అవతార్2 డబ్బులొచ్చేశాయ్… మూడే రోజుల్లో… 3600 కోట్లను ఇప్పటికి వసూలు చేసింది… నో, నో, 16 వేల కోట్లు వస్తే గానీ బ్రేక్ ఈవెన్ రాదని జేమ్స్ కామెరూన్ చెప్పాడు కదా అంటారా..? హంబగ్… ఇండియాకు వచ్చిపోయినట్టున్నాడు పలుసార్లు… ఇక్కడి నిర్మాతలను చూసి ఇలాంటి లెక్కలు నేర్చుకున్నాడేమో… మనం గతంలోనే చెప్పుకున్నాం కదా… ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర, రిలీజ్ కాని ఆదిపురుష్ తదితర సినిమాల నిర్మాణ వ్యయాలపై ఎన్ని సందేహాలున్నాయో…
ఐనా 16 వేల కోట్లు కాకపోతే, 36 వేల కోట్లు కావాలని ఆశపడనీ, తప్పేమీ లేదు… కామెరూన్ కూడా మనిషే కదా… కాకపోతే మరీ పిచ్చి లెక్కలను పరుస్తున్నాడు… విదేశీ మీడియా లెక్కల ప్రకారం అవతార్-2 ఖర్చు ఎక్కువే… కానీ మరీ అంత చెప్పుకోదగిన భారీ ఖర్చేమీ కాదు… మహా అయితే 25 కోట్ల డాలర్ల ఖర్చు అయి ఉంటుందని అవతార్-2 బడ్జెట్‌ను డిజిటల్ ఫిక్స్ అంచనా వేసింది… మహా అయితే 35 కోట్ల నుంచి 40 కోట్ల డాలర్స్ దాటి ఉండదని విదేశీ మీడియా గట్టిగా కూస్తోంది… 40 కోట్ల డాలర్స్ లెక్కేసినా 3200 కోట్ల రూపాయలు దాటదు కదా…
Ads
మరి ఇప్పటికే 3600 కోట్లు వచ్చేశాయి… నెట్ షేర్ లెక్కల్లో బ్రేక్ ఈవెన్ కూడా సోమవారం దాటేసినట్టుంది… ఫైనల్ ఫిగర్స్ రావల్సి ఉంది… 4500 కోట్లు దాటి ఉంటుందని అంచనా… ఇక ఎంతొచ్చినా లాభమే… 13 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశాం, పెట్టిన ప్రతి పైసాకు వడ్డీ లెక్కేయాలి, పనిచేసినవాళ్ల జీతాలు లెక్కేయాలి, సో, 16 వేల కోట్లు కావాలంటే ఎలా..? ప్రేక్షకుడికి నచ్చితే అది పెద్ద ఫిగర్ ఏమీ కాదు… కానీ 13 ఏళ్ల జాప్యం ఖర్చు కూడా ప్రేక్షకులు ఇచ్చేయాల్సిందే అనే వాదన అబ్సర్డ్…
ఒకసారి హాలీవుడ్‌లో అత్యధిక ఖర్చు పెట్టిన సినిమాల వివరాలు చూద్దాం…
- Pirates of the Caribbean: On Stranger Tides: $379 million
- Avengers: Age of Ultron: $365 million
- Avengers: Endgame: $356 million
- Avatar: The Way of Water: $350-400 million
- Fast X: $340 million
- Avengers: Infinity War: $325 million
- Pirates of the Caribbean: At World’s End: $300 million
పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సినిమాకు 379 మిలియన్ డాలర్ల ఖర్చు లెక్కేశారు… అవెంజర్స్ 365, 356 మిలియన్స్ ఖర్చు… సో, అవతార్-2 కు 400 మిలియన్లు ఖర్చయినా సరే, మరీ అయ్యయ్యో, ఇంత ఖర్చు వచ్చేదెలా అని ఆందోళన పడాల్సినంత సీనేమీ లేదు… అంతెందుకు..? నాలుగే రోజుల్లో తమ నిర్మాణ ఖర్చు వచ్చేసింది… ఇక రావల్సింది ఇన్నేళ్ల జాప్యానికి తగిన పరిహారం… అది ప్రేక్షకుడి బాధ్యతేమీ కాదు… నచ్చినోడు చూస్తాడు… లేదంటే చల్‌రే అని తోసిపారేస్తాడు…
మిశ్రమ టాక్ ఉన్నా సరే… అవతార్-2 వసూళ్లకైతే ఢోకా లేదు… ఎలా చూసుకున్నా సరే, ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 20 వేల కోట్లను వసూలు చేస్తుందని తాజా అంచనా… కామెరూన్‌కు ఇంకేం కావాలి..? అవునూ, అవతార్-3 రావడానికి ఎన్నేళ్లు పట్టొచ్చు మాస్టారూ… మరో 13 ఏళ్లు పట్టదు కదా… అప్పటిదాకా నిరీక్షించాలా..?!
Share this Article