. ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీలో అల్లు అరవింద్ ని దగ్గరగా చూసిన వ్యక్తిగా చెపుతున్నా సార్, ఫస్ట్ టైం మాటలు తడబడుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి ఈ రోజు ప్రెస్ మీట్ లో.., తన బలమే పీపుల్ మేనేజ్మెంట్… అటువంటి అరవింద్ తన సొంత కొడుకుని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నందుకు చాలా బాధపడి ఉంటాడు… తను పక్కా వ్యాపారి… తనకు అందరూ కావాలి… ఎవరితోనూ వైరం వద్దు… కానీ కొడుకు బన్నీతో తొలిసారి అవస్థలు పడుతున్నట్టున్నాడు… చిరంజీవిని, పవన్ కళ్యాణ్ ని, […]
అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యం… చెప్పినా వినని బరితెగింపు…
. సంధ్య థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదు… అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్ కు వెళ్లారు… అతను కేవలం థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరం ఉండేది కాదు… కానీ థియేటర్ కు వెళ్ళేటప్పుడు రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో […]
మా కరీంనగర్ టూ ఆ లంబసింగి.. వయా హైదరాబాద్..!
. . ( రమణ కొంటికర్ల ) .. …. మంచు కురిసే వేళలో…. చెడ్డీదోస్తుల లంబసింగి టెయిల్స్! చలి చంపుతున్న చమక్కులో గిలిగింతకొచ్చిందంటూ పాడుకుంటున్న చలికాలపు సాయంత్రాల్లో… పూర్తిగా మంచుదుప్పట్లోకే చొరబడ్డాం! చూసొచ్చినవాళ్లు చెప్పే ముచ్చట్లు.. యూట్యూబర్స్ ఊరించే కబుర్లు.. సోషల్ మీడియాలో వైరలయ్యే రీల్స్.. ఎంత కాదన్నా ఎంతో కొంత ప్రభావితం చేస్తూనే ఉంటాయి. పైగా చాలాకాలంగా ఒకేచోట తిష్ఠ వేసి కూర్చోవడం.. అటు వెళ్లాలి, ఇటు […]
డియర్ కేటీయార్… మరణించిన ఓం ప్రకాష్ చౌతాలా కథ తెలుసా..?!
. తను అడ్డగోలుగా బుక్ అవుతున్నాననే స్పృహ కేటీయార్‌లో చాలా రోజులుగా కనిపిస్తోంది… తమకు ఇన్నేళ్లుగా అణిగిమణిగి కోవర్టు ఆపరేషన్లు చేసే నాయకుడు కాదు కదా రేవంతుడు… అసలే బాధితుడు కదా… కాస్త కసిగానే వర్కవుట్ చేస్తున్నాడు… కవితను వదిలేయండి, ఆమె బీజేపీ స్ట్రాటజీ కస్టమర్… సరే, వాళ్లు కొన్నాళ్లకు పిచ్చి పొలిటికల్ స్ట్రాటజీల పేరిట ఉపేక్షిస్తారు… అదే కేసీయార్ మళ్లీ ఏవేవో డ్రామా ఎపిసోడ్లతో బీజేపీని బజారుకీడుస్తాడు… బీజేపీ నాయకులకు సిగ్గూశరం ఏమీ ఉండదు తెలిసిందే […]
నడిరాతిరి వేళా నీ పిలుపు… ఇలాంటి ఓ హిందీ పాటే ఓ ఉత్సవం…
. . ( Shanthi Ishaan… ) .. … పగలంతా నువ్వు మరోలా ఉండొచ్చు. నీ అనుభూతులను, నీ భావోద్వేగాలను దాచి ఉండొచ్చు. కానీ ఉన్నట్టుండి ఏ నడిరాతిరో నీకు మెలకువ వస్తుంది. నువ్వు కప్పుకున్న ముసుగు వీడిపోతుంది. నువ్వు పోగొట్టుకున్న నువ్వు నీకు బాగా గుర్తొస్తావు. నీలో నిద్రాణంగా ఉన్న జ్ఞాపకాలు మేలుకొంటాయి. నీ మనసు పట్టు తప్పుతుంది. నువ్వు మరిచిపోయిన మల్లెల పరిమళం తాజాగా మారి నీ […]
నిండు గర్భిణి… అనితర సాహసం… నృత్యం మీద అనురక్తి అది..!!
. ( కె.శోభ ) .. … 9వ నెలలో నృత్యకారిణి సాహసం, దేవకీ పరమానందం, ‘మాతృత్వం’ నృత్య రూపకం బిడ్డ కడుపున పడింది మొదలు నెలలు నిండేకొద్దీ కదలడం తల్లికి భారమే. అయినా సాహసించి పరీక్షలకు వెళ్ళేవాళ్ళు, ప్రయాణాలు చేసేవాళ్ళు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. అయితే తొమ్మిదో నెలలో నృత్య ప్రదర్శన ఇచ్చే సాహసం ఎవరూ చెయ్యలేదు. తాజాగా బెంగళూరుకు చెందిన యగ్నికా అయ్యంగార్ అరుదైన ప్రదర్శన చేసి చరిత్ర సృష్టించారు. […]
తమిళనాడులో సూపర్ హిట్… గురుడు శ్రీలంకలో సూపర్ బంపర్ హిట్…
. . ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) .. … హిందీలో బ్లాక్ బస్టర్ జుగ్నుకి (1973) రీమేక్ ఈ గురు సినిమా . తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో తీసారు . తమిళంలో సూపర్ డూపర్ హిట్ . తమిళనాడులో కన్నా శ్రీలంకలో బాక్సాఫీసుల్ని బద్దలు కొట్టేసింది . జూలై 1980 లో వచ్చిన ఈ గురు సినిమా తెలుగులో కూడా బాగా ఆడింది […]
ఉపేంద్ర తనే చెప్పాడు… మూర్ఖులైతేనే ఈ సినిమా చూడండి అని…!!
. తరణ్ ఆదర్శ్… వర్తమానంలోని మంచి సినిమా క్రిటిక్… అన్ని భాషల ఇండస్ట్రీ ముఖ్యులు తన రివ్యూలు ఫాలో అవుతుంటారు… సరళంగా నాలుగు ముక్కల్లో సినిమా నాణ్యతను తేల్చిపడేస్తాడు… కానీ నెవ్వర్… ఆయన కూడా ఓ సినిమాను విశ్లేషించలేడు… సమీక్షించలేడు… జుత్తు పట్టుకుంటాడు… ఓ విషమ పరీక్షలాగా మారుతుంది… తన సమీక్ష సామర్థ్యం మీదే తనకు డౌటొస్తుంది… ఆ సినిమా పేరు యూఐ… నిజం… ఉపేంద్ర కొత్త సినిమా ఒకటి వచ్చిందిగా,.. దాని పేరే యూఐ… ఆ […]
ఎంతకూ కదలని కథ..! అసలు ఇది వెట్రిమారన్ సినిమాయేనా..?!
. ప్రజల సమస్యల కోసం పోరాటం ఎవరు చేసినా, మొదట శాంతియుతంగానే స్టార్టవుతుంది… మన వ్యవస్థ, మన పోలీసుల పుణ్యమాని హింసకు దారితీస్తుంది… ఎక్కడో కార్మికుల తరఫున పోరాడే ఓ వ్యక్తి చివరకు సాయధుడయితే…? అసాంఘిక శక్తి అనో, నక్సలైట్ అనో మన వ్యవస్థ ఎన్కౌంటర్ చేయడానికే సంకల్పిస్తుంది… ఇలాంటి సీరియస్ సబ్జెక్టును కేవలం కొందరు మాత్రమే ఎఫెక్టివ్‌గా తీయగలరు… అందులో వెట్రిమారన్ కూడా ఒకరు..! అందుకే జూనియర్ ఎన్టీయార్ వంటి స్టార్ హీరోలు కూడా తనతో […]
శాండల్‌వుడ్..! ఏది కన్నడ తల్లీ, నిరుడు కురిసినఅపార ధనవర్షం..!!
. క్లౌడ్ బరస్ట్… క్యుములోనింబస్… కుంభవృష్టి… ఆవర్తన ద్రోణి… భారీ వర్షాలకు చాలా పదాలు వాడుతుంటాం కదా… అచ్చంగా శాండల్‌వుడ్… అనగా కన్నడ చిత్ర పరిశ్రమకు గత ఏడాది స్వర్ణయుగం… కేజీఎఫ్, కాంతార, చార్లి ఎట్సెట్రా బోలెడు సినిమాలు దుమ్మురేపాయి… పాన్ ఇండియా రేంజులో కూడా… కన్నడ ఇండస్ట్రీ దశ మారింది… కొత్త క్రియేటివ్ పీపుల్, దమ్మున్న నిర్మాతలు, ఇండియన్ మార్కెట్‌ను ఒడిసిపట్టిన మార్కెటింగ్ పీపుల్ వచ్చారనీ అనుకున్నారందరూ… అవును, గత ఏడాది అదే చరిత్ర… చుట్టూ […]
సారీ నరేష్..! బాగానే కష్టపడ్డవ్… ఎటొచ్చీ ప్రజెంటేషన్ కొట్టేసింది..!!
. ఇది పదేళ్లు గుర్తుండిపోయే సినిమా అని బచ్చల మల్లి గురించి హీరో నరేష్ చెప్పుకున్నమాట… మీడియా మీట్లలో, ప్రమోషన్ మీట్లలో ఎలాగూ తప్పదు ఇలాంటి విశేషణాలు వాడటం… కానీ అది వింటున్నప్పుడే కాస్త నవ్వొచ్చింది… ఎందుకంటే..? పదేళ్లు గుర్తుండిపోయే సినిమాలు అసలు గత పదేళ్లలో ఏమొచ్చాయని..! సగటు తెలుగు హీరో అంటే ఎలా ఉండాలి..? అల్లరి చిల్లర చేష్టలు, కాస్త విలనీ షేడ్స్ ఉండే గుణం, అసాంఘిక శక్తులుగా చిత్రీకరణ… అలా ఉంటేనే జనానికి కనెక్టవుతుందనే […]
తెలుగు భాషకన్నా ముందుగానే… తెలుగు లిపికి మరణశాసనం…
. తెలుగును తెలుగులో రాస్తే జైల్లో పెడతారా? మాతృ భాష. అమ్మ భాష. మన భాష. మదర్ టంగ్. ఎలా చెప్పినా, ఏ భాషలో చెప్పినా సొంత భాష ప్రాధాన్యం ఉండి తీరుతుంది. తెలుగు తల్లి/తెలంగాణా తల్లి అనగానే భావోద్విగ్నంగా ముడిపడతాం. పడాలి కూడా. భాసించేది భాష. అంటే వెలిగేది, వెలుగును పంచేది. అంటే నిజమయిన వెలుగుగురించి చెప్పాలన్నా కాంతిమంతంగా వెలిగే భాష లేకపోతే సాధ్యం కాదన్నమాట. అందుకే మండే సూర్యుడి వెలుగును సంకేతిస్తూ భాస్కరుడు అంటున్నాం. […]
ఆ సుమధుర గొంతుపై ఇందిర నిషేధం కత్తి..! అసలేం జరిగింది..?
. . ( రమణ కొంటికర్ల ) . ….. బినాకా గీత్ మాల.. 1970వ దశకంలో ఒక ఊపు ఊపిన రేడియో కార్యక్రమం. భారత్ తో పాటు, పొరుగుదేశాలైన శ్రీలంక, పాకిస్థాన్ వంటి చోట్లా ఓ ఎమోషనల్ బాండ్ ఏర్పర్చుకున్న రేడియో షో. అదే సమయంలో 1975-77 మధ్య ఎమర్జెన్సీ సమయంలో ఇందిర కుటుంబానికీ, సుప్రసిద్ధ గాయకుడు కిషోర్ […]
గుండమ్మ కథలాగే గయ్యాళి గంగమ్మ… తెర నిండా సూర్య‘కాంతులే’…
. . ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) …….. ఫక్తు జంధ్యాల మార్క్ సినిమా గయ్యాళి గంగమ్మ… కక్షలు , పగలు , చంపటాలు , చంపుకోవటాలు , చాతబడులు వంటి వయలెన్స్ లేకుండా ఫేమిలీ ఓరియెంటెడ్ , వినోదాత్మక సినిమాలను పాపులర్ చేసింది జంధ్యాలే . ఒకప్పుడు విజయా వాళ్ళు ఇలాంటి వినోదాత్మక సినిమాలు తీసేవారు . 1980 ఆగస్టులో వచ్చిన ఈ గయ్యాళి గంగమ్మ కూడా విజయా వారి […]
స ని ద ప మ… పిల్లల్ని దండించే ముందు ఈ స్వరాలు గుర్తుంచుకొండి…
. ( యండమూరి వీరేంద్రనాథ్ ) ….. స, ని, ద, ప, మ: పిల్లల్ని దండించే ముందు ఐదు అంశాల్ని గుర్తుంచుకోవాలి. సులభంగా ఉండటం కోసం వాటికి స, ని, ద, ప, మ అని పేరు పెట్టుకుందాం. 1. సహేతుకత: కోపం చర్య (యాక్షన్) కాదు. అవతలి వారి చర్యకి మన ప్రతిచర్య (రియాక్షన్). మీకు ప్రమోషన్ వచ్చిన రోజు, మీ పిల్లవాడికి ఒక సబ్జెక్ట్‌లో మార్కులు కాస్త తక్కువ వచ్చినా పెద్దగా పట్టించుకోరు. […]
ప్రతాప్ చంద్ర సారంగి..? ఈ ఒడిశా మోడీ ఓ ఇంట్రస్టింగ్ కేరక్టర్..!!
. రాహుల్ గాంధీ కావాలని నెట్టేశాడు, అందుకే 69 ఏళ్ల ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి కింద కూలబడి గాయాలయ్యాయి, హాస్పిటల్లో చేరాల్సి వచ్చిందని బీజేపీ ఆరోపణ… అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి, తరువాత ఆ సెక్షన్ తీసేసినట్టు ఓ వార్త… నాగాలాండ్ తొలి మహిళా రాజ్యసభ సభ్యురాలు, వైస్ చైర్మన్ కోనియాక్ తన పట్ల రాహుల్ గాంధీ ప్రవర్తన సవ్యంగాి లేదు, సభ్యంగా లేదు అని ఆరోపించింది… మొత్తానికి ఈ వివాదాలు, కేసులు, విమర్శలతో రాజ్యసభ […]
శ్రీనివాసా… కొండ మీద దేవుడికి కోపం రాదనే కదా వారి ధీమా..!!
. తిరుమలలో తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ మీడియాతో మాట్లాడాడు… ఏమంటున్నాడు అనేది తరువాత… తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కొండ దిగేలోపు కేసు పెడతామని ఆమధ్య టీటీడీ పాలకమండలి చెప్పినట్టు గుర్తు… ఐనా, అక్కడ ఇంకా మీడియా గొట్టాలు ఎందుకు కొనసాగుతున్నట్టు..? శ్రీనివాస గౌడ్ ఎంత జాగ్రత్తగా మాట్లాడినా అవి వివాదాస్పద వ్యాఖ్యలే… చైర్మన్ బీఆర్ నాయుడు వరుసగా హరీష్, శ్రీనివాసయాదవ్ తదితర బీఆర్ఎస్ మాజీ మంత్రులను కూడా కలిసి ఆశీస్సులు […]
ఈ ఇద్దరు మహిళల జగడాన్ని సుప్రీం కూడా తీర్చలేక పోయింది…
. నెవ్వర్… ఈ ఇద్దరు మహిళల తగాదా… అదీ ఫుల్లు అహంతో కూడిన ఇద్దరు ఉన్నతాధికారిణుల పంచాయితీని చివరకు సుప్రీం కోర్టు కాదు కదా… దేవుడు కూడా పరిష్కరించలేడేమో… కర్నాటక… ఒకావిడ పేరు రోహిణి సింధూరి… తెలుగు ఐఏఎస్… 43 ర్యాంకు… మరొకావిడ పేరు రూపా మొద్గిల్… కన్నడ ఐపీఎస్… ఇద్దరూ తరచూ వార్తల్లోకి ఎక్కుతుంటారు… ఒకరికి ఒకరు తీసిపోరు… అసలే ఆడ లేడీస్, ఆపై సెంట్రల్ సర్వీస్… కీలక బాధ్యతల్లో పనిచేసినవాళ్లు… ఎక్కడో తేడా కొట్టింది […]
రైతు అంటేనే మోసపోయేవాడని కదా… ఈ కేరక్టర్ చేసిందీ అదేగా…!!
. మరీ సీపీఐ నారాయణ అన్నట్టుగా… బిగ్‌బాస్ హౌజ్ ఓ వ్యభిచార కొంప అనే స్వీపింగ్ కామెంట్లు చేయలేను గానీ… డెఫినిట్‌గా అవాంఛనీయ కేరక్టర్లను … ఒరేయ్, నువ్వు తోపు, నువ్వు తురుమ్ అనే ముద్రవేసి సమాజం మీదకు వదులుతున్నది మాత్రం నిజం… అందులో ఫస్ట్ పర్సన్… పల్లవి ప్రశాంత్… గత సీజన్ విజేత… తనేమైనా ఎంటర్టెయినరా కాదు, మంచి గేమరా, అస్సలు కాదు, పోనీ, ఏమైనా ఓ రీతి కలిగిన కంటెస్టెంటా… కానేకాదు… ఆ శివాజీ […]
అడకత్తెరలో బంగ్లాదేశ్… సరిహద్దుల్ని మొత్తం ఆక్రమించిన అరకాన్ ఆర్మీ..!!
. కొందరు ఉంటారు… మన దేశం అనుభవిస్తున్న సార్వభౌమిక స్వేచ్ఛ విలువ తెలియదు… మరోసారి చెబుతున్నా… అంతర్జాతీయ సమాజంలో మనం అనుభవించే స్వేచ్ఛ విలువ వాళ్లకు తెలియదు… చుట్టూ అగ్నిగుండాలు… శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్, మాల్దీవులు, చివరకు హిందువుల్ని, బౌద్ధుల్ని తరిమేస్తున్న బంగ్లాదేశ్… మళ్లీ అదే బంగ్లాదేశ్ అయ్యో అయ్యో మా రోహింగ్యా ముస్లింలను బర్మాలో ఊచకోత కోస్తున్నారని ఏడుస్తుంది.. సేమ్, చైనా… ఇదే చైనా జింజియాంగ్ ప్రావిన్సులో తనే ముస్లింల మీద ఉక్కుపాదం మోపుతుంది… కానీ […]
- « Previous Page
- 1
- …
- 54
- 55
- 56
- 57
- 58
- …
- 490
- Next Page »