. ఇప్పుడే ఒక వార్త కనిపించింది సోషల్ మీడియాలో… ఇంకా ధ్రువీకరించుకోవాల్సింది… కానీ ఒకింత విస్మయానికి గురిచేసింది… సరే, ఏపీలో ఏదైనా సాధ్యమే… అసలు వార్త ఏమిటంటే… ఇదుగో… పార్వతీపురం, మన్యం జిల్లా… పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐ.పి.ఏస్ ఆఫీసర్ కలకలం… ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలానికి పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్… పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఆయన వెన్నంటే ఉండి ఐ.పి.ఏస్ ఆఫీసర్ లా కలియ తిరిగిన వ్యక్తి… పర్యటన అనంతరం […]
రాఘవేంద్రరావు సినిమా అంటేనే మసాలాలూ, ఫలపుష్పాలూ..!!
. . ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) .. …. రాఘవేంద్రరావు మార్క్ మసాలా సినిమా ఇది… ఘరానా దొంగ… రాఘవేంద్రరావు సినిమా అంటే పాటలు , డాన్సులు , ఫలాలు , పుష్పాలు పుష్కలంగా ఉంటాయి కదా ! అవన్నీ ఉన్నాయి . కృష్ణ-రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 8+1 సినిమాలలో ఒకటి తప్ప అన్నీ హిట్లే . కొన్ని సూపర్ హిట్లు . ఇక్కడ 8+1 లో ఆ ఒకటి […]
రేవంత్‌రెడ్డి పోలీసు అడ్డాలో, పోలీసు భాషలోనే క్లియర్‌గా చెప్పాడు..!!
. రాజు- దిల్ రాజు…… నిజమే. గవర్నమెంటు చాలా పెద్దది. బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపు చాలా చాలా చిన్నవి… తెలంగాణ ఫిలిం డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మాటల ఫ్లోలో అనుకోకుండా అనేశారో, లేక లోపల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశ సారాన్ని ప్రతిబింబించడానికి ఉద్దేశపూర్వకంగానే అన్నారో కానీ… నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకుంటున్నది అదే. రాజ్యం ముందు ఎవరైనా పిపీలికాలే. బహుశా నీళ్ళు నమలకుండా కుండబద్దలు కొట్టినట్లు తన సహజసిద్ధమైన పద్ధతిలో […]
రాజధానిలోనే స్మారకం, సరే సరే… మరి నాడు పీవీని ఏం చేశారు..?!
. మాజీ ప్రధానులు, రాజనీతిజ్ఞులకు ఢిల్లీలోనే అంత్యక్రియలు నిర్వహించి, ఆ స్థలంలోనే స్మారకాలు ఏర్పాటు చేయడం మన దేశంలో ఆనవాయితీగా వస్తుందని కాంగ్రెస్ చెబుతోంది… మన్మోహన్ అంత్యక్రియలు, స్మారకం కోసం… మరి అదే మన్మోహన్‌ను కేబినెట్ మంత్రిని చేసి, దేశాన్ని దివాలా స్థితి నుంచి రక్షించిన తెలుగువాడు పీవీ అంత్యక్రియలకు సంబంధించి ఈ వాదన ఎందుకు గుర్తురాలేదు..? పీవీ భౌతికదేహాన్ని కూడా అవమానించింది కదా కాంగ్రెస్ మాత… తన చేతిలో రిమోట్‌లా పనిచేశాడు కాబట్టి సోనియా అభిమానానికి […]
ఆదిత్య ఓం..! ‘హీరో’ అని పిలవాల్సింది నీలాంటోళ్లను మాత్రమే..!!
. మన సినిమా నటులు, ప్రత్యేకించి స్టార్ హీరోల సంగతి తెలుసు కదా… మేమే దేవుళ్లమనే పిచ్చి భ్రమల్లోనే బతుకుతూ పిల్లికి బిచ్చం కూడా పెట్టని బాపతు… తమకు సొసైటీ ఇంత ఇస్తుంది కదా, మనం ఏమైనా ఇవ్వాలనే సోయి ఏమాత్రం లేని బతుకులు… పేర్లు ఎందుకులే గానీ, టైమ్ వచ్చినప్పుడు ఎన్ని కోట్ల జరిమానాలు కడతారో అప్పుడప్పుడూ చదువుతూనే ఉన్నాం కదా… కానీ కొందరు ఉంటారు… రియల్లీ సర్వీస్ మోటివ్స్… ఉదాహరణకు లారెన్స్ రాఘవ… తన […]
‘సేటూ, ప్రాణాలు పోతాయని డబ్బుల్లేకపోయినా తిన్నాను… ఇక నీ దయ..’
ముంబైలోని ఓ చిన్న హోటల్… ఓ మనిషి వచ్చాడు, విపరీతంగా తిన్నాడు… మనిషి తిండి మొహం చూడక ఎన్నాళ్లయిందో అన్నట్టున్నాడు… అలాగే తింటున్నాడు… తన దగ్గర నయాపైసా లేదు… వెయిటర్ బిల్లు తీసుకొచ్చాడు… ఈ మనిషి ఆ బిల్లు తీసుకుని నేరుగా కౌంటర్ మీద కూర్చున్న సేటు వద్దకు వెళ్లాడు… ‘‘సేటూ, నా దగ్గర పైసా లేదు, రెండు రోజులుగా ఏమీ తినలేదు, ఇలాగే ఉంటే ఏమైపోతానో అని భయమైంది… అందుకే వచ్చి తిన్నాను… ప్రాణాలు నిలుస్తాయి […]
చివరకు జడ్జిల పాదపూజల దాకా ఎదిగిపోయింది జీసరిగమప..!!
. చివరకు ఎవరూ పెద్దగా పట్టించుకోని జెమిని, ఈటీవీ సీరియల్స్‌లో… ఓ నాసిరకం సీరియల్ రేటింగ్స్ కూడా 2 దాకా వస్తాయి… కానీ జీ తెలుగు వాడు సమర్పించే సరిగమప అనే మ్యూజిక్ షో రేటింగ్స్ సాధనలో అంతకన్నా నాసిరకం పనితీరు… రకరకాల భ్రష్ట ప్రయోగాలతో మ్యూజిక్ షోను మరో శ్రీదేవి డ్రామా కంపెనీ షోలాగా మార్చేశారు అని గతంలో కూడా చెప్పుకున్నాం కదా… అసలు దీని రేటింగ్స్ ఎలా ఉంటున్నాయి అని ఈవారం బార్క్ జాబితాలు […]
ఈ ఫార్మాట్ ఇలాగే ఉంటే… బిగ్‌బాస్-9 కూడా అట్టర్ ఫ్లాపే..!!
. క్రియేటివ్ టీం మార్చినా సరే… ఏదో నాగార్జునతో అన్లిమిటెడ్ ట్విస్టులు అని చెప్పించినా సరే… ఏవేవో కథలు పడ్డా సరే… ఈసారి బిగ్‌బాస్ సీజన్, అంటే ఎనిమిదో సీజన్ అట్టర్ ఫ్లాప్… ఇదే మాట గతంలోనూ ముచ్చటించుకున్నాం కదా… కారణాలనూ చెప్పుకున్నాం… షో టీఆర్పీలు పడిపోయేకొద్దీ ఏవేవో జాకీలు పెట్టారు, లేపడానికి ట్రై చేశారు కానీ సక్సెస్ కాలేదు… ఈ షో ఎంత ఫ్లాపో చెప్పాలంటే ఫినాలేకు వచ్చిన రేటింగ్సే తార్కాణం… ఫినాలేకు… గెస్టులు, విజేత […]
“అన్న వచ్చేదాకా శవాన్ని ఇక్కడ్నించి కదిలించేది లేదు..”
. “పోస్టుమార్టం పూర్తయ్యింది..ఇక నువ్ నీ భర్త బాడీని తీసుకెళ్ళొచ్చు..” ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో పోలీసులు చెప్పటంతో హతాశురాలయ్యింది ఆమె ! “చంపేశారు బాబూ.. పోలీసులే చంపేశారు..అయ్యా..ఇక నాకు..నా పిల్లలకు దిక్కేవరు..”హృదయ విధారకంగా రిక్షా కార్మికుడి శవం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది ఆమె “ముందు శవాన్ని త్వరగా ఇక్కడ్నించి తీసుకెళ్లు..ఎక్కువసేపు ఇక్కడుండకూడదు..”హడావుడి పెట్టారు పోలీసులు అప్పటికి సమయం తెల్లవారి ఐదు గంటలు వెలుగు రేఖలు భూమ్మీద ఇంకా పూర్తిగా పర్చుకోలేదు పోలీసుల మాటకు కళ్ళు తుడుచుకుని […]
ఆకాశవాణిలో పుష్ప సినిమా సంక్షిప్త శబ్ద చిత్రం వచ్చిందట పెట్టండర్రా
. అల్లుడికి సైకిల్, టేప్ రికార్డర్ పెట్టాల్సిందే !! ** # అదేంటి మావాడు పోస్టాఫీసులో రన్నర్ గా పంజేస్తున్నాడు.. పర్మినెంట్ కాదుగానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం.. కట్నం కింద .సైకిల్.. నేషనల్ టూ ఇన్ వన్ టేప్ రికార్డర్ ఇవ్వాల్సిందే # ఒరేయ్ రాముడూ బామ్మ సీరియస్ .స్టార్ట్ ఇమీడియట్లి అని హైదరాబాదులో మీ అన్నకు టెలిగ్రామ్ పంపరా # ఒసేయ్ గీతా..నీకు కొత్త పుస్తకాలు ఎందుకే.. మీ అక్క పాత బుక్స్ ఉన్నాయిగా అవి […]
ఏమండీ, పిలిచారా…? పిలవలేదా..? పిలిచినట్టు అనిపిస్తేనూ…!
. నేను వసారాలో, ఈజీ చైరులో కూర్చుని, పేపరు చదువుకుంటున్నాను. తూర్పు దిక్కు నుండి కొంచెం ఎండ పడుతుంది. ఇంతలో మా ఆవిడ, చీరె కొంగుతో చేతులు తుడుచుకుంటూ, ”పిలిచారా?” అని ఆతృతగా అంటూ వచ్చింది. నేను తన వైపు చిరునవ్వుతో చూసాను. “పిలవలేదా? పిలిచినట్టుగా అనిపించింది. కాఫీ ఏమైనా కావాలా?” అని అడిగింది. నేను కుర్చీలో నుంచి లేచి, మా ఆవిడ భుజం మీద చెయ్యి వేసి, నవ్వాను. “సరే సరే అవతల, స్టౌ మీద […]
బుధాదిత్య యోగం… మన్మోహన్సింగ్ ఉచ్ఛ స్థితికి అసలు కారణం..!!
. . ( Ke Sri… Srini Journalist ) .. ….. ప్రపంచంలో కొన్ని విషయాలు అంత తొందరగా మన అవగాహనకి రావు. వచ్చినా సరే, ఎవరికైనా అర్ధమయ్యేలా చెప్పడం అంత ఈజీ కాదు కూడా … మోడరన్ సైంటిస్టు ఎవరినైనా టెలిస్కోప్ లేని రోజుల్లో మన రుషులు గ్రహణ సమయాలు, గ్రహ చలనాలు ఎలా కనుక్కున్నారు అని అడిగి చూడండి ఏం చెప్తారో చూద్దాం … ఈ ఉపోద్ఘాతం అంతా జ్యోతిష్యం సైన్సా లేదా […]
50 కోట్ల మంది హాజరయ్యే కుంభమేళా… మార్కెటింగ్ మహత్తు ఇదీ..!!
. మామూలుగా ఓ చిన్న జాతర జరుగుతూ ఉంటేనే… బోలెడు మంది చిరు వ్యాపారులు మాత్రమే కాదు… బ్రాండ్ ప్రమోషన్ల యాడ్స్ కూడా బాగా కనిపిస్తుంటాయి… వర్తమాన వాణిజ్య ప్రపంచంలో ఎవరికైనా బ్రాండ్ ప్రమోషన్ తప్పదు… గతంలోని సంప్రదాయ మార్కెటింగ్ విధానాలు కాదు ఇప్పుడు… రకరకాల కొత్త పోకడలు వచ్చాయి… అలాంటిది కుంభమేళా వంటి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం జరుగుతుంటే ఇక యాడ్స్ సంగతి చెప్పాలా సపరేటుగా..? ఎక్స్చేంజ్ ఫర్ మీడియాలో ఓ ఆసక్తికర […]
మన్మోహన్సింగ్… తన కెరీర్‌పై ఇవీ కొన్ని ఇంట్రస్టింగ్ నిజాలు…
. . ( శివ రాచర్ల ) .. …. Destined Prime Minister… రాజకీయ ఆరోపణలు ముఖ్యంగా ఎన్నికల సమయంలో చేసే విమర్శలు ఏ నాయకుడి వ్యక్తిత్వాన్ని, వారి ట్రాక్ రికార్డ్ ను ప్రతిబింబించవు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ , సోనియా గాంధీ మీద విమర్శలకు మన్మోహన్ సింగ్ ను ఒక అవకాశంగా వాడుకున్నారు. అందులో ప్రధానమైనది “accidental prime minister ” అనటం… ఈ దేశంలో ఆక్సిడెంటల్ ప్రధానులు […]
శంకరాభరణం సునామీలో కొట్టుకుపోయిన ఓ మహాలక్ష్మి..!!
. . ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) . …. శంకరాభరణం సునామీలో కొట్టుకుపోయిన మంచి సినిమా ఈ మహాలక్ష్మి సినిమా . బహుశా చాలామందికి ఈ సినిమా పేరు కూడా గుర్తుండి ఉండదు . శంకరాభరణం 1980 ఫిబ్రవరి రెండున వచ్చింది . మొదటి వారం దాటాక శంకరాభరణం సునామీ ప్రారంభం అయింది . సరిగ్గా ఆ సునామీలో ఫిబ్రవరి ఇరవైన రిలీజయింది మహాలక్ష్మి సినిమా . […]
నిజానికి ప్రజల్ని దోచుకునేది ప్రభుత్వమే… ఎడాపెడా బాదుడే…
. ఈమధ్య రెండు సందర్భాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా చిత్ర విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తోంది. ఆమె లండన్ ఎకనమిక్ స్కూల్ విద్యార్థి. ఏకకాలంలో అనేకభాషలు మాట్లాడగలరు. ఆమె చదువును, జ్ఞానాన్ని తక్కువ చేయాల్సిన పనిలేదు. మోడీ, అమిత్ షా ల కాలంలో ఆర్థికమంత్రిగా ఆమెకున్న పరిమితులు కూడా లోకానికి తెలియనివి కావు. అయినా ఎందుకో ఆమె తరచుగా సామాజిక మాధ్యమాలకు వస్తువు అవుతున్నారు. పద్దెనిమిదేళ్ళ వయసులో చదరంగంలో జగజ్జేతగా […]
నిజమే… వెన్నెల కిశోర్ హీరోయే కాదు… ఇది అనన్య నాగళ్ల మూవీ..!!
. మొన్న చిన్న వివాదం… శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని ఓ సినిమా వచ్చింది కదా… దానికి ట్యాగ్‌లైన్ చంటబ్బాయ్ తాలూకా… పుష్ప2 తరువాత మాదే ఇక వసూళ్ల జాతర అనీ వేదికల మీద సరదాగా ప్రకటించారు కదా నిర్మాతలు… పైగా టైటిల్ రోల్ వెన్నెల కిషోర్… సో, గతంలో చిరంజీవి హీరోగా వచ్చిన చంటబ్బాయ్ తరహాలో హాస్యంతోకూడిన అపరాధ పరిశోధన కథ అనుకున్నారు అందరూ… నిజానికి ఒకప్పుడు బ్రహ్మానందం లేని తెలుగు సినిమా ఉండేది కాదు… […]
యాంకర్ ప్రదీప్ ఐటమ్ డాన్స్..! బాగానే కష్టపడ్డాడు డాన్సడానికి..!!
. ప్రదీప్ మాచిరాజు… పరిచయం అక్కర్లేని పేరు… తెలుగు టీవీల్లో నంబర్ వన్ మేల్ యాంకర్… స్పాంటేనిటీ, చెణుకులు, ఎనర్జీ… పెద్దగా అసభ్య సీన్ల జోలికి కూడా పోడు… కానీ ఈమధ్య టీవీల్లో కనిపించడం లేదు… ఏ షో చేయడం లేదు… కాకపోతే అనంతపురం జిల్లా రాజకీయవేత్త ఎవరితోనో లవ్వులో ఉన్నాడనీ, త్వరలో పెళ్లి అనీ చాన్నాళ్లుగా వినిపిస్తున్నదే, మళ్లీ ఈమధ్య కనిపిస్తున్నాయి ఆ వార్తలు… మరి ఏమైంది తనకు..? ఏమీ లేదు… అక్కడ అమ్మాయి ఇక్కడ […]
బాల్కనైజేషన్ ఆఫ్ సిరియా… ప్రపంచగతి మారుతోంది వేగంగా…
. బాల్కనైజేష్ అఫ్ సిరియా – Balkanization of Siriya! … Part 4 సిరియా బాల్కనైజేషన్ గురుంచి చెప్పుకునే ముందు లిబియా అధ్యక్షుడు మొహమ్మద్ గడాఫీ అన్న మాటలని గుర్తు చేసుకొని ముందుకి వెళితే పరిస్థితి అర్ధం అవుతుంది! 2011 లో లిబియా అధ్యక్షుడు మొహమ్మద్ గడాఫీని ప్రజలు కొట్టి చంపివేయడానికి రెండు రోజుల ముందు అన్న మాటలు ఇవి.. “ అమెరికన్ల ప్లాన్ ఏమిటంటే లెబనాన్, సిరియా దేశాలని ప్రపంచ పటం నుండి తీసివేయాలని… […]
బురద రాజకీయాల నడుమ… చిన్న మరకా అంటని నిష్కళంకుడు…
. నిజానికి తను పొలిటిషియన్ కాదు… ఆర్థిక రథాన్ని ఎలా నడపాలో బాగా తెలిసిన సారథి… ప్రణాళికవేత్త… అన్నింటికీ మించి పదే పదే ప్రశంసించదగిన సుగుణం… అవినీతి, అక్రమాలతో కుళ్లిన వర్తమాన రాజకీయ వ్యవస్థలోనే దశాబ్దాలపాటు కీలక స్థానాల్లో ఉన్నా సరే, ఏదీ అంటకుండా నిష్కళంకుడిగా బతికిన స్వచ్చుడు… తన ఆర్థిక విధానాలను, తన పాలన విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తులు, పార్టీలు కూడా ఆయన్ని ఎప్పుడూ అవినీతిపరుడిగా విమర్శలకు పోలేదు… తను ప్రధానిగా ఉన్న పదేళ్ల […]
- « Previous Page
- 1
- …
- 51
- 52
- 53
- 54
- 55
- …
- 490
- Next Page »