ఎఫ్-3 ప్రమోషన్ల కోసం ఫాఫం దర్శకుడు అనిల్ రావిపూడి ప్రతి టీవీ షోకు తిరుగుతున్నాడు… ఏవో తిప్పలు పడుతున్నాడు… అందులోని హీరోలకు అంత ఓపిక లేదు… సరే, వాళ్ల ఖర్మ వాళ్లది… ప్రమోషన్ కోసమే ఈటీవీ ఎక్సట్రా జబర్దస్త్‌షోకు వచ్చాడు… తను స్వతహాగా కామెడీ అంటే ఇష్టపడే వ్యక్తి కాబట్టి టీవీల్లో వచ్చే ప్రతి కామెడీ షో మీద తనకు మంచి అవగాహన ఉంది… కామెడీని ఎంజాయ్ చేస్తాడు… ఓవరాక్షన్ అలవాటైన ఫైమా మీద జబర్దస్త్ పంచ్ వేశాడు… అలాగే ఆటో రాంప్రసాద్‌కు ఓ ప్రశ్న వేశాడు…
నిజంగా అది సీరియస్ ప్రశ్నే… ‘‘నువ్వు ఆటో కదా, ఫస్ట్ టైం వీల్స్ లేకుండా స్కిట్ చేస్తున్నావు… వాళ్లిద్దరూ లేకుండా స్కిట్ చేయడం ఎలా ఫీలవుతున్నావ్…?’’ ఇదీ ప్రశ్న… నిజంగా రాంప్రసాద్ దగ్గర జవాబు లేదు… ఆ ప్రశ్నకు అర్థం ఏమిటంటే..? గెటప్ సీను, సుడిగాలి సుధీర్ లేకుండా నువ్వొక్కడివే స్కిట్ చేయడం ఏమిటి అని..!!
నిజం… ఒకప్పుడు సుడిగాలి సుధీర్ టీం అంటే… ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే, ఆ ముగ్గురూ కలిసి ఉన్నారు… కలిసే ప్రయాణించారు… కానీ తొలిసారి రాంప్రసాద్ ఒంటరివాడయ్యాడు… గెటప్ సీను అసలు ఈటీవీ జోలికే రావడం లేదు… జబర్దస్త్ గానీ, శ్రీదేవి డ్రామా కంపెనీ గానీ, ఫెస్టివల్ స్పెషల్ షోలు గానీ… ఎందులోనూ ఉండటం లేదు… సుధీర్ ఢీ నుంచి బయటపడ్డాడు… ఇప్పుడు జబర్దస్త్‌లోనూ లేడు… ఏమో, రేప్పొద్దున శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా డౌటే… ఎందుకంటే, మల్లెమాలకూ తనకూ టరమ్స్ బాగా లేవు…
Ads
అలాగే మాటీవీలో రాబోయే సూపర్ సింగర్ చిన్నపిల్లల పాటల పోటీని హోస్ట్ చేయబోతున్నట్టు ప్రోమోలు చెబుతున్నాయి… స్పెషల్ షోలకూ వస్తున్నాడు… ఎలాగూ మల్లెమాలతో ఒప్పందాలు ముగిశాయి… ఇక తనను కట్టిపడేసే బంధనాలేవీ లేవు… ఇంకోవైపు హైపర్ ఆదీ మానేశాడు… అదిరె అభి, చమ్మక్ చంద్రలు ఎప్పుడో మానేశారు… మరిక జబర్దస్త్‌కు మిగిలిన సూపర్ కమెడియన్స్ ఎవరు..? ఎఫ్3 అనిల్ అడిగిన ప్రశ్న వెనుక ఇంత నేపథ్యం ఉంది…
అసలు విషయం అది కాదు… మరి వాళ్లిద్దరూ సొంత బాటలు చూసుకున్నప్పుడు, ఆటో రాంప్రసాద్‌ను ఈటీవీలో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోవడం ఏమిటి గెటప్ సీను గానీ, సుడిగాలి సుధీర్ గానీ…! మరి ఇన్నేళ్లుగా కష్టానికి, సుఖానికీ ఒకరికొకరుగా ఉండి, ఇప్పుడు తనను ఆ అయోమయంలో ఉంచేసి తమ స్వార్థం తాము చూసుకోవడం ఏమిటి..? ఏం సుధీర్..? ఇదేం బాగుంది..?!
Share this Article