ద్రౌపది పాత్రలో నటి రౌద్రావతారం! చావుదప్పి బతికి బయటపడ్డ విలన్! ——————- బలిజేపల్లి లక్ష్మీకాంత కవి సత్యహరిశ్చంద్ర నాటక రచయితగా జగత్ ప్రసిద్ధుడు. ఆ నాటకం ప్రదర్శించని ఊరు తెలుగు నేల మీద బహుశా ఉండదు. “భక్తయోగ పదన్యాసి వారణాసి…” “తిరమై సంపదలెల్ల..” పద్యాలు అందులోనివే. నాటకాన్ని సినిమా మింగనంతవరకు, మూడు యుగాలు గడచినా పూర్తి కాని సీరియళ్లతో టీ వీ లు వేయి తలలుగా విస్తరించనంతవరకు నాటకం పద్యాలు వినేవారు ఉండేవారు. డి వి సుబ్బారావు, […]
రెడ్ వాల్..! కణకణ మండిన ఆ రోజుల్లోకి… వేలాది మంది జ్ఞాపకాల్లోకి…
ఒక ఫోటో… ఆశ్చర్యం వేసింది… బెంగుళూరు గూన కప్పిన ఓ పాత ఇల్లు… సిమెంటు పూతలతో మాసికలు వేసిన పాత గోడ… పక్కన ఓ జిల్లేడు చెట్టు… గోడపై విప్లవం వర్ధిల్లాలి అనే వాల్ రైటింగ్… సుత్తీకొడవలి గుర్తు… లంగావోణి, బుగ్గల జాకెట్ వేసుకున్న ఓ అమ్మాయి ఆ సుత్తీ కొడవలి గుర్తు చుట్టూ ఓ లవ్ సింబల్ గీస్తోంది… విప్లవాన్ని ప్రేమిస్తోందా..? విప్లవం కూడా ఓ ప్రేమ చర్యే అంటోందా..? ఆ కథలోకి తరువాత వెళ్దాం… […]
అక్షర..! సర్కారీ విద్యలాగే… లైన్ తప్పి, వెగటు కామెడీలో గింగరాలు..!!
అక్షర అనే సినిమా విడుదలైంది నిన్న… కరోనా కారణంగా పెండింగ్ పడిపోయిన సినిమాలన్నీ చకచకా గుమ్మడికాయలు కొట్టేసుకుని, థియేటర్లలో వచ్చి వాలుతున్నయ్… నిన్న పలు సినిమాలు రిలీజైనా అందరి దృష్టీ ప్రధానంగా నితిన్ సినిమా చెక్ మీదే కాన్సంట్రేట్ అయింది… అది కాస్తా ఛస్ అనిపించుకుంది… చాలా తక్కువ మంది ప్రేక్షకుల దృష్టి అక్షర అనే సినిమా మీద పడింది… అదీ నందిత శ్వేత మొహం చూసి…! కార్పొరేటు విద్య ఒక మాఫియాగా మారి, క్రమేపీ పేదవాడి […]
మామాఅల్లుళ్లకు అవమానమే..! ఐతేనేం, తమ్ముళ్లకు నమ్మకం పోతోంది మరి..!!
ఆంధ్రజ్యోతి న్యూస్ సైటులో ఒక వార్త… కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబును కార్యకర్తలు ఓ కోరిక కోరారు… కాదు, డిమాండ్ చేశారు… ఏమనీ అంటే..? ప్రచారానికి జూనియర్ ఎన్టీయార్‌ను తీసుకురావాలి అని..! ఇలాంటి డిమాండ్తు అప్పుడప్పుడూ తెలుగుదేశం శ్రేణుల నుంచి వ్యక్తం అవుతున్నయే కాబట్టి ఇందులో పెద్దగా కొత్త వార్తావిశేషం ఏమీ లేదు అనుకోవాలి… కాన చంద్రబాబు మౌనంగా తలూపాడు అని ఆ వార్తలో ఉన్న వాక్యమే కాస్త నవ్వు పుట్టించింది… ఎందుకంటే..? చంద్రబాబు ఆదేశించగానే జూనియర్ ఎన్టీయార్ […]
బిరుదు కావాలా నాయనా..? మన మార్కెట్లో చౌక సరుకే ఇది…!!
కీర్తి ప్రతిష్ఠల కోసమే లోకం బతుకుతూ ఉంటుంది. తిరుమల కొండమీది వెంకన్న కీర్తి ప్రభతో- వికారాబాద్ పక్కన అనంతగిరి కొండల్లో ప్రశాంతంగా ఉన్న అనంతపద్మనాభస్వామి ప్రభను పోల్చడానికి వీల్లేదు. ఎవరి కీర్తి వారిదే. తిరుమల వెంకన్న అన్నమయ్య అంతటి మహామహుడిని పి ఆర్ ఓ గా పెట్టుకుని పోషించగలిగాడు. అనంతగిరి స్వామికి ఆర్థికంగా అంత వెసులుబాటు లేదేమో? లేక అన్నమయ్య లాంటి కారణజన్ముడు దొరకలేదేమో? మనకెలా తెలుస్తుంది? అది పెరుమాళ్లకే ఎరుక! మనిషికయినా, దేవుడికయినా, చివరకు రాక్షసుడికయినా కీర్తి […]
డర్టీ కాంట్రవర్సీ..! అమెరికన్లకు చైనా గుదపరీక్షలు..! ఓ పంచాయితీ..!!
దేశాల నడుమ సత్సంబంధాలు లేనప్పుడు, ఉన్న సంబంధాలు క్షీణించినప్పుడు… కొన్ని అంశాలు భూతద్దంలో చూడబడతాయి..! కొత్త వివాదానికి తెరతీస్తాయి… ఇదీ అలాంటిదే… అనేకానేక అంశాల్లో అమెరికా- చైనా నడుమ వైరం సాగుతోంది… ప్రపంచ అధిపత్యం కోణంలోనే..! ఏ విషయమైనా సరే ఒకదానికొకటి లక్ష సందేహాలతో చూస్తున్నయ్… తాజాగా ఓ వార్త కాస్త చదవబుల్ అనిపించింది… ఈమధ్య చైనా కరోనా పరీక్షలకు సంబంధించి ఏం చేస్తున్నదంటే… వేరే దేశాల నుంచి వచ్చినవాళ్లకు, క్వారంటైన్లలో ఉన్నవాళ్లకు, అనుమానితులకు యానల్ స్వాబ్ […]
హిమ స్వర్ణం..! ఇండియన్ సోషల్ మీడియా సంబరం… చాలా అరుదు..!
జులై 2018… ఫిన్లాండ్… పరుగుకు సంబంధించిన అంతర్జాతీయ స్థాయి పోటీ… అనూహ్యంగా ఓ ఇండియన్ అథ్లెట్… పేరు హిమాదాస్… ఒక విభాగంలో గోల్డ్ మెడల్ కొట్టింది… బహుమతి ప్రదానం వేళ, జనగణమన గీతం వినిపిస్తుంటే, గెలిచిన ఆనందాన్ని, ఎమోషన్‌ను ఆపుకోలేక కన్నీరు కార్చేసింది… అది నటన కాదు… గుండెల్లో నుంచి తన్నుకొచ్చిన ఉద్వేగం… ఒక విశ్వవేదిక మీద స్వర్ణం గెలిచిన హిమదాస్‌ను, ఆమె కన్నీళ్లను చూసి జాతితోపాటు జాతి కూడా కదిలిపోయింది, గర్వించింది… మనసారా చప్పట్లు కొట్టి […]
సోప్ వేసిన సోప్ ప్రకటన..! తెల్లటి మాయకు తెలివైన ప్రయాస..!!
మా సోప్ శరీరం రంగు చూడదు! మా ప్రకటన భాష చూడదు!! ——————– డోవ్ అని ఒక ఒళ్లు రుద్దుకునే సోప్. ఆ సోప్ పాఠకులకు ఒక ప్రకటన సోప్ వేసింది. ఒక ఇంగ్లీషు పత్రికలో ఫస్ట్ పేజీలో సగం, రెండో పేజీ మొత్తం ఉన్న ఈ ప్రకటనలో కనిపిస్తున్న మనిషి ఊరు, పేరు కూడా వేశారు. “No digital distortion” అని అదే ప్రకటనలో ప్రత్యేకంగా చెప్పుకున్నారు. అంటే గ్రాఫిక్స్, మార్ఫింగ్, రంగులు మార్చడం లాంటివి […]
చెక్ నితిన్..! ఎంత ఏలేటి అయితేనేం… కమర్షియల్ లెక్కల్లో బోల్తా…!!
ఒక్కసారి ఆ హీరో నితిన్ కోణం వదిలేయండి… ఆ దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్ మీద మనకు సదభిప్రాయం ఉంది కదా… డిఫరెంటు కంటెంటు, మంచి స్క్రీన్ ప్లే, నాన్-ఫార్ములా…. కాదు కాదు.., తెలుగు సినిమా ప్రధాన అవలక్షణమైన నాన్-నాన్సెన్స్ ఉండదు కదా తన సినిమాల్లో అనే ఓ పాజిటివ్ ఒపీనియన్ మనలో ఉంది కదా… అందుకనే ఈ కొత్త సినిమా ‘చెక్’ మీద కాస్త ఇంట్రస్టు ఫోకసైంది… అంతేతప్ప ఇప్పటివరకు పెద్దగా తనకంటూ చెప్పుకోదగిన ఓ సినిమా […]
వజ్రాన్ని నేను…! నీరవ్ మోడీ అంతరాత్మ బహిరంగ లేఖ..!
చనిపోయినవారికే ఆత్మలు ఉంటాయనడం శాస్త్ర విరుద్ధం. అసలు ఆత్మకు చావే లేదని గీతలో శ్రీకృష్ణుడు బల్లగుద్ది మరీ చెప్పాడు. ఆత్మను కత్తి కోయలేదు. అగ్ని కాల్చలేదు. నీళ్లు తడపలేవు. గాలి ఎండబెట్టలేదు. ఆత్మ నిత్యం. ఆత్మ సత్యం. మనసులోపలి మనసును అంతరాత్మ అంటున్నాం. అంటే ఆత్మకంటే అంతరాత్మ ఇంకా గొప్పది అనుకుంటే చాలు. అంతకంటే లోతుగా వెళితే ఆత్మల అంతరాత్మల మనోభావాలు దెబ్బతింటాయి. మనస్సాక్షి కంటే అంతరాత్మ సాక్షి ఇంకా గొప్పది. అందుకే నీ అంతరాత్మను నువ్వే […]
ఇంట్రస్టింగు తీర్పు…! మహిళ పుట్టింటివారికీ ఆస్తిలో వారసత్వహక్కు..!!!
ఒకాయన… అకస్మాత్తుగా మరణించాడు… తనకు కొంత ఆస్తి ఉంది… అందులో ఎవరికి వారసత్వపు హక్కు ఉంటుంది..? మామూలుగా మనకు తెలిసిన వారసత్వపు పద్ధతులు, ఆనవాయితీలు, పెద్దల తీర్పులు, చట్టాల ప్రకారం… కొడుకు ప్రథమ హక్కుదారు… ఇప్పుడు స్త్రీలకూ ఆస్తి హక్కు వర్తిస్తున్నది కాబట్టి బిడ్డ కూడా హక్కుదారు… భర్త ఆస్తిపై సహజంగానే భార్య హక్కుదారు… కొడుకుల సంతానం, బిడ్డల సంతానం కూడా హక్కుదారులే… అంతేకదా… ఆ భార్య తరపు తమ్ముళ్లు, అన్నలు వచ్చి, ఆ ఆస్తి మీద […]
డంకీ బిర్యానీ… డంకీ కబాబ్స్… డంకీ బర్గర్స్… లొట్టలేస్తున్నారట ఏపీజనం..!!
ఈకాలంలో ఏ జీవజాలాన్ని పెంచడం లాభదాయకం..? కోళ్లు..? మేకలు- గొర్లు..? డెయిరీ..? పందులు..? గుర్రాలు..? చేపలు..? రొయ్యాలు..? సారీ, ఇవేవీ కావు… గాడిదల పెంపకమే సూపర్ డూపర్ క్లిక్కయ్యే వ్యాపారం కాబోతోంది… అవసలే గాడిదలు కదా… ఏం పెట్టినా పర్లేదు, మొండి జీవాలు… అవే పెరుగుతాయి… మార్కెట్ కూడా ఈజీ… అబ్బే, బరువులు మోయడానికి కాదులే బాబూ… మంచి శ్రేష్టమైన మాంసం, పాలు… గాడిదల పాల విక్రయం అందరమూ చూస్తున్నదే… కానీ గాడిద మాంసం తింటారా.?. అని […]
లెఫ్ట్, రైట్ కలిసి… రైట్ రైట్..! బెంగాల్లో బద్ధవైరుల నయా దోస్తానా..!!
సాధారణంగా లెఫ్ట్, బీజేపీ అంటేనే ఉప్పూనిప్పూ టైపు కదా… సహజంగానే ఒకటి కుడి, ఒకటి ఎడమ… అనేకానేక రాజకీయ అంశాల్లో ఒకటి తూర్పు, ఒకటి పడమర… ఎరుపుకూ కాషాయానికీ ఎప్పుడూ పడదు… ఇలా చెప్పుకుంటూ పోతే ఒడవదు, తెగదు… అంత వైరుధ్యం… రాజకీయ ప్రత్యర్థి అనే స్థాయిని కూడా దాటేసిన వైరం… కేరళలో కసకసా నరుక్కోవడమే… బెంగాల్లో కూడా గతంలో అలాగే ఉండేది … కానీ ఇప్పుడు విశేషం ఏమిటంటే..? ఆ రెండూ కలిసి పనిచేస్తున్నాయి… లెఫ్ట్, […]
బాబోయ్… ఇదేం వార్తారచన తండ్రీ… ఈనాడును ఏదో పాము కాటేసింది…
చదివేస్తే ఉన్న మతి పోయింది…. ఈ వాక్యం ఈనాడుకు అక్షరాలా సరిపోతుంది… రోజురోజుకూ అదే నిరూపించుకుంటోంది… రాజకీయ నాయకుల మీటింగులు, ప్రకటనలు రాసీ రాసీ… క్షుద్ర అనువాదాల యజ్ఞంలో మతులు పోగొట్టుకుని… మంచి రచనశైలిని చేజేతులా బొందపెట్టుకుంటోంది ఈనాడు… ఉదాహరణకు ఈ వార్త… ఫీల్డ్ నుంచి వచ్చిందే పరమ నాసిరకం కాపీ… దాన్ని యథాతథంగా అచ్చేశారు… కనీసం దీన్ని మార్చాలని గానీ, మంచి మానవాసక్తి కథనంగా మార్చాలని గానీ ఆలోచించలేదు… నిజానికి కాస్త మెలో డ్రామా, ఇంట్రస్టింగు […]
రైల్వే ప్రయాణాలు తగ్గించండి… లేకపోతే చార్జీలు ఇంకా పెంచేస్తాం…
కరోనా వ్యాప్తి నిరోధానికి రైల్వేశాఖ చిట్కా వైద్యం! ——————- ప్రజలచేత, ప్రజలకోసం, ప్రజల వలన, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వం అంటారు. తెలుగులో మనం ప్రయత్నపూర్వకంగా మరచిపోయిన విభక్తి ప్రత్యయాల్లో మరికొన్ని కలిపి ప్రజల కిన్, కున్, యొక్క, లోన్, కంటెన్, వలనన్, పట్టి, చేతన్, చేన్, తోడన్, తోన్ అని కూడా గంభీరంగా అనుకోవచ్చు. ప్రజలే ప్రభువులు అన్నది ప్రజాస్వామ్య మౌలిక ఆదర్శం. పునాది. సూత్రం. సిద్ధాంతం. ప్రజలకు ఏమి కావాలో ప్రభుత్వం […]
దక్షిణ కుంభకోణం..! పూజారుల భారీ మోసాల్ని పట్టేసిన కేరళ సర్కారు..!!
ముందుగానే ఓ డిస్‌క్లెయిమర్… మన దేవాదాయ, ధర్మాదాయ శాఖలు అచ్చంగా హిందూ దేవుళ్ల ఆదాయాన్ని సుబ్బరంగా భోంచేయడానికి తప్ప ఎందుకూ పనికిరావు… పనికిరాని శాఖల్లో నంబర్ వన్ శాఖ అదే… ఐనాసరే, ఏ ప్రభుత్వమూ దాన్ని రద్దు చేయదు… గుడి పఢావు పడినా సరే ఆ శాఖ మాత్రం పచ్చగా కళకళలాడుతూ ఉండాల్సిందే… ఒక మత సంస్థలపై సర్కారు పెత్తనం ఏమిట్రా అని ఎవడూ అడగడు…! ఇక అసలు స్టోరీకి వద్దాం… అసలు లెఫ్ట్ పార్టీలు అంటేనే […]
హమ్మయ్య… బ్రేవ్, ఆకలి తీరింది… మరో కొత్త బతుకును వెతుక్కోవాలిక..!!
హమ్మయ్య… కడుపు నిండింది మీడియాకు… చట్టానికి… సోషల్ మీడియాకు… సొసైటీకి… సినిమాలకు… టీవీ సీరియళ్లకు… అర చేతిలో స్మార్ట్ ఫోన్‌గా ఇమిడిన ప్రలోభానికి…!! ఆ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని, అందరి ఆత్మలకీ శాంతి చేకూర్చింది… తమ వల్లే దారితప్పిన ఓ యువతి జీవితం, తాము ఎంత పీక్కుతింటున్నా సరే, మళ్లీ ఎక్కడ నిలదొక్కుకుంటుందో, ఎక్కడ బాగుపడిపోతుందో అని తల్లడిల్లిపోయిన ఈ శక్తులన్నింటికీ ఇప్పుడు తృప్తిగా ఉంది… ప్రస్తుతానికి వీటి ఆకలి తీరింది… ఇప్పుడిక మరో కొత్త […]
ఫ్యామిలీనే నరికేసింది..! ఆమెకు ఉరిశిక్ష వర్ణవివక్షేనట సాక్షి కలాలకు..!!
ఫాఫం సాక్షి..! రోజురోజుకూ దానికి ఓ దశ, ఓ దిశ లేకుండా సాగిపోతున్నది… నిన్న ఫ్యామిలీ పేజీలో షబ్నమ్ ఉరిశిక్ష మీద వచ్చిన ఓ పెద్ద స్టోరీ నిజానికి విభ్రమ కలిగించింది… అందులో కొన్ని వాక్యాలు చదవండి ముందుగా… ‘‘భారతదేశంలో ఉరికి ఎదురుచూస్తున్న 12 మంది స్త్రీలు వెనుకబడిన, మైనారిటీ వర్గాలకు చెందినవారే కావడం నేరానికీ-శిక్షకూ-వెనకబాటుతనానికీ ఉన్న లంకె చర్చకు వస్తోంది… ‘ఉరిశిక్ష’ అని ఈ దేశంలో చర్చ జరిగినప్పుడల్లా ఆ ఉరిశిక్ష ‘ఎవరికి’ పడింది అనేది […]
ఫ్లోరైడ్ రక్కసి..! తెలంగాణను వదల్లేదట… మరి విముక్తి ప్రకటనల కథేంటి..?!
‘‘విషం పీడ విరగడ’’ అంటూ… తెలంగాణ ఫ్లోరైడ్ విముక్తప్రాంతంగా మారిపోయింది అంటూ… ఐదేళ్లలో దాదాపు వేయి గ్రామాలను ఈ భూతం నుంచి రక్షించినట్టే అంటూ… తెలంగాణ ప్రభుత్వం ఘనంగా చాటుకున్న ఘనత నిజం కాదా..? సాక్షిలో పబ్లిషైన ఓ స్టోరీ కొత్త ప్రశ్నలను, సందేహాలను జనం ముందుంచింది… నిజానికి సాక్షి పత్రికేనా ఇది రాసింది అనే డౌటొస్తుంది ఈ కథనం చూడగానే…! బహుశా వెలుగు పత్రిక అయి ఉంటుందేమోలే అనే భ్రమనూ కల్పిస్తుంది… కానీ నిజమే… సాక్షిలోనే […]
ఎంపిక వరకూ సరైన ఎత్తుగడ… కానీ రాంగ్ స్ట్రాటజీలో క్యాంపెయిన్…
కేసీయార్ తమ పార్టీ తరపున హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ కూతురు వాణీదేవి పేరు ప్రకటించాడు… ఆయన కోణంలో ఆమె ఎంపిక సరైన ఎత్తుగడ… పార్టీ బరిలో దిగకుండా ఇంకెవరికో మద్దతు ప్రకటించడంకన్నా, తను గతంలో హామీ ఇచ్చిన మేరకు పీవీ కుటుంబసభ్యుల్లో ఒకరికి ఒక పొలిటికల్ చాన్స్ కల్పించడం వరకూ వోకే… అయితే తన క్యాంపు ఆమెను ఫోకస్ చేయడంలో రాంగ్ స్ట్రాటజీలో వెళ్తోంది… ఆమె అభ్యర్థిత్వం పట్ల బ్రాహ్మణ సంఘాలన్నీ ఆనందాన్ని, […]
- « Previous Page
- 1
- …
- 430
- 431
- 432
- 433
- 434
- …
- 466
- Next Page »