దట్టమైన అడవులు… గుట్టలు… వందల మంది మావోయిస్టులు, సాయుధ బలగాల మధ్య కాల్పులు… యుద్ధం… దండకారణ్యానికి ఈ సమరం కొత్తేమీ కాదు… రాజ్యానికీ, తిరుగుబాటుకూ నడుమ నిత్యసమరమే అక్కడ… మొన్న కూడా యుద్ధం జరిగింది… 23 మంది జవాన్లు ప్రాణాలు వదిలారు… 31 మందికి గాయాలు… నలుగురైదుగురు నక్సలైట్లు కూడా మరణించారు… ఎందరికి గాయాలయ్యాయో తెలియదు… కానీ రాకేశ్వర్ సింగ్ అనే ఒక జవానును బందీగా తీసుకెళ్లారు మావోయిస్టులు… అంతటి ఉద్రిక్త సమరప్రాంతంలో దొరికిన ‘వర్గశత్రువు’ను మావోయిస్టులు […]
వావ్, వకీల్ సాబ్..! ‘పింక్ ఒరిజినల్ రివ్యూ’ అంటే ఇదీ..!!
……. by…. Prasen Bellamkonda………….. ఇవాళెందుకో పింక్ సినిమా గురించి మాట్లాడాలనిపిస్తోంది. పింక్ సినిమాలో ఏమేం ఎందుకు లేవో, అవి లేనందుకు అది ఎందుకు బాగుందో చెప్పాలనిపిస్తోంది. పింక్ లో అమితాబ్ కు పాపం కోర్టులో బల్లలు ఎత్తేయడం కుర్చీలిరగ్గొట్టడం తెలియదు, గడియారాన్ని మారణాయుధం చేయడం తెలియదు.. అయినా బాగుంది. పింక్ లో అమితాబ్ బాత్రూంలనూ మెట్రో ట్రయిన్ లనూ మల్ల యుద్ద భూములుగా మార్చడు.. అయినా అదేంటో మరి, బాగుంది. పింక్ లో అమితాబ్ అనాధల […]
Drunken Corona..! వైరస్ అయినా, మనిషి అయినా… ‘అక్కడే విజృంభించేది’…
విన్నారా? బార్ల వల్ల కరోనా వ్యాపిస్తోందని హై కోర్టు చెబుతోంది! ——————– రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏటా ఇరవై వేల కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా మద్యం అమ్ముడవుతోంది. దక్షిణాదిలో కేరళ, తమిళనాడు మద్యం అమ్మకాల్లో టాప్. మొత్తం దేశంలో అమ్ముడుబోయే మద్యంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 45 శాతం. బహుశా మరో రెండేళ్లల్లో 50 శాతం కావచ్చు. ఉత్తరాదిలో పంజాబ్ టాప్. అలాగని తెలుగు రాష్ట్రాల వినియోగం తక్కువ చేయాల్సిన పనిలేదు. ఎవరి చుక్కలు వారివి. […]
ఆ ఫ్లాష్‌బ్యాక్ కథలో సెట్ కాలేదు… లేకపోతే సినిమా మరో రేంజ్లో ఉండేది…
మనం తరచూ చెప్పుకునేదే… గాంధీ, బుద్ధుడి మీద బయోపిక్ సినిమాలు తీసినా సరే… మన హీరోలు దుడ్డుకర్రలు పట్టాల్సిందే… డాన్సులాడాల్సిందే… అవును మరి, ఎంతటి ఉదాత్తమైన కథైనా సరే, సగటు సినిమా హీరో ఇమేజీకి తగినట్టుగా అది మారాల్సిందే… మారి తీరాల్సిందే..! ఇప్పుడూ అంతే..!! నంబర్ వన్ అమితాబ్ రక్తికట్టించిన కోర్టు డ్రామా… ఆ కథలోని ఎమోషన్, జనానికి కనెక్టయ్యే మెయిన్ ప్లాట్… పింక్ అనే ఆ హిందీ సినిమాకు బలం… కథను నిజాయితీగా ప్రజెంట్ చేశారు… […]
హమ్మయ్య తేల్చేశారు…! హనుమంతుడు తెలుగువాడే… పుట్టింది తిరుమలలోనే..!
దేవుళ్లే కాదు, వాళ్ల జన్మస్థలాలు కూడా అప్పుడప్పుడూ వివాదాల్ని రేకెత్తిస్తుంటాయి… దేవుళ్లు ఫలానాచోట పుట్టారు అని చెప్పడానికి చారిత్రిక ఆధారాలేముంటయ్..? స్థలపురాణాలు, నమ్మకాలే ఆధారాలు… కానీ రామాయాణం అలా కాదు… రాముడి కథ నిజమైందేననీ, కల్పన కాదనీ కోట్ల మంది తరతరాలుగా నమ్ముతున్న నేల ఇది… జాతి ఆరాధ్యుడు… అయోధ్య రాముడి జన్మస్థలి వివాదం తెలిసిందే కదా… కొందరైతే అసలు రాముడు అయోధ్యలో పుట్టనేలేదని కూడా వాదిస్తారు… అవునూ, రాముడు సరే, హనుమంతుడు పుట్టిందెక్కడ..? ఇక్కడ, కాదు […]
ఆలీ సరదా తగలెయ్య…! సెలబ్రిటీ ఏడుపు బాగా సేలబుల్… ఇదో వికారం…!!
ఆ షో పేరే ‘ఆలీతో సరదాగా’…! మనం మరిచిపోతున్న పాతతరం నటీనటుల్ని, సినిమా సెలబ్రిటీలను తీసుకొచ్చి మాట్లాడింపజేస్తాడు ఆలీ… ఎస్, బాగుంటుంది… మనం మరిచిపోయిన మొహాల్ని మళ్లీ చూపిస్తాడు… కానీ తనకు ఓ వింత పైత్యం ఉంది… తన షోకు ఎవరొచ్చినా ఏడవాలి… దాన్ని ప్రోమో కట్ చేయిస్తాడు… ఈటీవీ వాడు ఎడాపెడా ఆ ప్రోమోలను కుమ్మేస్తాడు… చివరకు వడ్లగింజలో బియ్యపు గింజ… షో చూశాక మరీ అంత హృదయ విదారకం ఏమీ ఉందిరా భయ్ అనిపిస్తుంది… […]
dogology..! ఆ శునకోపాఖ్యానం నుంచి కొన్ని ముఖ్య ప్రవచనాలు…
కుక్కా! కుక్కా! ఎక్కడున్నావ్? ——————– ఈరోజు పొద్దున్నే దిన పత్రికల మధ్య ఉన్న కరపత్రమిది. సారాంశం:- కుక్క కనిపించుట లేదు. ఆచూకి చెప్పినవారికి పదివేల రూపాయల బహుమతి. పేరు- డాలీ, వయసు- 12, దేశీయ శునకం. రంగు- తెలుపు. ఆనవాళ్లు, మచ్చలు, ఫోన్ నంబర్ ఇచ్చారు. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నారో? అది కనపడక ఎంతగా అల్లాడిపోతున్నారో? ఈ కరపత్రం స్పష్టంగా చెబుతోంది. త్వరగా వారి డాలీ వారి చెంతకు చేరాలని కోరుకుందాం. ——————- “శునకము బతుకును […]
బొచ్చు..! స్మగ్లర్ల కొత్త సరుకు… హైదరాబాద్ అడ్డా… వందల కోట్ల దందా..!
బొచ్చు… ఆ పదమే నెగెటివ్‌గా ధ్వనిస్తుంది కదా… కానీ అదిప్పుడు వందల కోట్ల దందాకు… కాదు, వందల కోట్ల స్మగ్లింగ్ దందాకు ఆధారం… ఎహె, తెలివిలేనివాడు బంగారం గట్రా స్మగుల్ చేస్తాడు, తెలివైనవాడే ఇలా బొచ్చును దువ్వుతూ కోట్లు కొల్లగొడతాడు… ఈమధ్య అక్కడెక్కడో మయన్మార్ సరిహద్దుల్లో ఓ ట్రక్కు పట్టుకున్నారు… అందులో మొత్తం బొచ్చే ఉంది… ఇంకేముంది..? ప్రపంచంలో ఎక్కడ ఏం దొరికినా, ఏం జరిగినా సరే తెలుగు రాజకీయాలకు ముడిపెట్టాల్సిందే కదా… అదంతా తిరుమల శ్రీవారికి […]
TENET…! ‘టైమ్’లో జర్నీ కొత్తేమీ కాదు… కానీ ఇది అంతకుమించి… అర్థమైతేనే..!!
టెనెట్ సినిమా చివర్లో భవిష్యత్తు నుంచి వర్తమానంలోకి వచ్చిన హీరో ప్యాటిసన్… గతం నుంచి వర్తమానంలోకి వచ్చిన హీరో వాషింగ్టన్ తో ఒక మాట అంటాడు… నీ గతానికి గొప్ప భవిష్యత్తు ఉంది.. అంటే నాకు కొన్నేళ్లు క్రితం నీకు కొన్నేళ్ల తర్వాత అన్నమాట అని భవిష్యత్తులోకి వెళ్లిపోతే వాషింగ్టన్ గతంలోకి వెళ్లిపోతాడు.. వర్తమానం అలాగే ఉండిపోతుంది………. నేను రాసిన ఈ నాలుగు లైన్లలో మీకు ఒక్కటైనా అర్థమయితే సినిమా మొత్తం మీకు అర్థమైనట్టే.. ఒక్కొక్కరి పర్సెప్షన్ […]
మోడీ మీద తోకపటాకులు పనిచేయవు కామ్రేడ్స్… బోఫోర్స్ రేంజులో కొట్టాలి…
86,400 కోట్ల విలువైన రాఫెల్ యుద్ధవిమానాల మొత్తం కంట్రాక్టు విలువలో 8.64 కోట్ల కానుకలు అలియాస్ ముడుపులు అలియాస్ లంచాలు ఎంత శాతం..? ఎంత..? 0.01 శాతం..! అంతేనా, వేరే లెక్క ఏమైనా ఉందా..? 0.01 శాతం అంటే..? వంద రూపాయలకు ఒక పైసా..! ఇది భారీ కుంభకోణమా..? నిన్న ప్రతి పత్రిక కవర్ చేసిన ఓ వార్త చదివాక వచ్చిన భారీ సందేహం ఇదే… ప్రపంచంలో ఏ రక్షణ కంట్రాక్టులోనైనా సరే ఈ శాతానికి ఎవడైనా […]
అసలే తమిళ అతి… దాన్ని మించి తెలుగు సోషల్ గ్రూపుల అతితనం..!!
నిన్నంతా సోషల్ మీడియాలో ఒకటే హడావుడి… అదీ తెలుగు సోషల్ మీడియాలో… గ్రూపులుగా విడిపోయి మరీ వాదులాటలకు దిగారు… ట్రోలింగ్ సరేసరి… తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నయ్… చెన్నైలో సెలబ్రిటీలు, ప్రత్యేకించి సినిమా వ్యక్తులు, రాజకీయ నాయకులు గట్రా ఎక్కువ కదా… పైగా అదసలే చెన్నై… సినిమా వాళ్ల పట్ల అభిమానుల పిచ్చి మరీ విపరీతం… అకస్మాత్తుగా హీరో విజయ్ సైకిల్ తొక్కుతూ పోలింగ్ బూత్‌కు వెళ్లిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి… తన వెంట జనం […]
మెలోడ్రామా..! కోడలు కూతురైంది… కొడుకు అల్లుడయ్యాడు… ఓ తల్లి కథ…!
డెస్టినీ… అన్ని శాస్త్రాలూ మనిషిని చివరకు తీసుకెళ్లి అక్కడ వదిలేస్తయ్…. ఇదీ అంతే… నిజానికి మనిషి జీవితంలో ఉన్నంత మెలో డ్రామాను మనం కాల్పనిక సాహిత్యంలో కూడా అంతగా చూడలేం కదా… ఇదీ అంతే… ఎస్, ప్రతి మనిషి జీవితం ప్రిప్రొగ్రామ్డ్ చిప్… దాని ప్రకారమే నడుస్తూ ఉంటుంది… ఇదీ అంతే… విషయం ఏమిటంటే..? ఇది కథ… కథలాంటి వాస్తవం… తాజా వార్తే… చైనాలో జియాంగ్స్ ప్రావిన్స్ ఉంది… అందులో సుజో ఓ ఆవాసం,.. అక్కడ ఓ […]
Sleepless Nights..! నిద్రలేని రాత్రులు… ఓ సర్వేలో విస్తుపోయే వాస్తవాలు..!
ఇలా తలుచుకోగానే అలా నిద్ర పట్టేసి… వెంటనే గాఢ నిద్రలోకి జారిపోయి… లోకాన్ని మరిచిపోయి… అనుకున్న టైంకు టంచన్‌గా మెలకువ వచ్చేవాళ్లంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరేమో..! Sound Sleep అనండి, ReSoundSleep అనండి… నిద్ర… మన దైహిక జీవక్రియల్ని సెట్‌రైట్ చేయడానికి ఉపయోగపడే రెస్ట్ పిరియడ్… నిద్ర… ఒక మెడిటేషన్… నిద్ర… ఒత్తిళ్ల నుంచి రిలాక్స్ చేసి, సగం ఆరోగ్య సమస్యల్ని దరిదాపుల్లోకి రానివ్వకుండా చేసే ప్రొటెక్టర్… నిద్ర… అతి పెద్ద స్ట్రెస్ బస్టర్… కానీ మన […]
గ్లాసు భళ్లుమంది..! పువ్వు నిర్ఘాంతపోయింది..! అసలేం జరిగిందంటే..?!
ఎన్నికలంటే దొమ్మీ కాదు… బాహాబాహీ ఫైటింగు కాదు… ఎన్నికలంటే వ్యూహాలు…! ఏపీలో ఉండీలేనట్టుగా ఉన్న బీజేపీకి ఈ సత్యం తెలుసో లేదో మనకు తెలియదు కానీ… దానికి చదరంగం ఎత్తులు ఏమాత్రం తెలియవని మరోసారి అర్థమైంది… నిజంగానే ఏపీబీజేపీని చూస్తే సంఘ్ పరివార్‌కే జాలేసేట్టుగా ఉంది పరిస్థితి… దేవుడా నువ్వే దిక్కు, నువ్వే ముఖ్యమంత్రివి అంటూ పార్టీ అధ్యక్షుడు అలా జనసేనాని ఎదుట సాగిలబడిపోతాడు… చేతులు కట్టుకుని, భయభక్తులతో కాస్త తలవంచి, కోపగించుకోకు ప్రభూ అన్నట్టుగా చూస్తుంటాడు… […]
జగన్ No.1 దుర్మార్గుడే… సరే, వోకే… కానీ మీరెవరు తన అడుగుల్ని డిక్టేట్ చేయడానికి..?!
పూర్వకాలంలో తర్కం… అనగా లాజిక్ అనేది ఒక శాస్త్రం… ఎప్పుడైతే రాజకీయ నాయకులు ‘విపరీత తర్కానికి’ ఎగబడ్డారో అప్పుడే తర్కశాస్త్రానికి దుర్దినాలు ప్రారంభమై… ఇప్పుడు తర్కం అనేది ఓ బూతుగా మారింది… ఉదాహరణ కావాలా..? ఉండవల్లి అరుణ్‌కుమార్ అనబడే ఓ మాజీ ఎంపీ… అప్పుడప్పుడూ ఉండవల్లి ప్రెస్మీట్లు చూస్తుంటే ఘాజి హరి అలియాస్ సబ్బం హరి కాస్త బెటరేమో అనిపిస్తూ ఉంటుంది… ఎందుకంటే..? ఘాజి హరి బీకామ్ ఫిజిక్స్ కావచ్చుగాక… ఉండవల్లిది కాస్త పర్వర్షన్… కాస్త డిటెయిల్డ్గా […]
వంశీ రాసిన మరో మేఘసందేశం..! కథ అదిరింది- మదిలోకి ‘ఆపాత’ జ్ఞాపకాలు మళ్లీ..!
Pasalapudi Vamsy మంచి రైటరా..? మంచి డైరెక్టరా..? అనే ప్రశ్నకు క్షణంలో పావువంతు కూడా ఆలోచించకుండానే మంచి రైటర్ అని చెప్పేయొచ్చు… కథ రాస్తే అది హిట్టే… మంచి ప్రజెంటర్… తన కథల్ని చదివిన ప్రతిసారీ ఒకటీరెండు ప్రశ్నలు తొలుస్తా ఉంటయ్… తను నిజంగా జరిగిన సంఘటనల్నే మనకు కథలుగా చెబుతున్నాడా..? వాటికే కాస్త కల్పన అద్దుతున్నాడా..? ఎవరైనా చెప్పిన ముచ్చట్లను తనదైన స్టయిల్లో అక్షరీకరించి మనతో షేర్ చేసుకుంటున్నాడా..? ఏదయితేనేంలే… కథలే అనుకుందాం… పోనీ, నిజంగా […]
ముంబై పోలీస్..! వాళ్ల రాజ్యాంగమే వేరు… ఈ ఒక్కటీ చదవండి చాలు..!!
సాధారణంగా పాలకుడిని బట్టి పోలీసులుంటారు, అందరికీ తెలిసిందే… కానీ ముంబై పోలీసులు చాలా టిపికల్… వాళ్లు ఏ అంచనాలకూ అందరు… చూస్తున్నాం కదా… వాళ్లలోనే అనేక గ్రూపులు, ఏ గ్రూపును ఏ శక్తి నడిపిస్తుందో ఓ అంచనాకు రావడం కష్టం… వాళ్లు ఏదైనా చేయగలరు… ఒక్క ముంబైలోనే నెలనెలా వందల కోట్ల వసూళ్లు చేయగలరు… వాళ్లే డాన్లు, వాళ్లే లీడర్లు, వాళ్లే జడ్జిలు, వాళ్లే అన్నీ… అంతెందుకు..? అంతటి అంబానీకే స్పాట్ పెట్టేంత సమర్థులు… శివసేన ఆత్మీయ […]
జక్కన్న రాజమౌళి తాత ఉండేవాడు అప్పట్లో… ఓ కెమెరా బాహుబలి..!
………. By……… Bharadwaja Rangavajhala……………… రవికాంత్ నగాయిచ్ దర్శకుడి ఊహల్లో పురుడు పోసుకున్న సన్నివేశాలను తెర మీద ప్రభావవంతంగా ఆవిష్కరించడం చాయాగ్రాహకుడి ప్రధాన కార్యక్రమం. ఒక్కోసారి దర్శకుడు చాలా క్లిష్టమైన సన్నివేశాలను ఊహిస్తాడు. ఛాయాగ్రాహకుడు కూడా ఆ స్ధాయిని అందుకుంటే తెర మీద జరిగేవి అద్భుతాలే. తెలుగు తెర మీద అద్భుతాలు చేసిన కెమేరామెన్స్ లో రవి నగాయిచ్ ఒకడు …కెమేరా ఇంద్రజాలికుడు ఆయన. స్వీయ దర్శకత్వంలో తొలిసారి పౌరాణిక గాధను నిర్మించాలనుకున్నారు రామారావు. సముద్రాలతో స్క్రిప్ట్ […]
Rekha..! ఇండియన్ ఐడల్ షో హైజాక్ చేసేసింది… రేఖ అంటే రేఖ… అంతే…
రేఖ..! అరవై ఏడేళ్ల ఈ నవయవ్వనవతి గురించి ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా రాయాలనుకున్నా సాహసమే… ఇప్పటితరానికి పెద్దగా తెలియకపోవచ్చుగాక ఆమె కథ… తన వయస్సును పాతికేళ్లప్పుడే స్తంభింపచేసుకున్నది… అంతే… ఈ తమిళ బిడ్డ భారతీయ చిత్రజగతి కలల సుందరి… ఆమె కథలోకి పోవడం లేదు మనం ఇప్పుడు… కానీ… ఈమధ్య Sony వాళ్ల మ్యూజిక్ కాంపిటీషన్ ప్రోగ్రాం Indian Idol షోకు గెస్టుగా వచ్చింది… అఫ్ కోర్స్, ప్రతి వారం ఎవరో గెస్టును పిలవడం పరిపాటే… వచ్చే గెస్టులు కూడా […]
దుమ్మురేపే ఈ పాట 1952లోనే ఓ పాటల పుస్తకంలోకి ఎక్కింది… ఇదీ ప్రూఫ్…!
నేను ఆ పాటను ముందుగా పాడాను కాబట్టి ఇక నాకే అన్ని హక్కులూ ఉంటయ్, ఇంకెవరైనా మాట్లాడితే మర్యాద దక్కదు, ఆ పాట ఎక్కడైనా సరే నేనే పాడాలి…. అంటూ సాయిపల్లవి సారంగదరియా పాట మీద ఓ జానపద గాయని కొట్లాడింది తెలుసు కదా… దీని మీద కొద్దిరోజులుగా రచ్చ సాగుతూనే ఉంది… ప్రత్యేకించి సుద్దాల అశోక్ తేజ వ్యవహారశైలి మీద కూడా…! నిజానికి ఒక పాట మీద వివాదం ఎందుకులే అనుకుని దర్శకుడు శేఖర్ కమ్ముల […]