఖుల ఔదార్యం గురించి చెప్పుకుంటున్నాం, మనస్పూర్తిగా ప్రశంసించాం… మెచ్చుకోవాలి కూడా… ఆ పొగడ్తలు మరో పదిమందికి స్పూర్తినివ్వాలి… (సారీ, ఇక్కడ టాలీవుడ్ పెద్ద తలకాయల గురించి మాట్లాడటం లేదు…) ఈ జాబితాలోకి జ్యోతిక, సూర్య పేర్లను కూడా చేర్చొచ్చు… వీళ్ల తాజా వితరణ మరీ భిన్నమైన, మానవీయ అంశం… ముందుగా వార్తేమిటో చెప్పుకుందాం… […]
కేసినో @ ఫామ్ హౌజు..! దిగుదిగుదిగు నాగ… ఆ హీరో నాగశౌర్య చేసిన తప్పేమిటంటే..?
నిజానికి పైపైన చూస్తే ఈ పేకాట దందాలో హీరో నాగశౌర్య తప్పేమీ ఉన్నట్టు అనిపించదు… కానీ మరో కోణంలో చూస్తే తన తప్పులూ కొన్ని కనిపిస్తయ్… అదేనండీ… హైదరాబాద్ శివారులో ఓ ఫామ్ హౌజులో పోలీసులు పేకాట దందాను బ్రేక్ చేసి, 30 మందిని అరెస్టు చేశారనీ, అందులో రాజకీయ నాయకులు, కంట్రాక్టర్లు ఉన్నారనే వార్త… ఇక్కడ కొన్ని అంశాలు ప్లెయిన్‌గా చెప్పుకోవాలి… హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రిసార్టుల్లో, ఫామ్ హౌజుల్లో డ్రగ్ పార్టీలు, రేవ్ పార్టీలు, […]
Ish Sodhi… పేరు గుర్తుందా..? మనోడే… మరి తిడతారా..? చప్పట్లు కొడతారా..?!
ఆటగాళ్లు అకస్మాత్తుగా తన ఫామ్ కోల్పోతుంటారు, ప్రత్యేకించి క్రికెట్‌లో..! టీమ్స్‌కు కూడా ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుంది… మొత్తంగా ఫామ్ కోల్పోతారు, అసలు వీళ్లకు ఆట వచ్చా అన్నట్టుగా వైఫల్యాలు వెక్కిరిస్తయ్… సహజమే… అయితే క్రికెట్ అంటేనే వేల కోట్ల దందా కాబట్టి… ఫిక్సర్లు, బెట్టింగ్ మాఫియాలు, విపరీతమైన డబ్బు, స్పాన్సరర్లు, ప్రలోభాలు, విలాసాలు ఉంటయ్ కాబట్టి, మన దేశంలో క్రికెట్ అంటే ఓ మతం కాబట్టి ఈ చర్చ కాస్త ఎక్కువ… పోనీ, టీ20 వల్డ్ […]
భేష్ విశాల్..! నీ నిర్ణయం మా ‘గొప్ప హీరోలకూ’ స్పూర్తినిచ్చుగాక..!
మంచి సంకల్పం… మంచి తోడ్పాటు… స్నేహితుడి దాతృత్వానికి కొనసాగింపు… భేష్ విశాల్..! మొన్న హఠాత్తుగా మరణించిన తన స్నేహితుడు, కన్నడహీరో అప్పు పునీత్ రాజకుమార్ ఆశయాల్ని కొనసాగిస్తాననీ, పునీత్ చదివిస్తున్న 1800 మంది పిల్లల బాధ్యత, ఖర్చు ఓ సంవత్సరంపాటు తను భరిస్తాననీ విశాల్ ప్రకటించాడు… తన ఎనిమీ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో చెప్పాడు… గుడ్, అభినందనలు విశాల్… ఏదో ఓ ఎమోషన్‌లో చెబుతారులే అని విశాల్ మీద సందేహపడనక్కర్లేదు… ప్రజలకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు స్వయంగా […]
పాతాళలోకం నిజంగానే ఉన్నట్టుందట సుమా… తాజా రీసెర్చులు చెబుతున్నయ్…
ఈ విశ్వంలో ఎన్ని లోకాలున్నయ్… మన పురాణాల మేరకు ఆలోచిస్తే పద్నాలుగు… ఊర్ద్వలోకాలు ఏడు, అధోలోకాలు ఏడు… అధోలోకాలు అంటే నీచమైనవి అని కాదు, దిగువన ఉండేవి అని..! ఊర్ధ్వంలో ఉండేవి భూలోకం భువర్లోకం సువర్లోకం మహర్లోకం జనలోకం తపోలోకం సత్యలోకం మరి అధోలోకంలో… అతలం వితలం సుతలం రసాతలం మహాతలం తలాతలం పాతాళం ఛట్, ఇవన్నీ పుక్కిటి పురాణాలు… ఊర్ధ్వంలో ఏముంది..? అంతరిక్షం, ఖగోళం… చిక్కటి చీకటి, శూన్యం… భూమికి దిగువన ఏముంది..? తవ్వేకొద్దీ నీరు, […]
టాలీవుడ్ రేంజ్ చాలా పెద్దది… కానీ అవార్డుల జాబితాల్లో జాడే కనిపించదు…
ఓ మిత్రుడు అడిగాడు… ఆస్కార్ ఎంట్రీ కోసం పద్నాలుగు సినిమాల్ని జ్యూరీ పరిశీలనకు తీసుకుంది కదా… అవి ఏవి అని..? చెబుతాను… ఆస్కార్ ఎంట్రీకి పంపించిన తమిళ సినిమా కూళంగల్ గాకుండా… సర్దార్ ఉధమ్ (హిందీ), లైలా ఔర్ సత్త గీత్ (గోజ్రి), షేర్ని (హిందీ), చెల్లో షో (గుజరాతీ), నాయత్తు (మలయాళం), బ్రిడ్జి (అస్సామీ), షేర్ షా (హిందీ), మండేలా (తమిళం), కాగజ్ (హిందీ), అట్ట వేల్ జాలి (మరాఠీ), తూఫాన్ (హిందీ), గోదావరి (మరాఠీ), […]
పాపం సోనియమ్మ..! తెలంగాణ ఇచ్చింది – ఇదుగో ఈ నేతల్ని నమ్ముతోంది..!!
ఇప్పుడు చెప్పండి… ప్రశాంత్ కిషోర్ మాటల్లో తప్పేముందో..? అవే మాటల్ని మమతా బెనర్జీ వల్లెవేయడంలో తప్పేమిటో..? ఉన్నమాటే అన్నారు… కాంగ్రెస్ బలహీనతలే బీజేపీకి ప్లస్… లేదా తెలంగాణ కోణంలో చూస్తే టీఆర్ఎస్‌కు ప్లస్..! ప్రజల కోరిక మేరకు, ఏపీలో పార్టీని పణంగా పెట్టి మరీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా, అధికారంలోకి రాలేక.., కేసీయార్ కొట్టిన వరుస దెబ్బలతో బలహీనపడిన కాంగ్రెస్ దుస్థితి నిజంగానే టీఆర్ఎస్‌కు ఓ ఫాయిదా… పార్టీలో ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారో కూడా పార్టీ […]
- « Previous Page
- 1
- …
- 419
- 420
- 421
- 422
- 423
- …
- 450
- Next Page »