Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఐపోలేదు… అసలు కథ ముందుంది… అబ్బే, వేణుస్వామి జోస్యం కాదు…

May 17, 2025 by M S R

war

. ఒకండు… ఆ ధూర్త నమస్తే తెలంగాణ అనబడు బహుస్వార్థ కరపత్రికాలో రాస్తాడు… పహల్‌గామ్, ఆపరేషన్ సిందూర్ ఎట్రెట్సా అంతా జస్ట్ కాలసర్ప దోషం అని… అసలు కాలాన్ని సర్పంతో పోల్చి, ఓ దోషంగా ఎంచి ఆస్ట్రానమీలో బంధించడం మీద శాస్త్రీయ జ్యోతిష్కుల్లోనే బోలెడు విమర్శలున్నాయి… సరే, ఆ తిక్క, తలకుమాసిన కరపత్రికలో ఎవడేం రాస్తే ఏమిటిలే గానీ… ఫాఫం, మరొకాయన భీకరంగా చెబుతున్నాడు… షష్ట గ్రహ కూటమి ప్రభావమే అని… సరే, ఆయన లెక్కలు ఆయనవి… […]

వాళ్లు ఆశించిన డాన్స్ చేసినన్ని రోజులే ఆదరణ… తరువాత..?!

May 17, 2025 by M S R

trolling

. మీరు ఎవడికైనా, దేనికైనా ఫుల్లు సపోర్టుగా ఉండి… లక్ష భజనలు చేసి, లక్షన్నర కీర్తనలు పాడి, సోషల్ మీడియాలో దాస్యం చేసినా సరే… ఒక్క నిజం, వాళ్లకు నచ్చని నిజం ఒక్కటి పోస్టు చేస్తే చాలు… గతం మరిచి, విజ్ఞత విడిచి, విచక్షణ గంగలో కలిపేసి ఇక మొదలుపెడతారు… భారీ ట్రోలింగ్, బూతులు… మూసీ ప్రవాహమే ఇక… సోషల్ మీడియాకు ఓవైపు కాస్త పాజిటివ్, మరోవైపు నీచమైన, ప్రమాదకరమైన కోణం… లక్ష మంది మెచ్చుకునే పోస్టు […]

ఇండియన్ క్లియోపాత్రా..! World Top 10 బ్యూటీల్లో ఒకరు… మన తెలుగు మహిళే…

May 17, 2025 by M S R

. క్లియోపాత్రా… ప్రపంచం మొత్తం ఆమె అందాన్ని కీర్తించింది, గుర్తించింది… అందానికి ఆమె ఓ కొలమానం అని భజించింది… అది సరే, మరి మన భారతీయ మహిళ సౌందర్యం మాటేమిటి..? ప్రపంచం మెచ్చిన అందగత్తెలు అనగానే ఈరోజుకూ ఒక ఐశ్వర్యారాయ్, ఒక సుస్మితాసేన్ మాత్రమేనా..? కాదు.., రీటా ఫారియా, డయానా హైడన్, యుక్తా ముఖి, ప్రియాంకచోప్రా, మానుషి చిల్లర్, లారా దత్తా, మిస్ ఎర్త్ నికోల్ ఫరియా… బోలెడు మంది… వీళ్లు కాదు, మరి ఇండియన్ క్లియోపాత్రా […]

చీకటి పడితే సీతారాం అట, రాతిరికొస్తే రాధేశ్యామ్ అట… వామ్మో సుమలత..!!

May 17, 2025 by M S R

sumalatha

. Subramanyam Dogiparthi….. 1984 లోకి వచ్చాం . అక్షరక్రమంలో ఈ సంవత్సరంలో మొదటి సినిమా చిరంజీవి- క్రాంతికుమార్ల కాంబినేషన్లో వచ్చిన ఈ అగ్నిగుండం సినిమా . చట్టానికి కళ్ళు లేవు సినిమాలో ఎలా అయితే అక్కాతమ్ముళ్ళ అనుబంధం చూపబడిందో అంతకన్నా గొప్పగా సుజాత , చిరంజీవిల మధ్య అక్కాతమ్ముళ్ళ ప్రేమను , ఆప్యాయతను చూపారు క్రాంతికుమార్ . సుజాత , చిరంజీవిలు అక్కాతమ్ముళ్ళుగా బాగా నటించారు . చిరంజీవి ఫుల్ ఫాంలోకి వచ్చేసారు 1983 నుండి […]

ఓ కొలవెరి, ఓ రౌడీ బేబీ… అప్పట్లో ‘తోడీ సిపీలీహై’… మందు కొట్టించేశాడు…

May 17, 2025 by M S R

. వై దిస్ కొలవెరి పాటలో ఏముంది..? ఏమీలేదు… జనానికి విపరీతంగా కనెక్టయిపోయింది…. రౌడీ బేబీ పాటలో ఏముంది..? ఏమీలేదు… కానీ వంద కోట్ల వ్యూస్ దాటి ఇంకా దున్నేస్తూనే ఉంది… ఇప్పటి రెండు తరాలకు పెద్దగా తెలియకపోవచ్చుగాక… 45- 50 దాటినవాళ్లకు తెలుసు… అమితాబ్ నటించిన నమక్ హలాల్ సినిమా ఎంత భారీ హిట్టో… 1982… హైదరాబాద్ కాచిగూడ చౌరస్తాలో మహేశ్వరిలో నమక్ హలాల్, పరమేశ్వరిలో డిస్కో డాన్సర్… ఎన్ని నెలలు ఆడాయో కూడా ఎవరికీ […]

బాలు, కొసరాజు, సింగీతం, సాలూరి… అందరి కెరీర్లలోనూ ఇదే చెత్తపాట…

May 17, 2025 by M S R

. కొన్ని కొన్ని అంతే… సినిమా ఇండస్ట్రీలో కొందరు ప్రముఖుల కెరీర్ ఎంత ఉజ్వలంగా వెలిగినా… ఎన్ని ఎవరెస్టులు ఎక్కినా… కాస్త తరచిచూస్తే వాళ్ల కెరీర్లలో కొన్ని గులకరాళ్లు కనిపిస్తయ్… భారతీయ సినిమాలకు పాటలే ప్రాణం కాబట్టి ఆ పాటల గురించే చెప్పుకుంటున్నప్పుడు… ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనే ఓ మేరుపర్వతం ప్రస్తావన రాకుండా దక్షిణాది సినిమా సంగీతం గురించి ఏమీ చెప్పుకోలేం… అలాగే కొసరాజు ఎప్పట్నుంచో ఓ పాపులర్ రైటర్… మ్యూజిక్ కంపోజర్ సాలూరి రాజేశ్వరరావుకు తిరుగులేదు… […]

సంపద, సర్కిల్, పేరు, చదువు… ఆ ఒక్క దుర్బల క్షణంలో పనిచేయవు..!!

May 17, 2025 by M S R

neurology

. ఈయన పేరు డాక్టర్ శిరీష్ వల్సంగ్కర్… వైద్యుడు… సర్జన్… ఈ వైద్యుడితో ఆపరేషన్ చేయించుకోవడానికి మహారాష్ట్రలోని వేలాది మంది రోగులు నెలల తరబడి ఎదురుచూస్తుంటారు….. షోలాపూర్ రత్నం తను.., అపారమైన సంపద, ప్రతిష్ట, తెలివితేటలకు ప్రతీక… పది మందికీ బతుకును, ధైర్యాన్ని ఇవ్వగలిగిన స్టేటస్… కానీ ఈ ప్రఖ్యాత న్యూరో సర్జన్ డాక్టర్ శిరీష్ వల్సంగ్కర్ గత నెలలో లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో తలపై కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు… షోలాపూర్ జిల్లాలో సొంతంగా చార్టర్డ్ విమానం ఉన్న […]

రియా హరి..! తనే నిర్మాత, తనే హీరోయిన్… ఓ కృత్రిమ ప్రేమకథ…

May 16, 2025 by M S R

reyaa hari

. లెవెన్… అదేలెండి, ఎలెవెన్… తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు… సహనిర్మాత నటి రియా హరి… తమిళమే… మరి సినిమా అన్నాక, కథ మెయిన్ ప్లాట్ ఎలా ఉన్నా ఓ ప్రేమకథ ఉండాలి కదా… అందుకని ఈ సినిమాలోనూ ఓ లవ్ ట్రాక్ జొప్పించారు… నిజానికి కథకూ దానికీ లింకేమీ ఉండదు, కథలో అది ఇమడలేదు నిజానికి… ఈమాత్రం దానికి మళ్లీ వేరే ఓ హీరోయిన్ ఎందుకులే, నవీన్ చంద్ర పక్కన నేను సరిపోనా […]

వంశీ, శ్రీలక్ష్మి, ఆంజనేయులు… వాళ్ల అనుభవాలు చెప్పే పాఠమేంటనగా…

May 16, 2025 by M S R

vallabhaneni

. అధికారులైనా.. రాజకీయ నాయకులైనా గుర్తు పెట్టుకోవాల్సిన లైఫ్ లెసన్స్ వల్లభనేని వంశీ అండ్ IAS శ్రీలక్ష్మి.. IPS పి ఎస్ ఆర్ ఆంజనేయుల అనుభవాలు అధికారం శాశ్వతం కాదన్న రాజకీయ నాయకుల మాటలు డైరీలో రాసిపెట్టుకోవాలి… అధికారం చేతిలో ఉంది కదా అని ప్రతి నాయకుడ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దూషిస్తే రెడ్ బుక్ లో పేర్లు నమోదు అవుతాయి అన్న విషయం తెలుసుకోవాలి రాజకీయాలు గతంలోలా లేవు ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి దాని పర్యవసానాలు […]

రవితేజ సినిమా అయితేనేం… సూపర్ ఫ్లాప్, చివరకు టీవీల్లో కూడా…

May 16, 2025 by M S R

eagle review

. ఈగల్ అని ఓ సినిమా వచ్చింది గుర్తుందా..? గుర్తుండకపోవచ్చు… అలా వచ్చి, ఇలా వెళ్లిపోయింది… సో వాట్… రవితేజ ఉంటేనేం, అనుపమ పరమేశ్వరన్ రొమాన్స్ చేస్తేనేం… పైగా కావ్య థాపర్, వల్గర్ నవదీప్, అవసరాల శ్రీనివాస్… ఎవరుంటేనేం… కథలో దమ్మేదీ..? అదో రవితేజ మోనాటనస్ యాక్షన్, డైలాగ్ డిక్షన్… చూసీ చూసీ బోర్ కొట్టలేదా..? కొట్టింది… అందుకే ఫ్లాపయింది… కాలంతోపాటు మన హీరోలు మారరు, అదీ వాళ్ల దురదృష్టం… కాదు, సగటు తెలుగు ప్రేక్షకుడి దురదృష్టం… […]

ఆ మంత్రి చిల్లర వ్యాఖ్యలపై పార్టీ మౌనం ఏం సంకేతాలు ఇస్తున్నట్టు..!?

May 16, 2025 by M S R

qureshi

. నిన్న బబ్బన్ సింగ్ రఘు వంశీ అనే 70 ఏళ్ల ఉత్తరప్రదేశ్ నాయకుడిని బీజేపీ తన పార్టీ నుంచి బహిష్కరించింది,.. కారణం, తను ఓ డాన్సర్‌తో ఓ వీడియోలో వల్గర్‌గా డాన్స్ చేస్తూ కనిపించాడు… అది వైరల్ అయ్యింది… గుడ్… కానీ అదొక వ్యక్తిగత అవలక్షణం… ఏదో కక్కుర్తి యవ్వారం… కానీ విజయ్ షా సంగతి..? తను చేసిన నీచమైన వ్యాఖ్యలు ఈ దేశ మహిళల్ని, సైనికుల్ని కించపరిచేవి కాదా… ప్రధాని మోడీ స్పందిస్తాడని అనుకోలేం […]

Decaplets..! ఒకే కాన్పులో పదిమంది… నెవ్వర్.., ఇప్పటికీ జరగలేదు…!!

May 16, 2025 by M S R

decaplets

. కొంతకాలం క్రితం… పశ్చిమ ఆఫ్రికా నుంచి ఓ వార్త వచ్చింది… మాలీకి చెందిన హలిమా నిస్సే అనే పాతికేళ్ల యువతి ఒకే కాన్పులో తొమ్మిది మంది శిశువులకు జన్మనిచ్చింది… ఇది మానవచరిత్రలోనే రికార్డు… అసాధారణం, అసహజం అని కాదు… అత్యంత అరుదు… నిజానికి ఒకే కాన్పులో ముగ్గురు పుడితేనే అబ్బో అని అబ్బురపడతాం… అలాంటిది తొమ్మిది మంది, పైగా అందరూ బతికారు… మొదట ఏడుగురు అని స్కానింగులో కనిపించింది, తీరా పుట్టేసరికి తొమ్మది లెక్కతేలింది… ఇంతమందిని […]

*రెండు జెళ్ల’తో అర్జెంటుగా కుర్రాళ్ల మనసుల్ని పిచ్చెక్కించేసింది…!!

May 16, 2025 by M S R

మహాలక్ష్మి

. Subramanyam Dogiparthi ……. ముళ్ళపూడి వారి రెండు జెళ్ళ సీతకు తెర రూపాన్ని ప్రసాదించారు జంధ్యాల . రమణ గారి కధ కాదు ఈ రెండు జెళ్ళ సీత . బుడుగు , రెండు జెళ్ళ సీత అనే ఈ రెండు ముక్కలు తెలుగు హాస్య రచనా ప్రపంచానికి ముళ్ళపూడి వారు అందించిన ఆణిముత్యాలు . ఆ పేరుని తన సినిమాకు అందంగా వాడుకున్నారు జంధ్యాల … జంధ్యాలను హాస్యబ్రహ్మగా మార్చిన సినిమా కూడా ఇదేనేమో […]

ఆ రాజ్ సీతారామ్ ఏమయ్యాడు చివరకు..? కృష్ణ ఎందుకు వదిలేశాడు..?!

May 16, 2025 by M S R

raj sitaram

. ముందుగా ఓ పోస్టు చదవండి… తెలుగు ఇండస్ట్రీ వికీపిడియాట్రిస్టు Bharadwaja Rangavajhala రాశాడు… తరువాత ఇంకొన్ని సశేషాలున్నయ్… అవీ చెప్పుకుందాం… వార్ అండ్ పీస్ … ( బాలసుబ్రహ్మణ్యం- కృష్ణ)…….. టాలీవుడ్ వివాదాల్లో మోస్ట్ ఇంట్రస్టింగ్ టాపిక్ సూపర్ స్టార్ కృష్ణ గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం మధ్య జరిగింది. కృష్ణ, బాలు చాలా సన్నిహిత మిత్రులు. ఇద్దరూ ఒకే టైమ్ లో ఇండస్ట్రీలో ఎదిగారు. ఉన్నత స్థానాలకు చేరారు. ఇద్దరూ నాన్ కాంట్రవర్షియల్ గా వెళ్లాలనే […]

బిగ్‌బాస్… బిగ్‌లాస్… కళ్లు నెత్తికి ఎక్కడం తప్ప వేరే ఫాయిదా లేదు..!!

May 16, 2025 by M S R

biggboss

. ‘‘బిగ్ బాస్ తరువాత నాకు విపరీతంగా బలుపు పెరిగింది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. కంట్రోల్‌లోలేను. కొన్ని మాటలు నోరు జారాను. నా పక్కనున్న దోస్తులే.. నన్ను అలా మాట్లాడేట్టు చేశారు. నా ముందు ఎవరైనా మైక్ పెడితే నోటికొచ్చినట్టు మాట్లాడేసేవాడ్ని. బిగ్ బాస్‌ బయటకు వచ్చిన తరువాత క్రేజ్ చూసేసరికి బలుపు పెరిగిపోయింది. లక్కీ లక్ష్మణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా.. ‘నా కొడకల్లారా ఇంటికి వచ్చి కొడతా’ అని వార్నింగ్‌లు ఇవ్వడం లాంటివి చేశాను. […]

ట్రంపు చెప్పాడని ఐఫోన్ గుడ్డిగా వినదు… అది పక్కా వ్యాపారం…

May 16, 2025 by M S R

apple

. Pardha Saradhi Upadrasta …. బావ బావే పేకాట పేకాటే. వ్యాపారవేత్త ఎక్కడ తయారు చేస్తే తక్కువ ధరకు ఉత్పత్తి అవుతుందో అక్కడే తయారు చేస్తాడు, ఇది ట్రంప్ మామకు తెలుసు, టిమ్ కుక్ కీ తెలుసు, భారత్ కు కూడా తెలుసు. నో, నో, యాపిల్ ఐఫోన్లను ఇండియాలో తయారు చేయడానికి వీల్లేదు అని ఉరుముతాడు ట్రంపు… ఒక ఐఫోన్ అమెరికాలో తయారు చేస్తే  3000 డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. అదే చైనాలో తయారు చేస్తే […]

వాళ్ల మానాన వాళ్లు బతుకుతున్నా సరే… శ్రీముఖి వదిలేట్టు లేదు…

May 16, 2025 by M S R

nikhil

. జబర్దస్త్ నుంచి బిగ్‌బాస్ దాకా టీవీ షోలలో అప్పటికప్పుడు ప్రేమలు పుట్టిస్తారు… ట్రాకులు స్టార్ట్ చేస్తారు… అదంతా ఫన్ కోసం… ఆ రొమాన్స్ కేవలం తెర వరకే… సరే, కొందరు నిజంగానే ప్రేమలో పడిపోయి పెళ్లి కూడా చేసుకుంటారు, అది వేరే సంగతి… లైక్ రాకింగ్ రాకేశ్, సుజాత… విడిపోయేవాళ్లూ ఉంటారు… లైక్ ఫైమా, ప్రవీణ్… బట్, దాదాపు 9, 10 ఏళ్లపాటు సుధీర్, రష్మి లవ్ ట్రాక్ తెలుగు టీవీ షోలకు సంబంధించి అల్టిమేట్… […]

గుడ్డిగా నమ్మేయవద్దు… సోషల్ మీడియాలో కొందరుంటారు… జాగ్రత్త…!!

May 16, 2025 by M S R

doctor

. Yanamadala Murali Krishna ……….. నా ఎఫ్‌బి ఫ్రెండ్స్‌లో ఒక ‘డాక్టర్’ ఉండేవారు. అతనికి మంచి సంఖ్యలో ఫాలోవర్స్ వున్నారు. ఒక సూపర్ స్పెషలిస్ట్ గా చలామణి అవుతూంటాడు. అతని పోస్టులు అనేక అంశాల మీద ఉంటాయి. కానీ, మెడికల్ పోస్టులలో ఏ మాత్రం పరిణతి – విషయ పరిజ్ఞానం కనిపించవు. జస్ట్, మీడియాలో డెస్క్ సబ్ ఎడిటర్స్ రాసే కంటెంట్ లాగా పైపైన ఉంటుంది (కొందరు మీడియా మిత్రులు ఆరోగ్య విషయాలలో లోతుగా పరిశీలించి […]

హీరోయిన్ బాత్‌రూం‌తో ఏం పనిరా..? వీటినే పిచ్చి కూతలు అంటారు…!!

May 16, 2025 by M S R

skn

. ఈమధ్య సినిమా సెలబ్రిటీల చెత్త వాగుళ్లు ఎక్కువయ్యాయి కదా… దిల్ రాజు, శ్రీముఖి, శ్రీకాంత్ అయ్యంగార్ దగ్గర నుంచి నాగవంశీ, ఎస్‌కేఎన్, త్రినాథరావు…. ఎవరు తక్కువ..? 90 వేసుకుని వేదికల మీదకు వస్తారేమో… నాలుక మీద, మెదడు మీద అదుపు ఉండదు… ఏం మాట్లాడుతున్నామనే సోయీ ఉండదు… ఆమధ్య ఓ నిర్మాత అన్షు అంబానీ సై- ల మీద వెకిలి కూతలకు దిగాడు ఓ వేదిక మీద… తరువాత సారీ చెప్పినట్టున్నాడు… ఏదో కూయడం, సారీ […]

‘అనగనగా..’ ఓ సుమంతుడు… మరొక్కసారి అదే ఫెయిల్యూర్ అడుగు…

May 15, 2025 by M S R

సుమంత్

. ప్రస్తుతం ఓ మోస్తరు స్కూళ్ల ఫీజులు కూడా ఠారెత్తిస్తున్నాయి… ఇంటర్నేషనల్ స్కూల్ అని పేరు పెట్టుకుని 3 నుంచి 5, 6 లక్షల దాకా వసూలు చేస్తున్నారు… తీరా క్వాలిటీ, బోధన నాసిరకం… ఏదో నడిపిస్తున్నారు… పేరెంట్స్ పర్సులు ఖాళీ చేస్తూ… నిన్న ఓ వార్త చదివినట్టు గుర్తు, ఓ ఇంజనీరింగ్ కాలేజీ 2.5 లక్షలు ఆల్రెడీ వసూలు చేస్తూ ఇప్పుడు 3.5 లక్షల ఫీజు కోసం ఫీజుల కమిటీకి దరఖాస్తు చేసుకుందట… చైతన్యలు, నారాయణల […]

  • « Previous Page
  • 1
  • …
  • 96
  • 97
  • 98
  • 99
  • 100
  • …
  • 391
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • 55 ఏళ్ల క్రితం గల్లంతు..! ఆ అణు పరికరం కథ తెలిస్తే నేటికీ వణుకే..!!
  • నందమూరి దిష్టి తమన్… తెలియకపోతే అన్నీ మూసుకోవాలి బ్రదర్..!!
  • మూడు తెలుగు సినిమా పాటలు- ఒక నోస్టాల్జియా… అజరామరం…
  • నకిలీలకే ‘మెరుపు’లెక్కువ..! ముగ్గురు గరల్‌ ఫ్రెండ్స్, గర్భాలు..!!
  • తెలంగాణ గ్రామీణ వోటరు ఏం చెబుతున్నాడు..? ఇదీ క్లారిటీ..!!
  • హీరో మెటీరియలే..! కానీ ‘ఆది’ నుంచీ ‘డ్రైవ్’ కుదరడం లేదు పాపం…
  • మసక మసక చీకటిలో… మళ్లీ ఆనాటి స్మిత నయగారాలు, నయా రాగాలు…
  • బాలకృష్ణ అఖండ తాండవాలకు బీజం పడింది ఈ సినిమాతోనే..!!
  • మెస్సి టూర్ – నిజమైన సార్ధకత ఎక్కడుంది..? | Khelo India రియాలిటీ చెక్…
  • తగ్గొద్దు… రేవంతన్నా… ఏదేమైనా కానీ… ఈ స్పీడ్ ఆగొద్దు….

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions