ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే… ఎవరు కుర్చీల మీద కూర్చుని సమాజాన్ని ఉద్దరిస్తున్నా సరే….. తిరుమల శ్రీవారికి చేసేదేమీ ఉండదు, పైగా దేవుడి ఆదాయాన్ని రకరకాలుగా దోచుకుని తినడం తప్ప..! వాటికన్ సిటీ… అక్కడి దాకా ఎందుకు..? స్వర్ణదేవాలయం వెళ్లి, ఈ సోకాల్డ్ తిరుమల ఉద్ధారకులు రెండు రోజులు పరిశీలించి వస్తే చాలు… తిరుమల ఏడు కొండలనూ, తిరుమల దేవాలయాన్ని ఎంత అద్భుతమైన హిందూ క్షేత్రంగా చేయవచ్చో అర్థమవుతుంది… కానీ ఎవరూ చేయరు… చేస్తే పొలిటిషియన్స్ […]
రంగ్ దే..! వెలిసిపోయిన కథాకథనాలకు కొత్త రంగులెన్ని పూస్తేనేమిటోయ్..?
అప్పుడెప్పుడో చిన్న పోరడి లెక్క ఉన్నప్పుడు… జయం అనే సినిమా వచ్చింది… 2002 కావచ్చు… దాదాపు ఇరవయ్యేళ్లు… ఒక హీరోకు ఎంత సుదీర్ఘమైన కెరీర్… ఎస్, ఇది నా సినిమా అని చెప్పుకునే ఒక్క సినిమా, ఒక్క పాత్ర లేకపోతే… ఆ హీరోను ఏమనాలి..? ఫీల్డులో అలాంటోళ్లు చాలామంది ఉన్నారు… కానీ ప్రస్తుతానికి నితిన్ రెడ్డి అనాలి…!! జయం సినిమాకూ ఇప్పటికీ తనేమైనా మారాడా..? లేదు… ఒక నటుడిగా అలాగే ఉన్నాడు… తను మారడు, మారే సవాలే […]
కత్తి రత్నప్రభ తిరుపతి అభ్యర్థిత్వంపై కత్తి మహేష్ ఏమంటాడంటే..?!
……By…. Mahesh Kathi……………… కత్తి రత్నప్రభ గారు నిబద్ధత కలిగిన ఐఏఎస్ అధికారిణిగా రాణించారు. దళితజాతికి ఎంతో సేవచేసిన కత్తి చంద్రయ్యగారి వారసురాలు. జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి బరిలో దిగడం వ్యక్తిగతంగా నాకు ఆనందాన్ని కలిగించే విషయం. కాకపోతే దీని వెనకాల ఉన్న స్ట్రాటజీని కొంత గమనించాల్సిన అవసరం ఉంది. జగన్ పైన పెట్టిన కేసుల్లో,రత్నప్రభ గారికి కూడా కోర్టు నోటీసులో జారీచెయ్యడం. తరువాత కేసు కొట్టివేయ్యడం జరిగింది. కాబట్టి రత్నప్రభ గారికి జగన్ […]
దిక్కుమాలిన కౌలు రైతులు..! మా బంగారు తెలంగాణకు అరిష్టం, అష్ట దరిద్రం..!!
ఐనా మనకెందుకులే… ఎవడు ఆత్మహత్య చేసుకుంటేనేం..? కుటుంబాలతో సహా పరలోకాలకు పయనం కడితేనేం..? అప్పులే కదా ఆఫ్టరాల్… పుట్టేవాడు పుడతాడు, చచ్చేవాడు చస్తాడు… మనం బంగారు తెలంగాణ కోసం చప్పట్లు కొడదాం… మన పాత కష్టాలన్నీ మరచి, మన పాత గోసలను మరచి, పాలకులకు ఆహాఓహో అని డప్పులు కొడదాం…. తెలంగాణ వస్తే ఏమొచ్చింది అనే ఓ భ్రమాత్మక నినాదాన్ని భుజాన మోద్దాం, నయా నియంతల పల్లకీలు మోద్దాం… దిక్కుమాలిన కౌలు రైతులు… ఎవడికి పుట్టిన బిడ్డరా […]
ఎహె… కరకు లాఠీ నవల రాయడమేంటి..? ఖాకీ బతుకు కథాంశమేంటి..?!
…… By Taadi Prakash……………. హెడ్ కానిస్టేబుల్ మోహన్ రావు…… Protest against police ——————————————— కొన్ని రోజుల క్రితం మరణించిన తెనాలి హెడ్ కానిస్టేబుల్ మాకు మిత్రుడు. 1996 – 97 లో రెడ్ హిల్స్ లోని ఆర్టిస్ట్ మోహన్ ఆఫీస్ కి వచ్చినప్పుడే నాకు పరిచయం. సరదా మనిషి. మంచి కామన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాడు. ఆయన గత జీవితం గురించి మాకేమీ తెలీదు. సింపుల్ మనిషి. చాలా ప్రాక్టికల్. కూతురు, […]
అబ్బే, ఇది ఉత్త ఆర్గానిక్ కాదోయ్… పవిత్రమైన కాస్మిక్ రైస్ తెలుసా..?
అంతరిక్ష భోజనంబు! ఓహోహో నాకే ముందు!! ——————– “అస్తు..అస్తు.. శాస్త్రమెప్పుడూ ఏం చెప్పినా నిష్కర్షగానూ, కర్కశంగానే చెబుతుంది. మనం సౌమ్యంగా సారాంశమే తీసుకోవాలి” ఇది తెలుగు సినిమాలకు వెలుగు దీపమయిన మాయాబజార్ లో పింగళివారి గొప్ప మాట. “పాండిత్యం కన్నా జ్ఞానమే ముఖ్యం” అని ఘటోత్కచులవారి చేత ఇందులోనే చెప్పించారు. భారతంలో అసలు జరగని కథను కల్పించి, దానికి మాయాబజార్ అని అత్యాధునిక ట్రెండీ పేరు పెట్టి, మాటల్లో, పాటల్లో తెలుగు భాష మాధుర్యాన్ని, మాటల మధ్య […]
అరణ్య..! ఏనుగులకూ కళ్లుంటయ్, కన్నీళ్లుంటయ్, హక్కులుంటయ్..!
Hastir Kanya Hastir Kanya Bamoner Nari Mathai Niya Kam Kalasio Haate Sonar Sakhio…….. ఓ గజరాజు కూతురా..? ఓ బ్రాహ్మణ మహిళా… మణికట్టుకు బంగారు కంకణం ధరించినట్టే ఎప్పుడూ కన్నీటి కడవలను మోస్తుంటావు తల్లీ… అస్సోంలో మావటీలు పాడుకునే ఓ పాపులర్ జానపదానికి రఫ్‌గా ఇదీ తెలుగు అనువాదం… ఏనుగులకూ మనిషికీ నడుమ బంధాన్ని చెప్పే గీతం… రానా నటించిన అరణ్య చూస్తుంటే ఈ పాటే కాదు… అస్సోంలో ఆమధ్య ఏనుగుల స్వేచ్ఛాసంచారానికీ […]
‘‘షేపులు మారిపోయి… మన ఆడవాళ్లు డ్రమ్ముల్లా బలిసిపోతున్నారు…’’
ఒకరు… ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, బీజేపీ… రిప్డ్ జీన్స్ మీద నోరు పారేసుకుంటాడు… మరొకరు… బెంగాల్లో ప్రముఖ లీడర్, బీజేపీ… పొట్టి నిక్కర్లు వేసుకో అని ముఖ్యమంత్రి మమతను వెక్కిరిస్తాడు… ఆగండాగండి… బీజేపీయే కాదు, స్త్రీల మీద వెకిలి కామెంట్లు చేసే రోగం అన్ని పార్టీల్లోనూ ఉన్నదే… తాజా ఉదాహరణ కావాలా..? ఇది మరీ బీజేపీ లీడర్ల వాచాలత్వాన్ని మించిన చిల్లరతనం… డీఎంకే లీడర్ ఆయన… పార్టీ ప్రచార కార్యదర్శి కూడా… పేరు దిండిగల్ లియోనీ… కోయంబత్తూరులో […]
ఐపోయిందా..? జగన్ మళ్లీ జైలుకేనా..? బీజేపీతో దోస్తీ చెడిపోయినట్టేనా..?!
ఒక సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ రమణ మీద… తన సొంత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, అదీ కులరాజకీయాల్లో కంపుకొడుతున్న ఒక రాష్ట్రం నుంచి… తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుకు సన్నిహితుడు అని ఆరోపణల్ని వ్యాప్తి చేస్తున్న స్థితిలో………. అదే జడ్జిని భావి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించే స్థితి వైపు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం ఖచ్చితంగా ఓ డిబేటబుల్ సబ్జెక్టు…. కానీ ఎప్పుడైతే సుప్రీం అంతర్గత విచారణలో ముఖ్యమంత్రి చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చి, సదరు […]
తమిళనాట మూలిగే బీజేపీపై కొత్తగా శ్రీలంక దెబ్బ… కుయ్యో మొర్రో…
మూలిగే నక్క మీద తాటిపండు అంటే ఇదే…! అసలే తమిళ రాజకీయాల సంక్లిష్టత అర్థం చేసుకోలేక… చిత్రవిచిత్ర సమీకరణాలతో ఆడుకుని, తీరా తను ఆశించిన ఏ సానుకూలతా ఇప్పుడు కనిపించక మూలుగుతున్న బీజేపీకి ఇప్పుడు మరో అంతర్జాతీయ అంశంతో మరింత దిక్కుతోచని స్థితి ఏర్పడింది… నిజానికి ఇదొక ఇంట్రస్టింగు డిబేట్… జయలలిత మరణించాక, శశికళను జైలుకు పంపించేశాక, ఇప్పటికీ ఆమెను రాజకీయ చట్రం నుంచి బయటికి తరిమేశాక, రజినీకాంత్‌ను దూరం కొట్టేశాక… ఇప్పుడు బీజేపీకి కనిపించే పరిస్థితి […]
వేక్సిన్ వేసుకోవాలా..? పనిచేస్తుందా..? మళ్లీ సోకుతుందా..? చదవాల్సిన ఇన్ఫో…!
By…… Jagannadh Goud…………………. వ్యాక్సిన్ పనిచేస్తదా..? వేసుకోవచ్చా..? ఎనీ గ్యారంటీ…! మొదట వ్యాక్సిన్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా తయారు చేస్తారు, మనం తీసుకోబోయేది ఏ విధంగా తయారు చేశారు, మన శరీరం నిర్మాణం, మన హెల్థ్ ప్రొఫైల్ లాంటి చాలా విషయాల మీద ఇదంతా ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఏదైనా నిజమైన వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తే, వ్యాధినిరోధక కణాలు (యాంటీ బాడీస్) ఉత్పత్తి అయ్యి ఆ వైరస్ ని నిర్వీర్యం చేస్తాయి. […]
సుప్రీం సీజేగా త్వరలో జస్టిస్ రమణ..? జగన్‌కు షాకేనా..? ఆ ఫిర్యాదు బుట్టదాఖలేనా..?
మండలి రద్దు, పార్లమెంటు వోకే చెప్పాలి……… నో, చెప్పలేం, చెప్పబోం స్థానిక ఎన్నికలపై నిమ్మగడ్డకు షాక్ ఇవ్వాలి…. నో, ఇవ్వలేం, ఇవ్వబోం ప్రత్యేక హోదాపై ఓ క్లారిటీ ఇవ్వాలి… నో, హోదా ప్రసక్తే లేదు. ఇవ్వలేం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దు… నో, అమ్మేసి తీరతాం, రాజీ పడబోం …… కనీసం ఆ జస్టిస్ ఎన్వీ రమణను సుప్రీం చీఫ్ జస్టిస్ కానివ్వొద్దు, తన ప్రభావం మా హైకోర్టు మీద విపరీతంగా ఉంది, భూముల స్కాములు మన్నూమశానం చాలా […]
రాంమాధవ్..! ఓ వెలుగు వెలిగి… నిశ్శబ్దంగా వెనక్కి…! కారణాలు ఓ మిస్టరీ..!!
ఒక వార్త ఎందుకో పెద్దగా తెలుగు రాజకీయాల్లో చర్చనీయాంశం కాలేకపోయింది… బహుశా ఏపీలో బీజేపీకి పెద్ద సీన్ లేకపోవడం వల్ల కావచ్చు… ఆ వార్త ఏమిటంటే..? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆ పార్టీని వదిలేసి, తిరిగి తన మాతృసంస్థ ఆర్ఎస్ఎస్లోకి వెళ్లిపోవడం… చాలా నిశ్శబ్దంగా… ఏదో ఒక ఆఫీసు నుంచి మరో ఆఫీసుకు బదిలీ జరిగినంత సాఫీగా జరిగిపోయింది… సరే, ఆర్ఎస్ఎస్ చెట్టుకు బీజేపీ కూడా ఒక శాఖే కదా… అయితే ఒక జాతీయ […]
దండాలు సామీ..! ఖజానా ఊడ్చేసి, జీతాలిచ్చినా సరిపోదంటారేమో…!!
సాధారణంగా ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే ప్రభుత్వ నిర్ణయాలను ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకించవు… ఎందుకంటే వాళ్లతో కంటు కావడం ఇష్టం లేక… వాళ్లతో పెట్టుకుంటే నష్టం అనే భావన బలంగా ఉంటుంది గనుక..! నిజానికి కేసీయార్ పైకి ఎన్ని చెప్పినా తను కూడా అంతే కదా… 30 శాతం ఫిట్మెంట్, పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంపు నిర్ణయాలపై అనేకచోట్ల ఉద్యోగసంఘాలు కేసీయార్ చిత్రపటాలకు పాలాభిషేకాలు కొనసాగిస్తున్నాయి… కానీ నిజానికి పీఆర్సీ మీద వేసిన కమిటీ ఏం […]
వెంకటకృష్ణ ఎందుకు ఏబీఎన్ వదిలేసినట్టు..? ఇంతకీ తనేమంటున్నాడు..?
ఎవరో అడిగారు… జర్నలిస్టులు కూడా వార్తల్లోని వ్యక్తులేనా అని..! దీనికి సమాధానం… అవును..! మీడియా సంస్థలు, వాటిల్లో పెట్టుబడులు, వాటి పొలిటికల్ ధోరణులు గట్రా ఎలాగైతే వార్తాంశాలు అవుతున్నాయో… తమ రాతల ద్వారా, తమ డిబేట్ల ద్వారా జర్నలిస్టులు కూడా వార్తల్లోని వ్యక్తులు అవుతున్నారు…! ఆ ఆర్నబ్ గోస్వామి దగ్గర నుంచి మన రవిప్రకాష్ దాకా… అంతెందుకు..? మన తెలుగు చానెళ్ల సంగతుల్ని కూడా ‘ముచ్చట’లో బోలెడు చెప్పుకున్నాం… తెలుగు న్యూస్ చానెళ్ల డిబేట్లు అనగానే కొమ్మినేని, […]
మోడీ బంగ్లాదేశ పర్యటన..! అక్కడి నుంచి ఇక్కడి బెంగాలీ వోట్లపై వల..!!
మోడీకి స్వదేశంలో కాలు నిలవదు… గిరగిరా దేశాలు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు…. ఇది కరోనాకు ముందు మాట… కరోనా ధాటికి సారు గారి విదేశీ పర్యటనలు కూడా ప్రభావితమయ్యాయి ఫాఫం… ఇప్పుడొక దేశం వెళ్లకతప్పడం లేదు… అబ్బే, ఇటు బెంగాల్ ఎన్నికల ప్రచార బిజీలో ఉన్నాడు, అటూ ఇటూ ఏం తిరుగుతాడులే అని తేలికగా తీసేస్తే ఎలా..? ఆ విదేశీ పర్యటనలోనూ తన బెంగాలీ ఎన్నికల లబ్ధి చూసుకుంటున్నాడు… అర్థం కాలేదా..? ఓ విదేశీ గడ్డ మీదకు […]
రాజు సుందరం..! జాతీయ అవార్డుకు కొత్తేమీ కాదు, అనర్హుడు కాదు… కానీ..?
ప్రభుత్వం ఇచ్చే అవార్డుల వెనుక చాలా పైరవీలు, సిఫారసులు, కొన్నిసార్లు ప్రభుత్వ పొలిటికల్ ఈక్వేషన్లు, మన్నూమశానం ఉంటయనే అపప్రథ ఉన్నదే కదా… పద్మపురస్కారాలూ అంతే… అయితే ఈసారి (2019) జాతీయ సినిమా అవార్డుల్లో కంగనా రనౌత్‌కు మణికర్ణిక, పంగా సినిమాలకు గాను ఉత్తమ నటి అవార్డు వరించడం పెద్ద ఆశ్చర్యమేమీ అనిపించలేదు… ఆమె బీజేపీ మనిషే కదా… పైగా మహారాష్ట్రలో సినిమా మాఫియా, శివసేన సర్కారుతోనూ ఫైటింగ్ చేస్తోంది… అయితే… జాతీయ ఉత్తమనటి అవార్డును పొందే స్థాయిలో […]
నవీన్ నూలి..! చంద్రబాబు గారి క్యాంపు ప్రొడక్టే..! జాతీయ అవార్డు కొట్టాడు…!!
పీవీసింధుకు బ్యాడ్మింటన్ నేర్పింది ఎవరు..? నాదెళ్ల సత్యను మైక్రోసాఫ్ట్ వైపు అడుగులు వేయించింది ఎవరు..? ఆయనే… ఆయనే తెలుసు కదా… ఎక్కడ ఎవరికి ఏ ఘనత దక్కినా అందులో తన వాటా వెతుక్కుని, ఓన్ చేసుకుని, వీలయితే నేను అసలు కారకుడిని అని ఢంకా బజాయించే ఆయన తెలుసు కదా… ప్చ్, చాలారోజులైంది ఆయన నోటి వెంట ఇలాంటి మాటలు విని… ఏదో మిస్సవుతున్నాం… నిజానికి చంద్రబాబు ఇప్పుడు ఓ విషయాన్ని ఓన్ చేసుకోవచ్చు స్వేచ్ఛగా… కాలరెత్తుకుని […]
వామ్మో… జీటీవీ చంపేసింది..! గతితప్పిన సరిగమప గ్రాండ్ ఫినాలే..!!
జీతెలుగు చానెల్ బాధ్యులు ఒక్కసారి గనుక పాత పాడుతా తీయగా వీడియోలు గానీ… మన తెలుగు టీవీల్లోనే వచ్చిన సూపర్ సింగర్ ఎపిసోడ్లు గానీ…. పోనీ, ఇప్పటి ఇండియన్ ఐడల్ గానీ చూసి ఉన్నట్టయితే బాగుండు…! సరిగమప గ్రాండ్ ఫినాలే ఇంత పేలవంగా ఉండి, ఇంతగా ఇజ్జత్ పోయేది కాదు..! ఈమధ్యకాలంలో ఏ టీవీ ప్రోగ్రాం ఫినాలే కూడా ఇంత బేకార్ ఫినాలేగా ముగియలేదేమో… మూడున్నర గంటలపాటు ఇంతటి నిస్సారమైన ఫినాలేను ప్రసారం చేయడానికి నిజానికి జీవాడు […]
KCR కత్తెర నిజం… ఈటల అసంతృప్తి నిజం… ఎక్కాలు తప్పిన లెక్కలు…
ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయి… నాటి ఉద్యమ వ్యతిరేకులను చేర్చుకుని, అందలాలు ఎక్కించి… దేశంలోని అనేకానేక ప్రాంతీయ పార్టీల్లాగే తన నడతను, తన నడకను ప్రజాబాహుళ్యం నిజ ఆకాంక్షలకు భిన్నంగా మార్చేసుకున్న పార్టీ టీఆర్ఎస్… ఈమాట వాళ్లో వీళ్లో కాదు, పార్టీలో ఉన్నవారే చెబుతుంటారు… అసంతృప్తిని వెళ్లగక్కుతుంటారు… ఇప్పుడు విషయం ఏమిటంటే ఈటల మళ్లీ తిరుగుబాటు స్వరం వినిపించాడు… ఇదేమీ కొత్త కాదు… గతంలోనూ కనిపించింది… ఎప్పుడంటే..? కేసీయార్ తనను దూరం పెట్టిన […]
- « Previous Page
- 1
- …
- 441
- 442
- 443
- 444
- 445
- …
- 483
- Next Page »