గతంలో ఏమో గానీ… ఈమధ్య కన్నడ సినిమా కూడా కథాప్రయోగాలు చేస్తోంది… రొటీన్ ఫార్ములా సినిమాలు గాకుండా కాస్త డిఫరెంట్ కథల్ని ఎంచుకుని రిస్క్ తీసుకుంటున్నారు… రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి ఎట్సెట్రా రీసెంట్ పాపులర్ శెట్టిలలాగే ఇప్పుడు దీక్షిత్ శెట్టి… అదేనండీ నాని హీరోగా చేసిన దసరా సినిమాలో ఓ కీలకపాత్ర చేశాడు, కీర్తి సురేష్ ప్రేమికుడి పాత్ర… అదుగో తను హీరోగా చేసిన బ్లింక్ అనే సినిమా ఇప్పుడు ఓటీటీలో ఉంది… అమెజాన్ ప్రైమ్… […]
జోలపాడి.., నిద్రపుచ్చి.., సేదతీర్చి.., రెప్పపడని సమస్యకు రెప్పపాటు సొల్యూషన్…
చైనాలో నిద్రపుచ్చే వ్యాపారం….. నిద్ర పట్టని ప్రపంచం నిద్ర కోసం నిద్రాహారాలు మాని నిరీక్షిస్తూ ఉంటుంది. కొన్ని సెకెన్లు కాగానే కనురెప్పలు అసంకల్పితంగా పడడానికి వీలుగా కనురెప్పల వెనుక తడి ఉంటుంది. కంటి తడి లేకపోతే శాస్త్రీయంగా కనుగుడ్డుకు రక్షణ ఉండదు. గుండెతడి లేకపోతే మనిషికి విలువ ఉండదు. కను రెప్ప వేసే కాలమే నిమిషం. దేవతలకు మనలాగా కనురెప్పలు పడవు కాబట్టి వారు అనిమేషులు. కనురెప్ప పడినంత సహజంగా, వేగంగా నిద్ర పట్టాలి. కానీ- ఇది చెప్పినంత […]
చిన్న కృష్ణుడిగా రోహిణి… బాలకృష్ణుడిగా శ్రీదేవి… కృష్ణుడిగా రామకృష్ణ…
మహా నటుడు SVR , జమునల సినిమా ఇది . 1975 లో వచ్చిన ఈ యశోద కృష్ణ సినిమాయే మహానటుడు యస్ వి రంగారావుకి ఆఖరి తెలుగు సినిమా కావటం దురదృష్టం . ఇంతటి మహానటుడు , ఏ పాత్రనయినా అలవోకగా నటించగల నటుడు మరొకరు లేరని చెప్పవచ్చు . వసుదేవుడు , దేవకీదేవిల వివాహంతో ఆరంభమయి , శ్రీనివాస కల్యాణంతో ముగుస్తుంది సినిమా . భారతీయ సంస్కృతిలో పురాణాలకు , ఇతిహాసాలకు ప్రధాన స్థానం […]
మానవ బంధాలు, ఉద్వేగాల సంక్లిష్టత… ఎంత బాగా ఆవిష్కరించారమ్మా…
అప్పుడెప్పుడో రుస్తుం అనే సినిమాలో చిరంజీవి సరసన నటించింది ఊర్వశి… చాలా సీనియర్ నటి కానీ తెలుగులో మళ్లీ ప్రముఖంగా కనిపించలేదు… ఏమో, గుర్తుంచుకునేంతగా లేదు… కన్నడం, మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో అనేక సినిమాలు చేసింది… కానీ ఆమె ప్రధానమైన ఫీల్డ్ మలయాళమే… మొదట్లో పెద్దగా ఇంప్రెసివ్ నటి అనిపించలేదు, కానీ అనుభవంతో చాలా బాగా మెరుగుపడింది… టీవీల్లో కూడా చేసింది… సార్వతి తిరువోతు… ఈమె మలయాళ నటి… అన్ని భాషల్లోనూ చేస్తుంది గానీ తన […]
అనుభవాలే జ్ఞాపకాలు… జ్ఞాపకాలే కథలు… కథలే మనం..!
… చాన్నాళ్ళ తర్వాత ఓ తెలుగు సినిమాను నింపాదిగా చూశాను. Skip & Forward బటన్ నొక్కకుండా పూర్తిగా చూడగలిగాను. మరీ ముఖ్యంగా ‘తెలుగు’ నటులున్న సిసలైన ‘తెలుగు’ సినిమాను చూశాను. అదే ‘వీరాంజనేయులు విహారయాత్ర’. ‘ETV Win’ Streaming Appలో ఉంది. … ఇది చాలా సింపుల్గా కనిపించే చాలా కాంప్లికేటెడ్ కథ. ఈ మాట ఎందుకంటున్నానంటే, మహాభారతం, రామాయణం లాంటి భారీ కథల్లో బోలెడన్ని పాత్రలు, ఉపకథలు, ట్విస్టులు గట్రా ఉంటాయి. కాబట్టి మనం […]
తంగలాన్… హీరో విక్రమ్ ఓ సాహసి… తాజాగా తనకు భలే దొరికాడు పా.రంజిత్…
కొన్ని సినిమాలను, కొందరు హీరోలను ప్రత్యేకంగా చెప్పుకోవాలి… ఎలాంటి సినిమాలు అంటే డిఫరెంట్ కాన్సెప్టులతో… రెగ్యులర్ మూస, ఫార్మాట్, హైపర్ హీరోయిజం కథలకు భిన్నంగా వచ్చేవి… అవి సాహసాలు… తీసే దర్శకుడికి, తీయించే నిర్మాతకు… అలాంటి సినిమాయే ఈ తంగలాన్ కూడా… ఎక్కడా సగటు కమర్షియల్ పోకడకు దారిమళ్లకుండా… కథను స్ట్రెయిట్గానే చెబుతూ ఎక్కడా డీవియేషన్ లేకుండా సాగింది… కబాలి వంటి కథతో అందరి దృష్టినీ ఆకర్షించిన పా.రంజిత్ ఈసారి భారీ సినిమాను భుజానికెత్తుకున్నాడు… చాలావరకూ సక్సెసయ్యాడు… […]
ఆ నలుగురు మహిళలూ కలిసి చేసిన పెళ్లి… monsoon WeDDING…
ఆ నలుగురాడాళ్లూ కలిసి చేసిన పెళ్లి … భారతీయ సినిమాలు (ముఖ్యంగా దక్షిణాది సినిమాలు) పెళ్లిని చాలా రొమాంటిసైజ్ చేశాయి. పందిళ్లు, పసుపు కుంకుమ పళ్లేలు, అగ్నిహోత్రం, ఏడడుగులు, తలంబ్రాలు, అరుంధతి నక్షత్రం.. అబ్బో ఎన్నని! నిండా నవ్వుతూ, తుళ్లుతూ ఆడిపాడే ముఖాలు. అవి చూసి, వాటిని మళ్లీ మళ్లీ చూసి, ఇంకా ఇంకా చూసేసి తమ పెళ్లీ అలాగే కావాలని ఆశపడటం మనకొక Traditional Fantasy. కానీ నిజంగా పెళ్లి అలా జరుగుతుందా? అంత హాయిగా […]
లైగర్ రేంజ్ నాసితనం కాదు గానీ… 5జీ యుగంలోనూ 2జీ, 3జీ ధోరణిలోనే పూరి..!!
ఓ ఎన్ఆర్ఐ మిత్రుడు చెప్పినట్టు… ‘‘Anna Karenina నవలని Leo Tolstoy “All happy families are alike; each unhappy family is unhappy in its own way” అని మొదలు పెడతాడు… అలా, బాగున్న సినిమాలకన్నా బాగాలేనివి ఎందుకు బాగాలేవో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే ఈ సినిమా చూడొచ్చు…’ ఏ సినిమా..? అదే… డబుల్ ఇస్మార్ట్… ఆమధ్య హిట్టయిన డ్యుయల్ సిమ్ బుర్రల మార్పిడి కథతో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఇది సీక్వెల్… […]
నో డౌట్… ఇది కేసీయార్నే కాదు, ప్రధాన ప్రతిపక్షనేత హోదానూ అవమానించడమే…
నమస్తే తెలంగాణ, తెలంగాణటుడేలు తన సొంత పత్రికలు కాబట్టి… తనకు అవమానం కాబట్టి… కేసీయార్ ఈ వార్తను ప్రముఖంగా పబ్లిష్ చేశాడు… అవసరమే… మిగతా పత్రికలు మాత్రం ఎందుకోగానీ పెద్దగా పట్టించుకోలేదు… కానీ దీనికి నిజంగానే వార్తా ప్రాధాన్యం ఉంది… ఖచ్చితంగానే రాయదగిన వార్త… విషయం ఏమిటంటే..? పంద్రాగస్టు వేడుకలకు సంబంధించి మెదక్ జిల్లా యంత్రాంగం ఓ ఆహ్వానపత్రికను ముద్రించింది… అందులో ముఖ్య అతిథిగా కేకేశవరావు పాల్గొంటాడని పేర్కొన్నారు… తను ఎవరు..? జస్ట్, ఓ ప్రభుత్వ సలహాదారు […]
భాగ్యశ్రీ బోర్సె మాత్రమే బాగుంది… హిందీ పాటల మిస్టర్ బచ్చన్ గోలగోల…
భాగ్యశ్రీ బోర్సె మాత్రమే బాగుంది… అనే శీర్షిక చూసి మరి రవితేజ మాటేమిటి అనడక్కండి… రవితేజకు ప్రత్యేకంగా ఎవరూ కొత్త సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన పనిలేదు… ఈ వయస్సులోనూ ఆ ఎనర్జీ, ఆ ఈజ్ తనకు బలం… తన అన్ని సినిమాల్లాగే తనే ఈ సినిమాకు బలం, తనే మోశాడు, ఐతే… సగటు రొటీన్ తెలుగు ఫార్ములా మాస్ సినిమాగా రూపుదిద్దుకున్న ఈ సినిమా రవితేజ సినిమాల జాబితాలో ఒకటి మాత్రమే… పెద్ద విశేషాల్లేవు, మెరుపుల్లేవ్… జస్ట్, ఒక […]
ఇది ఓరకంగా శ్రీశ్రీ సినిమా… కానీ ఒక్క పాటా రాయలేదు… అదోరకం ‘తీర్పు’…
రాష్ట్ర ప్రభుత్వం వినోద పన్నును రద్దు చేసిన మొదటి తెలుగు సినిమా . NTR జడ్జిగా నటించిన మొదటి సినిమా , అప్పట్లో అది అరుదైన పాత్రే… (తరువాత కాలంలో జస్టిస్ చౌదరి సూపర్ హిట్)… 1975 లో వచ్చిన ఈ తీర్పు సినిమా . సినిమాగా ఒక వినూత్న ప్రయోగం . చనిపోయిన వ్యక్తుల కంకాళాలు కోర్ట్ బోన్లోకి ఎక్కి తమ గోడును వెళ్ళబోసుకునే సరికొత్త ప్రయోగాన్ని చేసారు . డబ్బులు ఎలా వచ్చాయో నాకు […]
ఈ డాక్టర్ తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం ఆయన దురదృష్టం, మన అదృష్టం…
HIV -AIDS….. ఎప్పుడో High School ఏజ్ లో తొమ్మిదో తరగతిలో ఈ పాఠం ఉండేది. అయ్యవార్లు దీన్ని Optional గా వదిలేసే వారు. అయినా స్వతహాగా ఆ వయసులో ఉండే లైంగిక అంశాలపై ఆసక్తి మూలంగా చదివినా అంత అర్థం చేసుకునే వయసు కాదు అది… ఒక పది రోజుల క్రితం Dr Yanamadala Murali Krishna సార్ నుండి ఈ పుస్తకం అందుకున్నాను… ఆసక్తి తో కాదు గానీ కేవలం మురళీ సార్ కోసం […]
బంగ్లాలో అమెరికా పెట్టిన చిచ్చు ఇది… పెద్ద పెద్ద ఎత్తుగడలతోనే అమలు…
అమెరికా ఒక మిలటరీ బేస్ ను బంగ్లాదేశ్ లో నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది! ఈ నిర్ణయం అనేది నిన్నా మొన్నా తీసుకున్నది కాదు. మూడేళ్ల క్రితం నిర్ణయం అది. ఆలోచన మాత్రం ఒక దశాబ్ద కాలం నాటిది. ఆలోచన నిర్ణయరూపం తీసుకుంది మాత్రం మూడేళ్ళ క్రితమే! ******* బంగ్లాదేశ్ లో మిలటరీ బేస్ తో పాటు ఒక నావీ బేస్ ను కూడా ఏర్పాటు చేయాలని తరువాత నిర్ణయం తీసుకున్నారు. మరి దీనికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ […]
ముగ్గురమ్మల్లో అసలు అమ్మ ఎవరు..? ఏం కథ రాశావయ్యా దేవుడా..?
చట్టబద్ధమైన హక్కులు… న్యాయబద్ధం, ధర్మబద్ధ హక్కులు అనేక రకాలు… అలాగే చిన్న పిల్లలకూ హక్కులుంటాయి మనం గుర్తించం గానీ… పిల్లలు తమ ప్రేమను సంపూర్ణంగా, స్వచ్ఛంగా చూపించడానికి అనువైన వాతావరణం, అవకాశం పొందే హక్కు కూడా ముఖ్యమే… పాశ్చాత్య దేశాల్లో పిల్లల ప్రేమ అనేక బంధాల సమీకరణాల్లో చిక్కి బహుముఖంగా, ఒకింత గందరగోళంగా ఉంటుంది… బయోలాజికల్ పేరెంట్స్, అడాప్టెడ్ పేరెంట్స్ తేడాలు మాత్రమే కాదు… రెండో అమ్మ, మూడో అమ్మ, రెండో నాన్న, మూడో నాన్న… ఎవరిని […]
ఓహ్… సమంతకూ పెళ్లి ఫిక్స్ చేసేశారా..? గుడ్… ఇంతకీ ఎవరాయన..?!
మీకేమైనా పిచ్చా..? అన్నింటినీ వేణుస్వామితో ముడిపెడితే ఎలా..? ఆయనేదో చెప్పాడు… తప్పో ఒప్పో… దొరికిండు కదాని ఆడుకుంటున్నది మీడియా, సోషల్ మీడియా, నాస్తిక మీడియా… ప్రత్యేకించి కాబోయే టీటీడీ చైర్మన్ (అనగాా బాబు మార్క్ ఆస్తికుడు అని మీరర్థం చేసుకోవాలి, గ్రేట్ చంద్రబాబు మార్క్ ఆస్తికుడు… ఉద్దరించేది ఏమీ లేదు, చంద్రబాబు ఆబ్లిగేషన్ తప్ప…) ఛానెల్లో ఓ ప్రముఖ గోగినేని మూర్తి గారి బాబు గారు మరీనూ… తనెవరో అయిదో చానెల్ సినిమా జర్నలిస్టు అట… నువ్వు […]
వినేష్కు సంఘీభావం మంచిదే… కానీ ఈ పాత ప్రముఖకలం ఏదేదో రాసి పారేసింది…
సాగరిక ఘోష్… ప్రముఖ జర్నలిస్టు రాజదీప్ సర్దేశాయ్ భార్య… ఆమె కూడా జర్నలిస్టే… చాలాకాలం ప్రముఖ మీడియా సంస్థల్లో కీలక హోదాల్లోనే పనిచేసింది… బయాస్డ్… భర్తలాగే భార్య కూడా… పక్షపాత జర్నలిజం… నిజంగా ఇన్నేళ్లు ఆమె ప్రముఖ జర్నలిస్టు ఎలా చెలామణీ అయిందో అర్థం కాదు… ఆమె వినేష్ ఫోగట్ మీద రాసిన అడ్డదిడ్డం వ్యాసం సాక్షికి ఎందుకు నచ్చిందో తెలియదు… (అది ది ప్రింట్ వ్యాసానికి అనువాదం)… భార్యాభర్తలిద్దరూ బీజేపీ వ్యతిరేకులు, మోడీ ద్వేషులు, పర్లేదు, […]
జిల్లాలకు తరలిన రాధాకృష్ణ… ‘పవర్ఫుల్’ ప్లేసు కోసం దిద్దుబాటలో…
ఒక ఫోటో ఆసక్తికరంగా అనిపించింది… నిజానికి ఓ సాదాసీదా ఫోటోయే… కానీ వర్తమాన తెలుగు పత్రికల స్థితిగతుల, సంస్థాగత వ్యవహారాల నేపథ్యంలో కాస్త ఇంట్రస్టింగ్… ఈ ఫోటోలో ఉన్నది ఏబీఎన్- ఆంధ్రజ్యోతి బాస్ రాధాకృష్ణ… విమానంలో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టాడు… తన వెనుక కనిపిస్తున్నది వక్కలంక రమణ… పత్రికలో కీలకమైన పొజిషన్ తనది… ఈనాడు రామోజీరావు చాన్నాళ్లుగానే ఈనాడుకు దూరదూరంగానే ఉన్నాడు వయస్సు, అనారోగ్యాల రీత్యా… ఆయన వెళ్లిపోయాక ఈ యాభై ఏళ్ల నంబర్ వన్ […]
మనం చెరువును చెరబట్టి… చెరువు గుండెను చెరిపిన కథ..!!
భాగ్యనగరం చెరువుల గుండె చెరువు “అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము; చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ” తెలుగు మీడియం మాత్రమే తెలిసిన అనాది కాలంలో ఒకటి, రెండో తరగతుల్లో తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పద్యమిది. అప్పిచ్చువాడు తరువాత కామాను గుర్తించని లోకం వైద్యుడికి అది విశేషణ పూర్వపదకర్మధారయంగా అనుకుని వైద్యులంటే రోగులకు అప్పిచ్చేవారని అపార్థం చేసుకుంది. వేదాంత దృక్కోణంలో వైద్యులు అప్పు చేయించేవారే అవుతారు కానీ, అప్పిచ్చేవారు కాదు. అయినా మన […]
ఈనాడు మార్క్ గొప్ప విలువలు, ప్రమాణాలు అంటే ఇవేనా అధ్యక్షా..?!
దోగిపర్తి సుబ్రహ్మణం చెబుతున్నట్టు… ‘‘రెండు మూడు రోజుల కిందే ఈనాడు స్వర్ణోత్సవ వేడుకల్లో ఈనాడు జర్నలిస్టిక్ విలువల గురించి చాలామంది కితాబులను ఇచ్చారు . ఈ కార్టూన్ చూడండి . నిన్న వచ్చింది . అమెరికా , చైనా , బ్రిటన్ దేశాలు సంపాదించిన పతకాల గురించి చెప్పేటప్పుడు ఆయా దేశాల అధినేతలను చూపారు . భారతదేశానికి వచ్చేటప్పటికి ప్రధాని మోడీ బొమ్మ వేయకుండా పిటి ఉషను చూపారు . (ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షురాలు)… […]
బాపు అంటే ముళ్లపూడి కూడా… ఈ ఒక్క రాముడి కథే మినహాయింపు…
బుధ్ధిమంతుడు , అందాలరాముడు , ముత్యాలముగ్గు వంటి సాంఘిక సినిమాలే పౌరాణికాల్లాగా ఉంటాయి . ఇంక సీతాకల్యాణం , శ్రీరామాంజనేయ యుధ్ధం వంటి పౌరాణికాలు తీస్తే ఎలా ఉంటాయో చెప్పవలసిన అవసరం లేదు . వాల్మీకి , వ్యాసుడు , పోతన కూడా ఆశ్చర్యపోవాల్సిందే . అంతటి కళాకారుడు బాపు . 1975 లో వచ్చిన ఈ శ్రీరామాంజనేయ యుధ్ధం సినిమా చూస్తే నాస్తికుడు కూడా ఆస్తికుడు కావాల్సిందే . అంత కళాత్మకంగా , కన్నుల పండగ్గా […]
- « Previous Page
- 1
- …
- 60
- 61
- 62
- 63
- 64
- …
- 459
- Next Page »