ఒక ఈటీవీ లేదా ఒక మల్లెమాల యాజమాన్యాలకో… లేదా ఇంకెవరో టీవీ చానెల్ ప్రబుద్ధుడికో… అంత లోతయిన అవగాహన ఉంటుందని అనుకోలేం కానీ…. పండుగపూట కాసిన్ని మంచి ముచ్చట్లు చెప్పుకోవాలనే మినిమం సోయి మాత్రం ఉండాలి కదా…! ఈమాట అనడానికిముందు ఓ సంగతి చెప్పాలి… ప్రపంచవ్యాప్తంగా పత్రికలు ఇప్పుడు ఓ ట్రెండ్ పాటిస్తున్నయ్… ఓ పెద్ద పేలుడో, ప్రమాదమో, విపత్తో… వంద మంది మరణించవచ్చుగాక, రక్తం ఏరులైపారవచ్చుగాక… ఫస్ట్ పేజీలో ఆ నెత్తుటివాసన కనిపించకూడదు… మనిషిని డిస్టర్బ్ […]
ఫ్లోర్లు ఊడ్చి, టికెట్లు చింపి… చివరకు స్టార్ డైరెక్టర్‌గా ఎదిగి ‘చింపేశాడు’…
….. By… Bharadwaja Rangavajhala……………………. డిష్యుమ్ డిష్యుమ్ దాస్… భారత దేశ తొలి కౌబాయ్ సినిమా దర్శకుడైన దాస్ డిష్యుం డిష్యుం సినిమాలకు ట్రేట్మార్క్గా నిలబడిపోయారు. సౌతిండియాలో యాక్షన్ హీరో ఇమేజ్ కావాలంటే… ఎట్టి పరిస్థితుల్లోనూ దాస్ డైరక్షన్ లో చేసితీరాలి. అదీ ఆయన రేంజ్. కె.ఎస్.ఆర్ దాస్ సినిమాల్లో హీరో లెక్కలేనన్ని సాహసాలు చేస్తాడు. దాస్ జీవితంలో కూడా సాహసాలకు కొదవ లేదు. గుంటూరులో ఓ సినిమాహాల్లో బుక్కింగ్ క్లర్క్‌గా జీవితం ప్రారంభించిన దాస్ సినిమా […]
గిదేందివయా అర్విందూ… మీ పార్టీలకు ఒస్త అంటున్నా, గీ లెటర్లు ఏంది..?!
‘‘మా డీఎస్, అదే భయ్, మన నిజామాబాద్ ధర్మపురి సీనన్న కొడుకు మంచిగ వ్యాపారంలో డెవలప్ అయ్యిండు, పాలిటిక్సులకు కూడా ఒచ్చిండు… మస్తు షైన్ అవుతున్నడు పిల్లగాడు అనుకుంటిమి… పోయిపోయి బీజేపీల దుంకిండు… పోనీలే, ఏ పార్టీ అయితే ఏంది అనుకుంటిమి..? మెల్లమెల్లగ డీఎస్ కూడా దూరం అయిపోతుండె… మన టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తే ఓ పంచాయితీ, ఉంచుకుంటే ఇంకో పంచాయితీ… పోతేపోనీలే అని ఇడిసిపెడితిమి… ఆమధ్య నన్ను మెచ్చుకుంట యాడనో మాట్లాడిండు, ఖుష్ అనిపించింది… […]
ఆ అమ్మాయి బీఎస్సీ (చేతబడి)… అల్లుడు గారేమో ఎంఎస్సీ (కాష్మోరా)….
అబ్బాయి భూతాల డాక్టర్! అమ్మాయి పిశాచాల సర్జన్! ———————— ఇది పూర్తిగా దయ్యాలకు సంబంధించిన అకెడెమిక్ సబ్జెక్ట్. ఇష్టం లేనివారు, భయపడేవారు ఇక్కడితో చదవడం ఆపేయగలరు. భూత, ప్రేత, పిశాచ, శాకినీ, ఢాకిని…ఇలా దయ్యాల్లో ఎన్నో రకాలు. అన్ని దయ్యాలూ చెడ్డవి కావు. కొన్ని దయ్యాలే మంచివి కావు. విఠలాచార్య సినిమాలతో తెలుగులో దయ్యాలకు సెలెబ్రిటీ హోదా వచ్చింది. వంశపారంపార్యంగా మనకందిన విజ్ఞానం ప్రకారం- దయ్యం తెల్ల రంగు, లేదా బూడిద రంగుతో ఉంటుంది. కళ్లల్లో గుంతలు […]
ఓ తెలుగు అలెక్సా..! ఎట్లున్నవ్..?
గూగుల్ సెర్చ్ ఇంజిన్ లేకపోతే ఎన్ని బతుకు ఇంజిన్లు ఆగిపోయేవో? గుండు సూది నుండి అణుబాంబుల తయారీ వరకు ఏదడిగినా తడబడకుండా, సిగ్గులేకుండా టక్కుమని చెబుతుంది గూగుల్. సమాచార సముద్రాన్ని కొన్ని లక్షల, కోట్ల పేజీల్లో డేటాగా ఎక్కించి గూగుల్ సమాచార గుత్తాధిపత్యాన్ని సాధించింది. గూగుల్ లో లేనిదాన్ని ఇప్పుడు ప్రపంచం ఒప్పుకోని పరిస్థితి వచ్చేసింది. సాంకేతిక పరిజ్ఞానం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించే కొద్దీ అధునాతన ఆవిష్కరణలు, సరికొత్త పరికరాలు రావడం సహజం. అలా […]
డాన్స్ ప్లస్..! అంటే సర్కస్ ఫీట్లే కాదు… తెలుగు భాషపై పోట్లు కూడా…!!
మొన్నమొన్నటిదాకా సాగిన బిగ్‌బాస్ గురించి చెప్పి మళ్లీ విసిగించడం కాదు… అందులో అమ్మారాజశేఖర్ అనే కంటెస్టెంటు తన కిలికిలి భాషతో తెలుగు ప్రేక్షకుల దుంపతెంచాడు… ఆ నీచ బిగ్‌బాసుడికి ఆ భాష తెలుగులా వినిపించేది, మోనాల్‌ను మాత్రం తెలుగు నేర్చుకో అని ఉరిమేవాడు… హారిక, అభిజిత్‌లపై అరిచేవాడు… మన ఖర్మ అనుకున్నాం… రాజశేఖర్ బిగ్‌బాస్ వదిలేరోజున యావత్తు తెలుగు ప్రేక్షకజనం ఆనందాశ్రువులతో వీడ్కోలు పలికి పండుగ చేసుకున్నారు… ఎవరో అడిగారు ఫేస్బుక్లో… ‘‘ఒరేయ్ బిగ్‌బాసూ, చాలా భాషల్లో […]
ప్రజాశక్తి..! ఇదేం పాత్రికేయం..? మోడీ మీద ఇదేం బురద..?
అంబానీ, ఆదానీ… ఈమధ్య పదే పదే వార్తల్లోకి వస్తున్న పేర్లు… రైతుల ఆందోళనల్లో ప్రముఖంగా వినవస్తున్న పేర్లు… మోడీ సర్కారు అంబానీలు, ఆదానీలకు జాతిసంపదను దోచిపెడుతున్నదనేది ఆరోపణ… ఉద్దేశపూర్వకంగా చేసే కొన్ని ప్రచారాలు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయంటే… అంబానీతో మోడీ సర్కారు ఏదో ఒప్పందం కుదుర్చుకున్నదనే ప్రచారం పెరిగి పంజాబ్, హర్యానాల్లో రిలయెన్స్ మొబైల్ టవర్లను, రిటెయిల్ సెంటర్లను ధ్వంసం చేస్తున్నారు… జియో కనెక్షన్ల పోర్టింగ్ పెట్టిస్తున్నారు… ఓరి దేవుడోయ్, కంట్రాక్టు ఫార్మింగు మీద ఆసక్తే […]
జానారెడ్డొచ్చె మొదలాడు..! రేప్పొద్దున అందరూ అవే డిమాండ్లు చేస్తే..?!
ఎవరో మిత్రుడు ఫేస్బుక్లో కామెంటినట్టుగానే… ‘‘ఈ కాంగ్రెసోళ్లు తెలంగాణ ఇవ్వడానికి పెద్ద టైం తీసుకోలేదు కానీ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడి ఎంపికకు మాత్రం తరాలు మారేట్టుంది…’’ వ్యంగ్యంగా చెప్పినా సరే, అందులో చాలా నిజం ఉంది… ఎన్నేళ్లయింది టీపీసీసీ అధ్యక్షుడిని మార్చాలని అనుకుని..! నన్ను తక్షణం తీసేసి, ఎవరో కొత్తాయనకు బాధ్యతలు ఇవ్వండి బాబోయ్ అని ఉత్తమకుమారుడే ఢిల్లీలో ఎఐసీసీ ఆఫీసు ఎదుట దీక్ష చేయడం బెటర్ అని జోకులు వినిపించే స్థాయిలో… కథ సాగుతూనే […]
అమితాబ్- రేఖ..! ఆహా…. ఆ జంట మరోసారి వెండితెరపై…!
అమితాబ్ బచ్చన్… రేఖ…! అసలు ఆ జంట పేరు వింటే, వాళ్లు నటించిన పాత హిందీ సినిమాలు తలుచుకుంటే సినిమా ప్రియులకు ఓ సంబరం… ఒకనాటి ప్రేమికులు… బహుశా నలభై ఏళ్లు దాటిపోయి ఉంటుంది… వాళ్ల బ్రేకప్ జరిగిపోయి..! ఎవరి బతుకులు వాళ్లవే… ఆ ప్రేమాయణంపై బోలెడు కథలు., వార్తలు, కథనాలు, యూట్యూబ్ వీడియోలు… ఎవరు ఏమైనా రాసుకోనీ… ఇన్నేళ్లలో పాత సంగతుల్ని వాళ్లిద్దరిలో ఎవరూ కెలికే ప్రసక్తే లేదు… ఏ ఇంటర్వ్యూల్లోనూ మాట్లాడేది లేదు… గౌరవప్రదమైన […]
చైనా జిన్‌పింగ్ దుర్నీతి… తన వాళ్లనూ వదలదు… వాళ్లు ఇక కనిపించరు…
(Jagannadh Goud…………) పల్లెటూరి నుంచి ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగి, రెండు నెలులగా కనిపించకుండా పోయిన ఓ లెజెండ్ ప్రస్థానం..!…. చైనా నుంచి ప్రపంచానికి తెలిసిన మొట్టమొదటి బిలియనీర్ “జాక్ మా”… చరిత్రలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలోని లోపాలని మొట్టమొదట చైనాలో ఎండగట్టిన వ్యక్తి కూడా ఆలీబాబా గ్రూప్ “జాక్ మా” గారే…. చైనాలోని ఒక పల్లెటూళ్ళో చదువుకునే ఒక పిలగాడు రోజూ సైకిల్ తొక్కుకుంటూ దగ్గరలోని టౌన్ కి వెళ్ళి విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకి […]
వీళ్లు సీనియర్ సింగర్సేనా..? ఆ బాలు లేకపోతే పాట మాధుర్యమే మటాష్..?!
ఇక్కడ సంగీతం అనే పదాన్ని వాడటం లేదు…! సినిమా పాటల మీద ఇంట్రస్టు ఉన్నవారికి ఈటీవీలో వచ్చే స్వరాభిషేకం వీనులవిందు… ఏళ్లుగా అది పాటలప్రియుల్ని అలరిస్తూనే ఉంది… రాష్ట్రంలోని పలు ప్రాంతాలకే కాదు, పలు దేశాలకు కూడా వెళ్లొచ్చింది… ఈటీవీలో అభిరుచి ఉన్న ప్రోగ్రాముల్లో ఇదీ ఒకటి… కాకపోతే దీనికి లిమిటెడ్ వ్యూయర్షిప్ ఉంటుంది… రేటింగ్స్ గురించి ఆలోచించకుండా రామోజీరావు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఆ బాధ్యతలు అప్పగించాడు… ఇక్కడ సీన్ కట్ చేయండి ఒకసారి… మొన్న స్వరాభిషేకం […]
వేక్సిన్ వార్‌కు విరుగుడు… మోడీకి మొదటి టీకా… ప్రజలందరికీ అంతులేని భరోసా…
కోవాగ్జిన్ టీకాకు ముందస్తు అనుమతుల యవ్వారం రాజకీయంగా రచ్చరచ్చ చేస్తోంది… ఈ నేపథ్యంలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు నిన్న ఎక్కడో చేసిన ఓ వ్యాఖ్య ఇంట్రస్టింగు అనిపించింది… ‘‘అమెరికాలో ప్రెసిడెంట్-ఎలక్ట్ జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్-ఎలక్ట్ కమలా హారిస్, ఇజ్రాయిల్ నెతన్యాహూ, రష్యా పుతిన్… అందరూ మొదటి టీకాకు మేం రెడీ అంటున్నారు… ఈ దేశ ప్రధాని మోడీ చప్పట్లు కొట్టమంటే కొట్టాం, దీపాలు పెట్టమంటే పెట్టాం, అది జనంలో ఓ భరోసాను నింపడానికే కదా… ఇప్పుడూ […]
చట్టం ఒప్పుకోదు… అష్టాచెమ్మా, పులిజూదం, వామనగుంటలు ఆడుకొండి…
మంత్రి కొడాలి నాని పలు సందర్భాల్లో వాడే భాష, సంయమనం కోల్పోయి చేసే వ్యాఖ్యలపై అభ్యంతరాలు ఉంటయ్, ఉండాలి… కానీ తను చాలాసార్లు ఎక్స్టెంపర్గా నిజాలే చెబుతాడు… కడుపులో ఉన్న భావాన్ని కక్కేస్తాడు… ఎమోషన్ కంట్రోల్ అనేది ఉండదు… అది తన తత్వం… నిజానికి పేకాట కేసులకు సంబంధించి తను నిన్న చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ ఉన్నట్టు అనిపించడం లేదు… తన వ్యాఖ్యలను పీకీ గీకీ ఏదో పెంట చేయాలని ప్రయత్నించడమే తప్ప విపక్షాలకు అందులో గిట్టుబాటు […]
దేహమా..! రేపు రా..! శ్మశానాలు ఖాళీ లేవు..!
సూర్యుడి కొడుకు యమధర్మరాజు. కూతురు యమునా నది. ఇద్దరూ నల్లగా ఉంటారు. నలుపు రంగుకు యమధర్మ రాజు ప్రాణమిస్తాడు. ఆయన వాహనం దున్నపోతు నలుపు. ఆయన డ్రెస్ పంచె, ఉత్తరీయం నలుపు, ఆయన చేతిలో యమపాశం నలుపు. భారతంలో ధర్మరాజు పేరు అర్థం చేసుకోవచ్చు. ప్రాణాలు తీసే యముడు ధర్మరాజు కావడం ధర్మబద్దమేనా? అని కొందరి ధర్మ సందేహం. జాతకాలు, సిజేరియన్ కత్తులు, ఆసుపత్రిలో లేబర్ వార్డ్ బెడ్డుల అందుబాటు గొడవల వల్ల పుట్టడం ముందుకో, వెనుకకో […]
రేవంత్ కేంద్రంగా… తెలంగాణ పెద్ద తలల ‘రాజీ’కీయం… అనూహ్యం…
రాజకీయ నాయకులు…. ఎప్పుడు కలిసిపోతారో, ఎందుకు కలిసిపోతారో, ఏ పాయింట్ వద్ద రాజీ కుదురుతుందో.., లేదా… ఏ ఇష్యూ మీద తన్నుకుంటారో అర్థం కాదు… అన్నీ తెరవెనుక మార్మిక యవ్వారాలు… అంతిమంగా జనం అమాయకులు…! నిజానికి బోలెడు ఉదాహరణలు మనకు నిత్యరాజకీయాల్లో కనిపిస్తూనే ఉంటయ్… కొన్ని సంకేతాలు స్పష్టాస్పష్టంగా మీడియా ధోరణిలో కనిపిస్తుంటయ్… మొన్న టెన్‌టీవీలో కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి సుదీర్ఘ డిబేట్ చూసిన చాలామందికి ఓపట్టాన జీర్ణం కాలేదు… ఆమధ్య మీకు గుర్తుందా..? సీఎం ఆఫీసు […]
తన ఎజెండా అగ్గిపుల్ల గీయడమే..! తను ఊహించినట్టే ఎదురుదాడి, తిట్లు..!!
ఏమన్నాడు బండి సంజయ్..? ‘‘ఏపీలో ఒక మతం రాజ్యమేలుతుంది… బైబిల్ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలి… దుబ్బాక, గ్రేటర్ ఫలితాలే తిరుపతిలో పునరావృతం అవుతాయి… వైసీపీ రెండే కొండలు అంటుంది… ఏడుకొండల వాడా గోవిందా అనేది బీజేపీ సిద్ధాంతం… తిరుపతి ఉపఎన్నిక ఫలితం కోసం దేశమంతా ఎదురుచూస్తోంది… వైసీపీ ప్రభుత్వం మూటామూల్లె సర్దుకునేలా తరిమికొడతాం… ఏపీ దేవాదాయ శాఖ పూర్తి ప్రక్షాళన అవసరం… హిందువుల కానుకల్ని కూడా ఈ ప్రభుత్వం దారిమళ్లిస్తోంది… […]
కేసీయార్ సార్.., మన సిటీ టిఫిన్ సెంటర్ల కష్టం గుర్తించినట్టా..? లేదా..?
డిజిటల్ ఎడిషన్స్, వాట్సప్ ఎడిషన్స్, ఈ-పేపర్స్ అంటూ మెయిన్ స్ట్రీమ్ పత్రికలన్నీ…. ప్రింటింగ్ మానేసి, డిజిటల్ బాట పట్టాయి… అఫ్ కోర్స్, అవి చేస్తూనే తప్పుడు లెక్కలతో ప్రభుత్వ ప్రకటనల్ని అడ్డగోలు రేట్లకు యాడ్స్ పబ్లిష్ చేయడం…. మెదళ్లు మోకాళ్లలో ఉండే సమాచార శాఖ అధికారుల పుణ్యమాని కోట్లకుకోట్లు కొల్లగొట్టడం, ఆ కమీషన్ల బాగోతం అనేది వేరే సంగతి… (అత్యంత భారీ గొప్ప నిజాయితీ, శీలం ఉన్న ఎర్ర పత్రికలు సహా… వాటికి అంతకుమించిన శరణ్యం లేదు […]
ప్రదీపా, నీకు బాగా ఎక్కువైంది బిడ్డా…! వేదిక మీద ఆమెకు ఆ ర్యాగింగు ఏమిట్రోయ్..?!
ఆలియా భట్… జగమెరిగిన టాప్ స్టార్… దీపిక, ప్రియాంకలకు దీటుగా పాపులారిటీ సంపాదించిన నటి… ఏజ్ తక్కువ… కానీ రేంజ్ చాలా ఎక్కువ… నటనలో ఎంత ఇరగదీసినా, తన జనరల్ నాలెడ్జి మీద మాత్రం మస్తు జోకులు… భలే సెటైర్లు నడుస్తూ ఉంటయ్… పెద్దగా చదువుకోకపోవడం, తండ్రి కూడా ప్యూర్ సినిమాల కోసమే అన్నట్టుగా పెంచడం… ఆమెకు చాలా దైనందిన వ్యవహారాలపై పెద్దగా సోయి లేదు… నిజానికి ఆమెకు అవి అవసరం లేదు… దాన్ని ఓ తప్పుగానో, […]
సుడిగాలి సుధీర్… పక్కకు పెట్టేయడం కాదు.., చెబుతున్న సాకులే ఇన్సల్టింగు..!!
తెలుగు బుల్లితెర సూపర్ స్టార్ ఎవరు..? చెప్పడానికి వేరే ఆప్షనే లేదు…! సుడిగాలి సుధీర్..!! కాస్త సమీపంలో ప్రదీప్ కనిపిస్తాడు కానీ… ప్రదీప్ బేసిక్‌గా యాంకర్… కామెడీ టైమింగు, సున్నితంగా డీల్ చేయడం గట్రా బాగుంటుంది, కానీ అంతకుమించి పోలేడు… కానీ సుధీర్… రియల్ పర్ఫార్మర్..! యాంకరింగు, డాన్సులు, కామెడీ, మ్యాజిక్, సింగింగ్, స్టంట్స్… వాట్ నాట్… ఏదంటే అది చేయగలడు… తెలుగు టీవీకి రజినీకాంత్ తను…! మరి అలాంటి వాడిని ఈటీవీ ఎందుకు దూరం పెట్టింది…? […]
స్వామీ! వ్యాక్సిన్ వస్తే కరోనా పోతుందా? శిష్యా! కరోనా పొతే, వ్యాక్సిన్ వస్తుందా?
వ్యాక్సిన్లు ఎన్ని రకములు? అవి ఏవి? వాటి గుణదోషములను వర్ణింపుము? అన్న పది మార్కుల ప్రశ్నకు ఇది సమాధానం కాదు. వ్యాక్సిన్ల తొందరపాటు, అయోమయం, అస్పష్టత, గందరగోళం మీద మరింత గందరగోళం, భయపెట్టే సమాధానం. కాబట్టి వ్యాక్సిన్ల మీద- ప్రత్యేకించి కరోనా వ్యాక్సిన్ మీద ఇప్పటికే స్పష్టత, ధీమా ఉన్నవారు ఇక్కడితో చదవడం ఆపేయవచ్చు. చదివి మరింతగా భయపడతామేమో అనుకునేవారు కూడా ఇక్కడితో చదవడం ఆపేయడం మంచిది. వ్యాక్సిన్లు ప్రధానంగా నాలుగు రకాలు. ఆ సాంకేతిక వివరాలకు […]
- « Previous Page
- 1
- …
- 479
- 480
- 481
- 482
- 483
- …
- 490
- Next Page »