.
సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు… టీవీలు, ఫ్యాషన్ ఎట్సెట్రా కలలు, రంగుల ప్రపంచంలో ప్రతిభతోపాటు డెస్టినీ సహకరించాలి… లేకపోతే అదీ అచ్చిరాదు… ఆ దీపాల చుట్టూ తిరిగి మాడిపోయిన పురుగులు వేనవేలు…
ఉగాది స్పెషల్ షోలో నితిన్ హోస్ట్ రష్మి గౌతమ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ… ‘‘నిజానికి తన సూపర్ హిట్ సినిమా జయంలో రష్మి నటించాల్సి ఉంది… నేను 90 శాతం సీన్స్ ఆమెతో రిహార్సల్స్ కూడా చేశాను… కానీ ఏమైందో ఆమెను వద్దని సదాను తీసుకున్నారు…’’ అని వెల్లడించాడు…
Ads
అదే సినిమాలో రష్మి నటించి ఉంటే ఆమె కెరీర్ వెలిగిపోయేది తన భావన… అది 2002 నాటి సినిమా… ప్రస్తుతం రష్మి వికీ వయస్సు 36… అంటే 13 ఏళ్ల పసివయస్సుకే సినిమా హీరోయిన్‌గా చాన్స్ వచ్చిందా..? ఇదీ డౌట్… కానీ జయం సూపర్ హిట్టయినా సరే సదా కెరీర్ అంత ఉజ్వలంగా ఏమీ వెలిగిపోలేదు… సీన్ కట్ చేస్తే…
ఢీ షో అనుకుంటా… ఇదే సదా జడ్జి, ఇదే రష్మి హోస్ట్… డెస్టినీ… ఎస్, ఒడిశా మూలాలున్న రష్మికి ఈరోజుకూ తెలుగు సరిగ్గా రాదు… ఐనా సరే.., సుమ, శ్రీముఖి తరువాత టాప్ తెలుగు ఫిమేల్ యాంకర్ తనే… హైదరాబాద్ వచ్చిన కొత్తలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొంది… ఈటీవీ జబర్దస్త్ హోస్టింగ్ చాన్స్ వచ్చాక ఆమె జీవితం కుదుటపడింది…
ఐనా సరే, సినిమాల్లో అవకాశాల కోసం గుంటూరు టాకీస్ వంటి బోల్డ్ సినిమాలూ చేసింది… కానీ ఫలితం లేదు… ఒకటీ అరా పాత్రలు, అవీ ప్రాధాన్యం లేనివి వచ్చేవి… మరోవైపు తనతోపాటే యాంకరింగ్ చేసే అనసూయ రంగమ్మత్త వంటి మంచి హిట్లు పడటంతో ఇక టీవీలను వదిలేసి పూర్తిగా సినిమాలకే పరిమితం అయిపోయింది… సినిమా చాన్సులు వస్తున్నాయి తనకు…
సేమ్, తన కోహోస్ట్ రష్మి మాత్రం ఇక సినిమా ప్రయత్నాల్ని వదిలేసి టీవీకే పరిమితమైంది… అదీ వేరే చానెళ్లకు చేయదు… జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ… వాస్తవానికి అనసూయకన్నా రష్మి మంచి గ్రేస్ ఉన్న డాన్సర్… (సుడిగాలి సుధీర్‌తో ఈటీవీ ప్రోగ్రాముల్లో బోలెడుసార్లు డాన్స్ చేసింది… సూపర్ జోడీ…)
తెల్లారిలేస్తే అనసూయకు వివాదాలు కావాలి… కానీ రష్మి వివాదాల్లోకి రాదు… సదాతో, అనసూయతో పోలిక దేనికంటే… రష్మి ఎవరికీ తక్కువ కాదు, పిసరంత ఎక్కువే… పైగా జీవకారుణ్యవాది… అందరిలా ఏవేవో పిచ్చి డ్రెస్సులతో సోషల్ పోస్టులు కూడా పెట్టదు… ఐతేనేం… జస్ట్, ఈటీవీ స్టూడియోకు మాత్రమే పరిమితమైంది ఇప్పుడు…
నితిన్ కూడా ఏ భేషజమూ లేకుండా రష్మి, తను జయం కోసం చేసిన రిహార్సల్స్ నెమరేసుకుని, ఓపెన్‌గా పాత సంగతులు పంచుకున్నాడు… ఈసారి ఉగాది స్పెషల్ టీవీ షోలలో నచ్చిన ఒకటీరెండు అంశాల్లో ఇదీ ఒకటి… ఎస్, ఇండస్ట్రీ ఓ పరమపద సోపానపటం… కొందరికే నిచ్చెనలు, చాలామందికి పాముకాట్లే… #rashmigautam #sudigalisudheer #anchorrashmi #anchoranasuya
Share this Article